Friday, December 6, 2024

GANAPATHI PRARDHANA GHANAPATAH - గణపతి ప్రార్థన ఘనపాఠః

గణపతి ప్రార్థన ఘనపాఠః


ఓం శ్రీ గురుభ్యో నమః । హరిః ఓమ్ ॥

ఓం గణానాం త్వా గణపతిగ్ం హవామహే కవిం కవీనాం ఉపమశ్రవస్తవమ్ । జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత ఆ నః శృణ్వన్నూతిభిస్సీద సాదనమ్ ॥

గణానాం త్వా త్వా గణానాం గణానాం త్వా గణపతిం గణపతిం త్వా గణానాం గణానాం త్వా గణపతిమ్ ॥

త్వా గణపతిం గణపతిం త్వాత్వా గణపతిగ్ం హవామహే హవామహే గణపతిం త్వాత్వా గణపతిగ్ం హవామహే । గణపతిగ్ం హవామహే హవామహే గణపతిం గణపతిగ్ం హవామహే కవిన్కవిగ్ం హవామహే గణపతిం గణపతిగ్ం హవామహే కవిమ్ । గణపతిమితిగణ-పతిమ్ ॥

హవామహే కవిం కవిగ్ం హవామహే హవామహే కవిం కవీనాన్కవీనాం కవిగ్ం హవామహే హవామహే కవిన్కవీనామ్ ॥

కవిన్కవీనాన్కవీనాం కవిన్కవిం కవీనాముపమశ్రవస్తమ ముపమశ్రవస్తమంకవీనాం కవిన్కవిం కవీనాముపమశ్రవస్తమమ్ ॥

కవీనాముపమశ్రవ స్తమముపమశ్రవస్తమం కవీనా న్కవీనా ముపమశ్రవస్తమమ్ । ఉపమశ్రవస్తమ మిత్యుపమశ్రవః-తమమ్ ॥

జ్యేష్టరాజం బ్రహ్మణాం బ్రహ్మణాం జ్యేష్ఠరాజం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణో బ్రహ్మణో బ్రహ్మణాం జ్యేష్ఠరాజం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణః । జ్యేష్ఠరాజమితిజ్యేష్ఠ రాజం ॥

బ్రహ్మణాం బ్రహ్మణో బ్రహ్మణో బ్రహ్మణాం బ్రహ్మణాం బ్రహ్మణస్పతే పతేబ్రహ్మణో బ్రహ్మణాం బ్రహ్మణాం బ్రహ్మణస్పతే ॥

బ్రహ్మణస్పతే పతే బ్రహ్మణో బ్రహ్మణస్పత ఆపతే బ్రహ్మణో బ్రహ్మణస్పత ఆ । పత ఆ పతేపత ఆనో॑న ఆపతే పత ఆనః ॥

ఆనోన ఆనశ్శృణ్వన్ఛృణ్వన్న ఆనశ్శృణ్వన్న్ । న శ్శృణ్వన్ఛృణ్వన్నోన శ్శృణ్వన్నూ॒తిభి రూతిభిశ్శృణ్వన్నోన శ్శృణ్వన్నూతిభిః॥

శ్శృణ్వన్నూతిభి రూతిభిశ్శృణ్వన్ఛృణ్వన్నూతిభిస్సీద సీదోతిభిశ్శృణ్వన్ ఛృణ్వన్నూతిభిస్సీద ॥

ఊతిభిస్సీద సీదోతిభి రూతిభిస్సీద సాదనగ్ం సాదనగ్ం సీదోతిభిరూతిభిస్సీద సాదనమ్ । ఊతిభి రిత్యూతి-భిః॒ ॥

సీదసాదనగ్ం సాదనగ్ం సీద సీద సాదనమ్ । సాదనమితి సాదనమ్ ॥

ఓం శ్రీ మహాగణపతయే నమః ॥

SRI DURGA APADUDDHARAKA STOTRAM - శ్రీ దుర్గా ఆపదుద్ధారక స్తోత్రం

శ్రీ దుర్గా ఆపదుద్ధారక స్తోత్రం


నమస్తే శరణ్యే శివే సానుకంపే
నమస్తే జగద్వ్యాపికే విశ్వరూపే ।
నమస్తే జగద్వంద్యపాదారవిందే
నమస్తే జగత్తారిణి త్రాహి దుర్గే ॥ 1 ॥

నమస్తే జగచ్చింత్యమానస్వరూపే
నమస్తే మహాయోగివిజ్ఞానరూపే ।
నమస్తే నమస్తే సదానందరూపే
నమస్తే జగత్తారిణి త్రాహి దుర్గే ॥ 2 ॥

అనాథస్య దీనస్య తృష్ణాతురస్య
భయార్తస్య భీతస్య బద్ధస్య జంతోః ।
త్వమేకా గతిర్దేవి నిస్తారకర్త్రీ
నమస్తే జగత్తారిణి త్రాహి దుర్గే ॥ 3 ॥

అరణ్యే రణే దారుణే శత్రుమధ్యే-
ఽనలే సాగరే ప్రాంతరే రాజగేహే ।
త్వమేకా గతిర్దేవి నిస్తారనౌకా
నమస్తే జగత్తారిణి త్రాహి దుర్గే ॥ 4 ॥

అపారే మహాదుస్తరేఽత్యంతఘోరే
విపత్సాగరే మజ్జతాం దేహభాజామ్ ।
త్వమేకా గతిర్దేవి నిస్తారహేతు-
ర్నమస్తే జగత్తారిణి త్రాహి దుర్గే ॥ 5 ॥

నమశ్చండికే చండదుర్దండలీలా-
సముత్ఖండితా ఖండితాఽశేషశత్రోః ।
త్వమేకా గతిర్దేవి నిస్తారబీజం
నమస్తే జగత్తారిణి త్రాహి దుర్గే ॥ 6 ॥

త్వమేకా సదారాధితా సత్యవాది-
న్యనేకాఖిలా క్రోధనా క్రోధనిష్ఠా ।
ఇడా పింగళా త్వం సుషుమ్నా చ నాడీ
నమస్తే జగత్తారిణి త్రాహి దుర్గే ॥ 7 ॥

నమో దేవి దుర్గే శివే భీమనాదే
సదాసర్వసిద్ధిప్రదాతృస్వరూపే ।
విభూతిః శచీ కాలరాత్రిః సతీ త్వం
నమస్తే జగత్తారిణి త్రాహి దుర్గే ॥ 8 ॥

శరణమసి సురాణాం సిద్ధవిద్యాధరాణాం
మునిమనుజపశూనాం దస్యుభిస్త్రాసితానాం
నృపతిగృహగతానాం వ్యాధిభిః పీడితానామ్ ।
త్వమసి శరణమేకా దేవి దుర్గే ప్రసీద ॥ 9 ॥

ఇదం స్తోత్రం మయా ప్రోక్తమాపదుద్ధారహేతుకమ్ ।
త్రిసంధ్యమేకసంధ్యం వా పఠనాద్ఘోరసంకటాత్ ॥ 10 ॥

ముచ్యతే నాత్ర సందేహో భువి స్వర్గే రసాతలే ।
సర్వం వా శ్లోకమేకం వా యః పఠేద్భక్తిమాన్సదా ॥ 11 ॥

స సర్వం దుష్కృతం త్యక్త్వా ప్రాప్నోతి పరమం పదమ్ ।
పఠనాదస్య దేవేశి కిం న సిద్ధ్యతి భూతలే ।
స్తవరాజమిదం దేవి సంక్షేపాత్కథితం మయా ॥ 12

|| ఇతి శ్రీ సిద్ధేశ్వరీతంత్రే పరమశివోక్త శ్రీ దుర్గా ఆపదుద్ధార స్తోత్రమ్ ।|

MANISHA PANCHAKAM - మనీషా పంచకం

మనీషా పంచకం


సత్యాచార్యస్య గమనే కదాచిన్ముక్తి దాయకమ్ ।
కాశీక్శేత్రం ప్రతి సహ గౌర్యా మార్గే తు శంకరమ్ ॥

అంత్యవేషధరం దృష్ట్వా గచ్ఛ గచ్ఛేతి చాబ్రవీత్ ।
శంకరఃసోఽపి చాండలస్తం పునః ప్రాహ శంకరమ్ ॥

అన్నమయాదన్నమయమథవా చైతన్యమేవ చైతన్యాత్ ।
యతివర దూరీకర్తుం వాంఛసి కిం బ్రూహి గచ్ఛ గచ్ఛేతి ॥

ప్రత్యగ్వస్తుని నిస్తరంగసహజానందావబోధాంబుధౌ
విప్రోఽయం శ్వపచోఽయమిత్యపి మహాన్కోఽయం విభేదభ్రమః ।
కిం గంగాంబుని బింబితేఽంబరమణౌ చాండాలవీథీపయః
పూరే వాఽంతరమస్తి కాంచనఘటీమృత్కుంభయోర్వాఽంబరే ॥

జాగ్రత్స్వప్నసుషుప్తిషు స్ఫుటతరా యా సంవిదుజ్జృంభతే
యా బ్రహ్మాదిపిపీలికాంతతనుషు ప్రోతా జగత్సాక్షిణీ ।
సైవాహం న చ దృశ్యవస్త్వితి దృఢప్రజ్ఞాపి యస్యాస్తి చే-
చ్చాండాలోఽస్తు స తు ద్విజోఽస్తు గురురిత్యేషా మనీషా మమ ॥ 1॥

బ్రహ్మైవాహమిదం జగచ్చ సకలం చిన్మాత్రవిస్తారితం
సర్వం చైతదవిద్యయా త్రిగుణయాఽశేషం మయా కల్పితమ్ ।
ఇత్థం యస్య దృఢా మతిః సుఖతరే నిత్యే పరే నిర్మలే
చాండాలోఽస్తు స తు ద్విజోఽస్తు గురురిత్యేషా మనీషా మమ ॥ 2॥

శశ్వన్నశ్వరమేవ విశ్వమఖిలం నిశ్చిత్య వాచా గురో-
ర్నిత్యం బ్రహ్మ నిరంతరం విమృశతా నిర్వ్యాజశాంతాత్మనా ।
భూతం భావి చ దుష్కృతం ప్రదహతా సంవిన్మయే పావకే
ప్రారబ్ధాయ సమర్పితం స్వవపురిత్యేషా మనీషా మమ ॥ 3॥

యా తిర్యఙ్నరదేవతాభిరహమిత్యంతః స్ఫుటా గృహ్యతే
యద్భాసా హృదయాక్షదేహవిషయా భాంతి స్వతోఽచేతనాః ।
తాం భాస్యైః పిహితార్కమండలనిభాం స్ఫూర్తిం సదా భావయ-
న్యోగీ నిర్వృతమానసో హి గురురిత్యేషా మనీషా మమ ॥ 4॥

