Sunday, December 29, 2024

VINNAPAALU VINAVALE విన్నపాలు వినవలె వింత వింతలు

 విన్నపాలు వినవలె వింత వింతలు


తాళం: ఝంప
రాగం: భూపాళం (మేళకర్త 8, తోడి  జన్యరాగ )
రూపకర్త: అన్నమాచార్య

ఆరోహణ: స రి1 గ2 ప ద1 స
అవరోహణ: స ద1 ప గ2 రి1 స

పల్లవి
విన్నపాలు వినవలె వింత వింతలు |
పన్నగపు దోమతెర పైకెత్తవేలయ్యా ||

చరణము
తెల్లవారె జామెక్కె దేవతలు మునులు |
అల్లనల్ల నంతనింత నదిగోవారే |
చల్లని తమ్మిరేకులు సారసపు గన్నులు |
మెల్లమెల్లనె విచ్చి మేలుకొనవేలయ్యా ||

గరుడ కిన్నరయక్ష కామినులు గములై |
విరహపు గీతముల వింతాలాపాల |
పరిపరివిధముల బాడేరునిన్నదివో |
సిరిమొగము దెరచి చిత్తగించవేలయ్యా ||

పొంకపు శేషాదులు తుంబురునారదాదులు |
పంకజభవాదులు నీ పాదాలు చేరి |
అంకెలనున్నారు లేచి అలమేలుమంగను |
వేంకటేశుడా రెప్పలు విచ్చి చూచి లేవయ్యా ||

ITTI MUDDULAADU ఇట్టి ముద్దులాడి బాలు డేడవాడు వాని

 ఇట్టి ముద్దులాడి బాలు డేడవాడు వాని


తాళం:
రాగం: దేవగాంధారి(మేళకర్త 29, శంకరాభరణం జన్యరాగ)
రూపకర్త: అన్నమాచార్య

ఆరోహణ: స రి2 మ1 ప ద2 స
అవరోహణ: స ని3 ద2 ని2 ద2 ప మ1 గ3 రి2 స

పల్లవి
ఇట్టి ముద్దులాడి బాలు డేడవాడు వాని
బట్టి తెచ్చి పొట్టనిండ బాలు వోయరే ||

చరణము
గామిడై పారితెంచి కాగెడి వెన్నెలలోన
చేమ పూవు కడియాల చేయి పెట్టి |
చీమ గుట్టెనని తన చెక్కిట గన్నీరు జార
వేమరు వాపోయే వాని వెడ్డు వెట్టరే ||

ముచ్చువలె వచ్చి తన ముంగ మురువుల చేయి
తచ్చెడి పెరుగులోన దగబెట్టి |
నొచ్చెనని చేయిదీసి నోర నెల్ల జొల్లుగార
వొచ్చెలి వాపోవువాని నూరడించరే ||

ఎప్పుడు వచ్చెనో మా యిల్లు చొచ్చి పెట్టెలోని
చెప్పరాని వుంగరాల చేయి పెట్టి |
అప్పడైన వేంకటాద్రి అసవాలకుడు గాన
తప్పకుండ బెట్టె (బట్టి) వాని తలకెత్తరే ||

JAYA JAYA RAAMAA జయ జయ రామా సమరవిజయ రామా

 జయ జయ రామా సమరవిజయ రామా



జయ జయ రామా సమరవిజయ రామా |
భయహర నిజభక్తపారీణ రామా ||

జలధిబంధించిన సౌమిత్రిరామా
సెలవిల్లువిరచినసీతారామా |
అలసుగ్రీవునేలినాయోధ్యరామా
కలిగి యజ్ఞముగాచేకౌసల్యరామా ||

అరిరావణాంతక ఆదిత్యకులరామా
గురుమౌనులను గానేకోదండరామా |
ధర నహల్యపాలిటిదశరథరామా
హరురాణినుతులలోకాభిరామా ||

అతిప్రతాపముల మాయామృగాంతక రామా
సుతకుశలవప్రియ సుగుణ రామా |
వితతమహిమలశ్రీవేంకటాద్రిరామా
మతిలోనబాయనిమనువంశరామా ||

JAYA LAKSHMI VARA LAKSHMI - జయలక్ష్మి వరలక్ష్మి సంగ్రామ వీరలక్ష్మి

 జయలక్ష్మి వరలక్ష్మి సంగ్రామ వీరలక్ష్మి


తాళం: ఆది
రాగం: లలిత(మేళకర్త 15, మాయామాళవగౌళ జన్యరాగ )
రూపకర్త: అన్నమాచార్య

ఆరోహణ: స రి1 గ3 మ1 ద1 ని3 స
అవరోహణ: స ని3 ద1 మ1 గ3 రి1 స

పల్లవి
జయలక్ష్మి వరలక్ష్మి సంగ్రామ వీరలక్ష్మి |
ప్రియురాలవై హరికి~ం బెరసితివమ్మా ||

చరణము
పాలజలనిధిలోని పసనైనమీ~ంగడ
మేలిమితామరలోని మించువాసన |
నీలవర్ణునురముపై నిండిననిధానమవై
యేలేవు లోకములు మమ్మేలవమ్మా ||

