Tuesday, June 30, 2026

Yamashtakam - యమాష్టకం

శ్రీ దేవీ భాగవతం నవమ స్కంధము - యమాష్టకం

పూర్వకాలంలో సూర్యభగవానుడు పుష్కరక్షేత్రంలో తీవ్రతపస్సుతో బ్రహ్మమానసపుత్రుడైన
ధర్ముణ్ణి ఆరాధించి నిన్ను పుత్రుడుగా పొందాడు. నువ్వు ధర్మరాజువి. సర్వసాక్షివి. సర్వభూత సమవర్తివి, సర్వభూత సంహారకుడవు. అందుకే నిన్ను శమనుడు అంటారు. కాలం చెల్లగానే ప్రతిజీవినీ అంతమొందిస్తూ కృతాంతుడనే పేరు సంపాదించుకున్నావు. పాపాత్ములను దండించి శుద్ధిచెయ్యడానికి దండం ధరించావు. దండధారి వయ్యావు. సర్వవిశ్వాలలోనూ నిరంతరం ప్రాణికోటిని వెన్నంటి సంచరిస్తూ సకలజీవులనూ శాసిస్తున్నావు. ఎవరైనా ఎదైనా తప్పించుకోవచ్చుగానీ నిన్నుమాత్రం తప్పించుకోలేరు. అందుకే కాలుడన్నారు నిన్ను. నువ్వు తపస్వివి. బ్రహ్మనిష్ఠుడివి. సంయమివి. జితేంద్రియుడివి. జీవులకు కర్మఫలాలమ నిష్పాక్షికంగా పంచిపెట్టేవాడివి. నువ్వు స్వాత్మారాముడివి. సర్వజ్ఞుడివి. పుణ్యాత్ములకు మిత్రుడివి. పాపాత్ములకు శత్రువువి. నీకిదే శిరసువంచి నమస్కరిస్తున్నాను. బ్రహ్మ అంశతో పుట్టావు. బ్రహ్మతేజస్సుతో
ప్రకాశిస్తున్నావు. పరబ్రహ్మను నిరంతరం ధ్యానిస్తుంటావు. నువ్వు ఈశుడవు. నీకిదే వందనం - అని
సావిత్రీదేవి స్తుతించి యముడికి శిరసువంచి నమస్కరించింది.

తపసా ధర్మమారాధ్య పుష్కరే భాస్కరః పురా ।
ధర్మం సూర్యస్పూతం ప్రాప ధర్మరాజం నమామ్యహమ్‌

సమతా సర్వభూతేషు యస్య సర్వస్య సాక్షిణః
 ।
అతో యన్నామ శమన ఇతి తం ప్రణమామ్యహమ్‌ ॥

యేవాంతశ్చ కృతో విశ్వే సర్వేషాం జీవినాం పరమ్‌ ।
కామానురూపం కాలేన తం కృతాంతం నమామ్యహమ్‌ ॥

బిభర్తి దండం దండాయ పాపినాం శుద్ది హేతవే

నమామి తం దండధరం యః శాస్తా సర్వజీవినామ్‌


విశ్వం చ కలయత్యేన యస్పర్వేషు చ సంతతమ్‌ ।
అతీవ దుర్శివార్యం చ తం కాలం చ ప్రణమామ్యహమ్‌


తపస్వి బ్రహ్మనిష్ఠో యస్సంయమీ సంజితేంద్రియః
 ।
జీవానాం కర్మఫలదస్తం యమం ప్రణమామ్యహమ్‌ ॥

స్వాత్మారామశ్చ సర్వజ్ఞో మిత్రం పుణ్యకృతాం భవేత్‌ ।
పాపినాం క్లేశదో యస్తం పుణ్యమిత్రం నమామ్యహమ్‌


యజ్జన్మ బ్రహ్మణో
౦శేన జ్వలంతం బ్రహ్మతేజసా
యో ధ్యాయతి పరం బ్రహ్మ తమీశం ప్రణమామ్యహమ్‌ ॥ (31 - 15)

నారదా! ఇది యమాష్టకం. దీన్ని తెల్లవారుజామున నిద్రలేచిన వెంటనే రోజూ పఠించేవారికి
మృత్యుభయం ఉండదు. సమస్త పాపాలూ తొలగిపోతాయి. యముడి అనుగ్రహంతో త్రికరణశుద్ది
ఏర్పడుతుంది - అని చెప్పి నారాయణమహర్షి సావిత్రీ యమసంవాదాన్ని కొనసాగించాడు.

శౌనకాది మహామునులారా! శ్రద్దగా వింటున్నారుగదా! నారాయణమహర్షి నారదుడికి వివరిస్తున్న
సావి
త్య్రుపాఖ్యానంలో అశుభకర్మవిపాకం ఆలకించండి - అని ఒకసారి హెచ్చరించి సూతుడు కొనసాగించాడు.

నారదా ! సావిత్రి చేసిన స్తోత్రానికి యముడు సంబరపడ్డాడు. మాయాబీజసహితంగా
శ్రీదేవీమహామంత్రాన్ని ఉపదేశించి పూజావిధానం తెలియచెప్పాడు. అటుపైని అశుభకర్మవిపాకం
వివరించాడు.

దుష్మర్మఫల నిరూపణ


Satkarmaphala nirupana - సత్కర్మఫల నిరూపణ

శ్రీ దేవీ భాగవతం నవమ స్కంధము - సత్కర్మఫల నిరూపణ

ధర్మరాజా! ఏ సత్కర్మలను ఆచరిస్తే స్వర్గలోకం లభిస్తుందో తెలుసుకోవాలని ఉంది. వివరించి పుణ్యం కట్టుకో అని సావిత్రి మళ్ళీ అడిగింది. సమవర్తి సమాధానం చెప్పాడు.

సావిత్రీ! విప్రుడికి అన్నదానం చేసినవాడు మెతుకులన్ని సంవత్సరాలు శివలోకంలో నివసిస్తాడు. అదే ఇతరులకు చేస్తే అన్నదాన ప్రమాణంగా శివలోకంలో నివసిస్తాడు. అన్నదానంకంటే గొప్పదానం ఏ కాలంలోనూ మరొకటి లేదు. దీనివిషయంలో పాత్రతాపాత్రత పరీక్షగానీ కాలాకాలవిచారణగానీ లేవు ఇది అందరూ అందరికీ అన్నివేళలా చెయ్యదగిన ఉత్తమోత్తమదానం.

దేవతలకుగానీ బ్రాహ్మణులకుగానీ ఉచితాసనం దానం చేసినవాడు విష్ణులోకంలో అయుతవత్సరాలు నివసిస్తాడు. పాడి ఆవును విప్రుడికి ఇస్తే దాని రోమాలన్ని సంవత్సరాలు దాతకు విష్ణులోక నివాసం లభిస్తుంది. పుణ్యప్రదమైన రోజునచేస్తే నాలుగురెట్లు తీర్థప్రదేశంలోచేస్తే పదిరెట్లు అధికంగా పుణ్యం వస్తుంది. నారాయణక్షేత్రంలో చెయ్యగలిగితే నా ఫలం కోటిరెట్లు లభిస్తుంది. గోదానం చంద్రలోక ప్రాప్తిదాయకం. ఉభయముఖీ గోదానం విష్ణులోక ప్రాప్తికి సోపానం. శ్వేతచ్ఛత్రప్రదాతకు అయుతవత్సరాలు వరుణలోక నివాసం కలుగుతుంది. కప్పుకునేందుకు గుడ్డలేక బాధపడుతున్న విప్రుడికి వస్త్రయుగ్మం సమర్పిస్తే వాయులోకనివాసం ఫలం. నూతనవస్త్రాలు పెట్టి సాలగ్రామం దానంచేస్తే వైకుంఠంలో శాశ్వతనివానమే. శయ్యాదానం చంద్రలోక ప్రాపకం. దీపదానం వహ్నిలోకదాయకం. గజదానం చేస్తే ఇంద్రుడితో అర్ధాసనం పంచుకోవచ్చు. అశ్వదానం వారుణలోకప్రదాయి. శిబికాదానమూ ఆంతే. వ్యజనవాటికాదానాలు వాయులోక నివాసహేతువులు, ధాన్యరత్నాలు దాతృప్రతిగ్రహీత లిద్దరికీ వైకుంఠలోకావాసప్రదాలు. శ్రీహరి నామస్మరణ నిరంతరం చేసేవాడు చిరంజీవి అవుతాడు. మృత్యువు పారిపోతుంది. పున్నమివేళ శ్రీహరికి ఉయ్యాలసేవ చేసినవారు ఇహలోకంలో భోగభాగ్యాలు పుష్కలంగా అనుభవించి విష్ణుమందిరం చేరుకొంటారు. ఆక్కడ శతమన్వంతరాలు నివసిస్తారు. ఉత్తర ఫల్గుణిలో ఈ పనిచేస్తే రెట్టింవు పుణ్యం వస్తుంది. ఆతడు కల్పాంతజీవి అవుతాడు. తిలదానం శివలోకప్రదం. అటు పైని ఉత్తమజన్మ ఎత్తి సుఖవడతాడు. తామ్రపాత్రను దానంచేస్తే రెట్టింపుఫలం. సాలంకృత కన్యాదాత చంద్రలోకంలో పదునల్గురు ఇంద్రులు గడిచేదాకా అప్పరసలతో వినోదిస్తాడు. అటుపైని గంధర్వలోకానికి వెళ్ళి ఊర్వశితో క్రీడిస్తాడు. అటుపైని భూమికి అవతరించి అనుకూలవతిని భార్యగా పొంది సుఖిస్తాడు.

ఫలదానానికి శక్రలోకనివాసం ఫలం. ఆ తరువాత జన్మలో పండంటిబిడ్డ కలుగుతాడు. ఫలభారంతో వంగిన వెయ్యి చెట్లు లభిస్తాయి.

ధనధాన్య సమృద్ధితో గృహదానం చేస్తే శాశ్వతస్వర్గలోక నివాసమే. అటుపైని ధనధాన్యాలకు లోటులేని ఉత్తమజన్మ పంటతోపాటు పొలం దానంచేస్తే వైకుంఠలోక నివాసం ఫలం. తరవాత జన్మలో భూపాలుడవుతాడు. నూరు జన్మలవరకూ పరిపాలకుడవుతాడు. శ్రీమంతుడూ ధనవంతుడూ పుత్రవంతుడూ అవుతాడు. వజ్రదానం గ్రామదానాలకు లక్షమన్వంతరాలు వైకుంఠవాసం ప్రతిఫలం. పునర్జన్మల్లో లక్షగ్రామాలకు అధిపతి అవుతాడు. ఉద్యానాలతో తటాకాలతో సత్ప్రజానీకంతో విరాజిల్లే అందమైన నగరాన్ని దానంచేస్తే దశలక్షేంద్రకాలపర్యంతం కైలాసంలో నివసిస్తాడు. పునర్జన్మలో రాజేంద్రుడై అటువంటి దశలక్షనగరాలకు ఏలిక అవుతాడు. నూరు నగరాలతోకూడిన దేశాన్ని దానంచేస్తే కోటిమన్వంతరాలు వైకుంఠంలో విరాజిల్లుతాడు. పునర్జన్మలో జంబూద్వీపానికి అధినాయకుడు అవుతాడు. భూలోక దేవేంద్రుడుగా కీర్తి గడిస్తాడు. కోటి జన్మలదాకా ఈ భోగం ఉంటుంది. రాజరాజేశ్వరుడై కల్పాంతజీవి అవుతాడు. అతడు సాధికారంగా జంబూద్వీపాన్నే దానంచేస్తే ఈ పుణ్యఫలం నూరురెట్టు అధికంగా లభిస్తుంది.

పతివ్రతాశిరోమణీ! ఎంతెంత దానాలన్నా చేయనీ, జంబూద్వీపమే దానం చెయ్యనీ, ఈ దాతలందరికీ పునర్జన్మ తప్పదు. జన్మరాహిత్యరూపమైన ముక్తి కలగదు. ఒక్క దేవీ భక్తుడికి మాత్రమే అది సాధ్యం. అసంఖ్యాకంగా బ్రహ్మలు పుట్టడం గిట్టడం చూస్తూ శ్రీదేవీ సన్నిధిలో మణిద్వీపంలో ఆ భక్తుడు శాశ్వతంగా నివసిస్తాడు. పునర్జన్మ అంటూ అతడికి ఉండదు.

దేవీ మంత్రోపాసకులు శరీరాన్ని విడిచిపెట్టాక దేవీసారూప్యాన్ని పొంది జన్మ మృత్యు జరారహితులై మణిద్వీపంలో విరాజిల్లుతుంటారు. దేవీసేవ చేసుకుంటూ ఉంటారు. మిగతా లోకాలూ
లోకేశ్వరులూ దేవతలూ దేవేశ్వరులూ నశించడం పునరావిర్భవించడం కళ్ళారా చూస్తూ సాక్షిమాత్రులుగా నిలుస్తారు. అంతేకానీ వీరు నశించరు. పునరావిర్భవించరు. మణిద్వీపం శాశ్వతం. మణిద్వీపవాసులు శాశ్వతం.

కార్తికమాసంలో శ్రీహరికి తులసీదళం సమర్పించినవాడు యుగత్రయపర్యంతం హరిసన్నిధిలో నివసిస్తాడు. పునర్జన్మలో హరిభక్తుడు అవుతాడు. జితేంద్రియుడవుతాడు. అరుణోదయకాలంలో గంగాస్నానం చేస్తే ఆరువేలయుగాలపాటు హరిసన్నిధిలో ఆనందంగా గడిపి పునర్జన్మలో విష్ణుమంత్రాన్ని పాంది తిరిగి మళ్ళీ హరిసన్నిధికి చేరుకుంటాడు. మరింక అతడికి పునర్జన్మ లేదు. వైకుంఠంలో హరిదాస్యం చేస్తూ సారూప్యసిద్ధి పొందుతాడు. నిరంతరం గంగాస్నానం చేస్తే భూలోకంలో సూర్యుడిలా ప్రకాశిస్తూ అనంత అశ్వమేధఫలాలను పొందుతాడు. అతడి పాదధూళితో వసుంధర పావనమవుతుంది. జన్మ చాలించాక వైకుంఠంలో ఆచంద్రతారార్కంగా నివసిస్తాడు. పునర్ణన్మలో హరిభక్తుడై జీవన్ముక్తి పొందుతాడు. అటుపైని సూర్యుడై వెలుగొందుతాడు.

స్వాదువూ సుగంధభరితమూ అయిన జలాన్ని దానం చేసినవాడు కైలాస నివాసి అవుతాడు. పునర్జన్మలో వేదవేదాంగవేత్త అవుతాడు. వైశాఖమాసంలో సక్తుదానం చేస్తే శివసాయుజ్యమే ఫలం, కృష్ణాష్టమీవ్రతం ఆచరించినవారు శతజన్మ పాపవిముక్తులై వైకుంఠంలో ఆనందిస్తారు. పునర్జన్మలో కృష్ణభక్తులవుతారు. శివరాత్రివ్రతం పాటించినవారు కైలాసంలో శివుడి సన్నిధిలో సప్తమన్వంతరాలు వినోదిస్తారు. ఆరోజున శివుడికి బిల్వపత్రం భక్తితో సమర్పిస్తే శివసాయుజ్యం లభిస్తుంది. పునర్జన్మలో శివభక్తులవుతారు. సకలవిధ సంపదలతో తులతూగుతారు. పుత్రపౌత్రాభివృద్ది పొందుతారు. చైత్రంలో కానీ మాఘంలో కానీ శంకరుణ్ణి అర్చిస్తే కైలాసాన వేత్రపాణియై ప్రమథశేఖరుడై నర్తిస్తాడు. శ్రీరామనవమిని యథావిధిగా నిర్వహించినవారు సప్తమన్వంతరాలు విష్ణుసన్నిధిలో విరాజిల్లుతారు. పునర్ణన్మలో ధనవంతులూ సజ్ఞనులూ అవుతారు.

శరదృతువులో మహాదేవుణ్ణి మాంసనైవేద్యాలతో షోడశోపచారాలతో అర్చించినవారు సప్తమన్వంతరాలపాటు కైలాసంలో ఉంటారు. పునర్జన్మలో పుత్రపాత్ర ధనధాన్య సమృద్దులతో రాజరాజేశ్వరులవుతారు. శుక్లాష్టమినాడు మహాలక్ష్మిని భక్తిప్రపత్తులతో అర్చించి ఉత్తమోత్తమంగా షోడశోపచారాలూ చేస్తే గోలోకనివాసం లభిస్తుంది. పునర్జన్మలో రాజేశ్వరులవుతారు. కార్తిక పూర్ణిమ రోజున రాసమండలంచేసి గోపీగోపశతాన్నీ రాధాకృష్ణులనూ శిలాప్రతిమలుగా శిల్పించి భక్తితో ఆరాధించినవారికి గోలోకం కరతలామలకం. పునర్జన్మలో కృష్ణభక్తులై మళ్ళీ గోలోకం చేరుకుంటారు. కృష్ణసారూప్యం పొంది పార్షదులవుతారు. మరింకవారికి పతనం లేదు. శుక్షపక్షంలోగానీ కృష్ణపక్షంలోగానీ ఏకాదశీవ్రతం చేస్తే బ్రహ్మపర్యంతం వైకుంఠవాసం లభిస్తుంది. పునర్జన్మలో కృష్ణభక్తులై అటుపైని గోలోకం చేరుకుంటారు. మరింక తిరిగిరారు.

భాద్రపద ద్వాదశి రోజున ఇంద్రుణ్ణి పూజిస్తే అరవైవేల సంవత్సరాలు ఇంద్రలోకంలో భోగాలు అనుభవిస్తారు. ఆదివారంనాడుగానీ సంక్రాంతినాడుగానీ శుక్లపక్ష సప్తమినాడుగానీ సూర్యదేవుణ్ణి అర్చిస్తే అతడు నూర్యలోకనివాసి అవుతాడు. ఆరోగ్యవంతుడూ శ్రీయుతుడూ జ్ఞానిగా భారత భూమిలో పునర్జన్మ ఎత్తుతాడు. మాఘ శుక్షపంచమినాడు సరస్వతిని ఉపాసిస్తే షోడశోపచారాలూ భక్తితో సమర్పిస్తే మణిద్వీపనివాసి అవుతాడు. పునర్జన్మలో పండితకవి అవుతాడు.

గో భూ సువర్ణ దానఫలాలు లోగడ చెప్పానుగదా! హరినామాలను ఉచ్చరించినవాడు నామానికి ఒక యుగంగా విష్ణులోకంలో సుఖిస్తాడు. ఆదే నారాయణ క్షేత్రంలో చేస్తే కోటిరెట్లు అధికఫలం లభిస్తుంది. జీవన్ముక్తుడై పునర్జన్మలేని స్థితికి చేరుకొంటాడు. పార్థివలింగంగా నిరంతరం శివోపాసన చేసినవారు రేణువుకి సంవత్సరంగా కైలాసంలో నివసిస్తారు. పునర్జన్మలో భూమిపాలకులై కీర్తి గడిస్తారు. సాలగ్రామ శిలను అర్చించి ఆ జలాన్ని పుచ్చుకునేవారు వైకుంఠంలో శతబ్రహ్మపర్యంత కాలం ఉండి పునర్జన్మలో హరిభక్తులై తిరిగి వైకుంఠం చేరుకుంటారు. వారికింక జన్మలేదు. సకల తపస్సులూ సకలదానాలూ సకలవ్రతాలూ చేసినవారు చాలాకాలం వైకుంఠంలో భోగాలు అనుభవించి పునర్జన్మలో రాజేంద్రులై అటుపైని ముక్తులు అవుతారు. వీరికింక మరి జన్మ ఉండదు. సకల తీర్థాల్లోనూ మునిగి భూప్రదక్షిణం చేసినవారికి జన్మరాహిత్యరూపమైన ముక్తి లభిస్తుంది. పుణ్యక్షేత్రంలో అశ్వమేధం చేస్తే అశ్వరోమ పర్యంత సంవత్సరాలు ఇంద్రుడితో అర్ధాసనం అలంకరిస్తారు. రాజసూయానికి నాలుగింతల అధిక పుణ్యఫలం. ఈ యజ్ఞాలన్నింటిలోకీ దేవీయజ్ఞం శిరోరత్నం. తొలినాళ్ళలో త్రిమూర్తులూ దేవీయజ్ఞాలు చేశారు. దీనికి సాటివచ్చే యజ్ఞం ముల్లోకాలలోనూ లేదు. దక్షుడు ధర్ముడు కశ్యపుడు శేషుడు కర్థముడు మనువు ప్రియవ్రతుడు శివుడు సనత్కుమారుడు కపిలుడు ధ్రువుడు - వీరంతా దేవీయజ్ఞం చేసినవారే. ఇది సహస్రరాజసూయాలకంటే అధికంగా పుణ్యప్రదం. దీనికన్నా గొప్ప యజ్ఞం మరొకటి లేనేలేదు.

