రమా ఏకాదశి
హిందూ పంచాంగం ప్రకారం, ప్రతి నెలా ఏకాదశి వస్తుంది. అయితే ఆశ్వయుజ మాసం లో క్రిష్ణ పక్షంలో దీపావళికి ముందు వచ్చే ఏకాదశికి ఒక ప్రత్యేకత ఉంది. ఈ ఏకాదశిని రమా ఏకాదశి అంటారు. ఈ పవిత్రమైన రోజున లక్ష్మీదేవిని, విష్ణుమూర్తిని ఆరాధించడం వల్ల డబ్బుకు ఎలాంటి లోటు ఉండదని పండితులు చెబుతున్నారు. అంతేకాదు సకల కష్టాల నుండి విముక్తి పొందుతారు.
రమా ఏకాదశి రోజున 11 గోవులకు మరియు లక్ష్మీ పూజ చేయాలి. ద్వాదశి రోజున శుభ్రమైన పసుపు బట్టను తీసుకుని, అందులో కౌరీలను కట్టి అల్మారాలో ఉంచాలి. ఇలా చేయడం వల్ల ధనానికి లోటు అనేదే ఉండదట. అలాగే లక్ష్మీదేవికి పసుపు రంగులో ఉండే పువ్వులు, భోగం, బట్టలను సమర్పించాలి. ధూప, దీప నైవేద్యాలను సమర్పించి, శ్రీ మహా విష్ణువుని పూజించాలి. మీ సామర్థ్యం మేరకు దాన ధర్మాలు చేయాలి.
వ్యాపారులకు నిరంతరం నష్టం వస్తుంటే రమా ఏకాదశి రోజున శ్రీ మహా విష్ణువును పూజించాలి. పూజా సమయంలో ఒక రూపాయి నాణెం కూడా సమర్పించాలి. ఆ తర్వాత ఎర్రని గుడ్డలో ఆ నాణెన్ని కట్టి, మీరు పని చేసే చోట శుభ్రమైన ప్రదేశంలో ఉంచాలి. ఇలా చేయడం వల్ల మీకు నష్టాల నుండి విముక్తి లభించడమే కాకుండా లాభాలు కూడా వస్తాయని పండితులు చెబుతున్నారు.
రమా ఏకాదశి రోజున ఇంట్లో సంపద, ధాన్యం, శ్రేయస్సు పెరగాలంటే శ్రీ క్రిష్ణుడికి ప్రత్యేక పూజలు చేయాలి.
రమా ఏకాదశి పూజా విధానం:
రమా ఏకాదశి ఉపవాస నియమాలు దశమి రోజు నుండి అంటే ఉపవాసానికి 1 రోజు ముందు నుండి ప్రారంభమవుతాయి.
అంటే రమా ఏకాదశి రోజున ఉపవాసం ఉండేవారు దశమి రోజున సూర్యాస్తమయం తర్వాత ఆహారం తీసుకోలేరు.
రమా ఏకాదశి వ్రతం యొక్క ప్రాముఖ్యత
రమా ఏకాదశి ఉపవాసం యొక్క ప్రాముఖ్యత హిందూ గ్రంధమైన పద్మ పురాణంలో వివరించబడింది. ఆయన ప్రకారం, చింతామణి, కామధేనువు లాగానే రమా ఏకాదశి వ్రతం కూడా ఫలాన్ని ఇస్తుంది.
ఈ వ్రతాన్ని ఆచరించడం వల్ల సకల పాపాలు నశించి సంపూర్ణ ఫలితాలు పొందుతారని విశ్వాసం. ఈ వ్రతం ప్రభావం వల్ల డబ్బుకు లోటు కూడా పోతుందని అంటారు.
న్యూమరాలజీ
జ్యోతిషశాస్త్రము
నిత్య స్తోత్రావళి
నిత్య పారాయణ శ్లోకాలు
స్తోత్రాలు
పంచాంగం
Wednesday, November 4, 2026
Sunday, November 1, 2026
Numerology - Number 9 - న్యూమరాలజీ - 9వ సంఖ్య
న్యూమరాలజీ - 9వ సంఖ్య
గ్రహము: కుజుడు అధిపతి
జన్మదిన తేదీ సంఖ్య: 9, 18, 27
జనవరి నుండి డిసెంబరు నెలలలో ఏ నెలలో నైనాసరే 9, 18, 27 ఈ తేదీలలో పుట్టినవారిని జనన సంఖ్య 9 సంఖ్య గలవారని పిలువబడతారు.
