Sunday, April 3, 2016

JYOTHISHA SHASTRAMU - జ్యోతిషశాస్త్రము

జ్యోతిష్యం నేర్చుకుందామా

1. చాంద్ర సంవత్సరము
శుక్ల పాడ్యమి మొదలు బహుళ అమవాస్యాంతము వరకు ఒక నెల (అమవాస్యాంతము మొదలు అమవాస్యాంతము) అట్టి 12 నెలలు ఒక సంవత్సరముగా గణన చేయుదురు.

తెలుగు సంవత్సరముల పేర్లు
1 ప్రభవ, 2. విభవ, 3. శుక్ల, 4, ప్రమోద్యూత, 5. ప్రజోత్పత్తి, 6. అంగీరస, 7. శ్రీముఖ, 8. భావ, 9. యువ, 10. ధాత, 11.ఈశ్వర, 12.బహుధాన్య, 13.ప్రమాధి, 14.విక్రమ, 15.వృష, 16.చిత్రభాను, 17.స్వభాను, 18.తారణ, 19.పార్థివ, 20. వ్యయ, 21. సర్వజిత్, 22.సర్వధారి, 23.విరోధి, 24.వికృతి, 25.ఖర, 26.నందన, 27.విజయ, 28.జయ, 29.మన్మధ, 30.దుర్ముఖి, 31.హేవళంబి, 32.విళంబి, 33.వికారి, 34.శార్వరి, 35.ప్లవ, 36.శుభకృత్, 37.శోభకృత్, 38.క్రోధి, 39.విశ్వావసు, 40.పరాభవ, 41.ప్లవంగ, 42.కీలక, 43.సౌమ్య, 44.సాధారణ, 45.విరోధికృత్, 46.పరిధావి, 47.ప్రమాది, 48.ఆనంద, 49.రాక్షస, 50. నల, 51.పింగళ, 52.కాళయుక్తి, 53.సిద్ధార్థి, 54.రౌద్రి, 55.దుర్మతి, 56.దుందుభి, 57.రుధిరోద్గారి, 58.రక్తక్షి, 59.క్రధన, 60.క్షయ(అక్షయ).

అయనములు
1. ఉత్తరాయనము: సూర్యుడు మకరరాశిని ప్రవేశించినది మొదలు మిధునరాశి చివరివరకు సంచరించు 6 మాసముల కాలము ఉత్తరాయన మనబడును. ఈ కాలమునందన్ని శుభ కర్మల నాచరించుట ప్రశస్థము.

2. దక్షిణాయనము: మిగిలిన 6 మాసముల కాలమును దక్షిణాయనము అందురు.

ఋతువులు
1. వసంతము
2. గ్రీష్మము
3. వర్షము
4. శరత్
5. హేమంత
6. శిశిర

మాసములు
1. 
చైత్రము
2. 
వైశాఖము
3. 
జ్యేష్టము
4. 
ఆషాడము
5. శ్రావణము
6. భాద్రపదము
7. ఆశ్వీయుజము
8. కార్తీకము
9. మార్గశీర్షము
10. పుష్యము
11. మాఘము
12 ఫాల్గుణము

శూన్యాధిక మాసములు
1. సూర్యుడు మీనరాశి యందు సంచరించు కాలంలో గల చైత్రమాసము,
2. మిధునరాశి సంచార కాలంలో గల ఆషాడమాసము,
3. కన్యారాశి సంచారంలో గల భాద్రపద మాసము,
4. ధనూరశి సంచారంలో గల పుష్యమాసము,
ఫై మాసములను శూన్య మాసములు అందురు. ఈ మాసములలో శుభకర్మలనాచరించరాదు. ఏ మాసమునందు రవికి వేరొక రాశి యందు ప్రవేశించుటయుండదో (శుక్లపక్ష పాడ్యమి నుండి అమావాస్య వరకు గల కాలము) అట్టి మాసము అధిక మాసమనబడును. ఒకే మాసము నందు రెండు రాశులలో సూర్య ప్రవేశము జరిగిన యెడల ఆ మాసము క్షయ మాసమనబడు, అధిక, క్షయ మాసములు రెండు అన్ని శుభకర్మలకు యోగ్యములు కావు.

పక్షము
1. శుక్ల (శుద్ధ) పక్షము: అన్ని శుభ కర్మలకు ప్రాశస్తమైనది
2. కృష్ణ (బహుళ) పక్షము: కొన్ని ప్రత్యేక కార్యములకు ప్రాశస్తమైనది

తిధులు
1. పాడ్యమి
2. విదియ
3. తదియ
4. చవితి
5. పంచమి
6. షష్టి
7. సప్తమి
8. అష్టమి
9. నవమి
10. దశమి
11. ఏకాదశి
12. ద్వాదశి
13. త్రయోదశి
14. చతుర్దశి
15. పొర్ణమి, అమావాస్య

శుక్ల పక్షము నందు మొదటి 5 తిధులు కృష్ణ పక్షము నందు చివరి 5 తిధులు మంచివి కావు
శుక్ల పక్షము కృష్ణ పక్షము రెంటి యందు రెండవ 5 తిధులు సామాన్య ఫలప్రదము
శుక్ల పక్ష మూడవ 5 తిధులు కృష్ణ పక్షమందు మొదటి 5 తిధులు ఉతమ ఫలప్రదము. రిక్త తిధులు ఉభయ పక్షములందు అప్రశస్తమైనవి.

తిధివార యోగములు
అది, మంగళవారములందు నంద తిధులు
సోమ, శుక్రవారములందు భద్ర తిధులు
బుధవారము నందు జయ తిధులు
గురువారము నందు రిక్త తిధులు
శనివారము నందు పూర్ణ తిధులు
కలిగి యుండిన యెడల మృత్యు ప్రదము.
మంగళవారము నందు జయ తిధులు, బుధవారము నందు భద్ర తిధులు, గురువారము నందు పూర్ణ తిధులు, శుక్రవారము నందు నంద తిధులు, శనివారము నందు రిక్త తిధులు కల్గియుండిన యెడల మిగులు శుభప్రదము.

వారములు
1. 
ఆదివారము
2. సోమవారము
3. మంగళవారము
4. బుధవారము
5. గురువారము
6. శుక్రవారము
7. శనివారము

ఇందు ఆది, మంగళ, శనివారములు శుభకర్మల నాచరించుటకు కూడవు. సోమ, బుధ, గురు, శుక్ర వారములు ప్రశస్థము.

నక్షత్రములు
1. అశ్వని
2. భరణి
3. కృతిక
4. రోహిణి
5. మృగశిర
6. 
ఆరుద్ర
7. 
పునర్వసు
8. 
పుష్యమి
9. 
ఆశ్లేష
10. మఘ
11. పుబ్భ
12. ఉతర
13. హస్త
14. 
చిత్త
15. 
స్వాతి
16. 
విశాఖ
17. 
అనూరధ
18. 
జ్యేష్ఠ
19. 
మూల
20. 
పుర్వాషాడ
21 ఉతరాషాడ
22. 
శ్రవణం
23. 
ధనిష్ఠ
24. శతభిషం
25. పూర్వాభాద్ర
26. ఉత్తరాభాద్ర
27. రేవతి

నక్షత్రాలు - వరుస క్రమము
వేదములో కృత్తికతో ప్రారంభించి ఈ నక్షత్రముల వరుస క్రమాన్ని చెప్పారు. కానీ, లోకంలో సాధారణంగా జ్యోతిష్కులంతా అశ్వినీ నక్షత్రముతో నక్షత్ర గణన ప్రారంభిస్తారు. అభిజిత్ అనే నక్షత్రం ఉత్తరాషాఢ, శ్రవణ నక్షత్రాల మధ్య ఉన్నది. కొన్ని సందర్భాలలో దీనిని కూడా నక్షత్రంగా పరిగణిస్తారు.

అభిజిత్ నక్షత్రము
ఉత్తరాషాఢ - శ్రవణముల మధ్య ఉండే అప్రకాశక నక్షత్రము 'అభిజిత్'. అభిజిత్ వా ప్రకాశకం అని పేరు. ఉత్తరాషాడ నక్షత్రంలో చివరిపాదం, శ్రావణా నక్షత్రంలో మొదటి 1/15వ భాగం కలిపి 'అభిజిత్' నక్షత్రం అంటారు.

ఈ నక్షత్రంలో జన్మించిన వారు సృజనాత్మకంగా, మేధావులుగా, మరియు కష్టాలను అధిగమించే విజయవంతమైన లక్షణాలను కలిగి ఉంటారని నమ్ముతారు.

మకరరాశిలో 6°40' నుండి 10°53'20" వరకు అభిజిత్ నక్షత్రము. అభిజిత్తు పగలు పదునాల్గు గడియలపై నుండు గడియల కాలము. "ఖి, ఖూ, ఖె, ఖో" అనే అక్షరాలు ఆ నక్షత్ర ప్రభావితుల నామాక్షరాలు.

'అభిజిత్' నక్షత్రం విజయం, అదృష్టాన్ని సూచిస్తుంది, దీనిని "విజేత" అని కూడా పిలుస్తారు, ఇది సూర్యోదయం తర్వాత వచ్చే 8వ ముహూర్తం మరియు పవిత్రమైన, ముఖ్యమైన సమయంగా పరిగణించబడుతుంది. సర్వ దోషాలనూ పోగొట్టే శక్తిని పొందింది. ఈ ముహూర్తంలో సూర్యభగవానుడు దశమ స్తానంలో ఉంటాడని, ఇది అనేక దోషాలను పోగొడుతుంది. 

దేవతలు సముద్రమధనం, రాముని జననం, సీతారాముల కళ్యాణం, భీష్ముడు ప్రాణపరిత్యాగం చేసిన సమయం, త్రిపుర సంహారం తరువాత ఇంద్రుని పునః పట్టాభిషేకం ఏ అభిజిత్ లగ్నం లోనే జరిగాయి. ఈ లగ్నానికి వారం, వర్జ్యం తో నిమిత్తం లేదు. సర్వత్రా విజయం, సర్వ శ్రేయోదాయకం. నారదపురాణం ప్రకారం ఈ ముహూర్తంలో ఉపనయనం, బుధవారం దక్షిణ దిక్కు ప్రయాణం చేయరాదు.

అభిజిత్ లగ్నాన్ని పల్లెటూళ్ళలో "గడ్డపలుగు"ముహూర్తం అని అంటారు. గడ్డపలుగు భూమిలో పాతిన దాని నీడ మాయమయ్యే మిట్ట మధ్యాన్న సమయాన్ని అభిజిత్ ముహూర్తంగా, మంచి ముహూర్తంగా నిర్ణయించారు. పూర్వకాలంలో బ్రాహ్మణులు పంచాంగం చూడటం రాని పల్లె ప్రజలకు ఎటువంటి గందరగోళం లేకుండా స్ధూలమైన మంచి ముహూర్తం ఈ విధంగా ఎన్నుకోవచ్చని తెలియజేశారు. ఈ ముహూర్తంలో సూర్యుడు దశమకేంద్రంలో ఉంటాడని ఈ యోగం ముహూర్తంలోని చాలా దోషాలను పోగొడుతుందని తెలియజేసేవారు.

అభిజిత్ నక్షత్ర జన్మ వృత్తాంతము
నక్షత్రాలు మొత్తం ఇరవై ఏడు. ఇవన్నీ దక్షప్రజాపతి కుమార్తెలు. దక్షుడు ఈ నక్షత్ర కన్యలను చంద్రుడికిచ్చి పెళ్లిచేశాడు.

చంద్రుడు తన భార్యలందరిలోకి రోహిణి మీద ఎక్కువ అనురాగాన్ని పెంచుకొని ఆమెతోనే ఎక్కువ సమయం గడుపుతుండేవాడు. ఓసారి వసంత ఋతువులో చంద్రుడు ఒక్క రోహిణి దగ్గరే ఉంటూ మిగతా నక్షత్రాలను నిర్లక్ష్యం చేశాడు.

మిగిలిన నక్షత్రాలు కొంత ఊరుకున్నా శ్రవణా నక్షత్రం మాత్రం తన సహనాన్ని కోల్పోయింది. ఓపిక పట్టలేక తన నుంచి తన లాగే ఉండే ఒక చాయను తీసి తన స్థానంలో ఉంచి చంద్రుడి విషయాన్ని గురించి తన తండ్రికి చెప్పేందుకు వెళ్లింది. ఆ శ్రవణా నక్షత్రపు చాయ ఒక నక్షత్రమైంది. దానిపేరు అభిజిత్తు. అలా ఇరవై ఏడు నక్షత్రాలే కాక అభిజిత్తు అనే ఇరవై ఎనిమిదో నక్షత్రం కూడా ఏర్పడింది.

ఆ తర్వాత కాలాలలో శ్రవణం చెప్పిన విషయాన్ని దక్షుడు వినటం, ఒకటికి రెండు సార్లు ఆయన చంద్రుడిని హెచ్చరించినా చంద్రుడు వినకపోయేసరికి ఆయన శపించటం మొదలైన విషయాలు జరిగాయి. అయినా అభిజిత్తు నక్షత్రం మాత్రం ఓ పవిత్రమైన స్థానాన్నే పొందింది.

నక్షత్రాల లింగవిభజన
ఈ నక్షత్రాలలో కొన్నిటిని పుంలింగములోనూ, మరికొన్నిటిని స్త్రీలింగములోనూ బోధించారు.
నక్షత్రదేవతలకు స్వేచ్ఛ ప్రకారంగా తమ లింగాన్నీ, రూపాన్నీ మార్చుకునే శక్తిని పరమేశ్వరుడు ప్రసాదించాడని పురాణ గాథ.

పురుష నక్షత్రాలు: అశ్వని, పునర్వసు, పుష్యమి, హస్త, శ్రవణము, అనూరాధ, పూర్వాభద్ర, ఉత్తరాభద్ర.

స్త్రీ నక్షత్రాలు: భరణి, కృత్తిక, రోహిణి, ఆరుద్ర, ఆశ్లేష, మఖ, పుబ్బ, ఉత్తర, చిత్త, స్వాతి, విశాఖ, జ్యేష్ఠ, పూర్వాషాఢ, ఉత్తరాషాడ, ధనిష్ట, రేవతి.

నపుంసక నక్షత్రాలు: మృగశిర, మూల, శతభిష.


నక్షత్ర సంజ్ఞలు
మొత్తం 27 నక్షత్రములు ధ్రువ, చర, ఉగ్ర, సాధారణ, క్షిప్ర మృదు, దారుణ సంజ్ఞలు కలిగియునాయి.
1. రోహిణి, ఉత్తర, ఉత్తరాషాడ ఉత్తరాభాద్ర - ధ్రువ నక్షత్రములు
2. పునర్వసు, స్వాతి, శ్రవణం, ధనిష్ఠ, శతభిషములు - చర నక్షత్రములు
3. భరణి, పుబ్భ, మఘ, పూర్వాషాడ, పూర్వాభాద్ర - ఉగ్ర నక్షత్రములు
4. కృత్తిక, విశాఖలు - సాధారణ నక్షత్రములు
5. అశ్వని, పుష్యమి, హస్త, అభిజిత్ లు - క్షిప్ర నక్షత్రములు
6. మ్రుగశిర, చిత్త, అనూరాధ, రేవతిలు - మృదు నక్షత్రములు
7. ఆర్ద్ర, ఆశ్లేష, జ్యేష్ట మూలలు - దారుణ నక్షత్రములు
8. భరణి, కృత్తిక, ఆశ్లేష, విశాఖ, మూలలు - అధొముఖములు
9.ఆర్ద్ర, పుష్యమి, శ్రవణం, ధనిష్ఠ, శతభిషం, ఉత్తర, ఉత్తరాషాడ, ఉత్తరాభాద్ర రోహిణిలు ఊర్ధ్వముఖములు
10. అశ్వని, మృగశిర, పునర్వసు హస్త, చిత్త, స్వాతి, అనూరాధ, జ్యేష్ఠ, రేవతీలు -తిర్యోజ్గ్ముఖములు
11. అశ్వని, రోహిణి, మృగశిర, ఉత్తర, హస్త, చిత్త, అనూరాధ, ఉత్తరాషాడ, శ్రవణం, ధనిష్ఠ, శతభిషం, ఉత్తరాభాద్ర, రేవతి నక్షత్రములు సాధారణంగా శుభ కార్యములకు యొగ్యమయినవి.
12. పునర్వసు, పుష్యమి, మఘ స్వాతి, మూల నక్షత్రములు కొన్ని సందర్భములలో కొన్నికార్యములకు శుభప్రదమై యున్నవి.
13. భరణి, కృత్తిక, ఆర్ద్ర, ఆశ్లేష, పుబ్భ, విశాఖ, జ్యేష్ఠ పూర్వాషాడ, పూర్వాభాద్ర నక్షత్రములు అన్ని కార్యములకు అయొగ్యములు.

నక్షత్రాలు గణ విభజన
జ్యోతిష శాస్త్రంలో నక్షత్రాలను మూడు గణాలుగా విభజిస్తారు.

దేవగణ నక్షత్రాలు: ఇరవై ఏడు నక్షత్రాలలో అశ్వని, మృగశిర, పునర్వసు, పుష్యమి, హస్త, స్వాతి, అనూరాధ, శ్రవణం, రేవతి అను తొమ్మిది నక్షత్రాలు దేవగణ నక్షత్రాలు. దేవగణ నక్షత్ర జాతకులు సాత్విక గుణం కలిగి ఉంటారు. శాంత స్వభావం కలిగి ఉంటారు. పరోపకారులై ఉంటారు. ఓర్పు, సహనం కలిగి ఉంటారు.

మానవగణ నక్షత్రాలు: భరణి, రోహిణి, ఆరుద్ర, పుబ్బ (పూర్వ ఫల్గుణి), ఉత్తర (ఉత్తర ఫల్గుణి), పూర్వాషాఢ, ఉత్తరాషాఢ, పూర్వబాధ్ర, కృత్తిక, ఉత్తరాబాధ్ర అను తొమ్మిది నక్షత్రాలు మానవ గణ నక్షత్రాలు. మానవ గణ నక్షత్ర జాతకులు రజోగుణ లక్షణాలు కలిగి ఉంటారు. మంచి చెడు రెండు కలిగి ఉంటారు. బాధించటం, వేధించటం చేయరు. ఎవ్వరికీ హాని తలపెట్టరు.

రాక్షసగణ నక్షత్రాలు: ఆశ్లేష, మఖ, చిత్త, విశాఖ, జ్యేష్ట, మూల, ధనిష్ఠ, శతభిషం (శతతార) అనే తొమ్మిది నక్షత్రాలు రాక్షస గణ నక్షత్రాలు. రాక్షసగణ నక్షత్ర జాతకులు తామస గుణ లక్షణాలు కలిగి ఉంటారు. అసూయ ద్వేషాలు కలిగి ఉంటారు. కఠినంగా మాట్లాడతారు. మిక్కిలి స్వార్ధపరులు.

వివిధ నక్షత్రాలు
1. క్షిప్ర నక్షత్రములు :- అశ్వని, హస్త, పుష్యమి
2. దారుణ నక్షత్రములు :- మూల, ఆరుద్ర, జ్యేష్ట, ఆశ్లేష
3. మృదు నక్షత్రములు :- చిత్త, రేవతి, మృగశిర, అనురాధ
4. స్థిర నక్షత్రములు :- రోహిణి, ఉత్తరాషాడ, ఉత్తరాభాద్ర
5. చర నక్షత్రములు :- స్వాతి, పునర్వసు, శ్రవణము, ధనిష్ట, శతభిష
6. ఉగ్ర నక్షత్రములు :- భరణి, మఖ, పుబ్బ, పూర్వాషాడ, పూర్వాభాద్ర.

అంధాక్ష నక్షత్రాలు : రోహిణి, పుష్యమి, ఉత్తర, విశాఖ, పూర్వాషాఢ, ధనిష్ట, రేవతి
మధ్యాక్ష నక్షత్రాలు : భరణి, మఘ, చిత్త, జ్యేష్ట, అభిజిత్, పూర్వాభాద్ర.
సులోచన నక్షత్రాలు : కృత్తిక, పునర్వసు, పుబ్బ, స్వాతి, మూల, శ్రవణం, ఉత్తరాభాద్ర.
షడ్జన్మ నక్షత్రాలు : జన్మ నక్షత్రం, జన్మ నక్షత్రం నుండి 10-కర్మ నక్షత్రం, 16-సంఘాత నక్షత్రం, 18-సముదాయ నక్షత్రం, 23- వినాశ నక్షత్రం, 25-మానస నక్షత్రాదులు సకల శుభ కర్మలకు విడువదగినవి.

సవ్య నక్షత్రములు (15) : అశ్విని, భరణి, కృత్తిక, పునర్వసు, పుష్యమి, ఆశ్లేష, హస్త, చిత్త, స్వాతి, మూల, పూర్వాషాడ, ఉత్తరాషాడ, పూర్వాభాద్ర, ఉత్తరాభాద్ర, రేవతి.

అపసవ్య నక్షత్రములు (12) : రోహిణి, మృగశిర, ఆరుద్ర, మఖ, పుబ్బ, ఉత్తర, విశాఖ, అనూరాధ, జ్యేష్ఠ, శ్రవణం, ధనిష్ఠ, శతభిష

ధర్మ నక్షత్రాలు : అశ్వని, పుష్యమి, ఆశ్లేష, విశాఖ, అనురాధ, ధనిష్ఠ, శతభిషం.
అర్థ నక్షత్రాలు : భరణి, పునర్వసు, మఖ, స్వాతి, జ్యేష్ఠ, శ్రవణం, పూర్వాభాద్ర
మోక్ష నక్షత్రాలు : రోహిణి, మృగశిర, ఉత్తర, హస్త, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ, రేవతి నక్షత్రాలు.

ఏ నక్షత్రం ఎందుకు ఉపయోగపడుతుంది
దృవ నక్షత్రాలు: ఉత్తర, ఉత్తరాషాడ, ఉత్తరాభాద్ర, రోహిణి నక్షత్రాలు. స్ధిరమైన పనులు చేయుటకు పనికి వస్తాయి. నూతన కార్యములు కాకుండా ఉన్నవి. ఉదా : గృహ నిర్మాణం, ఉద్యోగం.

చర నక్షత్రాలు: స్వాతి, పునర్వసు, శ్రవణం, ధనిష్ఠ, శతభిష నక్షత్రాలు. ఈ నక్షత్రాలలో యాత్రలు, విద్యా, వాహన చోదనం, వివాహం, గృహారంభం, నూతన కార్యములకు పనికి వస్తాయి.

ఉగ్ర నక్షత్రాలు: భరణి, మఖ, పుబ్బ, పూర్వాషాడ, పూర్వాభాద్ర నక్షత్రాలు ఉగ్ర నక్షత్రాలు. ఈ నక్షత్రాలు శుభ కార్యాలకు మంచిది కాదు. ఆయుధాల ప్రయోగానికి, మందులు తయారు మొదలైన వాటికి పనికి వస్తాయి.

మిశ్రమ నక్షత్రాలు: విశాఖ, కృత్తిక నక్షత్రాలు. ఇవి మిశ్రమ నక్షత్రాలు. ఇవి యజ్ఞ క్రియలు, దేవాలయ కార్యములు చేయుటకు మంచివి.

క్షిప్ర నక్షత్రాలు: అశ్విని, హస్త, పుష్యమి, అభిజిత్ నక్షత్రాలు క్షిప్ర నక్షత్రాలు. విద్యారంభానికి, అమ్మకాలకి, ఔషదాలు తీసుకొనుటకు, పనిలో సత్ఫలితాలు ఇచ్చే వాటికి, వెంటనే జరిగే పనులకు ఈ నక్షత్రాలు మంచివి.

మృదు నక్షత్రాలు: మృగశిర, రేవతి, చిత్త, అనురాధ నక్షత్రాలు మృదు నక్షత్రాలు. ఇవి లలిత కళలు, స్నేహం చేయటానికి, నూతన వస్త్రాలు కొనటానికి, ధరించటానికి, దౌత్య కార్యాలకు, వివాహములకు మంచిది.

దారుణ నక్షత్రాలు : మూల, జ్యేష్ఠ, ఆశ్లేష, ఆరుద్ర నక్షత్రాలు దారుణ నక్షత్రాలు.

ఊర్ధ్వముఖ నక్షత్రాలు : ఆరుద్ర, పుష్యమి, శ్రవణం, ధనిష్ఠ, శతభిషం, రోహిణి, ఉత్తరాత్రయ నక్షత్రాలు వీటి దృష్టి ఆకాశం వైపుకు ఉంటుంది. కాబట్టి రాచ కార్యాలకు, వ్యవహారాలకు, గృహప్రవేశాలకు, దనుర్విద్యలకు, విమాన చోదనం, గృహ నిర్మాణం, విత్తనాలు చల్లుటకు, దేవాలయ నిర్మాణాలు, రాకెట్ ప్రయోగము మొదలైన వాటికి మంచివి.

అధోముఖ నక్షత్రాలు : మూల, ఆశ్లేష, విశాఖ, కృత్తిక, పుబ్బ, పూర్వాషాడ, పూర్వాబాద్ర నక్షత్రాలు వీటి దృష్టి క్రింది వైపుకు ఉంటుంది. బావులు త్రవ్వటానికి, నాగలి పట్టుటకు, పునాదులు త్రవ్వటానికి పనికి వచ్చే నక్షత్రాలు.

తిర్మ్యఖ నక్షత్రాలు : మృగశిర, రేవతి, చిత్త, అనురాధ, హస్త, స్వాతి, పునర్వసు, అశ్విని, జ్యేష్ఠ ఇవి రోడ్లు వేయుటకు, ముందుకు సాగే వాటికి, ధ్వజ స్తంభ ప్రతిష్ఠ, విగ్రహ ప్రతిష్ఠ మొదలైన కార్యాలకు మంచిది.

పంచక నక్షత్రాలు : ధనిష్ఠ, శతభిషం, పూర్వాభాద్ర, ఉత్తరాభాద్ర, రేవతి, శుభకార్యాలకు మంచిది. క్రూర కర్మలు ప్రారంభించుటకు, సాహస కార్యములకు ఈ నక్షత్రాలు పనికిరావు.

గండ నక్షత్రాలు : ఆశ్లేష, మఖ, జ్యేష్ఠ, మూల, రేవతి, అశ్వని నక్షత్రాలలో శిశువు జన్మించిన విశేషంగా గ్రహ శాంతులు చేయవలెను. అందువలన వీటిని గండ నక్షత్రాలు అంటారు.

నక్షత్రాలు - దేవతలు
అశ్వని - అశ్వని దేవతలు, భరణి - యముడు, కృత్తిక - అగ్ని, రోహిణి - బ్రహ్మ, మృగశిర - చంద్రుడు, ఆరుద్ర - శివుడు, పునర్వసు - అదితి, పుష్యమి - గురుడు, అశ్లేష - సర్పములు, మఖ - పితృదేవతలు, పుబ్బ - బృగుడు, ఉత్తర - అర్యముడు, హస్త - సూర్యుడు, చిత్త - ఇంద్రుడు, స్వాతి - వాయుదేముడు, విశాఖ - ఇంద్రాగ్నులు, అనూరాధ - మిత్రులు, జ్యేష్ట - దేవేంద్రుడు, మూల - రాక్షసుడు, పూర్వాషాడ - ఉదకములు, ఉత్తరాషాడ - విశ్వేదేవతలు, శ్రవణం - విష్ణువు, ధనిష్ట - వసువులు, శతభిషం - వరుణుడు, పూర్వ భాద్ర - అజచరణుడు, ఉత్తరా భాద్ర - ఆహిర్భుద్నుడు, రేవతి - పూషుడు.

నక్షత్ర గండాంత దోషం
ఆశ్లేష చివరి 4 ఘడియలు, మఖ మొదటి నాలుగు ఘడియలు; జ్యేష్ట చివరి 4 ఘడియలు, మూల మొదటి 4 ఘడియలు; రేవతి చివరి 4 ఘడియలు, అశ్విని మొదటి 4 ఘడియలు మొత్తం ఈ మూడు నక్షత్ర కాలంలో 8 ఘడియల కాలం నక్షత్ర గండాంతములు. అభిజిన్ముహూర్తంలో తిధి, లగ్న, నక్షత్ర, గండాంత మూడు పరిహారమవుతాయి.

