Thursday, October 1, 2026

Why worship Kubera when Goddess Lakshmi is present? - లక్ష్మీదేవి ఉండగా, కుబేరుడిని ఎందుకు పూజించాలి?

లక్ష్మీదేవి ఉండగా, కుబేరుడిని ఎందుకు పూజించాలి

చాలామంది ఒక సందేహం అడుగుతారు. ధనానికి అధిపతి ఎవరు? లక్ష్మీదేవా... లేక కుబేరుడా? దీనికి సమాధానం పురాణాల్లోనే ఉంది.

శ్రీ మహాలక్ష్మీదేవి సంపద, ఐశ్వర్యం, శుభానికి మూలాధారం. అయితే ఆ దివ్య సంపదను సంరక్షించే బాధ్యతను ధనాధిపతి కుబేరుడికి పరమశివుని అనుగ్రహంతో లభించింది. అందుకే కుబేరుడిని "దేవతల ఖజానా అధికారి" అని పిలుస్తారు.

పురాణాల ప్రకారం, లక్ష్మీదేవి కటాక్షం లేకుండా కుబేరుడి వద్ద ఉన్న సంపద కూడా నిలవదు. అలాగే కుబేరుని అనుగ్రహం లేకుండా ఆ సంపద సరైన విధంగా భక్తులకు చేరదని విశ్వసిస్తారు. అందుకే వీరిద్దరినీ కలిసి ఆరాధించే సంప్రదాయం ఏర్పడింది.

అందుకే పెద్దలు..."లక్ష్మీదేవి అనుగ్రహం ఇస్తే... కుబేరుడు ఆ ధనాన్ని మీ ఇంటికి చేరుస్తాడు, అంటారు. ఈ ఇద్దరి అనుగ్రహం కలిగించే "ఓం శ్రీం హ్రీం క్లీం శ్రీం లక్ష్మీ కుబేరాయ నమః" ఈ లక్ష్మీ కుబేర మంత్రంకు విశేషమైన ప్రాధాన్యం ఉంది. ఈ మంత్రాన్ని భక్తిశ్రద్ధలతో జపిస్తే, మహాలక్ష్మీ అనుగ్రహం, కుబేరుడి ధన సంరక్షణ శక్తి రెండూ లభిస్తాయని భక్తుల విశ్వాసం.

ఇంట్లో ఆర్థిక స్థిరత్వం, వ్యాపారాభివృద్ధి, ధనసంపద, శుభం కలగాలని కోరుకునే వారు లక్ష్మీ కుబేరులను కలిసి పూజిస్తూ ఈ మంత్రాన్ని జపిస్తారు.

ఇది కేవలం ధనం కోసం మాత్రమే కాదు... సంపాదించిన ఐశ్వర్యం నిలవాలని, కుటుంబంలో శాంతి, శ్రేయస్సు నెలకొనాలని కూడా ప్రార్థించే దైవిక సాధనగా భావిస్తారు.


కుబేర మంత్రం

Procedure for the Ananta Padmanabha Swamy Vratam - అనంత పద్మనాభ స్వామి వ్రత విధానము

అనంత పద్మనాభ స్వామి వ్రత విధానము

భాద్రపద శుక్ల చతుర్థశి అనంత పద్మనాభ వ్రతము

భాద్రపద శుక్ల చతుర్థికి రెండు ప్రత్యేకతలు ఉన్నాయి.

ఒకటి శ్రీమహావిష్ణువు తన నాభీపుండరీకమును బాగా వికసింపజేసి, బ్రహ్మ దేవునికి భూలోక మానవసృష్టి చేయడానికి కావలసిన జ్ఞానం, ఈ తిథి నాడే ప్రసాదించాడు. బ్రహ్మ కృతజ్ఞతతో అనంతపద్మనాభ స్వామి వ్రతం చేశారు. ఈ వ్రతాచరణము చేసిన సాధకుడు భుక్తి, ముక్తులు రెండూ పొందుతాడు. ఈ రోజు శ్రీ మహావిష్ణువు అనంత పద్మనాభుడు అనే పేరుతో కాసేపు శయనించారు. ఈ రోజు స్వామిని, విష్ణు సహస్రనామంతో లేదా అష్టోత్తర శతనామములతో కాని పూజించాలి.

రెండవది - ఈ తిథి నాడు అగస్త్యమహర్షిని ఏదైనా లోహ ప్రతిమ రూపంలో పూజా మందిరంలో ఉంచి పూజించుట. అగస్త్యుడు పూర్వం యముని వద్దకు వెళ్ళి, మానవులకు నరకబాధను తొలగించమని కోరాడు. అప్పుడు యముడు అగస్త్యుని, భాద్రపద శుక్ల చతుర్థి నాడు లోహ రూపంలో పూజించిన వాని జోలికి తాను, తన భటులు వెళ్ళమని, అటువంటి వారికి నరక భయం ఉండదని వరమిచ్చాడు.

అనంతపద్మనాభ వ్రతం:
ఇది హిందూ సంప్రదాయంలో ఉన్న కామ్య వ్రతాలలో ప్రధానమైనదని వ్రత గ్రంథాలు పేర్కొంటున్నాయి. కష్టాలలో మునిగి ఉన్నప్పుడు బయటపడటానికి ఓ ఉత్తమ సాధనంగా ఈ వ్రతాన్ని భావించటం తరతరాలుగా వస్తోంది.

ఎంతో పూర్వ కాలం నుంచి ఈ వ్రత ప్రస్తావన భారతావనిలో కనిపిస్తుండటం విశేషం. పాండవులు వనవాసం సమయంలో కష్టాలను అనుభవిస్తున్న ధర్మరాజు శ్రీకృష్ణుడిని వాటి నుంచి గట్టెక్కేందుకు ఏదైనా వ్రతం ఉంటే చెప్పమన్నాడు. అప్పుడు కృష్ణుడు అనంతపద్మనాభ వ్రతాన్ని భాద్రపద శుక్ల చతుర్దశినాడు చేయమని చెప్పాడట. అనంతుడన్నా, అనంతపద్మనాభస్వామి అన్నా సాక్షాత్తూ కాలమే అన్నాడు. యుగ, సంవత్సర, మాస తదితర కాలం అంతా తన స్వరూపమన్నాడు. అనంతపద్మనాభుడంటే కాల స్వరూపుడైన వైకుంఠవాసుడి అవతారమే శ్రీకృష్ణుడు. పాల కడలిలో శేషశయ్య మీద పవళించి ఉండి బొడ్డు పద్మంలో బ్రహ్మదేవుడు కూర్చొని లక్ష్మీదేవి పాదాలొత్తుతున్న ఆ దివ్య స్వరూపమే అనంతపద్మనాభుడు. ఈ వ్రతమహిమతో కృతయుగంలో సుశీల-కౌండిన్య దంపతుల సకల సంపదలు, సుఖసంతోషాలతో జీవించినట్లు పురాణాలు చెబుతున్నాయి.

