Saturday, August 8, 2026

Numerology - న్యూమరాలజీ

న్యూమరాలజీ

న్యూమరాలజీ అంటే సంఖ్యాశాస్త్రం. అంకెలకు సంబంధించిన అతి పురాతనమైన ఒక తార్కిక శాస్త్రం. అంకెల భాష, న్యూమరాలజీలోని తొమ్మిది సంఖ్యలు (1-9) మానవ జీవితంపై తిరుగులేని ప్రభావాన్ని చూపుతాయి అంటారు.

పుట్టినతేదీ, ఆ వ్యక్తి పేరు న్యూమరాలజీ పరిశీలనకు ముఖ్యమైన ఆధారాలు. వీటి ఆధారంగా మీలో దాగి ఉన్న నిగూఢ రహస్యాలను తేటతెల్లంచేసి దిశానిర్దేశనం చేయగలదు అని భావన.

న్యూమరాలజీ పూర్వరంగం, మీ పేరులో ఉన్న అంతర్గత శక్తిని ఏ విధంగా తెలుసుకోవచ్చు, అంకెలు, వాటిలో ముడిపడి ఉన్న గ్రహాలు. ఆ గ్రహ ప్రభావం వ్యకులపై ఏ విధంగా ఉంటుంది మొదలైన న్యూమరాలజీకి చెందిన ప్రాథమిక భావనలు అన్ని తెలుసుకుందాం.

న్యూమరాలజీ గురించి తెలుసుకోవాలి అంటే దానికి కొన్ని పద్ధతులు ఉన్నవి అందులో మొదటి దాని గురించి తెలుసుకుందాం.

కబాలా లేదా హిబ్రూ లేదా కీరో పద్ధతి:
కబాలా అనగా హిబ్రూ భాషలో దేవుని నుండి వచ్చినది అని అర్థము. ఈ పద్ధతిలో అక్షరాలకు సంఖ్యలను ఆపాదిస్తారు.

హెబ్రూస్ మొదటి సారిగా ఈ పద్ధతి తెలుపినందువలన ఈ పద్ధతిని హిబ్రా పద్ధతి అంటారు. హిబ్రూ భాషలో అక్షరాలకు ఉన్న ప్రకంపనలను తరువాత వచ్చిన న్యూమరాలజిస్ట్లు ఆంగ్లభాషలోని అక్షరాలకు కూడా ఆపాదించారు. ఇదే హిబ్రూ పద్ధతి లేదా కీరో పద్ధతి. ఈ పద్ధతిలో అక్షరాలకు అంకెల అమరిక ఈ విధంగా ఉంటుంది.

Letters (Left)ValueLetters (Right)Value

A, I, J, Q, Y - 1
B, K, R - 2
C, G, L, S - 3
D, M, T - 4
E, H, N, X - 5
U, V, W - 6
O, Z - 7
F, P - 8

ఇచ్చట 9 అంకెకు ఏ అక్షరము కేటాయింపబడలేదు. 9 అంకెనుదేముని అంకెగా భావించారు. ఈ పద్ధతిని కీరో ప్రచారంలోకి తీసుకొని రావడం వలన దీనినే కీరో పద్ధతి అంటారు. చాలా దేశాల సంఖ్యా శాస్త్రవేత్తలు ఈ పద్ధతినే అనుసరిస్తున్నారు.

పైథాగరస్ పద్ధతి:
పైథాగరస్ ప్రతి అక్షరానికి ఉండే ప్రకంపన శక్తి హెబ్రూ పద్ధతిలో ఉన్న ప్రకంపనలకు కొంచెం భిన్నంగా ఉన్నట్లు గుర్తించి, అక్షరాలకు సంఖ్యలను ఈ విధంగా అమర్చాడు.


1  2  3  4  5 6 7 8 9 
A B C D E F G H I
J K L M N O P Q R
S T U V W X Y Z
ఈ పద్ధతినే ప్రపంచంలో 75 శాతం మంది న్యూమరాలజిస్ట్లు అనుసరిస్తారు.