ఇది చేసినవాడు శతాయుష్కుడవుతాడు. జీవన్ముక్తుడవుతాడు. జ్ఞాని తేజస్వి అవుతాడు. విష్ణుభృత్యుడవుతాడు. దేవతలలో విష్ణుమూర్తిలా, వైష్టవులలో నారదుడిలా, శాస్త్రాలలో వేదంలా, మానవులలో బ్రాహ్మణుడిలా తీర్థాలలో గంగలా పవిత్రులలో శివుడిలా వ్రతాలలో ఏకాదశిలా పువ్వులలో తులసిలా తారలలో చంద్రుడిలా పక్షులలో గరుత్మంతుడిలా స్త్రీలలో ప్రకృతిలా రాధలా వాణిలా వసుంధరలా ఇంద్రియాలలో మనస్సులా ప్రజాపతులలో బ్రహ్మలా ప్రజలలో ప్రజాపతిలా వనాలలో బృందావనంలా దేశాలలో భారతదేశంలా ధనవంతులలో లక్ష్మిలా పండితులలో సరస్వతిలా పతివ్రతలలో దుర్గలా సౌభాగ్యవతులలో రాధికలా - యజ్ఞాలలో దేవీయజ్ఞం ఉత్తమోత్తమం. సర్వయజ్ఞ సర్వతీర్థస్నాన సర్వవ్రతాచరణ సర్వవేదపఠన భూప్రదక్షిణ సర్వదానకరణ ఫలంకన్నా దేవీయజ్ఞఫలం అత్యధికం. సాక్షాత్తు ముక్తిప్రదం. ఇది వేదశాస్త్ర పురాణాదులలో నిస్సంశయంగా నిరూపించబడిన అంశం. దేవీవర్ణన, దేవీధ్యాన దేవీస్మరణ దేవీస్తవన దేవీవందన దేవీమంత్రపఠన దేవీపాదోదకసేవన దేవీనైవేద్య భక్షణలు నిరంతరం చెయ్యాలి. అది సర్వవాంఛాప్రదం. అందుచేత ఓ సావిత్రీ! నిత్యమూ ఆ నిర్గుణ పరాప్రకృతిని ఆరాధించు. ఉపాసించు. నీ భర్తను తీసుకుని ఇంటికివెళ్ళి సుఖసంతోషాలతో జీవించు. తత్త్వజ్ఞానప్రదమైన కర్మవిపాకాన్ని బోధించాను. నీ సంశయాలు తీర్చాను. శుభమగుగాక! వెళ్ళిరా - అని ముగించాడు యమధర్మరాజు. 

నారదా! యమధర్మరాజు నోట ఇలా శక్తిసంకీర్తన విన్న సావిత్రీదేవి కన్నుల్లో ఆనందబాష్పాలు గుడుసుళ్ళు తిరిగాయి. తనువంతా పులకించింది. ధర్మరాజా! శ్రోతలకూ వక్తలకూ జన్మమృత్యుజరాహరమై సకలోద్దారకారణమైన శక్తి సంకీర్తనం వినిపించావు. సకల ప్రాణీకోటికీ ముక్తిప్రదమనీ సిద్ధిప్రదమనీ తెలియజెప్పావు. మిగతావి ఏవీ శ్రీశక్తి ఉపాసకుడిలో పదహారవ కళకైనా సాటిరావని గ్రహించాను. నువ్వు చెప్పిన ప్రకారం నేను ఆ దేవిని ఆరాధిస్తాను. దీనితోపాటు జీవుల శుభకర్మవిపాకం వివరించావు. మరి అశుభకర్మలవిపాకం మాట ఎమిటి? ఏ అసత్కర్మకు ఏ అసత్ఫలితం వస్తుందో నువ్వే తెలియజెయ్యాలి, నువ్వు వేదవిదాంవరుడవు. జ్ఞానివి. సకలప్రాణికోటిపట్లా సమవర్తివి. రాగద్వేషాలకు అతీతుడవు. అరిషడ్వర్గాన్ని జయించిన జితేంద్రియుడవు. నీ జన్మవృత్తాంతం నాకు తెలుసు.

యమాష్టకం


Vastu Tortoise - వాస్తు తాబేలు

వాస్తు తాబేలు

ఇంట్లో తాబేలు బొమ్మ ఉంచితె వాస్తు ప్రకారం శుభప్రదం. అయితే ఎలాంటి తాబేలు ఉంచాలి, ఏ దిశలో ఉంచాలి తెలుసుకోండి. పురాణాల ప్రకారం, తాబేలును కూడా మహా విష్ణువు రూపంగా పరిగణిస్తారు. శ్రీ మహావిష్ణువు కూర్మావతార రూపంలో వచ్చి తన అద్భుత మహిమలను ప్రదర్శించినట్లు గ్రంథాలలో ఉంది. అందుకే ఇంట్లో, పూజ గదిలో తాబేలు బొమ్మ ఉంచుకోవడం చాలా ప్రాముఖ్యతను కలిగి ఉంది. ఇంట్లో అందం కోసం పెట్టుకునే తాబేలు విగ్రహానికి కూడా వాస్తు శాస్త్రంలో, ఫ్నెగ్ షుయ్‌లో కూడా కొన్ని నియమాలు ఉన్నాయి.

వాస్తు శాస్త్రం ప్రకారం తాబేలు చిహ్నంను ఇంట్లో ఉంచితే ఆర్థిక సమస్యలు దూరమై సంపదలు పెరుగుతాయని చాలా మంది నమ్మకం. అంతేకాదు తాబేలు ఇంట్లో సానుకూల శక్తి ప్రసరణను పెంచుతుంది. ప్రతికూల శక్తిని దూరంగా ఉంచుతుంది. అంతేకాదు వాస్తు శాస్త్రం ప్రకారం ఇంట్లో తాబేలు విగ్రహాన్ని ఉంచడం వల్ల వాస్తు దోషాలు కూడా తొలగిపోతాయి. తాబేలు విగ్రహం ఇంటికి రక్షణ కవచంగా పనిచేస్తుంది. 

అయితే ఇంట్లో తాబేలు చిహ్నాలు ఉంచాలనుకునే వారు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి లేకుంటే మీ ఇంట్లో సంతోషానికి బదులు సమస్యలు వస్తాయి.

ఇంట్లో తాబేలు చిహ్నం ఉంచడం ఎల్లప్పుడూ శుభప్రదంగా పరిగణించవచ్చు. ముఖ్యంగా పౌర్ణమి రోజున తాబేలును ఇంటికి తీసుకురావాలి. ఆ రోజు తాబేలును పాలలో కాసేపు ఉంచాలి. అభిజిత్ ముహూర్తం నాడు, ఈ తాబేలును పాల నుండి తీసివేసి నీటితో కడగాలి. ఆ తర్వాత ఒక పాత్రలో కొంత నీరు తీసుకుని అందులో తాబేలు చిహ్నంను ఉంచండి. ఇలా చేయడం వల్ల మీ ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ వ్యాపిస్తుంది. స్తోమతను బట్టి బంగారం, వెండి, వజ్రం, రాగి తాబేళ్లను ఇంట్లో ఉంచుకోవచ్చు.

తాబేలు ఉంచడానికి ఉత్తమ రోజు: బుధ, గురు, శుక్రవారాలు ఇంట్లో తాబేలు విగ్రహాలను ఉంచేందుకు అనువైన రోజులుగా భావిస్తారు. తాబేలు విగ్రహానికి కుంకుమ లేదా పసుపు పువ్వులను సమర్పించండి. ప్రతిరోజూ తాబేలు విగ్రహంపై ఒక తులసి దళాన్ని ఉంచడం శుభసూచకం.

తాబేలు చిహ్నం దిశ:
తాబేలు జలచరాలు కాబట్టి ఈశాన్య దిశలో ఉంచాలి. ఆ తర్వాత 'ఓం శ్రీం కూర్మై నమః' అనే మంత్రాన్ని 11 సార్లు జపిస్తే మంచి ఫలితాలు వస్తాయి. మీరు మీ ఇంట్లో శాంతి, సామరస్యాన్ని కోరుకుంటే, మీ గది తూర్పు భాగంలో తాబేలు ఉంచండి. ఇలా చేయడం వల్ల మీ కుటుంబ జీవితంలో సంతోషం కలుగుతుంది. కానీ ఎల్లప్పుడూ లోహపు తాబేలును నీటిలో ఉంచాలని గుర్తుంచుకోండి. వీటితో పాటు కొన్ని రంగు రాళ్లను కూడా వేయవచ్చు. దీంతో మానసిక ప్రశాంతత లభిస్తుంది. మీ ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది.

తాబేలు విగ్రహాన్ని ఎక్కడ ఉంచాలంటే.. పిల్లలు చదువులో ఏకాగ్రత పెంచాలంటే తాబేలు విగ్రహాన్ని ఉంచడం శుభప్రదంగా భావిస్తారు. దీనిని పిల్లల గదిలో ఉంచవచ్చు. ప్రధాన ద్వారం దగ్గర తాబేలు విగ్రహాన్ని ఉంచడం కూడా ప్రయోజనకరంగా పరిగణించబడుతుంది.

తాబేలు ముఖం ఎల్లప్పుడూ లోపలి వైపు (ఇంటి లోపలికి) చూస్తున్నట్లుగా పెట్టాలి.

అయితే ఇంట్లో తాబేలు ఎప్పుడూ నోరు తెరిచి ఉంచకూడదు. అలా ఉంచడం వల్ల ఇంట్లో ప్రతికూల ఫలితాలు వస్తాయి. అలాంటి తాబేలును ఇంట్లో ఉంచడం వల్ల మీ కుటుంబంలో కలహాలు, అశాంతి, ఆర్థిక సమస్యలు వస్తాయని గుర్తుంచుకోండి. 

క్షీర సాగర మథనం సమయంలో తాబేలు ఉద్భవించిందని నమ్ముతారు. లోహపు తాబేలును ఇంట్లో ఉంచడం వాస్తులో చాలా శుభప్రదంగా పరిగణిస్తారు.

తాబేలు కాలు మరియు ప్రయోజనాలు:
నీటిలో తాబేలు: పూజా గదిలో ఒక చిన్న ఇత్తడి లేదా రాగి పాత్రలో నీరు పోసి, అందులో తాబేలు ప్రతిమను ఉంచడం వల్ల సిరిసంపదలు వృద్ధి చెందుతాయి.

మెటల్ తాబేలు: ఇత్తడి, రాగి లేదా వెండితో చేసిన తాబేళ్లు కెరీర్ వృద్ధికి మరియు వ్యాపార అభివృద్ధికి దోహదపడతాయి. మెటల్ తాబేలు సంపదను సూచిస్తుంది. కెరీర్ వృద్ధిని కోరుకుంటే మెటల్ తాబేలును ఆఫీసులో ఉంచడం మంచిది. ఉత్తర దిశలో తాబేలును ఉంచడం మంచిది.

క్రిస్టల్/స్పటిక తాబేలు: దీన్ని ఇంట్లో ఉంచడం వల్ల మానసిక ప్రశాంతత లభిస్తుంది.

పిల్లలున్న తాబేలు: ఒకటి ఆడ తాబేలు, పిల్లలు. ఇలా ఉన్న తాబేలు కుటుంబానికి ప్రతీకగా పరిగణించబడుతుంది. ఒక పెద్ద తాబేలు వీపుపై చిన్న తాబేలు ఉన్న విగ్రహాన్ని ఉంచడం వల్ల సంతాన ప్రాప్తి కలుగుతుందని నమ్ముతారు. పిల్లతో ఉన్న తాబేలును ఇంట్లో పెట్టుకుంటే కుటుంబ సభ్యుల మధ్య వివాదాలు తలెత్తకుండా సహాయపడుతుంది.

చెక్క తాబేలు: వాస్తు శాస్త్రం ప్రకారం, తూర్పు లేదా ఆగ్నేయ మూలలో చెక్క తాబేలును ఉంచడం వల్ల ఇంటిలోని అన్ని ప్రతికూల శక్తులు తొలగిపోతాయి. ఇది స్నేహితులు, కుటుంబ సభ్యుల జీవితాలను ఆనందం, మంచి కర్మ, సాధనతో నింపుతుంది.

తాబేలు గిన్నె: మీరు ఒక గిన్నెలో నీటితో తాబేలును ఉంచినట్లయితే, తాబేలు గిన్నెలో వేసిన నీటిని ప్రతిరోజూ మార్చాలి.

Tallapaka Annamacharya - తాళ్లపాక అన్నమాచార్యులు

తాళ్లపాక అన్నమాచార్యులు

పురాణ కథనాల ప్రకారం, తాళ్లపాకలో నివసించిన నారాయణసూరి, లక్కమాంబ దంపతులు ఎంతోకాలం సంతానం కోసం శ్రీ వేంకటేశ్వర స్వామిని ప్రార్ధించగా శ్రీవారు తన నందక ఖడ్గాంశంతో ఒక దివ్య శిశువుగా జన్మిస్తాడని వరమిచ్చారని సంప్రదాయ విశ్వాసం.

అన్నమయ్య (1408, మే 9 - 1503, ఫిబ్రవరి 23 ) తెలుగు సాహితీ చరిత్రలో లభించిన ఆధారాల ప్రకారం మొదటి వాగ్గేయకారుడు (సాధారణ భాషలో గేయాలను కూర్చేవారు). అన్నమయ్యకు పదకవితా పితామహుడు, సంకీర్తనాచార్యుడు అని బిరుదులు ఉన్నాయి. దక్షిణాపథంలో భజన సంప్రదాయానికి, పదకవితాశైలికి ఆద్యుడు, గొప్ప వైష్ణవ భక్తుడు. తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి ని, అహోబిలము లోని నరసింహ స్వామి ని, ఇతర వైష్ణవ సంప్రదాయ దేవతలను కీర్తిస్తూ 32వేలకు పైగా కీర్తనలు రచించాడు . అన్నమయ్య పాటలు, పదాలు, పద్యాలలో భక్తి, సాహిత్యం, సంగీతం, శృంగారం, భావలాలిత్యం పెనవేసికొని ఉంటాయి.

కన్నడ వాగ్గేయకారుడు పురందరదాసు అన్నమయ్యను శ్రీనివాసుని అవతారంగా ప్రశంసించాడంటారు. శ్రీమహావిష్ణువు ఖడ్గమైన నందకం అంశతో అన్నమయ్య జన్మించాడని శ్రీవైష్ణవసంప్రదాయంలో నమ్మకం ఉంది. ప్రధాన మందిరంలో ఘంట అవతారమని కూడా కొందరి అభిప్రాయం. త్యాగయ్య, క్షేత్రయ్య, రామదాసు వంటి సంకీర్తనాచార్యులకు అన్నమయ్య మార్గదర్శకుడు.

అన్నమయ్య పాటలు తెలుగు సంస్కృతిలో ఒక భాగమై పోయినాయి. జనాల నోళ్ళలో నాటుకొని పోయినాయి. తుమ్మెద పాటలు, గొబ్బిళ్ళ పాటలు, శృంగార గీతాలు, ఆధ్యాత్మిక పదాలు ఇలా అనేక రకాలైన శైలిలో పాటలు రాశాడు అన్నమయ్య.

అన్నమయ్య మనుమడు తాళ్ళపాక చిన్నన్న అన్నమాచార్య చరితము అన్న ద్విపద కావ్యములో అన్నమయ్య జీవిత విశేషాలను పొందుపరచాడు. ఈ గ్రంథం 1948లో లభ్యమై ముద్రింపబడింది. అన్నమయ్య జీవితం గురించి మనకు తెలిసిన వివరాలకు ఈ రచనే మౌలికాధారం. కాని బహువిధాలైన నమ్మకాలూ, అనుభవాలూ, ఘటనలూ, కథలూ ఈ వివరాలలో పెనవేసుకొని ఉన్నాయి.

నందవరీకుల గాధ
నందవరీకులు సా.శ. 10వ శతాబ్దంలో కాశినుండి ఆంధ్ర దేశానికి వలస వచ్చిన శుద్ధవైదిక బ్రాహ్మణులని పరంపరాయాత ప్రతీత. సా.శ. 10వ శతాబ్దంలో నేటి కర్నూలు జిల్లాలోని "నందవరం" అనే గ్రామాన్ని నందుడనే రాజు పాలించేవాడు. ఈ రాజు కాశీయాత్రకు వెళ్ళినప్పుడు అక్కడ కొందరు వైదిక బ్రాహ్మణులు చాముండేశ్వరీ ఉపాసకులు పరిచయం అయ్యారని, ఆ సమయంలో వారణాసిలో క్షామం రాగా ఆ బ్రాహ్మణ కుటుంబాలు కొన్ని ఆంధ్రదేశానికి వలసివచ్చి నంద రాజు ఆశ్రయంలో స్ధిరపడ్డారనీ, నందరాజుచే తీసుకొని రాబడిన వైదికిలు కావడంచే నందవైదికులుగా ప్రచారం పొందారని జనవాక్యం. కాలక్రమాన వీరు నేటి కర్నూలు, కడప జిల్లాలో స్ధిరపడ్డారని పరిశోధకులు అభిప్రాయం. తాళ్ళపాక గ్రామ నామం అన్నమయ్య వంశస్ధులకు ఇంటిపేరుగా నిలిచింది. అన్నమయ్య కూడా నందవరీకుడే. 

ద్విపద కావ్యం ప్రకారం అన్నమయ్య తాత నారాయణయ్య. చదువు అబ్బక, గురువులు పెట్టే హింసలు భరించలేక నారాయణయ్య చనిపోవాలని అనుకొన్నాడట. ఊరిలో గ్రామ దేవత చింతలమ్మ గుడివద్ద విషసర్పం పుట్టలో చేయి పెట్టాడట. అప్పుడు అమ్మవారు ప్రత్యక్షమై అతని వంశంలో మూడవతరంలో హరి అంశతో ఒక బాలుడు జన్మిస్తాడని చెప్పిందట.

అన్నమయ్య వంశీకులు
భారద్వజ గోత్రులైన అన్నమయ్య పూర్వుల ప్రస్తావన నాలుగు తరాలకు సంబంధించిన వివరాలను చిన్నన్న అన్నమాచార్య ద్విపద వల్లను, అష్టమహిషి కల్యాణం వల్లను గ్రహించవచ్చును.

భరద్వాజ ఋషి 
నారాయణయ్య 
విఠలయ్య 
నారాయణయ్య 
విఠలుడు 
నారాయణుడు 
నారాయణసూరి 
అన్నమాచార్య

అన్నమయ్య తాతయ్య - నారాయణయ్య
కడప జిల్లా రాజంపేట తాలూకా పొత్తిపినాడు మండలం నడిబొడ్డున తాళ్లపాక గ్రామం విరాజిల్లుతుండేది. ఆ గ్రామంలో వెలసిన చెన్నకేశవస్వామి, సిద్ధేశ్వరస్వామి ల కరుణాకటాక్షములతో ఆ గ్రామజనులు సుఖవంతులై జీవనం సాగించేవారు. ఇచ్చట చెన్నకేశవస్వామి విగ్రహాన్ని ప్రతిష్ఠ చేశాడు. సస్యశ్యామలమై విరాజిల్లే ఈ గ్రామం 
సిద్ధులకు, అఖిల దేవతలకు నిజవాసమై వుండేదని స్థలపురాణం. ఈ చెన్నకేశవస్వామిని దేవతలు, ఋషులు, సిద్ధులు ప్రతి రోజూ పూజిస్తారు. ఈ చెన్నకేశవస్వామి గుడిని ఆశ్రయించుకొని కొన్ని బ్రాహ్మణ కుటుంబాలు జీవించేవి. ఆ గ్రామవాసులు తలపక ఇందిరారమణపదైక మానసులుగా జీవనం సాగించేవారు. వాళ్లల్లో నారాయణయ్య చాల ప్రసిద్ధుడు. ఇతని నాలుగోతరంలో మరో నారాయణయ్య వుండేవాడు. అన్నమయ్య పితృ పితామహులు నారాయణయ్య, విఠలయ్యలు విష్ణుభక్తిరతులై తాళ్ళపాక చెన్న కేశవస్వామిని సేవించుకొంటూ జీవితం గడిపేవారు. ఈ నారాయణయ్య కథ తోనే మన అన్నమయ్య కథ మొదలౌతుంది.

నారాయణయ్యకు చిన్నతనంలో ఎంతకీ చదువు రాలేదు. తండ్రి విఠలయ్య నయాన భయాన చెప్పి చూశాడు. లాభం లేక పోయింది. తన వద్ధ ప్రయోజనం లేదని ప్రక్కనే వున్న ఊటుకూరులో తన బంధువుల వద్ద వుంచాడు. ఊటుకూరు నేడు కడపజిల్లా రాజంపేట తాలూకాలో ఉంది. అన్నమయ్య మనవడు చినతిరుమలయ్య ఊటుకూరి చెన్నారాయణి మీద కొన్ని సంకీర్తనలు కూడా రచించాడు. అక్కడ బళ్ళో ఉపాధ్యాయులు శతవిధాల ప్రయత్నించారు. గురువులు నారాయణయ్యను చతుర్విధ ఉపాయాలకు గురి చేశారు. అయినా బాలునికి చదువుపట్ల శ్రద్ధకలుగలేదు. నారాయుణుని కళ్లల్లో నీళ్లే తప్ప నోట సరస్వతి పలకలేదు. వాళ్లు విసిగిపోయి బాలుని రకరకాల శిక్షలకు గురిచేసారు. చివరకు గురువు నారాయణయ్యను కోదండమున వ్రేలాడదీశారు. కోలగగ్గెర విధించారు. గుంజిళ్లు తీయించారు. కోదండం అంటే దూలానికి తాడు కట్టి వ్రేలాడతీయడం. కోలగగ్గెర అంటే కాళ్ళుచేర్చికట్టి కూలద్రోయడం.

