శ్రీ మహాభాగవతము దశమస్కంధము - పూర్వభాగము - గోపికాగీతలు
ఓ నాధా! నీవు జన్మించిన కారణంగానే మా గోకులం సిరిసంపదలు అధికమై అలరారుతున్నది. నీవారైన గోపికలు నీ మీదనే ప్రాణాలుంచుకొని వెదకుతున్నారు, నీ రూపం చూపించు.
అందగాడవైన ఓ కృష్ణా! శరత్కాల కమలాల గర్భంలోని జిగిని దొంగిలించే నీ చూపువల్ల నిన్ను వలచి జీతభత్యాలు లేని దాసులమయ్యాము. అలాంటి మమ్మల్ని ధీరుడవై నొప్పించడం నిజంగా చంపడమే కాదా?
ఓ స్వామీ! మమ్ములను కాళీయుని విషం కలిసిన యమునానదిలోని విషజలం నుండి కాపాడావు. సర్పరూపుడైన అఘాసురుని బారినుండి తప్పించావు. ఇంద్రుడు కురిపించిన రాళ్లవాననుండి రక్షించావు. అడవిలో చెలరేగిన కార్చిచ్చునుండి కాపాడావు.

ఇలా మరిన్నొ ఆపదలనుండి తప్పించావు. మరి ఇప్పుడు ఇలా కుసుమబాణుడైన మన్మథునికి మమ్ములను అప్పగించి చంపడం నీకు భావ్యమా?
కమలనేత్రా! నీవు యశోదకొడుకువే కాదయ్యా! సర్వదేహధారుల బుద్ధికి సాక్షీభూతుడవైన అంతరాత్ముడవు, పరమేశ్వరుడవు. పూర్వం బ్రహ్మదేవుడు నిన్ను స్మరించి, లోకరక్షణ చేయుమని సన్నుతించగా, ఉత్తమమైన యదుకులంలో భూమండలాన్ని రక్షించడానికి నీవు జన్మించావు కదా!
స్వామీ! నీపాదసేవకులకు సంసారభయాన్ని తొలగించేదీ, లక్ష్మీదేవిహస్తాన్ని చేయూతగా కలిగిందీ, అభీష్టాలను తీర్చేదీ ఐన నీ కరకమలాన్ని మా శిరస్సులమీద ఉంచి బదికించు.
లక్ష్మీవల్లభా! నీ పాదపద్మం గోవులవెంట సంచరించేది. పూజించేవారి పాపసమూహాలను పోగొట్టెది. దుష్టసర్పమైన కాళియుని పడగలమీద నర్తించేది. అలాంటి నీ పాదపద్మాన్ని మా గుండెలపై మోపి, మాకు మన్మథుని పూలబాణాలవల్ల సంభవించిన బాధను పోగొట్టు. మమ్మల్ని స్వీకరించు.
స్వామీ! నీ పలుకు పండితులకు ఇంపు నింపుతుంది. స్పష్టంగా ఉచ్చరించబడుతుంది. తీయనైంది. అలాంటి నీ పలుకు మమ్మల్ని మరులు కొల్పింది. నీ అధరామృతం ఆస్వాదించేటట్లు చేసి మా మన్మథబాధను పోగొట్టవా?
పద్మనేత్రా! నీవు నీ భక్తుల భయాన్ని పోగొట్టేవాడవు. అలాంటి నీకు ఈ క్రూరత్వం తగునా? తగదుగాక తగదు. నీదాసులయిన మాకు మీ నగుమోము చూపి రక్షించు.
లక్ష్మీమనోహరా! నీ కథామృతం గొప్ప సిరితో కూడింది; వినడానికి శుభకరమైంది. కామం మొదలైన అరిషడ్వర్గాన్ని విధ్వంసం చేసేది. సనకాదిమునులచే స్తుతించబడేది. నిరంతరతపస్సుచేత తపిస్తూ ఉండే పురుషపుంగవులకు జీవనం కలిగించేది. అలాంటి నీ కథామృతం గొప్పగొప్పదానాలు చేసి, సుప్రసిద్దులైన వారికే అందుతుంది కానీ ఇతరులకు అందదు.
