సత్యభామ నరకాసురునితో యుద్ధంబు సేయుట
శ్రీకృష్ణుడు యుద్ధంలో దుర్మార్గులయిన రాక్షసుల్ని సంహరించటానికి వచ్చిన సత్యభామను చూచి, రసమయము లయిన మంచి మాటలతో

సత్యభామా! నేను రాక్షసుల్ని జయించలేనా? నీవెందుకు కయ్యానికి పూనుకొని లేచావు? ఈ ప్రక్కకు రా! లెమ్ము. యుద్ధప్రయత్నం మాను; మానుకోలేకపోతే నా ధనుస్సును చేతితో తీసికో! లే!
అని చెప్పి
శ్రీకృష్ణుడు దేవతలను ఆనందింపజేయునది, వీరులూ గట్టివారు అయిన రాక్షస సైన్యానికి భయం కలిగించేదీ, శత్రువుల అహంకారాన్ని పోగొట్టేదీ అయిన వింటిని సత్యభామకు ఇచ్చాడు.
సత్యభామ శ్రీకృష్ణుడు ఇచ్చిన వింటిని పుచ్చుకొనింది. వెంటనే ఆమె బలం పొందింది. ఆ బలంవల్ల మహాతేజస్సూ, ఆ తేజస్సుచేత మహాపరాక్రమమూ ఆమెలో కలిగాయి.

అప్పుడు ఆమెవైపు కన్నెత్తి చూడటానికి రాక్షసవీరులకు అశక్యమయింది. తర్వాత సత్యభామ యుద్ధంమీద గల తహతహపాటుతో రాక్షసస్త్రీల కంఠాలకున్న మంగళసూత్రాలు తెగిపోయేటట్లు తన వింటియందు అల్లెత్రాటిని బిగించింది.
(ఇక్కడ సత్యభామ ఒక తాడును బిగిస్తుంటే, అక్కడ మరొక తాడు తెగిపోతున్నది అనడం ఇందులోని చమత్కారం.)
సత్యభామ, శత్రుసైన్యం తత్తరపడే ధ్వని వ్యాపింపగా, ఏనుగులు మొదలయినవి మూర్చపడగా అల్లెత్రాటిని మ్రోగించింది.
సత్యభామ యుద్ధం చేసేటప్పుడు ఆమెబంగారుగాజుల ఝణఝణధ్వనీ, అల్లెత్రాటిధ్వనీ ఏకమయ్యాయి. ఆమె చెవిపోగులలో పొదిగిన మణుల ధగధగమనే కాంతులు చెక్కిళ్లకాంతులను కప్పివేశాయి. ఆమెకడగన్నుల తళతళమనే కాంతులు బాణాల కాంతులను అణచి వేశాయి.

ఆమె ఏయుచున్న బాణాల ఘుమఘుమారావం, సైనికుల కలకలాన్ని మాన్సింది. వీర-శృంగార-భయానక-రౌద్ర-అద్భుత రసాలు కలసి, ఈ వీరనారిగా రూపొందిందేమో అని అనుకొనునట్లుగా ఆమె కనబడుతూంది.
ఆమె ఎప్పుడు బాణాన్ని వింటియందు కూర్చుతూ ఉందో, ఎప్పుడు నారిని లాగుతూ ఉందో! ఎప్పుడు బాణాన్ని ప్రయోగిస్తుందో తెలియడం లేదు.
సత్యభామ ఒయ్యారపుపోకడలు పోతూ రోషంతో ఏర్పడిన బొమముడులతో, వీరరసం అతిశయించగా, వాడి అయిన అస్త్రాలను ప్రయోగిస్తూ నరకాసురుణ్ణి పీడించటానికి ప్రయత్నించింది.

అనురాగంవల్ల జనించిన చిరునవ్వులు చిందిస్తూ, శృంగారరసం ఉద్దీపింపగా; కన్నులలో సొగసు కనబడగా; రసమయములయిన చూపులను ప్రసరింపజేస్తూ భర్త అయిన శ్రీకృష్ణుణ్ణి ఆనందింపజేయటానికి ప్రయత్నించింది. ఇలా వీర శృంగారాల్ని ఒక్కట ప్రదర్శించిన వీర శృంగారనారి సత్యభామ.
సత్యభామ సొగసు - ఉట్టి పడేటట్లు రాక్షసులతో యుద్ధం చేసేటప్పుడు విలుకానివలె ఎడమకాలు ముందుంచి నిలిచింది. ఆమె ముంగురులు నొసలి చెమటలో చెదిరాయి. ఆమె చెవివరకు లాగిన అల్లెత్రాటిని పట్టుకొన్న చేతివేళ్ల గోళ్ల కాంతులూ, అమ్ముల వెనుక భాగపు కాంతులూ అంతటా వ్యాపిస్తున్నాయి.