యత్సౌఖ్యాంబుధిలేశలేశత ఇమే శక్రాదయో నిర్వృతా
యచ్చిత్తే నితరాం ప్రశాంతకలనే లబ్ధ్వా మునిర్నిర్వృతః ।
యస్మిన్నిత్యసుఖాంబుధౌ గలితధీర్బ్రహ్మైవ న బ్రహ్మవిద్
యః కశ్చిత్స సురేంద్రవందితపదో నూనం మనీషా మమ ॥ 5॥

దాసస్తేఽహం దేహదృష్ట్యాఽస్మి శంభో
జాతస్తేంఽశో జీవదృష్ట్యా త్రిదృష్టే ।
సర్వస్యాఽఽత్మన్నాత్మదృష్ట్యా త్వమేవే-
త్యేవం మే ధీర్నిశ్చితా సర్వశాస్త్రైః ॥

ఇతి శ్రీమచ్ఛంకరభగవతః కృతౌ మనీషాపంచకం సంపూర్ణమ్

SRI KAMA KALA KALI KAVACHAM(TRAILOKYA MOHANAM) - శ్రీ కామ కళాకాళీ కవచం (త్రైలోక్యమోహనం)

 శ్రీ కామ కళాకాళీ  కవచం (త్రైలోక్యమోహనం)


అస్య శ్రీ త్రైలోక్యమోహన రహస్య కవచస్య త్రిపురారి: ఋషి: విరాట్ చందః భగవతి, కామ కళాకాళీ దేవత ఫ్రేమ్ బీజం యోగినీ శక్తి: కామార్ణం కీలకం డాకిని తత్త్వం  శ్రీ కామ కళాకాళీ  ప్రీత్యర్ధం పురుషార్థచతుష్టయే  వినియోగః || 

ఓం ఐం శ్రీం క్లీం శిరః పాతు ఫ్రేO హ్రీO చ్రీం మదనాతుర| 
స్త్రీO హ్రూO క్షౌO హ్రీO లO లలాటం పాతు ఖ్ప్రేO  క్రౌO కారాలినీ || 1 || 

అం హౌO ప్రోO 

RAGHAVENDRA ASHTOTHARA SHATHA NAMAVALI - రాఘవేంద్ర అష్టోత్తర శత నామావళి



రాఘవేంద్ర అష్టోత్తర శత నామావళి


ఓం స్వవాగ్దే వ తాసరి ద్బ క్తవిమలీ కర్త్రే నమః
ఓం రాఘవేంద్రాయ నమః
ఓం సకల ప్రదాత్రే నమః
ఓం భ క్తౌఘ సంభే దన ద్రుష్టి వజ్రాయ నమః
ఓం క్షమా సురెంద్రాయ నమః
ఓం హరి పాదకంజ నిషేవ ణాలబ్ది సమస్తే సంపదే నమః
ఓం దేవ స్వభావాయ నమః
ఓం ది విజద్రుమాయ నమః
ఓం ఇష్ట ప్రదాత్రే నమః
ఓం భవ్య స్వరూపాయ నమః ॥ 10 ॥
ఓం భ వ దుఃఖతూల సంఘాగ్నిచర్యాయ నమః
ఓం సుఖ ధైర్య శాలినే నమః
ఓం సమస్త దుష్టగ్ర హనిగ్ర హేశాయ నమః
ఓం దురత్య యో పప్ల సింధు సేతవే నమః
ఓం నిరస్త దోషాయ నమః
ఓం నిర వధ్యదేహాయ నమః
ఓం ప్రత్యర్ధ మూకత్వవిధాన భాషాయ నమః
ఓం విద్వత్సరి జ్ఞేయ మహా విశేషాయ నమః
ఓం వా గ్వైఖరీ నిర్జిత భవ్య శే షాయ నమః
ఓం సంతాన సంపత్సరిశుద్దభక్తీ విజ్ఞాన నమః ॥20 ॥
ఓం వాగ్దె హసుపాటవాది ధాత్రే నమః
ఓం శరిరోత్ధ సమస్త దోష హంత్రె నమః
ఓం శ్రీ గురు రాఘవేంద్రాయ నమః
ఓం తిరస్కృత సుంనదీ జలపాదో దక మహిమావతే నమః
ఓం దుస్తా పత్రయ నాశనాయ నమః
ఓం మహావంద్యాసుపుత్ర దాయకాయ నమః
ఓం వ్యంగయ స్వంగ సమృద్ద దాయ నమః
ఓం గ్రహపాపా పహయె నమః
ఓం దురితకానదావ భుత స్వభక్తి దర్శ నాయ నమః ॥ 30 ॥
ఓం సర్వతంత్ర స్వతంత్రయ నమః
ఓం శ్రీమధ్వమతవర్దనాయ నమః
ఓం విజయేంద్ర కరా బ్జోత్ద సుదోంద్రవర పూత్రకాయ నమః
ఓం యతిరాజయే నమః
ఓం గురువే నమః
ఓం భయా పహాయ నమః
ఓం జ్ఞాన భక్తీ సుపుత్రాయుర్యశః
శ్రీ పుణ్యవర్ద నాయ నమః
ఓం ప్రతివాది భయస్వంత భేద చిహ్నార్ధ రాయ నమః
ఓం సర్వ విద్యాప్రవీణాయ నమః
ఓం అపరోక్షి కృత శ్రీశాయ నమః ॥ 40 ॥
ఓం అపేక్షిత ప్రదాత్రే నమః
ఓం దాయాదాక్షిణ్య వైరాగ్య వాక్పాటవ ముఖాంకి తాయ నమః
ఓం శాపానుగ్ర హశాక్తయ నమః
ఓం అజ్ఞాన విస్మృతి బ్రాంతి నమః
ఓం సంశయాపస్మృతి క్ష యదోష నాశకాయ నమః
ఓం అష్టాక్షర జపేస్టార్ద ప్రదాత్రే నమః
ఓం అధ్యాత్మయ సముద్భవకాయజ దోష హంత్రే నమః
ఓం సర్వ పుణ్యర్ధ ప్రదాత్రే నమః
ఓం కాలత్ర యప్రార్ధ నాకర్త్యహికాముష్మక సర్వస్టా ప్రదాత్రే నమః
ఓం అగమ్య మహిమ్నేనమః ॥ 50 ॥
ఓం మహయశశే నమః
ఓం మద్వమత దుగ్దాబ్ది చంద్రాయ నమః
ఓం అనఘాయ నమః
ఓం యధాశక్తి ప్రదక్షిణ కృత సర్వయాత్ర ఫలదాత్రే నమః
ఓం శిరోధారణ సర్వతీర్ధ స్నాన ఫతదాతృ సమవ బందావన గత జాలయ నమః
ఓం నమః కరణ సర్వభిస్టా ధార్తే నమః
ఓం సంకీర్తన వేదాద్యర్ద జ్ఞాన దాత్రే నమః
ఓం సంసార మగ్నజనోద్దార కర్త్రే నమః
ఓం కుస్టది రోగ నివర్త కాయ నమః
ఓం అంధ దివ్య దృష్టి ధాత్రే నమః ॥ 60 ॥
ఓం ఏడ మూకవాక్సతుత్వ ప్రదాత్రే నమః
ఓం పూర్ణా యు:ప్రదాత్రే నమః
ఓం పూర్ణ సంప త్స్ర దాత్రే నమః
ఓం కుక్షి గత సర్వదోషమ్నానమః
ఓం పంగు ఖంజ సమీచానావ యవ నమః
ఓం భుత ప్రేత పిశాచాది పిడాఘ్నేనమః
ఓం దీప సంయోజనజ్ఞాన పుత్రా దాత్రే నమః
ఓం భవ్య జ్ఞాన భక్త్యది వర్దనాయ నమః
ఓం సర్వాభిష్ట ప్రదాయ నమః
ఓం రాజచోర మహా వ్యా ఘ్ర సర్పన క్రాది పిడనఘ్నేనమః ॥ 70 ॥
ఓం స్వస్తోత్ర పరనేస్టార్ధ సమృద్ధ దయ నమః
ఓం ఉద్య త్ప్రుద్యోన ధర్మకూర్మాసన స్దాయ నమః
ఓం ఖద్య ఖద్యో తన ద్యోత ప్రతాపాయ నమః
ఓం శ్రీరామమానసాయ నమః
ఓం దృత కాషాయవ సనాయ నమః
ఓం తులసిహార వక్ష నమః
ఓం దోర్దండ విలసద్దండ కమండలు విరాజితాయ నమః
ఓం అభయ జ్ఞాన సముద్రాక్ష మాలాశీలక రాంబుజాయ నమః
ఓం యోగేంద్ర వంద్య పాదాబ్జాయ నమః
ఓం పాపాద్రి పాటన వజ్రాయ నమః ॥ 80 ॥
ఓం క్షమా సుర గణాధీ శాయ నమః
ఓం హరి సేవలబ్ది సర్వ సంపదే నమః
ఓం తత్వ ప్రదర్శకాయ నమః
ఓం భవ్యకృతే నమః
ఓం బహువాది విజయినే నమః
ఓం పుణ్యవర్దన పాదాబ్జాభి షేక జల సంచాయాయ నమః
ఓం ద్యునదీ తుల్యసద్గుణాయ నమః
ఓం భక్తాఘవిద్వంసకర నిజమూరి ప్రదర్శకాయ నమః ॥ 90 ॥
ఓం జగద్గుర వే నమః కృపానిధ యే నమః
ఓం సర్వశాస్త్ర విశారదాయ నమః
ఓం నిఖిలేంద్రి యదోష ఘ్నే నమః
ఓం అష్టాక్షర మనూది తాయ నమః
ఓం సర్వసౌఖ్యకృతే నమః
ఓం మృత పోత ప్రాణాదాత్రే నమః
ఓం వేది స్ధపురుషోజ్జీ వినే నమః
ఓం వహ్నిస్త మాలికోద్ద ర్త్రే నమః
ఓం సమగ్ర టీక వ్యాఖ్యాత్రే నమః
ఓం భాట్ట సంగ్ర హకృతే నమః ॥ 100 ॥
ఓం సుధాపర మిళోద్ద ర్త్రే నమః
ఓం అపస్మారా పహ ర్త్రే నమః
ఓం ఉపనిష త్ఖండార్ధ కృతే నమః
ఓం ఋ గ్వ్యఖ్యాన కృదాచార్యాయ నమః
ఓం మంత్రాలయ నివసినే నమః
ఓం న్యాయ ముక్తా వలీక ర్త్రే నమః
ఓం చంద్రి కావ్యాఖ్యాక ర్త్రే నమః
ఓం సుంతంత్ర దీపికా ర్త్రే నమః
ఓం గీతార్ద సంగ్రహకృతే నమః ॥ 108 ॥

Wednesday, December 4, 2024

సప్తమ భావమందున్న గ్రహ ఫలితాలు

సప్తమ భావమందున్న గ్రహ ఫలితాలు

01. జన్మ లగ్నము నుండి ఏడవ స్థానము సప్తమ భావము! ఇదే కళత్ర భావము! దీనిని "అస్తమయ కేంద్రము",  "వివాహ స్థానము" ననియు నందురు. 

02. సప్తమ భావమునకు ప్రధాన కారక గ్రహం శుక్రుడు.!

