ఒక బ్రాహ్మణుడు సంతానములేక చింతిల్లుచు తపస్సు చేయదొడగెను. ఆ సమయమున పార్వతీ పరమేశ్వరులు భూమిపాలింప వచ్చి యా బ్రాహ్మణునిగాంచి - “ఓ బ్రాహ్మణుడా ! ఎందువలన నీవీ తపస్సు చేయుచుంటివి?” అని యడిగిరి. అందుల కాతండు “మీరేమి ఆర్చేవారా, తీర్చేవారా! మీకెందుకు? మీ త్రోవను బొండ”ని చెప్పెను అంతవారు ఆర్చేవారము మేమే, తీర్చేవారము మేమే. కారణమేమో చెప్పు మనిరి. “సంతానహీనుడవై యిట్లు తపస్సు చేయదొడగితిని. నాకీ కోరికదీర్చి
ఉద్యాపనము: తొలియెట ఐదుగురు, మలియేట పది మంది ముత్తయిదువులకు, మూడవయేట పదిహేను మంది ముత్తయిదువులకు, నాలుగవయేట యిరువదిమంది ముత్తయిదువులకు, అయిదవయేట ఇరువది అయిదు ముత్తయిదువులకు వాయనములు ఇచ్చుకొని అయిదుయేళ్లు అయిన తరువాత పెండ్లినాడు పెండ్లికూతురునకు మట్టెలు, మంగళసూత్రములు క్రొత్తకుండలో ముప్పది మూడు జోడుల అరిసెలు పెట్టి క్రొత్తరవికలగుడ్డచే వాసెనగట్టి పెండ్లికూతురు నకు
అందియ్యవలయును.
నన్ను రక్షింకపవలయునని దీనుండై యా బ్రాహ్మణుడు వారల వేడుకొనెను. వారు "ఆయువులేని మగవాడు కావలెనా? అయిదవతనములేని ఆడుదికావలెనా?" యని యడిగిరి. అప్పుడా బ్రాహ్మణుడు. ఇంటికివోయి నాభార్యనడిగి వచ్చెదనిని చెప్పెను. వారు అట్లానే కానిమ్మనిరి. బ్రాహ్మణుడు ఇంటికిపోయి భార్యనుచూచి, ఆయువు మాలిన మగవాడు కావలయునా? అయిదవతనములేని ఆడుది కావలయునా!” యని అడిగెను. పుట్టి చచ్చినను పుత్రుడేమేలు. పుత్రనియిమ్మని యా సాధ్వి యుత్తరమిచ్చెను. అంత నా బ్రాహ్మణుండతివేగమున దానుతపస్సు చేయు చోటికిబోయి "పుట్టిచచ్చినను పుత్రుడేమేలు. కాబట్టి పుత్రునేకోరమని నాభార్య వేడుకొనెన" ని చెప్పెను.
అంతవారు-"ఊరి వెలుపల నొక మామిడి చెట్టున్నది. దానినొక పండు కోసికొనిపోయి నీభార్యకిమ్మని వారంతర్జానము నొందిరి అప్పుడు బ్రాహ్మణుడొక ముంతమామిడి చెట్టుదగ్గరకు పోయి చాలపండ్లు కోసికొని వడిలో వేసుకొని యింటికివచ్చి చూచుకొనేసరికి నావడిలో నొక్కపండు మాత్రమే యుండెను. అతడాపండును తినుమని భార్యకిచ్చెను. ఆ పండు నామె భక్షించి గర్భముదాల్చి, యంత తొమ్మిది నెలలు నిండిన వెనుక నొక కొడుకును గనియెను. ఆ శిశువు పుట్టి పుట్టక పూర్వమే
యమభటులువచ్చి “వానిని మాకిమ్మ'ని తల్లి నడిగిరి. ఆమెయు నాయనలారా! ఈ శిశువునకు పురుడుబోసి నామా!” యని దీనవదనయె పలికెను: అంత నా యమభటులు వెళ్ళిపోయి పురుడు పుణ్యములైన తరువాత వచ్చి ఎప్పటి యట్ల “పిల్లవాని నియమిని అడిగిరి. అందులకామె “ఈ కన్నకొడుకు బారసాలను చూచినామా? ఆటపాటలు చూచినామా?” అని పలికెను. అంతట వారేగి తిరిగి బారసాల అయిన పిమ్మట వచ్చిరి. వారినిచూచి “పుట్టు, వెండ్రుకలు చూచినామా? నడుగు చూచినామా నాయనలారా! అని బ్రతిమాలెను. వారును యప్పటియట్లు మరలిపోయిరి. అంత