జన్మదిన సంఖ్య:
జన్మదిన సంఖ్యను మనం ప్రత్యేక పద్ధతులలో లెక్కించవలసిన అవసరం ఉండదు. ఏ నెల అయినా ఏ తేదీన జన్మించారు అన్నదే ముఖ్యము. ఈ జన్మదిన సంఖ్య అనేది ఏకసంఖ్యలోను, ద్విసంఖ్యలోను ఉంటుంది.

ఉదాహరణకు ఒక వ్యక్తి 26వ తేదీన జన్మిస్తే అతని జన్మ సంఖ్య 2 + 6 = 8 అవుతుంది. ఇందులో రెండు సంఖ్యలు ఉన్నాయి. 2, 6. ఈ రెండు సంఖ్యలను కూడితే వచ్చే మొత్తం 8. ఈ 8 సంఖ్య ఆ వ్యక్తి యొక్క దైహిక లక్షణాలతో పాటు గుణగణాలను కూడా తెలుపుతుంది. అలాగే 2, 6 సంఖ్యలలోని ప్రత్యేక లక్షణాలు కూడా ఆ వ్యక్తిలో గోచరిస్తాయి.

అంటే జన్మదిన సంఖ్యలో రెండు సంఖ్యలు ఉన్నప్పుడు దానిని ఒకే సంఖ్యలోకి మార్చుకోవాలి. ఉదాహరణకు 27వ తేదీ జన్మదిన సంఖ్యగాగల వ్యక్తికి 2 + 7 ఈ రెండు సంఖ్యలను కలపగా వచ్చే సంఖ్య 9. 9 సంఖ్య జన్మదిన సంఖ్యగా చెప్పవచ్చు.

జన్మదినం 8, 26 తేదీలుగల వ్యక్తులకు చెందిన జన్మసంఖ్య ఒక్కటే. కానీ ఈ ఇద్దరికి లక్షణాలు ఒకే విధంగా ఉండవు. దీనికి కారణం జన్మ దినంలోని సంఖ్యల మార్పు. ఒకేవేళ ఇద్దరిపైన 8 ఒకే రకమైన ప్రభావం చూపినా 1, 4, 2, 3 సంఖ్యలు ఆయా వ్యక్తులపై విభిన్న ప్రభావాన్ని చూపిస్తాయి. దానివలన వ్యక్తుల లక్షణాలు భిన్నంగా ఉంటాయి.

అంకెలతో సంబంధం:
ఒకవ్యక్తి జన్మించిన వెంటనే అతనికి సంఖ్యలతో సంబంధం ఏర్పడుతుంది. పేరు పెట్టిన తర్వాత మరికొన్ని సంఖ్యలతో సంబంధం ఏర్పడుతుంది. పుట్టిన సంఖ్యకు, పేరులోని సంఖ్యకు మంచి సంబంధం, సారూప్యత, సహవాసం ఉన్నపుడే ఆవ్యక్తి యొక్క జీవితం బాగుంటుంది. ఈ సంబంధాన్నే న్యూమరాలజీ తెలుపుతుంది.

ఒకే సమయం, ఒకే తేది, ఒకే నెల, ఒకే సంవత్సరాన పుట్టిన ఇద్దరు వ్యక్తుల జీవితాలు ఒకేలా ఉండవు. అలా ఎందుకు ఉండవో వేరే శాస్త్రాలలో సరైన సమాధానం కన్పించదు. కానీ న్యూమరాలజీలో సమాధానం ఉంది. ఆ ఇద్దరు వ్యక్తులకు వేరువేరు పేర్లు ఉండటం వలన వారికి ఒకేలాంటి జీవితాలు ఉండవు అని న్యూమరాలజి చెబుతుంది.