నారాయణయ్యను అయ్యవార్లు ఇంతటి కఠిన పరీక్షలకు గురిచేసినందుకు మనస్సు గాయపడింది. నలుగురూ అవహేళన చేస్తున్నారు. సిగ్గుతో, అవమానంతో క్రుంగిపోయాడు. ఇంతకంటె చావు మేలను కున్నాడు. నారాయణయ్య ఊటుకూరు గ్రామశక్తి అయిన చింతలమ్మగుడి సమీపాన పుట్టలో పాముందని ఎవరో చెబుతుండగా విన్నాడు. నారాయణుడు ఒంటరిగా గుడికి చేరి పుట్టలో చేయి పెట్టాడు. నేడు ఊటుకూరునందు చింతలమ్మ ఆలయం కనిపించదు. కాని ఊటుకూరు శివాలయంలో ఒక గదిలో వున్న స్త్రీమూర్తి విగ్రహం "చింతలమ్మ" అని స్ధానికుల అభిప్రాయం. పాము కరవలేదు సరికదా, నారాయణయ్యకు త్రికాల వేదినియైన చింతలమ్మ ప్రత్యక్షమైంది. నారాయణయ్య ఏడుస్తూ ఆమె పాదాల మీద పడ్డాడు. చింతలమ్మ ఆ బాలుని ఓళ్ళో చేర్చుకొని వూరడించింది."ఎందుకుబాబూ ఈ అఘాయిత్యం? నీ మూడోతరంలో గొప్ప హరి భక్తుడు జన్మిస్తాడు. అతని వల్ల మీ వంశమే తరిస్తుంది. నీకు చదువు రాకపోవడమేమిటి? వెళ్ళు, తాళ్ళపాక చెన్నకేశవస్వామే నీకు అన్నీ అనుగ్రహిస్తాడు" అని నారాయణయ్యను అనుగ్రహించి అంతర్థానమైనది. అమ్మవారి ఆదేశం ప్రకారం నారాయణయ్య తాళ్ళపాక చేరి ఆశ్రితక్లేశనాశకుడైన చెన్నకేశవస్వామిని సేవించి స్వామి అనుగ్రహించే వేదవేదాంగ పారంగతుడై సకలవిద్యలు పొందగలుగుతాడు. సర్వజ్ఞుడని కీర్తి పొందుతాడు. ఈ నారాయణయ్య కుమారుడే నారాయణసూరి.

అన్నమయ్య తండ్రి - నారాయణసూరి
అన్నమయ్య తండ్రి అయిన నారాయణసూరి గొప్ప కవి, పండితుడు, సకల విద్యాదురంధరుడుగా ప్రసిద్ధికెక్కినవాడు. అన్నమయ్య తండ్రి పేరు ’నారాయణసూరి’గా చిన్నన్న పేర్కొనడాన్నిబట్టి తాళ్ళపాకవారు అన్నమయ్య జననానికి ముందే పండిత వంశస్ధులుగా కీర్తించబడేవారని భావించవచ్చును. నారాయణసూరి ధర్మపత్ని లక్కమాంబ, మహా భక్తురాలు. మధురంగా పాడుతుంది. ఈమె స్వగ్రామం మాడువూరు, కడప జిల్లా సిద్దపట్నం తాలూకాలో వున్నది. అక్కడ చెన్నకేశవస్వామి ఈమెతో ప్రత్యక్షంగా మాట్లాడేవాడట.

అన్నమయ్య తండ్రి - తిరుమల పయనం
భాగవతసేవా పరాయణులైన నారాయణసూరి, లక్కమాంబ లకు సంతానం లేకపోవడం తీవ్ర వ్యధకు గురిఅయినారు. ఈ పుణ్య దంపతులు సంతానం కోసం చేయని వ్రతం లేదు, కొలవని దేవుడు లేడు. "మాకు మంచి కొడుకును ప్రసాదించు స్వామీ" అని ఏడుకొండలస్వామికి మ్రొక్కుకున్నారు. ముడుపులు కట్టుకున్నారు. ఒక మంచిరోజు చూసి ఇద్దరూ వేంకటేశ్వరస్వామి దర్శనం కోసం ప్రయాణమయ్యారు.లక్కమాంబ, నారాయణసూరి తిరుమల చేరారు. స్వామి మందిరం ప్రవేశించారు. గరుడస్థంభం వద్ద సాగిలి మ్రొక్కారు. వాళ్ళకేదో మైకం కమ్మినట్లైంది. కళ్లు మిరుమిట్లు గొలిపే తేజస్సు కనిపించి ధగదగ మెరిసే ఖడ్గాన్ని వాళ్ల చేతుల్లో పెట్టి అద్రుశ్యమైంది. వేంకటేశ్వరస్వామి తన నిజ ఖడ్గమైన నందకాన్ని ఆ పుణ్య దంపతులకు ప్రసాదించాడు. వాళ్ళు పరమానంద భరితులయ్యారు. వేంకటపతిని దర్శించి స్తుతించారు. సంతోషంతో తాళ్లపాకకు తిరిగి వచ్చారు.

అన్నమయ్య జననం
ఆ దంపతులు తిరుమల దర్శించుకొని, ధ్వజస్తంభం ఎదురుగా సాష్టాంగ ప్రణామం ఆచరించినపుడు ఒక దివ్యమైన కాంతి లక్కమాంబ గర్భంలో ప్రవేశించిందని గాథ. కొండలయ్య తాను ధరించే "బిరుదు గజ్జియల ముప్పిడి కఠారాన్ని" వారికందజేశాడట. అలా పుట్టిన శిశువే అన్నమయ్య.

లక్కమాంబ గర్భవతి అయింది. వైశాఖమాసం విశాఖ నక్షత్రంలో ఒక శుభలగ్నంలో మూడు గ్రహాలు ఉన్నత దశలో వుండగా నారాయణసూరి, లక్కమాంబలకు నందకాంశమున పుత్రోదయమైనది, మగశిశువు ఉదయించాడు. సర్వధారి సంవత్సరం వైశాఖ శుద్ధ పూర్ణిమ నాడు (మే 9, 1408) కడప జిల్లా లోని రాజంపేట మండలం తాళ్ళపాక గ్రామములో అన్నమయ్య జన్మించాడు. నారాయణసూరి ఆ శిశువునకు ఆగమోక్తంగా జాతకర్మ చేశాడు. 
అన్నమయ్య అని నామకరణం చేసాడు.

"అన్నం బ్రహ్మేతి వ్యజనాత్" అనే శ్రుతి ప్రకారం నారాయణసూరి పరబ్రహ్మ వాచకంగా తన పుత్రునకు అన్నమయ్య అని నామకరణం చేశాడు. అన్నమయ్యకు అన్నమయ్యంగారు, అన్నమాచార్యులు, అన్నయగురు, అన్నయార్య, కోనేటి అన్నమయ్యంగారు అనే నామాంతరాలు తాళ్ళపాక సాహిత్యంలోను, శాసనాల్లోను కనిపిస్తాయి.

శ్రీమహావిష్ణువు వక్షస్ధలమందలి కౌస్తుభమే శఠకోపయతిగా, వేంకటేశ్వరస్వామి గుడి ఘంట వేదాంతదేశికులుగా స్వామి హస్తమందలి నందకమనే ఖడ్గాంశలో పేయాళ్వారులు, అన్నమయ్యలు అవతరించారని ప్రాజ్ఞుల విశ్వాసం.

అన్నమయ్య బాల్యం
"హరి నందకాంశజుం డగుట డెందమున
పరమ సుగ్యాన సంపద పొదలంగ........."

అన్నమయ్య బోసి నవ్వులు వొలకబోస్తూ నలుగురినీ మురిపించేవాడు. మాటిమాటికీ వెంకన్న పేరు చెబితేనే ఉగ్గుపాలు త్రాగేవాడు. వేంకటపతికి మొక్కుమని చెబితేనే మొక్కేవాడు. వేంకటపతిమీద జోలపాడనిదే నిద్రపోడు. లక్కమాంబ భక్తిగీతాలు పాడుతుంటే పరవశించి పోయేవాడు. నారాయణసూరి కావ్యాలలో అర్ధాలు వివరిస్తూవుంటే తానూ ఊ కొట్టేవాడు.ఇలా అన్నమయ్య శిశుప్రాయం నుండి వేంకటపతి మీది ధ్యానంతో ప్రొద్దులు గడిపేవాడు.

అన్నమయ్యకు అయిదు సంవత్సరాలు నిండాయి. నారాయణసూరి ఆర్యుల సమ్మతి ప్రకారం ఉపనయనం చెయించాడు. అన్నమయ్యకు -

అహినాయకాద్రి
వెన్నుని వరముచే విద్య లన్నియును
నమితంబు లగుచు జిహ్వరంగసీమ
తము దామె సొచ్చి నర్తనమాడ దొడగె

అన్నమయ్య ఆడిన మాటల్లా అమృతకావ్యంగ, పాడినదల్లా పరమగానంగా భాసించేది. చిన్ననాటనే వేంకటపతి మీద వింత వింతలుగా సంకీర్తనలు ఆలపించేవాడు. కాని అన్నమయ్య సంకీర్తన రచనకు స్వామి ఆదేశం పొందినది తన పదహారవ సంవత్సరంలోనే! వేంకటేశ్వరస్వామి ఆదేశం ప్రకారం అన్నమయ్య తన పదహారో ఏటనుండి రోజుకొక్క సంకీర్తనకు తక్కువ కాకుండా వ్రాయడం ప్రారంభించాడు. ఈ విషయం రాగిరేకులమీద తొలి వ్యాక్యాలవల్ల కూడా స్పష్టమవుతున్నది. 

అన్నమయ్య ఏక సంథాగ్రాహి. గురువులు చెప్పిన పాఠాలు చెప్పినవెంటనే అప్పచెప్పేవాడు. వాళ్లు ఆశ్చర్యపడేవాళ్లు. ఇంక అన్నమయ్యకు నేర్పించవలసింది ఏమీ లేదని త్వరలోనే తెలుసుకున్నారు. అన్నమయ్య చెన్నకేశవుని గుడిచేరి "బుజ్జి కేశవా" అని పిలిచేవాడు.

బుజ్జిబాలుని ముద్దు మాటలకు మురిసి చెన్నకేశవుడు చిరునవ్వులు చిందించేవాడు. అన్నమయ్య ఎప్పుడూ ఆటల్లో పాటల్లో మునిగి తేలేవాడు. చెరువు కట్టలమీద చేరి చెట్టుమీద పిట్టలతో గొంతు కలిపేవాడు. చిరుగాలుల సవ్వడికి మురిసేవాడు. చెరువులోని అలలలో ఉయ్యాలలూగే కమలాలను చూస్తూ గంతులేసేవాడు. కన్నెపిల్లలు వెన్నెల రోజుల్లో జాజర పాడుతూంటే అక్కడ చేరుకొని వాళ్లను అల్లరి పెట్టేవాడు. రాగం పాడీ, తాళం వేసీ చూపేవాడు. "మీకేం తెలీదు పొ"మ్మని ఎగతాళి చేసేవాడు. కలుపు పాటల్లో, కవిల పాటల్లో జానపదులతో బాటు శ్రుతి కలిపేవాడు. అన్నమయ్య మాటన్నా పాటన్నా ఆ వూరి వాళ్లు ఎంతో సంబరిపడిపోయే వాళ్లు.

నారాయణసూరిది పెద్ద కుటుంబం. ఉమ్మడి కుటుంబాలలో చిన్న చిన్న కలతలు తప్పవు. వాళ్ల కోపతాపాలు అర్థం లేనివి కావు. ఇంతలో తగువులాడతారు. అంతలో కలిసిపోతారు.అన్నమయ్య బాల్యంలో తల్లిదండ్రులు, వదిన చెప్పిన పనులు అన్నీ విసుగు చెందగ చేసేవాడు. ఉమ్మడి కుటుంబాలల్లో పనులు తప్పవు. అందుకనే అన్నమయ్య ఎప్పుడూ దండె భుజాన తగిలించుకొని పాటలు పాడడం ఇంటివారలకు అంతగా నచ్చేది కాదు. 

ఒకనాడు అందరు కలిసికట్టుగా అన్నమయ్య మీద విరుచుకు పడ్డారు. అన్నమయ్యకు దిక్కు తెలియలేదు. "ఎప్పుడూ ఆ దండె భుజాన తగిలించుకొని పిచ్చి పాటలు పాడుకోవడమేనా? ఇంట్లో పనీపాటా ఎవరు చూస్తారు? "అని ఇంటివాళ్లు దెప్పి పొడిచారు. "గాలి పాటలు కట్టిపెట్టి అడవికెళ్ళి పశువులకింత గడ్డి తెచ్చిపడేయ్." ఏ విసుగులో వున్నాడో నారాయణసూరి కొడుకును కసిరినంత పనీచేశాడు. లక్కమాంబ మాత్రం కొడుకువైపు జాలిగా చూసింది. అన్నమయ్య ఏమీ బదులు పలకలేదు. కొడవలి భుజాన తగిలించుకొని అడవికి బయలుదేరాడు.

అన్నమయ్యకు అడవికి వెళ్ళడం అలవాటు లేదు. ఒక చెట్టు కింద చతికిలబడ్డాడు. తంబుర చేతిలోనే ఉంది. తీగలు సవరించి పాడబోయాడు. పక్కనే కొడవలి ఉంది. దాన్ని చూస్తూనే వచ్చిన పని గుర్తుకు వచ్చింది. లేచి చుట్టూ పరికించాడు. ఒక చోట పచ్చిక బాగా బలిసి ఉంది.

’పాపవల్లరుల శ్రీపతినామహేతి
నే పార దఋగు యోగీంద్రు చందమున ’

అంటూ కొడవలితో పచ్చికను కోస్తున్నాడు. పచ్చిక కోస్తున్నా మనసంతా శ్రీహరి మీదనే ఉంది. అందుకే మరికొంత పచ్చికను కొయబోతున్న అన్నమయ్య ఒక్కసారి "అమ్మా!!" అని కేక పెట్టాడు. చిటికినవేలు తెగి రక్తం బొటబొటా కారుతున్నది. రక్తం చూస్తూనే కళ్లు తిరిగిపోయాయి. బాధతో మూలిగాడు. ఈ అవస్థకు కారణం ఎవరు? ఒక్కమారు తనబంధువుల్ని తల్లిదండ్రుల్ని గుర్తుకు తెచ్చుకున్నాడు. వేదనలో విరక్తి, భక్తి జన్మించాయి. వేదనలో వేదం ప్రభవించినట్లు ఈ సంఘటన అన్నమయ్య జీవితంలో భక్తిరసావేశానికి నాంది పలికింది. "అంతా అబద్ధం. తనకు ఎవ్వరూ లేరు. లౌకిక బంధాలతో తనకు పని లేదనుకున్నాడు.

"అయ్యోపోయ బ్రాయముగాలము
మయ్యంచు మనసున నే మొహమతినెత్తి||

తగు బంధూలా తనకు దల్లులును దండ్రులును
వగలబెట్టుచు దిరుగువారేకాక

మిగుల వీరల పొందు మేలనుచు హరినాత్మ
దగిలించలేక చింతాపరుడనైతి ||

అని చింతించి......

"తల్లియుదండ్రియు దైవంబు గురువు
నెల్ల సంపదలునై యెల్ల చందముల
ననుబ్రోచు శెశాద్రినాధుని,గొలిచి
మనియెద........."

అని నిర్ణయించుకొంటాడు.

తిరుమల పయనం
అదే సమయాన తిరుమల వెళ్ళే యాత్రికుల గుంపును చూశాడు. వాళ్లు ఆడుతూ పాడుతూ వెళ్తున్నారు. చేతిలొ వున్న కొడవలిని విసిరేసాడు. తంబుర చేత పట్టుకొని ఆ గుంపులో కలిసిపోయాడు. ఆ యాత్రికులు ఎవరోకారు, సనకాదులనే భక్తబృందం. వాళ్ల వేషం తమాషాగా వుంది. జింక చర్మంతో చేసిన కిరీటాలు పెట్టుకున్నారు. అబ్రకము, ఆకులు కుట్టిన బట్టలు వేసుకున్నారు. నొసట పట్టెనామాలు, శంఖ చక్రాల ముద్రికలు, కాళ్లకు కంచు అందెలు, చేతిలో బాణాలున్నాయి. దండెలు మీటుకుంటూ చిట్టి తాళాలు వాయిస్తూ మద్దెల మ్రోగిస్తూ భక్తి పారవశ్యంతో పాడుతూ చిందులేస్తూ మధ్యలో "గోవిందా! గోవింద!"........

"వేడ్కుందామా వేంకటగిరి వేంకటేశ్వరుని||
ఆమటి మ్రొక్కులవాడే ఆదిదేవుడే వాడు
తోమని పళ్యలవాడే దురితదూరుడే ||

అంటూ చిత్రగతుల పాడుకుంటూ కొండకు పయనమవుతున్న యాత్రికులతో కలిసి తిరుపతి చేరుతాడు అన్నమయ్య.

తిరుపతి పొలిమేరలోకల గ్రామసక్తి తాళ్ళపాక గంగమ్మను సేవించాడు. తిరుపతిలో ఇంకా తాతాయగుంట గంగమ్మ, అంకాళమ్మ, వేశాలమ్మ, కాళెమ్మ, నేరెళ్ళమ్మ, కావమ్మ, మారలయ్య అనే గ్రామశక్తులు కొలువై ఉన్నారు. పూర్వం తిరుపతికి వచ్చే భక్తబ్రుందం మొదట తాళ్ళపాక గంగమ్మను సేవించిన తరువాతనే తిరుమలను సందర్సించే ఆచారం వుండేది. నేటికి తిరుపతిలో మేనెలలో గ్రామసఖ్తి గంగమ్మజాతర వైభవోపేతంగా జరుగుతుంది.

గంగమ్మని దర్సించిన అనంతరం అన్నమయ్య -

"అదె చూడు తిరువేంకటాద్రి నాలుగు యుగము
లందు వెలుగొంది ప్రభమీరగాను "

అని తిరుపతులను కీర్తిస్తూ అచ్చటి చక్రవర్తి పీఠాలు, దేశాంత్రుల మఠాలు, తపస్వుల గృహాలు, విశ్రాంతదేశాలను సందర్శించాడు. తిరుమలకు పయనమవుతూ మార్గమధ్యంలోని అళిపురిసింగరి, తలయేరుగుండు, పెద్దయెక్కుడు, కపురంపు కాలువలను 
సందర్శించాడు.

ఇక్కడ అళిపురిసింగరి, తలయేరుగుండు, కురువమండపం, పెద్దయెక్కుడు, కపురంపు కాలువ, మోకాళ్ళముడుపులను గూర్చి వివరించడం సమంజసం.

అన్నమయ్య ఇంటిలో తల్లి సంగీతం, తండ్రి పాండిత్యం ఛాయలలో పెరిగాడు. ఉపవీత సంస్కారం పొందిన తరువాత ఇంటి గురుకులంలోనే విద్యాభ్యాసం సాగింది. ఏక సంధాగ్రాహి అయినందున అనతికాలంలో ఉన్నత విద్యావంతుడయ్యాడు. తన పదహారవ యేట అన్నమయ్యకు శ్రీవేంకటేశ్వర దర్శనానుభూతి కలిగింది. అప్పటినుండి అన్నమయ్య అద్భుతమైన కీర్తనలను రచింపసాగాడు.

అళిపురిసింగరి(అలిపిరి)
కొండ ఎక్కుటలో తొలిమెట్టుగల ప్రాంతం అళిపురి. అడిపడి, అలిపిరి అని కూడా పిలుస్తారు. అలిపిరి చేరాడు, అక్కడ వెలసిన నరసింహస్వామికి నమస్కారం చేశాడు. అలిపిరి కొండకు చుక్కల పర్వతం అని కూడా పేరు. భగవంతుని చేరడానికి ఇది తొలిపాదం.

తిరుమల దర్శనం
సంప్రదాయం తెలియక తిరుమల కొండను చెప్పులతో కొండనెక్కుచుండగా అలసిపోయి ఒక వెదురు పొదలో నిద్రపోయాడు. అప్పుడు ఆయనకు కలలో అలివేలు మంగమ్మ దర్శనమిచ్చి పరమాన్నాన్ని ప్రసాదించి, పాదరక్షలు లేకుండా కొండనెక్కమని బోధించింది. 

