తస్యాః శుభం వామ మరాళపక్ష్మ
రాజీవృతం కృష్ణ విశాల శుక్లం
ప్రాస్పందతైకం నయనం సుకేశ్యా
మీనాహతం పద్మ మివాభితామ్రం
శ్రీమంతుని చుట్టూ చేరే సేవకులవలె సీతాదేవి శుభ శకునాలతో అలరారింది. సరోవరంలో చేపతోక తగిలిన కమలంవలె ఆమె విశాలమయిన ఎడమకన్ను, అత్యంత సుందరమయిన ఎడమ భుజం అదిరాయి.
ఆమె ధరించిన చీర కొద్దిగా జారింది.
అంతవరకూ ఎండకూ. పెనుగాలికీ దెబ్బతిన్న విత్తనం వాన చినుకులతో మొలకెత్తేశక్తి పొందినట్లు, శుభశకునాలతో సీతాదేవి సంతోషభరిత హృదయ అయింది. రాహువు నోటినుండి బయటపడిన చంద్రబింబంలా ఆమె వదనం వికసించింది.
శోకం తొలగింది.
తాపం వైదొలగింది.
సంతోషం పెల్లుబికింది.
శుక్లపక్ష శశాంకరోచు లీనింది - జానకీ ముఖకల్హారం.
అంతనూ చూస్తూ వింటూ అశోకంలో వున్న హనుమంతుడు, ఈవిడే సీత అనే నిశ్చయానికి వచ్చాడు.
ఇప్పుడింక యీవిడను ఓదార్చాలి. ఓదార్చు లేకపోతే యీవిడ ఏమవుతుందో తెలీదు. ప్రాణత్యాగం చేసినా ఆశ్చర్యం లేదు. ఈవిడతో మాట్లాడి ఆ మాటలు రామచంద్రునికి నివేదిస్తే అయన ఆశ్యాసన పొందుతాడు.
అయితే, ఈ రాక్షసీ మధ్యంలో యీవిడతో మాట్లాడడం ఎలా! మాట్లాడకుండా వెళ్ళి రామునికి ఏం చెప్పాలి, ఎలా అయినా ఈవిడతో మాట్లాడాలి.
నేను వానరుడను. ఏ భాషలో మాట్లాడాలి. మానవ వ్యవహారంలో వున్న సంస్కృతంలో మాట్లాడుతాను.
మరి - రావణుడు విప్రశ్రేష్ఠుడు కదా! వారి భాషా సంస్కృతమే, ఆ భాష పలికితే ఈవిడ నన్ను రావణుడే అనుకుంటే...
అనుకున్నాసరే ఈ భాష తప్ప దారిలేదు, ఆవిడకు అర్థం కావాలంటే.
కొని, నా రూపం నా మాట, వీటితో ఆవిడ నన్ను కామ రూపుడయిన రావణుడని శంకించి భయపడి, కేకలువేస్తే ఈ రాక్షసీజనం వారి ఆయుధాలతో నా మీద పడకుండా ఉంటారా! అప్పుడు నేను దీర్ఘకాయుడనై కొమ్మలమీదినుంచి దూకుతూంటే ఈ స్త్రీలు రాక్షసబలానికి తెలియజేస్తారు. వారు ఆయుధపాణులై వస్తారు. వీరితో పోరాడుతూ తిరిగి సముద్రం దాటడం సంభవమా! ఈలోగా వారు నన్ను బంధించినా బంధించవచ్చు లేదా ఈ క్రూరులు సీతాదేవిని హింసించవచ్చు. ఒకవేళ వీరు నన్ను నరికేస్తే రామునికి వర్తమానం అందదు కదా.
మళ్ళీ ఈ విశాలసాగరాన్ని దాటి ఎవడు రాగలడు. ఈ రాక్షసులతో పోరాడి వీరిని కడతేర్చగలిగినా నేను వెళ్ళడం సాధ్యమా. అదీకాక యుద్ధంలో జయాపజయాలు ముందుగా తేలవే. అటువంటప్పుడు పోరాటానికి దిగడం వివేకవంతుల లక్షణం కాదు.
సరే, యిప్పుడెంత ఆలోచించినా ఈవిడతో మాట్లాడకుండా వెళ్ళడం అవివేకం.