ఈ వ్రతంలో భూభారాన్ని వహిస్తున్న అనంతుడిని, ఆ ఆదిశేషుడిని శయ్యగా చేసుకొని పవళించి ఉన్న శ్రీమహావిష్ణువును పూజించటం కనిపిస్తుంది. వ్రత సంబంధమైన పూజను గమనిస్తే అనంతపద్మనాభ అవతారం కళ్ల ముందు మెదలాడుతుంది. వ్రతాచరణ కోసం పిండితో ఏడు పడగల పామును చిత్రిస్తారు. దర్భలతో పాము బొమ్మను చేసి పూజించటం కనిపిస్తుంది. దర్భలతో చేసిన పామును మూతపెట్టిన కలశం మీద ఉంచి పూజిస్తారు. ఈ మొత్తంలోనూ శేషశయనుడి రూప భావన కనిపిస్తుంది.

పద్నాలుగు లోకాలను ఏలే ఆ స్వామి పూజ అనే భావన కలిగేందుకు ఆనాడు పూజించే సర్పాకృతికి పద్నాలుగులో సగమైన ఏడు సంఖ్యలో పడగలను పెట్టడం, పద్నాలుగుకు రెండింతలైన ఇరవై ఎనిమిది సంఖ్యలో గోధుమ పిండితో పిండి వంటలు చేసి పద్నాలుగేళ్ల కొకసారి వ్రతానికి సంబంధించిన ఉద్యాపన చేయటం కనిపిస్తుంది. ఈ వ్రతంలో ప్రధానాంశమైన చేతికి ధరించే ఎర్రటి తోరానికి 14 ముడులుంటాయి.

మరి కొందరు నైవేద్యానికి 14 రకాల పండ్లు, పిండి వంటలు, పూజ కోసం పత్రిని వాడుతుంటారు. ఇదంతా ఏడేడు పద్నాలుగు లోకాలను ఏలే కాలస్వరూపుడైన ఆ దివ్య మంగళ స్వరూపుడిని తలచుకోవటం కోసమే.ఈ వ్రతంలో కలశాన్ని పెట్టి పూజ చేయటాన్ని పురోహితుడి సాయంతో చేసుకోవటం మేలని వ్రత గ్రంథాలు పేర్కొంటున్నాయి. ఈ రోజు వ్రతాన్ని చేసే దంపతులు ఉదయం నుంచి సాయంత్రం వరకు ఉపవాసముంటుంటారు.వ్రతానికి సంబంధించి కథను పరిశీలిస్తే అంతా సత్యం, ధర్మం మీద ఆధారపడి ఉన్నట్లు కనిపిస్తుంది.

వ్రతవిధానము
శుచిగా స్నానమాచరించి, గృహాన్ని, పూజామందిరాన్ని శుభ్రపరుచుకోవాలి. పూజామందిరము నందు అష్టదశ పద్మాన్ని తీర్చిదిద్దాలి. ఆ పద్మం చుట్టూ రంగవల్లికలతో అలంకరించుకోవాలి. దానికి దక్షణ భాగంలో నీరు నింపిన కలశం ఉంచాలి.

ముందుగా ఓ మండపాన్ని ఏర్పాటుచేసుకోవాలి. అందులో పధ్నాలుగు పడగలు గల అనంతుడుని తయారుచేసి ప్రతిష్టించాలి. సామానముగా దర్బలను ఉపయొగించి అనంతుణ్ణి తయారుచేస్తారు. ముందుగా గణపతిని, నవగ్రహాలను పూజించిన తరువాత యమునా పూజ చేయాలి. యమునా పూజ అంటే నీటిని పూజించాలి. బిందెతో నీటిని తెచ్చుకొని, ఆ నీటిలోకి యమునను ఆవాహనం చేసి పూజించాలి. తరువాత అనంతుడుని షోడశోపచారాలతో పూజించి, బెల్లము తో చేసిన ఇరవై ఎనిమిది అరిసెలను నైవేద్యముగా పెట్టాలి.

వ్రతకథ చెప్పుకొని అనంతపద్మనాభస్వామికి నమస్కరించి అక్షతలు తలపై చల్లుకోవాలి. వ్రతముతో తోరమును కట్టుకోవాలి. ఎరుపు రంగులో పద్నాలుగు పోచలతో తయారైన తోరాన్ని ధరించాలి.

అనంతపద్మనాభ వ్రత కథ
సూత మహర్షి శౌనకాది మునీంద్రులకు ఇట్లు చెప్పసాగాడు. పూర్వం ధర్మరాజు తన సోదరులతో గూడి అరణ్యవాసం చేసి అనేక కష్టములను ఎదుర్కొన్నాడు. ఒకనాడు ఆయన శ్రీకృష్ణుడితో మాధవా! మేము అరణ్యవాసం చేస్తూ దుఃఖంలో ఉన్నాము. ఈ కష్టాలు కడతేరటానికి ఉపాయాన్ని తెలుపమని కోరగా దానికి ఆ గోపాలుడు ధర్మరాజా! జీవులందరి సర్వ చింతలను పోగొట్టి వారికి శాంతిని యశస్సును కలిగించే వ్రతముంది. అది భాద్రపద శుక్ల చతుర్దశి రోజున ఆచరించే అనంత పద్మనాభ వ్రతం. ఈ వ్రతాన్ని ఆచరించిన వారికి సుఖ సౌఖ్యాలు, యశస్సు, సంతాన ప్రాప్తి కలుగుతాయని అన్నాడు.

ధర్మరాజు శ్రీకృష్ణునితో ఈ అనంత పద్మనాభ వ్రతము ఎలా ఆచరించాలి? వ్రతఫలము ఏమిటి? పూర్వము ఎవరెవరు ఈ వ్రతాన్ని ఆచరించారు? తెలుపమని కోరగా ఆ శ్రీకృష్ణుడు ఇలా చెప్పసాగాడు.