పొట్టి పేర్లు, పొడుగు పేర్లు:
తెలుగు సంప్రదాయం ప్రకారం ప్రతి పేరుకి ముందు ఇంటి పేరు ఉంటుంది. ఇది వద్దు అనుకున్న మార్చుకోలేనిది. కొన్ని పేర్లు వాటిల్లో ఉండే పాజిటివ్ వైబ్రేషన్స్ వలన ప్రపంచ వ్యాప్తి చెంది ఉంటాయి.

దీనివలన ఆ ఇంటి పేరు ప్రక్కనున్న అసలు పేరుకు కూడా కొంత లాభం చేకూరుతుంది. అదే ప్రక్కనున్న పేరులో నెగిటివ్ వైబ్రేషన్స్ ఉంటే ఇంటి పేరుకు నష్టం జరగదు కాని అసలు పేరుకి నష్టం జరుగుతుంది.

ముద్దుపేర్లు నెగిటివ్ ఎనర్జి:
దేవతల పేర్లు, పెద్దవాళ్ళ పేర్లు కలిపి పెద్ద పేర్లు పెట్టిన తల్లిదండ్రులు తమ పిల్లలను పొట్టి పేర్లుతో పిలవడం జరుగుతుంది. ఇలా చిన్నప్పటి నుండే ఆ రెండక్షరాల పేరులోని నెగిటివ్ ఎనర్జి ప్రభావం క్రమక్రమంగా ఆ వ్యక్తి స్థాయి దిగజార్చుకుంటూ వస్తుంది.

అడుగడుగునా ఆటంకాలు కలుగజేస్తూ జీవితం నత్తనడకలా సాగుతుంది. కాబట్టి పెద్దలు పెట్టిన పేరును పెద్దలే చిన్నప్పటినుండి పూర్తి పేరుతో పిలవడం అలవాటు చేస్తే అద్భుతమైన ఫలితాలను చూడగలరు.

ఇంటి పేరుతో సహా పిలిపించుకునే పేరులో ఉన్న వైబ్రేషన్స్ మామూలు పేరులో ఉండవు. న్యూమరాలజిస్ట్ సలహా మేరకు మీ పేరులో ఉన్న వైబ్రేషన్స్ను చెక్ చేసుకోండి.

సంఖ్యాశాస్త్రం ప్రకారం మీ పేరు లేకపోతే
సంఖ్యాశాస్త్రం ప్రకారం ఎవరి పేరు ఐతే వ్యతిరేకంగా ఉంటుందో వారిలోని ప్రతిభను పూర్తిగా వినియోగించుకోలేరు. ప్రతి చిన్నపనికి కూడా ఎంతో కష్టపడితేగాని ఫలితం దక్కడు. ఏ తప్పు చేయకపోయిన అపనిందలు మోయాల్సి వస్తుంది.

జీవితంలో స్థిరంగా ఉండలేరు. వైవాహిక జీవితం అంతంత మాత్రంగానే ఉంటుంది. స్నేహితులు, బంధువుల చేతిలో మోసపోవడం జరుగుతుంది. ఒక్కొక్కసారి ఎదో ఒకటి చేయాలనుకునే తలంపుతో తమ శక్తికి మించిన పనులు తలపెట్టి నష్టపోవటం, ఆస్తులు పోగొట్టుకోవడం జరుగుతుంది. జీవితంలో ఒడి దుడుకులతో మానసిక ప్రశాంతత కరువవుతుంది.

మరి కొంత మందికి ఏ పని చేయాలన్న ఆసక్తి లేకపోవటం, ఒక వేళ పని ప్రారంభించినా దాన్ని మధ్యలోనే వదిలేసి మరొక పనిమీదకి వెళ్ళడం చేస్తుంటారు. దీనివలన చంచలత్వం పెరిగిపోయి ఎవరికి చెప్పుకో లేని మానసిక అసంతృప్తితో జీవిస్తూ మనోబలాన్ని కోల్పోవడం జరుగుతుంది.