కృష్ణా! నీ నవ్వులు, నీ చూపులు, నీ నానావిహారాలు, నీ ధ్యానాలు, నీ పరిహాసవచనాలు మా మనసుల్లో నాటుకొనిపోయాయి. అవి ఈనాటికికూడా మరలి పోవడం లేదు.
పద్మనేత్రా! మందపట్టు వదిలి గోవులను మేపడానికి నీవు వెళ్లినప్పుడు పద్మాల్లాంటి నీపాదాలు గడ్డిమొక్కలూ, రాళ్లు తాకి ఎంత నొస్తాయో అని మా మనస్సులు కలత చెందుతూ ఉంటాయి.
ధీరజనోత్తమా! సాయంకాలం అయ్యేటప్పటికి నీవు బృందావనంమధ్యనుండి వచ్చి, గోవుల గిట్టలవల్ల రేగిన ధూలళిచే కప్పబడి, బూడిదరంగుతో ఒప్పే శిరోజాలు కలిగిన నీ ముఖం పద్మంలా ఒప్పారుతూ ఉంటుంది. అలాంటి ముఖం మాకు వేడ్కతో చూపి, క్రమక్రమంగా మా మనస్సులలో మన్మథుణ్ణి పొడసూపేటట్లు చేస్తావు.
రమణా! నీ పాదద్వయం భక్తులకోర్కెలను తీర్చేది. బ్రహ్మదేవునిచే పూజింపబడేది, భూమికి అలంకారమైంది. దుఃఖాన్ని పోగొట్టెది. శుభప్రదమైంది. అలాంటి నీ పాదద్వయాన్ని మా వక్షోజాలపై ఉంచకూడదా!
కృష్ణా! నీ అధరామృతం సంభోగప్రీతిని పెంపొందిస్తుంది. శోకాన్ని పోగొడుతుంది. మోగే మురళిని ముద్దులు గొంటుంది. ఇతరాలైన అనురాగాలను అతిశయింపజేస్తుంది. అలాంటి నీ అధరామృతంతో మా బాధను పోగొట్టు.
ఓ రమాపతీ! నీవు పగటివేళ బృందావనారణ్యంలో సంచరిస్తూ ఉండడంవల్ల ఉంగరాలు తిరిగిన ముంగురులచేత అందగించిన నీ నెమ్మోము తనివితీరా దర్శించలేకపోతున్నాం. అందువల్ల, మాకు క్షణాలు యుగాలుగా గడుస్తున్నాయి.

పోనీ, రాత్రి సమయాలలోనైనా నిన్ను నిరంతరాయంగా కన్నులనిండా దర్శిద్దామనుకుంటే క్రూరుడైన బ్రహ్మదేవుడు మాకండ్లకు రెప్పలు అడ్డంగా సృష్టించాడు గదా! ఇదెందుకో?
మనోవల్లభా! అయ్యో! మా బంధువులు, భర్తలు, అన్నలు, తమ్ములు, కొడుకులు మొదలైనవారు రాత్రిపూట ఇల్లువదలి వెళ్లవద్దని మమ్మల్ని అడ్డగిస్తున్నా వినకుండా నీ మెత్తని మధురగీతంయొక్క సవ్వడి మా చెవులలో పడి వెక్కసం కాగా, మోహంపొందిన వాళ్లమై వడివడిగా వచ్చాం. నీవు ఎక్కడ పోయావో! తెలియదు. ఇలాంటి నిర్దయుడు ఎక్కడైనా ఉంటాడా?
కృష్ణా! నీవు పలికే నర్మగర్భవచనాలు, నవరసాలొలికించే చూపులతో నిండిన నవ్వుమొగం, శ్రీదేవికి నివాసమైన విశాల వక్షస్థలం, మా మనసులను వశంచేసుకొని మమ్ము మురిపించాయి.
ఓ కృష్ణా! తామరలకంటే కోమలాలై అందాలుచిందే నీ పాదాలు కఠినమైన మాచన్నుల ఒత్తిడికి కందిపోతాయేమో నని బాధపడుతూ ఉంటాం. అలాంటిది ఈ కర్కశారణ్య భూముల్లో నీ సంచారం నీ ప్రేయసులమైన మాకు ప్రాణాంతకమైన శోకాన్ని కలిగించదా?