అప్పుడు పరవశించి అలమేలుమంగను కీర్తిస్తూ అన్నమయ్య శ్రీవేంకటేశ్వర శతకము రచించాడు. తిరుమల శిఖరాలు చేరుకొన్న అన్నమయ్య స్వామి పుష్కరిణిలో స్నానం చేసి, వరాహ స్వామి దేవాలయంలో ఆదివరాహ స్వామిని దర్శించుకొన్నాడు. పిదప వేంకటపతి కోవెల పెద్దగోపురము ప్రవేశించి "నీడ తిరుగని చింతచెట్టు"కు ప్రదక్షిణ నమస్కారాలు చేసి, గరుడ స్తంభానికి సాగిలి మ్రొక్కాడు. సంపెంగ మ్రాకులతో తీర్చిన ప్రాకారము చుట్టి "విరజానది"కి నమస్కరించాడు. భాష్యకారులైన రామానుజాచార్యులను స్తుతించి, యోగ నరసింహుని దర్శించి, జనార్దనుని (వరదరాజస్వామిని) సేవించి, "వంట యింటిలో వకుళా దేవి"కు నమస్కరించి, "యాగశాల"ను కీర్తించి, ఆనంద నిలయం విమానమును చూచి మ్రొక్కాడు. కళ్యాణమంటపమునకు ప్రణతులిడి, బంగారు గరుడ శేష వాహనములను దర్శించాడు. శ్రీభండారమును చూచి, బంగారు గాదెలను (హుండీని) సమర్పించి తన పంచె కొంగున ముడివేసుకొన్న కాసును అర్పించాడు. బంగారు వాకిలి చెంతకు చేరి, దివ్యపాదాలతో, కటివరద హస్తాలతో సకలాభరణ భూషితుడైన దివ్యమంగళ శ్రీమూర్తిని దర్శించుకొన్నాడు. తీర్ధ ప్రసాదాలను స్వీకరించి, శఠగోపంతో ఆశీర్వచనము పొంది, ఆ రాత్రి ఒక మండపములో విశ్రమించాడు.

శ్రీవారి దివ్య దర్శనం పొందిన అన్నమయ్య, ఆ భక్తి పారవశ్యంలో తన తొలి కీర్తన "అదివో అల్లదివో శ్రీహరివాసము" ఆలపించారు.

తరువాత అన్నమయ్య కొండపై కుమార ధార, ఆకాశ గంగ, పాప వినాశం వంటి తీర్ధాలను దర్శించి, కొండపైనే స్వామిని కీర్తిస్తూ ఉండిపోయాడు. అతని కీర్తనలు విని అర్చకులు అతనిని ఆదరించ సాగారు.

అన్నమయ్య, 
అన్నమాచార్య మారడం: 
తిరుమలలో ఘనవిష్ణువు అనే ముని స్వామి అన్నమయ్యను చేరదీసి అతనికి భగవదాజ్ఞను తెలిపి శంఖ చక్రాదికములతో శ్రీవైష్ణవ సంప్రదాయానుసారముగా పంచ సంస్కారములను నిర్వహించాడు. అన్నమయ్య కు అన్నమాచార్య అని నామకరణం చేసాడు. గురువుల వద్ద వైష్ణవ తత్వాలను తెలుసుకొంటూ, ఆళ్వారుల దివ్య ప్రబంధాలను అధ్యయనం చేస్తూ, వేంకటేశ్వరుని కీర్తిస్తూ తిరుమలలోనే అన్నమయ్య జీవితం గడప సాగాడు.

సంసారం, సంకీర్తనం
అన్నమయ్య తిరుమలలో ఉన్నాడని విని అతని తల్లిదండ్రులు తిరుమలకు వెళ్ళి అతనిని ఇంటికి తిరిగి రమ్మని బ్రతిమాలారు. ముందు నిరాకరించినా గాని అన్నమయ్య గురువు ఆనతిపై తాళ్ళపాకకు తిరిగి వచ్చాడు. కాని నిరంతరం భగవధ్యానంలో ఉంటూ స్వామిని కీర్తిస్తూ ఉండేవాడు. అతనికి యుక్త వయస్సు రాగానే తిమ్మక్క, అక్కమ్మ అనే పడతులతో వివాహం చేశారు తల్లిదండ్రులు. వైవాహిక జీవితంలో పడిన అన్నమయ్య ఒకమారు తన ఇద్దరు భార్యలతో కూడి తిరుమలను దర్శించాడు. ఆ సమయంలోనే శ్రీవేంకటపతికి రోజుకొక సంకీర్తన వినిపించాలని సంకల్పించాడు.

అప్పటినుండి అన్నమయ్య పుంఖానుపుంఖాలుగా కీర్తనలు చెప్పాడు. అతని శిష్యులు వాటిని గానం చేస్తూ తాళపత్రాలకు ఎక్కించసాగారు. తరువాత అన్నమయ్య తన భార్యలతో కలసి తీర్ధయాత్రలకు బయలుదేరాడు. వారు ముందుగా తమ వూరిలో చెన్నకేశవుని అర్చించారు. మార్గంలో నెందలూరు సౌమ్యనాధుని, ఒంటిమిట్ట రఘురాముని, కడప వేంకటరమణుని, చాగలమర్రి చెన్నకేశవుని దర్శించుకొన్నారు. తరువాత నవనారసింహ క్షేత్రం అయిన అహోబిలం చేరుకొని శ్రీలక్ష్మీనరసింహస్వామి దర్శనం చేసుకొని ఆనందించారు. ఆ క్షేత్రాన్ని, తీర్ధాన్ని, దైవాన్ని అన్నమయ్య తన కీర్తనలతో స్తుతించాడు. అహోబల మఠ స్థాపనాచార్యుడైన ఆదివణ్ శఠకోపయతులవద్ద అన్నమయ్య సకల వైష్ణవాగమాలను అధ్యయనం చేశాడు. అతని బోధనల ద్వారా పరబ్రహ్మస్వరూపమునర్చించే దివ్యయోగంలో కుల విచక్షణ వంటి అడ్డుగోడలను కూలగొట్టాలని అవగతం చేసుకొన్నాడు. ఇంకా అన్నమయ్య దక్షిణాదిన ఎన్నో వైష్ణవ క్షేత్రాలను దర్శించుకొన్నాడు. అతని కీర్తనలు అంతటా ప్రసిద్ధం కాజొచ్చాయి.

రాజాశ్రయం
విజయనగర రాజ ప్రతినిధి, దండనాధుడు అయిన సాళ్వ నరసింగరాయలు (ఇతడు శ్రీకృష్ణదేవరాయలుకు తాత), టంగుటూరు కేంద్రంగా ఆ సీమ ("పొత్తపినాడు") పాలనా వ్యవహారాలు చూస్తుండేవాడు. అతనికి "మూరురాయర గండ" అనే బిరుదుండేది. అన్నమయ్య కీర్తనలు, అతని ఆశీర్వచన మహాత్మ్యం గురించి విన్న దండనాధుడు తాళ్ళపాకకు వెళ్ళి అన్నమయ్యను దర్శించి అతనితో సాన్నిహిత్యాన్ని పెంచుకొన్నాడు. తరువాత అతను పెనుగొండ ప్రభువయినాక అన్నమయ్యను తన ఆస్థానానికి ఆహ్వానించాడు. రాజ ప్రాపకం వలన అన్నమయ్య సంగీత ప్రభావం కన్నడదేశంలో హరిదాసకూటాలలో ప్రసిద్ధమయ్యింది. తరువాతి కాలంలో ఆ రాజు అన్నమయ్యను తనపై కూడా ఒక్కపదాన్ని వినిపించమని కోరాడట. హరిని కీర్తించే నోట నరుని కీర్తించనని అన్నమయ్య నిరాకరించినందున, కోపించి రాజు అతనిని చెరసాలలో సంకెళ్ళలో ఉంచాడట.

అంత్య కాలం
రాజాస్థానం తనకు తగినది కాదని తెలుసుకొని అన్నమయ్య తిరుమల చేరాడు. తన శేషజీవితాన్ని స్వామి సన్నిధిలో నిత్యారాధనలో, సంకీర్తనా దీక్షలో గడిపాడు. ఈ దశలో ఆధ్యాత్మిక సంకీర్తనలు అధికంగా రచించాడు. వేంకటాచలానికి సమీపంలో ఉన్న "మరులుంకు" అనే అగ్రహారంలో నివసించేవాడు. ఈ సమయంలో రాజ్యంలో కల్లోలాలు చెలరేగాయి. అంతఃకలహాలలో రాజవంశాలు మారాయి. అన్నమయ్య జీవితంపట్ల విరక్తుడై నిత్యసంకీర్తనలతో పొద్దుపుచ్చేవాడు. అతని కీర్తనలలోని ఆశీర్వచన మహాత్మ్యం కథలు కథలుగా వినిన ప్రజలు అతని సంకీర్తనా సేవకు జనం తండోపతండాలుగా రాసాగారు.

ఈ సమయంలోనే పురందర దాసు తిరుమలకు వచ్చాడు. ఇద్దరూ వయోవృద్ధులు. భక్తశ్రేష్టులు. విష్ణుసేవాతత్పరులు. సంగీత కళానిధులు. ఒకరినొకరు ఆదరంతో మన్నించుకొన్నారు. "మీ సంకీర్తనలు పరమ మంత్రాలు. వీటిని వింటే చాలు పాపం పటాపంచలౌతుంది. మీరు సాక్షాత్తు వేంకటపతి అవతారమే" అని పురందరదాసు అన్నాడట. అప్పుడు అన్నమాచార్యుడు "సంధ్య వార్చుకోవడానికి సాక్షాత్తు విఠలునితోనే నీళ్ళు తెప్పించుకొన్న భాగ్యశాలివి. మీ పాటలు కర్ణాటక సంగీతానికే తొలి పాఠాలు. మిమ్ము చూస్తే పాండురంగని దర్శించుకొన్నట్లే" అన్నాడట.

95 సంవత్సరాలు పరిపూర్ణ జీవితం గడిపిన అన్నమయ్య దుందుభి నామ సంవత్సరం ఫల్గుణ బహుళ ద్వాదశి నాడు (1503 ఫిబ్రవరి 23) పరమపదించాడు. రాగిరేకులమీద వ్రాసిన తిధుల కారణంగా అతని జన్మ, మరణ దినాలు తెలుస్తున్నాయి.

ఇతడు శ్రీమహావిష్ణువు యొక్క ఖడ్గం అయిన నందకాంశ సంభూతుడు అని భావన ఉంది. "పదకవితా పితామహుడు", "సంకీరత్నాచార్యుడు", "పంచమాగమ సార్వభౌముడు", "ద్రవిడాగమ సార్వభౌముడు" - ఇవి అన్నమయ్యకు సమకాలీనులు సాదరంగా ఇచ్చిన బిరుద నామాలు. అవసానకాలంలో తన కొడుకు పెద తిరుమలయ్యను పిలచి, ఇంక దినమునకు ఒక్క సంకీర్తనకు తక్కువ కాకుండా శ్రీనివాసునకు వినిపించే బాధ్యతను అతనికి అప్పగించాడట.

అన్నమయ్య కీర్తనలు, రచనలు
అన్నమయ్య సంకీర్తనా సేవ సంగీత, సాహిత్య, భక్తి పరిపుష్టం. అధికంగా తెలుగులోనే పాడినా అతను సంస్కృత పదాలను ఉచితమైన విధంగా వాడాడు. కొన్ని వందల కీర్తనలను సంస్కృతంలోనే రచించాడు. కొన్నిచోట్ల తమిళ, కన్నడ పదాలు కూడా చోటు చేసుకొన్నాయి. అతని తెలుగు వ్యావహారిక భాష. మార్గ, దేశి సంగీత విధానాలు రెండూ అతని రచనలలో ఉన్నాయి. 

అన్నమయ్యకు పూర్వం కృష్ణమాచార్యుల వచనాలవంటివి ఉన్నా గాని అవి "అంగాంగి విభాగం లేక, అఖండ గద్య ధారగా, గేయగంధులుగా" ఉన్నాయి. శివకవుల పదాలగురించి ప్రస్తావన ఉన్నాగాని అవి లభించడంలేదు. మనకు లభించేవాటిలో అన్నమయ్యవే తొలిసంకీర్తనలు గనుక అతను "సంకీర్తనాచార్యుడు", 'పదకవితా పితామహుడు" అయ్యాడు.

అన్నమయ్య "యోగ వైరాగ్య శృంగార సరణి" మొత్తం 32,000 సంకీర్తనలు రచించాడని అతని మనుమడు చిన్నన్న పేర్కొన్నాడు. అతని పుత్రపౌత్రాదులు వీటిని రాగిరేకులమీద వ్రాయించారు. ఆ రేకులను తిరుమలలో సంకీర్తనా భండాగారంలో పొందుపరచారు. అయితే ప్రస్తుతం 14,000 మాత్రమే లభిస్తున్నవి. రేకులమీది అంకెల ప్రకారం కొన్ని రేకులు లభించడంలేదు. (వాటిని కొందరు కరగించుకొని ఉండవచ్చును.)

సంకీర్తనా లక్షణమనే సంస్కృత గ్రంథం కూడా అన్నమయ్య వ్రాశాడట. మంజరీ ద్విపదలో "శృంగార మంజరి" అనే కావ్యాన్ని రచించాడు. అతడు రచించాడని చెప్పబడే 12 శతకాలలో "వేంకటేశ్వర శతకము" ఒక్కటి మాత్రమే లభిస్తున్నది. ఇతర ప్రబంధాలు, వేంకటాచల మహాత్మ్యము, సంకీర్తనలక్షణం, ద్విపద రామాయణం వంటి గ్రంథాలు లభించలేదు.

రాళ్ళపల్లి అనంతకృష్ణశర్మ మాటలలో అన్నమయ్య రచనలు " ఒక సారస్వత క్షీర సముద్రం. కావ్యముల ధర్మమైన బావార్జవంలో, శైలిలో, భావవైవిద్యంలో, రాశిలో అన్నమాచార్యుని రచనను మించినది ఆంధ్ర వాఙ్మయంలో మరొక్కటి లేదు... నగుబాట్లైన ద్విపద, పద కవితలను ఉద్ధరించి ఉన్నత స్థానం కలిగించిన ప్రతిష్ఠ అన్నమాచార్యునిదే"

అలమేలుమంగ, శ్రీనివాసుల కీర్తనలకు తన జీవితాన్ని అంకితం చేసిన పరమభక్తుడు అన్నమయ్య. అతని రచనలలో భక్తి, సంగీతము, సాహిత్యము, శృంగారము, వేదాంతము అత్యంత మనోహరంగా, వినసొంపుగా చెప్పబడ్డాయి. సరళమైన మాటలలో ఆధ్యాత్మ సత్యాలను, వేంకటపతి తత్వాన్ని, జీవాత్మ పరమాత్మల తాదాత్మ్యాన్ని వినిపించాడు. లోకనీతిని, ధర్మాన్ని, విష్ణుతత్వాన్ని కీర్తించాడు. దక్షిణాపధంలో భజన సంప్రదాయానికి అన్నమయ్యే ఆద్యుడు.

మచ్చుకి కొన్ని ఉదాహరణలు
"అదివో అల్లదివో శ్రీహరి వాసము
పదివేల శేషుల పడగల మయము."

"అలర చంచలమైన ఆత్మలందుండ నీ యలవాటు చేసె నీవుయ్యాల
పలుమారు నుచ్ఛ్వాస పవనమందుండ నీ భావంబు దెలిపె నీ వుయ్యాల "

"కులుకక నడవరో కొమ్మలాలా
జలజల రాలీని జాజులు మాయమ్మకు"

"క్షీరాబ్ధి కన్యకకు శ్రీ మహాలక్ష్మికిని
నీరజాలయమునకు నీరాజనం"

"జోఅచ్యుతానంద జోజో ముకుంద
రావె పరమానంద రామ గోవింద "

"చెల్లఁబో తియ్యనినోరఁ జేఁ దేఁటికి యీ-
పల్లదపుఁగోరికలపాలు సేయవలెనా"

ఉదయాద్రి తెలుపాయె ఉడురాజు కొలువిడె
అదనెరిగి రాడాయెనమ్మా నా విభుడు

కుటుంబం
అన్నమయ్య వంశం తెలుగు సాహిత్యానికి ఆభరణం. అన్నమయ్య తండ్రి మహాపండితుడు. తల్లి సంగీతకళానిధి. అన్నమయ్య భార్య తిమ్మక్క తెలుగులో తొలి కవయిత్రి. "సుభద్రా కళ్యాణం" మంజరి ద్విపద కావ్యం రచించింది. ఈమె కుమారుడు నరసింహుడు సంగీత సాహిత్య కళా కోవిదుడని చిన్నన్న వ్రాశాడు ("పాడఁజెప్పఁగ వర్ణపద్ధతినీడు, జోడులేఁడని సభ సొచ్చి వాదించి, పరఁగిన ధీశాలి ప్రతివాదదైత్య నరసింహుఁడనఁగల్గె నరసింహగురుఁడు"). కవికర్ణ రసాయనం అనే కావ్యాన్ని వ్రాసిన సంకుసాల నృసింహకవి ఇతడేనని కొందరి అభిప్రాయం. నరసింగన్న భార్యలు వాచ్చారమ్మ, అనంతమ్మ. వారి పుత్రులు నారాయణుడు, అప్పలార్య, అన్నలార్య.

తిరుమలాచార్యుడు తండ్రి వలెనే సంకీర్తనా యజ్ఞం నిర్వహించాడు. ఇతని ఆధ్యాత్మ శృంగార సంకీర్తనలతో పాటు మరికొన్ని లఘురచనలు లభించాయి. వెంకటేశ్వర వచనములు, శృంగార దండకము, చక్రవాళ మంజరి, శృంగార వృత్త శతకము, వేంకటేశ్వరోదాహరణము, నీతి సీసశతకము, సుదర్శన రగడ, రేఫఱకార నిర్ణయం, ఆంధ్ర వేదాంతం (భగవద్గీత తెలుగు అనువాదవచవం), శ్రీ వేంకటేశ ప్రభాత స్తవము (ద్విపద), సంకీర్తనా లక్షణ వ్యాఖ్యానం (అలభ్యం) వంటివి రచించాడు. ఇతని భార్య తిరుమలమ్మ. వారి కొడుకులు చిన తిరుమలయ్య, అన్నయ్య, పెదతిరువెంగళ నాథుడు, చినతిరువెంగళనాధుడు (చిన్నయ్య లేదా చిన్నన్న), కోనేటి తిరువేంగళనాధుడు. చినతిరుమలయ్య తన తండ్రి, తాతలవలెనే ఆధ్యాత్మ, శృంగార సంకీర్తనలు రచించాడు. ఇంకా అష్టభాషా దండకం, సంకీర్తన లక్షణం (తండ్రి, తాతల సంస్కృత రచనలకు అనువాదం) వ్రాశాడు.

చినతిరుమలయ్య, అతని భార్య పెదమంగమ్మల కొడుకు తిరువేంగళప్ప అమరుక కావ్యానువాదము, అమరకోశానికి బాల ప్రబోధిక వ్యాఖ్య, ముమ్మటుని కావ్య ప్రకాశికకు సుధానిధి వ్యాఖ్య, రామచంద్రోపాఖ్యానం (అలభ్యం) వంటి రచనలు చేశాడు. పెద తిరుమలయ్య కొడుకు చిన్నన్న జనుల మన్ననలు పొందిన పరమ భక్తుడు, మహాగాయకుడు, భజన సంప్రదాయ ప్రచారకుడు, ద్విపద కవితకు విశేషంగా ప్రచారాన్ని కలిగించాడు. ఇతడు రచించిన అన్నమాచార్యుని జీవిత చరిత్రయే మనకు అన్నమయ్య జీవితానికి సంబంధించిన ప్రధాన ఆధార గ్రంథము. అంతే గాక ఇతడు పరమయోగి విలాసము, అష్టమహిషీ కళ్యాణము, ఉషా పరిణయము అనే ద్విపద కావ్యాలను రచించాడు. అన్నమయ్య, అక్కలమ్మల కుమార్తె తిరుమలాంబను తిరుమల కొండయార్యునికిచ్చి పెళ్ళి చేశారు. వారి కొడుకు రేవణూరి వెంకటాచార్యుడు శకుంతలా పరిణయము, శ్రీపాదరేణు మహాత్మ్యము.

ఇలా తాళ్ళపాక కవులు తెలుగు భాషకు, ప్రత్యేకించి పదకవితకు, ద్విపద కవితకు ఎనలేని సంపదను ఒనగూర్చారు. "చిన్నన్న ద్విపద కరగును, పన్నుగ పెద తిరుమలయ్య పదమునకెరగున్, మిన్నంది మొరసె నరసింగన్న పద్య గద్య శ్రేణిన్" అని తెనాలి రామకృష్ణుని చాటువు.

