నారదాది మహర్షులు శ్రీకృష్ణు దర్శనంబు సేసికొని వసుదేవునిచే గ్రతువు సేయించుట
బలవంతులైన శత్రువుల్ని అణచివేయడంలో సమర్థులూ, తెల్లని, నల్లని దేహకాంతులు కలవారూ, తమ ముఖకమలాల ప్రకాశంచేత నిండు చంద్రునివర్తులాకార సౌందర్యాన్ని గెలిచినవారూ, పరమపదస్థానాధిపతులైనవారూ, లీలతో మనుష్యులవలె ప్రవర్తించేవారూ, ప్రకాశమానమైన అలంకారాలుకలవారూ, దయాసముద్రులూ, ఓర్పులో నేర్పరులూ, అయిన బలరామకృష్ణులు
ద్వారకలో ఉన్నారని తెలిసి వారిని చూడాలనే నిశ్చలబుద్ధితో తాపస శ్రేష్ఠులైన ద్వితుడు, త్రితకుడు, దేవలుడు, వ్యాసుడు, కణ్వుడు, నారదుడు, గౌతముడు, చ్యవనుడు, వాల్మీకి, గార్గ్యుడు, వసిష్ఠుడు, గాలవుడు, అంగీరసుడు, కశ్యపుడు, అసితుడు, సుక్తీర్తి మార్కండేయుడు, అగస్త్యుడు, అంగిరులు, యాజ్ఞవల్క్యుడు, ఋష్యశృంగుడు - మొదలైన ఇరువదియొక్క ఋషులందరూ
(పైన పేర్కొనబడిన వివిధ కాలాలలోని తపస్సంపన్నులైన వీరు నిరంతరం హరిపదచింతనతో మోక్షార్థులై ఉన్నారు. తపస్సుతో సాధించవలసిన భగవత్ సాక్షాత్కారం చాలా సులభంగా ద్వారకలో లీలామానుషరూపంతో ఉన్న శ్రీకృష్ణుని సంగతివల్ల - కష్టసాధ్యమైన తపంకంటె, సులభసాధ్యమైన కృష్ణదర్శనం శ్రేష్ఠమని పురాణ ఋషులు భావించారు.)
వచ్చిన ఆ మునులకు శ్రీకృష్ణుడు ఆహ్వానంపలికి, ఎదురేగి, మహర్షులకు నమస్కరించి, అతిథులకిచ్చే అర్ఘ్య, పాద్య, తాంబూలాది సకల మర్యాదలూచేసి, ఇలా అన్నాడు.
ఓ సత్పురుషులైన మునులారా! జన్మలు అనుభవించాల్సిన, మోక్షాన్ని వెదుకవలసిన మా వంటి మానవులకు మీ అనుజ్ఞతో దేవతలకు కూడా, దేవతలకు లభించని మీ దర్శనం లభించింది. అదృష్టహీనులం, ఇంద్రియాసక్తులం, జ్ఞానహీనులం అయిన మాకు సంతోషాన్నిచ్చే మీ దర్శనం, తాకడం అదృష్టం, ధ్యానించే అదృష్టం, పాదసేవ చేసేభాగ్యం సహజంగా అందనివి. అయినా, మాకు ఈరోజు ఇవన్నీ అతిసులభంగా లభించాయి. సాధుబుద్ధిగల సత్పురుషులైన మిమ్మందరినీ దర్శింస్తే చాలు, ఇక వేరుగా పుణ్యతీర్థాలు వెదికే పనిలేదుగదా!
(దేవదేవుడైన శ్రీకృష్ణుడే సామాన్యునివలె మాట్లాడుతున్నాడు. మానువ జన్మల సారహీనత, సాధుజనసేవనం, తీర్ధసేవనంవంటి పుణ్యప్రదమైన అంశాల ఔన్నత్యాన్ని చెప్పడం - లోకోద్ధరణకోసమే. సత్పురుష సమాగమం - వుణ్య తీర్ధసేవనంతో సమాన పుణ్యఫలప్రదం. ఇక్కడ శ్యమంతక తీరపంచక సేవనం, నారదవ్యాసాది మహర్షి దర్శనం రెండూ లభించాయి.)
అంతేకాదు, నీటితో నిండిన తీర్ధాలు, మట్టి, శిలలతో నిర్మించిన దేవతావిగ్రహాలూ, తీర్ధదేవతల రూపాలతో సేవించిన వారిని అనుగ్రహించేవే. కాని, వాటిల్ని చాలాకాలం సేవిస్తేనే పవిత్రత సిద్ధిస్తుంది. కానీ, పవిత్రులైన మహాత్ములను కేవలం చూస్తేనే పుణ్యం లభించి జనులు పావనులౌతారు.
