శ్రీకృష్ణుడు ఇంద్రప్రస్థ పురంబున కరుగుదెంచుట
ఒకనాడు శ్రీకృష్ణుడు పాండవులను చూడాలని నిశ్చయించి, సాత్యకి మొదలయిన యాదవులతో ఇంద్రప్రస్థపురానికి వచ్చాడు. ఆ పరమాత్మను చూడగానే పాండవులకు పోయినప్రాణాలు తిరిగి వచ్చినట్లయింది.
వారు శ్రీకృష్ణుణి కౌగిలించుకొనటంచేత సర్వపాపాలనుండి విముక్తి పొందారు. ప్రేమ దరహాసాలతో కూడిన అతనిముఖకమలాన్ని చూచి ఆనందించాడు. శ్రీకృష్ణుడు ధర్మరాజుకూ, భీమునికీ పాదప్రణామం చేశాడు.
అర్జునుణ్ణి కౌగిలించుకొన్నాడు. తన కాళ్లకు మ్రొక్కిన నకులసహదేవులను రెండుచేతులతో పట్టి పైకి లేవనెత్తి, ఒక ఉత్తమపీఠంమీద కూర్చున్నాడు. అప్పుడు
స్తనభారంవల్ల ముడుచుకొనిపోయిన శరీరం గలదీ, క్రొత్తగా పెండ్లికావటంచేత కొంచెం కొంచెం సిగ్గు పొందిందీ అగు ద్రౌపది శ్రీకృష్ణునికి నమస్కరించింది.
తర్వాత సాత్యకి పాండవులచేత పూజలు పొంది ఉచితాసనంమీద కూర్చున్నాడు. మిగిలిన అనుయాయులుకూడ పాండవులు మర్యాదలు చేసిన తర్వాత సేవిస్తూ ఉన్నారు. అప్పుడు శ్రీకృష్ణుడు కుంతీదేవిని సమీపించి ఈ విధంగా అన్నాడు.
అత్తా! కొడుకులూ, కోడలూ నీవుచెప్పిన పనులు నీ మనస్సుకు సంతోషం కల్గిస్తూ చేస్తున్నారు కదా! నీ మనసుకు నచ్చినట్లు నడుచుకొంటూ, నీయాజ్ఞలు తలదాల్చేటట్లు చేయగల మంచితనం మొదలయిన గుణాలు కలిగి హాయిగా బ్రతుకు పండించుకొంటున్నావా?
శ్రీకృష్ణుని మాటలు విన్నతర్వాత కుంతి ప్రేమోద్వేగానికి లోనయింది. ఆమె కన్నులనిండా దుఃఖాశ్రువులు వ్యాపించాయి. ఆమెకు దుర్యోధనుడు చేసిన అపకారం జ్ఞప్తికి వచ్చింది. తడబడుచున్న గొంతుతో అనుభవించిన దుఃఖాలన్నీ వివరించింది. శ్రీకృష్ణుని పెద్దదిక్కుగా భావించి అతనితో ఈ విధంగా చెప్పింది.
మహాపుణ్యాత్మా! యాదవోత్తమా! దేవతాగ్రణీ! నాయనా! శ్రీకృష్ణా! మరచిపోకుండా నీ చుట్టపక్కాలను కాపాడుతుంటావు. నీవు అనురాగంతో పంపగా మా అన్న అక్రూరుడు వచ్చి మా యోగక్షేమాలు తెలుసుకొని వెళ్లాడు.

నీ అండదండలవల్లనే మేము బ్రతుకుతున్నాము. ఈనాటినుండి నాబిడ్డలకూ, నాకూ నీవు గాకుండా వేరేదిక్కు ఎవరైనా ఉన్నారా? సర్వజీవరాశికీ నీవే ఆత్మవు. అందువల్ల వీరు పరాయివారు, వీరు నావారు అనే భేదబుద్ధి నీకు లేదయ్యా! నా అదృష్టం ఎటువంటిదో కాని, నీవు ఎప్పుడూ మా మనస్సుల్లో నిలిచి మా కష్టాలన్నింటినీ తొలగిస్తున్నావు కదా!
పైవిధంగా కుంతి పలికిన తర్వాత ధర్మరాజు ఇట్లా అన్నాడు.
సర్వేశ్వరా! సనకుడు, సనందుడు మొదలయిన మహర్షులుకూడా ఏ ఆధ్యాత్మికమార్గాలలో చరించినా నిన్ను తెలుసుకోలేరు. నీవు అట్టి గుణసంపన్నుడవు. శుభప్రదమయిన నడవడి కలవాడివి. ఇప్పుడు మా బాంధవుడివై వస్తున్నావు. హీనులమైన మమ్ము చేరదీసి కాపాడుతున్నావు. మేము పూర్వజన్మల్లో ఎంతగొప్పతపస్సు చేశామో!