దొరికిన పెన్నిధి
తిరుమల సంకీర్తనా భండారంలో లభించిన రాగిరేకులలో ఒకటి 1922లో, 14,000 అన్నమయ్య కీర్తనలు, ఇతర రచనలు లిఖించిన 2,500 రాగిరేకులు తిరుమల సంకీర్తనా భాండాగారం (తరువాత పెట్టిన పేరు) లో లభించాయి. ఇది తిరుమల హుండీకి ఎదురుగా ఉన్న ఒక రాతి ఫలకాల గది.

అన్నమాచార్య ప్రాజెక్టు
అన్నమయ్య యొక్క విస్తృత పద సంపదను ఉపయోగించుకొని ప్రజలలో వేంకటేశ్వరుని మధురభక్తిని, శరణాగతిని ప్రోత్సహించడానికి అన్నమాచార్య ప్రాజెక్టు స్థాపించబడింది. అన్నమాచార్య ప్రాజెక్టులో సంగీతం, పరిశోధన, ప్రచురణ, రికార్డింగ్‌ అనే మూడు భాగాలున్నాయి. యువకళాకారులను తయారు చేసే దిశగా సంగీత విభాగం పనిచేస్తుంది. పరిశోధన, ప్రచురణ విభాగంలో భాగంగా అన్నమాచార్య సంకీర్తనల మీద, అన్నమాచార్యుల జీవిత చరిత్ర మీద పరిశోధన చేసేవారికి ప్రోత్సాహం లభిస్తుంది. రికార్డింగు విభాగం ద్వారా అన్నమయ్య సంకీర్తనలను ఆడియో క్యాసెట్ల రూపంలో తయారుచేసి మార్కెట్టులో అమ్ముతారు. తిరుమల తిరుపతి దేవస్థానము నిర్వహించే ధర్మ ప్రచార పరిషత్ తప్పితే మిగతా ప్రాజెక్టులన్నీ అన్నమాచార్య ప్రాజెక్టు పరిధిలోకి వస్తాయి. అన్నమాచార్య ప్రాజెక్టుతో దగ్గరి అనుబంధాన్ని కలిగి ఉంటాయి. అవి ఆళ్వార్ దివ్య ప్రబంధ ప్రాజెక్టు, దాస సాహిత్య ప్రాజెక్టు, భాగవత ప్రాజెక్టు, వేద రికార్డింగు ప్రాజెక్టు.

అన్నమయ్య ఆరు వందల జయంతి సందర్భంగా తాళ్ళపాకలో 19-5-2008 నుండి 22-05-2008 వరకు వుత్సవాలు జరిగాయి. ఈ సందర్భంగా 108 ఆడుగుల విగ్రహాన్ని 108 రోజులలో నిర్మించారు. తి.తి.దే వారు నిర్వహిస్తున్నారు. అన్నమయ్య 12 వ తరము వారు అగర్బ దరిద్రములో కొట్టుమిట్టాడు తున్నారని, ప్రభుత్వము వారు పించన్లు ఏర్పాటు చెయ్యడానికి వొప్పుకొన్నారు. అన్నమయ్య సాహితీ సంపదను తరతరాల వారికి అందించడానికి, వారి వంశస్థులను వినియోగిస్తున్నారు.

ప్రతిరోజూ స్వామివారి కోసం ఒక కొత్త కీర్తన రాయాలని ప్రతిజ్ఞ చేసి, తన జీవితకాలంలో ఏకంగా 32 వేల సంకీర్తనలను వెంకన్న పాదాలకు సమర్పించాడు.

వెంకన్నను తన భక్తి పాటలతో జోలపాడి, సుప్రభాతంతో మేల్కొలిపిన అన్నమయ్య భక్తి.. నేటికీ తిరుమల కొండల్లో ప్రతిధ్వనిస్తూనే ఉంది.

అన్నమయ్య కీర్తనలు

Monday, June 29, 2026

Anuradha Nakshatra - అనురాధ నక్షత్రము

అనురాధ నక్షత్రము

నక్షత్రం - అనురాధ
అధిపతి - శని
గణము - దేవ
జాతి - పురుష
వృక్షం - పొగడ
జంతువు - జింక
నాడి - మధ్య
పక్షి - పింగళ
అధిదేవత - సూర్యుడు
రాశి - వృశ్చికము

అనురాధ నక్షత్ర జాతకుల గుణగణాలు:
నక్షత్రములలో అనురాధ నక్షత్రము 17వ నక్షత్రం. ఇది దోష నక్షత్రము కాదు. కానీ, తల్లితండ్రులు సోదరులు ఇదే నక్షత్ర జననం అయినచో శాంతి అవసరం. ఇది దేవగణానికి చెందిన నక్షత్రం.

ఈ నక్షత్రములో జన్మించిన వారు నైతిక ధర్మము, పెద్దలు, వృద్ధుల పట్ల గౌరవము కలిగి ఉంటారు. విద్యలలో రాణించడానికి కొంత సమయము కావాలి. ఆరంభములో కొన్ని సమస్యలను ఎదుర్కొన్న తరువాత కాలములో నిరాటంకముగా విద్యలను అభ్యసిస్తారు.

ఉద్యోగ జీవితములో మొదట ఒడిదుడుకులను ఎదుర్కొన్నా తరువాత నిలదొక్కుకుని ముందుకు విజయవంతముగా సాగిపోతారు. ప్రేమ వివాహాలు చేసుకుంటారు. గుర్తింపు పత్రాలు లేకున్నా కొన్ని విద్యలలో పురోగతి సాధిస్తారు.

విద్యలపట్ల ఆసక్తి కలిగి ఉంటారు. ఉన్నత విద్యలు అభ్యసించి ఉన్నత పదవులు అధిరోహిస్తారు. కుటుంబ శ్రేయస్సు కొరకు కొన్ని పదవులు చేపడతారు. తల్లి మీద విశేషమైన అనురాగము ఉంటుంది. వీరు సలహాలు చెప్పి, మార్గాలు చూపి అనేక మంది పురోగతికి తోడ్పడతారు. సంతానము వలన ఖ్యాతి లభిస్తుంది.

అనురాధ నక్షత్ర జాతకులకు దేవుడిపై లోతైన విశ్వాసం ఉంటుంది. ఈ కారణం వల్లనే ఎటువంటి క్లిష్టమైన పరిస్థితుల్లోనూ నిరుత్సాహపడరు. జీవితంలో అడ్డంకులు రావొచ్చు, అయితే, వీరు బాగా కష్టపడి పనిచేస్తారు కనుక, అవి జీవిత పథాన్ని కదిలించకపోవచ్చు. చాలా చిన్న వయస్సులోనే వీరు డబ్బును సంపాదించడం ప్రారంభిస్తారు. వీరి స్వభావం చాలా సమస్యలమయంగా ఉంటుంది.

మానసిక శాంతి కొరకు, వీరు నిరంతరం శ్రమించాలి. వీరు ముక్కుసూటిగా వ్యవహరిస్తారు కనుక, మదిలోకి ఏది వస్తే దానిని చెబుతారు. ప్రతిదీ వీరు మనస్సులో ఉంచుకునే స్వభావం కాదు. అందువల్లనే కొన్నిసార్లు ప్రజల మాటలతో బాధించబడతారు. ఎప్పుడైనా వీరు ప్రజలకు సహాయపడటానికి ప్రయత్నిస్తే, వారు హృదయపూర్వకంగా చేస్తారు.

లక్ష్యం పట్ల వీరు చాలా సీరియస్ గా ఉంటారు, అనేక అడ్డంకుల తరువాత దానిని విజయవంతంగా చేరుకోగలుగుతారు. అవకాశం వచ్చినప్పుడల్లా, దానిని పూర్తిగా ఉపయోగించుకోవడానికి ప్రయత్నిస్తారు.

పని చేయడం కంటే వ్యాపారం చేయడానికి వీరు ఎక్కువ ఆసక్తి కనపరుస్తారు. బాల్యం నుంచే వీరికి వ్యాపార లక్షణాలుంటాయి. అందువల్ల, దీనిలో వీరు నిజంగా విజయం సాధిస్తారు. ఒకవేళ వీరు ఉద్యోగం చేయడం ప్రారంభించినట్లయితే, వీరిపై ఉన్నవారిని అందరినీ కూడా వీరికి అనుకూలంగా మలచుకోగలుగుతారు. వీరు జీవితంలో ఎంతో క్రమశిక్షణతో ఉంటారు మరియు జీవితంలో విలువలకు చాలా ప్రాధాన్యత ఇస్తారు.

పనిలో పూర్తి క్రమశిక్షణను కలిగి ఉండటానికి వీరు ప్రయత్నిస్తారు. వీరి యొక్క జీవిత పోరాటాల ద్వారా వీరు చక్కటి జీవిత పాఠాలను నేర్చుకుంటారు. వీరి యొక్క వ్యక్తిత్వ లక్షణాల గురించి తెలిసినవారు, వీరు చాలా అనుభవం కలిగినవారు కనుక వీరి నుంచి సలహాలను తీసుకోవడానికి ఇష్టపడతారు.

ఎలాంటి క్లిష్టమైన పరిస్థితినైనా తొలగించే అద్భుతమైన నైపుణ్యం వీరికి ఉంటుంది. ఒకవేళ సంపద విషయానికి వస్తే, ఆస్తులపై పెట్టుబడి పెట్టడం లేదా పొదుపు చేయడంపై వీరికి ఆసక్తి ఉంటుంది కనుక తగినంత సంపద ఉంటుంది. పెట్టుబడులు పెట్టే స్వభావం వల్ల, వీరు బాగా ధనవంతులుగా ఉంటారు.

అనురాధ నక్షత్రం మొదటి పాదము
అనురాధ నక్షత్ర అధిపతి శని. ఇది దేవగణ నక్షత్రం కావడం వల్ల వీరు సాత్విక గుణం, ధర్మపక్షపాతం కలిగి ఉంటారు. ఈ నక్షత్ర జాతకులకు స్వభావ రీత్య బద్ధకం ఉన్నా చేయాలనుకున్న పనిని శ్రమకు ఓర్చి పని చేస్తారు. అన్యాయాన్ని సహించలేరు. మంచివే అయిన తమ అభిప్రాయాలను సూటిగా తెలియజేస్తారు. వీరికి ఆత్మవిశ్వాసం ఎక్కువ.

ఈ నక్షత్ర జాతకులకు తొలి 17 సంవత్సరాల జీవితం సాధారణంగానే జరుగుతుంది. విద్యలో కాస్త మందకొడితనం ఉంటుంది. తరువాత వచ్చే 17 సంవత్సరాల బుధదశ కారణంగా కళాశాల చదువులలో అభివృద్ధి ఉంటుంది. జీవితంలో త్వరగా స్థిరపడతారు. వివాహం సకాలంలో జరుగుతుంది.

34 సంవత్సరాల అనంతరం వచ్చే 7 సంవత్సరాల కేతు దశ కారణంగా జీవితంలో కొన్ని సమస్యలు ఎదురవుతాయి. కేతు దశ అనుకూలిస్తే విదేశీ ఉద్యోగాలు అనుకూలిస్తాయి. 41 సంవత్సరాల కాలంలో వచ్చే శుక్ర దశ కారణంగా జీవితంలో అభివృద్ధి ఉంటుంది. జీవితం సౌఖ్యంగా జరుగుతుంది. మిగిలిన జీవితం సాఫీగా జరుగుతుంది.

అనురాధ నక్షత్రం రెండవ పాదము
అనురాధ నక్షత్ర రెండవ పాద జాతకులు సాత్విక గుణం, ధర్మ పక్షపాతం కలిగి ఉంటారు. వీరు చేయాలనుకున్న పనిని శ్రమకు ఓర్చి పనిచేస్తారు. అన్యాయాన్ని ప్రతిఘటిస్తారు. వీరికి మేధో సంబంధమైన వృత్తి ఉద్యోగాలు అనుకూలిస్తాయి. వీరికి బుధ దశ అనుకూలించడం వల్ల విద్యలో ఉన్నతిని సాధించగలరు.

13 సంవత్సరాల కాలం జీవితం సాధారణంగానే జరుగుతుంది. విద్యలో మందకొడితనం ఉంటుంది. తరువాత వచ్చే 17 సంవత్సరాల బుధ దశ కారణంగా మాధ్యమిక తరగతి నుంచి చదువులలో మంచి అభివృద్ధి ఉంటుంది. జీవితంలో తొందరగానే స్థిరపడతారు. వివాహం సకాలంలో జరుగుతుంది.

30 సంవత్సరాల అనంతరం వచ్చే 7 సంవత్సరాల కేతుదశ కారణంగా జీవితంలో కొన్ని సమస్యలు ఎదురవుతాయి. కేతుదశ అనుకూలిస్తే విదేశీ ఉద్యోగాలు అనుకూలిస్తాయి. 37 సంవత్సరాల అనంతరం వచ్చే శుక్ర దశ కారణంగా జీవితంలో అభివృద్ధి ఉంటుంది. ఆ తర్వాత జీవితం సౌఖ్యంగా, సాఫీగా కొనసాగుతుంది.

అనురాధ నక్షత్రం మూడవ పాదము
అనురాధ నక్షత్ర మూడవ పాద జాతకులు ప్రజాకర్షణ కలిగి ఉంటారు. తమ అభిప్రాయాలను సూటిగా, ఆకర్షణీయంగా చెప్పగలరు. కనుక సాత్విక గుణం, ధర్మ పక్షపాతం కలిగి ఉంటారు. వీరు చేయాలనుకున్న పనిని శ్రమించి పూర్తి చేస్తారు. సమాజంలో జరిగే అన్యాయాన్ని సహించలేరు. కళాత్మకమైన వస్తువులను సేకరించడానికి ఆసక్తి కలిగి ఉంటారు. పరిశుభ్రమైన వాతావరణంలో ఉండడానికి ఆసక్తి కలిగి ఉంటారు.

వీరికి బుధ దశ బాగా అనుకులించడం వల్ల విద్యావంతులై ఉన్నత స్థితికి చేరుకుంటారు. 8 సంవత్సరాల వరకు మందకొడిగా సాగే విద్యాభ్యాసం తరువాత వచ్చే 17 సంవత్సరాల బుధ దశ కాలంలో బాగా రాణిస్తుంది. కనుక వీరు ఉన్నత ఉద్యోగాలలో స్థిరపడతారు.

25 సంవత్సరాల తరువాత వచ్చే 7 సంవత్సరాల కేతు దశ కారణంగా కొన్ని సమస్యలను ఎదుర్కొంటారు. కేతుదశ అనుకూలిస్తే విదేశీ ఉద్యోగ అవకాశాలు అనుకూలిస్తాయి. 32 సంవత్సరాల తరువాత వచ్చే 20 సంవత్సరాల శుక్ర దశ కారణంగా జీవితంలో చక్కని అభివృద్ధి ఉంటుంది.

ఈ నక్షత్ర జాతకులకు ఇనుము, వెండి, ముత్యం సంబంధిత ఉద్యోగ వ్యాపారాలు అనుకూలం. పరిశ్రమలు, కర్మాగారం, విమానాశ్రయాలు.. వంటి వాటిలో పనిచేసే అవకాశాలు ఉంటాయి.

అనురాధ నక్షత్రం నాలుగో పాదము
అనురాధ నక్షత్ర నాల్గవ పాద జాతకులు ఆరంభములో కొన్ని సమస్యలను ఎదుర్కొన్నా తరువాత కాలంలో నిరాటంకముగా విద్యలను అభ్యసిస్తారు. ఉద్యోగ జీవితములో మొదట ఒడిదుడుకులను ఎదుర్కొన్నా తరువాత నిలదొక్కుకుని ముందుకు విజయవంతంగా సాగిపోతారు.

4 సంవత్సరాల తరువాత వచ్చే 17 సంవత్సరాల బుధ దశ కాలం బాగా రాణిస్తుంది. 21 సంవత్సరాల తరువాత వచ్చే 7 సంవత్సరాల కేతుదశ కారణంగా ఉన్నత విద్యాభ్యాసంలో కొన్ని సమస్యలను ఎదుర్కొంటారు. ప్రయత్న పూర్వకంగా విద్యలో విజయం సాధించవలసిన అవసరం ఉంది.

కేతు దశ అనుకూలిస్తే విదేశీ విద్య, ఉద్యోగ అవకాశాలు అనుకూలిస్తాయి. 28 సంవత్సరాల తరువాత వచ్చే 20 సంవత్సరాల శుక్ర దశ కారణంగా జీవితంలో చక్కని అభివృద్ధి ఉంటుంది. 71 సంవత్సరాల వరకు జీవితం సాఫీగా సాగిపోతుంది.

అనురాధ నక్షత్ర జాతకులు పెంచవల్సిన వృక్షము
అనురాధ నక్షత్రం వారు పొగడ చెట్టుని పెంచడం, పూజించడం మంచిది. పది మందిలో ఒకరిగా గుర్తింపు తెచ్చుకోవడానికి, పరోపకారం చేయడానికి, విద్యలో ఎటువంటి ఆటంకాలు ఎదురైనా, పట్టుదలతో వాటిని అధిగమించి ముందుకు సాగడానికి, ఆలోచనా శక్తి అభివృద్ధి చెందడానికి ఉపయోగపడుతుంది.

అనురాధ నక్షత్ర అధిపతి శని భగవానుడు కావున, ఈశ్వర ఆరాధన మంచిది. శని సేవక వృత్తిని సూచిస్తాడు. కావున సేవ చేసిన వారిని కాపాడతాడు.

అనురాధ నక్షత్ర జాతకుల తారా ఫలాలు
తార నామం - తారలు - ఫలం

జన్మ తార - పుష్యమి, అనురాధ, ఉత్తరాభాద్ర - శరీరశ్రమ

సంపత్తార - ఆశ్లేష, జ్యేష్ట, రేవతి - ధన లాభం

విపత్తార - అశ్విని, మఖ, మూల - కార్యహాని

సంపత్తార - భరణి, పూర్వ ఫల్గుణి, పూర్వాషాఢ - క్షేమం

ప్రత్యక్ తార - కృత్తిక, ఉత్తర ఫల్గుణి, ఉత్తరాషాఢ - ప్రయత్న భంగం

సాధన తార - రోహిణి, హస్త, శ్రవణం - కార్య సిద్ధి, శుభం

నైత్య తార - మృగశిర, చిత్త, ధనిష్ట - బంధనం

మిత్ర తార - ఆరుద్ర, స్వాతి, శతభిష - సుఖం

అతిమిత్ర తార - పునర్వసు, విశాఖ, పూర్వాభాద్ర - సుఖం, లాభం

నక్షత్ర శాంతి: బియ్యం, కొబ్బరి, ఖర్జూరం, బెల్లం ఇవన్ని మిశ్రమం తయారు చేసి దానంగా ఇవ్వాలి.

నక్షత్ర మంత్రం:
।। ఓం ।।
ఋద్ధ్యాస్మ' హవ్యైర్నమ'సోపసద్య' ।
మిత్రం దేవం మి’త్రధేయం' నో అస్తు ।
అనూరాధాన్, హవిషా' వర్ధయంతః ।
శతం జీ'వేమ శరదః సవీ'రాః ।
చిత్రం నక్షత్రముద'గాత్పురస్తా”త్ ।
అనూరాధా స ఇతి యద్వదంతి ।
తన్మిత్ర ఏ'తి పథిభిర్దేవయానై: ।
హిరణ్యయైర్విత తైరంతరిక్షే ||

నక్షత్ర గాయత్రి
ఓం మిత్రదేయాయై విద్మహే 
మహామిత్రాయ ధీమహి 
తన్నో అనూరాధా ప్రచోదయాత్

దర్శించవలసిన ఆలయములు
మొదటి పాదం – పనికేరులో వేంచేసి ఉన్న శ్రీ బాలాత్రిపురసుందరీ సమేత శ్రీ ఇష్టకాంతేశ్వర స్వామి.
రెండవ పాదం – చింతలూరులో వేంచేసి ఉన్న శ్రీ పార్వతీ సమేత శ్రీ పృధ్వీశ్వర స్వామి.
మూడవ పాదం – పినపల్లలో వేంచేసి ఉన్న శ్రీ పార్వతీ సమేత శ్రీనీలకంఠేశ్వర స్వామి.
నాలుగవ పాదం – పెదపల్లలో వేంచేసి ఉన్న శ్రీ పార్వతీ సమేత శ్రీరామలింగేశ్వర స్వామి.

Sunday, June 28, 2026

Vata Savitri Purnima - Vat Purnima - వట సావిత్రి పూర్ణిమ - వట్ పూర్ణిమ

వట సావిత్రి పూర్ణిమ (లేదా వట్ పూర్ణిమ) అనేది ఉత్తర భారతదేశంలో మరియు పశ్చిమ భారతదేశంలోని మహారాష్ట్ర, గోవా, గుజరాత్ రాష్ట్రాలలో వివాహిత స్త్రీలు జరుపుకునే సాంప్రదాయ పండుగ. ఈ పండుగ జ్యేష్ఠ మాసంలోని వచ్చే ఈ పౌర్ణమి రోజున వివాహిత స్త్రీ తన భర్తపై ఉన్న ప్రేమకు గుర్తుగా ఒక మర్రి చెట్టుకు సంప్రదాయబద్ధంగా ఒక దారాన్ని కడుతుంది. ఈ వేడుక మహాభారత ఇతిహాసంలో వివరించబడిన సావిత్రి మరియు సత్యవంతుడు కథ.