కృష్ణా! అకటా! మన్మథబాణాలు మమ్మల్ని నొచ్చేటట్లు నాటుకోగా, భీతిచెంది, నీపాదాలు పట్టుకోవడానికి వచ్చాం. అలాంటి మమ్ములను నట్టడవిలో వదిలి పోవడం నీకు న్యాయమా?
(పాదాలు పట్టుకోవడం శరణాగతిచిహ్నం. శరణాగతులను రక్షించడం భగవంతుని ధర్మం అని గుర్తు చేస్తున్నారు గోపికలు.)
ప్రాణేశ్వరా! మా మనసులను ముందుగా కోమలతరంగా చేసి, తరువాత వేరుగా నీ హృదయాన్ని మిక్కిలి కర్కశంగా చేసిన మా దురదృష్టం ఎక్కడైనా(ఎవరికైనా) ఉంటుందా?
దయానిధీ! రాక్షసులు ఒక్కపెట్టున పరాక్రమించి, ఎదుర్కొని పట్టుదలతో దేవతలపై వాడిబాణాలు ప్రయోగించేటప్పుడు అడ్డుపడి, ఆ రాక్షసుల్ని తునుమాడుతావని అంటారు. మరి, మేము నిన్ను నమ్ముకున్న అమాయికగోపికలం. అయ్యో! ఇలాంటి మమ్మల్ని పంచబాణుడు వెంటాడుతుంటే అడ్డుపడడం ఉచితం కాదా?
గోవిందా! ముకుందా! కృష్ణా! చెరకు విల్లుగా గలిగిన మన్మథుడు మమ్మల్ని ఎదిరించి, మా హృదయాలలో దూరిపోయేటట్లు బాణాలు ప్రయోగించాడు. మన పరస్పరసంబంధాన్ని భావించి, ఇకనైనా మా మొరాలకించవా స్వామీ!

ఇలా అంటూ, గోపికలు మధుర స్వరంతో ప్రస్తుతిస్తూ పాడుతూ కృష్ణుణ్ణి రావే అని పిలిచి ఏడిచారు. విశ్వరక్షకుడు, ముల్లోకసుందరుడు, మన్మథమన్మథుడు, మనోహరాకారుడు, పీతాంబరధారి, హారాలు ధరించినవాడు అయిన కృష్ణుడు, వారిముందు ప్రత్యక్షమయ్యాడు.
('మన్మథమన్మథుడు' అనడం స్వామివారి అపురూప సౌందర్యం చెప్పడానికి.)
అలా వచ్చిన ప్రాణనాథుడైన కృష్ణుణ్ణి గోపకాంతలు దర్శించారు. విజయంచేశాడని వికసించిన ముఖాలుకలవారై పోయిన ప్రాణాలు మరల వచ్చిన దేహేంద్రియాలవలె
ఒక అబల భక్తితో దోసిలొగ్గి ప్రాణనాథునికెంగేలు పట్టుకొంది. మరొక ఇంతి జీవితేశ్వరునిబాహువు తన భుజంపైన వేసుకొని సంతోషించింది. ఒక వనిత భర్త నమిలిన తమ్మిని తనచేతితో అందుకొంది. ఒక సుందరి ప్రియుని పాదాలను విరహాగ్నితో తపించిన తన స్తనాలకు అద్దుకొంది.

ఒక భామ కనుబొమముడివేసి ప్రణయభంగం చేశాడని కోపంగా మాట్లాడుతూ, పెదవి కొరుకుతూ, కొట్టేదానివలె కృష్ణుని వాడి చూపులతో చూచింది.
ఓ పరీక్షిన్మహారాజు! హరిపాదకమలం దర్శిస్తూ తనివి తీరని సత్పురుషునివలె ఒక తరుణి హరిముఖపద్మాన్ని రెప్పవేయకుండా చూస్తూ తనివి తీరందై ఉంది.
ఒక లతాంగి కృష్ణుని ప్రకాశవంతమైన రూపాన్ని చూపులనే తీగెలతో చిక్కేటుగా పట్టుకొని తన హృదయంలో బంధించింది. ఆ రూపం బయటికి వెళ్లకుండా కనురెప్పలు మూసివేసింది. పులకలు కమ్ముతుండగా కృష్ణుణ్ణి కౌగిలించింది. అలా స్వచ్చమైన అంతరంగంలోని రుచులతో ఆమె యోగివలె పరవశిస్తూ ఉండిపోయింది.