ఇచ్చట చెప్పిన 9, 18, 27 తేదీలలో 9వ తేది 9 సంఖ్యకు చెందిందనే విషయం స్పష్టముగానే తెలియు చున్నది.
18వ సంఖ్యను 1 + 8. అని కూడగా 9 వస్తుంది.
27వ సంఖ్యను 2 + 7 అని కూడితే 9 వస్తుంది.
అందుచేత 9, 18, 27 ఈ తేదీలలో పుట్టినవారు ఎవరైనా సరే, వారందరూ తొమ్మిది సంఖ్య వారని తెలుసుకోవాలి.
దీనితో పాటు 9వ నెంబరు అదృష్ట సంఖ్య లేదా ఫేట్ సంఖ్యగా లేదా డెస్టినీ సంఖ్యగా కలవారు కూడా ఈ 9వ నెంబరు క్రిందకు వస్తారు.
దీనితో పాటు ఒకరి పేరులోని అక్షరాలకున్న విలువల సమష్టి సంఖ్య 9గా కలవారు కూడా ఈ 9వ నెంబరు క్రిందకు వస్తారు.
9వ సంఖ్యకు అధిపతి కుజుడు. వీరు నాయకులుగా ఎదుగుతారు.వీరు విశాల దృక్పథం, బంధువుల, స్నేహితుల పట్ల వాత్సల్యం కలిగి ఉంటారు. వీరు శారీరక, మానసిక పటుత్వం కలిగి దృఢంగా ఉంటారు. భౌతిక సుఖాలపై ఆసక్తి. వీరు పుట్టుకతోనే గొప్ప పోరాటపటిమ కలిగి ఎక్కడైనా సరే నిలదొక్కుకోగల సామర్థ్యం కలిగి ఉంటారు.
9వ సంఖ్య వారి గుణగణాలు:
డెస్టిని సంఖ్య 9 గలవారు పోరాడుటకే జన్మించినవారు. మంచికి ప్రేరక శక్తులుగా, చెడుకు వినాస శక్తులుగా రెండు లక్షణాలు కల వారు ఈ సంఖ్యలో ఉంటారు. అంటే తెలివిగలవారు, అంతగా తెలివి లేనివారు. వీరి జీవితము మొత్తము పోరాటములు నిండినదిగనే ఉండును. వీరిలో తెలివిగలవారు మానసిక పోరాటములే ఎదుర్కొందురు.
అనగా సాహసము, తంత్రము, మోసము, కపటవాక్కు, సంక్షిప్తముగా చెప్పిన మనసులో ఒకటి, బయట ఒకటిగా ఉందురు. అంత తెలివిలేని రెండవ రకమువారు నోటి తగవులతోనే జీవితమును గడుపుతారు. ఆఖరు వర్గము వారు పోరాటమునే జీవితమును చేసికొని సైన్యము మొదలైన వానిలో చేరుదురు. వీరికి మాములు జగడములతో తృప్తి ఉండదు.
రణ రంగములు, జానపదములు, ఊర్లు మంటలకాహుతి అగుట వంటి భీతావహ వాతావరణమే వీరికి ఆహ్లాదము కలిగించును. వీరికి శాంతి, సామరసములపై నమ్మకము ఉండదు. సాధారణముగా వీరిలో అందరికి దేశసేవ చేయవలెనన్న ఉద్దేశ్యము పూర్తిగా ఉండును.
దేశము కొరకు దేనినయిననూ త్యాగము చేసి పోరాడుతారు. ఈ సంఖ్య వారిలో సంకుచిత స్వభావము కలవారు కూడా తమ జాతివారికి మేలు చేకూర్చుటలో కృతనిశ్చితులుగా ఉంటారు. వీరు తమ ఇష్టప్రకారమే పనులు చెయ్యటానికి ఇష్టపడతారు. ఎవరైనా అక్షేపించిన వెంటనే యుద్ధము ప్రకటిస్తారు.