కృతయుగంలో సుమంతుడు అనే సద్బ్రాహ్మణుడు ఉండేవాడు. అతని భార్య దీక్షాదేవి భృగు మహర్షి పుత్రిక. వారికి శీల అనే కుమార్తె జన్మించినది. అయితే కుమార్తె జననము తరువాత దీక్షాదేవి మరణించినది. సుమంతుడు వైదిక కర్మలను, విధులను నిర్వహించేందుకు అర్హతను పొందటానికి కర్కశ అనే కన్యను పునర్వివాహమాడాడు. ఆమె కఠిన హృదయురాలు, గయ్యాళి. సుమంతుని పుత్రిక శీల పెరిగి, పెద్దదవుతూ జ్ఞాన బుద్ధులతో దైవ భక్తి పరాయణురాలై శ్రీహరిని నిష్ఠతో కొలుస్తూ ఉండేది. ఒకసారి కౌండిన్య మహాముని దేశాటన చేస్తూ, సుమంతుని గృహానికి వెళ్ళాడు. అక్కడ శీలాదేవిని వివాహమాడాడు. కొద్ధి రోజుల పాటు అక్కడే ఉన్న తరువాత కౌండిన్యుడు భార్యా సమేతంగా స్వగృహానికి బయలుదేరాడు. అత్తగారింటికి వెళ్లే కుమార్తెకు ఏదైనా బహుమానం ఇవ్వాలని సుమంతుడు భార్యను కోరగా, ఆవిడ ఇంట్లో ఏమీ లేవు అన్నది.

ఆయన విధి లేక పెళ్ళిలో మిగిలిన సత్తుపిండిని మూటగట్టి కుమార్తెకు ఇచ్చి సాగనంపాడు. మార్గ మధ్యములో కౌండిన్యుడు సంధ్యావందనం కోసం నదికి వెళ్ళాడు. ఆరోజు అనంత పద్మనాభ చతుర్దశి. ఒక చోట స్త్రీలు ఎర్రని చీరలు కట్టుకుని పద్మనాభ స్వామిని కొలుస్తూ ఉండగా, శీలాదేవి వారివద్దకు వెళ్లి వివరాలు అడిగింది. అప్పుడు ఆ స్త్రీలు, తాము అనంత పద్మనాభ వ్రతము ఆచరిస్తున్నామని, దీనివలన విలువ కట్టలేనంత ఫలము కలుగుతుందని తెలిపారు. అప్పుడు శీలాదేవి దీనిని ఎప్పుడు, ఎలా ఆచరించాలి అని ప్రశ్నించగా వారు దీనిని భాద్రపద శుక్ల చతుర్దశినాడు నదీ తీరమునకు వెళ్లి స్నానము చేసి, ఒక ప్రదేశాన్ని ఎన్నుకుని అలికి, తామర పుష్పము వంటి మండపము నిర్మించాలి. మండపాన్ని ముగ్గులతో మరియు తోరణములతో అలంకరించి, వేదికపైన దక్షిణం వైపున కలశమును ప్రతిష్టించి, వేదిక నడుమ దర్భతో తీర్చి,

కృత్వా దర్భమయం దేవం శ్వేతదీపే స్థిరం హరిమ్|
సమన్వితం సప్తఫణైః పింగళాక్షం చతుర్భుజం||

అనే శ్లోకాన్ని పఠించి, దేవునికి ప్రదక్షిణ నమస్కారాలు చేసి, పదునాలుగు ముడులు కలిగిన పసుపు కుంకుమలతో తడిసిన దారాన్ని స్వామి ముంగిట ఉంచి, 28 అరిసెలు స్వామికి నైవేద్యంగా పెట్టి, స్వామి ముందు ఉంచిన దారాన్ని చేతికి కట్టుకుని వ్రతమాచరించాలి. వ్రత సామగ్రిని సాధ్యమైనంత వరకు 14 సంఖ్యలో ఉంచాలి. అని వారు తెలిపారు.

వారు తెలిపిన వివరాలు విన్న కౌండిన్య మహర్షి సతీమణి శీలాదేవి, వెంటనే నదికి వెళ్లి స్నానం చేసి, వ్రత దారమును ధరించి స్త్రీల సహాయముతో వ్రతమాచరించినది. తండ్రి ఇచ్చిన సత్తు పిండిని బ్రాహ్మణులకు వాయనంగా సమర్పించింది. ఆ తరువాత తన భర్త వెంట ఆశ్రమానికి చేరుకుంది. వ్రత ప్రభావము వలన ఆశ్రమము ధన ధాన్యాలతో తులతూగింది. ఆ దంపతులు సుఖ సంతోషాలతో ప్రతి సంవత్సరం నియమం తప్పక అనంత పద్మనాభ వ్రతమాచరించేవారు. అయితే కౌండిన్యుడు, ఒక రోజు శీలాదేవి ధరించిన నోము దారాన్ని చూసి ఇది ఎప్పుడు కట్టుకున్నావు? ఎవరినైనా వశపరుచుకోవటానికా? అని దూషించాడు. అప్పుడు ఆమె ఇది అనంత పద్మనాభ స్వామి వ్రతం సందర్భంగా కట్టుకున్న దారము. ఆ స్వామి దయ వలననే మనకు సిరి సంపదలు కలిగాయి అని అనగా, కౌండిన్యుడు అనంతుడు ఎవరూ అంటూ దూషించి, ఆ దారాన్ని తెంచి అక్కడ మండుతున్న అగ్నిలో వేసాడు. దీనివలన ఆ స్వామికి ఆగ్రహం కలిగి, కొంత కాలములోనే అతని సంపద హరించిపోయింది. అతని ఇల్లు అగ్నికి ఆహుతి అయి అడవులపాలయ్యాడు.

అప్పుడు కౌండిన్యునికి స్వామి జ్ఞాపకం వచ్చి, ఆ దేవుణ్ణి చూడాలని తిరగసాగాడు. అలా తిరుగుతూ కాయలు, ఆకులతో సమృద్ధిగా ఉన్న మామిడి చెట్టును చూసి, దానిపై ఒక్క పక్షి కూడా లేకపోవటంతో ఆశ్చర్యం చెంది ఆ చెట్టుతో ఓ వృక్షమా! అనంత పద్మనాభుని చూసావా? అని అడుగగా, దానికి ఆ చెట్టు నేను చూడలేదు అని అన్నది. అలాగే పచ్చగడ్డిలో ఊరికే నిలుచుని ఉన్న దూడను అడిగాడు. ఒక ఆవును, ఒక ఎద్దును, పుష్కలంగా నీటితో నిండిన రెండు సరస్సులనూ, ఒక గాడిదనూ మరియు ఒక ఏనుగునూ మీరు అనంత పద్మనాభుని చూసారా? అని ప్రశ్నించగా అవి మాకు తెలియదు అని సమాధానమిచ్చాయి. మతిభ్రమించిన వాడివలే అలా తిరిగి అలసిపోయిన కౌండిన్యుడు ఒక చోట సొమ్మసిల్లి పడిపోయాడు. అప్పుడు దయాళువు అయిన స్వామికి భక్తునిపై కృప కలిగి, వృద్ధ బ్రాహ్మణుని రూపములో వచ్చి అతనిని లేపి, చేయి పట్టుకుని ఒక ఆశ్రమానికి తీసుకెళ్లాడు. ఆ ఆశ్రమం నవరత్న ఖచితమై, ధన ధాన్యాలతో తులతూగుతూ ఉంది.