మనచుట్టూ ఉన్న పంచభూతాలైన భూమి, నీరు, అగ్ని సూర్యచంద్ర నక్షత్రాలు, వాయువు, ఆకాశం, వాక్కు మనస్సు అనే వాటిల్ని ఉపాసించినంతమాత్రాన మనలను అవి పవిత్రం చేయలేవు. అన్ని విషయాల్లో జ్ఞానంగల మహాత్ములు తమను సేవించిన క్షణకాలంలోనే మానవుల్ని పవిత్రులుగా చేస్తారు. అదలాఉంచి, ధాతుత్రయంతో నశ్వరమయ్యే శరీరాన్ని ఆత్మగా భావించడం, భార్యాపుత్రులు తనవారేననే అభిమానం కలిగి ఉండడం, సామాన్యజలాల్ని తీర్థా లని భ్రమించడం మూర్ఖుని పని. వాడు జ్ఞానహీనమైన జంతువుమార్గంలో పోవువాడు. పంచభూతోపాసనకంటె మహాత్ముల ఉపాసన చాలా శ్రేష్ఠం.
ఇలా కృష్ణుడు పలికిన - ఆలోచనాత్మకమైన మాటలు విని, మునులంతా ఆశ్చర్యంగా చూచి కొంత సేపు నిశ్శబ్దంగా ఉండి, ఒక్కక్షణంలో ఆయన అనుమతి పొంది, చిరునవ్వులతో ఇలా అన్నారు. “దేవా! మేమూ, సృష్టి రహస్యం తెలిసిన బ్రహ్మాదులూకూడా నీ మాయచేత మోహితులమై ఉన్నాము. ఎవ్వరికీ అంతుబట్టని నీ సంకల్పంతో మమ్మల్ని దయతలిచావు. నీ లీలలు ఆశ్చర్యకరమైనవి. ఈ భూమి ఒకటే ఐనా వేరువేరు ప్రాంతాల్లో వివిధ రూపాలుగా కనబడినట్టే నీవుకూడా సృష్ట్యాదిలో కారణరూపంతో ఉండి, భిన్నరూపాలుగా కనబడి, ఈ ప్రపంచంయొక్క సృష్టి, స్ధితి, లయాలకు కారణమైన అనేక లీలలుగా అవతారాలెత్తి దుష్టజన శిక్షణం, శిష్టజనరక్షణం చేస్తున్నావు. చాతుర్వర్ణ్యాశ్రమధర్మాలు స్వీకరించి, వేదాలు చెప్పిన మార్గాన్ని అనుమోదించిన బ్రహ్మస్వరూపుడవు. నిరంతర తపస్స్వాధ్యాయ నియమాలతో పవిత్రుడవు. వేద విహిత స్వరూపుడివి. బ్రాహ్మణ జాతిని రక్షించిన బ్రహ్మణ్యమూర్తివి. మహానుభావుడివి. మోహమనే తెరవెనుక ఉండి ఆడిస్తున్న నిన్ను నీ సహచరులైన ఈ రాజలోకాన్ని మేమూ సందర్శించే భాగ్యం పొందాము. మా పుట్టుక, మా చదువు, మా తపస్సు, మా మహిమ, దీంతో సార్థకమయ్యాయి. నీకు నమస్కరిస్తున్నాము” అని మునులు శ్రీకృష్ణుణ్ణి పొగడి నుతించి, తమ నివాసాలకు వెళ్లేందుకు అనుమతి పొందారు.
ఆ మహర్షులందరికీ వసుదేవుడు నమస్కరించి “మునీశ్వరులారా! మీరు ధర్మం బాగా తెలిసినవారు. క్షమించి నా మనవి వినండి. పూర్వజన్మకర్మల సంచితఫలం ఈ జన్మలో అనుభవించనక్కరలేని సత్కర్మాచరణం ఏదైనా ఉంటే దయతో తెలుపండి.” అనగా ఆ ఋషులంతా వసుదేవునితో రాజులందరూ వినేలా “సమస్తయజ్ఞాలకి అధీశ్వరుడు ఈ శ్రీకృష్ణుడు. ఈతణ్ణి గూర్చి చేసిన యాగాలు మీరు ఆచరిస్తే ఎంతటి దుష్కర్మ అయినా తొలగిపోతుంది. ఇదే ధర్మరహస్యం” అని అన్నారు.