కార్యాలకు అనుకూలమైన శుభ నక్షత్రాలు
అశ్విని : నామకరణ, అన్నప్రాసన, గృహారంభ, గృహప్రవేశ, వివాహములకు మంచి నక్షత్రము.
భరణి : గయ మొదలైన ప్రదేశాల్లో శ్రాద్ధాలకు, మంత్ర శాస్త్ర అధ్యాయానికి అనువైనది.
కృత్తిక : విత్తనాలు చల్లడానికి, మొక్కలు నాటడానికి మంచి నక్షత్రము.
రోహిణి : పెళ్ళిళ్ళు, ఇంటి పనులు, ఇతర అన్ని పనులకు మంచి నక్షత్రము.
మృగశిర : అన్ని పనులకు మంచి నక్షత్రము.
ఆరుద్ర : నూతులు త్రవ్వడానికి, శివ పూజకు మంచి నక్షత్రము.
పునర్వసు : అన్నప్రాశన, చౌలది సర్వ కార్యాలకు అనువైన నక్షత్రము.
పుష్యమి : గృహ ప్రవేశాలకు మంచి నక్షత్రము.
ఆశ్లేష : యంత్ర పనిముట్ల ప్రారంభానికి మంచి నక్షత్రము.
మఖ : ప్రయాణ శుభకార్యాలకు మంచి నక్షత్రము.
పుబ్బ : నూతులు త్రవ్వడానికి, విత్తనాలు చల్లడానికి మంచి నక్షత్రము.
ఉత్తర : పెళ్ళిళ్ళు, ఇతర అన్ని పనులకు మంచి నక్షత్రము.
హస్త : గృహ ప్రవేశాలకు తప్ప అన్ని ఇతర పనులకు మంచి నక్షత్రము.


శుభకార్యాలకు అనుకూలమైన శుభ నక్షత్రాలు
చిత్త : వివాహాలు, విద్య ప్రారంభం, గృహ ప్రవేశం వంటి వాటికి మంచి నక్షత్రము.
స్వాతి : పెళ్ళిళ్ళు వంటి అన్ని పనులకు మంచి నక్షత్రము.
విశాఖ : నూతులు త్రవ్వడానికి మంచి నక్షత్రము.
అనూరాధ : పెళ్ళిళ్ళు, ఉపనయనాలకు, ఇతర అన్ని శుభకార్యాలకు మంచి నక్షత్రము.
జ్యేష్ఠ : నూతులు త్రవ్వడానికి, ప్రయాణాలకు మంచి నక్షత్రము.
మూల : పెళ్ళిళ్ళు, ఉపనయనాలకు, ప్రయాణాలు మంచి నక్షత్రము.
పూర్వాషాడ : నూతులు త్రవ్వడానికి అనువైన నక్షత్రము.
ఉత్తరాషాడ : అన్ని పనులకు శుభ నక్షత్రము.
శ్రవణం : గృహ ప్రవేశాలకు తప్ప అన్ని ఇతర పనులకు అనువైన నక్షత్రం.
ధనిష్ఠ : వ్యాపార పనులకు, యంత్రాలకు, పెళ్లిళ్లకు శుభ నక్షత్రం.
శతబిషం : నూతులు త్రవ్వడానికి, అన్ని పనులకు అనువైన నక్షత్రం.
పూర్వాభాద్ర : విద్య ఆరంభానికి, నూతులు త్రవ్వడానికి అనువైన నక్షత్రం.
ఉత్తరాభాద్ర : అన్ని పనులకు శుభ నక్షత్రం.
రేవతి : పెళ్ళిళ్ళు, ఉపనయనములు, యాత్రలకు అనువైన నక్షత్రం.


సర్వకార్యాలకు శుభప్రదాలైన సర్వసిద్ది యోగాలు
ఆదివారం : ఉత్తరాత్రయం (ఉత్తర, ఉత్తరాషాఢ, ఉత్తరాభాద్ర), అశ్విని, పుష్యమి, హస్త, మూల
సోమవారం : రోహిణి, మృగశిర, పుష్యమి, అనురాధ, శ్రవణం
మంగళవారం : అశ్విని, కృత్తిక, ఆశ్లేష, ఉత్తరాభాద్ర
బుధవారం : కృత్తిక, రోహిణి, మృగశిర, హస్త, అనురాధ
గురువారం : అశ్విని, పునర్వసు, పుష్యమి, అనురాధ, రేవతి
శుక్రవారం : అశ్విని, పునర్వసు, అనురాధ, శ్రవణం, రేవతి
శనివారం : రోహిణి, స్వాతి, శ్రవణం. 
ఇవన్నీ సర్వార్థ సిద్ధి యోగాలు, సర్వకార్యాలకు శుభప్రదాలు.

దుష్టతిధి వార నక్షత్ర యోగములు
1. పంచమీ తిధి - హస్తా నక్షత్రము, ఆదివారం కలిసిన యోగము అదే విధముగా
2. సప్తమీ తిధి - అశ్వనీ నక్షత్రము, మంగళవారం
3. షష్ఠి తిధి - మృగశిరా నక్షత్రము, సోమవారము
4. అష్టమీ తిధి - అనూరాధ నక్షత్రం, బుధవారం
5. దశమీ తిధి - రేవతీ నక్షత్రం, శుక్రవారం
6. నవమీ తిధి - పుష్యమీ నక్షత్రం, గురువారం
7. ఎకదశి తిధి రోహిణి నక్షత్రం, శనివారం ఫై విధంగా తిధి వార నక్షత్రములు కలిగిన సమయమునందు సమస్త శుభకార్యములు ఆచరించరాదు.

శ్లో॥  భోమాశ్వని ప్రయాణంచ ప్రవేశే శని రోహిణి ।
        వివాహే గురు పుష్యేతు షాణ్మాసం మరణం ధృవమ్ ॥

అను ప్రమాణముండుట వలన అశ్వనీ మంగళవారము నందు ప్రయాణము, రోహిణి శనివారము నందు గృహ ప్రవేశము, పుష్యమీ గురువారము నందు వివాహమును ముఖ్యముగా చేయకూడదు. ఆయా తిది నక్షత్ర వారములతో కూడిన దుష్ట యోగములందు వాటి నాచరించిన మరణ ప్రదము కాగలదు.

జన్మ నక్షత్రం మరియు నక్షత్ర పాదాన్ని ఎలా లెక్కిస్తారు ?

ప్రతి నక్షత్రం నాలుగు పాదాలుగా విభజించబడింది. 27 నక్షత్రాలు 108 పాదాలుగా రాశిచక్రములో విభజింపబడ్డాయి. ఒక్కో పాదానికి ఒక్కో అక్షరం ఇవ్వబడింది. ముందు నక్షత్ర పాదాన్ని ఎలా గుర్తించాలో తెలుసుకుందాం.

నోట్ పాడ్, కాలిక్యులేటర్ ఓపెన్ చేసుకొండి. ఉదా:- ఒక వ్యక్తి 05-04-2004 రోజున ఉదయం 10 గంటలకు జన్మించాడనుకోండి. ఆరోజు పంచాంగానుసారం హస్తా నక్షత్రం సాయంత్రం 06 గంటల 39 నిమిషాల వరకు ఉన్నది. గడిచిన రోజు రాత్రి 8 గంటల నాలుగు నిమిషాలకు ఆరంభమయ్యింది. నక్షత్రం ఆరంభమునుంచి అంత్యము వరకు గల సమయాన్ని లెక్కించండి. ఇవ్వబడిన నక్షత్ర ఆద్యంత సమయము 22 గంటల 35 నిమిషములు. దీనినే రుక్షాద్యంతము అని అంటారు. (రుక్షము అంటే నక్షత్రము అని అర్థము).

ఒక నక్షత్రానికి నాలుగు పాదాలు. ఈ నాలుగు పాదాలు గడవటానికి పట్టిన సమయం 22 గంటల 35 నిమిషాలు అయినప్పుడు ఒక పాదం గడవటానికి దాదాపు 5 గంటల 39 నిమిషాలు. నక్షత్ర ఆరంభ సమయం నుంచి జన్మ సమయం వరకు అయిన సమయాన్ని లెక్కించండి. 13 గంటల 56 నిమిషములు. దీనిలో రెండుపాదాల సమయం అంటే 11 గంటల 18 నిమిషాలు గడిచిపోగా ఇంకా 2 గంటల 38 నిమిషాలు శేషం మిగిలి ఉన్నది. అంటే జాతకుని జన్మ సమయానికి హస్తానక్షత్రము రెండు పాదాలు గడిచి మూడవపాదం నడుస్తున్నది. అంటే జాతకుడు హస్తా నక్షత్రం 3వ పాదములో జన్మించాడని తెలుస్తున్నది. మళ్ళీ ఒకసారి గమనిస్తే ముందుగా జాతకుడు జన్మించిన నాటి నక్షత్ర ఆద్యంతాలను తీసుకొండి. దానిని 4చే భాగించండి. జాతకుడు జన్మించిన సమయానికి ఎన్ని పాదాలు కొట్టుడుపోతున్నాయో గమనించండి. శేషం ఏ పాదములో పడుతున్నదో గమనించండి. అదే ఆ జాతకుని జన్మ నక్షత్రపాదం.

తొమ్మిది విధాలైన నక్షత్ర శాంతులు
దుష్ట నక్షత్రములందు స్త్రీలు రజస్వలలైనప్పుడు, గండనక్షత్రములలో శిశుజననమైనప్పుడు జరపవలసిన శాంతి తొమ్మిది విధములు. శాంతికొరకు ఈ తొమ్మిది కార్యములను నిర్వహించవలెను.

1. తైలావలోకనం : కంచు, లేదా, మట్టిపాత్రలో తగినంత మంచి నూనెపోసి అందులో పగడం - ముత్యం వుంచాలి. ఒకచోట ఉప్పు గుట్టగాపోసి - ఈ పాత్రను పూజించాలి. తరువాత ఆ తైలంలో ఒకరి ముఖం ఒకరు చూసుకోవాలి.

2. రుద్రాభిషేకం : నక్షత్రం యొక్క దోషబలాన్ని బట్టి ఈ తంతు జరపాలి.శక్తివంచన లేకుండా ముగ్గురుగాని, అయిదుగురుగాని, 11 మందిగాని రుద్రన్యాసయుక్తంగా 11 పర్యాయాలు శివాభిషేకము, పూజ చేయించాలి. తదుపరి ఆ బ్రాహ్మణులను భోజన, తాంబూల, దక్షిణలతో సంతోషింపచేసి వారి ఆశీస్సులను పొందవలెను.

3. సూర్య నమస్కారములు : ఒంటికాలిపై నిలిచి అరుణ మంత్రమును108 పర్యాయములు జపించుచు చేయు నమస్కారమని పేరు. దీనికి ఒకరు గాని, ముగ్గురుగాని, 5 గురుగాని బ్రాహ్మణులను నియుక్తపరచవలెను.

4. మృత్యుంజయ జపము : దీనినే అపమృత్యుహరం అంటారు. యథాశక్తి బ్రాహ్మణులను నియమించి - లక్షసార్లు మృత్యుంజయ మంత్ర జపం చేయించటం సాంప్రదాయం. తద్వారా అన్ని విధములైన అపమృత్యు దోషాలు తొలగిపోతాయి అని అంటారు.

5. నక్షత్ర జపం : 27 గురు బ్రాహ్మణులను నియమించి - ఒక్కొక్క నక్షత్రమునకు 108 నుండి 1008 పర్యాయములు శాంతి మంత్రము జపింప చేయవలెను.

6. నవగ్రహ జపం : నవగ్రహములకు 9 మంది విప్రులచే ఆయా శాంతి నిర్ణీత మంత్రములను జపింపచేయవలెను.

7. హోమము : నవగ్రహముల పేరిట తగుహోమము (అగ్ని పూర్వకంగా) చేయింపవలెను.

8. సువాసినీ పూజ : శక్తిననుసరించి, తగినంత మంది ముత్తైదువలకుభోజన తాంబూలాదులు ఇచ్చి, పువ్వులు పండ్లను సమర్పించి, నమస్కరించి వారి ఆశీస్సులు పొందవలెను.

9. ఈ ఎనిమిది తరువాత - తగుమంది బ్రాహ్మణులకు సమారాధన చేయవలెను. దానమును స్వీకరించిన బ్రాహ్మణుడు తరువాత స్నానము, జపము తప్పక చేయవలెను.

ఈ తొమ్మిది అంగములతో చేసినదే శాంతి అనబడును. తద్వారా సర్వ నక్షత్ర, గ్రహదోషములు అపమృత్యు భయములు తొలగి సుఖ శాంతులు లభించును. ఈ శాంతి కార్యములు ఇంటి పురోహితులను (స్థానిక బ్రహ్మను) సంప్రదించి వారు చెప్పిన విధముగా జరిపించుకొనవలెను.


నక్షత్ర విష ఘటికలు
నక్షత్ర ప్రమాణం 60 ఘడియలు అయినప్పుడు విష ఘడియలు 4 అవుతాయి. (గం. 1.36ని.లు) ప్రమాణంలో మార్పులుంటే దానిని బట్టి లెక్కించుకోవాలి.

రేవతి, పునర్వసు, మాఘ నక్షత్రాలకు 30 ఘడియల తరువాత, రోహిణికి 40 ఘడియల తర్వాత, ఆశ్లేషకు 32 ఘడియల తర్వాత, అశ్వినికి 50 ఘడియల తర్వాత, ఉత్తర, శతభిషాలలో 18 ఘడియల తర్వాత, పుబ్బ, చిత్ర, ఉత్తరాషాఢ, పుష్యమి నక్షత్రాలలో 20 ఘడియల తర్వాత, విశాఖ, స్వాతి, మృగశిర, జ్యేష్ట నక్షత్రాలకు 14 ఘడియల తర్వాత, ఆర్ధ్ర, హస్తలకు 21 ఘడియల తర్వాత, పూర్వాభాద్రకు 16 ఘడియల తర్వాత, ఉత్తరాభాద్ర పూర్వాషాడ, భరణీ నక్షత్రాలకు 24 ఘడియల తర్వాత, అనురాధ, ధనిష్ట, శ్రవణాలకు 10 ఘడియల తర్వాత, మూలకు 56 ఘడియల తర్వాత 4 ఘడియలు విషఘటికలు అవుతాయి. ఇవి వివాహాదులకు వర్జ్యాలు. అనగా నిషేధించబడినవి.

వధూవరులకు పరస్పర వైరము కలిగించు వేధ నక్షత్రములు

అశ్వని - జ్యేష్ఠలకు,

భరణి - అనూరాధలకు,

కృత్తిక - విశాఖలకు,

రోహిణ - స్వాతులకు,

ఆర్థ్రా - శ్రవణములకు,

పునర్వసు - ఉత్తరాషాఢలకు,

పుష్యమి - పూర్వాషాఢలకు,

ఆశ్రేష - మూలలకు,

మఘా - రేవతులకు,

పూర్వఫల్గుని - ఉత్తరాభాద్రలకు,

ఉత్తరఫల్గుని - పూర్వాభాద్రలకు,

హస్త - శతభిష 
తారలకు పరస్పర వేధ కలిగి యుండును. కావున ఈ నక్షత్రముల జంటలో ఒక జంట దంపతుల జన్మనక్షత్రములై ఉన్నచో దంపతులకు కలహ కరమగును అని నమ్మకము. ద్విపాద నక్షత్రములగు చిత్రా - మృగశిర - ధనిష్ఠలును పరస్పరవైరము కలవై ఉండును.

పుష్యమి నక్షత్ర విశిష్టత
“సింహో యధా సర్వ చతుష్ట దానాం తథైవ పుష్యో బలవానుడూనాం
చంద్రే విరుద్ధ్యేప్యథ గోచరేవా సిద్ధ్యన్తి కార్యాణి, కృతాని పుష్యే”

మృగాలలో సింహలాగా, నక్షత్రాలలో పుష్యమి బలమైనది. చంద్ర బలం తక్కువగా ఉన్నా, గోచార బలం తక్కువైనా, పుష్యమిలో చేసిన పనులు ఫలసిద్ధినిస్తాయి.

విహాయ పాణిగ్రహమేవ పుష్య అని ముహూర్త దీపికాది గ్రంథాలు చెప్పిన ప్రకారం వివాహానికి మాత్రం పుష్యమి నిషిద్దమైన నక్షత్రంగా తేలియజేయబడుతుంది.

రవి యోగం
రవి నక్షత్రం నుండి 4, 5, 6, 10, 11, 20 నక్షత్రాల్లో చంద్రుడుంటే రవి యోగం సకల దోషాలకు నాశనం. మతాంతరంలో రవి నక్షత్రం నుండి చంద్రుడు 4, 6, 9, 10, 13, 20 నక్షత్రాల్లో ఉంటే రవి యోగం దగ్దాది దుష్ట యోగాలను హరిస్తుంది. శుభప్రదం.

జన్మ నక్షత్రాల ప్రాధాన్యం
వివాహం మొ॥ శుభకార్యాలు, ప్రయాణం, గోచారం మొ॥ అంశాలకు జన్మరాశి, జన్మ నక్షత్రాలు ముఖ్యమైనవి. (జన్మరాశి తెలియని వారు, అన్ని విషయాలలో నామ నక్షత్రమే చూసుకోవలసి ఉంటుంది).

యాత్ర, యుద్ధం, వివాహం, గృహప్రవేశం, క్షౌరం అనే అంశాల్లో జన్మచంద్రుడు దోషి, వివాహ విషయంలో “స్త్రీణాం జన్మత్రయం శ్రేష్టం” “పుంవివాహము దితం శుభం బుధై" అనే అనుకూలవచనాలు జన్మ నక్షత్రాన్ని కూడా అంగీకరిస్తున్నాయి. “చంద్రమా జన్మ చంద్రోపి జన్మర్ క్ష పరివర్జిత” మొదలైన వచనాలు జన్మనక్షత్రాన్ని నిషేధిస్తూ జన్మచంద్రుని అంగీకరిస్తున్నాయి.

నామ నక్షత్రం ప్రాధాన్యత
దేశ (అర్వణం), గ్రామ (అర్వణం), గృహ (ముఖద్వారార్వణం), యుద్ధ, సేవా (ఉద్యోగం) వ్యవహారాలకు నామరాశి, నామ నక్షత్రం ముఖ్యమైనవి.


స్త్రీ పురుషుల తారాబలం
వివాహం, గర్భాధానం, గృహప్రవేశం, (గృహిణి గృహముచ్యతే) మొదలైన స్త్రీ ప్రాధాన్యం గల కార్యాల్లో స్త్రీ పురుషులు ఇద్దరికి తారా బలాదులు చూడక తప్పదు. కుమారునికి ఉపనయనం మొదలైన ఇతర అంశాల్లో (కుమారునికి తండ్రికి తారాబలం చూడాలి) స్త్రీ (తల్లి) నక్షత్రానికి తారాబలం సరిపడకున్నను ఇబ్బంది లేదు అని భావన.

జన్మ నక్షత్ర విచారణ

బాలాన్న భుక్తౌవ్రత బంధనేకపి రాజ్యాభిషేకం ఖలు జన్మధిష్ట్యం
శుభత్వ నిష్టం సతతం వివాహే సీమంత యాత్రాధిషు మంగళేషు


జన్మనక్షత్రం అన్నప్రాశన, ఉపనయన, రాజ్యాభిషేకాలకు శుభప్రదం. వివాహ సీమంత యాత్రాదులకు నిషిద్ధం.

జన్మ నక్షత్రగ శ్చంద్ర ప్రశస్త సర్వ కర్మసు
క్షౌర భేషజ వాదాధ్వ కర్తనేషుచ వర్జయేత్


క్షౌరం, మందువాడడం, ప్రయాణం, చెవులు కుట్టడం అనే అంశాల్లో తప్ప తక్కిన విషయాలన్నింటిలో జన్మ నక్షత్రం శుభప్రదం.

శుభప్రద సర్వసిద్ధి యోగాలు
ఆదివారం : ఉత్తరాత్రయం (ఉత్తర, ఉత్తరాషాఢ, ఉత్తరాభాద్ర), అశ్విని, పుష్యమి, హస్త, మూల.
సోమవారం : రోహిణి, మృగశిర, పుష్యమి, అనురాధ, శ్రవణం.
మంగళవారం : అశ్విని, కృత్తిక, ఆశ్లేష, ఉత్తరాభాద్ర.
బుధవారం : కృత్తిక, రోహిణి, మృగశిర, హస్త, అనురాధ.
గురువారం : అశ్విని, పునర్వసు, పుష్యమి, అనురాధ, రేవతి.
శుక్రవారం : అశ్విని, పునర్వసు, అనురాధ, శ్రవణం, రేవతి.
శనివారం : రోహిణి, స్వాతి, శ్రవణం. ఇవన్నీ సర్వార్థ సిద్ధి యోగాలు, సర్వకార్యాలకు శుభప్రదాలు.


గ్రహణోత్పాతభ దోషం
భూకంపం, ధూమకేతువు, గ్రహణాలు మొదలైన ఉత్పాతాలు కలిగిన 7 రోజుల వరకు శుభకర్మలు చేయకూడదు. ఏ నక్షత్రంలో ఉత్పాతం జరుగుతుందో ఆ నక్షత్రాన్ని 6 మాసాల వరకు అన్ని రకాల ముహూర్తాలకు వదిలిపెట్టాలి. అర్థగ్రహణమైనా, గ్రస్తాస్తమైన సమయానికి ముందు మూడున్నర రోజులు, తరువాత మూడున్నర రోజులు, పూర్ణ గ్రస్తామైతే ముందు 7 రోజులు, తరువాత 7 రోజులు శుభకార్యాలకు పనికిరాదు. సంపూర్ణ గ్రహణమైన నక్షత్రం 6 నెలలు, అర్థగ్రహణమైన నక్షత్రాన్ని 3 మాసాలు విడవాలి.

నక్షత్ర అధిపతులు - దశా సంవత్సరములు

గ్రహములు - దశా నక్షత్రములు - దశాసం॥రాలు

రవి - కృత్తిక, ఉత్తర, ఉత్తరాషాఢ - 6 సం॥

చంద్ర - రోహిణి, హస్త, శ్రవణం - 10 సం॥

కుజ - మృగశిర, చిత్త, ధనిష్ఠ - 7 సం॥

రాహు - ఆరుద్ర, స్వాతి, శతభిష - 18 సం॥

గురు - పునర్వసు, విశాఖ, పూర్వాభాద్ర - 16 సం॥

శని - పుష్యమి, అనూరాధ, ఉత్తరాభాద్ర - 19 సం॥

బుధ - ఆశ్లేష, జ్యేష్ఠ, రేవతి - 17 సం॥

కేతు - అశ్వని, మఖ, మూల - 7 సం॥

శుక్ర - భరణి, పుబ్బ, పూర్వాషాఢ - 20 సం॥

9 గ్రహములు - 27 నక్షత్రాలు - 120 దశా సం॥


నక్షత్ర గోచారం
సకల గ్రహాలు రాశులను చూసినట్లే నక్షత్రాలను కూడా చూస్తుంటాయి. రవి, చంద్రులు తామున్న నక్షత్రం నుండి 14, 15 నక్షత్రాలను చూస్తారు. శని తానున్న నక్షత్రం నుండి 3, 15, 19 నక్షత్రాలను చూస్తాడు.

గురుడు తానున్న నక్షత్రం నుండి 10, 15, 19 నక్షత్రాలను చూస్తాడు. కుజుడు తానున్న నక్షత్రం నుండి 3, 7, 8, 15 నక్షత్రాలను, బుధ, శుక్రులు తామున్న నక్షత్రం నుండి 1, 15 నక్షత్రాలను చూస్తారు. పూర్ణచంద్రుని దృష్టి శుభాన్ని, క్షీణచంద్రుని దృష్టి అశుభ ఫలితాన్ని ఇస్తుంది.

రవి జన్మ నక్షత్రం లేదా నామ నక్షత్రాన్ని చూస్తుంటే రోగం, ధన నష్టం కలుగుతుంది. క్షీణ చంద్రుని దృష్టి మంచిది కాదు. కుజ దృష్టి అశుభ ఫలితాలను ఇస్తుంది. బుధ దృష్టి క్షేమాన్ని, లాభాన్ని కలిగిస్తుంది. శని దృష్టి వల్ల ఆపదలు, మరణం సంభవిస్తాయి. గురు, శుక్ర దృష్టి వల్ల శ్రేయస్సు, లాభం కలుగుతాయి.

రవి, చంద్రులు జన్మ లేదా నామ నక్షత్రాన్ని చూడటం మృత్యుప్రదం. రవి, కుజుల దృష్టి మృత్యుప్రదం. రవి, బుధుల దృష్టి కార్యభంగం. రవి, గురుల దృష్టి జయం, లాభం, సౌఖ్యం కలుగుతాయి. రవి, శుక్రుల దృష్టి మరణం. రవి, శనుల దృష్టి మృత్యుప్రదం. చంద్ర, కుజులు జన్మ లేదా నామ నక్షత్రాన్ని చూస్తుంటే అశుభం కలుగుతుంది.

బుధ, చంద్రుల దృష్టి వల్ల లాభం కలుగుతుంది. చంద్ర, శుక్రుల వీక్షణ వల్ల జయం, లాభం కలుగుతాయి. శని, చంద్రుల దృష్టి వల్ల మరణం కలుగుతుంది. గురు, బుధ దృష్టి వల్ల మరియు బుధ, శుక్ర వీక్షణం వల్ల విశేష లాభం, కార్య జయం కలుగుతాయి. బుధ, శనులు గాని, గురు, శనులు గాని చూడటం ఆలన కార్య నాశనం. శని, శుక్ర వీక్షణం వలన మృత్యుప్రదం కలుగుతాయి.

నాలుగు నైసర్గిక పాపగ్రహాలు జన్మ నక్షత్రాన్ని చూస్తుంటే తప్పక మరణం కలుగుతుంది. నాలుగు నైసర్గిక శుభ గ్రహాలు అంటే చంద్ర, బుధ, గురు, శుక్రులు చూస్తుంటే విశేష లాభం, సౌఖ్యం, జయం, అభివృద్ధి కలుగుతాయి.


నక్షత్రముల జన్మము
కశ్యప ప్రజాపతి భార్య దితి గర్భంలో జన్మించిన 27 మంది కుమార్తెలే 27 నక్షత్రాలు. వీరిలో రోహిణి, అనూరాధ, ధనిష్ఠ అతి సుందరమైనవారు.

రోహిణి ఈ ముగ్గురిలోనూ కూడా అందగత్తె. వారందరిని చూచి ముచ్చటపడి దక్షప్రజాపతి వారిని తన ఇంటికి తీసికొని వెళ్ళి తన బిడ్డలవలె పెంచాడు.

ఆ నక్షత్రముల పేర్లు - అశ్వని, భరణి, కృత్తిక, రోహిణి, మృగశిర, ఆరుద్ర, పునర్వసు, పుష్యమి, ఆశ్లేష, మఖ, పుబ్బ (పూర్వఫల్గుణి), ఉత్తర (ఉత్తర ఫల్గుణి), హస్త, చిత్త, స్వాతి, విశాఖ, అనూరాధ, జ్యేష్ఠ, మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ, శ్రవణము, ధనిష్ఠ, శతభిషము, పూర్వాబాధ్ర, ఉత్తరాబాధ్ర, రేవతి.

ఆ బిడ్డలకు తగిన వరుని కొరకు దక్షుడు మునులను సంప్రదించాడు. మునుల సలహా ప్రకారం దక్షుడు తన కుమార్తెలను చంద్రునికిచ్చి పెండ్లి చేశాడు. అందరిచేతను ఒక పూలమాల తయారు చేయించి చంద్రుని మెడలో వేయించాడు అని పురాణ కథనము.

విదేశీ ప్రయాణాలవైపు దారిచూపే నక్షత్రాలు
శనిగ్రహ నక్షత్రాలైన పుష్యమి, అనురాధ, ఉత్తరాభాద్ర

రాహుగ్రహ నక్షత్రాలైన ఆరుద్ర, స్వాతి, శతభిషం

గురుగ్రహ నక్షత్రాలైన పునర్వసు, విశాఖ, పూర్వాభాద్ర

చంద్రగ్రహ నక్షత్రాలైన రోహిణి, హస్త, శ్రవణం

ఇంకా చర నక్షత్రాలైన స్వాతి, పునర్వసు, శ్రవణం, ధనిష్ట, శతభిషం మొదలగు నక్షత్రాలు విదేశాలకు వెళ్ళాలనే కోరికను ప్రేరేపిస్తాయి అని నమ్మకం.

నక్షత్రాలు అవయవముల విభజన
జాతక చక్రంలో ఆయా నక్షత్రాలలో పాప గ్రహాలు ఉన్న, గ్రహాలు ఆయా నక్షత్రాలలో శుభత్వాన్ని కోల్పోయి, పాపగ్రహ వీక్షణ కలిగి పాప క్షేత్రాలలో ఉన్నప్పుడు ఆయా నక్షత్రాలకు సంబందించిన అవయవములకు చెందిన వ్యాధులు కలిగే అవకాశం ఉంది. నయం అయ్యే వ్యాధులు షష్టమ భావం ద్వారాను, నయం కాని వ్యాధులు అష్టమ భావం ద్వారాను, పంచమ భావానికి షష్టమ భావానికి సంబంధం ఉంటే వ్యాధి తొందరగా నయం అవుతుంది. అష్టమ భావానికి షష్టమ భావానికి సంబందం ఉంటే వ్యాధి తొందరగా నయం కాదు.

