ఉత్తమురాలయిన సీతాదేవి తన ఎదురుగా నిలిచిన రూపయౌవన సంపన్నుడూ, సర్వాలంకారభూషితుడూ అయిన రావణుని చూస్తూనే పెనుగాలిలో అరటిమొక్కలా కంపిస్తూ, కాళ్ళూ చేతులూ ముడుచుకుని కూర్చుంది.
విపరీత దుఃఖంతో ఉన్న ఆవిడ మహాసముద్రంలో మునిగిపోయిన నావలా ఉంది.
వ్రతనియమంతో, ఏ ఆస్తరణం లేకుండా నేలమీద కూర్చున్న ఆ యిల్లాలు చెట్టునుండి విరిగిపడిన కొమ్మలా ఉంది.
ధూళి ధూసరిత దేహంతో బురదనిండిన తామర తూడులా ఉంది.
తన మనస్సు ఎరిగిన రాముని దగ్గరకే ఆమె మనస్సు ప్రయాణం చేస్తున్నది. రామునిమీదనే సర్వమూ లగ్నం చేసుకున్నది. మంత్రబద్ధమయిన ఆడత్రాచులా ఉంది. దూమకేతువు ఆవరించిన రోహిణీ తారలా కనిపిస్తున్నది.
ఆచార కులశీల సంపన్నయై ప్రభవించి అనాచారపీడితయైనట్లుంది.
శిదిలమయే కీర్తిలా
అవమానిత శ్రద్ధవలె
క్షీణప్రజ్ఞలా, నెరవేరని ఆశలా
శూన్యమయిన భవిష్యత్తులా
ఎదురు తిరిగిన శాసనంలా, ప్రమాద సమయంలో మండే దిగంతంలా, దొంగిలింపబడిన పూజాద్రవ్యంలా,
నలగదొక్కిన తామరతూడులా
సర్వశూరులూ కూలిన సేనలా
చీకటి చుట్టుముట్టిన వెలుగులా
ఎండిన నదిలా
తుడిచిన వేదికలా
ఆరిన అగ్నిలా,
రాహువు నోట చంద్రునిలా
చీకటి చుట్టుముట్టిన వెలుగులా
ఎండిన నదిలా
తుడిచిన వేదికలా
ఆరిన అగ్నిలా,
రాహువు నోట చంద్రునిలా
ఆకులూ, పూవులూ పెల్లగించిన ఏనుగు తొండంతో చెల్లాచెదరయిన మృణాళనాళంవలె
కృష్ణపక్షపు రాత్రిలా
ఎండవేడికి వడలిపోతున్న తామరతూడులా
గజరాజు బంధితుడు కాగా దుఃఖించే ఆడ ఏనుగులా,
మేఘాలు లేనిచోట వనంలా
ఉపవాస దుఃఖంతో కృశించి, దీనురాలై, అల్పాహారంతో, తపోధనంతో తన భర్తవల్ల ఈ దశకంఠుడు పరాభూతుడు కావాలని అంజలిబంధంతో ప్రార్థిస్తున్నట్టుంది.
పవిత్ర చరిత్ర కల ఆ ధవళాయతనేత్రను సంహరించేటట్లు చూశాడు రావణుడు.
రావణ ప్రణయం
రామాయణం సుందరకాండ
జ్యోతిషశాస్త్రము
నిత్య స్తోత్రావళి
నిత్య పారాయణ శ్లోకాలు
స్తోత్రాలు
పంచాంగం
ఎండవేడికి వడలిపోతున్న తామరతూడులా
గజరాజు బంధితుడు కాగా దుఃఖించే ఆడ ఏనుగులా,
మేఘాలు లేనిచోట వనంలా
ఉపవాస దుఃఖంతో కృశించి, దీనురాలై, అల్పాహారంతో, తపోధనంతో తన భర్తవల్ల ఈ దశకంఠుడు పరాభూతుడు కావాలని అంజలిబంధంతో ప్రార్థిస్తున్నట్టుంది.
పవిత్ర చరిత్ర కల ఆ ధవళాయతనేత్రను సంహరించేటట్లు చూశాడు రావణుడు.
రావణ ప్రణయం
రామాయణం సుందరకాండ
జ్యోతిషశాస్త్రము
నిత్య స్తోత్రావళి
నిత్య పారాయణ శ్లోకాలు
స్తోత్రాలు
పంచాంగం
No comments:
Post a Comment