ఈలోగా హనుమంతుడు తన కార్యక్రమంలో వన విధ్వంసంతోపాటు చైత్య, ప్రాసాదాలు కూడా నేల కూల్చాలని నిశ్చయించుకుని మహాదైెత్యం మీదకు దుమికాడు.
మహోన్నతమయిన ఆ భవనంమీద రెండవ సూర్యునివలె వెలుగుతూ దాని పునాదులు కదలించి నేలమట్టం చేశాడు. చేస్తూనే ఒక్కసారి భుజాస్పాలనం చేశాడు. ఆ ధ్వనికి అక్కడి కాపలాజనం మూర్చపోయారు. మరొక్కమారు సింహగర్ణన చేసి:
అస్త్రవి జ్జయతాం రామో
లక్ష్మణశ్చ మహాబలః
రామ లక్ష్మణులకు జయం. రాఘవ పాలితుడయిన మా ప్రభువుకి స్వస్తి, నేను రామదూతను. శత్రుసంహార సమర్థుడను, వాయుపుత్రుడనైన నా ముందు రావణులు వేలమంది ఆగరు,
ఈ లంకను ధ్వంసం చేసి, సీతాదేవికి ప్రణామాలర్పించి మీరందరూ చూస్తూండగా నిశ్చింతగా తిరిగి వెడతాను, అని గర్జిస్తుంటే కొందరు చెత్యపాలకులు ఆయుధధారులై హనుమంతుని హింసించడానికి రాగా, వారి మధ్య మారుతి, గంగానదిలో పెద్ద సుడిగుండంలా కనిపించాడు.
వారిని దగ్గరగా రానిచ్చి, చైెత్యస్తంభం ఒకటి అందుకున్నాడు. ఆ వేగతీవ్రతకు నిప్పుపుట్టి భవనం ధ్వంసం అయింది.
వజ్రపాణి అయిన దేవేంద్రునివలె స్తంభహస్తుడైన హనుమంతుడు గగనవీధిని నిలిచి:
ఓ రాక్షసులారా! మహాబలిష్ఠులయిన మా వానర వీరులెందరో సుగ్రీవుని ఆజ్ఞానుసారం భూమండలం అంతా తిరుగుతున్నారు.
ఆ మహావీరులలో కొందరు దశమత్తేభాలతో సమమయిన బలం గలవారు. కొందరి బలం వంద ఏనుగులు, మరికొందరు సహస్ర గజబలులు. వాయుబలం, ప్రవాహవేగబలం కలవారెందరో ఉన్నారు.
వాడిగోళ్ళు, సుడి తిరిగిన దంతాలు, అవే ఆయుధాలుగా కల కోట్ల వానర వీరులతో మా సుగ్రీవ చక్రవర్తి మిమ్ము సంహరించడానికి వస్తున్నాడు.
మహాత్ముడైన ఇక్ష్వాకు వంశీయుడు రామునితో వైరం తెచ్చుకున్న మీకు ప్రాణాలు మిగులవు, ఈ లంక వుండదు. మీ రాజు అసలే వుండడు, అని గర్జించాడు.
ఆ సమయానికి జంబుమాలి వచ్చాడు.
వాడు మహా బలిష్ఠుడు. యుద్ధయోగ్యంగా ఎర్రవస్త్రాలు ధరించాడు. వస్తూనే నారి సారించి వదిలాడు. ఆ ధనుష్టంకారం కర్ణభేద్యంగా వుంది. దిక్కులు దద్దరిల్లేలా వుంది.
ఖర వాహన బద్ధమయిన రథంమీద వచ్చే వానిని చూచి హనుమ ఉత్సాహంతో గర్జించాడు. వాడు వస్తూనే బాణాలు విడిచాడు.
ఆ బాణ ఘాతాలతో శరత్కాలంలో సూర్యకిరణాలు సోకి వికసించిన అరుణకమలంలా వుంది హనుమంతుని వదనం.
ఆ దెబ్బ తిన్న మారుతి తన ప్రక్కనున్న గండశిల పెల్లగించగా దానిని పది బాణాలతో పొడి పొడి చేశాడు జంబుమాలి.
హనుమంతుడు మహావృక్షాన్ని పెల్లగించాడు. దాన్ని కూడా ముక్కలు ముక్కలు చేసి హనుమంతుని మీద బాణాలు వదులుతూంటే చేతికందిన పరిఘాయుధం అందుకుని గిర్రున త్రిప్పి విసిరాడు. అంతే!
జంబుమాలి అవయవాలన్నీ సంధులూడి జారిపోయాయి, రధం, ఆయుధాలు ముక్కలయ్యాయని విన్న రావణుడు మరికొందరు మంత్రి పుత్రులను పంపించాడు.
మంత్రి పుత్రులు

No comments:
Post a Comment