1) మేషరాశి : తల, మెదడు
అశ్విని నక్షత్రం 4 పాదాలు : తల, తలలోని పెద్ద మెదడులోని వెనుక భాగము.
భరణి నక్షత్రం 4 పాదాలు : తల, తలలోని పెద్ద మెదడులోని ముందు భాగము.
కృత్తిక 1 వ పాదం : మెదడు, మెదడులోని రక్త నాళాలు కళ్ళు విశేషించి కుడి కన్ను, దృష్టి.

2) వృషభరాశి : ముఖము నుండి మెడ వరకు
కృత్తిక 2,3,4 పాదములు : ముఖము, కుడి కన్ను, కను రెప్పలు.
రోహిణి నక్షత్రం 4 పాదాలు : కుడి కన్ను, నోరు, నాలుక, మెడ, చిన్న మెదడు, లాలాజలం.
మృగశిర నక్షత్రం 1,2 పాదాలు : గొంతుక, స్వరపేటిక, టాన్సిల్స్.

3)మిధునరాశి : మెడ నుండి ఛాతీ మద్య భాగం మరియు మెడ ఎముకలు.
మృగశిర నక్షత్రం 3,4 పాదాలు : చెవులు, భుజములు, మెడ, ముక్కు నుండి పోయే శ్వాస కోశములు, ముక్కు.
ఆరుద్ర నక్షత్రం 4 పాదాలు : చెవి లోపలి భాగాలు, మోచేయి పై భాగం.
పునర్వసు నక్షత్రం 1,2,3 పాదాలు : మెడ కింది భాగం, గొంతు కింద భాగం, ఆహార నాళిక ఆరంభ భాగం.

4) కర్కాటక రాశి : ఛాతీ భాగం
పునర్వసు నక్షత్రం 4 వ పాదం : ఛాతీ, ఊపిరితిత్తులు, స్తనములు.
పుష్యమి నక్షత్రం 4 పాదాలు : రెండు ప్రక్కల రిబ్స్ అనబడే ఎముకలు, ఊపిరితిత్తులు, వాటిలోనికి వెళ్ళే గాలి గొట్టాలు.
ఆశ్లేష నక్షత్రం 4 పాదాలు : ఆహార నాళం, ఛాతీకి సంబందించిన నరములు.

5) సింహరాశి : బొడ్డుపైన ఉన్న కడుపు, గుండె
మఖ నక్షత్రం 4 పాదాలు : గుండె, వీపు, వెన్నుముఖబొడ్డుపైన ఉన్న కడుపు లోపలి భాగములు కాలేయం, గాల్ బ్లాడర్.
పుబ్బ నక్షత్రం 4 పాదాలు : గుండె లోపల గదులు, వెన్నుముక, వెన్నుముకకు సంబందించిన వాల్వులు.
ఉత్తర 1 వ పాదం : గుండె పనిచేసే భాగాలు, వాల్వులుగుండే లోపలి రక్తం, గుండే నుండి ఊపిరితిత్తులకు పోవు శ్వాస కోశం.

6) కన్యారాశి: బొడ్డు కింద నున్న కడుపు భాగం.
ఉత్తర నక్షత్రం 2,3,4 పాదాలు : లివర్, క్లోమమ్, కడుపు భాగం, బొడ్డు, చిన్న ప్రేవులు.
హస్త నక్షత్రం 4 పాదాలు : రస గ్రంధులు,చిన్న ప్రేవులు, రసోత్పాదక క్రియలు.
చిత్తా నక్షత్రం 1,2 పాదాలు : పెద్ద ప్రేవులు, పొత్తి కడుపు, ఎపిండెక్స్.


7) తులా రాశి : మక్కలు, మూత్ర పిండాలు.
చిత్తా నక్షత్రం 2,3,పాదాలు : మూత్ర పిండాలు, మక్కలలోని కండరాలు, గజ్జలు, వెన్ను వెనక భాగం నడుము.
స్వాతి నక్షత్రం 4 పాదాలు : మూత్రకృచ్చం, మూత్ర నాళాలు, మూత్రం నందలి మలినాలు.
విశాఖ నక్షత్రం 1,2,3, పాదాలు : మూత్ర కృచ్చం లోపలి భాగాలు.

8) వృశ్చిక రాశి : బాహ్య జననేంద్రియాలు, గుదము, రెక్టమ్.
విశాఖ 4 వ పాదం : వీర్యోత్పత్తికి సంబందించిన గ్లాండ్ గర్భాశయం, జననేంద్రియాలు.
అనురాధా నక్షత్రం 4 పాదాలు : గుదము, రెక్టమ్, పొత్తి కడుపు, పెలోపి యన్ నాళములు.
జ్యేష్ట నక్షత్రం 4 పాదాలు : గర్భాశయం, దానికి సంబంధించిన నరాలు, అండములు.

9) ధనస్సు రాశి : మక్కల నుండి మోకాళ్ళ వరకు ఉన్న భాగములు.
మూల నక్షత్రం 4 పాదాలు : మక్కలు, తొడలు, సియాటిక నరాలు.
పూర్వాషాడ నక్షత్రం 4 పాదాలు : పిరుదులు, తొడల కింది భాగం, వెన్నుముక చివరి భాగం.
ఉత్తరాషాడ నక్షత్రం 1 వ పాదం : తొడల చివరి భాగం, అందలి రక్త నాళములు.

10) మకర రాశి : కాళ్ళు, చీల మండలు.
ఉత్తరాషాడ 2,3,4 పాదాలు : మోకాళ్ళు.
శ్రవణం 4 పాదాలు : మోకాలి చిప్పలు.
ధనిష్ట 1,2 పాదాలు : మోకాలి చిప్ప, మోకాళ్ళు, మోకాళ్ళలోని మజ్జ.

11) కుంభరాశి : చీలమండలు.
ధనిష్ట 3,4 పాదాలు : పిక్కలు, వాటి దిగువ భాగం.
శతభిషం 4 పాదాలు : చీల మండల ఎడమ భాగం.
పూర్వాభాద్ర 1,2,3, పాదాలు : చీల మండలు.

12) మీనరాశి : పాదాలు
పూర్వాభాద్రా నక్షత్రం 4 వ పాదం : చీల మండల వద్ద గల పాదముల అగ్రభాగం, మడమలు.
ఉత్తరాభాద్ర నక్షత్రం 4 పాదాలు : పాదాలు వీటికి సంబందించిన ఎముకలు.
రేవతి నక్షత్రం 4 పాదాలు : పాదాలలోని నరములు, పాదాల వ్రేళ్ళు.


తారాబలం దోష పరిహారాలు
చంద్రుడు మనకు ఏ తార ద్వారా కనపడతాడో ఆ తార మనకు జన్మ తార అవుతుంది. చంద్రుడు మనస్సుకి, నీటికి కారకుడు. నక్షత్రాన్ని బట్టి మనకు ప్రకృతి తెలుస్తుంది. మన జన్మతార మన మనస్సును నిర్ణయిస్తుంది. దాదాపుగా ఒకే నక్షత్రంలో ఉన్నవారు ఒకే విధమైన మానసిక చంచలత్వం కలగి ఉంటారు. చంద్రుడు 1,3,6,7,10,11 స్థానాలలో ఉన్నప్పుడు బలంగా ఉంటాడు.

జన్మ నక్షత్ర మారభ్య నిత్య నక్షత్ర గణ్యతే |
నవ సంఖ్యా హరద్భాగం శేషం ఫల మిదం శృణు ॥
జన్మ సంపద్విపత్ క్షేమ ప్రత్యక్సాధన నైధన |
మిత్రం పరమ మైత్రం చ నవతారాప్రకీర్తితా

జన్మ నక్షత్రం లేదా నామ నక్షత్రం నుండి లెక్కించి వచ్చిన దానిని తొమ్మిదిచే భాగించగా మిగిలిన శేషాన్ని బట్టి తొమ్మిది తారలు నిర్ణయిస్తారు.

శేషం 1 అయితే జన్మతార అని, శేషం 2 అయితే సంపత్ తార అని, శేషం 3 అయితే విపత్ తార అని, శేషం 4 అయితే క్షేమతార అని, శేషం 5 అయితే ప్రత్యక్ తార అని, శేషం 6 అయితే సాధనతార అని, శేషం 7 అయితే నైధన తార అని, శేషం 8 అయితే మిత్రా తార అని, శేషం 9 అయితే పరమమిత్ర తార అని నిర్ణయిస్తారు.


నవతారల ఫలాలు
జన్మతార దేహ నాశనాన్ని, సంపత్తార సంపదను, విపత్తార కష్టాలను, క్షేమతార క్షేమాన్ని, ప్రత్యక్తార కార్య నాశనాన్ని, సాధనతార కార్య సాధనాన్ని, నైధన తార మరణాన్ని, మిత్రతార సుఖసంపదలను, పరమ మైత్ర తార ధన లాభాన్ని కలిగిస్తాయి.

వివాహానికి ప్రత్యక్తారలలో ముహూర్తం పెట్టుకోవచ్చు. జన్మ తారలలోను పెట్టుకోవచ్చును. విపత్, నైధన తారలను వదిలిపెట్టాలి.

ప్రధమ నవకంలో జన్మతారను, ద్వితీయ నవకంలో విపత్తారను, తృతీయ నవకంలో ప్రత్యక్తారను, మూడు నవకాలలో నైధనతారను విడిచి పెట్టాలి.

తారాదోష పరిహారమునకు చేయవలసిన దానాలు
తారా దోష పరిహారానికి అంటే తారల వల్ల కలిగే నష్టాలు పోవటానికి ఈ క్రింది దానాలు చేయాలి అని చెబుతారు.

జన్మతార, విపత్తార, ప్రత్యక్తార, నైధన తారలు అశుభాన్ని కలిగిస్తాయి. ఆ తారల దోష పరిహారార్ధం ఈ క్రింది దానాలు చేయాలి.

జన్మతారకు ఆకుకూరలు, విపత్తారకు బెల్లం, ప్రత్యక్ తారకు ఉప్పు, నైధన తారకు నువ్వులతో కూడిన బంగారం దానంగా ఇవ్వాలి. దానం ప్రకృతికి చేస్తే మంచిది. ఉదా : ఉప్పును కొబ్బరి చెట్టుకి పోస్తే మంచిది. దానం చేసేది వ్యక్తులకు ఉపయోగపడాలి. దానం పొందిన వారి ద్వారా మనకు పుణ్యబలం వస్తుంది. దానం చేసే స్థోమత లేనప్పుడు మనస్సులోనే దానం చేసినట్లు భావించాలి.


జన్మనక్షత్రం, నామనక్షత్రాలలో ఏది ప్రధానము
జ్యోతిష ఫలితాల కొరకు సాధారణంగా నక్షత్రాలను పరిశీలుస్తుంటారు. ఎవరిది ఏ నక్షత్రమో తెలుసుకోడానికి రెండు పద్దతులున్నాయి.

1. జన్మ నక్షత్రము. 2. నామ నక్షత్రము. జన్మ నక్షత్రం అనగా పుట్టిన సమయాన్ని బట్టి నక్షత్రాన్ని తెలుసుకోవడము. పేరును బట్టి నక్షత్రాన్ని తెలుసుకోవడము. రెండింటిలో ఏది ప్రధానము అనే విషయాని కొస్తే రెండు ప్రధానమే. రెండిటికి వేర్వేరు ప్రయోజనాలున్నాయి.

దేశజ్వరే గ్రామ గృహ ప్రవేశే, సేవాను, యుడ్డే, వ్యవహార, కారయే
ద్యూతేషు, దానేషుచ నామ రాశి యాత్రా వివాహ దిషు జన్మ రాశి ॥


అనగా దేశ సంభందమైన, అనారోగ్య విషయం, గ్రామ ప్రవేశము, గృహ ప్రవేశము, యుద్ధ ప్రారంభానికి మొదలగు విషయాలకు నామ నక్షత్రాన్ని, యాత్రలకు వెళ్ళేటప్పుడు, వివాహము మొదలగు విషయములలో జన్మ నక్షత్రాన్ని చూడాలని పై శ్లోకంలో నిర్దేశించారు


నామ నక్షత్రం తెలుసుకునే పద్ధతి

అశ్వని : చూ/చే/చో/ లా
భరణి : లీ/లూ/లే/లో
కృత్తిక : /ఆ
ఈ మూడింటికి మేష రాశి.

కృత్తిక : ఈ/ఊ/ ఏ
రోహిణి : ఈ/వా/వీ/వూ
మృగశిర : వే/వో
ఈ మూడింటికి వృషభ రాశి.

మృగశిర : కా/కీ,
ఆరుద్ర : కూ/ ఖం/ జ/ ఛా
పునర్వసు: కే/కో/ హ
ఈ మూడింటికి మిధున రాశి.

పునర్వసు : / హీ/
పుష్యమి : హు/హే/హో/డా
ఆశ్లేష : డీ/డూ/డే/డో
వీటికి కర్కాటక రాశి.

మఖ : /మా,/ మి,/ మూ, /మే
పూర్వ ఫల్గుణి : మో, /టా/టీ,/ టూ
ఉత్తర ఫల్గుణి : / టే/
ఈ మూడింటికి సింహ రాశి.

ఉత్తర ఫల్గుణి : /టో,/ పా, /పీ,
హస్త : /వూ, /షం, /ణా,/ ఢా
చిత్త : /పే/పో
ఈ మూడింటికి కన్యారాశి.

చిత్త : /రా/రి
స్వాతి : /రూ,/ రే, రో, /లా
విశాఖ : /తీ, /తూ, /తే
ఈ మూడింటికి తులా రాశి.

విశాఖ : /తో,/
అనూరాధ : /నా, /నీ, /నూ, /నే
జ్యేష్ఠ : /నో, /యా, /యీ,/యూ
ఈ మూడింటికి వృశ్చిక రాశి.

మూల : /యే, /యో, /బా,/ బీ
పూర్వాషాడ : /బూ, ధా, భా, ఢా
ఉత్తరాషాడ : /బే
ఈ మూడింటికి ధనస్సు రాశి.

ఉత్తరాషాఢ : /బో, / జా, / జీ,
శ్రవణం : /జూ, జే, జో/, ఖా,
ధనిష్ట : /గా,/ గీ
ఈ మూడింటికి మకర రాశి.

ధనిష్టః : /గూ, /గే,
శతభిషం : / గో, /సా,/ సీ, /సూ
పూర్వాభద్ర : / సే, /సో,/ దా ఈ
మూడింటికి కుంభ రాశి.

పూర్వాభాద్ర : /దీ,
ఉత్తరాబాధ్ర : ధు/శ్చం/చా/ధా
రేవతి : /దే,/దో, /చా, /చీ ఈ మూడింటికి మీన రాశి.

ఇందులో లేని అక్షరాలతో మొదలయ్యే పేర్లకు

కృష్ణుడు - మృగశిర 3వ పాదం - మిథునరాశి;

ద్రోణ : స్వాతి 1వ పాదం - తులారాశి;

ద్రౌపది - స్వాతి 3వ పాదం - తులారాశి ;

బ్రహ్మ - చిత్త 3వ పాదం - తులారాశి;

ప్రభాకర - చిత్త 4వ పాదం - తులారాశి;

శ్రీధర - చిత్త 4వ పాదం - తులారాశి;

క్షేత్రపాల - హస్త 2వ పాదం - కన్యారాశి;

భీమ - మూల 3వ పాదం - ధనస్సు రాశి;

భైరవ - పూ.షా. 3వ పాదం - ధనస్సు రాశి.


ఏ నక్షత్రం వారు ఆ నక్షత్ర గాయత్రి ని రోజుకు 9 సార్లు పఠించాలి

1. అశ్విని :
ఓం శ్వేతవర్లై విద్మహే సుధాకరాయై ధీమహి 
తన్నో అశ్వినేన ప్రచోదయాత్

2. భరణి :
ఓం కృష్ణవర్నై విద్మహే దండధరాయై ధీమహి 
తన్నో భరణి: ప్రచోదయాత్

3. కృత్తికా :
ఓం వణ్ణిదేహాయై విద్మహే మహాతపాయై ధీమహి 
తన్నో కృత్తికా ప్రచోదయాత్

4. రోహిణి :
ప్రజావిరుద్దై చ విద్మహే విశ్వరూపాయై ధీమహి 
తన్నో రోహిణి ప్రచోదయాత్

5. మృగశిరా :
ఓం శశిశేఖరాయ విద్మహే మహారాజాయ ధీమహి 
తన్నో మృగశిర: ప్రచోదయాత్

6. ఆర్ద్రః :
ఓం మహాశ్రేష్ఠాయ విద్మహే పశుం తనాయ ధీమహి 
తన్నో ఆర్ద్రః ప్రచోదయాత్

7. పునర్వసు :
ఓం ప్రజా వరుద్దైచ విద్మహే అదితి పుత్రాయ ధీమహి 
తన్నో పునర్వసు ప్రచోదయాత్

8. పుష్యమి :
ఓం బ్రహ్మవర్చసాయ విద్మహే మహాదిశాయాయ ధీమహి 
తన్నో పుష్య:ప్రచోదయాత్

9. ఆశ్లేష :
ఓం సర్పరాజాయ విద్మహే మహారోచకాయ ధీమహి 
తన్నో ఆశ్లేష: ప్రచోదయాత్

10. మఖ :
ఓం మహా అనగాయ విద్మహే పిత్రియాదేవాయ ధీమహి 
తన్నో మఖ: ప్రచోదయాత్

11. పుబ్బ :
ఓం అరియంనాయ విద్మహే పశుదేహాయ ధీమహి 
తన్నో పూర్వఫల్గుణి ప్రచోదయాత్

12. ఉత్తరా :
మహాబకాయై విద్మహే మహాశ్రేష్టాయై ధీమహి 
తన్నో ఉత్తర ఫల్గుణి ప్రచోదయాత్

13. హస్త :
ఓం ప్రయచ్చతాయై విద్మహే ప్రకృప్రణీతాయై ధీమహి 
తన్నో హస్తా ప్రచోదయాత్

14. చిత్త :
ఓం మహాదృష్టాయై విద్మహే ప్రజారపాయై ధీమహి 
తన్నో చైత్రా: ప్రచోదయాత్

15. స్వాతి :
ఓం కామసారాయై విద్మహే మహానిష్ఠాయై ధీమహి 
తన్నో స్వాతి ప్రచోదయాత్

16. విశాఖ :
ఓం ఇంద్రాగ్నేస్యై విద్మహే మహాశ్రేష్టాయై చ ధీమహీ 
తన్నో విశాఖ ప్రచోదయాత్

17. అనూరాధ :
ఓం మిత్రదేయాయై విద్మహే మహామిత్రాయ ధీమహి 
తన్నో అనూరాధా ప్రచోదయాత్

18. జ్యేష్ఠా : 
ఓం జ్యేష్ఠాయై విద్మహే మహాజ్యేష్ఠాయై ధీమహి 
తన్నో జ్యేష్ఠా ప్రచోదయాత్

19. మూల : 
ఓం ప్రజాధిపాయై విద్మహే మహాప్రజాధిపాయై ధీమహి 
తన్నో మూలా ప్రచోదయాత్

20. పూర్వాషాఢ : 
ఓం సముద్ర కామాయై విద్మహే మహాబీజితాయై ధీమహి 
తన్నో పూర్వాషాఢా ప్రచోదయాత్

21. ఉత్తరాషాఢ : 
ఓం విశ్వేదేవాయ విద్మహే మహాషాఢాయ ధీమహి 
తన్నో ఉత్తరాషాఢా ప్రచోదయాత్

22. శ్రవణ : 
ఓం మహాశ్రేష్ఠాయై విద్మహే పుణ్యశ్లోకాయ ధీమహి 
తన్నో శ్రవణ ప్రచోదయాత్

23. ధనిష్టా : 
ఓం అగ్రనాథాయ విద్మహే వసూప్రితాయ ధీమహి 
తన్నో శర్విష్టా ప్రచోదయాత్

24. శతభిషం : 
ఓం భేషజాయ విద్మహే వరుణదేహాయ ధీమహి 
తన్నో శతభిషా ప్రచోదయాత్

25. పూర్వాభాద్ర : 
ఓం తేజస్కరాయ విద్మహే అజరక పాదాయ ధీమహి 
తన్నో పూర్వప్రోష్టపత ప్రచోదయాత్

26. ఉత్తరాభాద్ర : 
ఓం అహిరబుధ్నాయ విద్మహే ప్రతిష్ఠాపనాయ ధీమహి 
తన్నో ఉత్తరప్రోష్టపత ప్రచోదయాత్

27. రేవతి : 
ఓం విశ్వరూపాయ విద్మహే పూష్ణ దేహాయ ధీమహి 
తన్నో రేవతి ప్రచోదయాత్

నక్షత్రాలు - గ్రహాధిపతులు
27 నక్షత్రాలకు తొమ్మిది గ్రహాల్ని అధిపతులుగా చెబుతూ వాటికి సంబంధించిన దశాసంవత్సరాల్ని ఈ విధంగా కేటాయించారు.

అశ్విని, మఖ, మూలా నక్షత్రాలకు కేతువు అధిపతి. ఈ నక్షత్రాల్లో ఎవరు జన్మించినా వారి జన్మదశ కేతుమహర్దశ అవుతుంది. అదే విధంగాభరణి, పుబ్బ, పూర్వాషాఢ నక్షత్రాలకు శుక్రుడు అధిపతి.

కృత్తిక, ఉత్తర, ఉత్తరాషాఢ నక్షత్రాలకు - రవి అధిపతి.

రోహిణి, హస్త, శ్రవణంలకు చంద్రుడు - అధిపతి.

మృగశిర, చిత్త, ధనిష్టా నక్షత్రాలకు - కుజుడు అధిపతి.

ఆరుద్ర, స్వాతి, శతభిషంలకు - రాహువు అధిపతి.

పునర్వసు, విశాఖ, పూర్వాభాద్ర నక్షత్రాలకు - గురువు అధిపతి.

పుష్యమి, అనురాధ, ఉత్తరాభాద్ర నక్షత్రాలకు - శని అధిపతి.

ఆశ్లేషా, జ్యేష్ఠా, రేవతి నక్షత్రాలకు - బుధుడు అధిపతి.


నక్షత్రములు - దర్శించవలసిన ఆలయములు
ప్రతి వ్యక్తి 27 నక్షత్రాలలో ఉన్న 108 పాదాలలో ఏదో ఒక దానిలో జన్మిస్తారు. ప్రతి నక్షత్రానికి దానికి సంబంధించిన ప్రతి పాదానికి సంబంధించి ప్రత్యేకమైన ఆలయం ఉంటుంది. గ్రహదోష నివారణ కోసం అభిషేకాలు చేయదలుచుకున్న వారికి ఆ ప్రత్యేకమైన ఆలయంలో మొదట నామ నక్షత్రము, లేదా జన్మనక్షత్రానికి తరువాత రాశికి సంబంధించిన లింగ ఆరాధన చేసి చివరకు ద్రాక్షారామం దర్శించుకుంటే ఫలితం కలుగగలదని ఒక విశ్వాసము.

మేషరాశి నుండి మీనరాశి వరకు అదే క్రమంలో ఆరాధించ వలసిన ఆలయాలు ఆ ఆలయాలు ఉన్న ప్రదేశాలు, ఆ ఆలయంలో కొలువైన అమ్మవార్ల, స్వామివార్ల వివరాలు ఇచ్చట పొందుపర్చడం జరిగింది.

మేష రాశి - నక్షత్రములు - దర్శించవలసిన ఆలయములు

మేష రాశి :మేషరాశికి సంబంధించిన ఆలయం ద్రాక్షారామ భీమేశ్వర స్వామి వారి ఆలయానికి తూర్పున విలాసగంగావరంలో వుంది.

అశ్విని నక్షత్రం : మొదటి పాదం – బ్రహ్మపురిలో వేంచేసి ఉన్న శ్రీశ్రీశ్రీ అన్నపూర్ణ సమేత విశ్వేశ్వరస్వామి.
రెండవ పాదం – ఉట్రుమిల్లిలో వేంచేసి ఉన్న శ్రీ బాలాత్రిపురసుందరీ సమేత శ్రీ భీమశంకర స్వామి.
మూడవ పాదం – కుయ్యూరులో వేంచేసి ఉన్న శ్రీ బాలాత్రిపురసుందరీ సమేత శ్రీ మల్లేశ్వర స్వామి.
నాలుగవ పాదం – దుగ్గుదూరులో వేంచేసి ఉన్న శ్రీశ్రీశ్రీ పార్వతీ సమేత శ్రీ మల్లేశ్వర స్వామి.

భరణి నక్షత్రం : మొదటి పాదం – కోలంకలో వేంచేసి ఉన్న శ్రీ ఉమా సమేత శ్రీ సోమేశ్వర స్వామి.
రెండవ పాదం – ఎంజారంలో వేంచేసి ఉన్న శ్రీ ఉమా సమేత కృపేశ్వర స్వామి.
మూడవ పాదం – పల్లిపాలెంలో వేంచేసి ఉన్న శ్రీ గంగా పార్వతీ సమేత శ్రీ విశ్వేశ్వర స్వామి.
నాలుగవ పాదం – ఉప్పంగళలో వేంచేసి ఉన్న శ్రీ పార్వతీ సమేత రామలింగేశ్వర స్వామి.

కృత్తికా నక్షత్రం : మొదటి పాదం – నేలపల్లిలో వేంచేసి ఉన్న శ్రీ మీనాక్షి దేవి సమేత శ్రీ నీలకంఠేశ్వర స్వామి.


వృషభ రాశి - నక్షత్రములు - దర్శించవలసిన ఆలయములు
వృషభ రాశి : ద్రాక్షారామంలోని భీమేశ్వర స్వామి ఆలయానికి తూర్పున వృషభరాశికి సంబంధించిన ఆలయం విలాస గంగావరంలో ఉన్నది.

కృత్తికా నక్షత్రం : రెండవ పాదం – అదంపల్లిలో వేంచేసి ఉన్న శ్రీ పార్వతీ సమేత శ్రీ మల్లేశ్వర స్వామి.
మూడవ పాదం – వట్రపూడిలో వేంచేసి ఉన్న శ్రీ పార్వతీ సమేత శ్రీ సోమేశ్వర స్వామి.
నాలుగవ పాదం – ఉండూరులో వేంచేసి ఉన్న శ్రీ ఉమా సమేత శ్రీ మార్కండేయ స్వామి.

రోహిణీ నక్షత్రం : మొదటి పాదం – తనుమల్లలో వేంచేసి ఉన్న శ్రీ పార్వతీ సమేత శ్రీ నీలకంఠేశ్వర స్వామి.
రెండవ పాదం – కాజులూరులో వేంచేసి ఉన్న శ్రీ అన్నపూర్ణేశ్వరీ సమేత శ్రీ విశ్వేశ్వర స్వామి.
మూడవ పాదం – ఐతపూడిలో వేంచేసి ఉన్న శ్రీ అన్నపూర్ణా సమేత శ్రీ రామలింగేశ్వర స్వామి.
నాలుగవ పాదం – చీలలో వేంచేసి ఉన్న శ్రీ ఉమాసమేత శ్రీ రామలింగేశ్వర స్వామి.

మృగశిర నక్షత్రం : మొదటిపాదం – తాళ్ళరేవులో వేంచేసి ఉన్న శ్రీ భద్రకాళీ సమేత శ్రీ వీరేశ్వర స్వామి.
రెండవ పాదం – గురజానపల్లిలో వేంచేసి ఉన్న శ్రీ ఓం శ్రీ సర్వమంగళ అన్నపూర్ణ సమేత శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామి.



మిధున రాశి - నక్షత్రములు - దర్శించవలసిన ఆలయములు
ద్రాక్షారామంలోని భీమేశ్వర స్వామి ఆలయానికి ఈశాన్యమున మిధున రాశికి సంబంధించిన ఆలయం హసనాబాద్లో ఉన్నది.

మృగశిర నక్షత్రం : మూడవ పాదం – అంద్రగ్గిలో వేంచేసి ఉన్న శ్రీ పార్వతీ సమేత శ్రీ మల్లేశ్వర స్వామి.
నాలుగవ పాదం – జగన్నాధగిరిలో వేంచేసి ఉన్న శ్రీ అన్నపూర్ణా సమేత శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామి.

ఆరుద్ర నక్షత్రం : మొదటి పాదం – పనుమళ్ళలో వేంచేసి ఉన్న శ్రీ పార్వతీ సమేత శ్రీ సోమేశ్వర స్వామి.
రెండవ పాదం – గొల్లపాలెంలో వేంచేసి ఉన్న శ్రీ పార్వతీ సమేత గోకర్ణేశ్వర స్వామి.
మూడవ పాదం – వేములవాడలో వేంచేసి ఉన్న శ్రీ మాణిక్యాంబా సమేత శ్రీ భీమేశ్వర స్వామి.
నాలుగవ పాదం – కూరాడలో వేంచేసి ఉన్న శ్రీ భద్రకాళీ సమేత వీరభద్ర స్వామి.

