ముచుకుందుని పూర్వ కథాభివర్ణనము
ప్రజ్ఞావంతులలో శ్రేష్ఠుడవైన ఓ శుకమహర్షీ! ఆ పడుకున్న వ్యక్తి ఎవరు? అతనికి తండ్రి ఎవరు? భయం కలిగించే ఆ కొండ గుహకు ఎందుకు వచ్చి నిద్రపోయాడు? కాలయవనుణ్ణి ఇలా కాల్చ గలిగే శక్తి అతనికి ఎలా వచ్చింది? ఇదంతా వివరంగా నాకు తెలియ చెప్పు.
ఇలా పరీక్షిన్మహారాజు ప్రశ్నించగా యోగివర్యుడైన శుకమహర్షి ఇలా జవాబిచ్చాడు. ఆ వ్యక్తి ఇక్షాకువంశంలో పుట్టిన మాంధాత అనే మహత్మునికొడుకు. అతడే ముచికుందుడు అనే రాజు. దేవతలకు రాక్షసులవల్ల కలిగిన భయాన్ని పోగొట్టి కాపాడినవాడు. అతని రక్షణకు మెచ్చుకుని, వాళ్లు దేవలోకాన్ని కాపాడిన ఆ రాజకుమారునికి వద్దకు వెళ్లి వరం కోరుకొమ్మని చెప్పారు. వెంటనే ముచుకుందుడు ముక్తిని అడుగగా అతనితో దేవతలు ఇలా అన్నారు.
వీరులలో మొదటగా నిలబడేవాడా! లోకంలో శత్రువంటూ లేనిరాజ్యం నీది. అలాంటిరాజ్యాన్ని వదిలేసి, ఎంతోకాలం ఇక్కడ ఉండి మమ్ములను రక్షించావు. ఇంతలో నీకు సంబంధించిన స్త్రీలు, మంత్రులు, బంధువులు, కొడుకులు, సుబంధీకులు ఎవ్వరూ భూమిపై లేరు. కాలధర్మం చెందారు. ఆలోచిస్తే కాలమనేది ఎంతటివాళ్లకైనా దాటరానిది కదా!
కాలమనేది మహాబలవంతులందరికంటె బలీయమైంది. దైవం కాల స్వరూపుడు. అతడిని లెక్కించడానికి సాధ్యం కాదు. ఆయన లోకంలోని వాళ్లను కాలానికి లొంగిపోయేలా చేస్తాడు. ఎంతెంత గొప్పవాళ్లయినా సరే కాలాన్ని అతిక్రమించలేరు.
రాజా! నీవు కోరుకున్న వరాన్ని ఇస్తాం, మోక్షం తప్ప మరేదైనా అడుగు. మోక్షమివ్వడానికి ప్రభువైన విష్ణువు ఒక్కడు తప్ప మేమెవరమూ అధికారులం కాము.
ఇలా చెప్పిన దేవతాసమూహానికి ముచికుందుడు నమస్కరించి. నిద్రను కోరుకున్నాడు. వారిచ్చిన నిద్రకు వశుడై గుహలోపల నిద్రిస్తూ ఉండినాడు. కాలయవనుడు బూడిదైన తర్వాత, శ్రీ కృష్ణుడు ముచుకుందునిఎదుట నిలబడ్డాడు. అప్పుడు-
శ్రీకృష్ణుని కండ్లు కమలాలవలె అందంగా ఉన్నాయి ఆయనమెడలో వైజయంతిమాల ఉంది. నిండు పున్నమినాటి చందమామవలె ఆయనముఖం వెలుగులీనుతూ ఉంది. మకరకుండలాలు కాంతిమంతంగా ఉన్నాయి. ఆ కాంతికి చెక్కిళ్లు మెరుగెక్కినాయి. మెడలో కౌస్తుభం అనే మణిని ధరించాడు. వానమబ్బువంటి అందమైన వన్నెతో అతడి దేహం సొగసుగా ఆయనది.
ఆయనకు శ్రీవత్సమనే పేరున్న పుట్టుమచ్చ ఉంది. సింహానికి ఎలా సన్నని నడుముంటుందో అలాంటి నడుము ఉంది. ఆయనకు నాలుగు చేతులున్నాయి. చిరునవ్వు చిందిస్తూ ఉన్నాడు. బంగారు రంగువంటి రంగుతో ఉన్న పట్టువస్త్రాన్ని కట్టుకున్నాడు. గంభీరంగా ఉన్నాడు.
అత్యంత సుందరంగా ఉన్నాడు. అతనిమనోహరమైన కాంతిని ఎదిరించి చూడడం సాధ్యంకాక, అంతటి మహా తేజస్సంపన్నుడైన, మహాత్ముడైన శ్రీకృష్ణుని చూచి ముచికుందుడు సంభ్రమంచెంది అతికష్టం పై ఆశ్చర్యం నుంచి తేరుకుని, ప్రీతితో ఇలా మాట్లాడాడు.
చంద్రుడవో, ఇంద్రుడవో, చెలరేగి వెలుగుతున్న అగ్నివో, ప్రకాశించే సూర్యుడవో, తలపై చంద్రుని దాల్చిన శివుడవో, బ్రహ్మదేవుడవో, చక్రాన్ని దాల్చిన శ్రీమహావిష్ణుడవో తెలియడం లేదు. నీ కాంతి దిక్కులు, నేల, ఆకాశం అంతా నిండిపోయింది. ఈ తేజస్సు చూడడానికి శక్తి చాలటం లేదు. ఎవరివి నీవు? ఎందుకు వచ్చావు? ఒంటరిగా ఇక్కడ ఎందుకు తిరుగుతున్నావు?