వివాహిత మహిళలు తమ భర్త దీర్ఘాయుష్షు, ఆరోగ్యం మరియు సౌభాగ్యం కోసం జరుపుకునే అత్యంత పవిత్రమైన పండుగ. 

ఈ పండుగకు సంబంధించిన ముఖ్యమైన విశేషాలు:
పురాణ ప్రాముఖ్యత: మహాభారత కాలంలో తన భర్త సత్యవంతుడి ప్రాణాలను యముడి నుంచి కాపాడిన సావిత్రి దేవి కథ.

పురాణాల ప్రకారం మహాభారత కాలంలో సంతానం లేని అశ్వపతి రాజు, అతని భార్య మాలవి ఒక కుమారుడు కావాలని కోరుకుంటారు. చివరికి, సావిత్రి దేవి ప్రత్యక్షమై, వారికి త్వరలో ఒక కుమార్తె జన్మిస్తుందని చెబుతుంది. బిడ్డ పుట్టబోతోందన్న వార్తతో రాజు ఆనందంతో ఉప్పొంగిపోతాడు. ఆమె జన్మించగా, ఆ దేవి గౌరవార్థం ఆమెకు సవిత్రి అని పేరు పెట్టారు.

శుక్లపక్ష చంద్రరేఖలాగా దినదిన ప్రవర్ధమానయై యౌవనవతి అయ్యింది. ద్యుమత్సేనాపతి కుమారుడు సత్యవంతుడికిచ్చి వివాహం జరిపించారు. దంపతులు అన్యోన్యప్రేమతో ఆనందిస్తున్నారు. ఎడాది గడిచింది.

ఆమె సౌందర్యవతి, గుణవంతురాలు సౌర్యవంతురాలు మరియు ధైర్యవంతురాలు. తన సౌర్యంతో గ్రామంలోని పురుషులందరినీ భయపెడుతుంది, అందుకే ఏ పురుషుడు ఆమెను వివాహం చేసుకోవడానికి ముందుకు రాడు. ఆమె తండ్రి ఆమెను సొంతంగా పెళ్లి చేసుకోమని చెబుతాడు. ఈ ఉద్దేశ్యంతో ఆమె తీర్థయాత్రకు బయలుదేరి, అరణ్యవాసిగా ప్రవాసంలో జీవిస్తున్న ద్యుమత్సేనుడు అనే అంధ రాజు కుమారుడైన సత్యవంతుడిని కనుగొంటుంది. సావిత్రి తిరిగి వచ్చేసరికి, ఆమె తండ్రి నారద మహర్షితో మాట్లాడుతుండటం చూస్తుంది. నారద మహర్షి ఆమె తప్పుడు నిర్ణయం తీసుకుందని చెబుతాడు: సత్యవంతుడు అన్ని విధాలా పరిపూర్ణుడైనప్పటికీ, ఆ రోజు నుండి ఒక సంవత్సరంలో అతను మరణించడం ఖాయం అని తెలియజేస్తాడు. కానీ, సావిత్రి పట్టుబట్టి సత్యవంతుడిని వివాహం చేసుకుంటుంది.

సత్యవంతుడి మరణం సంభవిస్తుందని ముందుగా చెప్పబడిన మూడు రోజుల ముందు, సావిత్రి ఉపవాసం మరియు జాగరణ వ్రతం తీసుకుంటుంది. ఆమె మామగారు ఆమె చాలా కఠినమైన నియమాన్ని వరిస్తారు, కానీ ఆమె ఆ నియమాన్ని పాటిస్తానని ప్రమాణం చేశానని బదులిస్తుంది తరువాత ద్యుమత్సేనుడు ఆమెకు మద్దతు ఇస్తాడు.

సత్యవంతుడి మరణం సంభవిస్తుందని చెప్పబడిన రోజు ఉదయం, అతను కట్టెలు చీలుస్తూ ఉండగా అకస్మాత్తుగా బలహీనపడి, సావిత్రి ఒడిలో తల పెట్టి మరణిస్తాడు. సావిత్రి అతని శరీరాన్ని ఒక వట (మర్రి) చెట్టు నీడలో ఉంచుతుంది. మృత్యుదేవత యముడు, సత్యవంతుడి ఆత్మను తీసుకోవడానికి వస్తాడు. యముడు సత్యవంతుడి ఆత్మను తీసుకువెళుతుండగా, భర్తను అనుసరించడం భార్యగా తన కర్తవ్యం అని చెబుతూ సావిత్రి అతనిని అనుసరిస్తుంది. ఇది విన్న యముడు, సత్యవంతుడి ప్రాణం తప్ప, కొన్ని వరాలు తీరుస్తాడు.

ఆమె మొదట తన మామగారికి కంటిచూపు మరియు రాజ్య పునరుద్ధరణను, తరువాత తన తండ్రికి వంద మంది పిల్లలను, ఆపై తనకు మరియు 
సత్యవంతుడికి వంద మంది పిల్లలను కోరుకుంటుంది. చివరి కోరిక యముడికి ఒక సందిగ్ధాన్ని సృష్టిస్తుంది, ఎందుకంటే అది పరోక్షంగా సత్యవంతుడి ప్రాణాన్ని ప్రసాదిస్తుంది. అయితే, సావిత్రి యొక్క తెలివికి మరియు పాతివ్రత్య దీక్షకు ముగ్ధుడై, యముడు సత్యవంతుడికి  ప్రాణదానం చేసి, సావిత్రి జీవితాన్ని శాశ్వత సుఖంతో ఆశీర్వదిస్తాడు.

సత్యవంతుడు గాఢ నిద్రలో ఉన్నట్లుగా మేల్కొని తన భార్యతో కలిసి తల్లిదండ్రుల వద్దకు తిరిగి వస్తాడు. ఇంతలో, వారి ఇంట్లో, సావిత్రి మరియు సత్యవంతుడు తిరిగి రాకముందే ద్యుమత్సేనుడు తన కంటి చూపును తిరిగి పొందుతాడు. ఏమి జరిగిందో 
సత్యవంతుడుకి  ఇంకా తెలియదు కాబట్టి, సావిత్రి ఆ కథను తన అత్తమామలకు, భర్తకు మరియు అక్కడ సమావేశమైన సన్యాసులకు తెలియజేస్తుంది. వారు ఆమెను ప్రశంసిస్తుండగా, ద్యుమత్సేనుడి మంత్రులు అతని సింహాసనాన్ని ఆక్రమించిన వ్యక్తి మరణ వార్తతో వస్తారు. ఆనందంగా, రాజు మరియు అతని పరివారం అతని రాజ్యానికి తిరిగి వెళ్తారు.

కథలో ఆ చెట్టుకు ముఖ్యమైన పాత్ర లేనప్పటికీ, పురాణంలోని ప్రేమ జ్ఞాపకార్థం దానిని పూజిస్తారు.

ఇది ఉత్తర మరియు పశ్చిమ భారత రాష్ట్రాలైన ఉత్తరాఖండ్ , మహారాష్ట్ర , గోవా మరియు గుజరాత్‌లలో కఠినంగా జరుపుకునే పండుగ . ఈ పండుగను సాధారణంగా జ్యేష్ఠ మాసంలో మూడు రోజుల పాటు జరుపుకుంటారు. మహిళలు ఉపవాసం ఉండి, మర్రి చెట్టుకు దారాలు కట్టి, తమ భర్తల క్షేమం కోసం ప్రార్థిస్తారు.

పూజా విధానం: ఈ రోజున మహిళలు ఉపవాసం ఉండి, త్రిమూర్తుల స్వరూపంగా భావించే మర్రిచెట్టుకు (వటవృక్షం) పూజలు చేస్తారు. చెట్టుకు నూలు దారం చుడుతూ ప్రదక్షిణలు చేస్తారు. 

వట పౌర్ణమి సందర్భంగా, సావిత్రి చేసినట్లుగా భార్యలు తమ భర్తల కోసం మూడు రోజుల పాటు ఉపవాసం ఉంటారు. ఈ మూడు రోజులలో, ఇంట్లో నేలపైన లేదా గోడపైన చందనం మరియు బియ్యం ముద్దతో వట (మర్రి) చెట్టు, సావిత్రి, సత్యవంతుడు  మరియు యముడి చిత్రాలను గీస్తారు. దంపతుల బంగారు చిత్రాలను ఇసుక ఉన్న పళ్ళెంలో ఉంచి , మంత్రాలు జపిస్తూ , వట ఆకులతో పూజిస్తారు. బయట, మర్రి చెట్టును పూజిస్తారు. చెట్టు కాండానికి దారం చుట్టి, రాగి నాణేలను సమర్పిస్తారు. ఉపవాసాన్ని మరియు సంప్రదాయాన్ని కఠినంగా పాటించడం వల్ల భర్తకు దీర్ఘాయుష్షు, సుఖసంతోషాలతో కూడిన జీవితం లభిస్తుందని నమ్ముతారు. వారి భర్త రాబోయే ఏడు జన్మల వరకు బాగా జీవిస్తాడని నమ్ముతారు.

ప్రస్తుత కాలంలో, ఈ పండుగను ఈ క్రింది విధంగా జరుపుకుంటారు. మహిళలు మంచి చీరలు , ఆభరణాలు ధరించి, ఐదు రకాల పండ్లు, ఒక కొబ్బరికాయను నైవేద్యంగా సమర్పించడంతో వారి రోజును ప్రారంభిస్తారు . ప్రతి స్త్రీ తమ భర్తల జ్ఞాపకార్థం మర్రిచెట్టు చుట్టూ ఏడుసార్లు తెల్లటి దారాన్ని చుడుతుంది. వారు రోజంతా ఉపవాసం ఉంటారు.

స్కంద పురాణంలో వాట పూర్ణిమ వ్రతం యొక్క విధానం వివరించబడింది.


Eruvaka Pournami-Eruvaka Punnami - Jyeshtha Purnima - ఏరువాక పౌర్ణమి-ఏరువాక పున్నమి - జ్యేష్ఠ పూర్ణిమ

ఏరువాక పున్నమి

ఎరువక పౌర్ణమి (ఎరువక పున్నమి లేదా జ్యేష్ఠ పౌర్ణమి అని కూడా పిలుస్తారు) అనేది జ్యేష్ఠ మాసంలో వచ్చే పౌర్ణమి రోజున ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాలలో రైతులు జరుపుకునే ఒక ప్రధాన వ్యవసాయ పండుగ. ఇది రుతుపవనాల ఆరంభాన్ని మరియు పంట విత్తే కాలం యొక్క శుభారంభాన్ని సూచిస్తుంది.

వ్యవసాయ పనులు ప్రారంభించడానికి ముందు భూమి పూజ చేయడం వేదకాలం నుంచి వస్తోన్న ఆచారం. ఇందుకోసం పెట్టిన ముహూర్తమే ఏరువాక పౌర్ణమి. జ్యేష్ఠ పౌర్ణమి రోజే ఏరువాక పౌర్ణమి జరుపుకుంటారు.

వ్యవసాయాన్ని ఓ యజ్ఞంగా భావిస్తారు. వ్యవసాయ పనులు ప్రారంభానికి ముందు భూమి పూజ చేసి దుక్కి దున్నడాన్ని ఏరువాక అంటారు. ఈ వేడుకను జ్యేష్ఠ పౌర్ణమిరోజే ఎందుకు జరుపుకుంటారంటే. ఏరువాక అనే మాట అందరికీ తెలిసినదే! కానీ ‘ఏరువాక’ అనే పదానికి అర్ధం చాలామందికి తెలియదు. ఏరు అంటే ఎద్దులను పూన్చి దుక్కి దున్నడానికి సిద్దపరచిన నాగలి. దుక్కిదున్నే పనిని శాస్త్రోక్తంగా ప్రారంభించడాన్ని ‘ఏరువాక’ అని పేరు అంటే వ్యవసాయ పనుల ప్రారంభించడం అని అర్థం.

సస్యానికి అధిపతి చంద్రుడు ఇంకా చెప్పాలంటే నాగలి సారించి పనులు ప్రారంభించడానికి మంచి నక్షత్రం జ్యేష్ఠ అని జ్యోతిష్యశాస్త్రం చెబుతోంది. ఆ నక్షత్రంతో చంద్రుడు పూర్తిగా ఉండే రోజు జ్యేష్ఠ పూర్ణిమ. ఓషధులకి, సస్యానికి అధిపతి అయిన చంద్రుడు జ్యేష్ఠా నక్షత్రానికి చేరువలో ఉన్న తరుణంలో ఏరువాక పూర్ణిమ శుభ ఫలితాలను అందిస్తాడు. అందుకే జ్యేష్ఠ పూర్ణిమనాడు మొదటిసారి పొలాన్ని దున్నడం ప్రారంభిస్తారు.

భారతీయ సంస్కృతికి, జీవన విధానానికి వ్యవసాయం మూలస్తంభం లాంటిది. దానికి తొలి పనిముట్టు నాగలి, ముఖ్య వనరు వర్షం. ఆ వర్షం కురిసే కాలం మొదలయ్యేప్పుడు రైతులు కృతజ్ఞతతో జరిపే పండుగ 'కృషిపూర్ణిమ' దీనికే హలపూర్ణిమ, ఏరువాక పున్నమి అనే పేర్లతో పిలవబడుతుంది. 'ఏరు' అంటే నాగలి అని, 'ఏరువాక' అంటే దుక్కి ప్రారంభం అనీ అర్థాలున్నాయి.

వ్యవసాయానికి కావలసిన వర్షాన్ని కురిపిస్తాడని భావించే ఇంద్రుణ్ని పూజించడం, నాగలిని పూజించి వ్యవసాయ పనులు మొదలుపెట్టడం జ్యేష్ఠ పూర్ణిమ పర్వదిన ముఖ్యాంశాలు.

రైతులు పండుగ
రైతులు ఈ పండుగ జరపడానికిగల కారణాన్ని పరిశీలిస్తే - నాగలి సారించి పనులు ప్రారంభించడానికి మంచి నక్షత్రం జ్యేష్ఠ అని జ్యోతిష్యశాస్త్రం చెబుతోంది. ఆ నక్షత్రంతో చంద్రుడు కూడి ఉండే రోజు జ్యేష్ఠ పూర్ణిమ. చంద్రుడు ఓషధులకు అధిపతి. ఓషధులు ( మంచు, ఎరువు, సూక్ష్మధాతువులు ) పుష్కలంగా ఉంటేనే వ్యవసాయం అధిక ఫలసాయాన్నిస్తుంది. పై కారణాలన్నింటివల్ల జ్యేష్ఠ పూర్ణిమ నాడు ఈ పర్వదినాన్ని జరుపుతారు.

పంటపొలం దైవక్షేత్రం!
పంచభూతాత్మకమైన ప్రకృతిని దైవంగా ఆరాధించడం భారతీయుల సంప్రదాయం. భూమిని భూమాతగా కొలుస్తారు, వ్యవసాయం మానవ మనుగడకు జీవనాధారం. అందుకే దీన్న యజ్ఞంలా పవిత్రంగా భావించి చేస్తారు. అందుకే పొలం గట్లపై చెప్పులేసుకుని నడుస్తారు కానీ పొలాలు లోపలకు దిగేటప్పుడు మాత్రం చెప్పులు వేసుకోరు. ఏందుకంటే ఆ క్షేత్రం దైవసమానంగా భావిస్తారు. అందుకే వ్యవసాయ పనులు ప్రారంభించేందుకు ముందు భూమి పూజ చేయడం అనాదిగా వస్తున్న ఆచారం. జ్యేష్ఠ పూర్ణిమరోజు రైతులు ఎడ్లను కడిగి కొమ్ములకు రంగులు పూసి గజ్జెలు, గంటలతో అలంకరించి పూజిస్తారు. వాటికి భక్ష్యాలు సమర్పించి మేళతాళాలతో ఊరేగిస్తారు.

ఏరువాకకి వున్న వివిధ పేరులు:
ఏరువాక పూర్ణిమను సీతాయజ్ఞం అని సంస్కృతంలో అంటారు, కన్నడంలో కారణి పబ్సం అని జరుపుకుంటారు. అధర్వణవేదం ఏరువాకను 'అనడుత్సవం'గా చెప్పింది. క్షేత్రపాలకుని మంత్రాలతో స్తుతించి నాగలితో భూమిని దున్ని విత్తనాన్ని చల్లడం ఆచరణలో ఉంది. ఆ తర్వాతి కాలంలో పరాశరుడు, బోధాయనుడు లాంటి మహర్షులు తమ గుహ్య సూత్రాల్లో ఈ పండుగను ప్రస్తావించారు. విష్ణుపురాణం ఏరువాకను సీతాయజ్ఞంగా వివరించింది. సీత అంటే నాగలి అని అర్థం.

'వప్ప మంగళ దివసం'
'బీజవాపన మంగళ దివసం'
'వాహణ పుణ్ణాహ మంగళమ్'
'కర్షణ పుణ్యాహ మంగళమ్

అనే పేర్లతో ఈ పండుగను వైభవంగా జరుపుకుంటారు.

కొన్ని ప్రాంతాలలో ఊరు బయట, గోగునారతో చేసిన తోరాలు కడతారు. రైతులంతా అక్కడికి చేరి చెర్నాకోలతో ఆ తోరాలను కొట్టి ఎవరికి దొరికిన నారను వారు తీసుకొచ్చి ఎద్దుల మెడలో కడతారు. ఇలా చేయడం వల్ల వ్యవసాయం, పశు సంపద వృద్ది చెందుతుందని నమ్ముతారు.

పండుగ యొక్క ముఖ్య అంశాలుపశువులు మరియు పనిముట్ల పూజ: రైతులు తమ జీవనోపాధిని నిలబెట్టే ఎద్దులను, ఆవులను మరియు వ్యవసాయ పనిముట్లను గౌరవిస్తారు. ఆ జంతువులకు స్నానం చేయించి, వాటి కొమ్ములకు రంగులు వేస్తారు లేదా అలంకరిస్తారు, మరియు వాటికి పోలెలు (ఒక తీపి వంటకం) లేదా జొన్నలవంటి ప్రత్యేక ఆహారాలను నైవేద్యంగా సమర్పిస్తారు . 

సంకేతాత్మక దుక్కి: "ఎరువక" అంటే ఆ కాలంలో చేసే మొదటి దుక్కి దున్నడం. ఈ రోజున రైతులు తమ అలంకరించిన ఎద్దులను పొలాలకు తీసుకువెళ్లి, వ్యవసాయ కార్యకలాపాలను ప్రారంభించడానికి లాంఛనప్రాయంగా మొదటి చాలును దున్నుతారు.

సామూహిక వేడుకలు: ఇది ఎద్దుల బండి ఊరేగింపులు, సాంప్రదాయ జానపద గీతాలు మరియు సామూహిక సమావేశాలతో కూడిన ఒక ఉత్సాహభరితమైన సాంస్కృతిక కార్యక్రమం. కొన్ని ప్రాంతాలలో, సాంప్రదాయ ఎద్దుల పందాలు లేదా "బండలగూడు" (బరువు లాగే) పోటీలు నిర్వహిస్తారు.సాంస్కృతిక, చారిత్రక మూలాలు: ఈ పండుగ తెలుగు వారసత్వంలో గాఢంగా పాతుకుపోయింది. ఋగ్వేదంలో ( అనాదోత్సవంఅని ) మరియు విష్ణు పురాణంలో ( సీతా యజ్ఞంఅని , ఇక్కడ 'సీత' అంటే నాగలి అని అర్థం) వంటి ప్రాచీన గ్రంథాలలో దీని ప్రస్తావన ఉంది.

Friday, June 26, 2026

Somnath Jyotirlinga, Veraval, Saurashtra, Gujarat - సోమనాథ్ జ్యోతిర్లింగం, వెరావల్‌, సౌరాష్ట్రా, గుజరాత్

సోమనాథ్ జ్యోతిర్లింగం, వెరావల్‌, సౌరాష్ట్రా, గుజరాత్

ద్వాదశ జ్యోతిర్లింగ స్తోత్రం: 

ధ్యాన శ్లోకము:
సౌరాష్ట్రే సోమనాధంచ శ్రీశైలే మల్లికార్జునమ్ ।
ఉజ్జయిన్యాం మహాకాలం ఓంకారేత్వమామలేశ్వరమ్ ॥
పర్ల్యాం వైద్యనాధంచ ఢాకిన్యాం భీమ శంకరమ్ ।
సేతుబంధేతు రామేశం నాగేశం దారుకావనే ॥
వారణాశ్యాంతు విశ్వేశం త్రయంబకం గౌతమీతటే ।
హిమాలయేతు కేదారం ఘృష్ణేశంతు విశాలకే ॥
ఏతాని జ్యోతిర్లింగాని సాయం ప్రాతః పఠేన్నరః ।
సప్త జన్మ కృతం పాపం స్మరణేన వినశ్యతి ॥

ద్వాదశ జ్యోతిర్లింగాలలోని శివనామములలో ఒక పేరు సోమనాథుడు. సోమనాథుడు ఉన్న ఆలయాన్ని సోమనాథ్ దేవాలయం అంటారు. ఈ దేవాలయం గుజరాత్ రాష్ట్రంలోని సౌరాష్ట్రాలోని వెరావల్‌లో ఉన్న సోమనాథ్ లో ఉంది.