అక్కడ శ్రీహరి శంఖ, చక్ర, గదాదారియై, ఆ కౌండిన్యునికి అనంత పద్మనాభ స్వరూపముతో దర్శనమిచ్చాడు. అప్పుడు కౌండిన్యుడు సంతోషంతో శ్రీహరిని వేనోళ్ళ స్తుతించాడు. అప్పుడు ఆ స్వామి తృప్తి చెంది ఓ బ్రాహ్మణోత్తమా! నీ భక్తికి మెచ్చి నీకు శాశ్వత వైకుంఠప్రాప్తిని కలిగిస్తున్నాను అని దీవించాడు. అప్పుడు కౌండిన్యుడు అడవిలో తాను చూసిన మామిడి చెట్టు ఆవు, ఎద్దు, సరస్సులు, గాడిద, ఏనుగులను గురించి ప్రశ్నించగా దానికి ఆ శ్రీహరి ఆ మామిడి చెట్టు పూర్వం ఒక విద్యావంతుడైన బ్రాహ్మణుడు, ఎవ్వరికీ విద్యను బోధించనందువలన ఇప్పుడు ఎవరికీ ఉపయోగం లేని చెట్టుగానూ, దానధర్మాలు చేయని ధనవంతుడు గడ్డిని సరిగ్గా తినలేని ఆవుగానూ, ఉపయోగంలేని భూములను దానం చేసిన రాజు వృషభంగానూ, సాటి వారిని సదా దూషించే వ్యక్తి గాడిదగానూ, పూర్వీకులను విస్మరించిన వ్యక్తి ఏనుగు రూపంలోనూ జన్మించారు.

అలాగే ఆ రెండు సరస్సులలో ఒకటి ధర్మం మరొకటి అధర్మం అని వివరించాడు. అలాగే 14 సంవత్సరములపాటు వ్రతమాచరించవలసిందిగా శ్రీహరి అతనిని ఆదేశించి అంతర్ధానమయ్యాడు.

వరము పొందిన కౌండిన్యుడు ఆశ్రమం చేరి, తన భార్యకు జరిగిన విషయాన్ని వివరించి, పదునాలుగు సంవత్సరముల పాటు అనంత పద్మనాభ వ్రతాన్ని ఆచరించి భార్యా సమేతుడై వైకుంఠాన్ని చేరాడు. ఆ మహావిష్ణువు అతనికి ఒక నక్షత్ర స్థానాన్ని కల్పించాడు. అగస్త్యుడు కూడా ఈ వ్రతాన్ని ఆచరించి జగత్ ప్రసిద్ధుడయ్యాడు. అలాగే సగర, దిలీప, హరిశ్చంద్ర, భరత మరియు జనక మహారాజులు ఈ వ్రతాన్ని ఆచరించి స్వర్గ సౌఖ్యాలు పొందారని శ్రీకృష్ణుడు ధర్మరాజుకు వివరించినట్లుగా, సూత మహర్షి శౌనకాది మునీంద్రులకు తెలిపాడు.

Ashtalakshmi Temple, Kothapet, Hyderabad, Telangana - అష్టలక్ష్మీ దేవాలయం, కొత్తపేట, హైదరాబాద్, తెలంగాణ

అష్టలక్ష్మీ దేవాలయం, కొత్తపేట, హైదరాబాద్, తెలంగాణ

శ్రీ అష్టలక్ష్మి దేవాలయం హైదరాబాద్లోని వాసవీ కాలనీలో అష్టలక్ష్మి దేవికి సంబంధించిన ప్రసిద్ధ హిందూ దేవాలయం.

ఈ ఆలయం తెలంగాణ రాజధాని హైదరాబాద్లోని దిల్సుఖ్ నగర్, కొత్తపేట మరియు ఎల్బి నగర్ ప్రాంతాలకు సమీపంలో ఉంది.

అష్టలక్ష్మి దేవత, అష్ట లక్ష్మి అని కూడా పిలుస్తారు, ఇది ఎనిమిది లక్ష్మిల సమూహం. అష్ట "ఎనిమిది"ని సూచిస్తుంది మరియు లక్ష్మి "సంపద యొక్క దేవత"ని సూచిస్తుంది.

ఆరోగ్యం, శక్తి, కీర్తి, జ్ఞానం, విజయం, సంతానం, బలం, శ్రేయస్సు మరియు మరెన్నో అనేక రకాల సంపదలకు మూలం లక్ష్మీ దేవి.

అష్ట లక్ష్మి - ఈ ఆలయంలో ఉన్న లక్ష్మీ తల్లి యొక్క ఎనిమిది రూపాలు:
1. శ్రీ ఆది లక్ష్మి
2. శ్రీ ఐశ్వర్య లక్ష్మి
3. శ్రీ సంతాన లక్ష్మి
4. శ్రీ ధన లక్ష్మి
5. శ్రీ ధాన్యలక్ష్మి
6. శ్రీ గజ లక్ష్మి
7. శ్రీ విజయ లక్ష్మి
8. శ్రీ వర లక్ష్మి

యాత్రికులందరూ సందర్శించదగిన ఆహ్లాదకరమైన మరియు ప్రశాంతమైన దేవాలయాలలో ఇది ఒకటి.

అష్టలక్ష్మి ఆలయాన్ని రాత్రిపూట దేదీప్యమానంగా చూడటం భక్తులకు ఒక మంత్రముగ్ధమైన అనుభూతిని కలిగిస్తుంది మరియు ఆలయం దూరం నుండి పాలరాతి రాతితో చేసిన అనుభూతిని కలిగిస్తుంది.

ఆలయ చరిత్ర మరియు ఆకర్షణలు:
కంచి కామకోటి పీఠానికి చెందిన శ్రీ జయేంద్ర సరస్వతి స్వామీజీ మార్గదర్శకత్వంతో ప్రతిష్ఠించారు.

సుమారు 2 కోట్ల రూపాయల వ్యయంతో ఈ అద్భుతమైన ఆలయాన్ని నిర్మించడానికి దాదాపు 5 సంవత్సరాలు పట్టింది. ఈ ఆలయానికి అనేక వర్గాల ప్రజలు విరాళాలు ఇచ్చేందుకు ముందుకు వచ్చారు.