ఇతరుల మాటను వినరు:
డెస్టిని సంఖ్య 9 గలవారు ఇతరుల మాటలను వినరు. తమ మాటలను సభ ఆమోదించాలన్నది వీరి కోరిక. వీరి మాటలకు అడ్డు తగిలితే గొడవలు వస్తాయి. తమ మాటలను వినని వారిని శపిస్తారు. తమ మాటలకు చిత్తం అన్నవారిని చక్కగా చూసుకుంటారు. వారికి అన్ని సాయాలను చేస్తారు. వీరి తప్పులను ఇతరులు ఎత్తి చూపడం ద్వారా వీరిచే ఇతరులు ద్వేషింపబడతారు.
9వ సంఖ్య వారికి ఎప్పుడు అదృష్టం కలుగుతుంది?
డెస్టిని సంఖ్య 9 గలవారికి 28 వ సంవత్సరంలో అదృష్టం కలసి వస్తుంది. వీరు 28 ఏళ్ల వరకు చాలా ఇబ్బందులు కూడా పడే అవకాశం ఉంటుంది. వీరు అనుకున్న రంగంలో రాణిస్తారు. వీరికి ఆ వయస్సులో తిరుగుండదు.
శత్రువుయొక్క బలమును అంచనావేయువారు
వీరిలో తెలివిగలవారు ఎల్లప్పుడూ శత్రువు యొక్క బలమును అంచనా వేస్తూనే ఉంటారు. దాని అనుసరించి నిర్ణయములు తీసు కొనుటచేతనే వీరు గొప్ప రాజతంత్ర ధురీణులుగా పేరు పొందుచున్నారు. వీరు సమయానుగుణంగా ప్రవర్తిస్తారు.
గొడవలలో నష్టం కలిగితే శాంతికి పూనుకుంటారు. చర్చల ఫలితం వీరికి అనుకూలంగా ఉండాలి. లేకపోతే ఎదుటివారు ఎంత పెద్దవారైనా వారిని నిందిస్తారు. వీరు యుద్ధమున లాభమా, సంధివలన లాభమా అనునది తరచిచూచి సరి అయిన నిర్ణ యము తీసుకొంటారు.
ఒంటికాలిపై జపము చేయు కొంగవలె వీరు సందర్భమునకై, సమయము ఆసన్నమగు వరకు ఓపికగా కాచుకుని ఉంటారు. యుద్ధమున ఓడిపోవునట్లనిపించిన వెంటనే శాంతి సమాధానములకు దిగుతారు. శాంతిప్రియులుగా కనపడుతారు. ఒడంబడికలు తమకు సాధకమగునట్లే చేసుకుంటారు.
సంఖ్యాబలమును బట్టి గుణముల నిర్ణయము:
సంఖ్య బలము తగ్గిన పైన చెప్పిన గుణములు ఉండవు. కోపము, అసూయ ఎక్కువగా ఉండును. మొరటుతనము వలన కీడు కలుగును. ఆధిక్యత సరిగా ఉన్నచో పదునైన బుద్ధియు, సర్దుకుపోవు గుణమును కలుగును.
బలష్మ తగ్గినచో చెడు గుణములు, మొండి పట్టుదలయు కనబడును. చిన్న విషయములకు కూడా ప్రాణమును పణముగా పెట్టుదురు. వీరు ఇతరులు మాట్లాడునపుడు మధ్యలో ఆపక పూర్తిగా వింటారు.
వారిని వ్యతిరేకించినను ఓపికగా శతృవును అర్థం చేసుకొనే ప్రయత్నం చేస్తారు. మనసులోనే వారిని పడగొట్టుటకు ప్రణాళికలను రూపొందిస్తూనే ఉంటారు. ఎంత విన్నను తమ మనసులోనిది గుట్టుగానే ఉంచుకుంటారు. సామర్థ్యము కనబడునే గాని దుడుకుతనము ఉండదు.
