శ్రీ మహాభాగవతము దశమస్కంధము - పూర్వభాగము -
సర్పరూపియగు సుదర్శనుండను గంధర్వుని శాపవిమోచనముతరువాత ఒకరోజు నందుడుమొదలైన గోపాలకులు పశుపతి జాతరకోసం ఎడ్లబండ్ల నెక్కి అంబికావనానికి వెళ్లారు. అక్కడ వారు సరస్వతీనదిలో స్నానంచేసి, పార్వతీపరమేశ్వరులను పూజించి కానుకలు సమర్పించారు.
బ్రాహ్మణులకు గోవులు, బంగారం, వస్త్రాలు, అన్నమూ దానం చేశారు. తాము నీరుమాత్రమే ఆహారంగా గ్రహించి, నియమనిష్ఠలతో ఉన్నారు.
అప్పుడు విధివిశాత్తూ ఆకలిగొన్న ఒక మహాసర్పం నిద్రపోతూ ఉండిన నందుణ్ణి కరచి మింగడానికి ప్రయత్నించింది. అతడు 'కృష్ణా! కృష్ణా! నన్ను విడిపించు' అంటూ మొరపెట్టుకున్నాడు. ఆ మొరను గోపాలకులు విని
రాజా! గోపాలకులందరూ మేల్కొన్నారు. కోపంతో ఆ పామును పెద్దపెద్ద దుడ్డుకర్రలతోనూ, కొరవులతోనూ మొత్తారు. అయినా ఆ క్రూరమైన మహాసర్పం నందుణ్ణి వదలకుండా పట్టుకొంది.
ఆ సమయంలో శ్రీకృష్ణుడు విజృంభించి, కాలితో ఆ పామును తన్ని ఒక తొక్కు తొక్కాడు. వెంటనే ఆ పాము తన సర్పరూపం విడిచి, ఒక గంధర్వని రూపం దాల్చింది. శ్రీకృష్ణుడు అతనితో ఇలా అన్నాడు.
ఓ పండితశ్రేష్ఠుడా! అలంకృతమైన రూపంతో, బంగారుహారంతో, శుభలక్షణాలతో విరాజిల్లే నీకు ఈ క్రూరమైన పెనుబామురూపం ఎందుకు వచ్చింది? నీవెవరు? నీ పేరేమి? ఏ కారణంగా ఈ జన్మ కలిగింది? ఒకటొకటే నాకు వివరంగా తెలుపు. నీవు నందుణ్ణి పట్టుకొన్న చర్య వింతగొలుపుతూ ఉంది.
శ్రీకృష్ణుని పలుకులకు అతడిలా అన్నాడు. నేను విద్యాధరుణ్ణి నా పేరు సుదర్శనుడు. నేను సౌందర్యగర్వంతో పుష్పకవిమానంపై దిక్కులు తిరుగుతూ ఉండేవాణ్ణి.

ఒకనాడు అంగిరసుని సంతతివారు, అందం లేనివాళ్లు అయిన ఋషులను చూచి పరిహాసంగా నవ్వాను. వారు 'సౌందర్యదర్పంతో నువ్వు మమ్ములను చూసి నవ్వావు కాబట్టి పెనుబామువై పడిఉండు మని శపించారు. నేను బతిమలాడగా ఇలా అనుగ్రహించారు.
'ఓ మూర్ఖుడా! భక్తుల భయాన్ని పోగొట్టడంకోసం శ్రీహరి యాదవకులంలో జన్మిస్తాడు. అతడు ఒకనాడు ఈ అడవికి వస్తాడు. అతనికాలితన్ను తిని నీవు సర్పరూపం విడిచి, నీ తొలిరూపమైన విద్యాధరరూపం పొందగలవు అని దయానిధులైన ఆ ఋషులు పలికారు.
ఓ పద్మనేత్రా! నిన్ను ధ్యానించినా, నీ మహిమలు విన్నాా నీ నామం కీర్తించినా పాపరాశి మొదలంటా కృశించి నశిస్తుందని అంటారు. నా మీద నీ పాదం మోపితే నాకు ఆ ఋషులశాపంవల్ల సంక్రమించిన వికారాకారం పోకుండా ఉంటుందా? నా సర్పరూపం పూర్తిగా పోయింది. నేను ఇక వెళతాను.
సుదర్శనుడు ఇలా మనవి చేసి, శ్రీకృష్ణునికి ప్రదక్షిణం చేసి, నమస్కరించి దేవలోకానికి తిరిగి వెళ్లిపోయాడు. నందగోపుడు సర్పంనుండి విముక్తి పొందాడు. ఈ సంగతి విన్న గోపకులు ఆశ్చర్యపోయారు. పశుపతిజాతరను గోపాలకులు సంపూర్తిగా నిర్వహించి తిరిగి తమ గోకులానికి మరలిపోయారు.
శ్రీకృష్ణు౦డు కుబేరభటుండగు శంఖచూడుండను గుహ్యకుని సంహరించుట
నిత్య స్తోత్రావళి
నిత్య పారాయణ శ్లోకాలు
స్తోత్రాలు
పంచాంగం

శ్రీ మహా భాగవతము
శ్రీ మహా భాగవతము ద్వితీయస్కంధము
శ్రీ మహా భాగవతము తృతీయస్కంధము
శ్రీ మహా భాగవతము చతుర్ధస్కంధము
శ్రీ మహా భాగవతము పంచమస్కంధము
శ్రీ మహా భాగవతము షష్టస్కంధము
శ్రీ మహా భాగవతము సప్తమస్కంధము
శ్రీ మహా భాగవతము అష్టమస్కంధము
శ్రీ మహా భాగవతము నవమస్కంధము
శ్రీ మహాభాగవతము దశమస్కంధము - పూర్వభాగము
శ్రీ మహా భాగవతము ద్వితీయస్కంధము
శ్రీ మహా భాగవతము తృతీయస్కంధము
శ్రీ మహా భాగవతము చతుర్ధస్కంధము
శ్రీ మహా భాగవతము పంచమస్కంధము
శ్రీ మహా భాగవతము షష్టస్కంధము
శ్రీ మహా భాగవతము సప్తమస్కంధము
శ్రీ మహా భాగవతము అష్టమస్కంధము
శ్రీ మహా భాగవతము నవమస్కంధము
శ్రీ మహాభాగవతము దశమస్కంధము - పూర్వభాగము
నిత్య స్తోత్రావళి
నిత్య పారాయణ శ్లోకాలు
స్తోత్రాలు
పంచాంగం
No comments:
Post a Comment