ఎలా పనిచేస్తుంది:
ప్రాథమిక లెక్కలను ఉపయోగించి మీరు మీ జీవిత సంఖ్యను మరియు మీ వ్యక్తిత్వాన్ని సులభంగా కనుగొనగలిగినప్పటికీ, ఈ సంఖ్యలు కలిసి పనిచేసే విధానం సరిగ్గా అర్థం చేసుకోవాలి. ఇది చాలా క్లిష్టంగా ఉంటుంది. సాధారణంగా వివరణాత్మక మరియు ఖచ్చితమైన రీడింగులను అందించడానికి నైపుణ్యం కలిగిన న్యూమరాలజిస్ట్ అవసరం తప్పనిసరి.

న్యూమరాలజీ వెనుక ఉన్న ఆలోచన ఏమిటంటే, మీ పుట్టిన తేదీ మరియు ఒక వ్యక్తిగా మిమ్మల్ని చుట్టుముట్టే అనేక ఇతర కారకాల ద్వారా విశ్వం మరియు మీ జీవితం అనేక విధాలుగా ప్రభావితం అవుతుంది. సంఖ్యలు చాలా ఆసక్తికరమైన సమాచారాన్ని అందించగలవు.

సంఖ్యాశాస్త్ర ప్రకారం వ్యాపార సంస్థలు- వాటిపేర్లు:
సంఖ్యాశాస్త్రం అనేది ఒక మనో విజ్ఞాన శాస్త్రం. దీనిని బట్టి ఒక వ్యక్తి యొక్క జన్మతేదీ, నెల, సంవత్సరాన్ని పరిగణలోకి తీసుకుని తన పేరులోని అక్షరాలను శాస్త్ర ప్రకారం ఉన్నాయో లేదో పరిశీలించవచ్చు.

అతని మనసు ఏం ఆలోచిస్తుందో, ఎలాంటి భావాలను, గుణాన్నికలిగి ఉంటాడో, అంచనా వేయవచ్చు. కానీ ఒక వ్యాపార సంస్థ పేరు విషయంలో మాత్రం చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది.

వ్యాపారం చేసే వ్యక్తులు సామాజిక బాధ్యతలు కలిగి ఉండటంతో పాటు తన వ్యాపారం అంచెలంచెలుగా ఎదిగి పదిమందికి ఉపాధీ కలిపించే విధంగా అభివృద్ధి చెందాలంటే ఆ వ్యాపార సంస్థ పేరు సంఖ్యాశాస్త్రం ప్రకారం ఉందో లేదో చూసుకోవాలి.

కొత్తగా వ్యాపారం ప్రారంభించే వాళ్లైతే తప్పనిసరిగా వాస్తు మరియు న్యూమరాలజిస్టును సంప్రదించి వారి సలహా ప్రకారం సంస్థ పేరును నిర్ణయించుకోవాలి. ఒకవేళ ఇప్పటికే ఒక పేరు మీద వ్యాపారం కొనసాగుతుంటే అందులో ఏవైనా ఇబ్బందులున్నా లేదా బాగానే ఉన్న ఇంకా అభివృద్ధి చెందడానికి వ్యాపార సంస్థ యొక్క నామ సంఖ్యకు సరిపోయేటట్లు చేసుకొని సంపద పెంచుకోవచ్చు.

ఈరోజు ఎంతో మంది పెద్ద పెద్ద పారిశ్రామికవేత్తలు సైతం తమ సంస్థలకు, ప్రొడక్టులకు న్యూమరాలజి ప్రకారం పేర్లను నిర్ణయించు కోవడం జరుగుతుంది. అంతేకాకుండా వారి కారు నెంబర్లు, ఫోన్ నెంబర్కు కూడా న్యూమరాలజి ప్రకారమే తీసుకుంటున్నారు. ఇంతటి ప్రాముఖ్యం కలిగిన సంఖ్యా శాస్త్రాన్ని అందరూ ఉపయోగించుకుని వారి జీవన స్థితిగతులను మెరుగుపరుచుకోవచ్చు.


