ఆకాశ సముద్రంలో-
చంద్రుడే కలువ
సూర్యుడు నీటి కోడి.
పుష్యమీ, శ్రవణ నక్షత్రాలు హంసలు.
పునర్వసు మహా మీనం.
అంగారకుడు మొసలి.
స్వాతి నక్షత్రం హంసపథం.
ఐరావతం ద్వీపం.
మేఘాలే శైవలిని.
చంద్రకిరణాలు వాయు విచలిత తరంగాలు.
పద్మాలు, నాగ, యక్ష, గంధర్వులు.
అటువంటి సాగరాకాశాన్ని వేగగమన నౌకతో దాటుతున్నాడు, హనుమంతుడు.
సూర్య, చంద్ర, తారామండలాలను మింగుతున్నాడా అన్నట్టు సాగుతున్నాడు. మేఘమండలాలను లాక్కుంటూ వెడుతున్నాడు.
ఒక్కసారి వాటిలో దూరి, మరొకసారి పైకివచ్చి దోబూచులాడుతున్నాడు. మబ్బుల మాటున - ధవళ వస్త్రధారి హనుమంతుడు - చంద్రుని వలె వున్నాడు.
గరుత్మంతునివలె గోచరిస్తున్నాడు.
దారిలో మైనాకగిరిశిఖరాన్ని హస్తస్పర్శతో అనందింపజేసి ముందుకు సాగి మహేంద్రగిరిని సుదూరాన చూచి సింహనాదం చేశాడు. దీర్ఘవాలాన్ని ఆడిస్తూ ఆనందంతో చేసిన ఆ మహాధ్వనికి దిక్కులు దద్దరిల్లాయి. ఆకాశం బ్రద్ధలవుతుందా అన్నట్లుంది ఆ ధ్వని.
ఈవలి ఒడ్డున వున్న వానరవీరులు ఆ మహాగర్జన విని, అది ఏమా అని ఎదురు చూస్తున్నారు. వారిలో వృద్ధుడైన జాంబవంతుడు వారందరినీ దగ్గరగా చేర బిలిచి:
నాయనా! విన్నారా! ఆ గర్జ! కార్యసాధకుడు కాకపోతే అలా గర్జించలేడు. నిస్సంశయంగా మనవాడు విజయం సాధించి వస్తున్నాడన్నాడు.
పరమ సంతోషంతో వారందరూ పర్వతశిఖరాల మీద, చెట్ల చివరి కొమ్మల మీద గంతులు వేస్తూ హనుమంతుని రాకకోసం నిరీక్షిస్తున్నారు. మేఘం మీద మేఘం వస్తున్నట్టు దిగే హనుమంతునికి దోసిలి ఒగ్గి నిలిచారు.
నాయనా! విన్నారా! ఆ గర్జ! కార్యసాధకుడు కాకపోతే అలా గర్జించలేడు. నిస్సంశయంగా మనవాడు విజయం సాధించి వస్తున్నాడన్నాడు.
పరమ సంతోషంతో వారందరూ పర్వతశిఖరాల మీద, చెట్ల చివరి కొమ్మల మీద గంతులు వేస్తూ హనుమంతుని రాకకోసం నిరీక్షిస్తున్నారు. మేఘం మీద మేఘం వస్తున్నట్టు దిగే హనుమంతునికి దోసిలి ఒగ్గి నిలిచారు.
హనుమంతుడు మహేంద్రగిరిమీద రెక్కలు లేని పర్వతంలా దిగాడు. అందరూ హనుమంతుని చుట్టూ చేరారు.
అనాయాసంగా అంత ప్రయాణం చేసి వచ్చిన హనుమకు వారందరూ దుంపలూ, పళ్ళూ కానుక లర్పించారు.
వృద్దుడయిన జాంబవంతునికి, యువరాజయిన అంగదునికి అభివాదం చేశాడు. చేస్తూనే:
ఆలోచించాడు; హనుమంతుడు.
ఆలోచించాడు; హనుమంతుడు.
"దృష్టాసీతా" చూశాను సీతను, అని-
రాక్షసస్త్రీజన మధ్యంలో, ఏకవేణితో, ఉపవాస కృశీభూతదేహంతో, రామ విరహ శోకంతో మలినవస్త్రంతో ఉన్నది, అన్నాడు.
చూశాను అనేమాట అమృత ప్రాయంగా విని వారందరూ సింహ నాదాలతో, కిల కిలా రావాలతో, ఉరుములతో, తోకలు పొడుగుచేస్తూ పైకెత్తుతూ. నేలమీద తాడిస్తూ, గిరిశిఖరాలకు దూకుతూ, చెట్లమీదికి ఎగురుతున్నారు.
అంగదుడు: హనుమా! నీ వల్ల మా అందరి ప్రాణాలూ నిలిచాయి. ఇప్పుడు మనం రామ దర్శనం చెయ్యగలం. నీ పరాక్రమ, ధైర్య, ప్రభు భక్తులు ప్రశంసనియాలు, నీ అదృష్టం వల్ల నువ్వు జానకిని చూడగలిగావు. సీతా వియోగ దుఃఖం రామునికి ఉండదు, అంటూండగా మిగిలిన వారందరూ హనుమంతుని యాత్రా విశేషాలు వినడానికి చుట్టూ చేరి కూర్చున్నారు. ఆ వానరవీర మధ్యంలో అంగదుడు దేవ పరివృతుడైన దేవేంద్రుని వలె ఉన్నాడు.
ఆ వానర యోధులతో పర్వత శిఖరం శోభిస్తున్నది.
అన్వేషణ గాథ
ఆ వానర యోధులతో పర్వత శిఖరం శోభిస్తున్నది.
అన్వేషణ గాథ
No comments:
Post a Comment