దూత అవివేకి అయితే సర్వకార్యాలూ నాశనమే.
అయితే యిప్పుడు నేనేం చెయ్యాలి. ఎలా ప్రవర్తిస్తే రామకార్యం సక్రమంగా కొనసాగుతుంది.
ఒకే దారి ఉన్నది. సీతాదేవికి పరమ ప్రీతికరుడైన రామచంద్రుని గుణ గణకీర్తనంతో నేను సంభాషణ మొదలుపెడితే ఆవిడ నిస్సంకోచంగా నిర్భయంగా నా మాటలు వింటుంది. అలా ధర్మార్థహితంగా ఆరంభిసాను. అని అ కొమ్మలలోనే దాగి మధుర గళంతో ఆరంభించాడు.
రక్షితా స్వ స్వ వృత్తస్య
స్వజనస్య చ రక్షితా
రక్షితా జీవలోకస్య
ధర్మస్య చ పరంతపః
దశరథుడనే అయోధ్యా ప్రభువు చతురంగబల సమన్వితుడు. సదాచార నిర్వహణతో ఘనయశస్సు పొందిన వా డాయన.
ఆయన రాజర్షి శ్రేష్ఠుడు.
ఇంద్ర సమ పరాక్రమ సంపన్నుడు. ఉత్తమ గుణాలతో, భూత దయాపరుడై ఇక్ష్వాకువంశ శ్రేష్ఠుడై, శ్రీమంతుడై, సర్వభోగాలు సర్వజనానికీ సమకూరుస్తూ, తాను సుఖంగా ఉంటూ భూగోళంలో ప్రఖ్యాతి పొందాడు.
ఆయన కుమారులలో జ్యేష్ఠుడు రాముడు. రాముడు సర్వ విషయవేత్త; చంద్రునివలె చల్లనివాడు. ధనుర్థారులలో అంతటివాడులేడు.
ముందు తన నడవడి సక్రమంగా ధర్మబద్ధంగా సాగించి, సర్వ ప్రాణికోటినీ, తనవారినీ రక్షిస్తూ, ధర్మ రక్షణ తత్పరుడై జీవితం సాగిస్తున్నాడు.
అయన శత్రువులపాలిట యముడు.
సత్యవాక్పాలన నియమం కారణంగా, తన వృద్దజనకుని మాట ప్రకారం భార్య సీతతో, తమ్ముడు లక్ష్మణునితో అరణ్యానికి వచ్చాడు.
ఆ మహారణ్యంలో క్రూరమృగాలనూ, దుష్ట రాక్షసులనూ సంహరిస్తూ జనస్థానంలో ఖర దూషణుల నాయకత్వంలో ఉన్న సర్వరాక్షసులనూ నేల కూల్చాడు.
ఆ వార్త విని రావణుడు క్రోధంతో జానకీదేవిని అపహరించాడు. రాముని వంచించి, పర్ణశాలకు దూరంగా పంపి.
రాముడు సీతను వెదకుతూ వెదకుతూ, వానరరాజయిన సుగ్రీవునితో స్నేహంచేసి, మహాబలశాలి అయిన వాలిని సంహరించి వానర రాజ్యానికి సుగ్రీవుని ప్రభువుగా చేశాడు.
వానరేశ్వరుని ఆజ్ఞానుసారం కామరూప శక్తిగల వానర వీరులు సీతాదేవిని వెదకడానికి నాలుగు దిక్కులకూ బయలుదేరారు.
వారిలో ఒకడను నేను, జటాయు సోదరుడయిన సంపాతి మాటను బట్టి యిక్కడకు వచ్చాను, సముద్రం దాటి.
సీతాదేవిని గురించి రాముడు ఏ వర్ణన చేశాడో అంతా అలానే ఉన్న దేవిని యిక్కడ చూశాను, అని మౌనం వహించాడు.
సీతాదేవి ఆశ్చర్యంతో, భయంతో తల పైకెత్తి చెట్టు మీదికి చూసింది. సీతకు సంతోషం కలిగింది.
అటూ యిటూ చూడగా చూడగా వాయునందను డయిన హనుమంతుడు ఉదయసూర్య సమంగా కనిపించాడు.
ఆశ్వాసన

No comments:
Post a Comment