బలరాముడు ద్వివిదుడను వానరుని సంహరించుట
దైవత్వంగల ఓ శుకమహర్షీ! బలరాముడు ఎంతో గొప్పవాడు, సర్వాధికుడు, అంతంలేనివాడు. అతణ్ణి గురించి, అతడుచేసిన అద్భుతమైన పనుల్ని గురించి ఎంత విన్నప్పటికీ నాకు తనివి తీరడంలేదు. ఆ బలరాముణ్ణి గురించి మరికొన్నివిశేషాలు నాకు విశదీకరించి తెలియజేయండి - అని పరీక్షిన్మహారాజు కోరాడు.
(ఇక్కడ బలరాముడికి - అప్రమేయుడు, అలఘుడు, అనంతుడు - అనే మూడువిశేషణాలు. వీటిలో అనంతుడు అనేది సాభిప్రాయవిశేషణం. అనంతుడు అంటే శ్రీహరికి పాన్పుగా ఉన్న ఫణిరాజు అనికూడా అర్థం. బలరాముడు శేషునిఅవతారం. ఆ అర్థాన్నికూడా ఇక్కడ సమన్వయించుకోవాలి. మూలంలోని 'అనంతస్యాప్రమేయస్య' - అనే ప్రయోగంలోని చమత్కారాన్ని గమనించి, పోతన యథాతథంగా అనుసరించారు.)
బలరాముని విశేషాలు మరికొన్ని చెప్పుమన్న రాజుతో శుకమహర్షి ఇలా చెప్పాడు.
ఓ రాజా! సుగ్రీవునిమంత్రి, మైందునికి తోడబుట్టినవాడు అయిన ద్వివిదుడు అనే వానరశ్రేష్ఠుడు నరకాసురునికి చెలికాడు కావడంతో మిక్కిలి గర్వితుడై
(ఇక్కడ ప్రస్తావింపబడిన సుగ్రీవుడు - మైందుడు - ద్వివిదుడు - త్రేతాయుగంలో శ్రీరాముని వానరసేనలోనివారే. సుగ్రీవుడు రామునికి ప్రియమిత్రుడు.)
ద్వివిదుడు తన స్నేహితుడైన నరకుణ్ణి శ్రీకృష్ణుడు చంపినందుకు శ్రీకృష్ణునిమీద పగదీర్చుకోదలచాడు. అందుకై కృష్ణుడు పరిపాలించే పట్టణాల్లోనూ, పల్లెల్లోనూ ప్రవేశించి వాటిల్ని పాడుచేస్తూ, దహించివేస్తూ, రాజులు నివసించే అంతపురాలను పడగొట్టి, అగడ్తలు పూడ్చివేసి, నదుల్ని, ఉద్యానవనాల్ని, కొలనుల్ని తవ్విపోసి, స్త్రీపురుషుల్ని పట్టుకుని తీసుకుపోయి కొండగుహల్లో బంధించి, గుహల వాకిళ్లు మూసివేసి నానావిధాలయిన బాధలుపెట్టి, బాగా పండినచెట్లను విరిచివేసి, సాధువుల్ని హింసించి - భూమినంతా బహురీతులుగా మాత్సర్యంతో బాధలుపెడుతూ ఆ వానరుడు ఒకనాడు
మిక్కిలి మనోజ్ఞమయిన లలితగీతంయొక్క సవ్వడి వినబడగా, ఆ పాట వినబడిన దిక్కుగా రైవతపర్వతం గుహదగ్గరకు వడివడిగా వెళ్ళి, అక్కడ పాచికలాడుతున్నవాణ్ణి
మనోహరమైన నీలపువస్త్రాలు ధరించినవాడూ, వేడుక కత్తెలయిన యువతులతో కూడుకున్నవాడూ, స్వచ్చమైన వెన్నెలకాంతివంటి కాంతిగల తెల్లనిదేహంగలవాడూ, మణిమయాలైన బంగారుసొమ్ములు అలంకరించుకొన్నవాడూ, కాదంబరీ అనే మద్యపానంచేత తిరుగుడుపడుతున్న కన్నులుగలవాడూ, నాగలితో శత్రురాజుల పట్టణాలను ధ్వంసం చేసినవాడూ; మన్మథుణ్ణి పాలించినవాడూ అయిన బలరాముణ్ణి చూశాడు.
ఆ బలరాముణ్ణి చూచి, ఆయనకు ఎదుట ఉండే మాకులెక్కి దానికొమ్మల్ని ఊగులాడించడం, పండ్లిగిలించి, యేమరించి ఏదో ఎత్తుకొనిపోవడం, ముడ్డిచూపడం, చెట్లపళ్లను కొఱికి కొఱికి పారవేయడం మొదలయిన కోతిచేష్టలు చేస్తూండగా బలరాముడు కోపించి ఒక గుండెత్తి ఆ కోతిపై వేశాడు.