పునర్వసు నక్షత్రం : మొదటి పాదం – గొర్రిపూడి (భీమలింగపాడు)లో వేంచేసి ఉన్న శ్రీ పార్వతీ సమేత శ్రీ భీమేశ్వర స్వామి.
రెండవ పాదం – కరపశ్రీలో వేంచేసి ఉన్న పార్వతవర్ధి సమేత శ్రీ రామ లింగేశ్వర స్వామి.
మూడవ పాదం – ఆరట్లకట్లలో వేంచేసి ఉన్న శ్రీ భ్రమరాంబా సమేత శ్రీ మల్లీశ్వర స్వామి.

కర్కాటక రాశి - నక్షత్రములు - దర్శించవలసిన ఆలయములు
ద్రాక్షారామంలోని భీమేశ్వర స్వామి ఆలయానికి ఉత్తరమున కర్కాటక రాశికి సంబంధించిన ఆలయం ఉన్నది. ఇక్కడి ఆలయం వెల్లలో శ్రీ ఉత్తర సోమేశ్వర స్వామి వారికి అంకితం.

పునర్వసు నక్షత్రం : నాలుగవ పాదం – యెనమాడలలో వేంచేసి ఉన్న శ్రీ పార్వతీ సమేత శ్రీ మల్లేశ్వర స్వామి.

పుష్యమి నక్షత్రం : మొదటి పాదం – కాపవరంలో వేంచేసి ఉన్న శ్రీ భద్రకాళీ సమేత శ్రీ వీరేశ్వర స్వామి.
రెండవ పాదం – సిరిపురంలో వేంచేసి ఉన్న శ్రీ భద్రకాళీ సమేత శ్రీ వీరేశ్వర స్వామి.
మూడవ పాదం – వేలంగి శ్రీ బాలాత్రిపురసుందరీ సమేత శ్రీ భవానీ శంకర స్వామి.
నాలుగవ పాదం – ఓడూరులో వేంచేసి ఉన్న శ్రీ బాలాత్రిపురసుందరీ సమేత శ్రీ భవానీ శంకర స్వామి.

ఆశ్లేష నక్షత్రం : మొదటి పాదం – దోమాడలో వేంచేసి ఉన్న శ్రీ ఉమా సమేత శ్రీ మార్కండేశ్వర స్వామి.
రెండవ పాదం – పెదపూడిలో వేంచేసి ఉన్న శ్రీ శ్యామలాంబా సమేత శ్రీ సోమేశ్వర స్వామి.
మూడవ పాదం – గండ్రాడులో వేంచేసి ఉన్న శ్రీ ఉమా సమేత శ్రీ సోమేశ్వర స్వామి.
నాలుగవ పాదం – మామిడాడలో వేంచేసి ఉన్న శ్రీ మాణిక్యాంబా సమేత శ్రీశ్రీ భీమేశ్వర స్వామి.


సింహ రాశి - నక్షత్రములు - దర్శించవలసిన ఆలయములు
ద్రాక్షారామంలోని భీమేశ్వర స్వామి ఆలయానికి ఉత్తరమున సింహ రాశికి సంబంధించిన ఆలయం ఉన్నది. ఇక్కడి ఆలయం వెల్లలో శ్రీ ఉత్తర సోమేశ్వర స్వామి వారికి అంకితం.

మఖ నక్షత్రం : మొదటి పాదం-నరసరావుపేటలో వేంచేసి ఉన్న శ్రీ పార్వతీ సమేత శ్రీ మల్లేశ్వర స్వామి.
రెండవ పాదం - మెల్లూరులో వేంచేసి ఉన్న శ్రీ విశాలాక్షీ సమేత శ్రీ విశ్వేశ్వర స్వామి.
మూడవ పాదం - అరికిరేవులో వేంచేసి ఉన్న శ్రీ అన్నపూర్ణా సమేత శ్రీ విశ్వేశ్వర స్వామి.
నాలుగవ పాదం - కొత్తూరులో వేంచేసి ఉన్న శ్రీ పార్వతీ సమేత శ్రీ నాగలింగేశ్వర స్వామి.

పుబ్బ నక్షత్రం : మొదటి పాదం - చింతపల్లిలో వేంచేసి ఉన్న శ్రీ భద్రకాళీ సమేత వీరేశ్వర స్వామి.
రెండవ పాదం - వెదురుపాకలో వేంచేసి ఉన్న శ్రీ భద్రకాళీ సమేత వీరేశ్వర స్వామి.
మూడవ పాదం - తొస్సిపూడిలో వేంచేసి ఉన్న శ్రీ బాలాత్రిపురసుందరీ సమేత శ్రీ గోరేశ్వర స్వామి.
నాలుగవ పాదం - పొలమూరులో వేంచేసి ఉన్న ఉమా సమేత శ్రీరామలింగేశ్వర స్వామి.

ఉత్తరాభాద్ర నక్షత్రం : మొదటి పాదం- పందలపాకలో వేంచేసి ఉన్న శ్రీ పార్వతీ సమేత శ్రీ సోమేశ్వర స్వామి.


కన్యా రాశి - నక్షత్రములు - దర్శించవలసిన ఆలయములు
ద్రాక్షారామంలోని భీమేశ్వర స్వామి ఆలయానికి వాయవ్యమున కన్యా రాశికి సంబంధించిన ఆలయం ఉన్నది. ఈ ఆలయం యూరు పల్లిలోని శ్రీ రాజరాజేశ్వరీ సమేత నీలకంఠేశ్వర స్వామి వారికి అంకితం చేయబడ్డది.

ఉత్తరాభాద్ర నక్షత్రం : రెండవపాదం - చోడవరంలో వేంచేసి ఉన్నశ్రీ పార్వతీ సమేత శ్రీఅగస్తేశ్వర స్వామి.
మూడవ పాదం - నదురుబాడులో వేంచేసి ఉన్న శ్రీ పార్వతీ సమేత శ్రీమల్లేశ్వర స్వామి.
నాలుగవ పాదం - పసలపూడిలో వేంచేసి ఉన్న శ్రీ మాణిక్యాంబా సమేత శ్రీ రాజరాజేశ్వరుడు.

హస్తా నక్షత్రము : మొదటి పాదం - సోమేశ్వరంలో వేంచేసి ఉన్న శ్రీ బాలాత్రిపుర సుందరీ సమేత శ్రీ సోమేశ్వర స్వామి.
రెండవ పాదం - పడపర్తిలో వేంచేసి ఉన్న శ్రీ పార్వతీ సమేత శ్రీ రామలింగేశ్వరుడు.
మూడవ పాదం - పులగుర్తలో వేంచేసి ఉన్న శ్రీ పార్వతీసమేత శ్రీ వీరేశ్వర స్వామి.
నాలుగవ పాదం - మాచవరంలో వేంచేసి ఉన్న శ్రీ భద్రకాళీ సమేత శ్రీ వీరేశ్వర స్వామి.

చిత్త నక్షత్రం : మొదటి పాదం - కొప్పవరంలో వేంచేసి ఉన్న శ్రీ పార్వతీ సమేత శ్రీ రామలింగేశ్వర స్వామి.
రెండవ పాదం - అర్థమూరులో వేంచేసి ఉన్న శ్రీ పార్వతీ సమేత శ్రీ అగస్తేశ్వర స్వామి.


తులా రాశి - నక్షత్రములు - దర్శించవలసిన ఆలయములు
ద్రాక్షారామానికి పడమరగా వున్న ఆదివారపుపేటలో తులారాశికి సంబంధించిన ఆలయం ఉన్నది.

చిత్త నక్షత్రం : మూడవ పాదం – చల్లూరులో వేంచేసి ఉన్న శ్రీ బాలాత్రిపురసుందరీ సమేత శ్రీ అగస్తేశ్వర స్వామి.
నాలుగవ పాదం – కాలేరులో వేంచేసి ఉన్న శ్రీ రాజరాజేశ్వరీ సమేత శ్రీ మల్లేశ్వర స్వామి.

స్వాతి నక్షత్రం : మొదటి పాదం – మారేడుబాకలో వేంచేసి ఉన్న శ్రీ పార్వతీ సమేత మల్లేశ్వర స్వామి.
రెండవ పాదం – మండపేటలో వేంచేసి ఉన్న శ్రీ బాలాత్రిపురసుందరీ సమేత శ్రీ అగస్తేశ్వర కైలాసేశ్వర స్వామి.
మూడవ పాదం – గుమ్మిలూరులో వేంచేసి ఉన్న శ్రీ ఉమాసమేత శ్రీ రామలింగేశ్వర స్వామి.
నాలుగవ పాదం – వెంటూరులో వేంచేసి ఉన్న శ్రీ పార్వతీ సమేత శ్రీ సోమేశ్వర స్వామి.

విశాఖ నక్షత్రం : మొదటి పాదం – దూళ్ళలో వేంచేసి ఉన్న శ్రీ బాలాత్రిపురసుందరీ సమేత శ్రీ అగస్తేశ్వర స్వామి.
రెండవ పాదం – నర్సిపూడిలో వేంచేసి ఉన్న శ్రీ పార్వతీ సమేత సోమేశ్వర స్వామి.
మూడవ పాదం – నవాబుపేటలో వేంచేసి ఉన్న శ్రీ పార్వతీ సమేత సోమేశ్వరస్వామి.


వృశ్చిక రాశి - నక్షత్రములు - దర్శించవలసిన ఆలయములు
వృశ్చిక రాశి : ద్రాక్షారామానికి పడమరగా వున్న ఆదివారపుపేటలో వృశ్చికరాశికి సంబంధించిన ఆలయం ఉన్నది. ఈ ఆలయం శ్రీ పార్వతీ సమేత పరమేశ్వరునికి అంకితం.

విశాఖ నక్షత్రం : నాలుగవ పాదం – కూర్మపురంలో వేంచేసి ఉన్న శ్రీ పార్వతీ సమేత శ్రీ రామలింగేశ్వర స్వామి.

అనురాధ నక్షత్రం : మొదటి పాదం – పనికేరులో వేంచేసి ఉన్న శ్రీ బాలాత్రిపురసుందరీ సమేత శ్రీ ఇష్టకాంతేశ్వర స్వామి.
రెండవ పాదం – చింతలూరులో వేంచేసి ఉన్న శ్రీ పార్వతీ సమేత శ్రీ పృధ్వీశ్వర స్వామి.
మూడవ పాదం – పినపల్లలో వేంచేసి ఉన్న శ్రీ పార్వతీ సమేత శ్రీనీలకంఠేశ్వర స్వామి.
నాలుగవ పాదం – పెదపల్లలో వేంచేసి ఉన్న శ్రీ పార్వతీ సమేత శ్రీరామలింగేశ్వర స్వామి.

జ్యేష్టా నక్షత్రం : మొదటి పాదం – వడ్లమూరులో వేంచేసి ఉన్న శ్రీ పార్వతీ సమేత శ్రీ వీరేశ్వర స్వామి.
రెండవ పాదం – నల్లూరులో వేంచేసి ఉన్న శ్రీ రాజరాజేశ్వరీ సమేత శ్రీసోమేశ్వర స్వామి.
మూడవ పాదం – వెదురుమూడిలో వేంచేసి ఉన్న శ్రీ పార్వతీ సమేత శ్రీ మల్లేశ్వర స్వామి.
నాలుగవ పాదం – తేకిశ్రీలో వేంచేసి ఉన్న పార్వతీ సమేత శ్రీ సోమేశ్వర స్వామి.


ధనుస్సు రాశి - నక్షత్రములు - దర్శించవలసిన ఆలయములు
ధనుస్సు రాశి : ధనుస్సు రాశికి సంబంధించిన ఆలయం ద్రాక్షారామానికి నైఋతిలో ఉన్నది. నేలపర్తిపాడులోని శ్రీ అన్నపూర్ణా సమేత కాశీవిశ్వేశ్వర స్వామికి అంకితం.

మూల నక్షత్రం : మొదటి పాదం – యెండగండిలో వేంచేసి ఉన్న శ్రీ రాజరాజేశ్వరీ సమేత శ్రీ సోమేశ్వర స్వామి.
రెండవ పాదం – పామర్రులో వేంచేసి ఉన్న శ్రీ ఉమాపార్వతీ సమేత శ్రీ సోమేశ్వర స్వామి.
మూడవ పాదం – అముజూరులో వేంచేసి ఉన్న శ్రీ ఉమాపార్వతీ సమేత శ్రీ సోమేశ్వర స్వామి.
నాలుగవ పాదం – పానంగిపల్లిలో వేంచేసి ఉన్న శ్రీ లలితాంబికా సమేత శ్రీ ఉత్తరేశ్వర స్వామి.

పూర్వాషాఢ నక్షత్రం : మొదటి పాదం – అంగరలో వేంచేసి ఉన్న శ్రీ పార్వతీ సమేత శ్రీ కనక లింగేశ్వర స్వామి.
రెండవ పాదం – కోరుమిళ్ళలో వేంచేసి ఉన్న శ్రీ రాజరాజేశ్వరీ సమేతశ్రీ సోమేశ్వర స్వామి.
మూడవ పాదం – కుళ్ళలో వేంచేసి ఉన్న శ్రీ పార్వతీ సమేత శ్రీ సోమేశ్వర స్వామి.
నాలుగవ పాదం – వాకతిప్పలో వేంచేసి ఉన్న శ్రీ ఉమాసమేత రామ లింగేశ్వర స్వామి.

ఉత్తరాషాఢ నక్షత్రం : మొదటి పాదం తాతపూడిలో వేంచేసి ఉన్న శ్రీ పార్వతీ సమేత శ్రీ మల్లేశ్వర స్వామి.


మకర రాశి - నక్షత్రములు - దర్శించవలసిన ఆలయములు
మకర రాశి : మకర రాశికి సంబంధించిన ఆలయం ద్రాక్షారామానికి దక్షిణం ఉన్నది. కుందలమ్మ చెరువులోని శ్రీ పార్వతీ సమేత మార్కండేయ స్వామికి అంకితం చేయబడ్డది ఈ ఆలయం.

ఉత్తరాషాడ నక్షత్రం : రెండవ పాదం – మచర శ్రీ పార్వతీ సమేత శ్రీ రామలింగేశ్వర స్వామి.
మూడవ పాదం – సత్యవాడలో వేంచేసి ఉన్న శ్రీ పార్వతీ సమేత శ్రీ సోమేశ్వర స్వామి.
నాలుగవ పాదం – సుందరపల్లిలో వేంచేసి ఉన్న శ్రీ ఉమాసమేత శ్రీ సోమేశ్వర స్వామి.

శ్రవణ నక్షత్రం : మొదటి పాదం – వానపల్లిలో వేంచేసి ఉన్న శ్రీ ఉమా సమేత శ్రీ వైద్యనాధీశ్వర స్వామి.
రెండవ పాదం – మాదిపల్లి (మాడుపల్లి)లో వేంచేసి ఉన్న శ్రీ పార్వతీ సమేత శ్రీ ముక్తేశ్వర స్వామి.
మూడవ పాదం – వాడపాలెంలో వేంచేసి ఉన్న శ్రీ మాణిక్యాంబా సమేత శ్రీ వీరేశ్వర స్వామి.
నాలుగవ పాదం – వీరపల్లిపాలెంలో వేంచేసి ఉన్న శ్రీ భద్రకాళీ సమేత శ్రీ వీరేశ్వర స్వామి.

ధనిష్ట నక్షత్రం : మొదటి పాదం – వెల్వలపల్లిలో వేంచేసి ఉన్న శ్రీ మహిషాసురమర్ధనీ సమేత శ్రీ రాజరాజనరేంద్ర స్వామి.
రెండవ పాదం – అయినవెల్లిలో వేంచేసి ఉన్న శ్రీ అన్నపూర్ణా సమేత శ్రీ విశ్వేశ్వర స్వామి.


కుంభ రాశి - నక్షత్రములు - దర్శించవలసిన ఆలయములు
కుంభ రాశి : కుంభ రాశికి సంబంధించిన ఆలయం ద్రాక్షారామానికి దక్షిణంలో ఉన్నది. కుందలమ్మ చెరువులోని శ్రీ పార్వతీ సమేత మార్కండేయ స్వామికి అంకితం చేయబడ్డది ఈ ఆలయం.

ధనిష్ట నక్షత్రం : మూడవ పాదం – మసకపల్లిలో వేంచేసి ఉన్న శ్రీ పార్వతీ సమేత శ్రీ మల్లికార్జున స్వామి.
నాలుగవ పాదం – కుందూరులో వేంచేసి ఉన్న శ్రీ పార్వతీ సమేత శ్రీ సోమేశ్వర స్వామి.

శతభిష నక్షత్రం : మొదటి పాదం – కోటిపల్లిలో వేంచేసి ఉన్న శ్రీ రాజరాజేశ్వరీ సమేత శ్రీ సోమేశ్వర స్వామి.
రెండవ పాదం – కోటిపల్లిలో వేంచేసి ఉన్న శ్రీ పార్వతీ సమేత శ్రీ కోటేశ్వర స్వామి
మూడవ పాదం – తొట్టరమూడిలో వేంచేసి ఉన్న శ్రీ భ్రమరాంబా సమేత శ్రీమూల్లేశ్వర స్వామి
నాలుగవ పాదం – పాతకోటలో వేంచేసి ఉన్న శ్రీ లోపాముద్రా సమేత శ్రీ అగస్తేశ్వర స్వామి

పూర్వాభాద్ర నక్షత్రం : మొదటి పాదం – ముక్తేశ్వరంలో వేంచేసి ఉన్న శ్రీ రాజరాజేశ్వరీ సమేత శ్రీ ముక్తేశ్వర స్వామి.
రెండవ పాదం – శాసనపల్లి లంకలో వేంచేసి ఉన్న శ్రీ భ్రమరాంబా సమేత శ్రీశ్రీ చౌడేశ్వర స్వామి.
మూడవ పాదం – తానెలంకలో వేంచేసి ఉన్న శ్రీ పార్వతీ సమేత శ్రీ వీరేశ్వరస్వామి.


మీనరాశి - నక్షత్రములు - దర్శించవలసిన ఆలయములు
మీనరాశి : మీనరాశికి సంబంధించిన ఆలయం ద్రాక్షారామానికి దక్షిణం ఉన్నది. కుందలమ్మ చెరువులోని శ్రీ పార్వతీ సమేత మార్కండేయ స్వామికి అంకితం చేయబడ్డది ఈ ఆలయం.

పూర్వాభాద్ర నక్షత్రం : నాలుగవ పాదం ఎర్రపోతవరంలో వేంచేసి ఉన్న శ్రీ పార్వతీ సమేత శ్రీ మల్లికార్జున స్వామి.

ఉత్తరాభాద్ర నక్షత్రం : మొదటి పాదం - డంగేరులో వేంచేసి ఉన్న శ్రీ పార్వతీ సమేత శ్రీసోమేశ్వర స్వామి.
రెండవ పాదం - కుడుపూరులో వేంచేసి ఉన్న శ్రీ బాలాత్రిపురసుందరీ సమేత శ్రీ నీలకంఠేశ్వర స్వామి.
మూడవ పాదం - గుడిగళ్ళలో వేంచేసి ఉన్న శ్రీ ఉమాదేవీ సమేత శ్రీ మార్కండేయ స్వామి.
నాలుగవ పాదం -శివలలో వేంచేసి ఉన్న శ్రీ బాలాత్రిపురసుందరీ సమేత శ్రీ త్రిపురాంతక స్వామి.

రేవతీ నక్షత్రం : మొదటి పాదం భట్లపాలికలో వేంచేసి ఉన్న శ్రీ లోపాముద్ర సమేత శ్రీ అగస్తేశ్వర స్వామి.
రెండవ పాదం - కాపులపాలెంలో వేంచేసి ఉన్న శ్రీ భద్రకాళీ సమేత శ్రీ వీరభద్రస్వామి.
మూడవ పాదం - పేకేరులో వేంచేసి ఉన్న శ్రీ లోపాముద్ర సమేత శ్రీఅగస్తేశ్వర స్వామి .
నాలుగవ పాదం - బాలాంత్రంలో వేంచేసి ఉన్న శ్రీ రాజరాజేశ్వరీ సమేత శ్రీ అగస్తేశ్వర స్వామి.


పంటలు వేయుటకు నక్షత్రాలు, శుభసమయాలు
హస్తా నక్షత్రం, మృగశిర నక్షత్రం, మఖ నక్షత్రం, ధనిష్టా నక్షత్రం, రేవతి నక్షత్రం, ఉత్తర ఫాల్గుణ నక్షత్రం, ఉత్తరాషాడ నక్షత్రం, ఉత్తరాబాద్ర నక్షత్రం, నందు భూమి యందు విత్తనములు చల్లినచోచక్కగా ఫలించును.

పుష్యమి నక్షత్రం, పునర్వసు నక్షత్రం, రోహిణి నక్షత్రం యందు భూమి యందు చల్లిన వడ్లు, చామలు సమృద్ధిగా పండును. మూలా నక్షత్రం నందు చల్లిన అన్ని ధాన్యములు చక్కగా ఫలించును.

అశ్వని నక్షత్రం, పుబ్బా నక్షత్రం, పుర్వాషాడ నక్షత్రం, ఆరుద్ర నక్షత్రం, పూర్వాభాద్ర నక్షత్రం నాడు ప్రత్తి విత్తనములు నాటిన పక్షమున అవి మొలచి చక్కగా పెరిగి ప్రత్తి బాగుగా పండును.

శతభిష నక్షత్రం, విశాఖ నక్షత్రం నాడు నాటబడిన భూమిలో పెరుగు దుంప దినుసులు, చెరకు తోటలు లెస్సగా ఫలించును.


శ్రవణా నక్షత్రం నాడు మొలక వేసిన చెన్నంగి అను వడ్లు చక్కగా పండును.

ఉత్తర ఫాల్గుని నక్షత్రం నాడు తమలపాకు తీగలు నాటిన యెడల హద్దు లేకుండా పెరుగును.

కృత్తికా నక్షత్రం నాడు, హస్తా నక్షత్రం నాడు, చల్లిన శెనగలు భూమి యందు జనులు తృప్తి పొందునట్టు హెచ్చుగా పండును.

భరణి నక్షత్రం నాడు గోధుమలు నాటిన యెడల అవి ఫలించును. అనగా ఆయా నక్షత్రం నాడు ఆయా గింజలు నాటవలెను.

పుబ్బా నక్షత్రం నాడు శెనగ గింజలు చల్లిన పక్షమున ఆ పంట పండక చెడిపోవును.

ఆరుద్ర నక్షత్రం నాడు చల్లిన యెడల ఏదేని జబ్బు తగిలి చేను పెరగక ఉండును.

భూమి యందు మృగశిరా నక్షత్రం నాడు చల్లిన గోధుమ పంటను మృగములు తృప్తిగా తినిపోవును. అదే జ్యేష్ట నక్షత్రం నాడు చల్లిన పంటలు పండవు.

ఆశ్లేషా నక్షత్రం నాడు ప్రత్తి విత్తనాలు చల్లినచో స్వల్పముగా ఫలిం చును. కాని ఫలించ వలసినంతగా ఫలించవు. కావున నక్షత్రం మంచిదో కాదో ఆలోచించకుండా విత్తనములు వేసినచో అవి పండినట్లే పండి చెడిపోవును.


శతభిష నక్షత్రమున, విశాఖ నక్షత్రమున అవిసె గింజలు, మునగ విత్తనములు నాటిన ఎడల ఆయా సస్యములు వృద్ది పొందక మిక్కిలి ఆశ్చర్యముగా పురుగు పట్టి పాడగును.

పాపగ్రహములు ఉన్న లగ్నముల యందు ఆ పాపగ్రహములను చూచుచున్న లగ్నముల యందు విత్తనములు నాటుట మంచిది కాదు.

శుక్రుడు లగ్నము నందు ఉండిన ఆ లగ్నమునకు సూటిగా 7వ ఇంట ఉండినను భూమి యందు అన్ని ధాన్యములను నాటవచ్చును.

చంద్రుడు కేంద్ర స్థానం నందు ఉండిన పాపగ్రహములు మంచివిగా కాకున్నను వేసిన సస్యములు అన్నియు ఫలించును.

సూర్యుడు ఆర్ద్ర నక్షత్రం నందు ప్రవేశించినప్పుడు మొదలుకొని భూమి యందు చల్లిన విత్తనములు అన్నియూ, ఆ సమయం చాలా మంచి సమయం అగుటచే వృద్ధినొంది చక్కగా ఫలించును.

శ్రవణా నక్షత్రం నందు చల్లిన రాజనములు అను ఒక దినుసు ధాన్యము స్వల్పముగా ఫలించును. ఆరుద్రా నక్షత్రము నందు, పుష్యమి నక్షత్రము నందు, భరణి నక్షత్రము నందు, పునర్వసు నక్షత్రము నందు, రోహిణి నక్షత్రము నందు, మాఘ నక్షత్రము నందు, నాటిన విత్తనములు వృద్ధినొంది చక్కగా ఫలించును.


స్వాతి నక్షత్రము నందు, పుర్వాషాఢ నక్షత్రము నందు, పుర్వాభాద్ర నక్షత్రము నందు, ప్రత్తి గింజలు నాటు వేసిన పక్షమున హెచ్చుగా ప్రత్తిని ఇచ్చును.

జ్యేష్ఠా నక్షత్రమున మినుములు చల్లిన యెడల పంట హెచ్చుగా పండును.

హస్తా నక్షత్రము నందు, పెసర విత్తనములు, ఆరుద్రా నక్షత్రము నందు నువ్వు విత్తనములు, మూలా నక్షత్రము నందు కంది విత్తనములు నాటిన పక్షమున, అనురాధా నక్షత్రమున పత్తి విత్తనములు నాటిన చక్కగా పండును.

అశ్వని నక్షత్రము నందు శెనగ విత్తనములు, పుర్వాషాడ నక్షత్రము నందు అలసంద విత్తనములు నాటిన పక్షమున చక్కగా ఫలించును.

ఉత్తరాభాద్ర నక్షత్రం నందు, అనురాధా నక్షత్రం నందు, మూలా నక్షత్రం నందు, రోహిణి నక్షత్రం నందు, రేవతి నక్షత్రం నందు విత్తనాలు నాటు వేయుట చాలా మంచిది.

ఉత్తరాభాద్ర నక్షత్రం, రోహిణి నక్షత్రం, అనురాధా నక్షత్రం, రేవతి నక్షత్రం నందు జొన్న విత్తనాలు నాటుట చాలా మంచిది.

భూమి మీద విత్తనములు నాటుటకు అశ్వని నక్షత్రం, ధనిష్టా నక్షత్రం, శతబిష నక్షత్రం, శ్రవణా నక్షత్రం, పునర్వసు నక్షత్రం మధ్యమములు.


మకర రాశి యందు, సింహరాశి యందు, వృషభ రాశి, మీనరాశి, కర్కాటక రాశి యందు విత్తనములు చల్లుట చాలా మంచిది. అది చల్లునట్టి లగ్నమున గురుడు బుధుడు, శుక్రుడు ఉండుట చాలా మంచిది.

చాయాదేవి కొడుకైన శని మేషము నందు ఉన్నప్పుడు గురుడు వృషభ రాశి యందు ఉన్నప్పుడు ధనస్సు నందు సూర్యుడు ప్రవేశించి మొదలుకుని మాఘ మాసం వరకు స్వాతి నక్షత్రం నందు, మూలా నక్షత్రం నందు, అనురాధా నక్షత్రం నందు, మకర రాశి యందు, మీనరాశి యందు, కర్కాటక రాశి యందు చల్లిన పక్షమున జొన్న పంట హెచ్చుగా పండును.

పైన వివరించిన నక్షత్రములను ఆ రాశులకు కాక మిగిలిన నక్షత్రముల యందును, రాశుల యందును, జొన్న విత్తనములు నాటవేసిన పక్షమున మూడు వంతుల పంట ఎర్రబడి చెడిపోవును. ఒక్క వంతు మాత్రమే ఫలించును.

ముందుగా గంధము, అక్షంతలు, ధూపము, నైవేద్యము అనునవి దున్నిన పొలము మీదను, దున్నెడు యంత్రమునకు కూడా సమర్పించవలెను. అలాగే విత్తనములు చల్లు యంత్రముకు కుడా సమర్పించ వలెను. అటుపైన సంతోషముతో జొన్నలు మొదలయిన విత్తనములు నాటిన పక్షమున తక్కువ కాకుండా ఫలించును. విత్తనములు చల్లునప్పుడు వేగముగా పగ్గములు అయినను, మోకులు అయినను తెగిపోయినట్లు అయినను, ఎద్దులు మూలిగినను, ఎద్దులు పడిపోయినను ఆ పండిన పంట రాచకార్యముల చేత పాడైపోవును. ముందుగా ఎద్దు పడిపోయిన ఆ దోషం చేత ఆ పంట దొంగలపాలు అయినను పడును.