శ్రీమన్నారాయణుడు, గణేశుడు, అష్టలక్ష్మి విగ్రహాలు, విష్ణువు వాహకుడైన గరుడ విగ్రహాలను రూపొందించారు.

వాసవీ కాలనీలోని అష్టలక్ష్మి ఆలయానికి ప్రతిరోజూ చాలా మంది సందర్శకులు వస్తుంటారు, అయితే వార్షిక బ్రహ్మోత్సవం కాలంలో మరియు దుర్గాపూజ లేదా నవరాత్రి (సెప్టెంబర్-అక్టోబర్), వరలక్ష్మీ వ్రతం (జూలై-ఆగస్టు) వంటి పండుగలో మరియు శుభ సందర్భంలో అత్యధిక సంఖ్యలో భక్తులు వస్తారు.

అష్టలక్ష్మి ఆలయానికి ఎలా చేరుకోవాలి:
అష్టలక్ష్మి దేవాలయాలు వాసవి కాలనీలో ఉన్నాయి మరియు NH9లో కొత్తపేటకు చాలా దగ్గరగా ఉన్నాయి.

దర్శన వేళలు:
ఉదయం: ఉదయం 6:00 గంటల నుండి మధ్యాహ్నం 12:00 గంటల వరకు.
సాయంత్రం: సాయంత్రం 5:00 గంటల నుండి రాత్రి 9:00 గంటల వరకు.

రోడ్డు మార్గం:
ఈ ఆలయం రోడ్డు నెట్వర్క్ ద్వారా బాగా అనుసంధానించబడి ఉంది. ఈ మార్గంలో సిటీ బస్సులు, ప్రైవేట్ టాక్సీలు మరియు ఆటో రిక్షాలు నిత్యం తిరుగుతాయి.

రైలు మార్గం:
9 కి.మీ దూరంలో, హైదరాబాద్ దక్కన్ రైల్వే స్టేషన్ (HYD) అష్టలక్ష్మి ఆలయానికి చేరుకోవడానికి సమీప రైల్వే స్టేషన్.
అలాగే, సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ (SC) ఆలయం నుండి సుమారు 9 కి.మీ దూరంలో ఉంది.

విమాన మార్గం:
శంషాబాద్లో ఉన్న రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం దాదాపు 28 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఆలయానికి చేరుకోవడానికి సమీప విమానాశ్రయం.


మన దేవాలయాలు చారిత్రక నగరాలూ

నిత్య స్తోత్రావళి

నిత్య పారాయణ శ్లోకాలు

స్తోత్రాలు

పంచాంగం

Virupaksha Temple, Hampi, Vijayanagara District, Karnataka - విరూపాక్ష దేవాలయం, హంపి, విజయనగర జిల్లా, కర్ణాటక

విరూపాక్ష దేవాలయం, హంపి, విజయనగర జిల్లా, కర్ణాటక

విరూపాక్ష దేవాలయం భారతదేశంలోని కర్ణాటకలోని విజయనగర జిల్లాలో హంపిలో ఉంది. ఇది యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశంగా గుర్తించబడిన హంపిలోని మాన్యుమెంట్స్ సమూహంలో భాగం. విరూపాక్ష అనగా శివుని రూపం.

హంపి, విజయనగర సామ్రాజ్య రాజధాని, తుంగభద్ర నది (పంపా రంధ్రం/పంపా నది) ఒడ్డున ఉంది. విరూపాక్ష దేవాలయం హంపిలోని ప్రధాన తీర్థయాత్ర (తీర్థయాత్ర) మరియు శతాబ్దాలుగా అత్యంత పవిత్రమైన అభయారణ్యంగా పరిగణించబడుతుంది.

చరిత్ర

ఆలయ చరిత్ర సుమారు 7వ శతాబ్దం నుండి నిరంతరాయంగా ఉంది. విజయనగర రాజధాని ఇక్కడ ఉండక ముందు విరూపాక్ష-పంపా అభయారణ్యం ఉండేది. శివుడిని సూచించే శాసనాలు 9వ మరియు 10వ శతాబ్దాల నాటివి. చిన్న పుణ్యక్షేత్రంగా ప్రారంభమైన ఈ క్షేత్రం విజయనగర పాలకుల హయాంలో పెద్ద సముదాయంగా మారింది. చాలా ఆలయ భవనాలు విజయనగర కాలం నాటివని చెప్పబడినప్పటికీ, చాళుక్యుల చివరి మరియు హోయసల కాలంలో ఆలయానికి చేర్పులు చేసినట్లు ఆధారాలు సూచిస్తున్నాయి.

విరూపాక్షలోని పెయింటింగ్లు పద్నాలుగు మరియు పదహారవ శతాబ్దానికి చెందినవి. శతాబ్దాలుగా అక్కడ పూజలు కొనసాగుతూనే ఉన్నాయి. ఈ ఆలయం ఇప్పటి వరకు హంపిలో బాగా సంరక్షించబడిన మరియు నిర్వహించబడుతున్న ఏకైక ఆలయం ఇక్కడ ఉన్న ఇతర అనేక దేవాలయాలు ఉన్నాయి.

హంపి వీధికి పశ్చిమ చివర విరూపాక్ష దేవాలయం ఉంది. 50 మీటర్ల ఎత్తు ఉన్న తూర్పు గాలి గోపురం విరూపాక్ష దేవాలయం లోనికి స్వాగతం పలుకుతుంది.దేవాలయంలో ప్రధాన దైవం విరూపాక్షుడు (శివుడు). ప్రధాన దైవానికి అనుసంధానంగా పంపాదేవి గుడి, భువనేశ్వరీ దేవి గుడి ఉంటుంది. ఈ దేవాలయానికి 7 వ శతాబ్దం నుండి నిర్విఘ్నమైన చరిత్ర ఉంది. విరూపాక్ష-పంపా ఆలయం విజయనగర సామ్రాజ్యం కంటే ముందు నుండి ఉన్నదని శిలాశాసనాలు చెబుతున్నాయి. 10-12 శతాబ్దానికి చెందినవి అయి ఉండవచ్చని చరిత్రకారుల అంచనా. చరిత్ర ఆధారాల ప్రకారం ప్రధాన దేవాలయానికి చాళుక్యుల, హోయ్సళ పరిపాలన మార్పులు చేర్పుల జరిగాయని అయితే ప్రధాన ఆలయం మాత్రం విజయనగ రాజు లే నిర్మించారని అంటారు. విజయనగర రాజులు పతనమయ్యాక, దండయాత్రల వల్ల 16 వ శతాబ్ధానికి హంపి నగరం లోని అత్యద్భుత శిల్ప సౌందర్యం నాశమైపోయింది. విరూపాక్ష-పంపా ప్రాకారం మాత్రం 1565 దండయాత్రల బారిన పడలేదు.విరూపాక్ష దేవాలయంలో దేవునికి ధూప,దీప నైవేద్యాలు నిర్విఘ్నంగా కొనసాగాయి. 19 వ శతాబ్దం మొదలులో ఈ ఆలయం పైకప్పు పై చిత్రాల కు, తూర్పు, ఉత్తర గోపురాలకు జీర్ణోద్ధరణ జరిగింది.