గొన్నాళ్ళకా పిల్లవానికి తల్లిదండ్రు ఉపనయన మహోత్సవము గావించిరి. తరువాత ఒకనాడు తల్లి కొడుకునకు తలంటుచు నేడ్చెను. ఆమె కంటినీళ్ళా పిల్లవానిపై పడుటచేత దెలిసికొని- "ఏమి? అమ్మా ఇట్లు దుఃఖించుచున్నాని" ని యడుగగా ఆమె "నాయనా! నీవు పుట్టినది మొదలుకొని యమభటులు నీకొరకు వచ్చుచున్నారు” నీ వడుగయినదాకా జరుపుకొని వచ్చినాము. ఇకనెట్లు జరుపవచ్చునాయని యెడ్చుచున్నా" నని యెడ్చుచున్నానని చెప్పెను. అంత నాపిల్లవాడు ధైర్యమవలంబించి "అమ్మా? నాకువచ్చిన భయములేదు. మా మామను జతయిచ్చి నన్ను కాశీకి బంపు" మని చెప్పెను. అందుకామె సమ్మతించి మేనమామకు కబురంపి కొడుకున కాతని జత యిచ్చి పంపుచు నేమియు బలుకలేక కన్నులనీరు బెట్టసాగెను. "అమ్మా! ఎందులకేడ్చెదవు. నేను తులసిమొక్క నొకదాని నింటవేసి వెళ్లెదను. దాని బాగోగులంబట్టి నా స్థితిగతులు నీకు తెలియుచుండును. అది చచ్చినయెడల నేను నట్లే యగుదునని తెలిసికొనుము” అని చెప్పి చాలినంత ధనము పుచ్చుకొని కాశీకి ప్రయాణమై పోవుచుండెను. వారికి త్రోవలో నొక పూలతోట గనబడగా ఆ రోజున నచ్చట బసదిగిరి. అంత నాపట్టణపు రాకుమార్తెయును, పురోహితుని కూతురును, శెట్టికూతురును, పెత్తందారు కూతురును కలిసి పూవులు కోసికొనుటకు వనమునకు వచ్చిరి. వారు పువ్వులను కోసికొని తిరిగి వెళ్ళుచు మాటపట్టింపులచే పోట్లాడి- “నీవు ముండవు
అంటే నీవు ముండవు” అని తిట్టుకొనిరి. ఆ తిట్లకు రాచవారిపిల్ల కోపగించుకొని “నాకీరాత్రి పెండ్లి మాఅమ్మగారు శ్రావణమంగళవారం నోము నోచుకొని నాకు వాయనమిచ్చును. నన్ను ముండా అని తిట్టకంటి' అని పువ్వులు పారపోసెను. చూచువారికి ఆశ్చర్యముగ నా పువ్వు లేకొమ్మవి ఆకొమ్మకు అంటుకొనెను. ఆ చిత్రము నాబ్రాహ్మణ కుమారుడుచూచి యాశ్చర్యపడి “ఆహా! ఈ చిన్నది యెంత సత్యవాదియో!” అని పొగడుకొని- “యీమె నాకు భార్యయైనయెడల బాగుండును గదా!” యని మనస్సులో ననుకొనెను. ఆ సంగతులను ప్రక్కనున్న మేనమామ గ్రహించి, “అబ్బాయీ! మనము కాశీకి వెళ్లుచున్నాము. మనమట్టి తలంపులను తలపెట్టరాదు” అని పలికెను. ఇంతలో ప్రొద్దు గ్రుంకు సమయముకాగా నాపిల్లలువారి వారి యిండ్లకేగిరి. రాజకుమార్తెను పెండ్లికుమార్తెనుజేసి ముహూర్తము సమీపించుచున్నందున పెండ్లికుమారుని రాకకై రాజు మొదలైనవారెదురు చూచు