03. సప్తమ భావము ద్వారా జాతకుని యొక్క వివాహము, భార్య, భర్త, దాంపత్య సౌఖ్యము, భార్యాభర్తల అన్యోన్యము, మోహము, రేతస్సు(ఇంద్రియపుష్టి), ఇంద్రియములు, కామము, సంసారము, విహారము, పాతివ్రత్యమును, భార్య లేక భర్త యొక్క మృతి, స్త్రీ-పురుషులతో కలహములు, మృష్ఠాన్న భోజనాదులు, తాంబూల-సుగంధ ద్రవ్య-అలంకార శయ్యా సౌఖ్యములు,  కీర్తి-అపకీర్తి, ఆట-పాటలు, వర్తక-వాణిజ్యాదులు, భాగస్వామ్యములు, క్రయ-విక్రయములు, కోర్టు వ్యవహారములు, తగాదాలు, నష్టదనము, దత్తపుత్రులు, గాన-సంగీత-నృత్య-నాటకాది చతుషష్టి కళలు, రహస్య విషయములు, దొంగతనము, అప్పులిచ్చుట, వడ్డీ వ్యాపారము, దానము, ప్రయాణ విఘ్నములు, త్రోవ తప్పుట, ఉద్యోగము, పశుసంపద, శత్రువిజయము, వ్యసనాలంపట, వ్యభిచారము, దంతములు, నాభి, స్త్రీల మర్మావయవములు, స్థనములు, లింగము, నిగూఢవర్తనము అను ఫలితములను గురించి తెలియదగుయున్నది. 

04.  సప్తమ భావమునకు- శుభ గ్రహములు అధిపతులగుట వలన వారు ఆధిపత్య పాపులగుదురు. పాపగ్రహముల కాధిపత్యము కలిగినవారు- ఆధిపత్య శుభులు కాగలరు. నైసర్గిక శుభగ్రహములు (శుక్రుడు తప్ప) భావము నందుండుట మంచిది. 

05. సప్తమ భావము నందు రవియున్న- చంచలత్వము, స్వల్ప సౌఖ్యము, చెవుడు, విఫలత్వము, స్త్రీ వియోగము, అనారోగ్యములు, భార్యకు దౌర్భాగ్యము, పాపకార్యాసక్తి కలుగ గలవు.

06. సప్తమ భావమందు చంద్రుడున్న- శరీరకాంతి, చక్కని దేహము, పరస్త్రీ సంఘమము లుండగలవు. క్షీణచంద్రుడున్న- రోగ శరీరము, పనికిమాలిన భార్య, కళత్ర అనారోగ్యము లుండగలవు. 

07. కుజుడు సప్తమమందున్న- విరహము, బావనష్టము లుండగలవు. చంద్రుని కలయిక వలన- ఆర్తి, విద్యావిహీనత, భయంకర స్వభావము లుండగలవు. 

08. బుధుడు సప్తమ స్థానమందున్న- యుక్తాయుక్త పరిజ్ఞానము, కాముకత్వము, అల్పమైన రతి సౌఖ్యము, ధనము, తెలివిగల భార్య, కొలహీనత యగుదానితో సంబంధము, పుత్రులు, సువర్ణ-ధన-భాగ్యములు కలుగ గలవు. 

09. సప్తమ స్థానంలో గురువున్న- నమ్రత, శాస్త్రాసక్తి,, మంచి యోచన, విద్యా-వినయ-రూప-శీలములు, మంచి భార్య, మాట పొందిక, వకృత్వ శక్తి, దాతృత్వము, సమర్ధత, ఖ్యాతి కలుగగలవు. 

10. శుక్రుడు సప్తమ స్థానమందున్న- సౌందర్య స్త్రీలయందు మోజు, జారత్రము, అనేక వివాహములు, పుత్రసంతతి, గొప్ప వంశము, పేరు-ప్రతిష్టలు, విశేష ధన-భాగ్యములు ప్రాప్తించగలవు. 

11. సప్తమ స్థానంలో శనియున్న- అందము, బలము లేకపోవుట, స్త్రీ గృహ-ధాన్యా లోపము, జీర్ణావస్త్రధారణ, దుర్జన సహావాసము, నీచత్వము, జారత్వము, వ్యసన లంపటము, అధిక వయస్సు గల భార్య, వృద్ధ స్త్రీ సంపర్కము, కళత్ర నష్టములు కలుగగలవు. 

12. రాహువు సప్తమమందున్న- అమాయకురాలైన భార్య, చెడుబుద్ధులు, రోగకళత్రము, సంతానహీనత, నీచ స్త్రీ సంపర్కము, వ్యభిచారము, రెండవ వివాహము, కళత్ర నష్టములు కలుగును. 

13. సప్తమంలో కేతువున్న- శోకము, జలగండము, దైవభక్తి, తెలివి తేటలు గల భార్య, పాపకార్యాసక్తి, కాముకత్వము కాలత్రానురాగము, భార్య వినియోగ దుఃఖము, ధనహాని ప్రాప్తించగలవు. 

వివాహ యోగములు

01. వివాహమునకు శుక్రుని బలాబలములు ముఖ్యము! మరియు లగ్నా చతుర్థి దశమ భావాధిపతులు- వారి బలాబలములు కూడా చూడవలెను. 

02. లగ్నాధిపతి, సప్తమాధిపతి, నవమాధిపతి, గురువు, శుక్రుడు అను వారిలో అధిక బలము గల గ్రహ దశయందు- వివాహము కాగలదు.

03.  సప్తమాధిపతి శుభారాశి యందుండి వివాహ కారక గ్రహము స్వక్షేత్ర-ఉచ్చ క్షేత్రములందున్న- 9 వ సంవత్సరంలో బాల్యవివాహము కాగలదు. 

04. శుక్రుడు సప్తమాధిపతి కలిసియుండి, సప్తమంలో రవియుండిన బాల్య వివాహము జరుగును. 

05. సప్తమాధిపతి బలమగు స్థానము నందుండి, ద్వితీయంలో శుక్రుడున- 10-16 సంవత్సరముల మధ్య వివాహము కాగలదు. 

06. 1-4-7-10 స్థానములలో శుక్రుడుండి, ఆ శుక్రునికి సప్తమ రాశిలో చంద్రుడున్న- 12 నుండి 19 సంవత్సరముల లోపు వివాహమగును. 

07. సప్తమ స్థానంలో గురువుకుఉచ్చ-స్వక్షేత్ర, మిత్రక్షేత్ర స్థితి కలిగిన బాల్య వివాహము జరుగును. 

08. ద్వితీయాధిపతి 11 వ స్థానమందు 7 వ స్థానాధిపతి 2 వ స్థానమందు ఉన్న 15 వ సంవత్సరములో వివాహమగును. 

09. లగ్న-అష్టమాధిపతులతో శుక్రుడు కలిసియున్న- 15వ సంవత్సరంలో వివాహము జరుగును. 

10. చంద్ర లగ్నమునకు 7 వ రాశియందు శుక్రుడుండి, ఆ ఏడవ రాశ్యాధిపతియున్న రాశినుండి 7 వ రాశియందు శనియున్న- 18 వ సంవత్సరంలో వివాహయోగము. 

11. శుక్రునికి కేంద్ర స్థితి కలిగియుండి, ఆ కేంద్రాధిపతి 11వ స్థానమందున్న- 20-25 సంవత్సరములందు వివాహం జరుగును. 

12. ద్వితీయాధిపతి, కుజుడూ కలిసియుండి; ద్వితీయమందు శుక్రుడున్న- 22 లేక 27వ సంవత్సరంలో వివాహమగును. 

13. సప్తమాధిపతి సప్తమమందుండి, శుక్రుడు 7-9 స్థానములందున్న- 27 లేక 30 వ సంవత్సరమునందు వివాహము జరుగును. 

14. లగ్నాధిపతి, శుక్రుడు కలిసియుండి; అష్టమాధిపతి 8వ స్థానమందున్న- 23, 25వ సంవత్సరమునందు వివాహ యోగము కలుగును. 

15. ద్వితీయంలో రాహువు, తృతీయంలో శుక్రుడుండిన- 31 లేక 34 సంవత్సరములందు వివాహమగును. 

16. సప్తమాధిపతి, లగ్నాధిపతీ, శుక్రుడు స్థిరరాశుల యందుండి; చంద్రుడు క్షీణభలము కలిగి, చరరాశియందున్న- వివాహము 30 సంవత్సరములు వరకు జరగదు. 

17. పై విధముగా గ్రహ స్థితియందు శుక్ర-సప్తమాధిపతులకు శని యొక్క దృష్టి కలిగిన- లేక లగ్నాధిపతి, శుక్రులతో-శని కలిసిన 50 సంవత్సరముల వరకు వివాహ యోగము కలుగదు. 

18. లగ్నమందు అష్టమాధిపతియున్న- మూడు వివాహములు కాగలవు. 

19. సప్తమ భావమునందు చంద్రుడున్నను, భావమును జూచినను- వివాహయోగములు కొన్ని తప్పిపోయి; తదుపరి ఫలించగలవు. 

20. సప్తమస్థాన, స్థానాధిపతులకు రవి-శని సంబంధములు కలిగినను, లేక మకర-కుంభములందు శుక్రుడునను- వివాహము ఆలస్యమగును. 

21. కారకాంశ లగ్నమునుండి 2-4 స్థానములందు బుధుడుండిన యెడల వివాహము కాదు (రాశి  చక్రంలో అధిక భాగం గతించిన గ్రహము నవాంశలో ఏ రాశియందున్న ఆ రాశి కారకాంశ లగ్నము). 

22. సప్తమాధిపతి శుభగ్రహ సంబంధ రహితుడై, స్థానము బలరహితమై యుండి; సప్తమంలో ధూమగ్రహమున్న యెడల- వివాహము జరగదు. 

23. ద్వితీయ-సప్తమాధిపతులు ఒకే రాశి యందు పాపగ్రహాములతో కలిసి ఉన్న- వివాహము జరుగుట దుర్లభము. 

24. సప్తమాధిపతిగానీ, శుక్రుడుగానీ 8-12 స్థానములందుండగా; సప్తమంలో శనియున్న- వివాహము కానేరదు. 

25. చంద్రుడు, వ్యాయాధిపతీ శత్రుగ్రహాములతో గలసి; నీచాంశల యందున్న- వివాహము కాదు. 

26.  2-7-9-10 స్థానము లన్నిటియందు పాప గ్రహములున్న- వివాహముండదు.

27. ద్వీతీయభావమునకు, సప్తమభావమునకు పాపగ్రహార్గళము కలిగిన (ఇరువైపులా పాపగ్రహములుండుట)- వివాహయోగముండదు. 

వివాహకాల దశాంతర్దశలు

1. పాపరాశులయందున్న (6-8-12) శుభగ్రహ దశల మధ్య కాలము వివాహము కలిగించగలదు. 

02.సప్తమాధిపతియున్న రాశ్యంశాధిపతి గ్రహములు- శుక్ర-చంద్రులలో శుభాదిక గ్రహ దశాంతర్ధశలయందు- వివాహము జరుగగలదు. 