విత్తనములు చల్లుటకు పోవునప్పుడు పైడికంటి అను పక్షి, ఎడమ వైపు కూసి, నిలిచినను, కుడివైపు గాడిద కాని, ముంగీస కాని, కాకి కాని పోయినను, కుక్క ఎడమ దిక్కుకు పోయినను సంతోషించి ముత్తైదువులు నేసలు చల్లినను, సంతోషంతో బ్రాహ్మణులు వేదములు పఠించుచున్నను, విత్తనములు చల్లుచున్నప్పుడు ఎద్దు ఎడమవైపు చాలు చేసిననూ ఆ పైరు చక్కగా ఫలించును.

దేవతల గురువగు బృహస్పతి లగ్నము నందు ఉండగా విత్తనములు చల్లుటయును, నాల్గవ ఇంట ఉండగా పైరు కాలం తప్పకుండా కోయుటయును, సప్తమ స్థానం నందు ఉండగా వేగముగా ఆ పైరులు జాగ్రత్తగా పెట్టుకొనుట చాలా మంచిది. కాబట్టి గురుబలం విచారించి మరియు విత్తనములు చల్లవలెను.


తారాబలం
ప్రతి వ్యక్తీ పుట్టినప్పుడు ఏదో ఒక నక్షత్రంలో ఉంటాడు. అది ఆ వ్యక్తి జన్మ నక్షత్రం అవుతుంది. ఏ పని చేయాలన్నా ఆ నక్షత్రాన్ని ఆధారం చేసుకునే తారాబలం చూసుకోవాలి. దీనినే నిత్యగోచారం అని కూడా అంటారు.

తమ జన్మ నక్షత్రం నుండి ఆ రోజు నక్షత్రం వరకు లెక్కించి దానిని 9 చేత భాగించాలి. శేషం వేరు వేరు తారలుగా లెక్కించి ఫలిత నిరూపణ చేయాలి. అవి శేషం 1 వస్తే జన్మతార, శేషం 2 వస్తే సంపత్ తార, శేషం 3 వస్తే విపత్తార, శేషం 4 వస్తే క్షేమ తార, శేషం 5 వస్తే ప్రత్యక్తార, శేషం 6 వస్తే సాధనతార, శేషం 7 వస్తే నైధన తార, శేషం 8 వస్తే మిత్ర తార, శేషం 9 వస్తే పరమ మిత్ర తారలు అవుతాయి. వీనిలో 2వతార, 4వ తార, 6వ తార, 8వతార, 9వ తార శేషం వస్తే శ్రేష్ఠంగా చెపుతారు.

ఉదాహరణకు ఒక రోజును తీసుకుంటే ఆ రోజు హస్త నక్షత్రం అనుకుందాం. ఇదే నక్షత్రం జన్మ నక్షత్రంగా ఉన్న వారికి హస్త నక్షత్రం రోజు ఏదైనా కార్యం చేయాలను కుంటే నిత్యగోచారం చూస్తే తారా బలం ఎలా ఉంటుందో గమనిస్తే హస్త నక్షత్రం నుంచి హస్త నక్షత్రం వరకు లెక్కపెడితే 28 నక్షత్రాలు అవుతాయి. 28ను 9తో భాగిస్తే 1 శేషం వస్తుంది. 1 శేషం వస్తే 1వ తార జన్మతార అవుతుంది.

1. జన్మతార : ఈ రోజు ఏదైనా పనులు ప్రారంభించాలంటే శారీరక శ్రమ అధికంగా ఉంటుంది. ఈరోజు మనస్తాపం కూడా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి కొత్త పనులు ప్రారంభించకుండా ఉండడం మంచిది.

2. సంపత్తార : సంపత్తార అన్నిరకాల అనుకూలమైన తార. ఈరోజుఅన్నిరకాల లావాదేవీలకు మంచిది. సంపద అంటే డబ్బు ఒకటే కాదు, ఆరోగ్యం, ఆనందం, ఐశ్వర్యం, వీటన్నిటిని కూడా సంపదలుగానే భావించాలి. ఇవి అన్నీ ఉంటే సంపద నిండుగా ఉన్నదని అర్థం.

3. విపత్తార : విపత్తు అంటే ఆటంకాలను, కష్టాలను కలిగించేది. చేసే అన్ని పనుల్లో కూడా కష్టాలు ఎక్కువ, మొదలు పెట్టిన పని పూర్తి కాకుండా అన్నీ ఆటంకాలు, పోట్లాటలు కూడా వస్తూ ఉంటాయి. చేసే పని మీద విసుగు, చికాకు వస్తాయి. కాబట్టి విపత్తార పనికిరాదు.

4. క్షేమతార : ఈరోజు పనులు సజావుగా సాఫీగా సాగుతాయి.అంటే ప్రయాణాలు చేసేవారికి శుభ సూచకంగా కూడా చెప్పవచ్చు. క్షేమంగా వెళ్లి లాభంగా రండి అని దీవిస్తారు కదా. చేసే అన్ని పనుల్లో సంతోషం, క్షేమం కార్య అనుకూలత కలుగుతాయి.

5. ప్రత్యక్తార : ప్రత్యక్ అంటే కార్య నాశనము అని అర్థం. మొదలు పెట్టిన పనిలో కార్యనాశనం చూపిస్తుంది. రోజూవారి చేసుకునే పనుల్లో కూడా కొంత జాగ్రత్తగా ఉండాలి. అంటే ఆరోజు ఏదైనా పనిపై బయటకు వెళ్ళడం లాంటివి చేయకూడదు.

6. సాధనతార : ఈ తార పేరులోనే సాధనం అని ఉంది. కాబట్టి ఈరోజు అన్ని రకాల పనులను ప్రారంభించవచ్చు. ఏ పని మొదలు పెట్టిన అందులో విజయాన్ని సాధిస్తారు. ఫలితం కూడా సంతోషంగా ఉంటుంది. పని పూర్తి చేసి ఆనందాన్ని పొందుతారు.

7. నైధనతార: నైధన తార పనికి రాదు. అంటే ఈరోజున చేసే పనుల్లో చాలా రకాల కష్టాలు అనుభవించాలి. చేసే పనుల్లో ఆటంకాలు, కష్టాలు ఎక్కువ. మరణ తుల్యమైన భావనను కూడా కలిగిస్తుంది. కాబట్టి ఈరోజున ఎక్కువగా దానాలు చేసుకోవడం మంచిది.

8. మిత్రతార : మిత్రతారలో మొదలు పెడితే పనులు సజావుగా సాగుతాయి. చేసే పని వల్ల ఏదో ఒకరకమైన సుఖ సంతోషాలు కలుగుతాయి. కాబట్టి మిత్ర తార శ్రేష్ఠమైనది.

9. పరమమైత్రతార : ఈరోజున కూడా చేసే పనుల్లో ధనలాభాన్నికలిగిస్తాయి. అనుకున్న పనులు పూర్తిచేసుకునే సమయం ఉంటుంది. కాబట్టి ఈ తారకూడా మంచి ఫలితాలనే ఇస్తుంది.

ఈ విధంగా ప్రతిరోజూ ఎవరికి వారు తాము ఏవైనా చిన్న చిన్న పనులు మొదలుపెట్టాలంటే పంచాంగం లేదా క్యాలెండర్ చూసుకుని తమకు తాము మంచి చెడు రోజులను నిర్ణయించుకోవడానికి వీలుంటుంది.


నైధనతార పరిశీలన
చిన్న ముహూర్తం చూడాలన్న తారాబలం చూడటం సర్వ సాధారణం. తారాబలం, చంద్రబలం చూడకుండా ముహూర్త నిర్ణయం చేయం. తారలు 9. జన్మతార నుండి పరమమైత్ర తార.

జన్మన్యర్కో హిమకరసుతః సైంహికేయో సురేద్యః
కేతుశ్ఛంద్రో దినకరసుతః భార్గవో భూమిపుత్రః


జన్మతారకి అధిపతి సూర్యుడు, సంపత్తారకి అధిపతి బుధుడు, విపత్తారకు అధిపతి రాహువు, క్షేమతారకి అధిపతి గురువు, ప్రత్యక్ తారకు అధిపతి కేతువు, సాధన తారకు అధిపతి చంద్రుడు, నైధనతారకు అధిపతి శని, మిత్రతారకు అధిపతి శుక్రుడు, పరమమైత్ర తారకు అధిపతి కుజుడు.

సంపత్తార, క్షేమతార, సాధనతార, మిత్రతార ఈ నాలుగు తారాలకు అధిపతులు, వాహనాలు శుభులే కావటం వలన అన్నీ శుభకర్మలకు వీటిని వాడతాము. పరమమైత్ర తారకు అధిపతి, వాహనం చెడ్డవి అయినా "పరమమైత్రే లాభంచ" అను నానుడచే వాడుతూ ఉంటాము.

తారలు బాగుగా లేనప్పుడు వాటికి దానములు చెప్పబడినవి. ఆయా దానములు ఇచ్చి చెప్పిన ఘడియలు విడచి వాడవచ్చు. అలాగే నైధన తారకు స్వర్ణదానం చేసి ఆరోజు శుభకార్యం చేయవచ్చు అంటారు. కానీ కొందరు "నైధనం నిధనం" మృత్యుప్రదమని వాడుటలేదు.


వధువు నక్షత్రం నుండి వరుని నక్షత్రం 7వదైన ఎడల వధువుకు 6 మాసాలలో వైధవ్యం వచ్చునని కొంతమంది వాడుటలేదు. జన్మతారకు అధిపతి రవి, నైధనతారకు అధిపతి శని. వీరువురికి పరమ శతృత్వం కావున శుభకార్యాలు ఆచరించటంలేదు. "నైధానం సర్వత్ర వర్జయేత్" అని కొందరు జ్యోతిష్యవేత్తలు ఏ మాత్రం ఒప్పుకొనుటలేదు.

భరణి, పుబ్బ, పూర్వాషాడ నక్షత్రాలలో జన్మించినవారు శుక్రదశ
లో జన్మిస్తారు. వారికి పుష్యమి, అనూరాధ, ఉత్తరాభాద్ర నక్షత్రాలు నైధన తారల అవుతాయి. అలాంటప్పుడు ఆ నక్షత్రాలలో ఏ శుభకార్యాలు చేయకూడదు.

కాలామృతంలో వధువు నక్షత్రానికి ఏడవ నక్షత్రం వరునితో వివాహం నిషేదించాడు. గ్రంధంలో ఉన్న విషయాలు అనుభవంలో సరిపోతున్నవో లేదో చూడాలి.

కొంతమంది జ్యోతిష్యవేత్తలు భరణి, పుబ్బ, పూర్వాషాఢ నక్షత్ర జాతకులకు పుష్యమి అనూరాధ, ఉత్తరాభాద్ర నక్షత్రములు శుభకార్యాలకు ముహూర్తములుగా నిర్ణయించి పెట్టినప్పుడు అందరూ క్షేమంగా ఉన్నట్లు తెలుస్తుంది.

అలాగే ఆశ్లేష, జ్యేష్ఠ, రేవతి నక్షత్రాలవారికి కూడా నైధనతార దోషయుక్తం కాదు. ఎందుకనగా బుధ, శుక్ర, శనులకు మిత్రత్వం వలన నైధనతార చెడ్డ చేయడు. అదే విధంగా భరణి, పుబ్బ, పూర్వాషాడ నక్షత్ర వధువు జాతకులకు పుష్యమి అనూరాధ, ఉత్తరాభాద్ర నక్షత్ర జాతకులైన వరులతో వివాహం చేయవచ్చును అని అంటారు.


వధువు నక్షత్రం నుండి వరుని నక్షత్రం 7వదైన ఎడల వధువుకు 6 మాసాలలో వైధవ్యం వచ్చునని కొంతమంది వాడుటలేదు. జన్మతారకు అధిపతి రవి, నైధనతారకు అధిపతి శని. వీరువురికి పరమ శతృత్వం కావున శుభకార్యాలు ఆచరించటంలేదు. "నైధానం సర్వత్ర వర్జయేత్" అని కొందరు జ్యోతిష్యవేత్తలు ఏ మాత్రం ఒప్పుకొనుటలేదు.

భరణి, పుబ్బ, పూర్వాషాడ నక్షత్రాలలో జన్మించినవారు శుక్రదశల్ జన్మిస్తారు. వారికి పుష్యమి, అనూరాధ, ఉత్తరాభాద్ర నక్షత్రాలు నైధన తారల అవుతాయి. అలాంటప్పుడు ఆ నక్షత్రాలలో ఏ శుభకార్యాలు చేయకూడదు.

కాలామృతంలో వధువు నక్షత్రానికి ఏడవ నక్షత్రం వరునితో వివాహం నిషేదించాడు. గ్రంధంలో ఉన్న విషయాలు అనుభవంలో సరిపోతున్నవో లేదో చూడాలి.

కొంతమంది జ్యోతిష్యవేత్తలు భరణి, పుబ్బ, పూర్వాషాఢ నక్షత్ర జాతకులకు పుష్యమి అనూరాధ, ఉత్తరాభాద్ర నక్షత్రములు శుభకార్యాలకు ముహూర్తములుగా నిర్ణయించి పెట్టినప్పుడు అందరూ క్షేమంగా ఉన్నట్లు తెలుస్తుంది.

అలాగే ఆశ్లేష, జ్యేష్ఠ, రేవతి నక్షత్రాలవారికి కూడా నైధనతార దోషయుక్తం కాదు. ఎందుకనగా బుధ, శుక్ర, శనులకు మిత్రత్వం వలన నైధనతార చెడ్డ చేయడు. అదే విధంగా భరణి, పుబ్బ, పూర్వాషాడ నక్షత్ర వధువు జాతకులకు పుష్యమి అనూరాధ, ఉత్తరాభాద్ర నక్షత్ర జాతకులైన వరులతో వివాహం చేయవచ్చును అని అంటారు.


108 నవాంశలు వాటి ఫలితాలు

రాశిలో 9వ భాగమును నవాంశ అంటారు. రాశి పరిమాణం 30 డిగ్రీలు ఉంటుంది. దీనిని తొమ్మిది భాగాలు చేయగా 3 డిగ్రీల 20 నిమిషాలు వస్తుంది. ఒక నవాంశ అంటే 3° 20' ఒక నక్షత్ర పాదం. ఒక రాశిలో 9 నవాంశలు ఉంటాయి.

రాశి చక్రంలో మొత్తం 108 నవాంశలు ఉంటాయి. నవాంశ అనే పేరులోనే ఉంది. ఇది ఒక్కొక్క రాశిని తొమ్మిది సూక్ష్మభాగాలు చేస్తే వచ్చే వర్గ చక్రం అని తెలుస్తుంది.

నవాంశలో గ్రహస్థితి బాగా లేకపొతే రాశిచక్రంలో ఎన్ని యోగాలు ఉన్నా ఫలితాన్ని ఇవ్వవు. జ్యోతిష్య గ్రంథాలలో ఉన్న సూచనలను బట్టి రాశి చక్రం చెట్టు అయితే, నవాంశ చక్రం ఫలం.

రాశి చక్రంలో ఉన్న సూచనలు నవాంశ చక్రంలో ఉన్న సూచనలను అనుసరించి ఫలితాన్ని ఇస్తాయి. కాలం గడిచి మనిషి పెద్దవాడు అయ్యే కొద్దీ నవమాంశ చక్రంలో ఉన్న గ్రహస్థితులకు అనుగుణంగా మారటం మనం అనేక జాతకాలలో చూడవచ్చు.

నవాంశ వర్గ చక్రాన్ని స్థూల మరియు సూక్ష్మ పరిశీలనకు ఉపయోగిస్తారు. రాశి చక్రములో ఉన్న గ్రహాలు నవాంశ చక్రములో బాగుంటేనే ఆ గ్రహము యొక్క ఫలితాన్ని పొందుతారు.

రాశి చక్రములో యోగం ఉన్నప్పుడు ఆ యోగ కారక గ్రహాలు నవాంశలో మంచి స్థితిలో ఉంటేనే ఆ యోగాన్ని పొందుతారు. గ్రహాల యొక్క అంతర్గత శక్తిని ఈ నవాంశ వర్గ చక్రం ద్వారా పరిశీలించవచ్చును.


నవాంశ చక్రములో గ్రహ దృష్టులు, యోగాలను చూడరాదు. గ్రహాలు స్వక్షేత్రం, మిత్రక్షేత్రం, ఉచ్చలలో ఉన్నాయా అనే విషయాలను పరిగణలోకి తీసుకోవలెను. రాశి చక్రంలోని లగ్నం నవాంశ లగ్నానికి షష్టాష్టకం అయిన అశుభ ఫలితాలను ఇస్తుంది.

గ్రహాలు కూడా నవాంశ లగ్నానికి షష్టాష్టకం అయిన అశుభ ఫలితాలను ఇస్తుంది. నవాంశ వర్గ చక్రాన్ని పరిశీలించకుండా ఫలితాలను చెప్పకూడదు.

27 నక్షత్రాలలోను ప్రతి నక్షత్రానికి నాలుగు పాదాలు ఉంటాయి.మొత్తం నూట ఎనిమిది పాదాలే గాక వాటికి విడివిడిగా రాశ్యంశలు కూడా ఉంటాయి.

అశ్వని, రోహిణి, పునర్వసు, మఖ, హస్త, విశాఖ, మూల, శ్రవణం, పూర్వాభాద్ర అనబడే తొమ్మిది నక్షత్రాల ప్రధమ పాదాలు మేషాంశకు, ద్వితీయ పాదాలు వృషభాంశకు, తృతీయ పాదాలు మిధునాంశకు, చతుర్ధ పాదాలు కర్కటాంశకు చెంది ఉంటాయి.

భరణి, మృగశిర, పుష్యమి, పుబ్బ, చిత్ర, అనూరాధ, పూర్వాషాడ, ధనిష్ఠ, ఉత్తరాభాద్ర అనబడే తొమ్మిది నక్షత్రాల ప్రధమ పాదాలు సింహాంశకు, ద్వితీయ పాదాలు కన్యాంశకు, తృతీయ పాదాలు తులాంశకు, చతుర్ధ పాదాలు వృశ్చికాంశకు చెంది ఉంటాయి.

కృత్తిక, ఆరుద్ర, ఆశ్లేష, ఉత్తర, స్వాతి, జ్యేష్ఠ, ఉత్తరాషాడ, శతభిషం, రేవతి అనబడే తొమ్మిది నక్షత్రాల ప్రధమ పాదాలు ధనురాంశకు, ద్వితీయ పాదాలు మకరాంశకు, తృతీయ పాదాలు కుంభాంశకు, చతుర్ధ పాదాలు మీనాంశకు చెంది ఉంటాయి.



1) అశ్వని నక్షత్ర నాలుగు పాదాలకు అంశ గుణాలు :
1) తస్కరాంశ : అశ్వని నక్షత్ర ప్రధమ పాదం కుజుడిది. ఈ జాతకులు మంచి సంపద, భోగాలను అనుభవించువాడు, లోభ గుణం కలవాడు,

2) భోగ్యాంశ : అశ్వని నక్షత్ర ద్వితీయ పాదం శుక్రుడిది. ఈ జాతకులు తేజస్సు కలవాడు, ధన, ధాన్యాభివృద్ధి కలవాడు, దాన గుణం కలవాడు అగును.

3) విచక్షణాంశ : అశ్వని నక్షత్ర తృతీయ పాదం బుధుడిది. ఈ జాతకులు సమస్త భోగాలు కలవారు, ప్రతి పనిని సాధించువాడు, పనులను నేర్పుతో చేయువాడు అగును.

4) ధర్మాంశ : అశ్వని నక్షత్ర చతుర్ధ పాదం చంద్రుడిది. ఈ జాతకులు భగవంతుడి పైన భక్తి కలవాడు, పూజలు చేయువాడు, సంధ్యావందన తత్పురుడును, నిత్యం ధర్మ కార్యాచరణలో ఉండువారు అగును.

2) భరణి నక్షత్ర నాలుగు పాదాలకు అంశ గుణాలు :
5) నృపాంశ : భరణి నక్షత్ర ప్రధమ పాదం రవిది. ఈ జాతకులు గౌరవమర్యాదలు పొందువారు, మంచి లక్షణాలు కలిగి ఉంటారు. కార్య సఫలత కలవారు, ధర్మాత్ముడు అగును.

6) నపుంసకాంశ : భరణి నక్షత్ర ద్వితీయ పాదం బుధుడిది. ఈ జాతకులు లోభత్వం కలవారు, పనులయందు నేర్పరి, మధ్యవర్తిత్వం చేయువారు అగును.

7) అభయాంశ : భరణి నక్షత్ర తృతీయ పాదం శుక్రుడిది. ఈ జాతకులు ప్రశాంతమైన మనస్సు కలవారు, ఉత్సాహవంతులు, శూరులు, బాధ్యతారాహిత్యమైన జీవితాన్ని ఆశించేవారు అగును.

8) పాపాంశ : భరణి నక్షత్ర చతుర్ధ పాదం కుజుడిది. ఈ జాతకులు క్రూర స్వభావం కలవారు, కృతజ్ఞత కలవారు, అధిక పుత్ర సంతానవంతులు, ఫలితాలను ఆశించనివారు అగును.


3) కృత్తిక నక్షత్ర నాలుగు పాదాలకు అంశ గుణాలు:
9) ధానాంశ : కృత్తిక నక్షత్ర ప్రధమ పాదం గురువుది. ఈ జాతకులు దాన, ధర్మాలు చేయువారు, ధనవంతులు, ప్రతాపవంతులు, పనులలో నైపుణ్యం కలవారు అగును.

10) పాపాంశ : కృత్తిక నక్షత్ర ద్వితీయ పాదం శనిది. ఈ జాతకులు మొహమాటం లేకుండా ఉంటారు,

11) ఉగ్రాంశ : కృత్తిక నక్షత్ర తృతీయ పాదం శనిది. ఈ జాతకులు నైపుణ్యం ఉన్నప్పటికి మంద బుద్ధులుగా ఉంటారు.

12) ఉత్కృష్టాంశ : కృత్తిక నక్షత్ర చతుర్ధ పాదం గురువుది. ఈ జాతకులు విద్యా వినయాలు కలవారు, ధర్మాత్ములు, ధార్మికులు, ఎల్లప్పుడు సంతోషం కలవారు అగును.

4) రోహిణి నక్షత్ర నాలుగు పాదాలకు అంశ గుణాలు :
13) సేనాంశ : రోహిణి నక్షత్ర ప్రధమ పాదం కుజుడిది. ఈ జాతకులు చంచలత్వం కలవారు, శూరుడు, దెబ్బలాటలకు ప్రీతి కలవాడు.

14) భృత్యాంశ : రోహిణి నక్షత్ర ద్వితీయ పాదం శుక్రుడిది. ఈ జాతకులు ఓటమిని అంగీకరించలేని తనం కలవారు, మంచి నడవడిక కలవారు అగును.

15) విద్యాంశ : రోహిణి నక్షత్ర తృతీయ పాదం బుధుడిది. ఈ జాతకులు పండితులుగాను, కవులుగాను, గణిత శాస్త్రజ్ఞులుగాను, లోక వ్యవహార జ్ఞానం కలవారు గాను ఉంటారు.

16) అత్యాశ : రోహిణి నక్షత్ర చతుర్ధ పాదం చంద్రుడిది. ఈ జాతకులు తెలివైన వారుగాను, బుద్ధిమంతులు గాను, సజ్జనులు గాను ఉందురు.


5) మృగశిర నక్షత్ర నాలుగు పాదాలకు అంశ గుణాలు :
17) రాజాంశ : మృగశిర నక్షత్ర ప్రధమ పాదం రవిది. ఈ జాతకులు శత్రువులపైనా విజయం సాధించువారు, ధనవంతులు, తలకు మించిన పనులను నెత్తిన వేసుకొనేవారు గాను ఉంటారు.

18) చండాంశ : మృగశిర నక్షత్రం ద్వితీయ పాదం బుధుడిది. ఈ జాతకులు యజ్ఞ యాగాదులు చేయువారు, భాగ్యవంతులుగాను, మంచి వాక్ శుద్ధి కలవారు గాను ఉంటారు.

19) అభయాంశ : మృగశిర నక్షత్రం తృతీయ పాదం శుక్రుడిది. ఈ జాతకులు ఉదార స్వభావం కలవారుగాను, దేనికైనా సిద్ధపడేవారు గాను, మంచి పనులు చేయువారు, శౌర్యవంతులు గాను ఉందురు.

20) నీచాంశ : మృగశిర నక్షత్రం చతుర్ధ పాదం కుజుడిది. ఈ జాతకులు ఇతరులను ప్రేమించువారు గాను ఉందురు.

6) ఆరుద్ర నక్షత్ర నాలుగు పాదాలకు అంశ గుణాలు :
21) కృపాంశ : ఆరుద్ర నక్షత్ర ప్రధమ పాదం గురువుది. ఈ జాతకులు గుణవంతులు, పెద్దల యందు భక్తి, ప్రశాంతమైన ముఖం కలవారు గాను, దయా స్వభావం కలవారుగాను, మంచి నేర్పరులుగాను ఉందురు.

22) తస్కరాంశ : ఆరుద్ర నక్షత్ర ద్వితీయ పాదం శనిది. ఈ జాతకులు కలహాలకు దూరంగా ఉంటారు.

23) ఉగ్రాంశ : ఆరుద్ర నక్షత్ర తృతీయ పాదం శనిది. ఈ జాతకులు మంచి ఆలోచనలు చేసేవారు, స్ధిరమైన ఆదాయం కలవారు.

24) ఉత్కృష్టాంశ : ఆరుద్ర నక్షత్ర చతుర్ధ పాదం గురువుది. ఈ జాతకులు ధర్మాన్ని పాటించేవారు, అక్కటి ఆచార వ్యవహారాలు చేయువారు, గౌరవ మర్యాదలు తెలిసినవారై ఉంటారు.


7) పునర్వసు నక్షత్ర నాలుగు పాదాలకు అంశ గుణాలు :
25) ఉత్తమాంశ : పునర్వసు నక్షత్ర ప్రధమ పాదం కుజుడిది. ఈ జాతకులు భగవంతుని పైన భక్తి కలవారు.

26) భోక్తాంశ : పునర్వసు నక్షత్ర ద్వితీయ పాదం శుక్రుడిది. ఈ జాతకులు వస్త్ర అలంకార ప్రియులు, భోజన ప్రియులు, ధనవంతులు అవుతారు.

27) సౌమ్యాంశ: పునర్వసు నక్షత్ర తృతీయ పాదం బుధుడిది. ఈ జాతకులు పండితులు, వ్యాపార దక్షత కలవారు.

28) ధనాంశ : పునర్వసు నక్షత్ర చతుర్ధ పాదం చంద్రుడిది. ఈ జాతకులు ధనవంతులు, ఉపకారం చేయువారు, నిర్మలత్వం కలవారు.

8) పుష్యమి నక్షత్ర నాలుగు పాదాలకు అంశ గుణాలు :
29) భూపాంశ: పుష్యమి నక్షత్రం మొదటి పాదం రవిది. ఈ జాతకులు వీరికి ఏకాంతమన్న ప్రీతి, ప్రతి పని తొందరగా చేస్తారు.

30) సౌమ్యాంశ: పుష్యమి నక్షత్రం రెండవ పాదం బుధుడిది. ఈ జాతకులు ధనాకాంక్ష కలిగి ఉంటారు.

31) శూరాంశ : పుష్యమి నక్షత్రం మూడవ పాదం శుక్రుడిది. ఈ జాతకులు చాలా ప్రసన్నంగా ఉంటారు. భోగవంతులు, నిత్యం మనశ్శాంతి కలిగి ఉంటారు.

32) నీచాంశ : పుష్యమి నక్షత్రం నాల్గవ పాదం కుజుడిది. ఈ జాతకులు వీరు కలహాలకు దూరంగా ఉంటారు.


9) ఆశ్లేష నక్షత్ర నాలుగు పాదాలకు అంశ గుణాలు :
33) ఉత్పన్నాంశ : ఆశ్లేష నక్షత్ర ప్రధమ పాదం గురువుది. ఈ జాతకులు వీర ధైర్యవంతులు. సత్యవాక్కులు పలుకువారు. మంచిబుద్ధి కలవారు గాను ఉంటారు.

34) పాపాంశ : ఆశ్లేష నక్షత్ర ద్వితీయ పాదం శనిది. ఈ జాతకులు చంచల స్వభావం కలిగి ఉంటారు.

35) క్రోధాంశ : ఆశ్లేష నక్షత్ర తృతీయ పాదం శనిది. ఈ జాతకుల న్యాయంగా డబ్బు సంపాదిస్తారు.