ధర్మరాజు తన్ను వేడగా శ్రీకృష్ణుడు పౌరులకు కనులపండువు చేస్తూ ఇంద్రప్రస్థపురంలో కొన్ని నెలలు నివసించాడు. ఆ నగరంలో ఉన్నప్పుడు ఒకరోజున
అర్జునుడు కవచాన్నీ వింటినీ, అమ్ములపోదినీ, బాణాలనూ గ్రహించి, ఒకమంచి గుర్రమెక్కి శ్రీకృష్ణుడితో అడవికి వెళ్లి జింకలు, దుప్పులు, పందులు, దున్నలు, సింహాలు, సివంగులు, పెద్దపులులు, ఖడ్గమృగాలు, సవరపుమెకాలు మొదలయిన వాటిల్ని వేటాడినాడు.
పరీక్షిన్మహారాజా! చనిపోయినప్పటికీ పరిశుద్ధంగా ఉన్న అడవిమెకాలను - అర్జునుణ్ణి సేవిస్తున్న సేవకులు శీఘ్రంగా తీసుకొనివచ్చి మెచ్చుకొనేటట్లు అతడికి సమర్పించారు.
వేటాడిన అర్జునుడు దప్పికచేత బడలిక చెందాడు. అపుడు కృష్ణార్దునులు యమునానదికి వెళ్లి ఆచమించి నీరుత్రాగి
ఒక ఇసుక దిబ్బమీద ఉండి
కృష్ణార్జునులు దగ్గరకు చేరి చలిస్తున్న నల్లని యమునానది అలలలో సూర్యసుత అయిన కాళిందిని చూచారు. కాళింది తల వెండ్రుకలు మిగులనల్లనివై తుమ్మెదలవరుసను హేళనచేస్తున్నాయి. ఆమెనొసలు నెలవంకవెలుగు కలిగిఉన్నాయి. ఆమెచెక్కిలిపట్టులు మన్మథునిఅద్దంవలె ఉన్నాయి.
శ్రీకృష్ణుడు పంపగా అర్జునుడు వెళ్లి ఆ కన్యతో ఈ రీతిగా అన్నాడు.
ఓ కన్యామణీ! మృగాక్షీ! నీవెవరిపుత్రికవు? ఏమి కోరి ఇక్కడికి వచ్చావు? నీపేరేమి? నీకోరిక ఏమి? పెండ్లికొరకై ఇక్కడికి వచ్చినట్లుంది. నీరాక కృతార్థమైంది. నీ పుట్టుపూర్వోత్తరాలు చెప్పమ్మా!
ఇట్లు అడిగిన అర్జునునితో కాళింది ఈవిధంగా అనింది.
మానవ వీరాగ్రణీ! నేను సూర్యుని పుత్రికను. నాపేరు కాళింది. యమునానదిలో సూర్యుడు నిశ్చయించిన గృహంలో ఉండి, కృష్ణుణ్ణి భర్తగా కోరి నేను తపస్సు చేస్తుంటాను. మరొకణ్ణి వివాహమాడను. వేటమీది అభిలాషతో శ్రీకృష్ణుడు వచ్చి, నన్ను పెండ్లాడుతాడని నాతండ్రి నాకు చెప్పాడు.
అర్జునుడు కాళింది అనినమాటలు శ్రీకృష్ణునికి చెప్పాడు. సర్వమూ తెలిసిన శ్రీకృష్ణుడు కాళిందిని రథంమీద ధర్మరాజు దగ్గరకు తీసుకొనివెళ్లాడు. పాండవులు కోరగా విశ్వకర్మను రప్పించి, ఇంద్రప్రస్థాన్ని సుందరనగరంగా తీర్చిదిద్దించాడు.
శ్రీకృష్ణుడు దేవేంద్రుని ఖాండవ వనాన్ని అగ్నికి ఇవ్వడానికి నిర్ణయించాడు. తా ననుకొనింది నెరవేరటానికి అర్జునుణ్ణి రథయోధునిగా చేసి, అతనిమీద ఉన్న ప్రేమతో సారథి అయ్యాడు.
ఈ విధంగా శ్రీకృష్ణార్దునులు తోడుగా అగ్ని ఖాండవవనాన్ని బూడిదచేసి పరమానందం పొందాడు. కృతజ్ఞతతో అర్జునునికి తరుగని అమ్ములపొదులూ, భేదించుటకు సాధ్యంగాని కవచమూ, గాండీవ మను విల్లూ, దేవతా సంబంధమయిన రథమూ, తెల్లని గుర్రాలూ సమర్పించాడు. ఆ ఖాండవవనంలో
అర్జునుడు కారణంగా తనకు అగ్నిబాధలు తొలగగా ఆనందించి మయుడు అద్భుతమయిన సభాగ్భహాన్ని నిర్మించి, అతనికి కానుకగా సమర్పించాడు. ఇవి నీళ్లూ, ఇది నేలా అని గ్రహించే జ్ఞానం లేని దుర్యోధనుడు రాకపోకలు సాగించినప్పటికీ ఆ సభామందిరంలో సంతోషం పొందలేకపోయాడు.

No comments:
Post a Comment