సాగి సాగి హనుమంతుడు రావణుని రాణివాసం వుండే అంతఃపుర భవనం సమీపించాడు. యోజనం పొడవు, అర్థయోజనం వెడల్పు వున్న ప్రాకారం చుట్టూ నాలుగు దంతాలు కల ఏనుగులు రక్షణ కార్యంలో వున్నాయి. ఆయుధపాణు లయిన యోధులు అప్రమతంగా తిరుగుతున్నారు. మకర, తిమింగల, మహాసర్ప సమృద్ధమయిన సాగరంలా ఉన్నదది. యమ, వరుణ, కుబేర, దేవేంద్ర భవనాలను అధఃకరిస్తున్నది.
రావణుని భార్యలందరూ అక్కడ వున్నారు. ఆ లంకేశ్వరుడు పరాక్రమం ప్రదర్శించి తెచ్చిన నారీజనం కూడా ఆ భవనంలో స్వేచ్చగా విహరిస్తున్నారు.
విశ్వకర్మ ఈ పుష్పక విమానాన్ని చతుర్ముఖ ప్రజాపతి కోసం నిర్మించాడు. యక్షేశుడయిన కుబేరుడు తీవ్ర తపస్సుచేసి బ్రహ్మను సంతుష్టుని చేసి ఆ విమానాన్ని వరంగా పొందాడు. కుబేరుని ఓడించి రావణుడు దీనినీ సాధించాడు.
మేరు మందర గిరిశిఖర సదృశమయిన గోపుర సమూహాలతో అలరారుతోంది. బంగారు సోపానాలు, మణిరత్న వేదికలు. స్ఫటికమణులతో రూపొందించిన గవాక్షాలు. పగడాలు, మణులు, ముత్యాలతో నిండి అక్కడి నేల అంతా కాంతు లీనుతున్నది. రక్త చందనాలేపనంతో లేతసూర్య కాంతితో
వెలుగుతోంది, రకరకాల పానీయాలు, భక్ష్య, భోజ్య, చోష్య, లేహ్యాలతో నిండి ఉంది. వాటి వాసనలు మత్తెక్కిస్తున్నాయి. ఆప్త బంధువుకి విందుకోసం చేసినట్లున్నాయి.
ఆ భవనం రావణుని హృదయానికి ఆహ్లాదం కలిగించే కాంతారత్నంలా ఉంది. ఉన్నత స్తంభాలతో అది రెక్కలు విప్పి ఆకాశానికి లేస్తున్నట్టుంది.
గ్రామ, నగర, సౌధ చిత్రా లలంకరించిన తివాసీ పరచి ఉంది.
ఆ భవనంలో తెల్లని రాజహంసలవలె అగరు ధూమం వ్యాపించి శోభావహంగా ఉంది. సర్వేంద్రియ తర్పణం కలిగించే ఆ భవనం పిల్లలను సాకే మాతృమూర్తిలా ఉంది.
చూడగా చూడగా అది దేవేంద్ర రాజధానిలా, స్వర్గలోకంలా ఉంది. అక్కడి బంగారు దీపకళికలను తదేకంగా చూశాడు.
చూసి లోపలకు సాగుతున్నాడు హనుమంతుడు.
రంగు రంగుల చీరలతో వివిధ విధాలయిన ఆభరణాలతో అలరారే నారీమణులు అర్థరాత్రివరకూ ఆసవాలు సేవించి, నిద్రకు ఉపక్రమించారు. నిశ్శబ్దంగా ఉన్న తుమ్మెదల గుంపులతో, హంస జంటలతో వున్న సరోవరంలా వున్నది. ఆ వారిజాక్షుల వదనాలు పద్మగంధ భరితాలు. వికసించిన
పద్మాలమీద పరిభ్రమించే భ్రమరాలు ఈ ముఖపద్మాలచుట్టూ భ్రమిస్తాయి.
తాము చేసిన పుణ్యఫలం పూర్తి చేసుకుని నేలకుజారిన తారాగణాల వలె వున్నారువారు.
సడలిన కేశబంధాలు, చెదరిన అంగభూషణాలు, జారిన పూలమాలలు, అస్తవ్యస్తంగా పడిన హారాలు, చిరుచెమటకు కరగిన తిలకాలు.