ఇది అతి పురాణ ప్రాశస్త్యం కలది. మహాశివుని ద్వాదశ జ్యోతిర్లింగాలలో సోమనాథ్ మొదటిది. దీనిని "ప్రభాస తీర్థం" అని కూడా పిలుస్తారు.

ద్వాదశ జ్యోతిర్లింగాల యాత్రకు బయలుదేరే భక్తులు ఇక్కడి నుంచే తమ యాత్రను ప్రారంభిస్తారు. ఈ క్షేత్రంపై పదహారుసార్లు దాడులు జరిగాయి, అయినా అన్నిసార్లూ పునర్నిర్మాణం జరిగింది. ఈ పుణ్యక్షేత్రం శివభక్తులకు మాత్రమే కాక విష్ణుభక్తులకు సందర్శనీయ క్షేత్రమే. శ్రీకృష్ణ పరమాత్ముడు ఇక్కడే తన అవతరాన్ని చాలించినట్లు ప్రతీతి.

అరేబియా సముద్రతీరాన వెలసిన పుణ్యక్షేత్రం. సముద్రపు అలల తాకిడిని తట్టుకునే విధంగా 25 అడుగుల ఎత్తున్న బండరాళ్ళతో నిర్మించిన మట్టం మీద రూపుదిద్దుకుంది ఈ ఆలయం. ఈ ఆలయ గర్భగుడిలో శివలింగం 4 అడుగుల ఎత్తుండి, ఓం కారంతో అమర్చివుంటుంది. చారిత్రక ఆధారాలద్వారా ఇక్కడ నిర్మించిన మొదటి ఆలయం 1వ శతాబ్దానికి చెందినది. ఇది ఒకనాడు శిథిలమైపోగా తిరిగి సా.శ. 649లో అదే శిథిలాల మీద రెండవ ఆలయ నిర్మాణం జరిగింది. ఆ తరువాత సా. శ. 722లో అరబ్బులు సింధు ప్రాంతంలో బలపడి, భారతదేశం మీద దృష్టి సారించారు. అప్పటి గవర్నరుగా ఉన్న జునాయద్‌ ఆ చుట్టు ప్రక్కల ప్రాంతాలైన మార్వార్‌, బ్రోచ్‌, ఉజ్జయినీ, గుజరాత్‌ మొదలైన వాటిమీద యుద్ధానికి బయలుదేరారు. ఈ విధంగా జరిగిన దాడుల్లో రెండవ సారి నిర్మించిన సోమనాథ దేవాలయం ధ్వంసమయ్యింది.

ఆ తరువాత చాళుక్యుల కాలంలో దీనిని పునర్నిర్మించారు. వారి ఏలుబడిలో ప్రభాస నగరం మంచి ఓడరేవు కేంద్రంగా భాసిల్లడంతో, కనౌజ్‌ పాలకులైన ప్రతీహారుల కాలంలో ఈ క్షేత్రం కాశీతో సమానంగా విలసిల్లింది. ఆ కాలంలో ఇక్కడ వున్న అపార ధనరాసులే దండయాత్రలకి కారణాలని చెప్పవచ్చు.

"ఎప్పుడైతే సుల్తాన్ యామిను డి దౌలా మహ్ముద్ సుబుక్తిజిన్ భారతదేశం మీద మతపరమైన దండయాత్రచేసాడో ఆయన సోమనాధ్‌ను స్వాధీనపరచుకొని ధ్వంసం చేయడానికి గొప్ప ప్రయత్నం చేసాడు. అందువలన హిందువులు ముహమ్మదీయులుగా మారతారని విశ్వసించబడింది. ఫలితంగా వేల మంది హిందువులు బలవంతంగా ఇస్లామ్ మతానికి మార్చబడ్డారు. ఆయన అక్కడికి 416 ఎ హెచ్ (ఎ డి 1025 డిసెంబరు) " రాజు ఈ లింగరూపాన్ని చూసి విస్మయం చెందాడు. తరువాత ఇక్కడి నిధులను మళ్ళించడానికి పడగొట్టడానికి అదేశాలు జారీచేసాడు. అక్కడ గొప్ప ప్రముఖల చేత ఆలయానికి దానంగా ఇవ్వబడిన అనేక స్వర్ణ , రజత విగ్రహాలు, ఆభరణాలతో నిండిన పాత్రలు కనుగొనబడ్డాయి. ఆలయంలో కనుగొనబడిన వస్తువుల విలువ 20 వేల దినార్లకు పైబడి ఉంది "

ఇదే కోవలో మాండలీకుల పాలనలో ఉండగా 6-1-1026న మహమ్మద్‌ ఘజనీ దండెత్తడం జరిగింది. ఈ పోరులో 50 వేలమంది నేలకూలారు. యుద్ధం మొదలైన ఏడు రోజులకి మాండలీకులు ఇక ఘజనీతో నిలబడలేక రాజ్యాన్ని విడిచి పారిపోయారు. ఈ యుద్ధంలో హమీర్‌గోపాల్‌ అనే రాజకుమారుడు శత్రుసేనలతో తలబడి ఎందరినో మట్టికరిపించాడు. ఈ రాజ్యాన్ని రక్షించడంలో తన ప్రాణాలు కోల్పోయాడు. అందుకు చిహ్నంగా ఇక్కడొక వీరశిలని నిర్మించారు. ఈ యుద్ధంలో విజయం సాధించిన ఘజనీ పోమనాథ్‌ ఆలయ గర్భగుడిలో ప్రవేశించి శివలింగాన్ని ముక్కలు చేయడానికి ప్రయత్నించాడు. కానీ ఆ ప్రయత్నం సాధ్యపడక ఆలయ అర్చకుల్ని హింసించి, ఆలయాన్ని ధ్వంసం చేసి పోయాడు. అ సమయంలో పటాన్‌ ప్రభువైన పరమదేవ్‌, ఈ మూకలపై విరుచుకు పడ్డాడు. ఆతని దాటికి తట్టుకోలేక ఘజనీ సేనలు పారిపోయాయి. ఆ తరువాత 12-13 శతాబ్దంలో తిరిగి ఆలయ నిర్మాణం చేసాడు. ఇది నాల్గవ సారి జరిగిన ఆలయ నిర్మాణం. కాలగమనంలో ఇదికూడా శిథిలావస్థకు చేరుకోగా 1114 సంవత్సరంలో కుమారపాలుడు అనే రాజు ఈ ప్రాంతాన్ని తన ఏలుబడిలోకి తీసుకుని, ఈ ఆలయాన్నీ, పట్టణాన్నీ పూర్తిగా పునరుద్ధరించాడు. ఆ కాలంలోనే అర్చకులకి వసతి గృహాలు, దేవాలయానికి బంగారు కలశాలు, ముఖమండపంతో శోభిల్లజేసాడు.

ఇక 1296లో అల్లావుద్దీన్‌ ఖిల్జీ, తన మామని చంపి, రాజ్యవిస్తీర్ణ చేసుకునే నేపథ్యంలో దండయాత్రలు సాగించాడు. దారిపొడవునా ఎంతో బీభత్సాన్ని సృష్టించుకుంటూ సాగాడు. అలా బయలుదేరినవాడు 1299లో సోమనాథ్‌ మీద పడి, ఉలుంఖాన్‌ అనే సేనాని శివలింగాన్ని ముక్కలు ముక్కలుగా బద్దలుకొట్టి, ఆ శకలాల్ని ఖిల్జీకి కానుకగా సమర్పించాడు. ఆ తరువాత 1325-1331 ప్రాంతంలో జునాఘడ్‌ రాజకుమారుడు తిరిగి ఇక్కడ లింగప్రతిష్ఠ చేసాడు. ఆ తరువాతి కాలంలో 1459లో మహమ్మద్‌ బేగ్దా ఇక్కడున్న శివలింగాన్ని తీసివేసి, ఈ మందిరాన్ని మసీదుగా మార్చివేసాడు. ఆ తరువాత అక్భర్‌ పరమతసహనం కలిగివుండటం వల్ల ఇక్కడ ఏ విధమైన గొడవలూ లేకుండా కొంతకాలం ప్రశాంతత నెలకొంది.

తరువాత సా.శ. 1783లో పూనా పేష్వా, నాగపూరుకు చెందిన ''భోన్స్‌లే, ఖోలాపూరుకు చెందిన చత్రపతి భోన్‌స్లే, ఇండోరుకు చెందిన హోల్కార్ రాణి అహల్యాభాయి గ్వాలియరుకు చెందిన శ్రీమంత్ పతిభువా సమష్టి సహకారంతో ఈ ఆలయం పునర్నిర్మించబడింది. కూల్చబడి మసీదుగా కట్టబడిన నిర్మాణానికి సమీపంలోనే నిర్మించబడింది.అయితే లింగప్రతిష్ఠ భూగర్భంలో చేసి శత్రువుల బారిన పడకుండా ఉండే ఏర్పాట్లు గావించింది. నాటినుండి తిరిగి కాల ప్రవాహంలో శిథిలావస్థకు చేరుకున్న ఈ పురాతన క్షేత్రాన్ని స్వాతంత్య్రం వచ్చిన తరువాత డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ గారు 11-5-1951న లింగప్రతిష్ఠ గావించి పునర్నిర్మాణ కార్యక్రమాలు సాగించారు. ఈ దేవాలయానికి ముందు భాగంలో నవనగర్‌ మహారాణి భర్త దిగ్విజయసింగ్‌ జ్ఞాపకార్థం నిర్మించింది. దీనిని 19-5-1970 సంవత్సరంలో శ్రీ సత్యసాయిబాబా ప్రారంభోత్సవం చేశారు. ఇప్పుడు అన్ని వసతులతోటీ, అన్ని దేశాలవారినీ ఆకర్షిస్తూ ఆధ్యాత్మిక భావతరంగాలను వెదజల్లుతోంది.

ఆరు మార్లు ధ్వంసం చేయబడి తిరిగి పునర్మించబడినందు వలన ఈ ఆలయాన్ని అక్షరమైన ఆలయంగా వర్ణిస్తారు. చివరిసారిగా ఈ ఆలయ పునర్నిర్మాణం జరిగింది. 

స్వాతంత్రం అనంతరం ఆలయ పునర్నిర్మాణం
స్వాతంత్ర్యం రాక ముందు జునాగఢ్ రాజ సంస్థానం ప్రభాస్ పటాన్ అధీనంలో ఉంది. సమైక్య భారతదేశంలో జునాగఢ్ విలీనం అయిన తరువాత అప్పటి ఉపప్రధాని అయిన సర్ధార్ వల్లభాయ్ పటేల్ 1947 నవంబరు 12న భారతీయ సైన్యాలను క్రమపరిచే నిమిత్తం ఇక్కడకు వచ్చి అదే సమయంలో ఈ ఆలయ పునర్నిర్మాణానికి ఆదేశాలను జారీ చేసాడు. ఎప్పుడైతే సర్ధార్ పటేలు, కే ఎమ్ మున్షి, ఇతర నాయకులతో గాంధీని దర్శించి ఈ ప్రస్తావన తీసుకు వచ్చినప్పుడు గాంధీ ఆ ప్రస్తావనకు ఆనందంతో అంగీకరించి ఆలయ పునరుద్ధరణకు కావలసిన నిధులను ప్రభుత్వము నుండి మంజూరు చేయకుండా ప్రజల నుండి చందాలను గ్రహించి చేయవలసినదిగా సలహా ఇచ్చాడు. అయినా త్వరలోనే పటేల్, గాంధీ మరణించారు. ఆలయ పునరుద్ధరణ కార్యక్రమాలను కే ఎమ్ మున్షీ నిర్వహణలో జరిగింది. కే ఎమ్ మున్షి అప్పుడు నెహ్రూ ప్రభుత్వంలో ఫుడ్ అండ్ సివిల్ సప్లై మంత్రిగా పనిచేస్తున్నాడు. 1950 అక్టోబరు మాసంలో శిథిలాలు తొలగించబడి ప్రస్తుత మసీదు కొన్ని మైళ్ళ దూరానికి తీసుకు పోబడింది. 1951లో భారతప్రభుత్వ ప్రథమ రాష్ట్రపతి అయిన రాజేంద్రప్రసాదు ఆలయ కుంభాభిషేకానికి కే ఎమ్ మున్షి చేత అహ్వానించబడ్డాడు. ఆయన తన ప్రసంగంలో " నా దృష్టిలో ఈ పునాదుల నుండి అద్భుతమైన ఈ బృహత్తర ఆలయం పునర్నిర్మించబడడమే కాక పురాతన సోమనాధ ఆలయ పునరుద్ధణ వలన భారతీయ శిల్పకళావైభవానికి ఈ ఆలయం ఒక తార్కాణంగా నిలిచింది. అయన సన ప్రసంగం పొడిగిస్తూ " పునర్నిర్మించే శక్తి యొక్క గొప్పతనం పడగొట్టే శక్తికంటే ఘనమైనది అనడానికి సోమనాధ ఆలయ పునర్నిర్మణం ఒక ఉదాహరణ " అని ఉద్ఘాటించాడు. ఈ పూర్తి సంఘటన అప్పటి ప్రధాన మంత్రి అయిన జవహర్లాల్ నెహ్రూ రాష్ట్రపతుల మధ్య పెద్ద అఘాతాన్ని సృష్టించింది. జవహర్లా నెహ్రు దీనిని హిందువుల ప్రతి ఘటనగా భావించగా రాష్ట్రపతి రాజేంద్రప్రసాదు , కె ఎమ్ మున్షీ ఈ ఆలయ పునరుద్ధరణ స్వాతంత్ర ఫలంగా , తమకు జరిగిన అన్యాయానికి హిందువుల ప్రతిస్పందనగా భావించబడినది. రాజేంద్రప్రసాదు , కె ఎమ్ మున్షీల చేత పునరుద్దరించబడి దేశానికి సమర్పించిన ఈ సోమనాధ ఆలయం ఇప్పుడు సోమనాధ ఆలయ ట్రస్ట్ చేత నిర్వహించబడుతుంది.

ఇక్కడి స్తూపాలు, దేవతా మూర్తులు మొదలైన వాటిని ఒక మ్యూజియంలో భద్రపరిచారు. ప్రతి సంవత్సరం మహాశివరాత్రి నాడు చాలా పెద్ద ఉత్సవం జరుగుతుంది.

దేవాలయానికి దగ్గరలో వెరావల్ సముద్రతీరం ఉంది. సమీపంలో భల్కా తీర్థం ఉంది. ఇక్కడే శ్రీకృష్ణుడు వేటగాడి బాణం తగిలి అవతారాన్ని చాలించాడని చెబుతారు. సోమనాథ్ లో త్రివేణీ సంగమంగా ప్రసిద్ధిచెందిన హిరణ్, సరస్వతి, కపిల నదులు సముద్రంలో కలిసే దృశ్యం చాలా మనోహరంగా ఉంటుంది.

స్థలపురాణం:
స్థల పురాణం ప్రకారం సోమనాథ్ దేవాలయాన్ని చంద్రుడు నిర్మించాడని భావిస్తారు. శాపవశాత్తు తేజస్సు కోల్పోయిన చంద్రుడు ఇక్కడి సరస్వతీ నదిలో స్నానమాచరించి, తిరిగి తేజస్సును పొందినట్లు పురాణాలు చెబుతున్నాయి. చంద్రుడిని దక్షుడి శాపం నుండి విముక్తిడిని చేసిన శివుడి ఆలయం కనుక ఇది సోమనాధ ఆలయం. ఇక్కడి శివుడు సోమనాథుడు అయ్యాడు. శివుడు ఈ ఆలయంలో చంద్రుడి తపః ఫలంగా స్వయంగా ప్రత్యక్షమై స్వయంగా వెలిసాడు. 

పురాణ కథనం అనుసరించి ఈ ఆలయాన్ని చంద్రుడు బంగారంతో నిర్మించాడని, ఆ తరువాత రావణుడు వెండితోను, కృష్ణుడు దీనిని కొయ్యతోనూ నిర్మించారని ప్రతీతి. భీముడు రాతితో పునర్నిర్మించారని చెబుతారు. చంద్రుడు దక్షుడి కుమార్తెలు, తన భార్యలు, అయిన 27 నక్షత్రాలలో రోహిణితో మాత్రమే సన్నిహితంగా ఉన్న కారణంగా మిగిలిన వారు తమ తండ్రితో మొరపెట్టుకోగా మామ అయిన దక్షుడు ఆగ్రహించి చంద్రుడిని శపించిన కారణంగా తనకు ప్రాప్తించిన క్షయ వ్యాధి నివారణార్ధం చంద్రుడు శివలింగ ప్రతిష్ఠ చేసి తపస్సు చేసిన ప్రదేశమే ఈ ప్రభాసతీర్ధము. ఇక్కడ శివుడు చంద్రుడికి ప్రత్యక్షమై భార్యలు అందరిని సమానంగా చూసుకొమ్మని చంద్రుడికి సలహా ఇచ్చి శాపాన్ని పాక్షికంగా ఉపసంహరించి చంద్ర ఉపస్థిత లింగంలో తాను శాశ్వతంగా ఉంటానని చంద్రుడికి మాట ఇచ్చాడు.

13వ శతాబ్ధపు అరబ్ భూగోళశాస్త్రవేత్త జకారియా అల్ క్వాజ్విని వ్రాసిన వండర్స్ ఆఫ్ తింగ్స్ క్రియేటెడ్ండ్ మార్వెల్స్ ఆఫ్ తింగ్స్ ఎగ్జిస్టెడ్ వ్రాతల సారాంశం కింద ఇవ్వబడింది. ఇది సోమనాధ్ ఆలయ వివరణ, దాని ధ్వంసం గురించి వివరిస్తుంది. " సోమనాధ్: భారతీయుల చేత పవిత్రక్షేత్రంగా భావించబడి సముద్రతీరాన ఉపస్థితమైన క్షేత్రం సోమనాధ్. ఈ ఆలయ విచిత్రాలలో ఒకటి చంద్రుడు ఈ ఆలయ లింగాన్ని ప్రతిష్టించడం. ఆలయం మధ్యభాగంలో భూమిలోపల ఎటువంటి ఆధారం లేకుండా ఈ లింగం నిలిచి ఉండడం ఒక ప్రత్యేకత. హిందువుల చేత అధికంగా కొనియాడబడుతున్న ఈ ఆలయ ప్రధానదైవమఇన పరమశివుడు భూమికి పైభాగంలో గాలిలో తేలినట్లుండి ఈ లింగరూపంలో నిలిచి ఉండడం ఒకవేళ ముసల్మాన్ కాని నాస్థికుడు కాని ఎవరికైనా ఒక వర్ణించ లేని అద్భుతం. చంద్రగ్రహణ కాలంలో లక్షకంటే అధికులైన హిందువులు ఇక్కడకి పవిత్రయాత్రార్ధం రావడం ఆనవాయితీ.

నిర్మాణ శైలి
కైలాస మహామేరు ప్రసాదం గా పిలవబడే నేటి ఆలయ కట్టడం చాళుక్యులనాటి ఆలయ నిర్మాణ శైలిని లేక కైలాష్ మహామేరు ప్రసాద్ శైలి ప్రతిబింబిస్తుంది. 1951లో ఈ నూతన ఆలయంలో జ్యోతిర్లింగ ప్రతిష్టాపనగావించిన నాటి రాష్ట్రపతి డా. రాజేంద్ర ప్రసాద్ "సృష్టించే శక్తి నాశనం చేసే శక్తి కన్నా గొప్పది అనడానికి సోమనాథ్ ఆలయం ప్రతీక" అని అన్నారు. ఈ ఆలయం గుజరాత్ శిల్పాచార్యుల సోమపుర నిర్మాణ శైలిని ప్రతిబింబిస్తుంది. ఈ ఆలయం నిర్మించిన స్థలానికీ, ఎక్కడో దక్షిణాన ఉన్న అంటార్కిటిక్ ఖండానికీ మధ్య భూభాగమన్నదే లేదు. ఈ విశేషాన్ని సంస్కృత భాషలో తెలియచేస్తున్న ఒక శాసనం అక్కడి బాణ స్తంభం (యారో పిల్లర్) మీద చెక్కబడియున్నది. వెయ్యి సంవత్సరాల పైబడినదిగా భావిస్తున్న ఈ బాణ స్తంభం అక్కడి సముద్రతీరాన ఉన్న రక్షణకుడ్యము పై నిర్మింపబడింది. ఈ బాణ స్తంభం ఉత్తర దక్షిణ ధ్రువాల కేంద్ర బిందువుగా భావించబడుతుంది.