ఈ దేవాలయానికి 3 ప్రాకారాలు ఉన్నాయి. 9 ఖానాలతో 50 మీటర్ల ఎత్తు ఉన్న తూర్పు గోపురములోని రెండు ఖానాలు రాతితో నిర్మించబడ్డాయి. మిగతా 7 ఖానాలు ఇటుకలతో నిర్మించబడ్డాయి. ఈ తూర్పు గోపురం నుండి లోపలికి ప్రవేశిస్తే బయటి నుండి ఆలయంలోకి వెళ్ళే మొదటి ప్రాకారం స్తంభాలు లేకుండా ఆకాశం కనిపించేటట్లు ఉంటుంది. ఈ ప్రాకారాన్ని దాటి లోపలికి వెళ్తే స్తంభాలతో కూడి కప్పబడిన వసారా ఉంటుంది. స్తంభాలతో కూడి ఉన్న వసారాలో చిన్న చిన్న దేవాలయాలు ఉంటాయి.దీనిని కూడా దాటి లోపలి ప్రాకారంలోకి వెళ్ళితే గర్భ గుడి వస్తుంది.

తుంగభద్ర నది నుండి ఒక చిన్న నీటి ప్రవాహం ఆలయంలోకి ప్రవేశించి గుడి వంట గదికి నీరు అందించి బయటి ప్రాకారం ద్వారా బయటకు వెడుతుంది. ఈ ఆలయ అభివృద్ధిలో శ్రీ కృష్ణదేవరాయల పాత్ర ఎంతో ఉన్నదని లోపలి ప్రాకారం ఉన్న స్తంభాల వసారాలోని శిలాశాసనాలు చెబుతున్నాయి. ఈ లోపలి ప్రాకారంలోని స్తంభాల వసారాని 1510 సంవత్సరములో కృష్ణదేవరాయలు కట్టించాడని కూడా శిలాశాసనాలు చెబుతున్నాయి. విరూపాక్ష దేవాలయంలోని బయటి ప్రాకారంలో ఏకశిలలో చెక్క బడిన నంది ఒక కి.మీ. దూరం వరకు కనిపిస్తుంది.

ఆలయ విశేషాలు:
ఈ ఆలయం చాల పురాతనమైనందున, దీనిని వీరు చాల పవిత్రంగా భావించేవారు యాత్రికులు ఎక్కువగా వస్తూ ఉండేవారు. ఈ ఆలయ ప్రధాన ద్వారం పైన అందమైన చెట్టు ఉంది.చుట్టూ స్త్రీ, పురుషుల చిత్రాలతో ఉండేది. ఈ ద్వారం పై అతి ఎత్తైన గోపురం ఉంది. అందులో మనుషుల ఆడ, మగ చిత్రాలు ఉన్నాయి. ఈ గోపురం క్రింద నుండి పైకి పోను పోను సన్నగా ఉంది. ద్వారం లోనుండి లోపలికి వెళ్ళగానే, విశాలమైన ఆవరణ ఉండగా అందులో మరొక ప్రవేశ ద్వారం ఉంది. ఇది మొదటి దాని లాగే ఉన్నది కాని చిన్నది. దీని లోపలికి వెళ్ళ గానే మరొక అవరణ ఉంది. అందులో ఒక కట్టడం వరండాలతో చుట్టు స్తంభాలతో ఉంది. దీనికి మధ్యలో గర్భ గుడి ఉంది. ఈ గర్భ గుడి ముందు నాలుగు స్తంభాలున్నాయి. అందులో రెండు బంగారు పూతతోను, రెండు రాగి రేకు తాపడం తోను ఉన్నాయి. ఈ గుడి చాల పురాతనమైనది. అందువల స్తంభాలపై నున్న బంగారు పూత కొంత వెలిసి పోయి లోపలున్న రాగి రేకు కనిపిస్తున్నది. అంటే ఆ నాలుగు స్తంభాలు రాగివే నన్న మాట. దేవుని కెదురుగా ఉన్న స్తంభాలను ప్రస్తుతం రాజ్య మేలుతున్న రాజు శ్రీకృష్ణ దేవ రాయలు ఇవ్వగా, మిగతావి అతని పూర్వీకులు ఇచ్చారు. ద్వారానికి ముందు పై కప్పు వరకు, రాగితో తాపడం చేయబడి ఉంది. పైకప్పులో పులి లాంటి జంతువుల బొమ్మలు,చిత్రించ బడి ఉన్నాయి. విగ్రహం ముందున్న స్తంభాలలో రంద్రాలున్నాయి. వాటిలో రాత్రులందు నూనె దీపాలు పెడతారు. దీని తర్వాత ఒక చిన్న భూగర్భ గది లాగ ఒకటున్నది. అందులో ఒక విగ్రహం నిలబడి ఉంది. దీనికన్న ముందు మూడు తలుపులున్నాయి. ఇదంతా చీకటిగా ఉంది. ఇక్కడ ఎప్పుడూ దీపం వెలుగుతూనే ఉంటుంది. ఇక్కడున్న ద్వారపాలకులు పూజారిని తప్ప వేరెవ్వరిని లోనికి వెళ్లనివ్వరు. నేను వారికి కొంత ధనమిచ్చి నందున వారు నన్ను లోపలికి పోనిచ్చారు. ఈ రెండు ద్వారాల మధ్య రెండు చిన్న విగ్రహాలున్నాయి. ఇందులోని ప్రధాన విగ్రహం ఏ అకారము లేని గుండ్రటి రాయి మాత్రమే. దీనికి వీరు చాల భక్తితో పూజ చేస్తారు. ఈ ఆలయం వెలుపలి భాగమంతా రాగితో తాపడం చేయబడి ఉంది. గుడి వెనక వైపున వరండాకు దగ్గిరగా తెల్లని చలువ రాతి విగ్రహం ఉంది. దానికి ఆరు చేతులు ఉన్నాయి. ఒక చేతిలో, ఇంకో చేతిలో కత్తి మిగతా చేతులలో ఏవో పవిత్రమైన వస్తువులు ఉన్నాయి. దాని పాదాల క్రింద ఒక బర్రె, ఇంకొక వింత జంతువు ఉన్నాయి. ఈ వింత జంతువు బర్రెను చంపడానికి సహాయం చేస్తున్నట్లున్నది. గుడిలో నిత్యం నేతి దీపాలు వెలుగుతుంటాయి. ఈ చుట్టు ప్రక్కల ఇతర చిన్న ఆలయాలున్నాయి. ఇవి కూడా అన్ని ఆలయాల లాగే ఉన్నాయి కాని ఇది ప్రధానమైనది, పురాతన మైనది.