“ప్రాణనాథా! నన్ను మోసంచేసి ఎక్కడికి వెళ్లావు” అని ఒక సుందరి మిక్కిలి కోపంతో నిందించింది. “పద్మనేత్రా! నన్ను వదిలివెళ్లడానికి నీకు కాళ్లెట్లాడాయి?” అని ఒక సుందరి వాపోయింది. “ప్రభూ! నీవు వెళ్లినప్పటికీ ఇంకా నేను ప్రాణాలతోనే ఉన్నానే! ప్రేమంటే ఇదేనా?” అని ఒక గోపసుందరి వాపోయింది.

“ప్రియా! ఇంతవరకు మనలను పాపాత్ముడైన విధాత విడదీశాడు గదా” అని ఒక గోపిక విలపించింది; “నాథా! నన్ను వదిలి వెళ్లేంత తప్పు నెనేం చేశానో చెప్పు. నీ కిది న్యాయమా అని ఒక సుందరి నిలదీసింది” “మనోనాథా! ఏనోము ఫలమోకానీ, మళ్లీ నిన్ను దర్శించగలిగాను” అంటూ ఒక యువతి విహరించింది.
కమ్మని కంఠస్వరంగల ఒక సుందరి “నేను ముందుగా అతనితో మాట్లాడితే నా ప్రతిజ్ఞ భంగమవుతుంది - అతడు పలకరిస్తేనేగానీ పలుకను”. అంటూ తన మాటల్లో అమృతాలు కురిసినట్లు తన చెలికత్తెతో పలికింది.
పరీక్షిన్మహారాజా! ఒక నెరజాణ తన చెలిచేయి పట్టుకొని “ప్రాణేశుడు నాచేయి పట్టుకొంటేనే నేను ఆతని చేయిపట్టుకొంటాను”. అని ధైర్యంగా చెప్పింది. అయితే-ఆ ధైర్యమంతా మన్మథుని నివాసస్థానం అయింది(ఆమె ధైర్యాన్ని మన్మథుడు ఛిన్నాభిన్నం చేశాడు).
ఓ పరీక్ష్మిన్మహారాజా! రమణుడు తనకు చెప్పకుండా వెళ్లి పోయాడన్న విముఖతతో, అందువల్ల తాను ముందుగా అతణ్ణి చూడనని తలవంచుకొని ఉన్న ఓ అమాయకురాలు తన మనసులో మన్మథుడు ప్రేరేపించగా అట్లే తలవంచుకొని ఉండలేక తానే తలఎత్తింది.
ఈ విధంగా
కృష్ణుని సుందరకోమల రూపాన్ని సందర్శించిన తరుణులు విరహతాపజ్వరంనుంచి విముక్తలై భవబంధాలనుండి విముక్తి చెందిన భగవద్భక్తులవలె గొప్పవేడుక సలిపారు.
అప్పుడు బృందావనంలో గోపసుందరులు తన చుట్టూచేరి కొలువగా శ్రీకృష్ణుడు సర్వజ్ఞత్వం మొదలైన సమూహాలతో కూడిన శక్తిని పరమేశ్వరుడువలె ప్రకాశించాడు. వసుదేవనందనుడు ఆ గోపరమణులను వెంట బెట్టుకొని మందారాల, మొల్లపూల సువాసనలతో నిండి మందమారుతాలచే మన్నింపబడి మృదువుగా జుంజుమ్మని ఝంకారంచేసే తుమ్మెదల సమూహంగలదీ, శరత్మాల చంద్రకిరణాల సమూహాలచేత ఛిన్నాభిన్నమైన చీకట్లు కలదీ, యమునానది అలలచేత చేరిన మెత్తని ఇసుకతో విలసిల్లేదీ, అచ్చమైందీ అయిన సైకతస్థలానికి చేరుకున్నాడు. అక్మడ గోపికారమణులు జ్ఞానోదయ(సమయం)చేత పరమ్మాతను సందర్శించి, శ్రీ కృష్ణునివిరహంవల్ల ఇంతవరకూ ఉన్న తాపాన్ని పోగొట్టుకున్నారు. వారి కోరికలన్నీ పరిపూర్ణంగా నెరవేరాయి.