ఆమె చూపు గురి తప్పలేదు. ఆమె నారిని లాగటంవల్ల గుండ్రంగా అయిన వింటినుండి బాణాలు వదలి శత్రువుల్ని సంహరించింది. ఇలా సత్యభామ తన యుద్ధవిద్యావైశారద్యాన్ని ప్రదర్శించింది.
బొమ్మల పెళ్లిళ్లకు వెళ్లటాని కంగీకరించని బాలిక యుద్ధరంగాని కేవిధంగా రావాలనుకొనింది? మగవాళ్ళను చూచి చాటుకు వెళ్లే మహిళ శత్రువుల్ని జయించాలని ఎట్లా నిశ్చయించింది? బంగరు టుయ్యాలల్ని ఎక్కటానికి భయపడే పిరికిది గరుత్మంతుని మూపు ఏ తీరుగా ఎక్కింది?

చెలికత్తెల పెద్దరొదలను సహింతచని చిన్నది యుద్ధవాద్య భాంకారాలను ఏ రకంగా ఓర్చుకొన్నది? నెమళ్లకు నృత్యం నేర్పుతూ కొంచెం సేపటికే అలసిపోయే సుకుమారి ఆలీఢపాదాదిపద్ధతులతో శత్రువుల గర్వం అణచివేయటానికి ఏ విధంగా సిద్ధపడింది?
వీణను చక్కగా పట్టుకోలేని వనిత వింటిని ఏ విధంగా పట్టగలిగింది? తీగను చెట్టుకు కట్టలేని మహిళ ఏ విధంగా వింటిచివర అల్లెత్రాటిని బిగించింది? క్రమంగా ముత్యాలు గ్రుచ్చలేని అబల ఏవిధంగా అల్లెత్రాటితో బాణాన్ని సంధించింది? చిలుకకు పద్యం చెప్పలేని అశక్తురాలు అస్త్రమంత్రాలు ఎప్పుడు నేర్చుకొనింది?

మాట్లాడ మన్నప్పుడు ఎక్కువసేపు మాట్లాడలేని అమాయకురాలు ఏ విధంగా సింహనాదాలు చేసింది? - అని అనుకొనేటట్లుగా సద్గుణరాశీ, మనోజ్ఞకాంతిసంపన్న ఐన సత్యభామ ప్రకాశించింది.
సత్యభామ, అల్లైత్రాటిమోత ఉరుముగా, దేవతలు చాతకపక్షులుగా, ధనుస్సు ఇంద్రధనుస్సుగా, శ్రీకృష్ణుడు మేఘంగా, తాను మెఱపుతీగగా, బాణాలు నీటితుంపురులుగా, రాక్షసులు అనే కార్చిచ్చు ఆరిపోగా వర్షాకాలాన్ని సృష్టించింది.
శృంగారరసం అతిశయించటం చేత ప్రియుడయిన శ్రీకృష్ణునికి సత్యభామ ముఖం పూర్ణిమనాటి చంద్రబింబమై, చీరకొంగు మన్మథధ్వజమై, గుండ్రని విల్లు మన్మథుని కాంతిమండలమై, ఆమె సందర్శనం అమృత ప్రవాహమై, బాణవర్షం సంతోషదాయకమై గోచరించాయి.