03.శుక్రుడు, కళత్ర స్థానాధిపతి అను గ్రహములతో బలముగల గ్రహముతో కలిసియున్న- గ్రహ దశాంతర్ధశలయందు- వివాహమగును. 

04.చంద్ర దశలో బుధ-అంతర్దశ, గురుదశలో-గురు అంతర్దశ, గురుదశలో-చంద్ర అంతర్దశ, బుద్ద దశలో-చంద్ర-బుధ-గురువు అంతర్దశలు; శుక్ర దశలో శుక్ర అంతర్దశల యందు- సామాన్యంగా వివాహయోగము ప్రాప్తిస్తుంది. 

05.నవాంశ చక్రంలో లగ్నాధిపతియున్న రాశ్యాధిపతి యొక్క స్వక్షేత్రములందు, గోచార గురు సంచార కాలమునందు- వివాహము కాగలదు. 

06.నవాంశ చక్రంలో సప్తమాధిపతి యున్న రాశికి 5-9 రాశులలో, గోచార గురువు సంచరించే కాలం- వివాహ సమయంగా ఉంటుంది. 

07.జన్మ లగ్న, చంద్ర లగ్నములకు 1-4-7-10 రాశులలో గోచార గురిని సంచారకాలమునందు- వివాహమునుహించవలెను. 

08.రాశి చక్రమందు- గురువున్న రాశికి 1-4-5-7-9-10 రాశులలో గోచార గురిని సంచార కాలమునందు- వివాహ యోగం ఉండగలదు. 

09.లగ్నాధిపతి, సప్తమాధిపతియున్న రాశులలో గోచార గురుని సంచారకాలము- వివాహము జరుగుటకు దోహదపడగలదు. 

10.జన్మలగ్నము నుండి 2-7 రాశులలో గోచార గురుని సంచార కాలము కూడ- వివాహము జరుగును. 

11.లగ్నాధిపతితోగాని, సప్తమాధిపతితోగాని కలిసియున్న గ్రహముల యొక్క దశాంతర్ధశలయందు- భార్య ప్రాప్తించగలదు. 

కళత్ర - రూప, శీలాది యోగములు

01.గురు,చంద్ర, శుక్రులు కలిసియున్నను, లేక చంద్ర, శుక్రులు కలసియుండి; వారికి గురుదృష్టి యున్నను- అందమైన భార్య లభించగలదు.

02.కర్కాటక రాశి సప్తమ స్థానమై, అందు కుజ-శనులు కలసియున్న- అందము, పాతివృత్యము గల భార్య ప్రాప్తించగలదు. 

03.అంశ చక్రమునందు- సప్తమ స్థానంలో, చంద్ర-గురువులుండిన- రూపవతియకు భార్య లభించగలదు. 

04.సప్తమ స్థానమందు బుధుడున్న- భార్య రూపసి కాగలదు, కళత్ర రాశికి బుధ సంబంధముండిన- భార్య చురుకుదనము, తెలివితేటలు కలిగి యదార్ధవాది కాగలదు.

05.సప్తమమున గురుడున్న- జాతకుని భార్య ధర్మ గుణశీల కాగలదు. 

06.సప్తమాధిపతి కేంద్ర స్థానము లందుండి, శుభగ్రహ వీక్షితుడైన- వాని భార్య శీలవతియగును. 

07.సప్తమాధిపతి శుభ నవాంశలయందున్న- భార్య శీలవతియుగను. 

08.లగ్నాధిపతి బలవంతుడై యుండి, సప్తమంలో గురువుండి, శుక్రుడు చరరాశి యందున్న- అధిక సౌందర్యము గల భార్య ప్రాప్తించగలదు. 

09.శుక్రునికి, సప్తమాధిపతికి గురుని సంబంధమున్న- భార్య ప్రతివ్రత కాగలదు. 

10.సప్తమాధిపతి గురువై, వానికి బుధ-శుక్రుల సంబంధం ప్రాప్తించిన- పతివ్రతయకు భార్య లభించగలదు. 

11.7 వ స్థానాధిపతి శుభగ్రములతో కలసి, శుభగ్రహ వీక్షితుడైయున్న- కళంక రహిత, సౌభాగ్యవతియకు భార్య ప్రాప్తించి; వివాహానంతరము ధన-భాగ్య-సంపదల నందగలడు. 

12.గురువు 1-9-11 స్థానములందున్న- సత్కళత్రము కలుగును. 

13.బలవంతుడగు సప్తమాధిపతి- శుక్రునితో గలసి 4-10 స్థానంముల యందున్న- సత్కళత్రము కలుగును.

14.జన్మ లగ్నమందు సప్తమాధిపతియుండి, ద్వితీయమున గురుడున్న- ఇరువురు భార్యలుండి అందు మొదటి భార్య పొడవు, స్థూల శరీరము గలదియు; రెండవ భార్య పొట్టిగానుండి, సౌందర్యవతియు కాగలదు. 

15.లగ్నాధిపతికన్నను అధిక బలముగల సప్తమాధిపతి శుభగ్రహ రాశ్యాంశల యందుండినను, శుభ దృగ్యోగాది సంబంధము కలిగినను పరమోచ్చ, వైశేషికాంశలయందున్నను- భార్య ఉత్తమ కుల సంజాతురాలు కాగలదు. 

16.సప్తమాధిపతి బలము కంటే తక్కువ బలముగల లగ్నాధిపతి బలహీనుడై, శత్రువు నవాంశల యందున్నను; నీచాంశము, మూడము, నీచ గ్రహ దృగ్యోగ సంబంధాదులు కలిగియున్నను- భార్య హీనకుల సంజాతురాలు కాగలదు. 

17.సప్తమ స్థానమందు కుజుడున్న- కుచ్చితురాలగు భార్య కలుగును. 

18.రవికి సప్తమాధిపత్యం కలిగి, పాపగ్రహరాశి-నవాంశల యందున్నను; పాపగ్రహ, దృక్యోగాది సంబంధములు కలిగినను- భార్య పాపాత్మురాలగును. 

19.సప్తమ భావమునకు శని సంబంధము కలిగిన- జాతకుని భార్య కోప స్వభావం కలిగి, ముకుళితముఖియై యున్నాను; ఓర్పు-కష్టించి పనిచేయు స్వభావము కలదిగా నుండును. 

20.సప్తమ స్థానమునకు శుభ సంబంధము లేక కేవలం కుజుని సంబంధమే కలిగియున్న- జాతకుని భార్య భర్తను బాధించునది, కోపి రతి, తిరస్కార భావము గలదిగా నుండగలదు. 

21.అంశ చక్రమందు 7 వ స్థానంలో కుజుడున్న- అంగవైకల్యము గల భార్య కలుగును. 

22.చంద్రునికి సప్తమాధిపత్యం కలిగి, పాపగ్రహ రాశి-నవాంశల యందున్నను, పాప ద్రుగ్యోగాది సంబంధములున్నను- దోషయుక్తయై, చెడు పనుల నాచరించెడు కఠినాత్మురాలు భార్య కాగలదు. 

23.సింహరాశి సప్తమ స్థానమై, రవి కేంద్ర స్థానములందున్న- భార్య స్థనములు గొప్పవియు, కఠినముగా నుండునవియు నగును. 

24.కుజుడు సప్తమాధిపతిగానున్న- కుష్క స్థనములు గల భార్య కలుగును. 

25.రవికి సప్తమాధిపత్యము కలిగి, కేంద్రములందు లేకయున్నను, సప్తమ స్థానంలో శని-రాహు-కేతువులన్నను- వ్రేలాడు స్థనములుగల భార్య ప్రాప్తించగలదు. 

26.సప్తమంలో బుధ-చంద్ర-గురువులున్న- భార్య కుచములు కురుచలై యుండును. 

27.సప్తమ భావాధిపతి కుజునితో గలసియున్న- కుడి స్థనము కన్న ఎడమ స్థనము పెద్దదిగానున్న భార్యయు; బుధునితో గలసిన- రెండు ప్రక్కల సమానస్థనములు గలదియు భార్యగా ప్రాప్తించగలదు. 

28.కళత్ర భావాధిపతి గురు-చంద్రులతో గలసియున్న- ఎడమ ప్రక్క కంటెను, కుడిపక్క స్థనము పెద్దదిగా గల భార్య ప్రాప్తించగలదు. 

29.7వ అధిపతితో రవి కలిసియున్న-శుష్కస్థనములు గల భార్యా కలుగును. 

30.సప్తమ భావాధిపతి కేతువుతో గలసిన- చిన్నవగు స్థనములు గల భార్య ప్రాప్తించును. 

31.కళత్రాధిపతి రాహువుతో గలసిన- వెడల్పగు స్థనములున్న భార్య కలుగును. 

32.సప్తమాధిపతి పాప గ్రహముగా నుండినన్ను లేక జలతత్వ గ్రహమైనను లేక జలరాశులయందున్నను; అట్టి స్థితియందు గురుదృష్టి కలిగిన- బలిసిన స్థనములు గల భార్య ప్రాప్తించగలదు. 

33.గురువుగాని, శుక్రుడుగాని సప్తమాధిపతులైనను- భార్య యొక్క భగము సమము గలదిగాను; చంద్ర-శని-బుధులైన హస్వభగముగాను నుండగలదు. 

34.రాశిచక్రమందు సప్తమ స్థానంలో గల రాహువు లేక కేతువు అంశయందు కవార గ్రహంశల యందున్న- అట్టి జాతకుని భార్య భర్తకు విషము పెట్టగలదు. కేవలము పాప సంబంధాదులు కలిగిన రాహు-కేతువులు రాశి చక్రమందు సప్తమమందున్న- కఠినాత్మురాలు, పాపకర్మలు చేయునధై లోకాపవాదము నందుగలదు. 

35.సప్తమ స్థానమునకు, సప్తమాధిపతికి- శుభగ్రహాల కలయిక, దృష్టి యుండుట; సప్తమాధిపతియున్న నవాంశాధిపతి శుభుడై యుండుట వలన- భార్య సద్గుణములు గలదిగా నుండును. 

36.పై విధముగానే సప్తమ స్థాన-భావాధిపతులకు-పాప గ్రహ కలయిక దృష్టి వలనను; సప్తమాధిపతియున్న నవాంశాధిపతి పాపగ్రహ మగుట వలనను- దుర్గుణములు గల భార్యను పొందగలరు. 

37.సప్తమ భావంలో 6-8-12 అధిపతులండి, పాపగ్రహ వీక్షితులైన- భార్య స్వేచ్చా విహారిణియై వ్యభిచరించగలదు. 

38.సప్తమాధిపత్యం గల శుక్రుడు కుజాంశల యందునను; లేక కళత్ర స్థానాధిపత్యం గల కుజుడు నవాంశ చక్రమందు శుక్రునితో గలసి పాపగ్రహ విక్షితుడైయున్నను; కుజ-శుక్రులు ఒకరి అంశయందు మరొకరు పరివర్తన పొందియున్నను- భార్య వ్యభిచారిణి కాగలదు. 