న్యూమరాలజి ప్రకారం మీ పేరు ఉంటే:
ఎవరి పేరైతే సంఖ్య శాస్త్రం ప్రకారం తప్పు లేకుండా ఉంటుందో అటువంటి వ్యక్తులు ధైర్యం, ఆత్మవిశ్వాసం కలిగి తోటివారిని ప్రేమిస్తూ సంప్రదాయ బద్ధంగా, దైవభక్తిని కలిగి ఉంటారు. కలల్లో విహరించకుండ వాస్తవంలో ఉంటు ఒక లక్ష్యాన్ని కలిగి దాన్ని నెరవేర్చుకొనుటకు ప్రయత్నిస్తూ ఉంటారు.

నాయకత్వ లక్షణాలతో పాటు మంచి వాక్చాతుర్యం, ఆకర్షణ కలిగి వుంటారు. తమ ప్రతిభను పూర్తి స్థాయిలో వినియోగించుకుంటారు. మరొకరికి ఆదర్శప్రాయంగా నిలుస్తారు. అందరిని గౌరవిస్తారు, గౌరవాన్ని పొందుతారు. ముఖ్యంగా కుటుంబ జీవితం ఆనందమయం చేసుకుంటారు.

కళలయందు ఆసక్తి కలిగి ఎప్పటికప్పుడు పరినీతి చెందుతూ తమలోని సృజనాత్మకు పదును పెట్టుకుంటారు. తద్వారా పూర్తి స్వేచ్చా వాతావరణాన్ని సృష్టించుకుని తమ ప్రతిభతో మంచి ప్రగతిని సాధించగలుగుతారు. మధ్య మధ్యలో కొన్ని అవరోధాలు, ఆపదలు ఎదురైనా కూడా వాటిలో కూడా అవకాశాలు వెతుక్కుంటారు.

నీతి, నిజాయతితో వృత్తి, వ్యాపారాలలో ధనం సంపాదిస్తూ ఇచ్చిపుచ్చుకునే ధోరణిని కలిగి ఉండుట వలన దైవానుగ్రహం తోడై ప్రమాదాల నుండి కూడా తప్పించుకోవటం జరుగుతుంది. శారీరక మానసిక ఆరోగ్యంతో పాటు సంతానం అభివృద్ధి కలుగుతుంది.

న్యూమరాలజీ ప్రకారం జీవిత భాగస్వామిని ఎంచుకోవడం:
సంఖ్యా శాస్త్రం ప్రకారం అనుకూల నామ సంఖ్య గల భాగస్వామిని ఎంచుకుంటే వారి జీవితం, కుటుంబం చూడ ముచ్చటగా ఉంటుంది. ఎన్ని ఆస్తులున్న, ఎంత సంపాదిస్తున్న కుటుంబ జీవితం సంతృప్తికరంగా లేనప్పుడు అర్థాకలితో జీవిస్తున్నట్టు ఉంటుంది.

కుటుంబ, దాంపత్య జీవితం సరిగ్గా లేనివాళ్లు వారి వివాహ తేదీని వాళ్ళు జన్మతేదీలతో సరిచూసి నామసంఖ్యలో ఏవైన నెగటివ్ వైబ్రేషన్స్ ఉంటే వాటి స్థానంలో పాజిటివ్ వైబ్రేషన్స్ గల అక్షరాలతో కూడిన నామసంఖ్యను ఇస్తే కొంత దోష నివారణ జరుగుతుంది. ఈ పనికి సమర్థుడైన న్యూమరాలజిస్టు సమర్థుడు.