36) ఉగ్రాంశ : ఆశ్లేష నక్షత్ర నాల్గవ పాదం గురువుది. ఈ జాతకులు మంచి స్వభావం కలిగి ఉంటారు.

10) మఖ నక్షత్ర నాలుగు పాదాలకు అంశ గుణాలు :
37) సేవాంశ : మఖ నక్షత్ర ప్రధమ పాదం కుజుడిది. ఈ జాతకులు పట్టుదల కలిగి ఉంటారు. ప్రతిష్ఠ కలవారుగా ఉంటారు.

38) భుక్తాంశ : మఖ నక్షత్ర ద్వితీయ పాదం శుక్రుడిది. ఈ జాతకులు ఏకాంతాన్ని కోరుకుంటారు. త్యాగం చేయువారు, దేనినైనా న్యాయంగా పొందాలి, సంపాదించాలి అని కోరుకునేవారు.

39) విచక్షణాంశ : మఖ నక్షత్ర తృతీయ పాదం బుధుడిది. ఈ జాతకులు జ్ఞాన వంతులు, మేధావులు, శాస్త్రవేత్తలు, నేర్పరులుగా ఉంటారు.

40) అంత్యాంశ : మఖ నక్షత్ర చతుర్ధ పాదం చంద్రుడిది. ఈ జాతకులు తెలివైనవాళ్ళు, మంచి స్వభావం కలిగి ఉంటారు.


11) పుబ్బ నక్షత్ర నాలుగు పాదాలకు అంశ గుణాలు :
41) రాజాంశ : పుబ్బ నక్షత్ర ప్రధమ పాదం రవిది. ఈ జాతకులు కొనుగోలు, అమ్మకాలు వ్యవహారాలు కలిగిన వ్యాపారాలలో నిపుణత్వం కలిగి ఉంటారు.

42) నపుంసకాంశ : పుబ్బ నక్షత్ర ద్వితీయ పాదం బుధుడిది. ఈ జాతకులు కీర్తి ప్రతిష్ఠలు కలిగి ఉంటారు.

43) అభయాంశ : పుబ్బ నక్షత్రం తృతీయ పాదం శుక్రుడిది. ఈ జాతకులు శిల్ప శాస్త్రంలో నిపుణులు అవుతారు. గణిత శాస్త్రంలోను నిపుణత్వం కలిగి ఉంటారు.

44) దరిద్రాంశ : పుబ్బ నక్షత్రం చతుర్ధ పాదం కుజుడిది. ఈ జాతకులు జీవితంలో కష్టలను అనుభవిస్తారు.

12) ఉత్తర నక్షత్ర నాలుగు పాదాలకు అంశ గుణాలు :
45) ఉత్పన్నాంశ : ఉత్తర నక్షత్రం ప్రధమ పాదం గురువుది. ఈ జాతకులు పరిశుద్ధులు, కావ్యా స్వాదనా చతురులు కలవారు అవుతారు.

46) పాపాంశ : ఉత్తర నక్షత్రం ద్వితీయ పాదం శనిది. ఈ జాతకులు చంచలత్వం కలవారుగా ఉందురు.

47) ఉగ్రాంశ : ఉత్తర నక్షత్రం తృతీయ పాదం శనిది. ఈ జాతకులు మేలు చేసిన వారిని ఎప్పటికి మరిచిపోరు.

48) శుభాంశ : ఉత్తర నక్షత్రం చతుర్ధ పాదం గురువుది. ఈ జాతకులు వినయ విధేయతలు కలవారు, విద్యా సంపన్నులు అవుతారు.


13) హస్త నక్షత్ర నాలుగు పాదాలకు అంశ గుణాలు :
49) క్రూరాంశ : హస్తా నక్షత్ర ప్రధమ పాదం కుజుడిది. ఈ జాతకులు బలవంతులు, చింతన కలవారు అవుతారు.

50) ముక్తాంశ : హస్తా నక్షత్ర ద్వితీయ పాదం శుక్రుడిది. ఈ జాతకులు నిత్యం మంచి మాటలనే మాట్లాడేవారుగా ఉంటారు.

51) పండితాంశ : హస్తా నక్షత్ర తృతీయ పాదం బుధుడిది. ఈ జాతకులు వ్యాపారంలో భాగం అయిన అమ్మకాలు, కొనుగోళ్ళు విషయాలలో మహా నిపుణులుగా ఉంటారు.

52) ధనాంశ : హస్తా నక్షత్రం చతుర్ధ పాదం చంద్రుడిది. ఈ జాతకులు రాచకార్యాలు చేయుటలో ఇష్టం కలవారు, సన్మానాలు పొందేవారు, అభిమానవంతులు.

14) చిత్తా నక్షత్ర నాలుగు పాదాలకు అంశ గుణాలు :
53) రాజాంశ : చిత్తా నక్షత్ర ప్రధమ పాదం రవిది. ఈ జాతకులు చంచల మనస్తత్వం కలవారుగా ఉంటారు.

54) నపుంసకాంశ : చిత్తా నక్షత్ర ద్వితీయ పాదం బుధుడిది. ఈ జాతకులు చాలా తియ్యగా మాట్లాడతారు.

55) అభయాంశ : చిత్తా నక్షత్ర తృతీయ పాదం శుక్రుడిది. ఈ జాతకులు కీర్తిమంతులు, శౌర్యవంతులు, పండితులతో సహవాసం చేయటం, వారితోనే గడపటం వీరి లక్షణాలు.

56) ధనాంశ : చిత్తా నక్షత్ర చతుర్ధ పాదం కుజుడిది. ఈ జాతకులు అమిత ధైర్యవంతులు, విక్రమం కలవారుగాను ఉంటారు.


15) స్వాతి నక్షత్ర నాలుగు పాదాలకు అంశ గుణాలు :
57) ఉత్పన్నాంశ : స్వాతి నక్షత్ర ప్రధమ పాదం గురుడుది. ఈ జాతకులు జ్ఞానం కలవారుగా ఉంటారు.

58) ధనాంశ : స్వాతి నక్షత్ర ద్వితీయ పాదం శనిది. ఈ జాతకులు సాయం చేసినవారిని మరువరు.

59) ఉగ్రాంస : స్వాతి నక్షత్ర తృతీయ పాదం శనిది. ఈ జాతకులు అతిగా ఖర్చు పెట్టేవాళ్ళుగా ఉంటారు.

60) ఉత్కృష్టాంశ : స్వాతి నక్షత్ర చతుర్ధ పాదం గురువుది. ఈ జాతకులు కోపం కలిగి ఉన్న జనాభిమానం కలవారు. గురుభక్తి కలవారు. ధనికులు అయి ఉంటారు.

16) విశాఖ నక్షత్ర నాలుగు పాదాలకు అంశ గుణాలు :
61) సౌఖ్యాంశ : విశాఖ నక్షత్ర ప్రధమ పాదం కుజుడిది. ఈ జాతకులు ధనవంతులై ఉంటారు.

62) భోగాంశ : విశాఖ నక్షత్ర ద్వితీయ పాదం శుక్రుడిది. ఈ జాతకులు దేనినైనా న్యాయపరంగా సంపాదించుకునేవాళ్ళు అవుతారు.

63) సౌమ్యాంశ : విశాఖ నక్షత్రం తృతీయపాదం బుధుడిది. ఈ జాతకులుమంచి చెడు పట్ల విచక్షణ కలిగి ఉంటారు. నేర్పరితనం కలిగి ఉంటారు. దాన గుణవంతులుగా ఉంటారు.

64) అర్ధాంశ : విశాఖ నక్షత్రం చతుర్ధ పాదం చంద్రుడిది. ఈ జాతకులు ధన సంపాదన పైన ఆసక్తి కలవారు అగును.


17) అనురాధ నక్షత్ర నాలుగు పాదాలకు అంశ గుణాలు :
65) రాజాంశ : అనురాధ నక్షత్ర ప్రధమ పాదం రవిది. ఈ జాతకులు మాట్లాడేటప్పుడు వినయ విధేయతలు కలిగి ఉంటారు. నీతి నియమాలు కలిగి ఉంటారు.

66) నపుంసకాంశ : అనురాధ నక్షత్ర ద్వితీయ పాదం బుధుడిది. ఈ జాతకులు వీణా వాయిద్యాల పట్ల మక్కువ కలిగి ఉంటారు. ఆదర్శ మూర్తులు. మేధావులుగా ఉంటారు.

67) అభయాంశ : అనురాధ నక్షత్ర తృతీయ పాదం శుక్రుడిది. ఈ జాతకులకు స్థిరత్వం ఉండదు.

68) నీచాంశ : అనురాధ నక్షత్రం చతుర్ధ పాదం కుజుడిది. ఈ జాతకులు ఇతరులకు మంచి చేసేవాళ్ళు అవుతారు.

18) జ్యేష్ఠ నక్షత్ర నాలుగు పాదాలకు అంశ గుణాలు :
69) ఉత్పన్నాంశ : జ్యేష్ఠ నక్షత్ర ప్రధమ పాదం గురువుది. ఈ జాతకులు రచనా సామర్థ్యం కలవారు, హాస్యప్రియులు.

70) ఉగ్రాంశ : జ్యేష్ఠ నక్షత్ర ద్వితీయ పాదం శనిది. ఈ జాతకులు ఇతరులను సులభంగా నమ్ముతారు.

71) పాపాంశ : జ్యేష్ఠ నక్షత్ర తృతీయ పాదం శనిది. ఈ జాతకులు ఇతరుల పనులు చేయువారు అగుదురు.

72) శుభాంశ : జ్యేష్ఠ నక్షత్ర చతుర్ధ పాదం గురువుది. ఈ జాతకులు ధర్మ శాస్త్రాలపైనా పట్టు కలవారు. పూజలు చేయువారు.

19) మూల నక్షత్ర నాలుగు పాదాలకు అంశ గుణాలు :
73) తస్కరాంశ : మూల నక్షత్ర ప్రధమ పాదం కుజుడిది. ఈ జాతకులు మంచి స్వభావం కలవారు.

74) భోక్తాంశ : మూల నక్షత్ర ద్వితీయ పాదం శుక్రుడిది. ఈ జాతకులు వాహన సౌఖ్యం కలవారు.

75) విచక్షణాంశ : మూల నక్షత్ర తృతీయ పాదం బుధుడిది. ఈ జాతకులు మంచి సంభాషణా పరులు, విద్యావంతులు, జ్యోతిష్య విద్య తెలిసినవారు.

76) ధనాంశ : మూల నక్షత్ర చతుర్ధ పాదం చంద్రుడిది. ఈ జాతకులు లౌకికం కలవారు అవుతారు.

20) పూర్వాషాడ నక్షత్ర నాలుగు పాదాలకు అంశ గుణాలు :
77) ఉత్పన్నాంశ : పూర్వాషాడ నక్షత్ర ప్రధమ పాదం రవిది. ఈ జాతకులు శక్తి సామర్ధ్యాలు కలవారు.

78) అభయాంశ : పూర్వాషాడ నక్షత్ర ద్వితీయ పాదం బుధుడిది. ఈ జాతకులు మృదువుగానే మాట్లాడుతారు. అవతలి వ్యక్తులలోని సద్గుణాలను పసిగడతారు.

79) భాగ్యాంశ : పూర్వాషాడ నక్షత్ర తృతీయ పాదం శుక్రుడిది. ఈ జాతకులు నిత్యం శుచిగా ఉంటారు. దయా హృదయం కలిగి ఉంటారు.

80) ఉగ్రాంశ : పూర్వాషాడ నక్షత్ర చతుర్ధ పాదం కుజుడిది. ఈ జాతకులు మంచి స్వభావం కలవారు.


21) ఉత్తరాషాడ నక్షత్ర నాలుగు పాదాలకు అంశ గుణాలు
81) ఉత్పన్నాంశ : ఉత్తరాషాడ నక్షత్ర ప్రధమ పాదం గురువుది. ఈ జాతకులు బుద్ధిమంతులు, స్థిరాస్తులు కలవారు, పెద్దల యందు భక్తి కలవారు, ధర్మపాలన చేయువారు.

82) పాపాంశ : ఉత్తరాషాడ నక్షత్ర ద్వితీయ పాదం శనిది. ఈ జాతకులు అందరికి పనికివచ్చే పనులు చేయటంలో సిద్ధహస్తులు.

83) ఉగ్రాంశ : ఉత్తరాషాడ నక్షత్ర తృతీయ పాదం శనిది. ఈ జాతకులు అల్ప సంతోషులు.

84) శోభనాంశ : ఉత్తరాషాడ నక్షత్ర చతుర్ధ పాదం గురువుది. ఈ జాతకులు శుభములు కలవారు, నిత్యం ఏదో ఒక పని చేసేవారు, వ్యాపార లక్షణాలు కలవారు.

22) శ్రావణా నక్షత్ర నాలుగు పాదాలకు అంశ గుణాలు :
85) మంగళాంశ : శ్రావణా నక్షత్ర ప్రధమ పాదం కుజుడిది. ఈ జాతకులు మంచి స్వభావం కలవారు.

86) భోక్తాంశ : శ్రావణా నక్షత్ర ద్వితీయ పాదం శుక్రుడిది. ఈ జాతకులు ఇతరులతో మంచిగా ఉంటారు.

87) విచక్షణాంశ : శ్రావణా నక్షత్ర తృతీయ పాదం బుధుడిది. ఈ జాతకులు ఉత్సాహ వంతులుగా ఉంటారు.

88) ధనాంశ : శ్రవణా నక్షత్ర చతుర్ధ పాదం చంద్రుడిది. ఈ జాతకులు పశుపోషకులు, యోగులు, ధార్మికులు అవుతారు.


23) ధనిష్ఠ నక్షత్ర నాలుగు పాదాలకు అంశగుణాలు :
89) రాజాంశ : ధనిష్ఠ నక్షత్ర ప్రధమ పాదం రవిది. ఈ జాతకులు దానగుణం కలవారు.

90) సౌమ్యాంశ : ధనిష్ఠ నక్షత్ర ద్వితీయ పాదం బుధుడిది. ఈ జాతకులు వినయ విధేయతలతో మాట్లాడేవారు. ఉన్నత విద్యలు చదివేవారు అవుతారు.

91) అభయాంశ : ధనిష్ఠ నక్షత్ర తృతీయ పాదం శుక్రుడిది. ఈ జాతకులు గుణవంతులు అవుతారు. చిరాయుష్మంతులు అవుతారు. సత్య పలుకులు పలుకువారు అవుతారు.

92) క్రూరాంశ : ధనిష్ఠ నక్షత్ర చతుర్ధ పాదం కుజుడిది. ఈ జాతకులు మంచి స్వభావం కలవారు.

24) శతభిష నక్షత్ర నాలుగు పాదాలకు అంశ గుణాలు :
93) ఉత్పన్నాంశ : శతభిష నక్షత్ర ప్రధమ పాదం గురువుది. ఈ జాతకులు గోవులను పూజించువారు. బ్రాహ్మణులపట్ల గౌరవం కలవారు.

94) పాపాంశ : శతభిష నక్షత్ర ద్వితీయ పాదం శనిది. ఈ జాతకులు సత్యం మాట్లాడువారు. స్థిరమైన బుద్ధి కలవారు, అభిమానవంతులు, స్నేహములను కలిగి ఉంటారు.

95) భయాంశ : శతభిష నక్షత్ర తృతీయ పాదం శనిది. ఈ జాతకులు పాండిత్యం కలవారు.

96) సౌమ్యాంశ : శతభిష నక్షత్ర చతుర్ధ పాదం గురువుది. ఈ జాతకులు స్నేహశీలురు, పండితులు, అభిమానవంతులు, యజ్ఞ కార్యాలు చేయువారుగా ఉంటారు.

25) పూర్వాభాద్ర నక్షత్ర నాలుగు పాదాలకు అంశగుణాలు :
97) సేవాంశ : పూర్వాభాద్ర నక్షత్ర ప్రధమ పాదం కుజుడిది. ఈ జాతకులు ఉద్యోగస్తులు, పూజ చేయువారు.

98) భోగాంశ : పూర్వాభాద్ర నక్షత్ర ద్వితీయ పాదం శుక్రుడిది. ఈ జాతకులు సాహసవంతులు, మంత్రోపాసన చేయువారు.

99) విచక్షణాంశ : పూర్వాభాద్ర నక్షత్ర తృతీయ పాదం బుధుడిది. ఈ జాతకులు పితృ ప్రియులు, జ్ఞానవంతులు.

100) ధనాంశ : పూర్వాభాద్ర నక్షత్ర చతుర్ధ పాదం చంద్రుడిది. ఈ జాతకులు అందరిచేత కీర్తింపబడేవారు, ధనవంతులు, మాతృ సేవకులుగా ఉంటారు.

26) ఉత్తరాభాద్ర నక్షత్ర నాలుగు పాదాలకు అంశ గుణాలు :
101) తీక్షణాంశ : ఉత్తరాభాద్ర నక్షత్ర ప్రధమ పాదం రవిది. ఈ జాతకులు జ్ఞానవంతులు, సౌమ్యమైన గుణం కలవారు.

102) అభయాంశ : ఉత్తరాభాద్ర నక్షత్ర ద్వితీయ పాదం బుధుడిది. ఈ జాతకులు జ్యోతిష శాస్త్ర పండితులుగా గాని, పంచాంగ కర్తలుగా గాని ఉంటారు.

103) అభయాంశ : ఉత్తరాభాద్ర నక్షత్ర తృతీయ పాదం శుక్రుడిది. ఈ జాతకులు తెలివితేటలు కలవారు, శాస్త్రవేత్తలు, ధనవంతులు అవుతారు.

104) దీనాంశ : ఉత్తరాభాద్ర నక్షత్ర చతుర్ధ పాదం కుజుడిది. ఈ జాతకులు ధనం సంపాదించువారు అవుతారు.

27) రేవతి నక్షత్ర నాలుగు పాదాలకు అంశ గుణాలు :
105) ఉత్పన్నాంశ : రేవతీ నక్షత్ర ప్రధమ పాదం గురువుది. ఈ జాతకులు శాస్త్రాలపైనా పట్టు గలవారు, నీతి నియమాలు కలవారు.

106) పాపాంశ : రేవతి నక్షత్ర ద్వితీయ పాదం శనిది. ఈ జాతకులు అవతలి వాళ్ళలోని గుణాలను గ్రహించగలిగే సామర్థ్యం కలవారు అవుతారు.

107) ఉగ్రాంశ : రేవతి నక్షత్ర తృతీయ పాదం శనిది. ఈ జాతకులు మంచి బుద్ధి కలవారు అగుదురు.

108) శోభనాంశ : రేవతి నక్షత్ర చతుర్ధ పాదం గురువుది. ఈ జాతకులు ఈ జాతకులు యజ్ఞ యాగాదులు చేయువారు, దైవ కార్యాలు చేయువారు, ధైర్యవంతులు అవుతారు.


కర్తరి నిర్ణయం
భారత పురాణాల ప్రకారం కాలాన్ని సూర్య, చంద్ర, బృహస్పతి మానాలలో కొలుస్తారు. 27 నక్షత్రాలు ప్రతిరోజు ఒక దాని తర్వాత ఒక్కటి ఉదయించి, అస్తమిస్తాయి.

చంద్రుడు ఉదయించినప్పుడు ఏ నక్షత్రం ఉదయిస్తే ఆ నక్షత్రం ఆ రోజుగా భావిస్తారు. చైత్ర పౌర్ణమినాడు చిత్త నక్షత్రంతో ఉదయించే చంద్రుడు మరుసటిరోజు వెనుకబడుతాడు.

సూర్యుని గమనంతో ముడిపడి వున్న కాలమానాన్ని సౌరమానం అంటారు. సూర్యుడు 14 రోజులపాటు ఒకే నక్షత్రంతో కలిసి ఉదయించి తర్వాత వెనుకబడుతాడు.

అశ్వనీ నక్షత్రంలో సూర్యుడు ఉదయించడం అరంభం కాగానే సూర్యుడు మేషరాశిలో ప్రవేశించినట్లుగా గణిస్తారు. సూర్యునితో కలిసి ఏ నక్షత్రం ఉదయిస్తుందో ఆ 13 రోజుల సమయాన్ని కార్తె అని పిలుస్తారు. ఇలా అశ్వని నుండి రేవతి వరకు 27 కార్తెలు వుంటాయి.

సాధారణంగా కర్తరీ మే నెల 4వతేదీన డొల్లుకర్తరీ, మే నెల 11వ తేదీన నిజకర్తరీ ప్రారంభమై మే నెల 28వ తేదీతో కర్తరీ త్యాగం జరుగుతుంది. సూర్యుడు మేషరాశికి చెందిన భరణి నక్షత్రం 4వ పాదంలో ప్రవేశించినది మొదలుకొని వృషభ రాశిలోని రోహిణి నక్షత్రం మొదటి పాదం దాటే వరకు గల మద్య కాలాన్ని "కర్తరీ" అంటారు. అంటే భరణి నాలుగో పాదం, కృత్తిక నాలుగు పాదాలు, రోహిణి మొదటి పాదం మొత్తం ఆరు పాదాలలో సూర్యుడు ఉన్న కాలం కర్తరీ అంటారు. దీనినే "కత్తెర" అనికూడ అంటారు. కర్తరి నక్షత్ర కాలంలో సూర్యుడు నిప్పులు చెరుగుతాడు. డిగ్రీలలో చెప్పాలంటే మేషరాశిలో (డిగ్రీల 23°-20' నిమిషాలు) నుండి వృషభరాశిలో (డిగ్రీల 26°-40' నిమిషాలు).


సూర్యుడు భరణి నక్షత్రం ప్రవేశించిన రోజే "డొల్లు కర్తరీ" ప్రారంభమవుతుంది. దీనినే "చిన్న కర్తరీ" అని కూడా అంటారు. సూర్యుడు కృత్తికా నక్షత్రం మొదటి పాదంలో ప్రవేశించే రోజుతో డొల్ల కర్తరీ అంతమై "నిజకర్తరి" ప్రారంభమవుతుంది.

సూర్యుడు రోహిణి నక్షత్ర రెండవ పాదం ప్రవేశంతో కర్తరీ త్యాగం అవుతుంది. కర్తరీలో చేయకూడని పనులు కొన్ని ఉన్నాయి. కర్తరిలో గృహ సంబంధమయిన పనులు చేయకూడదంటారు.

నిజానికి నక్షత్రమాన ప్రకారంగా వచ్చే కార్తెలు కర్షక, కార్మిక పంచాంగం అనచ్చు. భరణి మూడు నాలుగు పాదాలలో సూర్యుడున్నపుడు దొల్ల కర్తరి, కృత్తిక నాలుగు పాదాలు, రోహిణి రెండు పాదాలలో సూర్యుడు ఉన్నప్పుడు పెద్ద కర్తరి అంటాం.

కర్తరి అంటే కత్తెర అని అర్ధం, అంటే ఎండలో పనికి కత్తెరనమాట. వేసవిలో మే నెలలో 4,5 తారీకుల మొదలు మే 27,28 దాకా కర్తరి ఉంటుంది. ఆ తరవాత చల్లబడుతుంది కనక పనులు మొదలు పెట్టచ్చని భావన అయి ఉంటుంది. ఈ కార్తెలు ఒక రోజు ఇంచుమించులో ప్రతి సంవత్సరం ఒకలాగే వస్తాయి.


జన్మ నక్షత్రమున చేయదగిన కార్యములు
జన్మ నక్షత్రమున అన్నప్రాశనము, అక్షరాభ్యాసము, చౌళము, ఉపనయనము, నిషేకము, వ్యవసాయము, భూసంపాదన, మొదలగునవి శుభము. స్త్రీకి జన్మనక్షత్రమున వివాహము చేయుట మంచిది. పురుషులకు జన్మ నక్షత్రమున ఉపనయనము మంచిది.

వారశూలలు: శని సోమ వారములు తూర్పునకు, దక్షణమునకుగురువారము, పడమరకు ఆది శుక్రవారము, ఉత్తరమునకు బుధ మంగళ వారములు వారశూలలు. ఆ వారములలో ఆదిక్కునకు ప్రయాణము చేయరాదు అని అంటారు.

తిధి శూలలు: తూర్పునకు- పాడ్యమి, నవమి, తిధులలోను, ఉత్తరమునకు, విదియ, దశమి యందును; ఆగ్నేయమునకు, తదియ ఏకాదశి యందును; నైరుతి దిక్కునకు చవితి ద్వాదశి తిధులయండును; దక్షిణమునకు పంచమి త్రయోదశి యందును; పడమరకు, షష్టి, చతుర్దశి యందును; వాయువ్యమునకు, సప్తమి, పున్నమి యందును; ఈశాన్యమునకు, అష్టమీ, అమావాస్యలయందును ప్రయాణము చేయరాదు అని అంటారు.

యాత్రా (ప్రయాణ) విషయములు: పాడ్యమి యందు కార్య నాశనము, విదియ ధన లాభము, తదియ యందు శుభము, చవితి యందు సంకటము, పంచమినాడు, శుభము, షష్టి కలహము, సప్తమి ధనలాభము, అష్టమి కార్యనాశనము, నవమి విచారము, దశమి శుభము, ఏకాదశి కార్యజయము, ద్వాదశి కార్యనాశనము, త్రయోదశి శుభము, చతుర్దశి మరణము, పున్నమి అమావాస్యలలో కార్యనాశనము జరుగును అని నమ్మకము. ఈ విషయములు గమనించి చక్కగా వివేచించి ప్రయాణము చేయవలెను.


నక్షత్రాలు - శాంతులు
ప్రతి నక్షత్రంలో పుట్టిన జాతకుడు కొన్ని దానాలు చేయడం వలన ఆ జాతకుడి భవిష్యత్తు ఆనందకరంగా ఉంటుంది అని అంటారు. అలాగే నక్షత్ర శాంతికి హోమాలు, జపాలు చేయించుకోవలసి ఉంటుంది. అవి చాలా వ్యయ ప్రయాసలతో కూడుకొని ఉంటాయి. అలా చేయించుకోలేని వారి కోసం తంత్ర శాస్త్రం ప్రకారం ఈ పరిష్కారాలు చెప్పటం జరిగింది.

అశ్వని: వాయువ్యంలో గుఱ్ఱపు బొమ్మ లొహంతో చేసినది పెట్టడం మంచిది.

భరణి: ఏ పప్పుతో అయినా పంచదార వేసి “పూర్ణం” తయారు చేసి లక్ష్మీదేవికి నైవేద్యం పెట్టడం మంచిది.

కృత్తిక: తెల్లని పువ్వులు దేవాలయంలో దానంగా ఇవ్వాలి. వేదజ్ఞుల ఆశీర్వాదం తీసుకోవాలి.

రోహిణి:
ఆవులకు ఆహారం తినిపించాలి. అలాగే శివాలయంలో ఉన్న ఆవును పుజించాలి. దానికి ఆహరం తినిపించాలి.

మృగశిర: అమ్మవారికి యాలుకులతో పుజ చేయించాలి. అమ్మవారి ఆలయంలో పళ్ళు దానం చేయాలి.

ఆర్ద్ర: జంతువధ నిరోధానికి తోడ్పడాలి. రెండు పప్పు దినుసులు కలిసి ఆహారంగా ఉపయోగించండి.

పునర్వసు: మేలి రకం బియ్యం మీ ఊరిలోగాని దగ్గరలో గాని పడమర దిశగా ఉన్న శివాలయంలో దానంగా ఇవ్వాలి.

పుష్యమి: బార్లి, గోధుమలు, బియ్యం, చెరుకు వీటిలో ఏ వస్తువు అయినా సరే యజ్ఞాలు చేసే వారికి అయినా సత్ప్రవర్తన కలిగిన వారికి ఎవరికి అయినా శివాలయంలో దానంగా ఇవ్వాలి.

ఆశ్లేష: దుంప జాతి ఆహారాలను దానంగా ఇవ్వాలి. వైద్యులని సన్మానించాలి.

మఖ: తల్లిదండ్రులను సేవించే వారిని వెతికి ఆశీర్వాదం పొందాలి. కొండపై వెలసిన దైవ సన్నిధికి వెళ్లి దర్శనం చేసుకోవాలి.

పుబ్బ: నట, సంగీత, కళాకారులను గౌరవించాలి. తేనేను దానంగా ఇవ్వాలి.

ఉత్తర: ఉత్తమ ధాన్యమును సత్ప్రవర్తన గలవారికి దానం చేయాలి.

హస్త: వేద పండితుల వద్ద విద్యను అభ్యసించాలి.

చిత్త: యాలుకలు, కస్తూరి, లవంగాలు, పునుగు, జవ్వాది ఇవన్ని ఎర్ర వస్త్రంలో కట్టి దానం ఇవ్వాలి.

స్వాతి: 2 కిలోల శనగపప్పు దైవ ధ్యాసలో గడిపే వారికి దానం చేయాలి.