ఓ స్వామీ! నీ పాదాలు చూస్తే కోమలమైన తామరరేకులవలె ఉన్నాయి. మరి ఈ అడవి అంతా ఎగుడుదిగుడుగా ఉంది. ముళ్లతో నిండి ఉంది. భయంకరమైన మృగాలతో ఉంది. ప్రవేశించడానికి వీలుకానిదిగా ఉంది. అలాంటి అడవిలోకి ఎలా వచ్చావు?
మహాత్మా! నీకు సేవచేయాలని నేను కోరుకుంటున్నాను. నీ పుట్టుక, వంశంగురించి నేను తెలుసుకోవడానికి అర్హుణ్ణి అనిపిస్తే తెలియజేయి. నేను ఇక్షాకువంశంలో పుట్టాను. మాంధాతకొడుకును. నాపేరు ముచుకుందుడు. దేవతలకు సహాయం చేయాలని చాలాకాలం నిద్రపోక మేలుకునే ఉన్నాను. బాగా అలసిపోయాను. అందువల్ల నిద్రను వరంగా పొంది, ఇంద్రియవ్యాపారాలు మరచి
నేను నిద్రపోతుండగా ఎవరో మనిషి ఒకడు వచ్చాడు. వాడిప్రవర్తన ఏమీ బాగాలేదు. చాలా పొగరుబోతు. తాను చేసినపాపంవల్ల తానే బూడిదగా మారి నాశనమై పోయాడు. అటు తర్వాత, శ్రీ మహావిష్ణువువంటిరూపంతో నీవు కనిపించావు. నిన్ను తేరిపార చూద్దామంటే కూడా నాకు చేత కావడం లేదు. నేను దీనుడి నయ్యాను. నన్ను నీ దయతో కూడిన చల్లనిచూపులతో చూడవా?
ముచుకుందుడు అలా వేడుకోగా, విని శ్రీకృష్ణుడు మేఘగర్జనవంటి గంభీర స్వరంతో ఇలా అన్నాడు.
పాపాలుసోకనిమహారాజా! భూమిపై ఉన్నధూళికణాలను లెక్కపెట్టవచ్చు కానీ నా గుణాలను గురించి, పుట్టుకలను గురించి, చేతలనుగురించి, పేర్లనుగురించి - వీటిన్నిటిని గురించి లెక్కించడానికి ఎవరికీ శక్తి లేదు. అంతదాకా ఎందుకు? నాకుకూడా చేతకాదు. భూమికి బరువుగా ఉన్న రాక్షసులను జయించి, ధర్మాన్ని నిలబెట్టమని మునుపు బ్రహ్మ నన్ను వేడుకున్నాడు.

సరే! అని, దయతో నేను వసుదేవునిఇంట్లో పుట్టాను. నన్ను వాసుదేవుడని అంటారు. కంసుడనే పేరుతో ఉన్న కాలనేమి అనే రాక్షసుణ్ణి చంపాను. ఇంకా చెడ్డ వాళ్లందరినీ చంపుతున్నాను. నీవు కళ్లుతెరచి చూస్తే ఇపుడు బూడిదై పోయాడే, వాడు కాలయవనుడు.
ఒక విషయం చెప్తాను ఆలకించు. మునుపటి జన్మల్లో నీవు నన్ను పూజించావు. అందుకని, నిన్ను అనుగ్రహించడం కోసం ఈ కొండగుహకు వచ్చాను. నీకు ఏం కావాలో కోరుకో ఇస్తాను. నాకు భక్తులైన వాళ్లు ఇక దుఃఖం పొందడానికి అనర్హులు అని శ్రీకృష్ణుడు చెప్పాడు.

ఈ మాటను విని, ముచుకుందుడు శ్రీకృష్ణునికి నమస్కరించాడు. అతడు సాక్షాత్తు శ్రీమహావిష్టు వని గ్రహించాడు; ఇరవైఎనిమిదవ మహాయుగంలో శ్రీమన్నారాయణుడు అవతరిస్తాడని మునుపు గర్గుడు అనే ఋషి చెప్పిన మాటను ముచుకుందుడు గుర్తుచేసుకున్నాడు.
ముచుకుందుడు శ్రీకృష్ణుని స్తోత్రము చేయుట
నిత్య స్తోత్రావళి
నిత్య పారాయణ శ్లోకాలు
స్తోత్రాలు
పంచాంగం
శ్రీ మహా భాగవతము
శ్రీ మహా భాగవతము ద్వితీయస్కంధము
శ్రీ మహా భాగవతము తృతీయస్కంధము
శ్రీ మహా భాగవతము చతుర్ధస్కంధము
శ్రీ మహా భాగవతము పంచమస్కంధము
శ్రీ మహా భాగవతము షష్టస్కంధము
శ్రీ మహా భాగవతము సప్తమస్కంధము
శ్రీ మహా భాగవతము అష్టమస్కంధము
శ్రీ మహా భాగవతము నవమస్కంధము
శ్రీ మహాభాగవతము దశమస్కంధము - పూర్వభాగము
శ్రీ మహా భాగవతము ద్వితీయస్కంధము
శ్రీ మహా భాగవతము తృతీయస్కంధము
శ్రీ మహా భాగవతము చతుర్ధస్కంధము
శ్రీ మహా భాగవతము పంచమస్కంధము
శ్రీ మహా భాగవతము షష్టస్కంధము
శ్రీ మహా భాగవతము సప్తమస్కంధము
శ్రీ మహా భాగవతము అష్టమస్కంధము
శ్రీ మహా భాగవతము నవమస్కంధము
శ్రీ మహాభాగవతము దశమస్కంధము - పూర్వభాగము
నిత్య స్తోత్రావళి
నిత్య పారాయణ శ్లోకాలు
స్తోత్రాలు
పంచాంగం
No comments:
Post a Comment