వివాహం కానివారికి స్త్రీ, పురుషల జన్మ తేదీని పరిశీలించి ఇద్దరికీ సరిపడ్డాయో లేదో చూడాలి. బర్త్ నెంబర్, డెస్టిని నెంబరుకు సఖ్యత కుదిరిందో లేదో తెలుసుకోవాలి. అప్పుడు వారి సహ జీవనానికి కావలసిన బలాలు, బలహీనతలు గుర్తించి బలాలు ఎక్కువగా ఉన్నప్పుడు వారిద్దరికి వివాహం జరిపించవచ్చు.

ఏ శాస్త్రమైన ఒక మనిషి యొక్క వ్యక్తిత్వాన్ని, ఆలోచనలను మాత్రమే అంచనా వేయగలరు. దానిని బట్టి భవిష్యత్తులో ఎలా ఉండగలరో చెప్పగలరు. అలాగే ఈ వివాహ బంధంలోని భార్యాభర్తల మధ్య సంబంధ బాంధవ్యాలు, ఆ దంపతుల ఇద్దరికీ మధ్య ఉండే ప్రేమ, సహజీవన భావం ముఖ్యం.

వివాహం అనేది ప్రతి మనిషికి జీవితంలో ఒక ప్రధానమైన, మధురమైన మరపురాని ఘట్టం. కాబట్టి న్యూమరాల జిస్టుని సంప్రదించి మంచి తేదీని నిర్ణయించుకోవాలి.

1 నుండి 9 వరకుగల సంఖ్యలు ఎందుకు :
ప్రపంచంలో ఒకటి మొదలుకొని కోట్లవరకు ఎన్నో సంఖ్యలున్నా, అవన్నీ తొమ్మిది సంఖ్యలు లోపులోనే ఇమిడిపోతాయి.

సున్నా (పూజ్యం)

సున్నాకు ప్రత్యేకంగా విలువ లేదు. అంటే తతిమ్మా సంఖ్యలతో కలిసినప్పుడే దానికి విలువ ఉంటుంది. అదికూడా, సంఖ్యకు తరువాత వస్తేనే సున్నాకు విలువ ఉంటుంది.

ఉదాహరణ :
0 ఇక్కడ విలువ లేదు.
01 ఇక్కడా విలువ లేదు.
10 ఇక్కడ 1 సంఖ్యకు తరువాత రావటం వల్ల విలువ ఉన్నది.

ఆధార సంఖ్య, విస్తార సంఖ్య
సంఖ్యలను ఆధార సంఖ్యలనీ, విస్తార సంఖ్యలనీ రెండు విధాలుగా విభజించవచ్చు.

ఆధార సంఖ్యలు:
1 మొదలు 9 వరకున్న సంఖ్యలు ఆధార సంఖ్యలు

అనగా ఈ సంఖ్యల్ని ముందూ వెనకా పెడితేనే తతిమ్మా సంఖ్యలన్నీ రూపొందుతాయి. అంటే ఒకటి మొదలు తొమ్మిది సంఖ్యలు లేకుంటే గొప్ప గొప్ప మొత్తాలు రూపొందవు. అంచేత 1 మొదలు 9 వరకున్న సంఖ్యలు ఆధార సంఖ్యలు.

ఉదా: 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 ఆధార సంఖ్యలు..

విస్తార సంఖ్యలు :
తొమ్మిదికి తరువాత కోట్ల వరకున్న మిగతా సంఖ్యలన్నీ విస్తార సంఖ్యలు. అంటే ఆధార సంఖ్యలను (1-9) వరుసగా వ్రాస్తూ పోతుంటే విస్తార సంఖ్యలు ఏర్పడతాయి.

ఉదా : 10, 1235, 2245... ఇలా కోట్లవరకు ఉండే సంఖ్యలు. న్యూమరాలజీలో ఎంత పెద్ద సంఖ్య ఉన్నా దాన్ని ఆధార సంఖ్యలోకి పరివర్తన చేసుకోవాలి. న్యూమరాలజీలో విస్తార సంఖ్యలో పని లేదు. దానికి ఆధార సంఖ్యే అవసరము.