ఈ ఆలయాలకు చాల భూములు, తోటలు ఉన్నాయి. వాటిలో బ్రాహ్మణులు, తాము ఆ పొలాలలో తినడానికి కూరగాయలు, ఇతర పంటలు పండించు కుంటారు. ప్రత్యేక ఉత్సవాల సందర్భాలలో చక్రాలున్న రథాన్ని గుడి ముందున్న వీధిలో లాగుతారు. ఇటువంటి ఉత్సవ సందర్భం నేను ఈ నగరంలో ఉండగా రాలేదు కనుక నేను చూడలేక పోయాను. ఈ నగరంలో ఇంకా చాల ముఖ్యమైన ఆలయాలున్నాయి. వాటినన్నింటి గురించి వ్రాయాలంటే చాల ఎక్కువ అవుతుంది." అన్నాడు.

తూర్పు ముఖంగా ఉన్న ఈ విరూపాక్షాలయం ప్రధాన రాజ గోపురం పదకొండంతస్తులు కలిగి చాలా ఎత్తుగా ఉంది. ఈ ఆలయం విజయ నగర నిర్మాణాని కన్న ముందే నిర్మితమైనది. రాజగోపురము పై స్త్రీ పురుషుల, జంతువుల, శిల్పాలు చాలా ఉన్నాయి. గోపురం ద్వారం లోపల ఒక ప్రక్క ఒక చిన్న నంది, ఇంకొక ప్రక్క మూడు తలల నంది ఉన్నాయి. ఇక్కడ పెద్ద ఆవరణ ఉంది. ఇక్కడే ఆలయ కార్యాలయం, ప్రక్కన యాత్రికులకు విశ్రాంతి గదులు ఉన్నాయి. ఆవరణ మధ్యలో ఒక నీటి కాలువ ఉంది. ఇది ఆ ప్రక్కనున్న హేమ కూటము నుండి ప్రవహిస్తున్నది. ఇందులో ఎల్ల వేళలలో నీరుండును. ఆవరణ లోపల ఫొటోలు తీయదలిస్తే మామూలు కెమెరాకి 50 రూపాయలు, వీడియో కెమెరాకి 500, రూపాయలు కట్టాలి. ఈ ఆవరణకు ఎదురుగా మరో గోపురమున్నది.

ఈ రెండో గోపురం మొదటి దానికన్న చిన్నది. దీనిని శ్రీ కృష్ణ దేవరాయలు కట్టించి నందున దీనికి రాయల గోపురం అని పేరు. ఈ గోపుర ద్వారంలో ఒక శిలా శాసనం పలక ఉంది. ఈ ద్వారం తర్వాత ఉన్నదే రెండో ఆవరణ. ఇందులో మధ్యన ముఖ మంటపం, దాని తర్వాత గర్భ గుడి ఉన్నాయి. గర్భ గుడి చుట్టు ఉన్న వరండాలలో ఇతర దేవతా ఉప ఆలయాలు ఉన్నాయి. అవి పాతాళేశ్వర, ముక్తి నరసింహ, శ్రీ వేంకటేశ్వర, మహిషాసుర మర్దని వంటి దేవతా మూర్తులు ఉన్నాయి. విరుపాక్ష స్వామి వారికి పంపాపతి అని నామము కూడా ఉంది. పూర్వం పంపానదిగా పిలువ బడినదే ఈ నాటి తుంగభద్రా నది. ఈ ఆలయంలో త్రికాల పూజలు జరుగుతాయి. ఈ ఆవరణలో దీప స్తంభం, ధ్వజ స్తంభం, నాలుగు కాళ్ల మంటపం, ఆ మంటపం ఉన్నాయి నాలుగు కాళ్ల మంటపంలో, మూడు నందులు ఉన్నాయి. తర్వాత ముఖ మంటపం ఉంది. ముఖ మంటపం లోనికి ఎక్కే మెట్ల ప్రక్కన ఒక శిలా శాసనం పురాతన తెలుగులో రెండు వైపులా చెక్కి ఉంది. ముఖ మంటపం అనేక స్తంభాలతో, వాటి పై సుందర శిల్పాలతో ఉంది. పై కప్పుకు సున్నంతో తాపడం చేసి అందు రంగులతో పులి లాంటి వింత జంతువుల చిత్రాలు చిత్రించి ఉన్నాయి. కాలగమనంలో చిత్రాలు చాల వరకు వెలసి పోయినా ఇంకా కొంత మిగిలి ఉన్నాయి. వీటి గురించే ఆ నాడు డొమింగో పీస్ చెప్పినది. ముఖ మండపంలోనుండి గర్భగుడి లోనికి దారి లేదు. ఉగ్ర రూపుడైన స్వామి వారికి ఎదురుగా వెళ్ల కూడదనే నియమాన్ని అనుసరించి, స్వామి దర్శనానికి భక్తులు వెళ్లడానికి గర్భగుడికి ఇరువైపులా మెట్ల దారి ఉంది. గర్భాలయానికి ఇరువైపులా రెండు సొరుగులు ఉన్నాయి. అందులో స్వామి వారి ఉత్సవ విగ్రహాలు ఉన్నాయి. గర్భాలయం ముందు నాలుగు అందమైన నల్ల రాతి స్తంభాలతో మండపం ఉంది. ఈ స్తంభాలలో మనోహరమైన శిల్పకళ ఉంది. వీటిని గురించే ఆనాడు "డొమింగో పీస్" చెప్పినది. అందులో స్వామి వారి వాహనాలైన గుర్రం, నెమలి, ఏనుగు వంటి వాహనాలు ఉన్నాయి. గర్భ గుడికి కుడి ప్రక్కన కొంత ఎత్తులో స్వామి వారి బంగారు రత్న ఖచిత కిరీటం యొక్క చిత్ర పటం ఉంది. అసలు కిరీటాన్ని శ్రీ కృష్ణ దేవరాయలు చేయించాడు. ఆ కిరీటం ప్రభుత్వ ఖజానాలో భద్ర పరచ బడి ఉంది. ఉత్సవాల సందర్భాలలో దాన్ని స్వామివారికి ధరింప జేస్తారు.