చుండిరి. ఇంతలో పెండ్లికుమారునకు మూర్చవచ్చి పడివోయినాడు. “ఇప్పుడు పెండ్లికి రావీలు లేదిని యొక జాబు రాజుగారికి అందెను. ముహూర్తము సమీపించుటచే “ఆహా! వేళమిగిలి పోవును ఎరువు పెండ్లికొడుకు ఎవరు దొరుకునాయుని యాతడు పట్టణమందరిని అడిగెను. ఎరువు పెండ్లికొడుకున కెవ్వరును వప్పుకోరైరి. నగ యెరువుండును, బట్ట యెరువుండును గానీ పెండ్లికొడుకు ఎరువేమిటి?” అని నవ్వనాగిరి. అంత నాతండూరంతయు తిరిగి బ్రాహ్మణ కుమారుడున్న తోటలోనికివచ్చి యిక్కడయెవరో మనుష్యులున్నారని వారిదగ్గరకేగి వారినిలేపెను. వారు ఉలికిపడి లేచిరి. రాజా పిల్లవాని మేనమామనుచూచి, “అయ్యా ఈ పిల్లవానికొకసారి
ఎరువిచ్చెదరా? యని యడిగెను. “అయ్యా! ఎరువేమిటి? మేము తెల్లవారురూమున లేచి కాశీకి పోవనున్నాము. కావున వీలులే" దని చెప్పెను. రాజుగారు ముహూర్తము దాటిపోవుచున్నదని, కాదు కూడదని 'బలవంతముచేసి మేనమామను ఒప్పించి యాపిల్లవానిని తన యింటికి దిసికొనిపోయెను. అట్లు తీసుకొనివెళ్ళి మంగళస్నానాదుల నాచరింపజేసి యాపిల్లతో గూడపెండ్లి అరుగుపైకి దీసికొనిపోయి సంతోషముతో వివాహకార్యము జరిగించెను. తరువాత నా పిల్లవానికి బంగారుగిన్నెలో ఫలహారము లుంచగా నాతండవి తినుచుండ వైలియుంగరముజారి యాగిన్నెలో పడిపోయెను. ఆ యుంగరము నాచిన్నది పదిలముగ దిసికొని తనవేలిని బెట్టుకొని యా రాత్రి
నిద్రించుచుండగా కలలో పార్వతీదేవి యామెకు కనిపించి "నీపెనిమిటికి సర్పగండమున్నది కాచుకొమ్మ" ని యానతిచ్చెను. అందులకా రాజకుమార్తె అమ్మా! ఏమిచేస్తే అదితప్పునో సెలవియ్యవలయుననని ప్రార్థించెను. నీ తల్లి శ్రావణమంగళవారము నోముపట్టిన కుండను పామురాగానే పట్టుము. అందులో నదిపడునిని చెప్పెను. ఆ రాత్రి భర్త నిద్రించుచుండగా బుస్సుమని బుసకొట్టుచు పాము వచ్చుచుండెను. అది కనిపెట్టి యాచిన్నది భయపడక పైనున్న కుండకై చేయిచాచెను. అది అందక పోయెను. ఓహో! కార్యము తప్పవచ్చుచున్నదే!” యని చెప్పి భర్తతొడపై కెక్కి యాకుండ నందుకొని చప్పున పాముదిక్కునకు ఒగ్గెను. ఆ పామువచ్చి యాకుండలోపడగా ఆ చిన్నది యొక రవికె గుడ్డచే నా కుండకు వాసినకట్టి యొకచోట దాచిపెట్టి
నిద్రపోయెను. అంత తెల్లవారుజాముకూడా పిల్లవాని మేనమామవచ్చి యాతని లేపుకొని తీసుకొని వెళ్ళెను. అంత తెల్లవారెను. మరల పెండ్లి ప్రయత్నములుచేసి పెండ్లికొడుకును దీసుకొనిరాగా- "నాకాతడు భర్తగాడు కాశీవెళ్ళిన యాతడే కాని" యని యామె చెప్పెను. దానికేమి యానవాలు? అని యందరు నడిగిరి. అప్పుడా చిన్నది తండ్రినిచూచి “తండ్రీ! నీవు యేడాది అన్నదానము చేయుము. నేను తాంబూలదానం చేయుదునని చెప్పి ఆ ప్రకారం జరిగించు చుండెను. అంత