విస్తార సంఖ్య నుంచి ఆధార సంఖ్య (1)
ఉదాహరణకు, ఒక విస్తార సంఖ్య 73425 అని ఉంటే, దీనిని 7+3+4+2+5= 21 (2+1) 3 ఆధార సంఖ్యగా మార్పు చేసుకొనవచ్చును.

ఒకటి మొదలు తొమ్మిది వరకున్న ఆధార సంఖ్యలు తొమ్మిదింటిని మాత్రం న్యూమరాలజీలో ఉపయోగించటానికి కూడా ఒక కారణం న్యూమరాలజీకి జ్యోతిషమునకు ఉన్న సంబంధం.12 రాశులు, తొమ్మిది గ్రహాలు, 27 నక్షత్రాలు. ఈ మూడింటి ఆధారంగానే జ్యోతిష శాస్త్రం వర్దిల్లుచున్నది.

12 రాసులలో 27 నక్షత్రాలు ఇముడుతాయి. అనగా, ఒక్కొక్క రాశికి 21 నక్షత్రాలన్నమాట.ఒక నక్షత్రానికి 4 పాదాలు. 21 నక్షత్రాలకు 9 పాదాలు. అంటే ఒక్కొక్క రాశిలో ఆ నక్షత్ర పాదాలున్నాయి. 12 రాసులకు కలిపి 108 పాదాలు ఉంటాయి.

27 నక్షత్రాలంటే 2 + 7 = 9
108 పాదాలంటే 1+0+8=9

డిగ్రీలు లెక్క చూసుకొన్ననూ, ఒక రాశికి 30 డిగ్రీలు వంతున 12 రాసులకు 360 డిగ్రీలు. వీటి ఆధార సంఖ్య 3 + 6+ 0 = 9.

కాబట్టి, గ్రహాలను, రాసులను, నక్షత్రాలను ఆధారంగా పెట్టుకొని మానవ భవిష్యత్తును చెబుతున్న జ్యోతిష శాస్త్రంలో కూడా ఒకటి మొదలు తొమ్మిది వరకున్న సంఖ్యలే ప్రధానంగా కనిపిస్తున్నాయి అని చెప్ప వచ్చును.


న్యూమరాలజీలో మూడు రకాల ఫలితాలు:
సంఖ్యాశాస్త్రంలో మూడు రకములైన ఆధార సంఖ్యలకు అను గుణంగా ఫలితాలను చెబుతారు.

(1) పుట్టిన తేదీ సంఖ్య.
(2) పుట్టిన తేదీ, నెల, సంవత్సరం వీటి సమష్టి సంఖ్య.
(3) ఒకరి పేరులోని అక్షరా లకున్న విలువల సమష్టి సంఖ్య.
(ఈ సమష్టి సంఖ్యలు పెద్ద మొత్తంగా ఉంటే ఆధార సంఖ్యగా మార్చుకోవాలి.)

ఉదాహరణ :
(1) ఒకరు పుట్టిన తేది 4-1-1967.
(ఇందులో పుట్టినతేదీ 4. కావున మిగతా వివరాలు అక్కరలేదు. ఇచ్చట పుట్టిన తేదీని ఆధారంగా చేసుకొని ఆ జాతకుని వివరాలను అందించవచ్చు.)

(2) ఒకరు పుట్టిన తేది 4-1-1967.
(ఇందులో పుట్టిన తేదీ, నెల, సంవత్సరములోని అంకెలను ఏక సంఖ్యలోకి తీసుకురావాలి)

4+1+1+9+6+7 = 28
2 + 8 = 10 = 1 (డేస్టినీ సంఖ్య)

3) పై జన్మదినము కలవాని పేరు వెంకటేశ్వర స్వామి అనుకొనిన

V E N K A T E S W A R A S W A M I
4  5  5  2 1  2 5 1  5  1  9  1 1  5  1  4 9

4+5+5+2+1+2+5+1+5+1+9+1+1+5+1+4+9=61

6 + 1 = 7 (డెస్టినీ సంఖ్య) పేరును బట్టి.