గర్భాబాలయానికి వెనుక, బయటకు వెళ్లడానికి మెట్లదారి ఉంది. అక్కడ పది మెట్లు ఎక్కగానే, కుడి వైపు ఒక చీకటి గది ఉంది. ఆ గదికి తూర్పు వైపున 7 అడుగుల ఎత్తులో ఒక రంధ్రం ఉంది. అందులో నుండి వెలుతురు వచ్చి ఎదురుగా ఉన్న గోడ పై పడి బయట ఉన్న రాజ గోపురం నీడ తల క్రిందులుగా చాల స్పష్టంగా కనబడుతుంది. దాని కెదురుగా ఒక తెల్లని గుడ్డ అడ్డం పెడితే దాని మీద కూడా ఆ గోపురం ప్రతి బింబం కనబడుతుంది. "పిన్ పాయింట్ కెమెరా కటకం (లెన్స్) "

అన్న సూత్రము ద్వారా ఈ యొక్క తలకిందులైన ప్రతిబింబము మనకు కనిపిస్తుంది. మధ్యాహ్న కాలము, సాయంత్రం కాలం సూర్యకాంతి అధికంగా ఉన్న సమయంలో గోపురం యొక్క తలకిందులైన రంగుఛాయాచిత్రము కూడా కనిపించును. దీన్ని చాల వింతగా చూస్తుంటారు. ఆ వస్తున్నది సూర్య కిరణాలు కాదు, కేవలం వెలుగు మాత్రమే. ఈ వింత బయట వెలుగు ఉన్నంత సేపు ఉంటుంది. ఇది తప్పక చూడాల్సిందే.

సందర్శన వేళలు: ఉదయం 6:00 గంటల నుండి సాయంత్రం 6:00 గంటల వరకు.

హంపిలోని విరూపాక్ష దేవాలయానికి చేరుకోవడానికి రైలు, రోడ్డు, మరియు విమాన మార్గాల ద్వారా మెరుగైన రవాణా సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయి.

హంపి సందర్శించడానికి అక్టోబర్ నుండి మార్చి వరకు అత్యంత అనుకూలమైన సమయం. (గరిష్ఠంగా 32°C, కనిష్ఠంగా 20°C). ఈ సమయంలో తుంగభద్ర నదిలో ప్రయాణించడానికి మరియు చారిత్రక కట్టడాలను కాలినడకన అన్వేషించడానికి వాతావరణం చాలా బాగుంటుంది.

రవాణా సౌకర్యం:

రోడ్డు మార్గం: కర్ణాటకలోని అన్ని ప్రధాన నగరాల (బెంగళూరు, మైసూర్, హుబ్లీ) నుండి హోస్పేట్ మరియు హంపికి కేఎస్‌ఆర్‌టీసీ (KSRTC) బస్సులు నడుస్తాయి.

హంపి ప్రధాన బస్ స్టాండ్ నుండి విరూపాక్ష ఆలయం కేవలం 400 మీటర్ల దూరంలో ఉంటుంది, ఇక్కడికి నడుచుకుంటూ సులభంగా చేరుకోవచ్చు.

రైలు మార్గం: హంపికి అత్యంత సమీపంలో ఉన్న రైలు నిలయం హోస్పేట్ (Hosapete). ఇది ఆలయానికి కేవలం 13 కిలోమీటర్ల దూరంలో ఉంది.

హోస్పేట్ రైల్వే స్టేషన్ నుండి ప్రతి 30 నిమిషాలకు హంపికి స్థానిక బస్సులు (చార్జీ ₹15–20) అందుబాటులో ఉంటాయి. స్టేషన్ వెలుపల ఆటోలు, టాక్సీలు కూడా సులభంగా దొరుకుతాయి.

విమాన మార్గం: హంపికి అత్యంత సమీప డొమెస్టిక్ విమానాశ్రయం తోరణగల్లులోని జిందాల్ విజయ్‌నగర్ విమానాశ్రయం. ఇది హంపి నుండి 32 కిలోమీటర్ల దూరంలో ఉంది.

ఈ విమానాశ్రయానికి బెంగళూరు, హైదరాబాద్ నుండి నేరుగా విమాన సర్వీసులు ఉన్నాయి. పెద్ద అంతర్జాతీయ విమానాశ్రయాల ద్వారా రావాలనుకునే వారు హుబ్లీ (160 కి.మీ) లేదా బెంగళూరు (350 కి.మీ) ఎంచుకోవచ్చు.

హంపి లోపల స్థానిక రవాణా:
ఆటో రిక్షాలు: హంపిలోని విరూపాక్ష ఆలయం నుండి ఇతర ప్రముఖ కట్టడాలైన విజయ విఠల ఆలయం (రాతి రథం), అచ్యుతరాయ ఆలయాలకు వెళ్ళడానికి రోజువారీ ప్యాకేజీల కింద ఆటోలను అద్దెకు తీసుకోవచ్చు (సుమారు ₹500 - ₹1000).

సైకిళ్లు / స్కూటర్లు: తక్కువ బడ్జెట్‌లో హంపిని అన్వేషించాలనుకునే వారికి సైకిళ్లు, స్కూటర్లు అద్దెకు దొరుకుతాయి. హోస్పేట్ లేదా హంపి బజార్‌లో రోజువారీ ప్రాతిపదికన (₹400–600/రోజుకు) వీటిని తీసుకోవచ్చు.

బ్యాటరీ వాహనాలు (EVs): కాలుష్య నివారణలో భాగంగా విజయ విఠల ఆలయ పరిసర ప్రాంతాలలో సొంత వాహనాలను అనుమతించరు. అక్కడ పార్కింగ్ స్థలం నుండి ఆలయానికి వెళ్ళడానికి పర్యాటక శాఖ బ్యాటరీ కార్లను/బస్సులను నడుపుతోంది.
 

Why worship Kubera when Goddess Lakshmi is present? - లక్ష్మీదేవి ఉండగా, కుబేరుడిని ఎందుకు పూజించాలి?

లక్ష్మీదేవి ఉండగా, కుబేరుడిని ఎందుకు పూజించాలి చాలామంది ఒక సందేహం అడుగుతారు. ధనానికి అధిపతి ఎవరు? లక్ష్మీదేవా... లేక కుబేరుడా? దీనికి సమాధాన...