యేడాది పూర్తికాగానే కాశీకిబోయిన అల్లుడు మామూలు కాశీనుండి తిరిగివచ్చుచు మునపటి పూలతోటలోనేదిగిరి. అక్కడవారు పడుకొనబోతే వారిని జూచినవారు "అయ్యా! మీరు ఇక్కడయేల పడుకొనెదరు? ఈ పట్టణపు రాజుగా రన్నదానము చేయుచున్నారు, ఆయన కుమార్తె తాంబూల దానము చేయుచున్నది. మీరక్కడికి బోవు" డని తెల్పిరి. ఆ ప్రకారము వారు వెళ్ళి భోజనమొనర్చి తాంబూలనిమిత్తమై యా చిన్నదియున్న చోటికిబోయిరి. బ్రాహ్మణకుమారుని మేనమామకును వానికిని తాంబూలమిచ్చి ఇదిగో నాపతి యని యా చిన్నది వానిచేయి పట్టుకొనెను. నీపెనిమిటి
యగుటకేమి యాధారమున్నదిని యందరు నడిగిరి. అప్పుడు భర్తవంక దిరిగి- మీరు పెండ్లినాడు భోజనమొనర్చువేళ, బంగారుగిన్నెలో మీవ్రేలి యుంగరము జారిపండింది. అది యిదిగో!’ యని యాతని వ్రేలినుంచెను. అది సరిగా సరిపోయెను. తరువాత పెండ్లినాడు పార్వతీదేవి వచ్చి నీభర్తకు సర్పగండ మున్నదని చెప్పెను. దానికి "నేనేమి చేయవలెనిని అడిగినాను, మీయమ్మ శ్రావణమంగళవారము నోము నోచుకున్నది, ఆ కుండ నొగ్గవలసినదని చెప్పి యంతర్జాన మొందగా నేనాకుండను వగ్గుటకు పాము వచ్చినప్పుడు ప్రయత్నించినాను, అందినదికాదు. అప్పుడు నా పెనిమిటి తొడలపై కాలువైచి అందుకున్నాను. అదిగో చూడండి ఆ పసుపు పారాణి
కాలు తొడమీదనున్నది” అని చూపించెను. పరీక్షించిచూడగా ఆ యానవాలా తొడలపై కనిపించెను. కుండు పట్టుకొనివచ్చి విప్పచూడగా బంగారు సర్పమైవుండెను. అందుల కందరును ఆమోదించిరి. అప్పుడు అబద్ధము ఇప్పుడు నిజమని ఆకాశమంత పందిరివేసి భూదేవియంత అరుగువేసి గుచ్చిన ముత్యాల తోరణాలుకట్టి గుచ్చని ముత్యాలు తలంబ్రాలుపోసి డెబ్బదియోగముల వారిరువురకు నారాజు పెండ్లిచేసెను. అటు పిమ్మట నా చిన్నది శ్రావణ మంగళవారము నోమునుపట్టి ఆ కాటుక పెట్టుకొని వానితో నత్తవారింటికి వెళ్ళెను. అట్లు వెళ్ళుసరికి అత్తగారును, మామగారును, కుమారుని వియోగ దుఃఖముచేత కండ్లు కాళ్ళులేనివారైయుండిరి. ఊరివారందరు పరుగు పరుగునవచ్చి “సోమయాజులుగారు! సోమిదేవమ్మగారూ! మీ కొడుకు కోడలు వచ్చుచున్నారిని చెప్పిరి. “అయ్యో! మాకెక్కడ కోడలు? మా కెక్కడ కొడుకును? నాడే పోయినారు” అని వగచు చుండిరి. అప్పుడు బాజాచప్పుడు చెవులలో ప్రవేశించి వారికి చెవులు వచ్చెను. కోడలువచ్చి అత్తమామలకు నమస్మారముచేయగా వారికి కాళ్లు వచ్చెను. కౌగలించుకొనగా నడమువచ్చినది. కాటుక పెట్టగా కన్నులు వచ్చెను. 'ఏమి నోము పట్టినావు? ఏమివ్రతము పట్టినావు? అని అందరు అడిగిరి. నేను
శ్రావణ మంగళవారము నోము పట్టినానిని వారికి జవాబు చెప్పెను. ఆమె నోచిన నోము కలియుగములో నందరు నోచి యామెవలెనే సౌభాగ్యవంతులై భూలోకమున ప్రసిద్ధిగాంచిరి.