అంతేగాక
వసుదేవ మహారాజా! దేవ, ఋషి పితౄణాలు పుట్టిన ప్రతివానికి ఆవశ్యకమై వస్తాయి. వాటిని తీర్చుకునే ప్రయత్నం చేయాలి. దేవఋణం - యజ్ఞాదులచే, ఋషి ఋణం - వేదాధ్యయనంచేత, పితృఋణం - పుత్రపౌత్రాది వంశ పరంపరాభివృద్ధిచే తీర్చబడుతుంది. వీటిని తీర్చలేని నరుడు పుణ్యాలకు దూరమై అధోలోకానికి వెళతాడు.
(దేవతలు హవిస్సుచేత తృప్తి చెందుతారు. కనుక యజ్ఞాల ఆచరణ అవసరం. ఋషులు వేదాలు చెప్పారు. నీ తీరంలో నీవు అధ్యయనం చేసి అధీతి బోధనలచే వేదం తరతరాలకు అందించాలి. ఇది ఋషి ఋణం తీర్చుకోవడానికి మార్గం. పితృఋణం తీర్చాలంటే సంతానం ద్వారానే సాధ్యం.
గమనం “ఊర్ధ్వ లోకాలవైపే ఉంటే శ్రేష్ఠం. అధోలోకగమనం” హీనం. పుత్రులవల్ల ఊర్ధ్వలోకాలు, పుణ్యచ్యుతితో అధోలోకం రెండూ సూచించబడ్డాయి. త్రివిధ ఋణాలు, వాటిని సాధించే ఉపాయాలు సూచింపబడ్డాయి.)
అలా కావడం వల్ల నీవు (వసుదేవుడు) కూడా
శ్రేష్ఠుడైన కుమారుణ్ణి కని, పితౄణం తీర్చుకొన్నావు. వేదాధ్యయనంతో ఋషిఋణం తీర్చుకొన్నావు. పెద్దల అనుమతంతో యజ్ఞాలు చేసి దేవఋణం తీర్చుకోవడం యుక్తం అని ఋషులు తెలిపారు.
ఋషులు చెప్పిన సూచనను అంగీకరించి, ఎంతో వినయంగా, “సూర్యసమానులైన ఓ మునీశ్వరులారా! మీరు చెప్పినట్లే యాగం నిర్వహించి, దేవఋణం తీర్చుకుంటాను. కానీ, మీరే నాతో నిర్వహింప చేయించాలి” అని ప్రార్థించాడు.
(వసుదేవుడు అడిగిందే తడవుగా వారిసలహాను పాటించదలచాడు. 'శుభస్య శీఘ్రమ్' అని కదా! పైగా మహారాజు శ్రీకృష్ణుని తండ్రి. స్థలం శ్యమంతక పంచక భూమి, అతిపవిత్రం. సమయం సూర్యోపరాగపుణ్యసమయం. బంధువర్గం అందరూ సిద్ధం. సూర్యగ్రహణవేళ సూర్యునివంటి తేజస్వులైన, అతి శ్రేష్ఠులైన మునులంతా ఎదురుగా ఉన్నారు. పెద్దల సూచన శిరోధార్యంగా, ఆముష్మికఫలదాయకంగా ఉంది. ఇంక ఆలస్యం దేనికి? ఈ అవకాశం లోకంలో ఎవ్వరికీ రానిది.)
వసుదేవుడు మునిశ్రేష్ఠులను ప్రార్థించి,ఆ మునీంద్రులనే, యజ్ఞంచేయించే ఋత్విక్కులుగా ఎన్నుకొని, ఆ శ్యమంతకపంచక పుణ్యతీర్థాల దగ్గరి భూమిపై, ఇంద్రవైభవంతో, పద్దెనిమిదినుంచిభార్యలతో, దీక్ష స్వీకరించి, ఆ గొప్పయజ్ఞాన్ని వేదవిహితంగా పూర్తిచేసి, ఋత్విక్కులను గొప్పగా వినిమయ ద్రవ్యదానాలతో తృప్తిపెట్టి, భార్యలతో అవభృథ స్నానాలాచరించి, వజ్రాభరణాలు, విచిత్రవస్త్రాలు, సుగంధలేపనాలు, సుపుష్పమాలలు ధరించి, అక్కడ ఉన్న సమస్త బ్రాహ్మణ, ముని, బంధు, రాజులను యోగ్యంగా సన్మానించి, తృప్తిపెట్టినాడు. యజ్ఞానంతరం అందరూ కృష్ణుని అనుమతితో ఎవరిండ్లకు వారు వెళ్లిపోయారు.