39.సప్తమాధిపతి శుక్రుడై, లగ్నాధిపతితో గలసి మకర రాశి యందుండి; లగ్న-చతుర్ద-సప్తమము లందు శుభగ్రహ దృష్టి లేని పాప గ్రహము లుండి; చంద్రుడు నీచ-నీచాంశల యందున్న యెడల- అట్టివాని భార్య విచ్చలవిడిగాను, బహిరంగముగాను వ్యభిచరించగలదు. 

40.చంద్రుడు, శనితోగాని, కుజునితోగాని కలసి యుండగా; శని-కుజులు ఒకరినొకరు చూచుకొనుచున్న (పరస్పర దృష్టి) జాతకుడు వ్యభిచారి యగుటయే గాక; అతని భార్య కూడా వ్యభిచారిణి కాగలదు. 

41.లగ్నమందు కుజుడు, సప్తమమునందు శనియుండి; సప్తమాధిపతి శుక్రుడు కుజ నవాంశల యందున్న యెడల- ఆ జాతకుని భార్య వ్యభిచారిణి కాగలదు. 

వ్యభిచార యోగములు 

01.సప్తమ స్థానములో శుక్రుడు సంపూర్ణ బలం కల్గియుండిన- బహుస్త్రీలతో సంబంధము లుండగలవు. 

02.శుక్రుడు నైసర్గిక పాపగ్రహములతోనూ, 2-6-7 స్థానాధిపతులతోనూ, కలసి జన్మలగ్నము నందున్న- వ్యభిచారి కాగలడు.

03.నైసర్గిక పాప గ్రహము 2-6-1 స్థానాధిపతులతో కలిసి, సప్తమ స్థానమందున్న యెడల వ్యభిచారి కాగలడు. 

04.శుక్రునకు కుజ-శనుల ఇరువురి దృష్టి కలిగి యున్న- వ్యభిచరించగలడు. 

05.సప్తమ స్థానమునకు శుభగ్రహ ద్రోగ్యోగాది సంబంధములు కలుగక ఆ స్థానంలో శుక్రుడుండి, సప్తమాధిపతి రాహువుతో కలసిన- వేబిచార యోగము కలుగును. 

06.కుజుడు-శుక్రుడు కలిసి 7 లేక 10 స్థానములందున్న- వ్యభిచారి. 

07.జన్మలగ్నమునుండి 10వ స్థానంలో శని, చంద్ర లగ్నము నుండి 10వ స్థానంలో శుక్రుడు ఉన్న యెడల వ్యభిచారి కాగలడు. 

08.వృషభ-తులలు 7 లేక 10వ స్థానంలో నుండి, అందు శని-బుధ-శుక్రలు కలసియున్న- వ్యభిచారి కాగలడు. 

09.అంశ చక్రంలో 12వ స్థానమందు కుజ-శుక్రులున్న- వ్యభిచారికాగలడు. 

10.అంశ చక్రము నందు 9వ స్థానంలో కేతువున్న (రాశి చక్రంలో 9వ స్థానం ఏ రాశి యగునో అంశచక్రంలో ఆ రాశి యందు కేతువుండుట యని కొందరి అభిప్రాయము)- జీవితాంతము పరస్త్రీ రతుడు కాగలడు. 

11.చంద్ర-కుజ-శనులు కలసి సప్తమమందున్న- వ్యభిచారికాగలడు. 

12.సప్తమ స్థానంలో కుజ-రాహువులు కలసియున్న- అన్యకుల స్త్రీలతో వ్యభిచరించగలడు. 

13. పాప గ్రహములతో గలచిన క్షీణచంద్రుడు సప్తమందున్న- పరస్త్రీ రతుడు కాగలడు. 

14.రవి-కుజ-చతుర్ధాధిపతి కలసి, 6-7 స్థానములలో నెందైనను నుండి; శని వీక్షితుడైన- రజస్వలయైన వితంతువును సంఘమించగలడు. 

15.సప్తమ స్థానాధిపతి బలహీనుడై లేక కుజ నవాంశల యందుండగా, సప్తమ స్థానంలో క్షీణ చంద్రుడున్న- దాసీ స్త్రీ సంగమము, బలహీనుడైన బుధుడు ఉన్న వేశ్య స్త్రీ సంగమము, రాహువు ఉన్న గర్భిణీ స్త్రీ సంగమము, శని రాహువులున్న- హీన జాతి స్త్రీ సంగమము, శుక్ర-రాహువులున్న- రజక స్త్రీ సంగమము, బుద-రాహువులున్న- పడుపు వృత్తి గల స్త్రీ సంగమము, గురు-శుక్ర-రాహువులు ఉన్న- ఉత్తమ కుల వితంతు సంగమము; కుజ-శనులున్న- నికృష్ట జాతి స్త్రీ సంగమము కలుగును. 

16. లగ్నాధిపతి, అష్టమాధిపతి కలిసి మేష-వృషభ-తుల-వృశ్చిక రాశులయందున్న- తన బంధు వర్గమునందు రహస్యముగా వ్యభిచరించువాడు కాగలడు. 

బహు బార్య యోగములు

01. సప్తమ స్థానము పాపగ్రహ రాశియై  యుండి, సప్తమాధిపతి నీచ నంది, 7వ స్థానంలో పాప గ్రహములున్న- ద్వికళత్రయోగము(ఇద్దరు భార్యలు) వుండును. 

02. సప్తమాధిపతి కేంద్రకోణముల యందుండి, ఆ స్థానము అతనికి ఉచ్చ-మిత్ర క్షేత్రమై దశమాధిపతి వీక్షణ కలిగియున్న- అనేక భార్యలు కలుగును. 

03. సప్తమాధిపతి-పంచమాధిపతి బలవంతులై శుభగ్రహములతో గలసి యుండి, వారిలో నొకరికి షష్ఠాధిపతి వీక్షణ కలిగిన- బహు భార్య యోగము కలుగును. 

04. ద్వితీయాధిపతి 6వ స్థానంలో, సప్తమాధిపతి 8వ స్థానంలో, శుక్రుడు 12వ స్థానంలో (ఈ ముగ్గురు కలిసి 6-8-12 లలో ఏదో ఒక స్థానంలో యుండి) నుండి; ఎన్ని పాపగ్రహ వీక్షణలు కలిగియుందురో- అన్ని కళత్రములు నష్టపడగలవు. 

05. శని 2వ స్థానంలో, రాహువు 7వ స్థానంలో నున్న- ద్వికళత్ర యోగముండును. 

06. శుక్రునకు పాప గ్రహ సంబంధము వలన- ద్వికళత్ర ప్రాప్తి. 

07.  ద్వితీయ-అష్టమ స్థానములకు అనేక గ్రహ సంబంధము కలిగిన కళత్ర భంగము కాగలదు.  గురు సంబంధము వలన- ద్వితీయ వివాహముండును. 

08. అష్టమ స్థానంలో గల పాప గ్రహములను గురుడు చూసుకున్న- ద్వికళత్ర యోగముండును. 

09. సప్తమ స్థానంలో 1-8-12 అధిపతులు కలసియున్న- ద్వికళత్ర యోగముండును. 

10. మిధున-కన్యలు 8వ స్థానమై, శని వీక్షణ నందియున్న- ద్వికళత్రము కలుగును. 

11. సప్తమాధిపతి 8 వ స్థానంలో శుభ బలాధికుడైయున్న- మేనమామల తాలూకు కన్యక భార్య యగును.  వ్యాధితో నుండగలరు. 

12.  లగ్నాధిపతి 12, రవి 7, కుజుడు 8 స్థానములందున్న- రెండవ వివాహము జరుగును. 

13.  ద్వి స్వభావ రాశులలో శుక్రుడుండి, కుజ-రాహువులు ధృగ్యోగములు కలిగిన- మొదటి భార్య నశించి, రెండవ వివాహము కాగలదు. 

14. సప్తమ స్థానంలో రవి-బుధ-కుజులు పాపగ్రహములతో గలసి యున్న- మొదటి భార్య సంతానము కలిగి, నశించగలదు. తదుపరి రెండవ వివాహము జరుగగలదు. 

15. శుక్రునికి గురు దృష్టి కలిగిన-ద్వికళత్ర యోగముండును. 

16. సప్తమ స్థానంలో శని-రాహువులున్న ద్వికళత్ర యోగముండును.

17. జాతకము నందు కుజ దోషముండి, ద్వితీయంలో గురువు వున్నను లేక శనియున్నను- ద్వి కళత్ర యోగము కలుగును. 

బార్యా వియోగ-అనారోగ్యములు 

01. సప్తమ స్థానంలో 5 లేక 8 స్థానాధిపతిలున్న- భార్యావియోగం కలుగును. 

02. సప్తమాధిపతి 5వ స్థానమందున్న- భార్యావియోగ ముండగలదు. 

03.  పంచమస్తానములో బలహీనుడైన చంద్రుడుండి 1-7-12 స్థానాలలో పాప గ్రహములున్న- భార్యా-సంతాన వియోగము లుండగలవు. 

04. శుక్రునకు పాపార్గళము కలిగి పాప గ్రహ సంబంధం లుండిన- భార్యా వియోగము కలుగును. 

05. పాప గ్రహముల యొక్క సంబంధములు గల శుక్రుడు 4-8-12 స్థానముల యందున్న యెడల- భార్యా వియోగము కలుగును. 

06. సప్తమ స్థానము వృశ్చిక రాశియై, అందు శుక్రుడున- భార్య వియోగం కలుగును. 

07. వృషభ రాశి సప్తమ స్థానమై, అందు బుదుడున్న- భార్యాభయోగము. 

08. మకరం సప్తమ స్థానమై అందు గురువున్న- భార్యావియోగము. 

09 మీనరాశి సప్తమ స్థానమై; అందు శని గానీ, కుజుడు గానీ యుండిన- భార్యాభియోగము కలుగును. 

10. శుక్రుడు పాపగ్రహములతో గలసి 7-5-9 స్థలముల యందున్న- అంగవైకల్యం గల భార్య ప్రాప్తించి, వియోగ మేర్పడగలదు. 

11. శుక్రునికి సప్తమంలో కుజుడు, చంద్రుడికి సప్తమంలో శనియున్న- భార్యా వియోగము లేక సంతాన హీనత కలుగును. 

12. సప్తమ-ద్వితీయాధిపతులు బలహీనులై, పాపగ్రహ సంబంధములు కలిగియున్న- భార్యను వదిలి వేయగలరు. 

13. సప్తమ స్థాన-సప్తమాధిపతులకు శనీ-రాహు సంబంధమున్న భార్యను విడిచివెయును. 

14. సప్తమ శని, లగ్న రవి వలన- కళత్రము నష్టమగును. 

15. కన్య జన్మ లగ్నమై, అందు రవి యుండి; మీనంలో శనియున్న- భార్య నశించును. 

16.శుక్ర, షష్ఠాధిపతులు కలిసియున్న- భార్యకు ఆపదలు ప్రాప్తించగలవు. 