ఆ కోతి ఆ గుండుదెబ్బను తప్పించుకొని దుష్టత్వంతో బలరాముణ్ణి వెక్కిరిస్తూ ఆ ద్వివిదుడు అక్కడగల బలరాముని మద్యపుకుండను ఎత్తుకొని ఒక చెట్టుకొమ్మ మీదికిపోయి అక్కడనుండి నేలమీదకు పడవేసి పగులగొట్టాడు - కల్లుకుండ ఛిన్నాభిన్నమై పడిఉండటాన్ని చూచిన బలరాముడు మిక్కిలి కోపంతో
ఇంకనూ
ద్వివిదుడు బలరాముణ్ణి ఏ కొంచెంకూడా లక్ష్య పెట్టక, సమీపానికి వచ్చి, ఆయన ధరించిన వస్త్రాలు చింపాడు. ఆ చర్యకు బలరాముడు కోపించి, ఈ ద్వివిదునివలని బాధలు భూమిమీది ప్రజలకందరికీ లేకుండ చేయదలచినవాడై
(చీర = వస్త్రవిశేషం. ఒకప్పుడు పురుషులూ, స్త్రీలూ అనే భేదం లేకుండా అందరూ ధరించే పెద్దవస్త్రాన్ని చీర అనే పేర్కొనేవారు. ఆధునికకాలంలో “చీర' - అనేది స్త్రీలు ధరించే వస్త్రానికే పరిమితమయింది.)
బలరాముడు అప్పుడు తన ముసలాయుధాన్నీ, హలాయుధాన్నీ ధరించి, సమస్తప్రాణికోటిని నశింపచేసే ప్రళయకాలంలోని యమునిలాగా ఆ వానరుణ్ణి అదిలించి, ఎదురు నిలిచాడు. ద్వివిదుడుకూడా బలరాముణ్ణి లక్ష్య పెట్టక పరాక్రమాతిశయంతో తనకు చేతివాటు దూరంలోని ఒక్క వృక్షాన్ని పెళ్లగించుకొని వచ్చి, బలరాముణ్ణి తలమీద మోదాడు.
ఈ విధంగా ఆ వానరుడు కొట్టగా బలరాముడు ఆ సమయంలో
కర్రతో కొట్టబడిన పెద్దపాము మిక్కిలి వేగంగా ఒక్కసారిగా ఎగసిపడినట్లు, అంతులేని వీరరసం విజ్బంభించినట్లు బలరాముడు ప్రకాశిస్తూ, సునందం అనే పేరుగలది, బంగారపుకట్లువేసి తయారు చేయబడినదీ అయిన రోకలితో - ఒకవైపు దేవతలందరూ కోయని కేకలువేస్తూ, పొగడుతూ ఉండగా, ద్వివిదుని మెడమీద కొట్టాడు. ఆ దెబ్బతో వాడు ఎర్రని చారికలుగల కొండవలె ఒంటినిండా నెత్తురు క్రమ్మగా నేలమీద చదికిలబడ్డాడు.
అంతట ఆ ద్వివిదుడు కొంచెంసేపు మూర్చపొంది ఉంది, వెంటనే తేరుకొని అణపలేని ఆటోపంతో తన భుజబలం మెరసేటట్లు ఒక చెట్టును పెరికి బలరామునిపై వేశాడు. అంతట బలరాముడు ఆ మాను తనమీద పడకముందే అది తునాతునకలై నేలపడేటట్లుగాగొట్టి తనయొక్క పరాక్రమాతిశయాన్ని ప్రకాశింపజేశాడు.
అంతటితో తనపట్టుదలను వదలక ఆ వానరుడు ఒకచెట్టును పెరికి తనపై ప్రయోగించగా బలరాముడు దాన్ని లెక్కచేయక నరికేశాడు. వానరుడుకూడా ఆగక బలరాముడు విరగ గొట్టుతుండగా, అదేపనిగా మాకులు పెల్లగించి వేయసాగాడు.
ఆ వానరుడు ఆ విధంగా చెట్లన్నీ పెరికివేసి, అన్నీ అయిపోగా ఒకసారి పరిస్థితిని గమనించి, బలరామునిపై రాళ్లవానను కురిపించాడు. దేవతలు పొగిడేలా
అప్పుడు బలరాముడు ఆ రాళ్లన్నీ పొడిపొడియై నేలరాలేటట్లుగా చేసి, సింహనాదం చేశాడు. అది విని ఆ వానరుడు వెనుదీయక తాటిచెట్టునుబోలిన తన నిడుపాటి చేతులు రెండింటితోను భయంకరుడై
ద్వివిదుడు పిడుగుతో సమానమయిన తన పిడికిటితో పొడువగా బలరాముడు ఏ మాత్రం వెనుకకు తగ్గక రోకటిని, నాగేటిని వదలివేసి, ఆ వానరునిమెడను పట్టుకొని కనుగుడ్లు ఉబికి బయటికి వచ్చేవిధంగా మెల్లమెల్లగా బిగించడం ప్రారంభించాడు. (కనుగ్రుడ్డు ఊడిపడేలా మెడను బిగించా డన్నమాట.)
ఓ రాజా! నోటినుండీ, చెవులనుండీ నెత్తురు, క్రొవ్వు అదేపనిగా కారుతుండగా ఆ వానరుడు నేలమీద చదికిలబడి తిరిగి లేవలేక చనిపోయాడు.
ఆ సమయంలో ద్వివిదుడు పడి మరణించినపుడు ఆ బరువుకు ఆ రైవతకపర్వతం తనమీది అడవులతోగూడ గడగడవడకింది. దేవతలు మిక్కిలి సంతోషించి, సువాసనలతో నిండిన పూలవాన కురిపించారు.
ఈ విధంగా లోకంలోని జనులందరినీ బాధిస్తున్న ఆ వానరుణ్ణి భూమికి బలి ఇచ్చి, సకలజనులు తనను ఎంతో ఆనందంతో పొగడుతూండగా బలరాముడు తనపట్టణానికి విజయుడై వచ్చా డని శుకమహర్షి రాజుతో చెప్పాడు.

No comments:
Post a Comment