పై విధంగా పేరును బట్టి ఒక వచ్చే సంఖ్య (పై పేరులో 7) ఆ జాతకునికి సరిపోవునా లేదా, పేరులో ఏ మార్పులు చేస్తే మరిన్ని మెరుగైన ఫలితాలు ఆ జాతకుడు పొందచ్చా మొదలైన విషయాలు న్యూమరాల జిస్టులు తగు విధంగా పరిశీలించి పేరును కరెక్షన్ చేయగలరు. కావున అనుభవజ్ఞుడైన న్యూమరాలజిస్టులు ఈ విషయంలో మీకు చక్కని మార్గనిర్దేశనం చేయగలరు.

ఈ విధముగా మూడు మార్గముల ద్వారా సాధించిన ఒక వ్యక్తి యొక్క 1-9 సంఖ్యలలో ఏదో ఒక సంఖ్యతో ఆ జాతకుని దైహిక లక్షణములతో పాటు మానసిక, వ్యక్తిత్వ మొదలైన అంశాలు దాగి ఉంటాయి. వీటికి సంబంధించిన పూర్తి వివరాలు ముందు పేజీలలో అందించబడినవి.

రూలింగ్ నెంబరు:
వ్యక్తి జాతకంలో రూలింగ్ నెంబరు అత్యంత ముఖ్యమైన పాత్ర వహిస్తుంది. జీవితంలోని ప్రతి సంఘటనపై ఈ సంఖ్య పాత్ర విశేషంగా ఉంటుంది.

ఉదాహరణకు 4-1-1967లో పుట్టిన ఒక జాతకుని జనన తేదీ అయిన 4వ తేదీ రూలింగ్ సంఖ్య అవుతుంది.

ఒక వేళ 14-1-1967లో పుట్టిన ఒక జాతకుని జన్య తేదీ అయిన 14 ను ఏక సంఖ్యగా మార్చితే (1 + 4 = 5) ఆ వచ్చిన సంఖ్య అయిన 5 రూలింగ్ సంఖ్యగా ఉంటుంది.

అదృష్ట సంఖ్య:-
దీనినే “ఫేట్ నెంబర్” అని, డెస్టినీ నెంబరు, విధి సంఖ్య అని వివిధ పేర్లతో పిలుస్తారు. దీనిని తెలుసు కోవటానికి జనన తేదీ సంఖ్యను మాస సంఖ్యను, సంవత్సర సంఖ్యను కలిపితే అది అదృష్ట సంఖ్య అవుతుంది.

ఉదాహరణకు : 4-1-1967 జాతకుని అదృష్ట సంఖ్యను నిర్ణయించదలిస్తే 4+1+1+9+6+7 28 దీనిని ఏక సంఖ్యగా మారిస్తే 2 + 8 = 10 సున్నకు విలువ లేదు కాబట్టి 1 అదృష్ట సంఖ్య అవుతుంది.

జన్మదిన తేదీ ద్వారా, పేరు ద్వారా సాధించిన సమష్టి సంఖ్యలు (1-9) మనకు ఏ విధంగా దిశానిర్దేశనం చేస్తాయో ఇచ్చట వివరించబడినది.

న్యూమరాలజీ - 1వ సంఖ్య

No comments:

Post a Comment

Gayatri Stotram - గాయత్రీ స్తోత్రం

శ్రీ దేవీ భాగవతం ద్వాదశ స్కంధము - గాయత్రీ స్తోత్రం గాయత్రీస్తోత్రం నారదా! గాయత్రీ హృదయం చెప్పానుగదా, ఇక గాయత్రీస్తోత్రం చెబుతున్నాను - విను....