17. కుజుడు సప్తమ భావమందున్న- 22 లేక 42వ సంవత్సరంలో భార్య నశించును.

18. చంద్ర-శుక్రులు నీచ స్థితి యందున్న- భార్యకు జలగండము. 

19. సప్తమాధిపతి పాశ భుజంగ ద్రేక్కాణముల యందున్న- భార్య ఊరి వలన మృతి నందగలదు. 

20. శుక్రుడు పాప బలాధిక్యత నంది, సప్తమాధిపతి పాపులతో గలసియుండి, సప్తమ భావమందు 4వ స్థానాధిపతియున్న- గర్భవతియై, భార్య మరణించగలదు. 

21. కుజుడు 2-4-7-8-12 స్థానములందున్న- భార్యకు హాని కలుగును. 

22. పై విధముగా కుజుడుండి, 2వ స్థానంలో గురువున్న లేక ద్వితీయాధిపత్యము గురువునికి కలిగినను- కళత్రము నష్టమగును. 

23. సప్తమాధిపతి 3-8 స్థానములందున్న- భార్యకు అనారోగ్యము. 

24. శుక్రుడున రాశి నుండి 4-8 రాశులలో రవి, కుజ, శనులున్న- భార్య అగ్ని వలన మృతి నందగలదు. 

25. శుక్రుని కిరువైపులా పాప గ్రహములున్న- భార్య ఎత్తు నుండి జారి పడగలదు. 

26. సప్తమాధిపతికి సప్తమంలో రాహువున్న-  కళత్ర నష్టం కలుగును. 

27. పంచమ స్థానమునకు శుభగ్రహ వీక్షణాది సంబంధములు కలుగక, 11వ స్థానంలో రాహువు యొక్కడే యున్న- రాహు దశలో భార్య మరణించగలదు. 

28. సప్తమాధిపతి-రాహువు గలసి, 10వ స్థానమందున్న- విషము వలన భార్య నాశనం కాగలదు. 

29. శుక్రుడు మకర-కుంభంము లందుండి- సప్తమాధిపతి నీచస్థితి నందిన, పాప గ్రహముల యొక్క దశాంతర్ధశలు భార్యను నశింపచేయును. 

30. సప్తమ స్థానంలో కుజుడు, 2వ స్థానములో రాహువు, 6-8-12 స్థానాలలో ఒకచోట శుక్రుడు యుండిన- వివాహమైన సంవత్సరం లోపల కళత్ర నష్టము కలుగును. 

31. సప్తమాధిపతి అష్టమ స్థానమందుండి, 12వ స్థానాధిపతి సప్తమందున్న- 19 లేక 39 వ సంవత్సరంలో భార్యను భార్యకు మృతి కలుగును. 

32. లగ్నాధిపతికి నీచస్థితి కలిగి, సప్తమాధిపతి 8వ స్థానమందున్న- 40 వ సంవత్సరమునందు భార్య మరణించగలదు. 

33. ఇతర గ్రహములతో కలయక శుక్రుడోక్కడే కర్కాట రాశి యందున్న-  కళత్రమును నష్టపరుచును. 

34. జన్మ లగ్న-చంద్ర లగ్నముల నుండి 2వ స్థానంలో నున్న కుజుడు- సంతాన నష్టములను; 7వ స్థానంలో గల కుజుడు- భార్య హానినీ, 8వ స్థాన కుజుడు- స్త్రీల సౌభాగ్య (భర్తను) నష్టమును; 12వ స్థాన కుజుడు- సంపద నష్టము, దరిద్రములను కలిగించగలడు. 

35. కుజుడు జన్మ-చంద్ర లగ్నములు రెండింటి ద్వారా దోషప్రధుడైయుండిన- వివాహాటంకము లుండగలవు. 

36.  కుజుని కి ద్వితీయ-సప్తమ భావస్థితి- పురుషుల కధిక దోష ప్రధము. 

37.  4-12 కుజ స్థానస్థితి స్త్రీల కధిక దోషము కలిగించును. 

38. అష్టమ స్థాన, లగ్న స్థాన కుజదోషము- స్త్రీ పురుషులను పీడించగలదు. 

39.  శుక్రుడున్న రాశి నుండి కూడా 1-2-4-7-8-12 రాశులలో కుజుదుండుట- వైవాహిక జీవితమునకు మంచిది కాదు. 

సప్తమ భావ యోగములు 

01. నైసర్గిక శుభగ్రహమును దృష్టి 5-7 స్థానములకు కలిగిన- భార్యా సంతానముల ద్వారా అభివృద్ధి నందగలరు. 

02.  సప్తమ భావమునకు రవి గ్రహ సంబంధము కలిగిన- భార్య అదృష్టవతియై, బాగా కలిసి రాగలదు. 

03. సప్తమ స్థానమునకు శుక్ర సంబంధమున్న- భార్య వలన సుఖపడగలరు. 

04. 7 వ స్థానమునకు గురు సంబంధమున్న- వివాహానంతరం యోగ ప్రాప్తి కలుగును. 

05. జన్మ లగ్నమునందు బుధ, కేతువుల కలయిక వల్ల- భార్యకు రోగము కలుగును. 

06. సప్తమాధిపతికి గానీ, సప్తమ భావములకుగానీ- కుజ లేక శని సంబంధమున్న- భార్యతో కలహము లుండగలవు. 

07. సప్తమమందు పాప గ్రహములున్న- భార్యకు గర్భస్రావము కాగలదు. 

08. సప్తమాధిపతి యొక్క స్పుట రాశికి 5-9 స్థానములలో- గోచార గురువు ప్రవేశించు కాలము- భార్య మరణమును సూచించగలదు. 

09. సప్తమ, షష్ఠ స్థానాధిపతులు, 6 వ స్థానంలో కలసియున్న- శత్రువివాదములు, చోర బాధలు ప్రాప్తించగలవు. 

10.  సప్తమ భావము ద్వారా- జాతకుని మొదటి భార్య విషయములు తెలియను. 

11. అష్టమ భావం ద్వారా- రెండవ భార్య విషయంలు గ్రహించవలెను. 

12. తృతీయ భావము ద్వారా- మూడవ భార్య విషయములు తెలియవలెను. 

13. సప్తమ భావము తులాంశ యందున్న- వ్యాపార వృత్తి ప్రాప్తించగలదు. 

14.సప్తమ భావములో- కుజ, బుదులు కలసియున్న- వ్యాపారము చేయగలరు. 

15. లగ్న, సప్తమాధిపతులు లగ్నమందుండి; సప్తమాధిపతి దశ ప్రాప్తించిన- గొప్ప సుఖ-శాంతులు లేర్పడగలవు. 

16. శుభ గ్రహ సంబంధము గల సప్తమాధిపతి దశయందు- నౌకా సంబంధిత వృత్తు లేర్పడగలవు.

17. పాప గ్రహ సంబంధం గల సప్తమాధిపతి దశయందు- ఉన్నంతయు పోయి, దేశాటన మొనర్చును. 

18. సప్తమ స్థానంలో రాహు వుండి, పాప గ్రహ వీక్షితుడైన- దేశభ్రమణము కలుగును. 

19. సప్తమాధిపతి 9వ స్థానము నందుండి, 1-2 అధిపతులచే చూడబడుచున్న- కాంట్రాక్ట్ ల వలన విరివిగా ధన-భాగ్యములు ప్రాప్తించగలవు. 

20. సప్తమాధిపతి- శుక్రుడూ మిత్ర క్షేత్రములందుగానీ, ఉచ్చరాశుల యందు గాని యుండి; శుభగ్రహ సంబంధీకులైన- విశేష భాగ్య-సంపదలతో సుఖ ప్రాప్తి నందగలరు. 

జ్యోతిషశాస్త్రము


Monday, December 2, 2024

షష్ఠ భావమందున్న గ్రహ ఫలితాలు

షష్ఠ భావమందున్న గ్రహ ఫలితాలు

01.జన్మలగ్నం నుండి ఆరవరాశిని షష్ఠ భావముగా గ్రహించవలెను.  దీనికి రుణ రోగ స్థానము, కలహస్థానము, ప్రమాద స్థానమనియుపేర్లు కలవు. 

02. షష్టభావమునకు ప్రధాన కారక గ్రహము కుజుడు. 

03. షష్ఠ భావము ద్వారా జాతకుని యొక్క శత్రువులు, ఋణములు, రోగములు మోస క్రోధ వైరములు, పేరాశ, కుట్రలు, భయము, ఆశాభంగము, ఆత్మస్తుతి, జనద్వేషము, మతిభ్రష్టత, ప్రమాదములు, అవమానములు, జ్ఞాతులు, దుర్మరణం, దాస్యము, జూదము, భిక్షాటన, శిక్షలు, చెరసాలప్రాప్తి, యుద్ధము, అంగవైకల్యము, శత్రచికిత్స, వైద్యము, భూత ప్రయోగబాధలు, నిద్ర, ఆకలి, దరిద్రము, దొంగలు, ఔదార్యము, మేనమామల విషయములు, కఫాశ్లేష్మములు, శూల, అతిసారము, క్షయ, మేహా వ్రణాలు, మశూచి, మూత్రవ్యాధులు, సుఖవ్యాధులు, గర్వము, నిందా దూషణ, దుర్భాషలు, నాభి, గుదము, లింగ-రుషణములు, మద్యపానాది వ్యసనములు అను ఫలితములను గురించి తెలియదగియున్నది. 

04. షష్టభావము- పాపస్థానము! దీని ఆధిపత్యముగల గ్రహము మిక్కిలి పాపికాగలడు.  షష్ఠాధిపతి ఏ భావమునందునను ఏ భావాధిపతితో కలిసినను- ఆ భావ ఫలితములను పాడుచేయను.  నైసర్గిక పాప గ్రహములు షష్ఠ భావము నందుట మంచిది. . షష్ఠాధిపతి ఏ ఇతర గ్రహములతో కలియక 2-7-11 స్థానముల యందుండుట మంచిది. 

05. షష్ఠ భావము నందు రవియున్న- సౌఖ్యము, తేజస్సు, కులముఖ్యత్వము, శత్రు-రోగా- ఋణరాహిత్యము, బలము, వాహనము, బుద్ధియు కలుగ గలవు. 

06. చంద్రుడు షష్ఠమందున్న- క్రూరత్వము, దయాహీనత, క్రోధము, రోగ శరీరము, చాందసము, అజీర్తి వ్యాధి కలుగును.  పూర్ణచంద్రుడైన- కొంత శుభముండును. 

07. షష్ఠమందు కుజుడుండిన- అధిక కోపము, శత్రు నాశనము, స్నేహశీలత్వము, సజ్జన సహవాసము, కామాతురత, రోగ-రుణ-పీడా నాశనములు కలుగును. ఈ కుజునికి షష్ట స్థానము నీచ, శత్రు, క్షేత్రములైవున్న పోట్లాటలు ఉండగలవు. 

08. బుధుడు షష్ఠ భావమందున్న- రోగ శరీరము, కఠిన హృదయము, కలహ ప్రియత్వము, జాతివృద్ధి, శత్రుబాధలు, వ్యాకులత కలుగును. 