కాని వీరిలో సామాన్యులు త్వరగా అభిప్రాయములను ప్రకటించుదురు. కోపతాపములను బహిరంగపరచుదరు. వీరిలో మంచి తత్వజ్ఞానులును, విజ్ఞులును సహజముగనే ఉందురు. జన్మసంఖ్య తేదీలలో ఒకటి (జన్మసంఖ్య / విధి సంఖ్య) 9గా ఉన్నను అది మరియొక సంఖ్య యొక్క గుణములను ఎక్కువ చేయును. రెండును 9 యైనచో పేరుయొక్క గుణములను తీవ్రము చేయును.
శత్రువులను బోల్తాకొట్టించువారు:
బుద్ధిమంతులైన వీరు శత్రువును సమయం ఎరిగి బోల్తా కొట్టించ గలరు. శత్రువును ప్రత్యక్షంగా ఎదుర్కోవడం కాక వంచనతో, శాంతి ప్రదర్శించి జయిరు. తన రహస్యాలను ఎవరి వద్ద బయట పెట్టరు. రహస్య రక్షకులు, చురుకుదనం లేనివారుగా కన్పించినా మనసు తేనెటీగ లాగా పరిభ్రమిస్తుంది.
ధైర్యము, పోరాట పటిమ:
వీరికి ఎంతో ధైర్యం, పట్టుదల, శక్తి కలిగియుండి ఎలాంటి కష్ట నష్టాలు అయినా సరే ఎదుర్కుంటారు. వీరికి తరగని ధైర్యము, పోరాడ గలశక్తి ఉందుటతోపాటు, జీవితమునకు కావలసిన వస్తువులను కని పెట్టుటలో ఉత్సాహముండును, వీరికి రసాయనము, వైద్యము వంటి శాస్త్రములందు మిక్కిలి అభిమానము ఉండదును. ప్రావీణ్యము కలుగును.
దైవీక సంబంధములైన రహస్యములను తెలిసికొని వాటి సహాయమున లోకులకు మార్గదర్శకము గావించునది వీరే వీరి వద్ద కొన్ని అపూర్వ 'కక్తులు కనబడును బువంటివారు పాగడ్తలను ఆశింపక జనులకు దూరమునే జీవింతురు.
యుద్ధవీరులు:
డెస్టిని సంఖ్య 9 గలవారు ఇతరుల దుఃఖాన్ని పోగొడతారు. ఛాలెంజ్లను ఎదుర్కొనగలరు. ఇల్లు, కార్యాలయం, మిత్రులు అందరిలోనూ, అన్నిచోట్ల సంస్కరణ ముద్రలు ప్రతిబింబింప చేస్తారు.
అపజయానికి భయపడరు:
వీరి జీవితము చెప్పబడినట్లు పెద్ద పోరాటమే. ఎన్నో ఆపదలు వచ్చి తొలగును. మంచి పనులు చేయునప్పుడు అవి మంచి ఫలితములనే పొందగలరు. వీరు నూతన నాగరికత కోసం పాటుపడే గొప్ప మానవతా విలువలు గల వ్యక్తులుగా ఎదుగుతారు.
వీరు పరోపకార పనులలో ఉత్సాహము చూపెదరు. అనుభవశాలురని పొగడబడుదురు.
డెస్టిని సంఖ్య 9 గలవారి గూర్చి ప్రాచీన గ్రంధములు "తెలివియను దీపమును చేతబట్టుకొని, కాలిక్రింది పామును గమనింపక, నెత్తురు మరకలుగల త్రోవలో, ఒంటరిగా పయనించు అనుభవశాలురు" అని వీరి గురించి చెప్పియున్నవి.
నిదానమును కోల్పోవక ఉండినచో గెలుపు వీరినే వరించును. వీరిలో అనేకులకు ప్రారంభమున జీవితము కష్టములు నిండినదిగా ఉండును. అవజయమునకు ఎన్నడూ భయపడరు. ఎట్టి కష్టమేర్పడినను సహింపగల శక్తి వీరికే కలదు.
స్త్రీలైతే మనోభావాలను పసిగట్టలేము:
డెస్టిని సంఖ్య 9 గలవారు స్త్రీలు అయితే వీరి మనోభావాలను కనుగొనటం చాలా కష్టం. అయినా మొత్తం మీద వీరు సద్గుణాలు, సహనం కలవారుగా రాణిస్తారు.