ప్రొక్లెమేషన్ ఆఫ్ గేట్స్
1782-1783ల మధ్య శ్రీనాధ్ మహదాజీ షిండే (ఉజ్జయిని, గ్వాలియర్, మధుర పాలకుడు) లాహోరు పాలకుడైన ముహమ్మద్ షాహ్‌ను ఓడించిన తరువాత విజయోత్సాహంతో లాహోరు నుండి మూడు వెండి ద్వారాలను తీసుకువచ్చాడు. గుజరాత్ పండితులు ఆ చర్యను నిరాకరించడంతో పాలకుడైన గైక్వాడ్ వాటిని సోమనాధ ఆలయంలో పెట్టించాడు. ఈ ద్వారాలు ప్రస్తుతం ఉజ్జయిని ఆలయాలలో ద్వారములుగా నిలబడి ఉన్నాయి. ప్రస్తుతం వాటిని మహాకాళేశ్వర్ జ్యోతిర్లింగ మందిరం, గోపాల్ మందిరంలలో చూడ వచ్చు. 1842లో 1 ఎర్ల్ ఆఫ్ ఎడిన్బర్గ్ కు చెందిన ఎడిన్బర్గ్ ప్రసిద్ధిచెందిన ప్రొక్లెమేషన్ ఆఫ్ గేట్స్ పేరుతో చేసిన ప్రకటనలో ఆఫ్ఘనిస్తాన్ లోని గజనీలో ఉన్న గజనీ మహ్ముద్ సమాధిలో ఉన్న ఈ ద్వారాలను గజనీ నుండి తీసుకు వచ్చి భారతప్రభుత్వానికి అందించమని ఆదేశాలను జారీచేసాడు. వీటిని గజనీ మహ్ముద్ సోమనాధ్ ఆలయం నుండి తీసుకు వెళ్ళబడినట్లు విశ్వసించబడింది. సోమనాథ ఆలయ ఈ ద్వారాల గురించిన చర్చ 1843లో లండన్లో హౌస్ ఆఫ్ కామన్స్‌లో జరిగినట్లు ఆధారాలు ఉన్నాయి. బ్రిటిష్ ప్రభుత్వం, ప్రతిపక్షాల మధ్య జరిగిన చెలరేగిన చర్చల మంటల తరువాత ఈ ద్వారాలు వెలికి తీసి విజయవంతంగా వెనుకకు తీసుకురాబడ్డాయి. కాని వచ్చిన తరువాత అవి అసలైన ద్వారాలకు ఖచ్ఛితమైన నమూనాలని తెలుసుకున్నారు. అవి ప్రస్తుతం ఆగ్రా స్టోర్ రూమ్ లో ఇంకా అలా పడి ఉన్నాయి.

మన దేవాలయాలు చారిత్రక నగరాలూ

Thursday, June 25, 2026

Visakha Nakshatra - విశాఖ నక్షత్రము

విశాఖ నక్షత్రము

నక్షత్రం - విశాఖ
అధిపతి - గురువు
గణము - రాక్షస
జాతి - స్త్రీ
వృక్షం - నాగకేసరి
జంతువు - పులి
నాడి - అంత్య
పక్షి - గరుడుడు
అధిదేవత - ఇంద్రుడు, అగ్ని
రాశి - 1,2,3 పాదాలు తుల, 4వ పాదం వృశ్చికము

విశాఖ నక్షత్ర జాతకుల గుణగణాలు
నక్షత్రములలో విశాఖ నక్షత్రం 16వ నక్షత్రం. విశాఖ సూర్యుని జన్మ నక్షత్రంగా పేరొందినది. విశాఖ శాంతి నక్షత్రం. విశాఖ గురుగ్రహ నక్షత్రము, రాక్షస గణము, అధిదేవతలు, ఇంద్రుడు, అగ్ని, జంతువు పులి, రాశ్యధిపతి కుజుడు. గురుదశతో జీవితము ప్రారంభం ఔతుంది కనుక బాల్యము సుఖముగా జరుగుతుంది.

తల్లి తండ్రులు కుటుంబ సభ్యుల మధ్య గారాబంగా జీవితము మొదలౌతుంది. వైద్య, వ్యాపార, సాంకేతిక రంగాలలో, అర్ధికపరమైన వ్యాపారాలలో పట్టు సాధిస్తారు. మంచి సలహాదారుల వలన ప్రయోజనాలు ఉంటాయి.

వంశపారంపర్య ఆస్థులు సంక్రమిస్తాయి. స్వంతగా అంతకంటే అధికమైన ఆస్తులు సంపాదిస్తారు. సంతానము వలన ఖ్యాతి లభిస్తుంది. అన్యభాషలు నేర్చుకుంటారు. సాంకేతిక రంగం ఆధారముగా ఇతర రంగాలలో ప్రవేశించి ఆ రంగములో విజయము సాధించి ప్రాముఖ్యత సాధిస్తారు.

కుటుంబ సభ్యుల మీద తప్ప ఇతరుల మీద ప్రేమాభిమానాలు తక్కువ. భయము, పొదుపు, జాగ్రత్త, విజ్ఞానము జీవితములో సమపాళ్ళలో ఉంటాయి. ఏభై సంవత్సరాల అనంతరము జీవితము సుఖవంతముగా జరుగుతుంది కనుక వృద్ధాప్యము సుఖవంతముగా జరుగుతుంది.

ఈ నక్షత్రం వారు అన్నివేళలా పనిచేయడానికి ఇష్టపడతారు. వేడుకలు, ప్రేమ మరియు విలాసం అనేవి వీరి జీవితంలో ముఖ్యమైన భాగాలుగా పరిగణిస్తారు. వీరు ఎంతో మర్యాదపూర్వకంగా, సామాజికంగాను ఉంటారు మరియు ఎల్లప్పుడూ సంతోషంగా ఉంటారు.

విద్యాపరంగా, వీరి పరిస్థితి చాలా బాగుంటుంది. బృహస్పతి యొక్క ప్రభావం కారణంగా, వీరు వీరి బాల్యం నుండి జ్ఞానాన్ని పొందడం కొరకు ఉత్సాహాన్ని కనపరుస్తారు. బాగా చదువుతారు, అందువల్లనే ఉన్నత విద్యను పొందుతారు.

వీరు మెదడును ఎక్కువగా ఉపయోగిస్తారు. ఒకవేళ వీరు సామాజిక కోణాన్ని పరిగణనలోకి తీసుకున్నట్లయితే, చాలా స్నేహపూర్వకంగా ఉంటారు కనుక వీరి సర్కిల్ చాలా పెద్దది. వ్యక్తులచే ప్రేమించబడతారు మరియు గౌరవించబడతారు.

సామాజిక సంక్షేమ కార్యక్రమాల్లో పాల్గొనే సంస్థలకు వీరు అనుబంధంగా ఉంటారు. వీరి స్వరం ఎంతో శక్తివంతమైనది, అందువల్లనే ప్రజలను వీరు ఆకర్షిస్తారు. అందువల్లనే, ఒకవేళ వీరు రాజకీయాల్లో ఉన్నట్లయితే, అనేక సామాజిక సంక్షేమ కార్యక్రమాలు చేస్తారు.

రోజువారీ సంపాదన విషయానికి వస్తే, వ్యాపారం చేయడం కంటే ఉద్యోగం చేయడానికి వీరు ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తారు. ప్రభుత్వ ఉద్యోగం పొందడం కొరకు వీరు చాలా కష్టపడతారు. ఆర్థికంగా వీరి పరిస్థితి ఎంతో బాగుంటుంది. మరియు హఠాత్తుగా ఆర్థికపరమైన ప్రయోజనాలు వీరికి కలగవచ్చు.

లాటరీలు మొదలైన వాటి ద్వారా కూడా వీరు లాభాన్ని పొందవచ్చు. వీరు ఇప్పటికే డబ్బును ఆదా చేయడాన్ని ఆస్వాదిస్తారు మరియు అన్ని విషయాలు కూడా వీరికి ఎంతగానో సహాయపడతాయి. వీరికి ఎన్నడూ ఆర్థికపరమైన ఇబ్బందులు కలగవు మరియు ఒకవేళ అటువంటి సమస్యలు ఏర్పడినట్లయితే, అవి తాత్కాలికంగానే ఉంటాయి.

విశాఖ నక్షత్రం మొదటి పాదం
విశాఖ నక్షత్ర అధిపతి గురువు. విశాఖ రాక్షసగణ నక్షత్రం కనుక వీరికి పట్టుదల అధికంగా ఉంటుంది. వీరు ధర్మపక్షపాతం కలిగి ఉంటారు. నిర్వహణ సామర్థ్యం అధికంగా ఉంటుంది. ఉన్నతోపాధ్యాయులు, ఉపాధ్యాయులు వంటి వృత్తులు వీరికి అనుకూలం. అలాగే విద్యుత్, అగ్ని భూ సంబంధిత ఉద్యోగాలు వీరికి అనుకూలంగా ఉంటాయి.

ఆధ్యాత్మిక విషయాలలో కూడా వీరికి ఆసక్తి ఉంటుంది. విద్యాభ్యాసం కొంత వరకు బాగానే సాగుతుంది. కాలేజి చదువులలో మందకొడితనం నెల కొంటుంది. ప్రయత్నపూర్వకంగా విజయం సాధించవలసిన అవసరం ఉంది.

14 సంవత్సరాల వయసు వరకు సౌఖ్యంగా జీవితం గడుస్తుంది. తల్లి తండ్రుల ఆదరాభిమానాలకు పాత్రులు ఔతారు. తరువాత వచ్చే 19 సంవత్సరాల శనిదశ కారణంగా సౌఖ్యం కొంత తగ్గుతుంది. జీవితంలో నిదానంగా స్థిరపడతారు. వివాహంలో జాప్యం కలుగవచ్చు. సంపాదించిన దానికంటే ఖర్చులు అధికంగా ఉంటాయి. కనుక జాగ్రత్త వహించవలసిన అవసరం ఉన్నది. స్థిరాస్తులు ఏర్పరచుకోవడం జీవితకాలం సహకరిస్తుంది.

33 సంవత్సరాలకు వచ్చే 17 సంవత్సరాల బుధదశ కాలంలో కొంత ఉపశమనం కలుగుతుంది. 50 సంవత్సరాల నుండి 7 సంవత్సరాల కేతుదశ కారణంగా కొన్ని సమస్యలు ఎదురౌతాయి. కేతు దశ అనుకూలిస్తే విదేశీపర్యటన అనుకూలిస్తుంది. తీర్ధయాత్రలకు ఇది అనుకూల సమయం. 57 సంవత్సరాల తరువాత వచ్చే శుక్రదశ కారణంగా జీవితంలో సౌఖ్యం తిరిగి నెలకొంటుంది. మిగిలిన జీవితం సౌఖ్యంగా జరుగుతుంది.

విశాఖ నక్షత్రం రెండవ పాదం
విశాఖ నక్షత్ర అధిపతి గురువు. విశాఖ రాక్షస గణ నక్షత్రం కనుక వీరికి పట్టుదల అధికంగా ఉంటుంది. వీరు ధర్మపక్షపాతం కలిగి ఉంటారు. స్థిరమైన అభిప్రాయాలు కలిగి ఉంటారు. నిర్వహణ సామర్థ్యం అధికంగా ఉంటుంది. ఉన్నతో పాధ్యాయులు, ఉపాధ్యాయులు వంటి వృత్తులు వీరికి అత్యంత అనుకూలం. ఆధ్యాత్మిక గురువులుగా కూడా వీరు రాణించగలరు. ఆధ్యాత్మిక విశ్వాసం అధికంగా ఉంటుంది.

విద్యారంభం బాగానే ఉంటుంది. మాధ్యమిక విద్యాకాలంలో విద్యలో మందకొడితనం నెలకొంటుంది. ప్రయత్నపూర్వకంగా విజయం సాధించవలసిన అవసరం ఉంది. 10 సంవత్సరాల వయసు వరకు సౌఖ్యంగా జీవితం గడుస్తుంది.

తల్లితండ్రుల ఆదరాభిమానాలకు పాత్రులు ఔతారు. తరువాత వచ్చే 19 సంవత్సరాల శనిదశ కారణంగా సౌఖ్యం కొంత తగ్గుతుంది. జీవితంలో నిదానంగా స్థిరపడతారు. వివాహంలో జాప్యం కలుగవచ్చు. సంపాదించినా దానికంటే ఖర్చులు అధికంగా ఉంటాయి. కనుక జాగ్రత్త వహించవలసిన అవసరం ఉన్నది. స్థిరాస్తులు ఏర్పరచుకోవడం జీవితకాలం సహకరిస్తుంది. 29 సంవత్సరాలకు వచ్చే 17 సంవత్సరాల బుధదశ కాలంలో కొంత ఉపశమనం కలుగుతుంది.

46 సంవత్సరాల నుండి 7 సంవత్సరాల కేతుదశ కారణంగా కొన్ని సమస్యలు ఎదురౌతాయి. కేతుదశ అనుకూలిస్తే విదేశీపర్యటన అనుకూలిస్తుంది. తీర్ధయాత్రలకు ఇది అనుకూల సమయం. 53 సంవత్సరాల తరువాత వచ్చే శుక్రదశ కారణంగా జీవితంలో సౌఖ్యం తిరిగి నెలకొంటుంది. మిగిలిన జీవితం సౌఖ్యంగా జరుగుతుంది.

విశాఖ నక్షత్రం మూడవ పాదం
విశాఖ నక్షత్ర అధిపతి గురువు. విశాఖ రాక్షసగణ నక్షత్రం కనుక వీరికి పట్టుదల అధికంగా ఉంటుంది. నిర్వహణ సామర్థ్యం అధికంగా ఉంటుంది. వీరు ధర్మపక్షపాతం కలిగి ఉంటారు. విచక్షణా జ్ఞానం అధికంగా ఉంటుంది. వీరికి వ్యాపారం అంటే మక్కువ ఎక్కువ. మేధా సంబంధిత, విద్యా సంబంధిత, భూ సంబంధిత ఉద్యోగం, వ్యాపారం, వృత్తులు వీరికి అనుకూలిస్తాయి. విద్యలో ఆరంభం నుండి మందకొడితనం నెలకొంటుంది. ప్రయత్నపూర్వకంగా విజయం సాధించవలసిన అవసరం ఉంది.

6 సంవత్సరాల వయసు వరకు సౌఖ్యంగా జీవితం గడుస్తుంది. తల్లితండ్రుల ఆదరాభిమానాలకు పాత్రులు ఔతారు. తరువాత వచ్చే 19 సంవత్సరాల శనిదశ కారణంగా సౌఖ్యం కొంత తగ్గుతుంది. జీవితంలో నిదానంగా స్థిరపడతారు. 25 సంవత్సరాలకు వచ్చే 17 సంవత్సరాల బుధదశ కారణంగా జీవితం సాఫీగా సాగుతుంది. వివాహం సకాలంలో జరుగుతుంది.

42 సంవత్సరాల నుండి 7 సంవత్సరాల కేతుదశ కారణంగా కొన్ని సమస్యలు ఎదు రౌతాయి. కేతుదశ అనుకూలిస్తే విదేశీపర్యటన అనుకులిస్తుంది. తీర్ధయాత్రలకు ఇది అనుకూల సమయం. 49 సంవత్సరాల తరువాత వచ్చే శుక్రదశ కారణంగా జీవితంలో సౌఖ్యం తిరిగి నెలకొంటుంది. మిగిలిన జీవితం సౌఖ్యంగా జరుగుతుంది.

విశాఖ నక్షత్రం నాలుగవ పాదం
విశాఖ నక్షత్ర అధిపతి గురువు. విశాఖ రాక్షసగణ నక్షత్రం కనుక వీరికి పట్టుదల అధికంగా ఉంటుంది. వీరు ధర్మపక్షపాతం కలిగి ఉంటారు. నిర్వహణ సామర్థ్యం అధికంగా ఉంటుంది. ఆధ్యాత్మిక విషయాలలో కూడా వీరికి ఆసక్తి ఉంటుంది. ఉన్నతోపాధ్యాయులు, ఉపాధ్యాయులు వంటి వృత్తులు వీరికి అనుకూలం.

తల్లి తండ్రుల ఆదరాభిమానాలకు పాత్రులు ఔతారు. 2 సంవత్సరాల తరువాత వచ్చే 19 సంవత్సరాల శనిదశ కారణంగా సౌఖ్యం కొంత తగ్గుతుంది. విద్యాభ్యాసంలో మందకొడితనం ఉంటుంది. 21 సంవత్సరాలకు వచ్చే 17 సంవత్సరాల బుధదశ కారణంగా జీవితం ఉన్నత విద్యలో అభివృద్ధి ఉంటుంది. సకాలంలో వివాహం జరుగుతుంది.

38 సంవత్సరాల నుండి 7 సంవత్సరాల కేతుదశ కారణంగా కొన్ని సమస్యలు ఎదురౌతాయి. కేతుదశ అనుకూలిస్తే విదేశీపర్యటన అనుకులిస్తుంది. తీర్ధయాత్రలకు ఇది అనుకూల సమయం. 45 సంవత్సరాల తరువాత వచ్చే శుక్రదశ కారణంగా జీవితంలో సౌఖ్యం తిరిగి నెలకొంటుంది. మిగిలిన జీవితం సౌఖ్యంగా జరుగుతుంది.

విశాఖ నక్షత్ర జాతకులు పెంచవల్సిన వృక్షములు:
విశాఖ నక్షత్రం వారు వెలగ, మొగలిచెట్లను పెంచడం మంచిది. ఎటువంటి పరిస్థితులనైన తట్టుకొని నిలబడడానికి, ముందుచూపుతో అన్ని విషయాలను గ్రహించి ముందుకు సాగడానికి, వృత్తిరీత్యా మంచి గౌరవ మర్యాదలు సంపాదించుకోవడానికి ఉపయోగపడుతుంది.

విశాఖ నక్షత్ర జాతకుల తారా ఫలాలు
తార నామం - తారలు - ఫలం

జన్మ తార - పునర్వసు, విశాఖ, పూర్వాభాద్ర - శరీరశ్రమ

సంపత్తార - పుష్యమి, అనూరాధ, ఉత్తరాభాద్ర - ధన లాభం

విపత్తార - ఆశ్లేష, జ్యేష్ట, రేవతి - కార్యహాని

సంపత్తార - అశ్విని, మఖ, మూల - క్షేమం

ప్రత్యక్ తార - భరణి, పూర్వ ఫల్గుణి, పూర్వాషాఢ - ప్రయత్న భంగం

సాధన తార - కృత్తిక, ఉత్తర ఫల్గుణి, ఉత్తరాషాఢ - కార్య సిద్ధి, శుభం

నైత్య తార - రోహిణి, హస్త, శ్రవణం - బంధనం

మిత్ర తార - మృగశిర, చిత్త, ధనిష్ట - సుఖం

అతిమిత్ర తార - ఆరుద్ర, స్వాతి, శతభిష - సుఖం, లాభం

నక్షత్ర శాంతి: ఉత్తర దిశలో మొక్కలు పెంచాలి. శనగలు దానం ఇవ్వాలి.

నక్షత్ర మంత్రం:
।। ఓం ।।
దూరమస్మచ్ఛత్ర'వో యంతు భీతాః ।
తది' ద్రాగ్నీ కృ'ణుతాం తద్విశా'ఖే ।
తన్నో' దేవా అను'మదంతు యజ్ఞమ్ ।
పశ్చాత్ పురస్తాదభ'యన్నో అస్తు ।
నక్షత్రాణామధి'పత్నీ విశా'ఖే ।
శ్రేష్ఠా'వింద్రాగ్నీ భువ'నస్య గోపౌ ।
విషూ'చశ్శత్రూ'నపబాధ'మానౌ ।
అపక్షుధ'న్నుదతామరా'తిమ్ ॥

నక్షత్ర గాయత్రి
ఓం ఇంద్రాగ్నేస్యై విద్మహే 
మహాశ్రేష్టాయై చ ధీమహీ 
తన్నో విశాఖ ప్రచోదయాత్

దర్శించవలసిన ఆలయములు
మొదటి పాదం – దూళ్ళలో వేంచేసి ఉన్న శ్రీ బాలాత్రిపురసుందరీ సమేత శ్రీ అగస్తేశ్వర స్వామి.
రెండవ పాదం – నర్సిపూడిలో వేంచేసి ఉన్న శ్రీ పార్వతీ సమేత సోమేశ్వర స్వామి.
మూడవ పాదం – నవాబుపేటలో వేంచేసి ఉన్న శ్రీ పార్వతీ సమేత సోమేశ్వరస్వామి.
నాలుగవ పాదం – కూర్మపురంలో వేంచేసి ఉన్న శ్రీ పార్వతీ సమేత శ్రీ రామలింగేశ్వర స్వామి.

Puri Jagannath Rath Yatra - పూరీ జగన్నాథ్ రథయాత్ర

పూరీ జగన్నాథ్ రథయాత్ర ఆలయ ఆధ్వర్యంలో జరిగే ఉత్సవాలన్నింటికల్లా ముఖ్యమైనది జగన్నాథ రథయాత్ర. భారతదేశంలో అత్యంత ప్రసిద్ధి గాంచినది పూరీ జగన్నాథ...