09. గురుడు షష్ఠమందున్న- రోగరాహిత్యము, కీర్తికాంక్ష లుండగలవు. గురునికి స్వమిత్ర క్షేత్రములగుట వలన- శత్రునాశనము; శత్రు క్షేత్రము, శత్రు గ్రహసంబంధములున్న- శత్రు బాధలు ప్రాప్తించగలవు. 

10. షష్టమందు శుక్రుడున్న- అధిక ధనవ్యయము, శత్రువృద్ధి, భయము, శత్రువులకు వశపడియుండుట, స్వల్ప సుఖము ప్రాప్తించును. 

11. శని షష్ఠ భావమందున్న- శత్రు-రోగ-ఋణములు లేకుండుట, దీర్ఘాయువు, నీచుల వలన భయము, పుత్ర-ధనసంపదలు, వాత రోగ బాధలు ఉండగలవు. 

12. రాహువు షష్ఠమందున్న- మూలవ్యాధి, శత్రువులు, ధన-భోగములు, యోగ్య కళత్రములు ప్రార్థించగలవు. 

13. కేతువు షష్ఠమందున్న-ధైర్యము, చొరబుద్ధి, కుట్టిలత్వము, శత్రు-రోగ-ఋణ బాధలు, చంచల స్వభావము, అవమానములు, ధైర్యము, పశుసంపదలు కలుగును. 

14. మేషము షష్టభావముగానుండిన- మెదడుకు సంబంధించిన అనారోగ్యములు, శిరో-నేత్రవ్యాధులు కలుగును. 

15. వృషభము షష్టమైన-కంఠవ్యాధులు; మలకోశ, మూత్ర కోశ వ్యాధులు కలుగును. 

16. మిధునము షష్ఠమైన- ఊపిరితిత్తులు, రక్తము, శ్వాసకోశ, నాడీ మండలములకు సంబంధించిన వ్యాధులు కలుగును. 

17. కర్కాటకము ఆరవ స్థానముగానున్న- జీర్ణకోశ, ఉదర సంబంధిత వ్యాధులు కలుగును. 

18. సింహము షష్ఠమైన- హృదయ, కంఠ, మలకోశ సంబంధమగు వ్యాధులు మరియు దురలవాట్లవల్ల కలుగు ఆయా జబ్బులు నుండగలవు. 

19. కన్య షష్టమైన- అజీర్తి, జిగట విరోచనములు, మలబద్ధకములు కలుగును. 

20. తుల షష్ఠమైన- మధుమేహము, మూత్రపిండ సంబంధిత వ్యాధులు కలుగును. 

21. వృశ్చికము ఆరవ స్థానమైన- వాపులు, ఉబ్బులు, రహస్యాంగ వ్యాధులు కలుగును. 

22. ధనస్సు ఆరవ స్థానమైన- రక్త దుర్బలత, లివర్, నడుముల బలహీనత, క్షయ వంటి వ్యాధులు సంభవించగలవు. 

23. మకరం షష్ఠ స్థానమైన- చర్మము, కీళ్లు, రక్తములకు సంబంధించిన వ్యాధులు; మరియు జలుబు సంబంధిత ఇతర శీతల వ్యాధులు కలుగును. 

24. కుంభం ఆరవ స్థానమైన- రక్తము, నరములు, నేత్రములకు సంబంధించిన వ్యాధులు; మానసిక సంబంధ వ్యాధుల వలన బాధలు కలుగును. 

25. మీనము షష్ఠ భాగముగానుండిన- వ్రణములు, కంతులు, రక్తములోని మలినముల వలన- నరముల వణుకు, క్షయ వంటి వ్యాధులు ఉండగలవు. 

వివిధ రోగ యోగములు

01. లగ్న, ద్వితీయాధిపతులు 6-8-12 స్థానములందుండి; లగ్నమందు కుజుడు పాప గ్రహ సంబంధం కలిగియున్న- నేత్ర రోగములు కలుగును. 

02. శుభగ్రహ దృష్టి లేని శని- శత్రువు-నీచ-అస్తంగా తాది దోష యుక్తుడై: ద్వితీయాధిపతి లగ్నాధిపతులతో గలసియుండి, శుక్రుడు బలహీనుడై యుండిన- పుట్టుకతో గుడ్డివాడగును. 

03. లగ్న, అష్టమాధిపతులిద్దరూ- 8వ స్థానము నందున్న- ఎడమ కన్నుకు హాని కలుగును. 

04. శుక్రుడు 6-8 స్థానములందున్న- కుడికంటికి హాని కలుగును. 

05. వ్యయస్థానంలో రవి-చంద్రులు కలిసివున్న- రెండునేత్రములకు హాని కలుగును. 

06. షష్టభావంలో- చంద్రుడు, 8వ స్థానంలో-రవి 12లో-శని 2-కుజుడుయున్న- గుడ్డివాడవును. 

07. షష్ఠాధిపతి-బుధుడు కలసి; జన్మలగ్నమందున్న- మూగతనము. 

08. ద్వితీయాధిపతి-గురువు కలసి; 6-8-12 స్థానములందునను- మూగతనము వచ్చును. 

09. షష్ఠాధిపతి-గురువు కలసి 6-8-12 స్థానములను స్థానముననున్న-మూగతనము. 

10. వృషభమందు-చంద్రుడుండి; మకర, కుంభ, మినముల యొక్క నవాంశలయందు పాప గ్రహములున్న మూగతనము ప్రార్థించగలదు. 

11. షష్ఠాధిపతికి-శత్రు క్షేత్ర స్థితి కలిగినను, లేక చంద్ర లగ్నమునకు 12వ స్థానంలో బుధుడున్నను  చెవిటి- వారగుదురు. 

12. తృతీయ, షష్ఠా, లాభాధిపతులు మువ్వురూ 1-5-9 స్థానములందున్న- చెవుడు కలుగును. 

13. నవాంశ లగ్నమందు-కేతువుండి, పాప విక్షణంనందిన- చెవి తెగిపోగలదు. 

14. ద్వితీయాధిపతి, రాహువు కలసి; షష్ఠమందున్న- దంత రోగములు కలుగును.

15. 6-8-12 స్థానములలో- ద్వితీయాధిపతి పాపగ్రహములతో గలసియున్న- నోటి యందు దుర్గంధము కలుగును. 

16. లగ్నాధిపతి, కుజుడు కలసి; మిధున, కన్యలందున్న- ముఖరోగం ఉండును. 

17. లగ్నాధిపతి, బుధుడు కలసి; మేష, వృశ్చికము నందున్న-ముఖరోగం ఉండును.

18. కుజుడు-లగ్నమందు, శుక్రుడు-షష్ఠమందునుండిన- ముక్కు తెగిపోగలదు. 

19. శనికి-లగ్నస్థితి, రాహువుకు-సప్తమస్థితి, శుక్రునకు-దశమస్థితి కలిగియుండి క్షీణ చంద్రుడు, రాహువుతో గలసిన- కాళ్లు-చేతులు తెగిపోగలవు. 

20. నైసర్గిక పాప గ్రహములన్నియు 4 కేంద్ర స్థానము నందున్న వికలాంగుడు కాగలడు.  (1-4-7-10 కేంద్ర స్థానములు)

21. దశమ స్థానంలో-బుధ, శని, రాహులు కలిసియున్న చేతులకు హాని కలుగును. 

22. వ్యయాధిపతి-బలరహితుడై, పాప గ్రహంశ, లేక నీచాంశం యందున్న- అంగవైకల్యం ముండగలదు. 

23. వ్యయాధిపతి-పాపులతో కలిసినను, 12వ స్థానంలో- పాప గ్రహములున్నను- అవయవ లోపం ఉండగలదు. 

24. రవి యున్న రాశికి 2వ  రాశిలో- శనియు,  10వ  రాశిలో చంద్రుడు, ఏడవ రాశిలో కుజుడు స్థితి నంది యున్న- అంగవైకల్య యోగము. 

25. లగ్నాధిగా ద్వితీయంలో-రవి, సప్తమంలో- కుజుడు, దశమంలో చంద్రుడు యున్న- అంగవైకల్య యోగము. 

26. షష్ఠ భావము నందు- రవి, కుజ శనులు కలిసి యున్న- కుంటివాడగును. 

27. నైసర్గిక పాప గ్రహములన్నియు షష్ఠ భావమందున్న- కుంటితనము కలుగును. 

28. షష్ఠాధిపతి- పాప గ్రాములతో గలసి 1-8 స్థానములందున్న- బాల్యమందే వ్రణ బాధలు ఉండగలవు.

29. షష్ఠాధిపతికి- పాప గ్రహా లేక అష్టమాధిపతులు కలయిక వలన- వ్రణ బాధలు కలుగును. 

30. షష్ఠాధిపతి- చంద్రుడు కలసి; 1-8 స్థానములందున్న- నోటి యందు వ్రణ బాధలుండును. 

31.షష్ఠాధిపతి- 8-1 స్థానములందుండి; కుజుని గలసిన- కంటము నందు, శుక్రుని కలసిన- నేత్రములందు, గురుని కలసిన-నాభియందు, బుధునికలసిన-ఉదరమునందు(పొట్ట), రాహువు-కేతువులను గలసిన- దేహమునందు, పెదవియందు- వ్రణబాధలు ప్రాప్తించగలవు. 

32. షష్ఠమందు- బుధుడు, 11వ స్థానము లో-చంద్రుడు, 12వ స్థానంలో-గురువుయున్న- గుదమందు వ్రణబాధలు లుండగలవు.

33. 9వ స్థానమునందు- షష్ఠాధిపతియున్న, ఆ స్థానమునకు షష్ఠాధిపతి దృష్టి కలిగిన- గృహ్యరోగ పీడితులు కాగలరు. 

34. 12-6 స్థానములలో-పరివర్తన చెందిన లేక 3 వ లేఖ 19వ సంవత్సరంలో గుల్మ  రోగ పీడ కలుగును. 

35. మేష, వృశ్చికములందు గలసియున్న- చంద్ర, కుజలకు- శని దృష్టి కలిగిన- అండ రోగా పీడ ఉండును. 

36. 8వ స్థానంలో- కుజ, శుక్రులు లేక కుజ, శని, రాహువులు కలిసియున్న అండ రోగము కలుగును. 

37. షష్ఠ, అష్టమాధిపతులు- శని, కుజులుగా నుండి; వారిరువురు పరస్పర దృష్టి నందిన- అండ రోగము కలుగును. 

38. షష్ఠాధిపతి, లగ్నాధిపతి కలసి; మేష, వృశ్చికముల యందున్న- మూల వ్యాధి కలుగును. 

39. లగ్నాధిపతి, కుజుడు, బుధుడు కలసి- మిధున, కన్య యందున్న- మూల వ్యాధి కలుగును. 

40. 6-8-12 స్థానాలలో- రాహువుతోగాని, కేతువుతోగాని కలసి లగ్నాధిపతి యుండిన- మూల వ్యాధి మరణాంతకము కాగలదు. 

