Tuesday, June 2, 2026

Ashlesha - ఆశ్లేష

ఆశ్లేష నక్షత్రము

నక్షత్రం - ఆశ్లేష
అధిపతి - బుధుడు
గణము - రాక్షస
జాతి - పురుష
వృక్షం - నాగకేసరం
జంతువు - మార్జాలం
నాడి - అంత్య
పక్షి - చిన్నపక్షి
అధిదేవత - సర్పము
రాశి - కర్కాటకం

ఆశ్లేష నక్షత్ర జాతకుల గుణగణాలు
నక్షత్రములలో ఇది తొమ్మిదవది. ఆదిశేషుడు, లక్ష్మణుడు యొక్క జన్మ తారగా చెప్పబడే నక్షత్రము ఆశ్లేష నక్షత్రము.

ఈ నక్షత్ర జాతకులు పట్టుదలను కలిగి ఉంటారు. అడ్డంకుల నడుమ వీరి చదువులు కొన సాగుతాయి, ఏది ఏమి అయిన సరే వీరు ఆయా అడ్డగింపులని దాటి పై చదువులను చదువుకొనగలుగుతారు. వీరి పట్టుదల వీరిని ఉన్నత స్థితికి తీసికొనిపోతుంది.

న్యాయపరమైన చిక్కులను అధిగమిస్తారు. వీరు ఉద్యోగ, వ్యాపార రంగాలలో రాణించగలరు.

ఉద్యోగములో నిపుణత సాధిస్తారు. అనుకున్న లక్ష్యాన్ని చేరుకోవడానికి ఎంతో ఓర్పు వహిస్తారు. లక్ష్యసాధన కొరకు ఎంత కాలమైనా ఎదురు చూస్తారు.

నిరంతరం ఉన్నత స్థానానికి చేరుకోవడానికి వీరి మేధస్సు మరియు నాయకత్వ సామర్థ్యాలు నిరంతరం స్పూర్తిని కలిగిస్తాయి.

వీరి స్వేచ్ఛలో ఎవరూ కూడా జోక్యం చేసుకోవడాన్ని మీరు ఇష్టపడరు. కనుక, వీరితో మాట్లాడేటప్నపుడు, వీరి మాటల్ని తిరస్కరించని విధంగా చూసుకోవాలి.

స్నేహితుల కొరకు ఏదైనా చేసే లక్షణాన్ని వీరు కలిగి ఉంటారు. వీరు చాలా స్నేహ పూర్వకంగాను మరియు సామాజికంగాను ఉంటారు.

ఒక సమస్య రావడానికి ముందు దానిని విశ్లేషించే సామర్థ్యాన్ని వీరు కలిగి ఉంటారు. అందువల్ల, సాధారణంగా వాటికి సిద్ధమై ఉంటారు. వీరికి ఉన్నత స్థానాన్ని చేరుకునే నాయకత్వ లక్షణాలుంటాయి.

కష్టపడి పనిచేసే విషయానికి వస్తే, స్మార్ట్ వర్క్ ని ఎంచుకుంటారు. ఒక్కసారి ఏదైనా నిర్ణయించుకున్న తరువాత, కేవలం దానికే కట్టుబడి ఉంటారు.

ఆశ్లేష నక్షత్రం మొదటి పాదము
ఆశ్లేష నక్షత్ర మొదటి పాదం అధిపతి బుధుడు. అహింసాధిపతి గురుడు కనుక వీరి మీద గురు, బుధగ్రహ ప్రభావం ఉంటుంది. ఈ నక్షత్ర జాతకులకు విద్యా సంబంధిత ఉద్యోగాలలో వీరికి ఆసక్తి ఉంటుంది.

మేధా సంబంధిత ఉద్యోగాలలోనూ వీరు బాగా రాణించగలరు. విద్యా సంస్థలు స్థాపన, నిర్వహణలో వీరు సమర్థులు. వీరికి నిర్వహణ సామర్థ్యం అధికంగా ఉంటుంది. వీరు విద్యారంభంలోనే ప్రతిభను ప్రదర్శిస్తారు.

కేతువు అనుకూలంగా ఉన్న వారు సొంత ఊరికి దూరంగా (బయట ఊర్లలో లేక విదేశాలలో) విద్యాభ్యాసం చేయగలుగుతారు.

శుక్ర దశ కారణంగా విద్య పూర్తి కాగానే జీవితంలో స్థిరపడతారు. వీరు చిన్న వయసులోనే జీవితంలో స్థిరపడతారు. భూ, విద్యా, ఆభరణ సంబంధిత ఉద్యోగం, వ్యాపారం, వృత్తులు వీరికి అనుకూలిస్తాయి.

ఆశ్లేష నక్షత్రం రెండవ పాదము
ఆశ్లేష నక్షత్ర రెండవ పాదము అధిపతి బుధుడు. అహింసాధిపతి శని కనుక వీరి మీద బుధ, శని గ్రహ ప్రభావం ఉంటుంది. వీరు వ్యాపారం అంటే ఇష్టపడతారు. బుధ గ్రహ ప్రభావం కారణంగా మేధో సంబంధిత ఉద్యోగాలు వీరికి అనుకూలిస్తాయి.

ఇనుము సంబంధిత ఉద్యోగ వ్యాపారాలు కూడా అనుకూలిస్తాయి. కేతుదశ కారణంగా వీరికి కొన్ని ఆటంకాలు ఎదురౌతాయి. ప్రయత్నపూర్వకంగా వాటిని అధిగమించి విజయం సాధించవచ్చు.