యౌవనం సమస్యలమయం:
యౌవనంలో సమస్యలమయ జీవితం కలిగి ఉంటారు. అనేక ఇబ్బందులకు లోనవుతారు. యౌవన చరమ దశనుంచి అదృష్టం మొదలై, మధ్య వయస్సుకు ఆ తర్వాత శాస్వతమైన అదృష్టం వీరి వెంటే ఉంటుంది.
నవ్వు ముఖముగలవారు:
తమ కుటుంబాన్ని ప్రేమిస్తూ దానికోసం తమ సర్వస్వాన్ని త్యాగం చేయటానికి కూడా వెనుకాడరు. ఈ సంఖ్య బలము తగ్గినవారు. బలహీనులయి, ఇతరులకు లోబడి నడచుకొనువారు ఆగుచున్నారు. అధిక్యము ఎక్కువగా ఉండిన ఎల్లప్పుడు హుషారుగా ఉంటారు. ఎప్పుడూ నవ్వు ముఖముతోనే కనబడుతారు. పరులకు ఉత్సాహము కలిగేటట్లు ప్రోత్సాహిస్తారు.
వీరు తమ మనసుకు నచ్చినట్లు ఖర్చుకూడ పెడతారు. మంచివారి వద్ద మర్యాదతో నడుచుకొని వారివద్ద మంచివాడన్న పేరుకు పాత్రులవుతారు. మనసుకు వచ్చిన స్నేహితుల కొరకు ఎట్టి సహాయమైనా చేస్తారు. మనసుకు నచ్చిన దోవలలో మరో ఆలోచన లేక ధనమును వెచ్చిస్తారు.
రూపంలో గాంభీర్యం, ఆకర్షణ:
శారీరక ఆరోగ్యాన్ని చక్కగా చూసుకుంటారు. వీరి రూపంలో గాంభీర్యం, ఆకర్షణ ఉంటుంది. తమ శత్రువులను ఎక్కువగా ధిక్కరిస్తారు. భయం లేకుండా గొడవ పడతారు. కుజుడికి పోరాడే గుణం ఉన్నది.
తమ స్వీయ సిద్ధాంతాలను ఎప్పటికి విడచి పెట్టరు. వీరికి ప్రత్యక్షంగా కాక, పరోక్షంగా వ్యతిరేకత, శత్రుత్వాలు ఉంటాయి. వీరి సద్గుణాలను ఇతరులు గ్రహించరు.
యుద్ధ దేవతలో వీరికి ప్రీతి:
వీరికి ప్రశాంతంగా గడపటం కంటే సాహసోపేతమైన పనులు చేయుటకు నిరంతరం ఉవ్విళ్లూరతారు. వీరికి కలలో కనిపించే దైవముల వలన దైవకృప లభించును. వీరి మనసును, యుద్ధదేవతా రూపములే ఎక్కువగా ఆకర్షించును, శ్రీరాముడు, కాళిమాత, సుబ్రహ్మణ్యస్వామి, హనుమంతుడు. దుర్గాదేవి వంటి దేవతలనే వీరు మనసారా పూజిస్తారు. కలగంటారు. వీరికి సమాజంలో గుంపులను తయారుచేసి వాటిని నడపటానికి తగినంత నేర్పుని కలిగివుంటారు.
వృద్ధాప్యంలో ఆధ్యాత్మికమార్గం
సినిమా, నాటకం, పత్రికలూ, రేడియో, టీవి వంటి రంగాల గురించి అవగాహన ఉంటుంది. సులభంగా ఆకర్షించే మాటలు ముఖ లక్షణాలు ఉండడం వలన జన సంబందమైన వేనినైనా చక్కగా నిర్వహించగలరు. ప్రశాంతమైన, ఆనందమయమైన జీవితాన్ని ఆశిస్తారు. వృద్ధా ప్యంలో ఆధ్యాత్మిక మార్గాన్ని ఎన్నుకుంటారు.