41. శని, ఇతర పాప గ్రహ సంబంధములు గల- లగ్నాధిపతి 8వ స్థానము నందున్న- 59వ సంవత్సరంలో వాతరోగము కలుగును. 

42. శని యొక్క షడ్వర్గులు కలిగిన షష్ఠాధిపతి- లగ్నాధిపతితో గలసియున్న ఆ షష్ఠాధిపతి దశా కాలమునందు సన్నిపాత వ్యాధి కలుగును. 

43. లగ్న, షష్ఠాధిపతులకు శని యొక్క సంబంధముచే వాతవ్యాధి కలుగును. 

44. షష్ఠాధిపతి-కుజునిచే చూడబడుచూ; 8వ స్థానమునందున్న స్పోటకము కలుగును. 

45. లగ్న, షష్ఠాధిపతులు కుజునుతో కలిసియున్న స్పోటక ప్రాప్తి. 

46. లగ్న, షష్ఠాధిపతులకు మాంది-రాహు-కేతువుల సంబంధం కలిగిన చంద్ర భుక్తి యందు- సర్ప బాద, జ్వరము, మశూచి కలుగును. 

47. కుజుడు-12వ స్థానంలోనూ, శని-8వ స్థానంలోనూ నుండిన- 15వ లేక 30 వ సంవత్సరంలో స్పోటకము కలుగును. 

48. షష్ఠభావమందు- శనియున్నను- లేక భావమును చూచినను- గర్భ శూల కలుగును. 

49. షష్ఠభావంలో-గురువు; పంచమంలో-చంద్రుడు ఉన్న 19వ లేక 22వ సంవత్సరంలో కుక్షీ రోగము ప్రాప్తించగలదు. 

50. సప్తమ లేక అష్టమ స్థానములలో- శని, గురువులు కలిసి ఉన్న- రక్త కోశ రోగము, రవి కూడా కలిసి ఉన్న- క్షయ వ్యాధి ప్రాప్తించగలదు. 

51. క్రోరాంశ యందున్న బుధుడు-కుజుడుతో గలసి, షష్ఠ భావమందుండి; శుక్ర, చంద్రులచే చూడబడుచుండిన- క్షయ వ్యాధి పీడితులు కాగలరు. 

52. రవి,చంద్రులకు- ఒకరి రాశుల యందు మరోకరికి మరొకరికి పరివర్తన కలిగిన క్షయ వ్యాధి జనించగలదు. 

53. దశమ స్థానంలో- శని, కుజ, చంద్రులుండి; బుధుడు-మేషరాశి యందున్న కుష్టు వ్యాధి కలుగును. 

54. పాప గ్రహవీక్షణ గల-చంద్ర, శుక్రులు జలరాశుల యందున్న- కుష్టు వ్యాధి జనించును. 

55. కారకాంశ- లగ్నమునందుండి; 4వ స్థానంలో- కుజ వీక్షితుడైన చంద్రుడుండిన మహా కుష్టు వ్యాధి ప్రాప్తించగలదు. 

56. షష్ఠమందు చంద్రుడూ, లగ్నమందు రాహువు యున్న- అపస్మార వ్యాధి కలుగును. 

57. అష్టమ స్థానంలో- చంద్ర, రాహువులు కలసియున్న అపస్మార వ్యాధి కలుగును. 

58. చంద్ర, శుక్రులు కేంద్రములందుండి; అష్టమంలో పాప గ్రహములు ఉన్న అపస్మార వ్యాధి ఉండగలదు. 

59. చంద్ర,శనులు కలసి; కుజ దృష్టి పొందియున్న అపస్మార స్థితి కలుగును. 

60. చతుర్ధమందు- గురు, కుజ, శనులు కలిసి ఉన్న హృద్రోగ ప్రాప్తి. 

61. సప్తమంలో కుజ, రాహువుల కలయిక భార్యకు కుసుమ రోగము. 

62. షష్టమందు- చంద్ర, గురుల కలయిక- శూల రోగ ప్రాప్తి!

63. పాప గ్రహ దృష్టి నందిన గురుడు- వ్యయమందున్న-గుద రోగము కలుగును. 

64. కుజ, శనులు- షష్ఠ భావము నందుండి; రవి, రాహువులచే చూడబడుచున్నాను; లేక బలహీనుడైన లగ్నాధిపతికి- కుజ, శనులు సంబంధం కలిగియున్నను ఆ జాతకుడు దీర్ఘవ్యాధిగ్రస్తుడు కాగలడు. 

65. అష్టమాధిపతి- 6-8-12 స్థానములందున్న- నిత్య రోగ బాధలు ఉండును. 

66. లగ్నాధిపతి, షష్ఠాధిపతి గ్రహములకు రవి యొక్క కలయిక కలిగిన- జ్వర బాధలు, చంద్రుని కలయికచే- జలోచరము; కుజునిచే- ఆయుధ,వ్రణ, స్పోటక, బాధలు; బుధ కలయికచే- మనోవిచారము, శని కలయికచే- వాత వ్యాధులు, రాహువు, కేతువుల కలయిక వలన- సర్పపీడలు ప్రాప్తింపుచుండ గలవు. 

67. లగ్నమందున్న షష్ఠాధిపతికి చంద్ర, రాహువుల కలయిక వల్ల- పురుషాంగమునకు శస్త్ర చికిత్స జరుగగలదు. 

68. లగ్నములందు- బుధ, రాహువుల కలయిక వల్ల- విషభక్షణ మృత్తి కలుగును. 

69. చతుర్ధ, సప్తమాధిపతులు శత్రు గ్రహములతో; కలసి 6-8-12 స్థానములందున్న- మూత్ర, కృచ్చ  రోగములు కలుగును. 

70. షష్ఠాధిపతి 8వ స్థానంలోనూ, కుజుడు- 6వ స్థానంలోనూ నుండిన- 6వ లేక 12వ సంవత్సరంలో తీవ్ర జ్వరగండం ముండగలదు. 

71. చంద్రుడు- శుభగ్రహ సంబంధ రహితుడై షష్ఠమందున్న- బాల్యంలో రోగ పీడ ఉండగలవు. 

72. 10వ స్థానంలో కుజుడున్న- భూ సంబంధముగను, 6-8-12 లలో గురువున్న-వస్త్రాభరణ- వాహనముల కొరకు; 7-5-9 లలో గురువు ఉన్న- సంతానము వలన, 5-9 లలో రవి ఉన్న- తండ్రి వలన, బంధువుల వలన; 5-7 లలో శుక్రుడున్న-ప్రయాణ విషయములను గురించి మనోవ్యాధలు కలుగుచుండగలవు. 

షష్టభావము శుభాశుభ యోగములు

01. షష్ట భావాధిపతికి- నీచ, శత్రుక్షేత్ర స్థితి; ద్వాదశ భావ స్థితి కలిగిన యెడల- శత్రునాశమునము కాగలదు.

02. షష్ఠ స్థానంలో- శుభగ్రహము లుండుటవల్ల మంచి జరుగును.

03. 6-11 స్థానాధిపతులు- 11-6 స్థానములందు పరివర్తనులైయున్న- 41వ సంవత్సరంలో శత్రువుల వల్ల ధననాశము కాగలదు. 

04. గురువు-1-6-12 అధిపతులతో కలసి; షష్ఠ భావమందున్న- కుమారుడే పరమ శత్రువు కాగలడు.

05. షష్ఠ భావమునకు లేక షష్ఠాధిపతికి శని-కుజుల దృగ్యోగాది సంబంధములు కలిగిన- మద్యపానము చేయగలరు. 

06. షష్ఠాధిపతి 10 వ స్థానమునందున్నను, ఆ స్థానమున చూచినను- వ్యసనముల వల్ల బ్రష్టులు కాగలరు.

07. 1-6-8 స్థానాధిపతులకు రాహు-కేతువుల కలయికయున్న-సర్పదష్టులు  కాగలరు (1-6-8 అధిపతుల దశలలో). 

08.  లగ్నమందు షష్ఠ- అష్టమాధిపతులుండి వారికి రవి సంబంధం కలిగిన- జ్వరద్యుపద్రవముల  వలన మృతి కలుగును. 

09. పై విధముగా చంద్ర సంబంధము కలిగిన- జలగండముచే మృతి కలుగును. 

10.  పై విధముగా బుధ సంబంధము వలన పైత్య రోగాదుల వల్ల మరణము కలుగును. 

11. పై విధముగా శని సంబంధము వలన- క్రూర జంతువుల, చోరుల వల్ల మరణము ప్రాప్తించగలదు. 

12.  పై విధముగా కుజ సంబంధము వలన- శత్రువులు, అగ్నివల్ల మృతి కలుగును. 

13. పై విధముగా షష్ఠ-అష్టమాధిపతులుండి; ఆయా గ్రహముల సంబంధములతో పాటు- గురు-శుక్రల సంబంధము కూడా కలిగిన- మరణ గండము తప్పిపోగలదు. 

14. షష్ఠాధిపతికి రాశ్యంశలయందు కేతు సంబందమున్న- కారాగార ప్రవేశము చేయగలరు. 

15. చంద్రుడు పాపగ్రహ వీక్షితుడైయుండి, శని సప్తమ స్థితి యందుండి, శుభగ్రహములు చరరాశులయందుండిన- భూత, ప్రేత పిశాచాది దుష్టగ్రహ పీడలు సంభవించగలవు. 

16. వ్యయాధిపతి తృతీయస్థితి కలిగియున్నను, అంశ లగ్నమందు కేతువున్నను- చోరుడు కాగలడు. 

17. షష్ఠాధిపతి సప్తమంలో నుండిన- శత్రు వశీకరణ, శత్రు నిగ్రహము లుండగలవు.

18. నైసర్గిక పాపగ్రహములన్నియు షష్ఠ భావంలో కలిసియున్న- తక్కువ స్థితి నుండి  ఉన్నత స్థితి నందగలరు. 

19. రాహు-కేతువులతో గలసి, 1-6-8 అధిపతులు కేంద్ర కోణములందున్న- కారాగృహ ప్రాప్తి కలుగును. 

20.  కుజుడు 9-10 స్థానములందు పాపగ్రహ వీక్షితుడైన- మేనమామలు ఉండరు. 

21. షష్ట స్థానమును శుభగ్రహములు వీక్షింపుచుండిన- మేనమామలు ఉండరు. 

22. బుధుడున్న రాశి నుండి 6 వ రాశిలో పాపగ్రహములున్న మేనమామ ఉండరు. 

23. షష్ఠాధిపతి షష్ఠ భావమందున్న-నమ్మికగల మంచి సేవకులుండగలరు. 

జ్యోతిషశాస్త్రము


Kamika Ekadashi - కామిక ఏకాదశి

కామిక ఏకాదశి మన భారతీయ సంప్రదాయంలో ఏకాదశి వ్రతాలకు ఎంతో విశిష్టత ఉంది. ఈ రోజున శ్రీ మహావిష్ణువును  భక్తిశ్రద్ధలతో పూజిస్తారు. దక్షిణాయన పుణ్...