Wednesday, August 12, 2026

Trnaprayum - తృణప్రాయుం

రామాయణం సుందరకాండ ఇరువది ఒకటవ సర్గ - తృణప్రాయుం

రావణుని ప్రలోభపూరిత మయిన కామప్రసంగం విన్న సీత, ఎదురుగా వున్న గడ్డిపరకతీసి రావణుని ముందుంచి, భయకంపితయై దీనస్వురంతో.

నీ 
మనస్సు మార్చుకుని నీ నారీజనం మీద నిలుపుకో. పాపికి సత్ఫలితాలు దొరకవు. అలానే నీకు నేను అందను.

నా పుట్టినిల్లు, మెట్టినిల్లు పర
మపవిత్రమయినవి నేను యీ అకార్యం చెయ్యను, అంటూ ముఖం ప్రక్కకు త్రిప్పి;

సజ్జనధర్మాన్నీ, వారి నియమాలనూ విస్మరించకు. నేను పతివ్రతా ధర్మశీలను, పరస్త్రీని, అటువంటి నన్ను భార్యగా భావించడం నీకు తగదు.

నీ భార్యలతో నువ్వు సుఖంగా ఉండు; వారి రక్షణ నీకెంత ముఖ్యమో నా రక్షణ నా బర్త కంత ప్రదానం.

కట్టుకున్న భార్యతో తృప్తిపడని వానిని చపలచిత్తునిగా, ఇంద్రియ నిగ్రహంలేని వానిగా బావించి పరాభవిస్తారు, పరస్త్రీలు.

ఈ లంకానగరంలో సత్పురుషులే లేరా! ఉన్నా వారి మాట నీ చెవి కెక్కడంలేదా! సదాచారవిరుద్ధంగా నీ బుద్ధి యింతటి విపరీతానికి ఒడిగట్టిందేం! ఆత్మజ్ఞానశూన్యుడై, దురాచారపరుడైన రాజువల్ల రాజ్యం సర్వనాశనమవుతుందని ఎరుగవా!

సర్వసంపదలతో అలరారే ఈ లంకానగరం నీ ఒక్కడి దురాచారాల వల్ల త్వరలోనే నశిస్తుంది. దూరదృష్టి లేకుండా నువ్వు చేసే పాపకర్మలు నిన్ను బలిగొన్నరోజున సర్వభూతకోటీ సంతోషిస్తుంది. ఈనాడు నీ దుర్మార్గాలకు తలవంచిన వారందరూ నిన్ను ఆడిపోసుకునే రోజు రాకపోదు. ఆనాడు దైవం తమను అనుగ్రహించి నిన్ను కడతేర్చిందని సంతోషిసారు.

నీ సిరి సంపదలు నన్ను వంచించవు, సూర్యుని వీడని కాంతిలా రాముని వెన్నంటి నేనుంటాను. సర్వలోకనాధుడయిన శ్రీరామచంద్రుని భుజసీమ ఆధారంగా శయనించె నేను మరొకరిని తాకను. ఆత్మజ్ఞానియైన విప్రునికి లభించే వేదవిద్యవలె నేను రాముని సంపదను. ఈ దుఃఖసాగరం
నుండి నన్ను ఉద్ధరించి రాముని దగ్గరకు పంపు.

నీకు జీవితంమీద ఆశవుంటే నేను చెప్పినట్లు చెయ్యి. రామునితో స్నేహం చేసుకో. ఆయన ధర్మాత్ముడు, శరణాగత వత్సలుడు ఇంద్రియ దౌర్బల్యాలకు లొంగకు. నన్ను నా భర్త దగ్గరకు పంపితే నీకు శ్రేయస్సు కలుగుతుంది, లేదా నీ మరణం తథ్యం.

ఇంద్రుని వజ్రాయుధాన్ని తప్పించుకోవచ్చు.
య
మపాశాన్ని వదిలించుకోవచ్చు.
కాని రామబాణానికి తిరుగులేదు.

అగ్నిశిఖలు జిమ్మే 
మహాసర్పముఖాలవలె, రామ, లక్ష్మణుల నిశితబాణాలు యిక్కడపడక తప్పదు. ఈ నగరంనిండా రాబందులు చేరి నీ రాక్షసజనాన్ని పీక్కుతింటాయి. రామగరుత్మంతుడు రాక్షస సర్పాలను తనవాడిగోళ్ళ బాణాలతో చీల్చి చెండాడుతాడు.

రాక్షసలక్ష్మిని మూడడుగుల వామనుడు హరించినట్లు శత్రునాశన సమర్థుడయిన రాముడు ఈ రాక్షసశక్తిని నశింపజేసి నన్ను తీసుకువెడతాడు.

జనస్థానంలో నీ రాక్షసబలాన్ని అయన సర్వనాశనం చేసినప్పుడు ఎదుర్కోలేని అసముర్ధుడవు; వారు ఆశ్రమంలో లేనప్పుడు వచ్చావుకనక యీపని చెయ్యగలిగావు.

వారి కంటబడితే పెద్దపులులముందు కుక్కలా అయేవాడవు. వృత్రాసురుడు ఇంద్రుని నిగ్రహించలేనట్లే నువ్వు రా
మలక్ష్మణులను ఎదుర్కొనలేవు. సూర్యరశ్మి జలాశయాలను ఆవిరిచేసేటట్లు రామలక్ష్మణులు నిన్ను ప్రాణహీనుని చేస్తారు.

కుబేరనిలయుంలో దాగినా, వరుణాలయంలో శరణుపొందినా, పిడుగుపడిన చెట్టువలె నీకు శ్రీరామబాణంతో చావు తప్పదు, అంటున్నది సీత.

అకామాం కామయానస్య
శరీర ముపతప్యతే
ఇచ్చంతీం కామయానస్య
ప్రీతి ర్భవతి శోభనా

రావణుని క్రోధం

No comments:

Post a Comment

Why worship Kubera when Goddess Lakshmi is present? - లక్ష్మీదేవి ఉండగా, కుబేరుడిని ఎందుకు పూజించాలి?

లక్ష్మీదేవి ఉండగా, కుబేరుడిని ఎందుకు పూజించాలి చాలామంది ఒక సందేహం అడుగుతారు. ధనానికి అధిపతి ఎవరు? లక్ష్మీదేవా... లేక కుబేరుడా? దీనికి సమాధాన...