9వ సంఖ్య వారి ఆరోగ్యము :
కుజుడు శరీరములో తల, జననేంద్రియములు, కండరములపై అధికారము కలిగియున్నాడు. వీరి శరీరము ఉష్ణమైనదిగనే కనబడును. పోట్టలో అధిక వేడిచే బాధపడతారు.
కొందరికి జ్వరము కూడా వచ్చును. నిప్పువలన గాయములు, ప్రమాదములు కూడా వీరికి సహజమే. మొత్తముమీద డెస్టిని సంఖ్య 9 గలవారికి అప్పుడప్పుడు గాయాలు, దెబ్బలు తగులుతుంటాయి.
ఇది సహజంగా జరిగినా, దైవ ప్రార్థనలమూలముగా ఈ దెబ్బలు మొదలైన వాటిని తగ్గించుకొనవచ్చును.
ఆర్థిక పరిస్థితి :
డెస్టిని సంఖ్య 9 గలవారి ఆర్ధిక పరిస్థితి అంత తృప్తికరంగా ఉండదు. కానీ అవసరానికి కావలసిన ధనం మాత్రం సమకూరుతుంది. ఎక్కువ ఖర్చుపెట్టే స్వభావం వలన ఆర్థికంగా తరచు బాధలు పడతారు.
సహాయము చేయువారు :
9 సంఖ్య వారికి 3, 5, 6, 8, 9 సంఖ్యలవారి సహాయము కలదు. సమిష్టి వ్యాపారములలో 3, 5, 6 తేదీలలో జన్మించిన వారిని మంచి భాగస్వామ్యులుగా తీసుకొనవచ్చును.
కుటుంబ జీవనము :
వీరు ప్రేమ వ్యవహారాలలో సంప్రదాయంగా వస్తున్న నీతి నియమాలకు విరుద్ధంగా ప్రవర్తిస్తారు. అందువలన తమ ప్రతిష్టకు భంగం కూడా కలుగవచ్చు. అయినా వాటిని పట్టించుకోరు.
వీరి కుటుంబ జీవితం అంత ప్రశాంతంగా ఉండదు. వీరికి ఉన్న కోపం కారణంగా దంపతుల మధ్య చెలరేగే తగాదాలు తాత్కాలికంగా అదుపులో ఉంటాయి. 9 తేదీలలో పుట్టినవారు 9 సంఖ్య వారినే వివాహము చేసికొనుట మంచిది.
పాజిటివ్ లక్షణాలు :
డెస్టిని సంఖ్య 9 గలవారికి స్వార్ధం లేకుండా, త్యాగబుద్ధిని పరిపూర్ణత్వాన్ని కలిగి ఉంటారు. వీరు సోమరితనంగా ఉండక ఎల్లపుడు జాగరూకత, చురుకుదనం కలిగి ఉంటారు. నాయకత్వ లక్షణాలు ప్రస్పుటంగా కనిపిస్తాయి. సహనం, క్షమాగుణం, మానవత్వం, జాలి, కరుణ, దయ, కలిగి ఉంటారు.
అందరిని అర్ధం చేసుకునే శక్తి, ద్వేషం, లేకుండా ఉండటం, విశాలమైన ఆలోచనలు, దానగుణం, సేవాభావం, మంచి తనం ఉండటం. అంతరాత్మను నేరుగా భగవంతుని యందు నిలిపి గొప్ప మానవతా దృక్పదం కలిగి ఉంటారు.
తోటివారితో మంచి సంబంధాలు కలిగి, సోదర భావంతో అందరితో మెలగడం, కళలపై నైపుణ్యం, ఆధ్యాత్మిక చైతన్యం, విశ్వప్రేమకలిగి ప్రయాణాలన్న ఆసక్తి కలిగి ఉంటారు. వీరు ధనం సమృద్ధిగా సమకూరే మార్గాలను కనిపెట్టి గొప్ప ఐశ్వర్యవంతులుగా నిబడతారు. వీరికి వారసత్వంగాగాని, వేరే అదృష్టం వలనగాని అనుకోకుండా ధనం ప్రాప్తిస్తుంది.