కథ లోపమైనా వ్రతలోపము కారాదు. భక్తి తప్పినా ఫలము తప్పదు.
ఉద్యాపనము: తొలియెట ఐదుగురు, మలియేట పది మంది ముత్తయిదువులకు, మూడవయేట పదిహేను మంది ముత్తయిదువులకు, నాలుగవయేట యిరువదిమంది ముత్తయిదువులకు, అయిదవయేట ఇరువది అయిదు ముత్తయిదువులకు వాయనములు ఇచ్చుకొని అయిదుయేళ్లు అయిన తరువాత పెండ్లినాడు పెండ్లికూతురునకు మట్టెలు, మంగళసూత్రములు క్రొత్తకుండలో ముప్పది మూడు జోడుల అరిసెలు పెట్టి క్రొత్తరవికలగుడ్డచే వాసెనగట్టి పెండ్లికూతురు నకు
అందియ్యవలయును.
పూజా విధానం:
ప్రాథమిక శుద్ధి: స్నానం చేసి, శుభ్రమైన వస్త్రాలు ధరించి, పూజా స్థలాన్ని శుభ్రం చేసుకోవాలి.
సంకల్పం: మంగళ గౌరీ దేవిని ఉద్దేశించి, సౌభాగ్యం కోసం ఈ వ్రతం చేస్తున్నట్లు సంకల్పం చెప్పుకోవాలి.
గణపతి పూజ: ముందుగా హరిద్రా గణపతి పూజ చేసి, ఆ తర్వాత మంగళ గౌరీ పూజ ప్రారంభించాలి.
మంగళ గౌరీ ప్రతిష్ఠ: మట్టితో చేసిన గౌరీ విగ్రహాన్ని లేదా పసుపుతో చేసిన గౌరీ దేవి రూపాన్ని పీఠపై ఉంచి, షోడశోపచారాలతో పూజించాలి.
పూజా సామగ్రి: పువ్వులు (ముఖ్యంగా మందార, గులాబీ), పసుపు, కుంకుమ, గంధం, అక్షతలు, దీపం, ధూపం, నైవేద్యం (అరటిపండు, బెల్లం, బియ్యం పిండితో చేసినవి) సమర్పించాలి.
మంగళ గౌరీ వ్రత కథ: శ్రావణ మంగళవారం కథను భక్తితో చదవాలి లేదా వినాలి.
తాంబూలం: కనీసం ఐదుగురు స్త్రీలకు (ముఖ్యంగా కొత్తగా పెళ్లయినవారు) పండ్లు, ఆకు, తమలపాకు, పూలు, పసుపు, కుంకుమ, మొలకలు, బియ్యం పిండితో చేసిన తంతులతో కూడిన తాంబూలం ఇవ్వాలి.
నైవేద్యం: బియ్యం పిండితో చేసిన వడలు, అరటిపండు, బెల్లం వంటివి సమర్పించి, హారతి ఇవ్వాలి.
ముగింపు: పూజ పూర్తయ్యాక, గౌరీ దేవికి సమర్పించిన అక్షతలు, కుంకుమను నుదుట పెట్టుకోవాలి.
ముఖ్య గమనిక: ఈ వ్రతం శ్రావణ మాసంలోని ప్రతి మంగళవారం రోజు, ముఖ్యంగా కొత్తగా పెళ్లయిన మహిళలు తమ మాంగల్యం నిలబడాలని కోరుకుంటూ ఐదు సంవత్సరాల పాటు ఆచరిస్తారు.
No comments:
Post a Comment