విశాఖ: ఉత్తర దిశలో మొక్కలు పెంచాలి. శనగలు దానం ఇవ్వాలి.

అనురాధ: బియ్యం, కొబ్బరి, ఖర్జూరం, బెల్లం ఇవన్ని మిశ్రమం తయారు చేసి దానంగా ఇవ్వాలి.

జ్యేష్ట: కంచు పాత్రలో కర్పూరం వేసి సైనికునికి దానంగా ఇవ్వాలి.

మూల: పేదలకి ఉచితంగా వైద్యం చేయడానికి ఆయుర్వేదిక్ వైద్యునికి మందుల డబ్బులు ఇవ్వవలెను.

పుర్వాషాడ: ఏనుగులకు అరటిపళ్ళు తినిపించడానికి మావటి వాళ్లకు ఇచ్చి దగ్గర ఉండి తినిపించాలి.

శ్రవణం: శ్రీ వెంకటేశ్వర క్షేత్రానికి వెళ్లి విష్ణు దర్శనం, విష్ణు భక్తుల దర్శనం చేసుకోవాలి.

ధనిష్ట: గోధుములు పుణ్యాత్ములకు శివాలయంలో దానం చేయాలి.

శతభిషం: ఎర్రని పువ్వులు దేవాలయంలో దానంగా ఇవ్వాలి.

పూర్వాబాధ్ర: కొంత నెయ్యి ఒంటరిగా జీవించే సత్పురుషులకి ఇవ్వవలెను.

ఉత్తరాబాధ్ర: కోవాను ప్రత్యేకంగా తయారు చేయించి 8 మంది వృద్ధ బ్రాహ్మణులకు శివాలయంలో దానం ఇవ్వండి.

రేవతి: పద్మములు, సువాసన గల పుష్పాలు, యాలుకులు, కస్తూరి, పునుగు, జవ్వాది ఇవన్ని ప్యాకింగ్ చేసి శివాలయంలో దానం చేయవలెను.


నిషిద్ద నవమీ త్రయము
నిషిద్ధము అంటే విడచి పెట్టబడునది అని అర్ధము. నవమీ త్రయము అనగా ఎదైనా ఒక తిధి నుండి తొమ్మిదవ తిధి, ఒక నక్షత్రము నుండి తొమ్మిదవ నక్షత్రము, ఒక రోజు నుండి తొమ్మిదవ రోజు వీటినే నవమీ త్రయము అని అంటారు.

ముఖ్యమైన పనులకొరకు, వివాహాది సంబంధములుకు ప్రయాణమై వెళ్ళునపుడు, కొత్త పెళ్ళి కూతురు, గర్భవతిగా ఉన్నప్పుడు, అలాగే చంటి బిడ్డతో తొలిసారి అత్తవారింటికి వెళ్ళునపుడు, తిరిగి ప్రయాణము చేయాల్సి ఉంటే అలాంటి సమయములో పైన తెలిపిన విషయములను తప్పక పాటించాలి.

ప్రయాణమై బయలుదేరిన తిధి నుండి తొమ్మిదవ తిధి, బయలు దేరిన రోజునుండి తొమ్మిదవ రోజు, బయలుదేరిన నక్షత్రము నుండి తొమ్మిదవ నక్షత్రమున తిరుగు ప్రయా ణము చెయ్యకూడదు. దీనినే నిషిద్ద నవమీ త్రయము అని అందురు.

నక్షత్రం - అధిపతులు

నామం - 1 పాదం - 2 పాదం - 3 పాదం - 4 పాదం

అశ్విని - కుజుడు - శుక్రుడు - బుధుడు - చంద్రుడు

భరణి - రవి - బుధుడు - శుక్రుడు - కుజుడు

కృత్తిక - గురువు - శని - శని - గురువు

రోహిణి - కుజుడు - శుక్రుడు - బుధుడు - చంద్రుడు

మృగశిర - రవి - బుధుడు - శుక్రుడు - కుజుడు

ఆరుద్ర - గురువు - శని - శని - గురువు

పునర్వసు - కుజుడు - శుక్రుడు - బుధుడు - చంద్రుడు

పుష్యమి - రవి - బుధుడు - శుక్రుడు - కుజుడు

ఆశ్లేష - గురువు - శని - శని - గురువు

మఖ - కుజుడు - శుక్రుడు - బుధుడు - చంద్రుడు

పూర్వఫల్గుణి - రవి - బుధుడు - శుక్రుడు - కుజుడు

ఉత్తరఫల్గుణి - గురువు - శని - శని - గురువు

హస్త - కుజుడు - శుక్రుడు - బుధుడు - చంద్రుడు

చిత్త - రవి - బుధుడు - శుక్రుడు - కుజుడు

స్వాతి - గురువు - శని - శని - గురువు

విశాఖ - కుజుడు - శుక్రుడు - బుధుడు - చంద్రుడు

అనురాధ - రవి - బుధుడు - శుక్రుడు - కుజుడు

జ్యేష్ఠ - గురువు - శని - శని - గురువు

మూల - కుజుడు - శుక్రుడు - బుధుడు - చంద్రుడు

పూర్వాషాఢ - రవి - బుధుడు - శుక్రుడు - కుజుడు

ఉత్తరాషాఢ - గురువు - శని - శని - గురువు

శ్రవణం - కుజుడు - శుక్రుడు - బుధుడు - చంద్రుడు

ధనిష్ట - రవి - బుధుడు - శుక్రుడు - కుజుడు

శతభిష - గురువు - శని - శని - గురువు

పూర్వాభద్ర - కుజుడు - శుక్రుడు - బుధుడు - చంద్రుడు

ఉత్తరాభద్ర - రవి - బుధుడు - శుక్రుడు - కుజుడు

రేవతి - గురువు - శని - బుధుడు - గురువు


జననకాల నక్షత్ర దోషాలు - పరిహారాలు
పిల్లలు పుట్టినప్పుడు నక్షత్రము మంచిదేనా? దోషములేమైనా ఉన్నాయా ? శాంతి అవసరమా ? అను సందేహము ప్రతి తల్లిదండ్రులకు కలుగుతుంది. ఏ నక్షత్రములలో జన్మించినపుడు ఏ దోషములు కలుగుతాయి దోష పరిహారములు ఏమిటి?

దోష నక్షత్రములలో జన్మించిన పిల్లలకు నక్షత్ర జపము, నవగ్రహ శాంతి, హోమము, నూనెలో నీడలు చూచుట, రుద్రాభికము, మొదలగు శాంతిని తప్పనిసరిగా జరిపించాలి. కొన్ని విశేష శాంతి కలిగిన నక్షత్రములకు శాస్త్రోక్తముగా విశేష శాంతి చేయాలి.

1. అశ్విని 1వ పాదములో జన్మంచిన పిల్లల వలన తండ్రికి దోషం. ఈ దోషము 3 నెలలు ఉండును. ఇక్కడ గమనించవలసిన విషయము రేవతి, అశ్విని నక్షత్రముల మధ్య సుమారు 48 నిమిషములు సంధి కాలము ఉంటుంది. ఈ సంధి సమయములో జన్మించిన శిశువుకు ఆయుర్దాయము తక్కువగా ఉంటుంది. అశ్విని 2,3,4 పాదములలో జన్మించిన వారికి దోషములేదు.

2. భరణీ 1,2,4 పాదములలో జన్మంచిన వారికి దోషములేదు. 3 వ పాదములో ఆడపిల్ల పుడితే తల్లికి, మగపిల్లాడు పుడితే తండ్రికి దోషం కలుగును. ఈ దోషము 23 దినముల వరకు ఉంటుంది.

3. కృత్తిక నక్షత్రములో 3వ పాదములో జన్మంచిన స్త్రీ తల్లికి పురుషుడు తండ్రికి సామాన్య దోషం కలుగచేయును. 1,2,4 పాదములలో జన్మంచినవారు స్వల్ప దోషమును కలుగ చేయుదురు.

4. రోహిణి నక్షత్రము 1వ పాదములో జన్మించిన మేనమామకు, 2వపాదము తండ్రికి, 3వ పాదము తల్లికి దోషమని 4 వ పాదము దోషము లేదని కొందరి అభిప్రాయము. సామాన్యముగా ఈ నక్షత్రములో పుట్టిన వలన మేనమామకు గండము. తప్పక శాంతి అవసరము. శ్రీ కృష్ణ పరమాత్ముడు ఈ నక్షత్రము నందే జన్మించాడు. మేనమామ గండములో పుట్టాడు. అందువలెనే కంసుడు నాశనమయ్యాడనీ పురాణ వచనము.

5. మృగశిర 1,2,3,4 పాదములలో జన్మించిన వారికి ఏ విధమైన దోషములు ఉండవు.

6. ఆరుద్ర నక్షత్రము 1,2,3 పాదములలో జన్మంచిన వారికి దోషము లేదు 4వ పాదమున జననము జరిగిన సామాన్య శాంతి అవసరము.

7. పునర్వసు నక్షత్రము 1,2,3,4 పాదములు అన్నీ మంచివే. ఏ విధమైన శాంతి అవసరము లేదు.

8. పుష్యమి నక్షత్రము కర్కాటక లగ్నములో పగటి సమయమున పురుషుడు పుట్టిన తండ్రికి గండము కలుగును. 
రాత్రి సమయాన స్త్రీ జన్మించినచో తల్లికి గండము కలుగును. 

పుష్యమి నక్షత్రములో జన్మించిన వారివలన 1వ పాదము మేనమామలకు 

2 పాదములలో తల్లి తండ్రులకు దోషము కలిగింతురు. 

మూడు, నాలుగవ పాదమున పుట్టిన వారికి సామాన్య దోషము కలుగును. 

వీరికి శాస్త్రోక్తముగా శాంతిని చేయించాలి. గంధపు చెక్కను దానము ఇచ్చుట వలన దోషము నశించును.

9. ఆశ్లేష నక్షత్రములో 1వ పాదమున పుట్టినవారికి దోషము లేదు. 2వ పాదము శిశువునకు 3వ పాదము తల్లికి 4వ పాదము తండ్రికి దోషము. నాలుగవ పాదమున జన్మించిన వారికి విశేష శాంతి చేయించుట అవసరము. ఈ నక్షత్రము యొక్క చివరన 24 నిమిషములు సంధి ఉండును.

10. మఖ నక్షత్ర 1వ పాదములో జననమైతే 5 నెలల వరకు తండ్రికి దోషము. మఖ నక్షత్ర ప్రారంభ సమయములో మొదటి 24 నిమిషములు అత్యంత దోషము. 3వ పాదమున పుట్టిన వారివలన తల్లి తండ్రి ఇద్దరికి దోషము. అశ్వము దానమిచ్చుట వలన దోషము తొలగును. 2, 4 పాదములలో జన్మించిన దోషము లేదు.

11. పుబ్బ నక్షత్రములో 1,2,3,4 పాదములలో జన్మించిన వారికి దోషము లేదు.

12. ఉత్తర నక్షత్ర 1,4వ పాదములలో జననము జరిగిన యెడల తల్లి, తండ్రి, అన్నలకు దోషము కలుగును. నూనె పాత్రను దానము చెయ్యాలి. మిగతా 2,3 పాదములలో పుట్టిన వారికి దోషము లేదు.

13.హస్తా నక్షత్ర 3వ పాదమున పుట్టిన పురుషుని వలన తండ్రికి, స్త్రీ వలన తల్లికి దోషము కలుగును. మిగతా 1,2,4 పాదములలో జన్మించిన వారికి దోషము లేదు.

14. చిత్త నక్షత్రములో 1వ పాదము తండ్రికి, 2వ పాదము తల్లికి 3వ పాదము తోడ పుట్టిన వారికి దోషము కలిగిస్తుంది. నాల్గవ పాదములో జన్మించిన వారికి సామాన్య దోషము కలుగును.

15. స్వాతి నక్షత్రమున 1,2,3,4 పాదములలో ఏ పాదమున జన్మించిననూ దోషము లేదు.

16. విశాఖ నక్షత్రము జన్మించిన వారికి మరుదులు మరియు బావలకు దోషము కలుగును. 1,2,3,4 ఏ పాదములో పుట్టిననూ బంధువులకు గండము. విశేష శాంతి అవసరము.

17. అనురాధ నక్షత్రములో 1,2,3,4 పాదములలో జన్మించుట వలన దోషము లేదు.

18. జ్యేష్ఠ నక్షత్రము ఈ నక్షత్రము విశేష శాంతి కలిగిన నక్షత్రము. దీనిలో 1,2,3,4 ఏ పాదములో జన్మించినా దోషమే. జాతకుల పుట్టిన రోజున ఉన్న జ్యేష్ఠ నక్షత్రము మొత్తము సమయాన్ని 10 భాగములు చేయాలి. 1వ భాగములో తాతయ్యకు 2 అమ్మమ్మ కు. 3 తల్లి తోడ బుట్టిన వారికి, మేనమామలకు; 4 అన్నలకు, అక్కలకు; 5 శిశువునకు; 6 ఎవ్వరికి దోషము ఉండదు; 7 వివాహ సమయములో అత్తవారి బంధు వర్గమునకు; 8 జాతకునకు; 9 తల్లికి; 10 తండ్రికి దోషము కలుగచేయును మరియు నాల్గవ పాదమున జననమైతే తండ్రికి దోషము. ఇది 9 నెలలు ఉండును. విశేష శాంతి చేయించాలి.


19. మూల నక్షత్రము ఈ నక్షత్రము ప్రారంభమున 24 నిమిషములు సంధి ఉండును. ఈ నక్షత్రములో 

1వ పాదమున జననమయిన వారి తండ్రికి, 
2వ పాదము తల్లికి, 
3వ పాదము ధనమునకు నాశనము కల్గించును 
4వ పాదమున జననము జరిగిన దోషము లేదు. మూలా నక్షత్ర సమయమును మొత్తం 12 భాగాలుగా విభజించి దోషమును తెలుసుకోవాలి.

పన్నెండు భాగాలలో 
1వ భాగము తండ్రికి దోషము, 
2 తల్లికి, 3 అన్నలకు, 
4 భాగస్వాములకు, 
5 పిల్లనిచ్చిన మామగారికి, 
6 చిన్నాన్న, పెద్ద నాన్నలకు, 
7 పిన్నమ్మ, పెద్దమ్మలకు మరియు మేనమామలకు, 
8 ధనమునకు, 
9 జీవన నాశనము, 
10 దరిద్రమును కల్గిస్తుంది, 
11 భృత్యులు, 
12 జాతకునికి నాశనము కలుగచేయును.

జ్యేష్ట, మూలా నక్షత్రములలో జన్మించిన వారి దోషము వివాహ కాలము వరకు ఉండును. దోష నివారణ కొరకు ఎద్దును దానమివ్వడము. నవగ్రహ శాంతి, జప, తప, దానములు ఇచ్చుట వలన దోషములు తొలగును.

20. పూర్వాషాడ నక్షత్రము పగటి వేళలో కుమారుడు జన్మించినపుడు తండ్రికి ఆపదలు కలుగును. 2, 3వ పాదములలో స్త్రీ గానీ పురుషుడు గానీ ఎవరు పుట్టిననూ తల్లి తండ్రి ఇద్దరికీ గండము. 4వ పాదమున జననము దోషము లేదు.

21. ఉత్తరాషాడ నక్షత్రము 1,2,3,4 పాదములలో జననము దోషము లేదు.

22.శ్రవణం నక్షత్రము 1,2,3,4 పాదములలో జననము దోషము లేదు.

23. ధనిష్ట నక్షత్రము 1,2,3,4 పాదములలో జననము దోషము లేదు.

24. శతభిషం నక్షత్రము 1,2,3,4 పాదములలో జననము దోషము లేదు.

25. పూర్వాబాద్ర నక్షత్రము 1,2,3 పాదములలో జననము దోషము లేదు. నాల్గవ పాదము సామాన్య దోషము.

26. ఉత్తరాభాద్ర నక్షత్రము 1,2,3,4 పాదములలో జననము దోషము లేదు.

27.రేవతి నక్షత్రము 1,2,3 పాదములలో జననము దోషము లేదు. 

4వ పాదమున దోషము. ఈ రేవతి నక్షత్రము చివరి ఘడియలలో జన్మించిన మృత్యుంజయ జపములు రుద్రాభిషేకము తప్పని సరిగా చేయించాలి.

ఈ నక్షత్రములనే కాక దుష్ట తిధి దోషము, వర్జ్యము, దుర్ముహూర్త కాలముల యందునూ, గ్రహణ సమయములలోనూ జన్మించినవారికి శాంతి చేయించుట ముఖ్యము. ఇందుకు ఈ రంగములలో ప్రసిద్ధులైన వ్యక్తులను సంప్రదించి వారి సూచనల మేరకు అభిషేకాదులను నిర్వహించుకొనవలెను.


నక్షత్ర మంత్రాలు
యజుర్వేదంలోని నక్షత్రేష్టిలో 27 నక్షత్రాలకు సంబంధించిన మంత్రాలు ఉన్నాయి. ఒక్కో నక్షత్రానికి 8 వాక్యాలతో కూడుకున్న మంత్రం ఉంటుంది. వైదిక సాహిత్యంలో అన్ని చోట్ల నక్షత్ర గణన కృత్తిక నక్షత్రం నుండి ప్రారంబమవుతుంది. కృత్తిక నుండి విశాఖ నక్షత్రం వరకు దేవ నక్షత్రాల విభాగంగాను అనూరాధ నుండి భరణి నక్షత్రం వరకు యమ నక్షత్రాలుగాను విభజించబడింది.

ఉత్తరాషాఢ 4వ పాదం శ్రవణా నక్షత్ర 1వ పాదం కలిసి అభిజిన్న క్షత్రం. జయింప శక్యంకాని పనులు జయింప జేయాలంటే అభిజిత్తులో చేయాలి.

సూర్యుడు ఉదయించినప్పుడు నక్షత్రం కనపడదు. కనుక సూర్యోదయానికి ముందే నక్షత్రాలు కనపడే సమయంలో నక్షత్ర మంత్రాలను పఠించాలి. ఒక నక్షత్రం సూర్యోదయం కన్నా ముందు తూర్పు ఆకాశంలో ఉదయించినప్పుడు ఒక నక్షత్రం సూర్యాస్తమయం తరువాత తూర్పు ఆకాశంలో ఉదయించినప్పుడు ఆయా నక్షత్రాలకు ఆయా రోజుల్లో పూజలు చేయాలని వైదిక సాహిత్యం సూచిస్తుంది.

నక్షత్రాల మంత్రాలను వారి వారి నక్షత్రాలను బట్టి రోజూ 11 సార్లు పఠించటం వల్ల సర్వశుభాలు కలుగుతాయి.

అశ్విని :
।। ఓం ।।
తదశ్వినావశ్వయుజోపయాతామ్ ।
శుభంగమిష్టౌ సుయమేభిరశ్వై: ।
స్వం నక్షత్రగ్మ్ హవిషా యజ౦తౌ ।
మధ్వాసంపృక్తౌ యజుషాసమక్తౌ ।
యౌ దేవానాం భిషజౌ హవ్యవాహౌ ।
విశ్వస్య దూతావమృతస్య గోపౌ ।
తౌ నక్షత్రం జుజుషాణోపయాతామ్ ।
నమో శ్విభ్యాం కృణుమో శ్వయుగ్భ్యామ్ ।।

భరణి :
।। ఓం ।।
అప పాప్మానం భరణీర్భరంతు ।
తద్యమో రాజా భగవాన్ విచష్టామ్ ।
లోకస్య రాజా మహతో మహాన్ హి ।
సుగం నః పంథామభయం కృణోతు ।
యస్మిన్నక్షత్రే యమ ఏతి రాజా ।
యస్మిన్నేనమభ్యషించంత దేవాః ।
తదస్య చిత్రగమ్ హవిషా యజామ ।
అప పాప్మానం భరణీర్భరంతు ।।

కృత్తిక :
।। ఓం ।।
అగ్నిర్నః పాతు కృత్తికాః ।
నక్షత్రం దేవమిఇంద్రియమ్ ।
ఇదమాసాం విచక్షణమ్ ।
హవిరాసం జుహోతన ।
యస్య భాంతి రశ్మయో యస్యకేతవః ।
యస్యేమా విశ్వా భువనాని సర్వా ।
స కృత్తికాభిరభిసంవసానః ।
అగ్నిర్నో దేవస్సువితే దధాతు ।।

రోహిణి :
।। ఓం ।।
ప్రజాప'తే రోహిణీవే'తు పత్నీ ।
సా నో' యస్య' సువితే ద'ధాతు ।
రోహిణీదేవ్యుద’గాత్పురస్తా”త్ ।
ప్రజాప'తిగ్మ్ హవిషా' వర్ధయంతీ ॥
విశ్వరూ'పా బృహతీ చిత్రభానుః ।
యథా జీవేమ శరదస్సవీ'రాః ।
విశ్వా' రూపాణి' ప్రతిమోద మానా ।
ప్రియా దేవానాముప’యాతు యజ్ఞమ్ ॥

మృగశిర :
।। ఓం ।।
సోమో రాజా' మృగశీర్షేణ ఆగన్న్' ।
శివం నక్షత్రం ప్రియమ’స్య ధామ' ।
ఆప్యాయ'మానో బహుధా జనేషు ।
రేతః' ప్రజాం యజ'మానే దధాతు ।
యత్తే నక్షత్రం మృగశీర్షమస్తి' ।
ప్రియగ్మ్ రా'జన్ ప్రియత'మం ప్రియాణా”మ్ ।
తస్మై' తే సోమ హవిషా’ విధేమ ।
శన్న' ఏధి ద్విపదే శం చతుష్పదే ॥

ఆరుద్ర :
।। ఓం ।।
ఆర్ద్రయా' రుద్రః ప్రథ’మా న ఏతి ।
శ్రేష్టో' దేవానాం పతి'రఘ్నియానా”మ్ ।
నక్షత్రమస్య హవిషా' విధేమ ।
మా నః' ప్రజాగ్మ్ రీ'రిషన్మోత వీరాన్ ।
హేతి రుద్రస్య పరి'ణో వృణక్తు ॥
ఆర్ద్రా నక్షత్రం జుషతాగ్మ్ హవిర్నః' ।
ప్రముంచమా'నౌ దురితాని విశ్వా" ।
అపాఘశగ్మ్' సన్నుదతామరా'తిమ్ ॥

పునర్వసు :
।। ఓం ।।
పున'ర్నో దేవ్యది'తిస్పృణోతు ।
పునర్వసూనః పునరేతాం" యజ్ఞమ్ ।
పున'ర్నో దేవా అభియంతు సర్వే" ।
పునః ' పునర్వో హవిషా' యజామః ।
ఏవా న దేవ్యది' తిరనర్వా ।
విశ్వ'స్య భర్త్రీ జగతః ప్రతిష్ఠా ।
పునర్వసూ హవిషా' వర్ధయంతీ ।
ప్రియం దేవానా-మప్యే'తు పాథః' ॥

పుష్యమి :
।। ఓం ।।
బృహస్పతిః' ప్రథమం జాయ'మానః ।
తిష్యం' నక్షత్రమభి సంబ'భూవ ।
శ్రేష్టో' దేవానాం పృత'నాసుజిష్ణుః ।
దిశో ను సర్వా అభ'యన్నో అస్తు ।
తిష్యః' పురస్తా'దుత మధ్యతో నః' ।
బృహస్పతి'ర్నః పరి'పాతు పశ్చాత్ ।
బాధే'తాంద్వేషో అభ'యం కృణుతామ్ ।
సువీర్య'స్య పత’యస్యామ ॥

ఆశ్లేష :
।। ఓం ।।
ఇదగ్మ్ సర్పేభ్యో' హవిర’స్తు జుష్టమ్” ।
ఆశ్రేషా యేషా'మనుయంతి చేతః' ।
యే అంతరిక్షం పృథివీం క్షీయంతి' ।
తే న'స్సర్పాసోహవమాగ'మిష్ఠాః ।
యే రో'చనే సూర్యస్యాపి' సర్పాః ।
యే దివం' దేవీమను సంచరంతి ।
యేషా'మశ్రేషా అ'నుయంతి కామమ్” ।
తేభ్య స్సర్పేభ్యో మధు'మజ్జుహోమి ॥

మఖ (మఘ) :
।। ఓం ।।
ఉప'హూతాః పితరో యే మఘాసు' ।
మనో'జవసస్సుకృత'స్సుకృత్యాః ।
తే నో నక్షత్రే హవమాగ'మిష్ఠాః ।
స్వధాభి'ర్యజ్ఞం ప్రయ'తం జుషంతామ్ ।
యే అగ్నిదగ్ధా యే న'గ్నిదగ్ధాః ।
యే' ముల్లోకం పితరః' యంతి' ।
యాగ్శ్చ' విద్మయాగ్మ్ ఉ' చ న ప్ర'విద్మ ।
మఘాసు' యఙ్ఞగ్మ్ సుకృతం జుషంతామ్ ॥

పుర్వా ఫల్గుని (పుబ్బ) :
।। ఓం ।।
గవాం పతిః ఫల్గు'నీనామసి త్వమ్ ।
తద'ర్యమన్ వరుణమిత్ర చారు' ।
తం త్వా' వయగ్మ్ స'నితారగ్మ్' సనీనామ్ ।
జీవా జీవంతముపసంవి'శేమ ।
యేనేమా విశ్వా భువ'నాని సంజితా ।
యస్య' దేవా అ'నుసంయంతి చేతః' ।
అర్యమా రాజా జరస్తు వి'ష్మాన్ ।
ఫల్గు'నీనామృషభో రో'రవీతి ॥

ఉత్తర ఫల్గుని (ఉత్తర) :
।। ఓం ।।
శ్రేష్టో' దేవానాం" భగవో భగాసి ।
తత్త్వా' విదుః ఫల్గు'నీస్తస్య' విత్తాత్ ।
అస్మభ్యం' క్షత్రమజరగ్మ్' సువీర్యమ్” ।
గోమదశ్వ'వదుపసన్ను' దేహ ।
భగో'హ దాతా భగ ఇత్ప్ర'దాతా ।
భగో' దేవీః ఫల్గు’నీరావి'వేశ ।
భగస్యేత్తం ప్రసవం గ'మేమ ।
యత్ర' దేవైస్స'ధమాదం' మదేమ ॥

హస్త :
।। ఓం ।।
ఆయాతు దేవస్స'వితోప’యాతు ।
హిరణ్యయే'న సువృతా రథే'న ।
వహన్, హస్తగ్మ్' సుభగ్మ్' విద్మనాప'సమ్ ।
ప్రయచ్ఛంతం పపు'రింపుణ్యమచ్ఛ' ।
హస్తః ప్రయ’చ్ఛ త్వమృతం వసీ’యః ।
దక్షి'ణేన ప్రతి'గృభ్ణీమ ఏనత్ ।
దాతార'మద్య స'వితా వి'దేయ ।
యో నో హస్తా'య ప్రసువాతి యజ్ఞమ్ ॥

చిత్త (చిత్ర) :
।। ఓం ।।
త్వష్టా నక్షత్రమభ్యే'తి చిత్రామ్ ।
సుభగమ్ స'సంయువతిగమ్ రాచ'మానామ్।
నివేశయ'న్నమృతాన్మర్త్యాగ్'శ్చ ।
రూపాణి' పిగ్ంశన్ భువ'నానివిశ్వా" ।
తన్నస్త్వష్టా తదు' చిత్రా విచ’ష్టామ్ ।
తన్నక్షత్రం భూరిదా అ'స్తు మహ్యమ్” ।
తన్నః' ప్రజాం వీరవ'తీగమ్ సనోతు ।
గోభి'ర్నోఅశ్వైస్సమ'నక్తు యజ్ఞమ్ ॥

స్వాతి :
।। ఓం ।।
వాయుర్నక్షత్రమభ్యే'తి నిష్ట్యా”మ్ ।
తిగ్మశృం'గో వృషభో రోరు'వాణః ।
సమీరయన్ భువ'నా మాతరిశ్వా" ।
అప ద్వేషాగ్మ్'సి నుదతామరా'తీః ।
తన్నో' వాయస్తదు నిష్ట్యా' శృణోతు ।
తన్నక్షత్రం భూరిదా అ’స్తు మహ్యమ్” ।
తన్నో' దేవాసో అను'జానంతు కామమ్” ।
యథా తరే’మ దురితానివిశ్వా” ॥


విశాఖ :
।। ఓం ।।
దూరమస్మచ్ఛత్ర'వో యంతు భీతాః ।
తది' ద్రాగ్నీ కృ'ణుతాం తద్విశా'ఖే ।
తన్నో' దేవా అను'మదంతు యజ్ఞమ్ ।
పశ్చాత్ పురస్తాదభ'యన్నో అస్తు ।
నక్షత్రాణామధి'పత్నీ విశా'ఖే ।
శ్రేష్ఠా'వింద్రాగ్నీ భువ'నస్య గోపౌ ।
విషూ'చశ్శత్రూ'నపబాధ'మానౌ ।
అపక్షుధ'న్నుదతామరా'తిమ్ ॥