పరీక్షిన్మహారాజా! మీననేత్రలయిన ఆగోపరమణులు తమ హృదయసీమలలో ఉత్సాహాలు సందడించగా, తమ మెత్తని పైట చెరగులతో ప్రియుడైన శ్రీకృష్ణునికి ఆసనం కల్పించారు.
యోగీశ్వరులహృదయాలు అనే సుఖాసనాలమీద కూర్చునే ఆ పరమేశ్వరుడు ముల్లోకాలకు దేవేరి అయిన శ్రీమహాలక్ష్మి తన శరీరంమీద తేజరిల్లగా, గోపకాంతలు పయ్యెద కొంగులతో కల్పించిన ఆసనం మీద ఆసీనుడయ్యాడు.
(యోగీశ్వరులహృదయాలు గోపకాంతల పయ్యెదకొంగులు పరమాత్మకు ఆసనాలయ్యాయి. గోపికలు త్రేతాయుగంలో మునీశ్వరులు అనే అంశం ఇక్కడ స్ఫురిస్తున్నది.)
ఆ ముగ్ధలు మరులు పెంపొందిస్తూ ఉన్న రమణునికి సమ్మానం చేస్తూ నవ్వుతో కూడినచూపులలో శృంగారం ఒలకపోస్తూ ఆయనపాదాలను చేతులతో ఒత్తుతూ, ఆయనశరీరాన్ని స్పృశిస్తూ, తూలనాడుతూ, పరిహాసవచనాలు పలుకుతూ, కొద్దిగా కోపం తెచ్చుకున్నందువల్ల ప్రకాశించే ముఖాలు గలవారై ప్రేమతో ఇలా పలికారు.
నందనందనా! కొందరు తమను సేవించిన వారినే సేవిస్తారు. మరికొందరు తమను సేవించని వారినికూడా సేవిస్తారు. ఇక కొందరు సంతోషంతో తమను సేవించేవారినీ, సేవించనివారినికూడా సేవించరు. (వీరిలో నీ వెలాంటి వాడవో తెలుపు)
ఇలా తనను ఉద్దేశించి నర్మగర్భంగా పలికిన గోపసుందరుల పలుకులు విని గోపసుందరుడు ఇలా పలికాడు.
ఓ గోపికలారా! పశువులను ఫలం ఆశించి కొలిచిన విధంగా కొందరు కొలుస్తారు. వారు తమసొంతప్రయోజనమే కోరుకునేవారు. వారికి స్వార్ధమే పరమావధి. కొలిస్తేనే తిరిగి కొలవడం స్నేహధర్మంకాదు.

ఇక కొందరు దయగలవారు. మంచి మనసున్నవారు. తండ్రులు ఎలాగయితే తమను కొలువని కుమారులనూ కొలుస్తారో అలాగా తమను కొలువనివారిని కూడా కొలుస్తారు. వారి స్నేహధర్మాలు ప్రతిఫలం ఆశించనివి.
మరికొందరు ఇతరులను కొలిచే ఉద్దేశంలేనివారు. వీరు తమను కొలిచేవారినైనా, కొలువని వారినైనా కొలువరు. వారు ఆత్మయందే రమించేవారు, భోగేచ్చలేనివారు. మరికొందరు మూర్ఖులు. మిక్కిలి కఠినహృదయులు. వారిలో నన్ను ఈ చివరితెగకు చెందినవానినిగా భావించి మీరు ఇలా పలుకుతున్నారు. ఔనా?
ఓ తరుణులారా! నేను పైన చెప్పిన వారిలో ఎవ్వడనూ కాను. పరమకరుణార్ణ హృదయుడను. మీకు ఆత్మబంధువును. మీకు నిరంతరధ్యానం సమకూర్చడానికే కనిపించకుండా వెళ్లాను సుమా!
(దగ్గరనే ఉంటే గోపికలకు నిరంతరధ్యానం కుదరదు. దూరంగా ఉంటేనే వారికి కృష్ణునిమీద నిరంతరధ్యానం సిద్ధిస్తుంది.)