విద్య పూర్తికాగానే జీవితంలో స్థిరపడతారు. వివాహం సకాలంలో జరుగుతుంది. రాహుదశ కాలంలో కొన్ని సమస్యలు ఎదురౌతాయి. రాహువు అనుకూలంగా ఉంటే విదేశీవాసం, విదేశీయాత్ర చేయడానికి అవకాశం కూడా ఉంది.

ఆశ్లేష నక్షత్రం మూడవ పాదము
ఆశ్లేష నక్షత్ర మూడవ పాదము వారి మీద బుధ శని గ్రహ ప్రభావం ఉంటుంది. వీరికి వ్యాపారం అంటే ఇష్టం. బుధగ్రహ ప్రభావం కారణంగా మేధో సంబంధిత ఉద్యోగాలు వీరికి అనుకూలిస్తాయి. వీరు స్థిరమైన అభిప్రాయాలు కలిగి ఉంటారు. శ్రమించి పనిచేసే గుణం కలిగి ఉంటారు.

వీరికి వృత్తి, వ్యాపారం, ఉద్యోగాల మీద సమానంగా ఆసక్తి ఉంటుంది. మేధో సంబంధిత ఉద్యోగాలు వీరికి అనుకూలిస్తాయి. ఇనుము సంబంధిత ఉద్యోగ వ్యాపారాలు కూడా వీరికి అనుకూలిస్తాయి.

విద్యా ఆరంభంలోనే ఆటంకాలు ఎదురౌతాయి. వాటిని అధిగమించి ముందుకు సాగవలసిన అవసరం ఉంది. వీరు ప్రయత్న పూర్వకంగా విద్య వైపు మనసును మళ్ళించి విద్యాభ్యాసం పూర్తి చేయాలి. విద్యాభ్యాసం పూర్తి కాగానే జీవితంలో స్థిరపడతారు.

ఆశ్లేష నక్షత్రం నాలుగవ పాదము
ఆశ్లేష నక్షత్ర నాలుగవ పాదం వారి మీద గురు బుధ గ్రహ ప్రభావం ఉంటుంది. విద్యా సంబంధిత ఉద్యోగాలలో వీరికి ఆసక్తి ఉంటుంది. మేధా సంబంధిత ఉద్యోగాలలో రాణించగలరు. వీరు విద్యారంభంలోనే కేతుదశ కారణంగా విద్యారంభంలో ఆటంకాలను ఎదుర్కొంటారు. వాటిని అధిగమించి ముందుకు సాగవలసిన అవసరం ఉంది.

శుక్రదశ కారణంగా విద్య మీద శ్రద్ధ తగ్గే అవకాశం ఉంది. కనుక ప్రయత్న పూర్వకంగా మనసును విద్య వైపు మళ్ళించి విద్యాభ్యాసం పూర్తి చేసి విజయం సాధించవలసిన అవసరం ఉంది.

నాలుగవ పాదములో జన్మించిన వారు కూడా విద్యాభ్యాసం పూర్తి కాగానే జీవితంలో స్థిరపడతారు. సకాలంలో వివాహం జరిగే అవకాశాలు ఉంటాయి. రాహు దశ కాలమో కొన్ని సమస్యలను ఎదుర్కోనవలసిన అవసరం ఉంది. రాహుదశ అనుకూలిస్తే విదేశీయానం చేసే అవకాశం ఉంటుంది.

ఆశ్లేష నక్షత్ర జాతకులు పెంచవల్సిన చెట్లు:
ఆశ్లేష నక్షత్రం వారు సంపంగి లేదా చంపక వృక్షాన్ని పెంచడం మరియు పూజించడం వల్ల చాలా మంచి ఫలితాలు కలుగుతాయి.

ఆశ్లేష అధిపతి బుధుడు కావున వీరు బుధగ్రహ జప, స్తోత్ర పఠనం చేస్తూ ఉండాలి. బుధ గ్రహానికి అధిపతి విష్ణువు కావున విష్ణు సహస్ర నామం పారాయణ చేయుట ఉత్తమం.

ఆశ్లేష నక్షత్ర జాతకుల తారా ఫలాలు
తార నామం - తారలు - ఫలం

జన్మ తార - ఆశ్లేష, జ్యేష్ట, రేవతి - శరీరశ్రమ

సంపత్తార - అశ్విని, మఖ, మూల - ధన లాభం

విపత్తార - భరణి, పూర్వ ఫల్గుణి, పూర్వాషాఢ - కార్యహాని

సంపత్తార - కృత్తిక, ఉత్తర ఫల్గుణి, ఉత్తరాషాఢ - క్షేమం

ప్రత్యక్ తార - రోహిణి, హస్త, శ్రవణం - ప్రయత్న భంగం

సాధన తార - మృగశిర, చిత్త, ధనిష్ట - కార్య సిద్ధి, శుభం

నైత్య తార - ఆరుద్ర, స్వాతి, శతభిష - బంధనం

మిత్ర తార - పునర్వసు, విశాఖ, పూర్వాభాద్ర - సుఖం

అతిమిత్ర తార - పుష్యమి, అనూరాధ, ఉత్తరాభాద్ర - సుఖం, లాభం


నిత్య స్తోత్రావళి

నిత్య పారాయణ శ్లోకాలు

స్తోత్రాలు

పంచాంగం

No comments:

Post a Comment

Temple to visit on Vidiya Tidhi - విదియ తిధి రోజు దర్శించవలసిన దేవాలయం

విదియ తిధి రోజు దర్శించవలసిన దేవాలయం ప్రతి నెలలో మనకు రెండు పక్షాలు (శుక్ల పక్షం, కృష్ణ పక్షం) ఉంటాయి కాబట్టి, రెండు విదియ తిథులు వస్తాయి.. ...