నను పాలింప నడచి వచ్చితివో
రాగం: మోహనం (మేళకర్త 28, హరి కాంభోజి జన్యరాగ)
రూపకర్త: త్యాగరాజ
అవరోహణ: స ద2 ప గ3 రి2 స
నను పాలింప నడచి వచ్చితివో
నా ప్రాణ నాథ
అనుపల్లవి
వనజ నయన మోమును జూచుట
జీవనమని నెనరున మనసు మర్మము తెలిసి (నను)
చరణం
సురపతి నీల మణి నిభ తనువుతో
ఉరమున ముత్యపు సరుల చయముతో
కరమున శర కోదండ కాంతితో
ధరణి తనయతో త్యాగరాజార్చిత (నను)