వీరరసం విజ్బంభించటంవల్ల శత్రువయిన నరకాసురునికి సత్యభామ ముఖం సూర్యబింబంగా, పయ్యెదకొంగు అరిష్టహేతువయిన తోకచుక్కగ్గా; గుండ్రని విల్లు ప్రళయకాలం నాటి సూర్యుని ప్రభాపుంజంగా, ఆమెసందర్శనం అగ్నిజ్వాలాసమూహంగా, బాణవర్షం మహాకోపప్రదంగా కనబడింది. శృంగారవీరరసాల్ని ఇలా హరికి, అరికి మధ్య విస్తరింపజేసింది సత్య!
(ఈ నరకాసురవధాఘట్టాన్ని పోతన నాచనసోముని ఉత్తర హరివంశంనుండి గ్రహించి, రూపొందించాడు.)
ఈ తీరున
సత్యభామ ప్రయోగించిన వాడి బాణాలకు తాళజాలక పెంపుచెడి, సమృద్ది కోల్పోయి యుద్ధ ప్రయత్నాలు చేయలేక రాక్షససేనలు నరకాసురుని మరుగుజొచ్చాయి. చెదరిపోయాయి.
అప్పుడు శ్రీకృష్ణుడు సత్యభామను చూచి సంతోషం కలిగించేవాడు, దయతో చూచేవాడు; అమృతంవంటి మాటలు పలికేవాడు, ఆమె యుద్ధప్రయత్నాల్ని నివారించేవాడూ అయి ఇట్లా అన్నాడు.
సత్యా! రాక్షసరాజుసైన్యం యుద్ధరంగంనుండి పారిపోయింది. నీవు మహావిజయం పొందావు. నిన్ను మెచ్చాను. నీవు కోరిన సొమ్ములన్నీ ఇస్తాను. స్వీకరించు.
శ్రీకృష్ణుడు గౌరవాన్ని వెల్లడించేవీ, మోహాన్ని పుట్టించేవీ, మనస్సునందలి కలతలను దూరంచేసేవీ అయిన సరస సల్లాపాలతో కళావిశారద అయిన సత్యభామను బహుమానించి ఆమె చేతిలో ఉన్న వింటిని తిరిగి తీసుకొన్నాడు. అప్పుడు నరకాసురుడు అతనితో ఇలా అన్నాడు.
శ్రీకృష్ణా! ఆడుది మగవారిముందు పౌరుషం ప్రదర్శిస్తున్నప్పుడు నీవు యుద్ధం మానటం పౌరుష మనిపించుకోదు. రాక్షసులు వీరులకే వీరులు కావటంవల్ల అబలలతో యుద్ధం చేయరు.
నరకాసురు డారీతిగా పలుకగా శ్రీకృష్ణుడు ఈ విధంగా అన్నాడు.
ఓరీ నరకాసురా! దేవతాస్త్రీలు, కిన్నరాంగనలు చూచి సంతోషింపగా మహాభయంకరమైన శరీరం కలిగిన నిన్ను నేడే నా బాణాలతో సంహరిస్తాను.
శ్రీకృష్ణుడు 'శతఘ్ని' అనే లోకాతీతమయిన అస్త్రాన్ని నరకాసురుని భటులమీద వేయగా వారందరూ మహాక్షోభకు గురి అయ్యారు.
శ్రీకృష్ణుని బాణాలచేత ఖండించిన గుర్రాలూ; గదచేత బ్రద్దలుచేసిన ఏనుగులూ, చక్రంచేత అవయవాలు తెగకొట్టబడిన వీరులూ గలదైన రాక్షససైన్యం దురవస్థపాలై, దుర్బలమై, హీనదశకు వచ్చి, అతనియెదుట నిలువలేక హాహాకారాలు చేస్తూ పారిపోయింది.
ఆ సమయంలో
పరీక్షిన్మహారాజా! శ్రీకృష్ణుడు రాక్షసయోధశ్రేష్ఠులు ప్రయోగించిన బాణాల్ని మూడుమూడు బాణాలను తడవ తడవకు వేసి, ముక్కముక్కలు చేశాడు.
పరీక్షిన్మహారాజా! శ్రీకృష్ణుణ్ణి, సత్యభామను మూపున మోస్తూ, గరుత్మంతుడు యుద్దానికి సిద్ధపరచిన నరకాసురుని గజబలాన్ని గోళ్లతో రక్కాడు. ముక్కుతో పొడిచాడు. రెక్కలతో బాదాడు.
గరుత్మంతుడు రెక్కలాడించటంవల్ల పుట్టిన గాలితాకుడు సహింపలేక - చావగా మిగిలిన సైన్యం పట్టణంలో ప్రవేశించింది. ఇది చూచి నరకాసురుడు పూర్వం వజ్రాయుధాన్నే త్రిప్పికొట్టిన తనశక్త్యాయుధాన్ని గరుడునిమీద ప్రయోగించాడు. గరుత్మంతుడు పూలదండవ్రేటుకు చలింపని మదగజంమాదిరిగా ఆ శక్తిదెబ్బకు తట్టుకొని నిలబడగలిగాడు. అప్పుడు ఏనుగునెక్కి నరకాసురుడు యుద్ధరంగంలో
మదించిన ఏనుగు నెక్కి నరకాసురుడు శ్రీకృష్ణుణ్ణి కొట్టటానికి శూలం చేపట్టాడు. అతడు శూలాన్ని చేతితో అందుకొనే లోపల శ్రీకృష్ణుడు తన కాంతిపరంపరచే రాక్షసవీరుల్ని ధ్వంసంచేసే చక్రాన్ని చేపట్టి, రత్నకుండలాలతో కూడిన అతనితలను నరికాడు.
ఓ తల్లీ! "పూర్వం వరాహావతారసమయంలో నేను విష్ణువునకు భార్య నయ్యానని చాటుకొంటూ ఉంటావు. నిన్ను తలచి అయినా నన్ను కాపాడడు గదా! అయ్యో! నిర్దయుడై శిరస్సును ఖండించాడు" అని తల్లిని నిందిస్తున్నట్లు యుద్ధభూమిమీద రోదిస్తూ నరకాసురుడు పడిపోయాడు.
"నరకాసురుడు నేలగూలటం ఈ దినం కళ్లారా చూచాము. బ్రతికిపోయాము గదా!" అని దేవతలూ, మునులూ వెంటనే ఆకాశంనుండి పూలవాన కురిపిస్తూ, ఏ సందేహం లేకుండా శ్రీకృష్ణుణ్ణి స్తుతించారు.
పిమ్మట భూదేవి శ్రీకృష్ణుణ్ణి సమీపించి, బంగారపు రత్నకుండలాలను, వైజయంతి అనే వనమాలను, వరుణుడు ఇచ్చిన తెల్ల గొడుగును, ఒక మహారత్నాన్ని సమర్పించి, భక్తితాత్పర్యాలతో చేతులు జోడించి, దేవాధిదేవుడూ, పరమాత్మ అయిన శ్రీకృష్ణుణ్ణి ఈ రీతిగా స్తుతించింది.

No comments:
Post a Comment