ఓ పరీక్షిన్మహారాజా! 'మాతో ఉండమని' ఉగ్రసేన, శ్రీకృష్ణ, బలరాములు, ప్రేమతో అర్ధించగా యశోదానందులు తమ గోపీగోపాలుర బృందాలతో కొన్నాళ్లు వారితో కలిసి సంబరంగా అక్కడే ఉన్నారు.
ఓ పరీక్షిన్మహారాజా! శ్రీకృష్ణాదుల ప్రార్థనను మన్నించి, నందుడు వారితో కలిసి మూడునెలలు అక్కడే ఉన్నాడు. ఆ సమయంలో కృష్ణుని మర్యాదలతో, తల్లిదండ్రులపట్ల ప్రేమలతో, మధురమైన పలుకులతో, అతని లీలలుగా చెప్పుకునే జీవిత విశేషాలతో ఆనందంగా ఆస్వాదిస్తూ, కుటుంబ, బంధుమిత్రాదులమధ్య సాటిలేని విధంగా గడిపారు.
బలరామ కృష్ణాదులు, తక్కిన యాదవులు, సకలవిధాలుగా గౌరవించి, ఆభరణ వస్త్రాదులు బహూకరించి వీడ్కొల్పగా, నందయశోదాది వ్రేపల్లె వాసులు కృష్ణపాదకమలాల మకరందం కోలే తమ మనస్సులనే తుమ్మెదల్ని బలవంతంగా మళ్లించుకొంటూ, విడువలేక, విడువలేక, చివరకు
వెళ్లలేక వెళ్లలేక వెడుతూ, మాటిమాటికి వెనుకకు తిరిగిచూస్తూ, కృష్ణనామస్మరణచేస్తూ ప్రేమతో, ఆప్యాయతతో, భక్తిసూచకంగా పిలుస్తూ, స్మరిస్తూ మథురా రాజ్యంవైపు నందాదులు సాగిపోయారు. అప్పుడు
ఆ సమయంలో వర్షాకాలం ఆసన్నమైనందున బలరామకృష్ణులు ఆ శ్యమంతక పంచకభూమిని వదలి, యాదవ, బంధువర్గాలు కొలుస్తూండగా, దేవతానమస్కారాలందుకొంటూ ద్వారకకు (పయనమయ్యారు)
బలకృష్ణులు ద్వారకచేరి సుఖంగా ఉన్నారు. అపుడు

శ్రీకృష్ణ బలభద్రులు మృతులైన తమ సహోదరుల దెచ్చి దేవకిదేవికి గనబఱుచుట
శ్రీ మహా భాగవతము
శ్రీ మహా భాగవతము ద్వితీయస్కంధము
శ్రీ మహా భాగవతము తృతీయస్కంధము
శ్రీ మహా భాగవతము చతుర్ధస్కంధము
శ్రీ మహా భాగవతము పంచమస్కంధము
శ్రీ మహా భాగవతము షష్టస్కంధము
శ్రీ మహా భాగవతము సప్తమస్కంధము
శ్రీ మహా భాగవతము అష్టమస్కంధము
శ్రీ మహా భాగవతము నవమస్కంధము
శ్రీ మహాభాగవతము దశమస్కంధము - పూర్వభాగము
శ్రీ మహాభాగవతము దశమస్కంధము - ఉత్తరభాగం
జ్యోతిషశాస్త్రము
నిత్య స్తోత్రావళి
నిత్య పారాయణ శ్లోకాలు
స్తోత్రాలు
పంచాంగం
శ్రీ మహా భాగవతము
శ్రీ మహా భాగవతము ద్వితీయస్కంధము
శ్రీ మహా భాగవతము తృతీయస్కంధము
శ్రీ మహా భాగవతము చతుర్ధస్కంధము
శ్రీ మహా భాగవతము పంచమస్కంధము
శ్రీ మహా భాగవతము షష్టస్కంధము
శ్రీ మహా భాగవతము సప్తమస్కంధము
శ్రీ మహా భాగవతము అష్టమస్కంధము
శ్రీ మహా భాగవతము నవమస్కంధము
శ్రీ మహాభాగవతము దశమస్కంధము - పూర్వభాగము
శ్రీ మహాభాగవతము దశమస్కంధము - ఉత్తరభాగం
జ్యోతిషశాస్త్రము
నిత్య స్తోత్రావళి
నిత్య పారాయణ శ్లోకాలు
స్తోత్రాలు
పంచాంగం
No comments:
Post a Comment