అనూరాధ:
।। ఓం ।।
ఋద్ధ్యాస్మ' హవ్యైర్నమ'సోపసద్య' ।
మిత్రం దేవం మి’త్రధేయం' నో అస్తు ।
అనూరాధాన్, హవిషా' వర్ధయంతః ।
శతం జీ'వేమ శరదః సవీ'రాః ।
చిత్రం నక్షత్రముద'గాత్పురస్తా”త్ ।
అనూరాధా స ఇతి యద్వదంతి ।
తన్మిత్ర ఏ'తి పథిభిర్దేవయానై: ।
హిరణ్యయైర్విత తైరంతరిక్షే ||

జ్యేష్ఠ:
।। ఓం ।।
ఇంద్రో” జ్యేష్ఠామను నక్షత్రమేతి ।
యస్మి'న్ వృత్రం వృ'త్ర తూర్యే' తతార' ।
తస్మిన్వయ-మమృతం దుహా'నాః ।
క్షుధంతరేమ దురి'తిం దురి'ష్టిమ్ ।
పురందరాయ' వృషభాయ' ధృష్ణవే" ।
అషా'ఢాయ సహ'మానాయ మీఢుషే" ।
ఇంద్రా'య జ్యేష్ఠా మధు'మద్దుహా'నా ।
ఉరుం కృ'ణోతుయజ'మానాయ లోకమ్ ॥

మూల :
।। ఓం ।।
మూలం' ప్రజాం వీరవ'తీం విదేయ ।
పరా"చ్యేతు నిరృతిః పరాచా ।
గోభిర్నక్షత్రం పశుభిస్సమ'క్తమ్ ।
అహ’ర్భూయాద్యజ'మానాయ మహ్యమ్” ।
అహ'ర్నో అద్య సు'వితే ద’దాతు ।
మూలం నక్షత్రమితి యద్వదంతి ।
పరా'చీం వాచా నిరృతిం నుదామి ।
శివం ప్రజాయై' శివమ'స్తు మహ్యమ్” ॥

పూర్వాషాఢ :
।। ఓం ।।
యా దివ్యా ఆపః పయ'సా సంబభూవుః ।
యా అంతరి'క్ష ఉత పార్థి'వీర్యాః ।
యాసా'మషాఢా అ'నుయంతి కామమ్” ।
తా న ఆపః శగ్గ్ స్యోనా భ'వంతు ।
యాశ్చ కూప్యా యాశ్చ' నాద్యా" స్సముద్రియాః ।
యాశ్చ' వైశంతీరుత ప్రాసచీర్యాః ।
యాసా'మషాఢా మధు' భక్షయంతి ।
తా నఆపః శగ్గ్ స్యోనా భ'వంతు ॥

ఉత్తరాషాఢ :
।। ఓం ।।
తన్నో విశ్వే ఉప' శృణ్వంతు దేవాః ।
తద’షాఢా అభిసంయంతు యజ్ఞమ్ ।
తన్నక్షత్రం ప్రథతాం పశుభ్యః' ।
కృషిర్వృష్టిర్యజ'మానాయ కల్పతామ్ ।
శుభ్రాః కన్యా' యువతయ' స్సుపేశ’సః ।
కర్మకృత'స్సుకృతో' వీర్యా'వతీః ।
విశ్వా”న్ దేవాన్, హవిషా' వర్ధయ'౦తీః ।
అషాఢాః కామముపా'యంతు యజ్ఞమ్ ॥


అభిజిత్ :
।। ఓం ।।
యస్మిన్ బ్రహ్మాభ్యజ'యత్సర్వ' మేతత్ ।
అముంచ' లోకమిదమూ'చ సర్వమ్” ।
తన్నో నక్షత్రమభిజిద్విజిత్య' ।
శ్రియం' దధాత్వహృ'ణీయమానమ్ ।
ఉభౌ లోకౌ బ్రహ్మ'ణా సంజి'తేమౌ ।
తన్నో నక్షత్రమభిజిద్విచ’ష్టామ్ ।
తస్మి'న్వయం పృత'నాస్సంజ’యేమ ।
తన్నో' దేవాసో అను'జానంతుకామమ్” ॥

శ్రవణం :
।। ఓం ।।
శృణ్వన్తి' శ్రోణామమృత'స్య గోపామ్ ।
పుణ్యా'మస్యా ఉప'శృణోమి వాచమ్” ।
మహీం దేవీం విష్ణుపత్నీమజూర్యామ్ ।
ప్రతీచీ' మేనాగ్మ్ హవిషా' యజామః ॥త్రేధా విష్ణు’రురుగాయో విచక్రమే ।
మహీం దివం' పృథివీమంతరి'క్షమ్ ।
తచ్ఛ్రోణైతిశ్రవ’-ఇచ్ఛమా'నా ।
పుణ్యగ్గ్ శ్లోకం యజ'మానాయ కృణ్వతీ ॥

ధనిష్ఠ :
।। ఓం ।।
అష్టౌ దేవా వస'వస్సోమ్యాసః' ।
చత’స్రో దేవీరజరాః శ్రవిష్టాః ।
తే య్ణం పాంతు రజ'సః పురస్తా”త్ ।
సంవత్సరీణ'మమృతగ్గ్' స్వస్తి ।
యం నః' పాంతు వస'వః పురస్తా”త్ ।
దక్షిణతో' భియంతు శ్రవి'ష్ఠాః ।
పుణ్యన్నక్షత్రమభి సంవి'శామ ।
మా నో అరా'తిరఘశగా సాగన్న్' ॥

శతభిషం :
।। ఓం ।।
క్షత్రస్య రాజా వరు'ణో ధిరాజః ।
నక్షత్రాణాగమ్ శతభి'షగ్వసి'ష్ఠః ।
తౌ దేవేభ్యః' కృణుతో దీర్ఘమాయుః' ।
శతగ్మ్ సహస్రా' భేషజాని' ధత్తః ।
యన్నోరాజా వరు'ణ ఉప'యాతు ।
తన్నో విశ్వే' అభి సంయంతు దేవాః ।
తన్నో నక్షత్రగ్మ్ శతభి'షగ్జుషాణమ్ ।
దీర్ఘమాయుః ప్రతి’రద్భేషజాని' ॥

పూర్వాభాద్ర :
।। ఓం ।।
అజ ఏక పాదుద'గాత్పురస్తా”త్ ।
విశ్వా' భూతాని' ప్రతి మోద'మానః ।
తస్య' దేవాః ప్రసవం యంతి సర్వే" ।
ప్రోష్ఠపదాసో' అమృత'స్య గోపాః ।
విభ్రాజ’మానస్సమిధా న ఉగ్రః ।
ఆంతరి'క్షమరుహదగంద్యామ్ ।
తగ్మ్ సూర్యం' దేవమజమేక' పాదమ్ ।
ప్రోష్ఠపదాసో అను’యంతి సర్వే" ॥

ఉత్తరాభాద్ర :
।। ఓం ।।
అహిర్బుద్ధ్నియః ప్రథ’మా న ఏతి ।
శ్రేష్టో' దేవానా'ముత మాను'షాణామ్ ।
తం బ్రా”హ్మణాస్సో' మపాస్సోమ్యాసః' ।
ప్రోష్ఠపదాసో' అభిర’క్షంతిసర్వే” ।
చత్వార ఏక'మభి కర్మ' దేవాః ।
ప్రోష్ఠపదా స ఇతి యాన్, వదంతి ।
తే బుధ్నియం' పరిషద్యగ్గ్' స్తువంతః' ।
అహిగ్మ్' రక్షంతినమ’సోపసద్య' ॥

రేవతి :
।। ఓం ।।
పూషా రేవత్యన్వే'తి పంథా”మ్ ।
పుష్టిపతీ' పశుపా వాజ' బస్త్యౌ ।
ఇమాని' హవ్యా ప్రయ'తా జుషాణా ।
సుగైర్నో యానైరుప’యాతాం యమ్ ।
క్షుద్రాన్ పశూన్ ర'క్షతు రేవతీ' నః ।
గావో' నో అశ్వాగ్మ్ అన్వే'తు పూషా ।
అన్నగం రక్షంతౌ బహుధా విరూ'పమ్ ।
వాజగ్మ్' సనుతాంయజ'మానాయ యజ్ఞమ్ ॥

యోగములు
1. విష్కంభము
2. ప్రీతి
3. ఆయుష్మాన్
4. సౌభాగ్య
5. శోభన
6. అతిగండ
7. సుకర్మ
8. దృతి
9. శూల
10. గండ
11. వృద్ధి
12. దృవ
13. వ్యాఘాత
14. హర్షణ
15. వజ్ర
16. సిద్ధి
17. వ్యతీపాత
18. వరీయాన్
19. పరిఘ
20. శివ
21. సిద్ధి
22. సాధ్య
23. శుభ
24. శుభ్ర
25. బ్రహ్మ
26. ఐంద్ర
27. వైదృతి
మొత్తం 27 యోగములు ఇందు విష్కంభము, అతిగండ, శూల, గండ, వ్యాఘాత, వజ్ర, వరియాన్, పరిఘ, వైద్రుతియను 9 యోగములు మాత్రము సమస్త శుభ కర్మలయందు పనికిరావు. మిగిలిన యోగములు శుభప్రదము.

కరణములు
1. బవ
2. బాలువ
3. కౌలువ
4. తైతుల
5. గరజి
6. వణజి
7. భద్ర
8. శకుని
9. చతుష్పాత్
10. నాగవ
11. కింస్తుఘ్నము

మొత్తం 11 కరణములు వీటిలో మొదటి ఏడు కరణములు చర సంజ్ఞ గలవి. మిగిలిన నలుగు స్థిర సంజ్ఞ గలవి. ఈ కరణములు ప్రతిదినము వరుస క్రమములో రాజాలవు. గణిత విధానము ననుసరించి ఒక తిధికి రెండు కరణము లేర్పడుచుండ గలవు. మరియు శుక్ల, కృష్ణ పక్షముల యందు గల భేదముచే కరణములు మార్పుజెందు చుండగలవు. వీనియందు భద్రకరణము, శకుని కరణము శుభకార్యములయందు గొప్ప దోష ప్రదములు, గరజి, వణజి, చతుష్పాత్, నాగవ, కింస్తుఘ్న కరణములు సామాన్య దోష ప్రదములు, మిగిలిన బావ, బాలువ, కౌలువ, తైతుల కరణములు మాత్రమే శుభకార్యములు శుభప్రదమై యున్నవి.

సంవత్సరము నందలి అయనము, ఋతువు, మాసము, పక్షము, తిధి, వారము, నక్షత్రము, యోగము, కరణములను పంచాంగ యుక్త మగు కాల విశిష్ఠతను వివరణత్మకమగు యోగ్యా యోగ్యతలను గుర్తించుట ముహూర్త నిర్ణయమునకు అతి ముఖ్యాంశము. పంచాంగ శుద్ధి ప్రధమ కర్తవ్యము.

గ్రహములు -వివరములు


1. సూర్యుడు

ప్రతివారికి వారి వారి జాతకములు ననుసరించి జీవిత కాలంలో అనేక శుభా శుభ ఫలితము లీ నవగ్రహములవల్లనే కలుగుచుంటవి. వీరిలో గురు, శుక్ర, పూర్ణ చంద్రులు మాత్రమే నైసర్గిక శుభ గ్రహములు! మిగిలినవారు నైసర్గిక పాప గ్రహములు లగుదురు. బుధుడు - ఏ గ్రహ సంభంధమును పొంది యుండిన ఆ గ్రహముయొక్క  శుభ లేక పాపత్వములు కలిగియున్దగలడు. జాతక చక్రములు పరిశీలించుటకు ముందు - ఈ గ్రహముల యొక్క  పూర్తి స్వరూప -స్వభావములు, వీరికి కల్గు శుభా - శుభ స్థితి మరియు ఉచ్ఛ - నీచలు, పరస్పర శత్రు - మిత్రత్వములు  పరిశీలించుట చాల అవసరము! కేంద్ర స్థానములకు ఆధిపత్యము వహించిన  నైసర్గిక శుభ గ్రహములు - పాప (అశుభ ) ఫలితములు నివ్వగలవు. అదే విధముగా కోణ స్థానదిపత్యము నందిన నైసర్గికపాపగ్రహములు కూడా చెడు ఫలితములనే కలుగజేయును. సహజముగా దుష్ట స్థానములని చెప్పబడు - లగ్నాధి 6, 8, 12 స్థానముల ఆధిపత్యము - ఏ గ్రహములకు కలిగినను వారు మంచిని చేయగలరు. 2, 3, 11 ఆధిపత్యములు కూడా అంత మంచివి కావు. 

లగ్నాధిగా స్థాన వివరణ
కేంద్ర స్థానములు:- 1, 4, 7, 10 (కంటకములు )
త్రికోణస్థానములు :- 1, 5, 9 (కోణములు )
అపచయ స్థానములు :- 1, 2, 4, 5, 7, 8, 9, 12
ఉపచయ స్థానములు :-3, 6, 10, 11
పణ పరములు :- 2, 5, 8, 11
అపో క్లీబ స్థానములు :- 3, 6, 9, 12
త్రిషడాయములు :- 3, 6, 11
త్రికములు 6, 8, 12

గ్రహద్రుష్టి: ప్రతి గ్రహము తానున్న రాసి నుండి ఏడవ రాశిని, అందలి గ్రహములను వీక్షించగలదు . మరియు గురువు ఫైవిధముగా గానే 5, 9 రాశుల యందు, కుజుడు 4, 8 రాశుల యందు , శని 3, 10 రాశుల యందు విశేష దృష్టి కలిగియుండగలరు. 7 వ రాశి యందలి దృష్తి పూర్ణ దృష్టి! శనికి - 3, 10 స్థానముల దృష్టి, కుజునికి - 4, 8 స్థానముల దృష్టి, గురునికి - 5, 9 స్థానముల దృష్టి విశేష బలము గలిగి యుండగలవు.

గ్రహములు - ఆధిపత్యాదులు

గ్రహ
ములు 
ఆధిపత్య
స్వస్థలము
ఉచ్చ
రాశులు
పరమోచ్చ 
భాగాలు
నీచ 
రాశులు
పరమనీచ 
భాగాలు
మూల 
త్రికోణాలు
మిత్ర 
గ్రహములు
సమ 
గ్రహములు
శత్రు 
గ్రహములు
రవిసింహముమేష10తుల10
సింహం 
2/3భాగం
చం, కు,
గు 
బు శ , శు 
చంద్రకర్కాటకంవృషభం3వృశ్చిక3
(వృషభం) 
కర్కాటకం
ర, బుకు, గు,
శు , శ  
-
కుజ 
మేషము 
వృశ్చికం
మకరం 28కర్కాటక 15
మేషం 
12/30 బాగం 
ర, చం,
గు 
శు, శ,బు 
బుధ
మిధునం 
కన్య
కన్య15 మీన 15
కన్య 
2వ భాగం
ర, శు, కు, గు, శ చం 
గురు 
ధనుస్సు 
మీనము
కర్కాటక5మకరం5
ధనస్సు 
1/3భాగం
ర, చంశ బు, శు 
శుక్ర
వృషబం 
తుల
మీనం27కన్య27 
తుల 
9/10 భాగం
బు, శ కు, గు ర, చం 
శని 
మకరం  
కుంభం 
తుల 20మేషం 20
కుంభం  
2/3భాగం 
బు, శు గు ర, చం, కు 
రాహు
మిధునం
ధను 
సింహం శు, శ బు, గు ర, చం, కు 
కేతు 
ధను 
మిధునం 
కుంభం ర, చం, కు బు, గు శు, శ

"సృష్టి, స్థితి, లయములను కలిగింపుచు కొనసాగుచున్న కల చక్రమునందు వివిధ దశలు సంప్రాప్తించుటకు ఆధార భూతమైనది "భచక్రము" అందు నిరంతరము సంచరించునవి గ్రహములు!" అని సనాతన జ్యోతిశ్శాస్త్ర భిప్రాయము.

భచక్రము 12 రాశులుగా విభజింపబడి, అందు 27 నక్షత్రములు, 108 నక్షత్ర పాదములు కల్గి, 360 భాగాల (డిగ్రీల) ప్రమాణమై యున్నది. వర్తులాక్రుతిగల భూమి తన చుట్టూ తాను తిరుగు చున్నపుడు ఏ ప్రదేశంలో, ఏ సమయంలో బచక్రమునందలి ఏ రాశి యొక్క కిరణములు భూమి ఫై బడునో ఆ సమయంలో అ సమయంలో ఆ రాశియే జాతకుల జన్మలగ్నము కాగలదు . జన్మ లగ్నము ననుసరించియే జాతకుల యొక్క శేషించిన తను ధనాది భావము లెర్పడుచున్నవి. ఈ విధమైన లగ్న నిర్ణయమును గావించుటయే జ్యోతిశ్శాస్త్రంలో బహుకష్టమైన విషయము ఇందుకు జాతకుడు జన్మించిన సమయము, ఆ ప్రదేశమునందలి అక్షాంశ - ధీర్గంశలు, ఆయనాంశాలు, మొదలగునవెన్నో విషయములను పరిశీలించి, జన్మలగ్న నిర్ణయము గావింపవలసియున్నది.

జన్మలగ్నముతో బాటుగా జాతకుని ఫలితములను గమనించునపుడు చంద్రలగ్నము (చంద్రుడున్న రాశి), రవి లగ్నము (రవి యున్న రాశి ), నవాంశ లగ్నము (జన్మ లగ్నము యొక్క నవాంశ ) లను కూడా పరిగణన లోనికి తీసుకోవలసి యున్నది. జననము మొదలు 30 సంవత్సరముల వరకు జన్మ లగ్నము నుండి, పిమ్మట 60 సం।।ల వరకు చంద్ర లగ్నము నుండి, తరువాత 90 సం॥ ల వరకు రవి లగ్నము నుండి, అటు పిమ్మట నవాంశలగ్నము నుండి జాతకుని యొక్క ఫలితములను ధెల్పవలెనని కొందరు శాస్త్రకారుల అభిప్రాయము. ముఖ్యముగా ఫలితములను పరిశీలీంచునప్పుడు జన్మకాలమునకు గల ద్వాదశ భావముల యొక్క సహజస్థితి (భావస్పుటము) గ్రహముల యొక్క స్పుట, బాగా, లిప్తలు, షడ్వర్గ బలము, అష్టకవర్గ బలము, ఆధిపత్యములు, యుతి, దృష్తి అను వానిని వివిధ రకాలుగా పరిశీలించి, గ్రహింపకుండిన ఫలితములు తారుమారు కగలవు.

జాతక ఫలితములను దెల్పుటకు జన్మకాలమునందలి గ్రహస్థితులతో బాటుగా ఆయా దశా భుక్తుల యొక్క కాలము నందలి గోచార గ్రహముల యొక్క బలాబలములుగూడా ఆలోచించుట సమంజసము. చంద్ర స్థితి, రాశి నుండి ఏర్పడు ఈ గోచార గ్రహముల ప్రభావము జాతకుని ధశాంతర్ధశా ఫలితముల ఫై తప్పక ఏర్పడగలదు. గోచారము నందలి గ్రహముల ద్వారా ఫలితములనాలోచించునప్పుడు వేదలు, అష్టక వర్గము ప్రాధాన్యత కల్గియుండగలవు. కావున జన్మలగ్న, చంద్రలగ్నముల ద్వారా ఆయా వయోకాలముల యందలి జ్యోతిష ఫలితములను నిర్దుష్టముగా గుర్తించుటకు వీలు కల్గుచున్నధి.

ద్వాదశరాశులకు ఆధిపత్య గ్రహములు

1.మేష లగ్నమునకు: లగ్న అష్టమాధిపతి కుజుడు, ద్వితీయ సప్తమాధిపతి శుక్రుడు, తృతీయ షష్టాదిపతి బుధుడు, చతుర్దాదిపతి చంద్రుడు, పంచమాదిపతి రవి, నవమ వ్యయాధిపతి గురువు, దశమ లాభాధిపతి శని.

2.వృషభ లగ్నమునకు: లగ్నషష్టాధిపతి శుక్రుడు, ద్వితీయ పంచమాధిపతి బుధుడు, తృతీయాధిపతి చంద్రుడు, చతుర్దాధిపతి రవి, సప్తమవ్యయాధిపతి కుజుడు, అష్టమ లాభాధిపతి గురువు, నవమ దశమాధిపతి శని!

3.మిధున లగ్నమునకు: లగ్న చతుర్ధాదిపతి బుధుడు, ద్వితీయాధిపతి చంద్రుడు, తృతీయాధిపతి రవి, పంచమ వ్యయాధిపతి శుక్రుడు, షష్టలాభాధిపతి సప్తమ దశమాధిపతి గురుడు, అష్టమ నవమాధిపతి శని!

4.కర్కాటకలగ్నమునకు: లగ్నాధిపతి చంద్రుడు, ద్వితీయాధిపతి రవి, తృతీయవ్యాయాధిపతి బుధుడు, చతుర్ధ లాభాధిపతి శుక్రుడు, పంచమ ధశమాధిపతి కుజుడు, షష్టభాగ్యాధిపతి గురువు, సప్తమ వ్యయాధిపతి శని!

5.సింహ లగ్నమునకు: లగ్నాధిపతి రవి, ద్వితీయ లభాదిపతి బుధుడు, తృతీయ ధశమాధిపతి శుక్రుడు, చతుర్ధ భాగ్యాధిపతి కుజుడు, పంచమ అష్టమాధిపతి గురువు, షష్ట సప్తమాధిపతి శని, వ్యయాధిపతి చన్ద్రుదు.

6.కన్యా లగ్నమునకు: లగ్న దశమాధిపతి బుధుడు, ద్వితీయ భాగ్యదిపతి శుక్రుడు, తృతీయ అష్టమాధిపతి కుజుడు, చతుర్ధ సప్తమాధిపతి గురువు, పంచమ షష్టధిపతి శని, లాభాధిపతి చంద్రుడు, వ్యయాధిపతి రవి.

7.తులా లగ్నమునకు: లగ్న అష్టమాధిపతి శుక్రుడు, ద్వితీయ సప్తమాధిపతి కుజుడు, తృతీయ షష్టధిపతి గురువు, చతుర్ధ పంచమా ధిపతి శని, నవమ వ్యయాధిపతి బుధుడు, దశమాదిపతి చంద్రుడు, లాభాధిపతి రవి!

8.వృశ్చిక లగ్నమునకు: లగ్నషష్టాధిపతి కుజుడు, ద్వితీయ పంచమాధిపతి గురువు, తృతీయ చతుర్ధధిపతి శని, సప్తమ వ్యయధిపతి శుక్రుడు, అష్టమ లాభాధిపతి బుధుడు, నవమాధిపతి చంద్రుడు దశమాదిపతి రవి!

9.ధనుర్లగ్నమునకు: లగ్న చతుర్ధాదిపతి గురువు, ద్వితీయ తృతీయధిపతి శని, పంచమ వ్యయాధిపతి కుజుడు, షష్ట లాభాధిపతి శుక్రుడు, సప్తమ దశమాధిపతి బుధుడు, అష్టమాధిపతి చంద్రుడు, నవమాధిపతి రవి!

10.మకర లగ్నమునకు: లగ్న ద్వితీయాధిపతి శని, తృతీయ వ్యయాధిపతి గురువు, చతుర్ధ లాభాధిపతి కుజుడు, పంచమ దశమాదిపతి శుక్రుడు, షష్ట నవమాధిపతి బుధుడు, సప్తమాధిపతి చంద్రుడు, అష్టమాధిపతి రవి!

11. కుంభ లగ్నమునకు: లగ్న వ్యయాధిపతి శని, ద్వితీయ లాభాధిపతి గురువు, తృతీయ ధశమాధిపతి కుజుడు, చతుర్ధ భాగ్యాధిపతి శుక్రుడు, పంచమ అష్టమాధిపతి బుధుడు, షష్టాధిపతి చంద్రుడు, సప్తమాధిపతి రవి!

12. మీన లగ్నమునకు: లగ్న దశమాదిపతి గురువు, ద్వితీయ నవమాధిపతి కుజుడు, తృతీయ అష్టమాధిపతి శుక్రుడు, చతుర్ధ సప్తమాధిపతి బుధుడు, పంచమాధిపతి చంద్రుడు, షష్టాధిపతి రవి, లాభవ్యయాధిపతి శని!

ద్వాదశ లగ్నములకు శుభ - పాప గ్రహములు
1. మేష లగ్నమునకు రవి, గురులు శుభులు! బుధ, శుక్ర, శనులు పాపులు!!
2. వృషభ లగ్నమునకు రవి, శనులు, శుభులు! చంద్ర, గురు, శుక్రులు పపులు!!
3. మిధున లగ్నమునకు శుక్రుడు మాత్రమే శుభుడు! రవి, కుజ, గురు, శనులు పాపులు!!
4. కర్కాటక లగ్నమునకు కుజ, గురులు శుభులు! బుధ, శుక్రులు పాపులు!!
5. సింహ లగ్నమునకు కుజుడు మాత్రమే శుభుడు!బుధ, శుక్రులు పాపులు!!
6. కన్యా లగ్నమునకు శుక్రుడు మాత్రమే శుభుడు! చంద్ర, కుజ, గురు పాపులు!!
7. తులా లగ్నమునకు బుధ, శనులు శుభులు! రవి, కుజ, గురులు పాపులు!!
8. వృశ్చిక లగ్నమునకు గురువు మాత్రమే శుభుడు! బుధ, శుక్ర, శనులు పాపులు!!
9. ధనుర్లగ్నమునకు రవి, కుజులు శుభులు! బుధ, గురులు కూడా కొన్ని సందర్బములలో మంచివారు! శుక్రుడు పాపి!!
10. మకర లగ్నమునకు బుధ, శుక్రులు శుభులు! చంద్ర, కుజ, గురులు పాపులు!!
11. కుంభ లగ్నమునకు శుక్రుడు మాత్రమే శుభుడు!చంద్ర, కుజ, గురులు పాపులు!!
12. మీన లగ్నమునకు చంద్ర, కుజలు శుభులు! రవి, బుధ, శుక్ర, శనులు పాపులు!!
13. లగ్నము వలన, ఆత్మ సంభంధమైన విషయములను, జాతకుని అనూహ్య కర్మలను తెలియధగియున్నది.
14. చంద్ర లగ్నమువలన జాతకుడు తెలిసిజేయు కర్మలను, వాటి ఫలితములను గుర్తించవలెను.
15. నవాంశలగ్నముల వల్ల జాతకుని పూర్వజన్మ కర్మలకు సంభందించిన ఫలితములు తెలియధగియున్నది.
16. జన్మలగ్నము జాతకుని దేహస్థితి, అంగసోష్ట వము, శారీరక సుఖములను ధెల్పును.
17. చంద్రలగ్నము మనో ధర్మములను, మానసిక స్థితి గతులను ధెల్పును.
18. అంశలగ్నము శరీరచ్చయా, అంతర్గత స్వభావములను తెల్పును.
19. లగ్నాధిపతి శుభుడై 5-9 స్థానములందు, పాపియై 1-4-7-10 స్థానములందు యున్న యెడల - జాతకునికి శుభ ఫలితములు ప్రాప్తించగలవు.
20. 3-11 స్థానములలో లగ్నాధిపతియున్న - సామాన్య శుభ ఫలితములు కల్గును.
21. 2-6-8-12 స్థానములలో లగ్నాధిపతి యున్న అశుభ ఫలితములు నివ్వగలడు.


లగ్న భావమందున్న గ్రహ ఫలితాలు

ద్వితీయ భావమందున్న గ్రహ ఫలితములు

తృతీయ భావ మందున్న గ్రహ ఫలితాలు

చతుర్ధ భావ మందున్న గ్రహ ఫలితాలు

పంచమ భావము నందున్న గ్రహ ఫలితాలు

షష్ఠ భావమందున్న గ్రహ ఫలితాలు

సప్తమ భావమందున్న గ్రహ ఫలితాలు

నిత్య స్తోత్రావళి

పంచాంగం

2 comments:

  1. From which book did you take the data sir

    ReplyDelete
  2. The above details are only upto Chaturdha bhava palithalu. What about the remaining eight bhava palithalu. Where can I get the it sir. Please indicate the reference book.

    ReplyDelete

Kamika Ekadashi - కామిక ఏకాదశి

కామిక ఏకాదశి మన భారతీయ సంప్రదాయంలో ఏకాదశి వ్రతాలకు ఎంతో విశిష్టత ఉంది. ఈ రోజున శ్రీ మహావిష్ణువును  భక్తిశ్రద్ధలతో పూజిస్తారు. దక్షిణాయన పుణ్...