నెగిటివ్ లక్షణాలు :
వీరి తలబిరుసు తనం వలన స్నేహితులే శతృవులుగా మారిపోతారు. వీరు నిమ్మళంగా ఉండకుండా నిరంతరం దౌర్జన్యాలకు దిగుతూ ఉంటారు. స్వార్ధబుద్ధి, సంకుచిత తత్త్వం, ఆవేశంలో అతిగా ప్రవర్తించడం, అధికారం దుర్వినియోగం చేయడం.
నైతిక ప్రవర్తన లేకపోవడం, స్థిరత్వం లేకపోవడం, మనో బలహీనత, పక్షపాతబుద్ధి, అతిగా ప్రతిస్పందించడం, అకారణ కోపం, కాలం, శక్తి, ధనం, విచ్చలవిడిగా ఖర్చుచేయడం, సామాజిక పరిస్థితులపై ఎటువంటి బాధ్యతా లేక ప్రవర్తించడం, అనవసరంగా ఇతరులను నిందించడం నీతి, శీలము లేకపోవడం, అశ్లీల ప్రవర్తన కలిగి ఉండటం మొదలైన లక్షణాలు కలిగి ఉంటారు.
18వ తేదీన జన్మించిన వ్యక్తి లక్షణాలు :
వీరు నాయకత్వ లక్షణాలు కలిగి, నాయకులుగా ఎదుగుతారు. వీరు ఆధ్యాత్మికత కలిగి ఉంటారు. కాని మొండితనం కలిగి ఉంటారు. వివిధ కళల్లో ప్రావీణ్యం, వీరు శారీరక, మానసిక పటుత్వం కలిగి దృఢంగా ఉంటారు. భౌతిక సుఖాలపై ఆసక్తి.
18వ తేదీన జన్మించిన వారు జన్మతః ధైర్యవంతులై నాయకత్వ లక్షణాలు కలిగి ఉంటారు. ఆధ్యాత్మికత కలిగి ఉంటారు. వివిధ విద్యలలో, కళలలో, ప్రావీణ్యం కలిగి ఉంటారు. వీరికి కోపం అధికంగా ఉండి, ఎమోషనల్గా ఉంటారు. ఎప్పుడూ ఏదో ఒక విషయంలో టెన్షన్ పడుతూఉంటారు. ముందు ... వెనక అనే ఆలోచన లేకుండా నిర్ణయాలు తీసుకుంటారు. వీరు జాగ్రత్తగా ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటే మంచిది.
వీరు ప్రేమ వ్యవహారాల జోలికి వెళ్ళకుంటే మంచిది. ఉద్వేగం, స్వార్ధం, మొండితనం ఎక్కువగా ఉంటాయి. కనుక వాటిని తగ్గించుకుని, క్షమాగుణం కలిగి ఆధ్యాత్మిక, తాత్విక ధోరణిని అవలంబిస్తే అన్ని విధాల శ్రేయస్కరం.
వీరు అనేకమార్లు ప్రమాదాలకు గురవుతూ ఉంటారు. అగ్ని ప్రమాదాలకు, పేలుళ్ళకు, ప్రకృతి వైపరీత్యాలకు, ఘర్షణలకు గురౌతూ ఉంటారు. వీరు రక్షణ శాఖ, రాజకీయ, ఫార్మా, మెడికల్, రియల్ ఎస్టేట్ రంగాలలో బాగా రాణిస్తారు.
27వ తేదీన జన్మించిన వ్యక్తి లక్షణాలు :
వీరు నాయకత్వ లక్షణాలు కలిగి, నాయకులుగా, ఎదుగుతారు. వీరు విశాల దృక్పధం కలిగి ఉంటారు. ప్రజాక్షేమం కోసం పాటు వీరు శారీరక, మానసిక పటుత్వం కలిగి దృఢంగా ఉంటారు. భౌతిక సుఖాలపై ఆసక్తి ఉంటుంది.