చందురుతోడ~ం బుట్టిన సంపదలమెఱు~ంగవో
కందువ బ్రహ్మల~ం గాచేకల్పవల్లి |
అందినగోవిందునికి అండనే తోడునీడవై
వుందానవు మా//ఇంటనే వుండవమ్మా ||

పదియారువన్నెలతో బంగారుపతిమ
చెదరనివేదములచిగురు~ంబోడి |
యెదుట శ్రీవేంకటేశునిల్లాలవై నీవు
నిదుల నిలిచేతల్లి నీవారమమ్మా ||

KALIGENIDE NAAKU కలిగెనిదె నాకు కైవల్యము

 కలిగెనిదె నాకు కైవల్యము


తాళం: ఆది
రాగంసింధుభైరవి(మేళకర్త 10, నాటక ప్రియ జన్యరాగ )
రూపకర్త: అన్నమాచార్య

ఆరోహణ: స రి1 గ2 మ1 ప ద1 ని2 స
అవరోహణ: స ని2 ద1 ప మ1 గ2 రి1 స

పల్లవి
కలిగెనిదె నాకు కైవల్యము
తొలుతనెవ్వరికి దొరకనిది ||

చరణము
జయపురుషోత్తమ జయ పీతాంబర
జయజయ కరుణాజలనిధి |
దయ యెఱంగ నే ధర్మము నెఱగ నా
క్రియ యిది నీదివ్యకీర్తనమే ||

శరణము గోవింద శరణము కేశవ
శరణు శరణు శ్రీజనార్ధన |
పరమ మెఱంగను భక్తి యెఱంగను
నిరతము నాగతి నీదాస్యమే ||

నమో నారాయణా నమో లక్ష్మీపతి
నమో పుండరీకనయనా |
అమిత శ్రీవేంకటాధిప యిదె నా
క్రమమెల్లను నీకయింకర్యమే ||

KANTI NAKHILAANDA కంటి నఖిలాండ తతి కర్తనధికుని గంటి

 కంటి నఖిలాండ తతి కర్తనధికుని గంటి


తాళం: ఆది
రాగం: బృందావన సారంగ(మేళకర్త 22, ఖరహరప్రియ జన్యరాగ )
రూపకర్త: అన్నమాచార్య

ఆరోహణ: స రి2 మ1 ప ని3 స
అవరోహణ: స ని2 ప మ1 రి2 గ2 స

పల్లవి
కంటి నఖిలాండ తతి కర్తనధికుని గంటి |
కంటి నఘములు వీడుకొంటి నిజమూర్తి గంటి ||

చరణము
మహనీయ ఘన ఫణామణుల శైలము గంటి |
బహు విభవముల మంటపములు గంటి |
సహజ నవరత్న కాంచన వేదికలు గంటి |
రహి వహించిన గోపురములవె కంటి ||

పావనంబైన పాపవినాశము గంటి |
కైవశంబగు గగన గంగ గంటి |
దైవికపు పుణ్యతీర్థములెల్ల బొడగంటి |
కోవిదులు గొనియాడు కోనేరి గంటి ||

పరమ యోగీంద్రులకు భావగోచరమైన |
సరిలేని పాదాంబుజముల గంటి |
తిరమైన గిరిచూపు దివ్యహస్తము గంటి |
తిరు వేంకటాచలాధిపు జూడగంటి ||

KANTI SUKRAVAARAMU కంటి శుక్రవారము గడియ లేడింట

 కంటి శుక్రవారము గడియ లేడింట


తాళం: ఆది
రాగం: కురింజి (మేళకర్త 29, శంకరాభరణం జన్యరాగ)
రూపకర్త: అన్నమాచార్య

ఆరోహణ: స ని3 స రి2 గ3 మ1 ప ద2
అవరోహణ: ద2 ప మ1 గ3 రి2 స ని3 స

పల్లవి
కంటి శుక్రవారము గడియ లేడింట |
అంటి అలమేల్మంగ అండనుండే స్వామిని ||

చరణము
సొమ్ములన్నీ కడపెట్టి సొంపుతో గోణముగట్టి |
కమ్మని కదంబము కప్పు కన్నీరు |
చెమ్మతోను వేష్టువలు రొమ్ముతల మొలజుట్టి |
తుమ్మెద మైచాయతోన నెమ్మదినుండే స్వామిని ||

పచ్చకప్పురమే నూరిపసిడి గిన్నెలనించి |
తెచ్చి శిరసాదిగ దిగనలది |
అచ్చెరపడి చూడనందరి కనులకింపై |
నిచ్చమల్లె పూవువలె నిటుతానుండే స్వామిని ||

తట్టుపునుగే కూరిచిచట్టలు చేరిచినిప్పు |
పట్టి కరిగించు వెండి పళ్యాలనించి |
దట్టముగ మేను నిండపట్టించి దిద్ది |
బిట్టు వేడుక మురియు చుండేబిత్తరి స్వామిని ||

Gayatri Stotram - గాయత్రీ స్తోత్రం

శ్రీ దేవీ భాగవతం ద్వాదశ స్కంధము - గాయత్రీ స్తోత్రం గాయత్రీస్తోత్రం నారదా! గాయత్రీ హృదయం చెప్పానుగదా, ఇక గాయత్రీస్తోత్రం చెబుతున్నాను - విను....