పాన వ్యాయామ సమయంలో తెగిన ముత్తెపుసరులు. జారిన వసనాలు, పట్టు సడలిన వడ్డాణాలు, తెగిపోయి ఊడిపడి పగిలిన కుండలాలు.
ఏనుగులు నలగత్రొక్కిన లతామతల్లులవలె ఉన్నారు. చంద్రకిరణ శోభ లీనే ముత్యాలహారాల కిరివంకలా ఉన్నత వక్షోజాలు చూడగా నిద్రపోయే హంసలు గోచరించాయి.
వారి అలంకారాలలో వైడూర్యముణులు రాజహంసలవలె, బంగారు హారాలు చక్రవాకాలవలె కనిపిస్తూంటే, హంసలూ చక్రవాకాలూ విహరించే నదులవలె ఉన్నారు. వారి కటిస్థలాలు ఇసుక తిన్నెలను తలపింపజేస్తున్నాయి.
వారి ఆభరణాలకు పొదిగిన చిరుగంటలే మొగ్గలుగా, వదనాలే వికసిత కమలాలుగా, శృంగారక్రియలే మకరాలుగా, తనుద్యుతులే తటాలుగా వారందరూ నదీ దేవతల్లా వున్నారు.
కొందరి చూచుకాల మీద అలంకార రేఖారచనయే భూషణ భ్రమ గొలుపుతోంది. కొందరి నిట్టూర్పులకే వారి చేలాంచలాలు ముఖంమీద ఆడుతున్నాయి. అవి రంగు రంగుల పతాకాలవలె ఉన్నాయి.
ఆ గాలిసోకి కొందరి కర్ణకుండలాలు నెమ్మది నెమ్మదిగా చలిస్తున్నాయి. ఆ మహిళల కాంతిగంధానికి తోడు మధుపానగంధం కలిసివచ్చే వాయువులు రావణునికి హాయిగా సేవ చేస్తున్నాయి.
మద్యపాన వివశలయిన ఆ రావణ ప్రియకాంతలు తమ ప్రక్కనున్న యువతి వదనమే రావణ ముఖంగా వాసన చూసి తృప్తి పడుతూంటే, ఆ సుఖాన్నే ఎదుటివారు కూడా అనుభవిస్తున్నారు.
మేలి వసనాలే తలగడలుగా కొందరు, బాహువులే ఉపధానాలుగా కొందరు, ఎదుటి ఆమె వక్షస్థ్సలం మీద తలవంచి ఒకతె, దాని ఒడిలో తల పెట్టి యింకొకతె, తొడలమీద, పిరుదులమీద ఆలా ఒకరికి తెలియని మైకంలో ఒకరు హాయిగా నిద్రాముద్రలో వున్నారు. ఆ స్పర్శలోనే పరవశిస్తున్నారు.
తుమ్మెదల దారంతో కట్టిన పూలమాలవలె వారు ఒకరి భుజం ఒకరు మెలవేసి పడుకున్నవారు నారీమణిహారంలా ఉన్నారు.
వసంత వాయువుకు కదలియాడే లతలు, పూవులు, ఒకదానితో ఒకటి పెనవేసుకున్నట్టు వారందరూ ఒకరి నొకరి బంధించుకున్నారు.
ఎవరి అవయవాలు ఎవో, ఎవరి అలంకారాలు ఎవో, ఎవరి కేశాలంకారం యేదో తెలియకుండా ఉంది. బంగారు దీపాలవలె వున్నారు.
ఇందరినీ రావణుడు తన పరాక్రమంతోనే తెచ్చాడు. కొందరు మాత్రం రావణ సౌందర్యాన్ని మోహించి వచ్చారు. వివాహితులనెవరినీ తీసికొని రాలేదు. ఇతరుల యందు అనురాగం వున్న ఆడదాన్నీ తేలేదు.
వారిలో గుణ, రూప, కుల, శీలాలలో ఎవరినీ తక్కువ అంచనా వేయలేం.
అందరినీ చూస్తూ హనుమంతు డనుకున్నాడు.
వీరందరూ తమ భర్త అయిన రావణ సమక్షంలో ఉన్నట్టు జానకీ దేవి కూడా రామచంద్రుని దగ్గరే ఉండి ఉంటే వీని జన్మ చరితార్థమయేది. ఎంతటివాడయినా సీతాపహరణంతో తుచ్చుడయాడు రావణుడు.

No comments:
Post a Comment