27వ తేదీన జన్మించిన వారు పుట్టుకతోనే నాయకత్వ లక్షణాలు కలిగి ఉంటారు. సహజంగా వీరు దృఢమైన శరీరం, ధైర్యం కలిగి ఉంటారు. డెస్టిని సంఖ్య 9 గలవాలో అనగా 9, 18, 27 తేదీలలో ఈ 27వ తేదీ సంఖ్య చాలా మంచి సంఖ్య, గొప్ప దేశభక్తి, గొప్ప ఆధ్యా త్మిక వేత్తలుగా పేరు పొందుతారు.
ఆత్మ విశ్వాసం ఎక్కువ. నియంత భావాలు కలిగి ఉంటారు. ఆవేశం, కోపం ఎక్కువ. ఎవరి మాట వినని మొండితనం కలిగి ఉంటారు. అనుకున్న పని సాధించే వరకు నిద్రపోరు. వీరు తొందరపాటు నిర్ణయాలు తీసుకుని సమస్యలు తెచ్చుకుంటారు. వీరిలో కొందరు గొప్ప మానత్వం కలిగి ఇతరులకు సహాయం చేసే గుణం కలిగి ఉంటారు.
వీరు ఇతరులను ప్రభావితం చేయ గలిగే కార్యనిర్వహణా సామర్థ్యం కలిగి, విశాల హృదయం కలిగి, మంచి విద్యాభ్యాసం చేసి అనేక రంగాలలో మంచి జ్ఞానాన్ని సంపాదిస్తారు.
కొందరు మంచి వ్యవసాయ భూములు కలిగి, మంచి పంటలు పండిస్తారు. ఉత్తమ రైతులుగా, ల్యాండ్ లార్డ్స్ గా పేరు పొందుతారు.వివిధ ప్రదేశాలు తిరిగి విశేష అనుభవం, జ్ఞానము, సంపాదించి, వ్యాపార, పారిశ్రామిక రంగాలలో చాలా ఉన్నత స్థితిని పొందుతారు.
రాజకీయ, ఆర్థిక, ఆధ్యాత్మిక, కళా రంగాలలో కీర్తిప్రతిష్టలు పొందుతారు. వీరు మకుటం లేని మహారాజుగా వెలుగొందుతారు. దేశంకోసం, ప్రజా సంక్షేమం కోసం పాటుపడతారు.
ఐతే వీరు క్షమాగుణం కలిగి ప్రతీకారం తీర్చుకునే ప్రయత్నం చేయకుండా మానవతావాదం కలిగి, వీరి బలమైన శక్తి యుక్తులను ప్రజాక్షేమంకోసం వినియోగించినట్లయితే వీరు మంచి నాయకులుగా ఎదిగి, మంచి పేరు ప్రతిష్టలు, కీర్తి ప్రతిష్టలు పొందుతారు. తదనంతరం కూడా ప్రజలు వీరిని చిరస్థాయిగా గుర్తుంచుకుంటారు.

Subscribe to:
Posts (Atom)
Rama Ekadashi - రమా ఏకాదశి
రమా ఏకాదశి హిందూ పంచాంగం ప్రకారం, ప్రతి నెలా ఏకాదశి వస్తుంది. అయితే ఆశ్వయుజ మాసం లో క్రిష్ణ పక్షంలో దీపావళికి ముందు వచ్చే ఏకాదశికి ఒక ప్రత్య...
-
సూర్య ద్వాదశ నామాలు ధ్యేయః సదా సవితృమండలమధ్యవర్తీ నారాయణః సరసిజాసన సన్నివిష్టః । కేయూరవాన్ మకరకుండలవాన్ కిరీటీ హారీ హిరణ్మయవపుః ధృతశంఖచక్రః ...
-
నిత్య పారాయణ శ్లోకాలు స్తోత్రాలు నవ గ్రహ స్తోత్రం సుబ్రహ్మణ్యాష్టకం ఆదిత్యహృదయం కనకధారా స్త్రొత్రమ్ దుర్గాసప్తశ్లోకీ దేవి మహత్యం ద్వాత్రిస న...
-
శ్రీ దేవీ భాగవతము నవమ స్కంధములోని శ్రీ సరస్వతీ కవచం ఓం శ్రీం హ్రీం సరస్వ త్త్యై స్వాహా -శిరో మే పాతు సర్వతః । ఓం శ్రీం వాగ్దేవతాయై స్వాహా -ఫ...