నన్ను సేవిస్తూ ఉండేవారికి నేను నారూపం చూపించను. ఎందుకంటే నన్ను దర్శించిన తర్వాత గర్వించి నన్ను కొలవడం మానేస్తారేమోనని. తనకున్న డబ్బుపోయినప్పుడు దరిద్రుడైనవాడు నిరంతరం డబ్బు చింతలోనే మునిగి పోయినట్లు నన్ను చూడకుండా ఉంటేనే నన్ను కోరే భక్తులు నా రూపాన్ని నిరంతరం ధ్యానిస్తూ ఉంటారు.
న్యాయమూ, ధర్మమూ పట్టించుకోకుండా మీ తల్లిదండ్రులను, బంధువులను, భర్తలను, బిడ్డలను వదిలివచ్చి, నాయందు మనసులు లగ్నంచేసిన మిమ్మల్ని వదిలివెళ్లడం న్యాయం కాదు. అలా వదిలి వెళ్లినందుకు నన్ను మన్నించండి. నా వియోగభారంతో చింతిస్తూ మీరు పలికిన పలుకులను వింటూనే ఉన్నాను.
(కృష్ణుడు గోపికలకు క్షమాపణ చెప్పడం ఆయన గొప్పమనస్సుకు, దయార్దహృదయానికి సాక్ష్యం.)
ఓ భామినులారా! విడిపోని సంసారమనే సంకెళ్లను తొలగించుకొని నాయందే నిరంతరాయంగా మనస్సును నిమగ్నంచేసిన మీకు, ఎన్నియుగాలైనా ప్రత్యుపకారం చేయలేను. (అంటే అంతటి గొప్ప ప్రేమమీది) నేను మిమ్ములను వదిలివెళ్లడం కృతజ్ఞత లేనందువల్ల కాదు,

నన్ను మీరు నిరంతరం ధ్యానంచేస్తూ ఉండాలనే. ఇదే నేను మీకు చేసిన ప్రత్యుపకారంగా భావించి, నేను వదిలి వెళ్లడాన్ని తప్పుగా భావించక, దయతో మీ కోపాన్ని తగ్గించండి.
(ప్రేయసులను బతిమలాడుకునే సామాన్యప్రేమికుడిగా కృష్ణుడు క్షమాపణ చెప్పుకోవడం ఆయన లీలగానే భావించాలి.)
ఓ పరీక్షిన్మహారాజా! ఇలా మనోజ్ఞంగా పలికిన కృష్ణుని మాటలాలకించి తీవెబోడులైన గోపరమణులు అతని చక్కని మాటలతోను, సంగమంతోను, తమ హృదయాలలో ఇంతవరకూ నిండి ఉండే విరహవేదనలను, ఒక్కసారిగా వదిలేశారు.
నిత్య స్తోత్రావళి
నిత్య పారాయణ శ్లోకాలు
స్తోత్రాలు
పంచాంగం

రాస క్రీడాభివర్ణనము
శ్రీ మహా భాగవతము
శ్రీ మహా భాగవతము ద్వితీయస్కంధము
శ్రీ మహా భాగవతము తృతీయస్కంధము
శ్రీ మహా భాగవతము చతుర్ధస్కంధము
శ్రీ మహా భాగవతము పంచమస్కంధము
శ్రీ మహా భాగవతము షష్టస్కంధము
శ్రీ మహా భాగవతము సప్తమస్కంధము
శ్రీ మహా భాగవతము అష్టమస్కంధము
శ్రీ మహా భాగవతము నవమస్కంధము
శ్రీ మహాభాగవతము దశమస్కంధము - పూర్వభాగము
శ్రీ మహా భాగవతము
శ్రీ మహా భాగవతము ద్వితీయస్కంధము
శ్రీ మహా భాగవతము తృతీయస్కంధము
శ్రీ మహా భాగవతము చతుర్ధస్కంధము
శ్రీ మహా భాగవతము పంచమస్కంధము
శ్రీ మహా భాగవతము షష్టస్కంధము
శ్రీ మహా భాగవతము సప్తమస్కంధము
శ్రీ మహా భాగవతము అష్టమస్కంధము
శ్రీ మహా భాగవతము నవమస్కంధము
శ్రీ మహాభాగవతము దశమస్కంధము - పూర్వభాగము
నిత్య స్తోత్రావళి
నిత్య పారాయణ శ్లోకాలు
స్తోత్రాలు
పంచాంగం
No comments:
Post a Comment