గ్రహము: రాహువు
జన్మదిన తేదీ సంఖ్య : 4, 13, 22, 31
4వ సంఖ్య క్రిందకు వచ్చేవారు:
జనవరి నుండి డిసెంబరు నెలలలో ఏ నెలలో నైనాసరే 4, 13, 22, 31 ఈ తేదీలలో పుట్టినవారిని జనన సంఖ్య 4 సంఖ్య గలవారని పిలువబడతారు.
ఇచ్చట చెప్పిన 4, 13, 22, 31 తేదీలలో:
4వ తేది 4 సంఖ్యకు చెందిందనే విషయం స్పష్టముగానే తెలియుచున్నది.
13వ సంఖ్యను 1 + 3 అని కూడగా 4 వస్తుంది.
22వ సంఖ్యను 2 + 2 అని కూడితే 4 వస్తుంది.
అందుచేత 4, 13, 22, 31 ఈ నాలుగు తేదీలలో పుట్టినవారు.
ఎవరైనా సరే, వారందరూ నాలుగు సంఖ్య వారని తెలుసుకోవాలి.
దీనితో పాటు 4వ నెంబరు అదృష్ట సంఖ్య లేదా ఫేట్ సంఖ్యగా లేదా డెస్టినీ సంఖ్యగా కలవారు కూడా ఈ 4వ నెంబరు క్రిందకు వస్తారు.
దీనితో పాటు ఒకరి పేరులోని అక్షరాలకున్న విలువల సమష్టి సంఖ్య 4గా 4గా కలవారు కూడా ఈ 4వ నెంబరు క్రిందకు వస్తారు.
4వ సంఖ్యకు రాహు అధిపతి. వీరు రాహుగ్రహ ప్రభావితులై ఉంటారు. వీరు నూతన టెక్నాలజీ అయిన కంప్యూటర్, ఫోటోగ్రఫీ రంగాలు, ఇంజనీర్స్, శాస్త్రవేత్తలుగా, కష్టించి పనిచేసేతత్త్వం, కళలు, కావ్యాలు, సాహిత్యం, జ్యోతిష్యం వంటి రంగాలు అనుకూలం.
వీరిని సమాజమునకు పునాదులని చెప్పవచ్చును. ఇటువంటివారిని పార్లమెంటులోను, పత్రికాలయములందు మొదలైన చోట్ల గమనించవచ్చును. వీరు ఎల్లవేళలా నలుగురిని కూడగట్టుకొని స్వారస్యంగా మాట్లాడుతూ కనబడుతారు.
ప్రయాణములన్నా, ఊళ్ళు తిరుగుటయన్నా వీరికి ఆసక్తి మెండు. తాము చూసిన విశేషాలను కళ్ళకు కట్టినట్లుగా అందంగా వర్ణించి చెపుతారు. అన్ని ముఖ్య విషయముల గురించియు ఇతరులకు సలహాలిచ్చుమేరకు, వివరించుటకు, కావలసినంత జ్ఞానము సంపాయించుకొంటారు.
4 సంఖ్యగల వారి లక్షణములు
వీరు చాలా తక్కువమందితో స్నేహంచేస్తూ వాళ్లతో జీవితాంతం విడిపోకుండా జాగ్రత్తలు తీసుకుంటారు. వీరికి నీతి, నిజాయితీ, వినయం, విధేయత మరియు కృతజ్ఞత మొదలైనవి ఎక్కువగా ఉంటాయి.
వీరు అనేక అనుకోని విషాద సంఘటనలు జరిగిన తర్వాత ఊహించని విజయాలు అందుకుంటారు. వీరు కష్టపడి పనిచేసే తత్త్వం కలిగి ఉంటారు. చేసే పని ఏదైనా శ్రద్ధగా చేస్తారు. కఠిన వాక్ ధోరణి కలిగిన వారుగా ఉందురు.
వ్రాతమూలకముగాను, మాటలతోను, తోటివారిని, లోకమును, ముఖ్యముగా తాను జీవించు సమాజమును సంస్కరించాలని అనుకుంటారు. మాటలో కాఠిన్యమే తప్ప మృదుత్వం ఉండదు. అభిప్రాయములను దుడుకుగానే వెలిబుచ్చుతారు. తను నిజమని నమ్మిన వానిని బాహాటముగా ఒప్పుకుంటారు.
వినేవారు ఏమనుకుంటారే అన్న మొహమాటముండదు. జీవిత ప్రారంభంలో ఇలా ఉన్నా చాలామంది, అనుభవస్తులైన తరువాత మారుతారు. తమ అభిప్రాయాలను ఇతరులపై రుద్దటానికి ప్రయత్నిస్తారు. ఎవరు ఏమిచెప్పినా వెంటనే దానికి వ్యతిరేకముగా ఒక విషయం చెపుతారు. ఇతరులు చెప్పు ఏ విషయమును ఆమోదింపక, వ్యతిరేకముగానే తమ అభిప్రాయమును చెపుతారు.
ఇతరులు ఇచ్చు తీర్పు, అది ఎట్టిదయినా ఒప్పుకోరు. పూర్తిగా వాదించి, విచారించి, పరిశోధించి ఒక అభిప్రాయానికి వస్తారు. జీవితంలో ఉన్నతి కోసం బాగా శ్రమిస్తారు. వీరు తార్కిక బుద్ధి కలిగి ఉంటారు.
ప్రకృతి దృశ్యాలంటే ఆనందం వీరు ఎల్లప్పుడూ ఇతరులతో ఏదో ఒక కార్యం గురించి ఆసక్తితో మాట్లాడుతుంటారు. కొత్త చోట్లకు వెళ్లి రావడంలోను, తరచుగా బయటికి ఊర్లకు ప్రయాణం చేయడంలోను ఇష్టం చూపుతుంటారు.
ప్రపంచ సంచారం వీరికి ఆసక్తిదాయకం. ప్రకృతి దృశ్యాలు, పక్షులు, రంగు రంగుల పూలు, అద్భుత మృగాలు వంటి వాటిని చూడటం వీరికి ఆనందం కలిగిస్తుంది. చారిత్రిక ప్రసిద్ది గాంచిన స్థలాలను దర్శిస్తుంటారు.
ఆత్మగౌరవాన్ని రక్షించుకొనే ప్రవృత్తి వీరిలో ఎక్కువగా ఉంటుంది. మిత్రులతో, బంధువులతో ఎల్లప్పుడు సెంటిమెంట్లు, భావోద్వేగాలు, ప్రేమానురాగాలు కలిగి ఉంటారు. అందరిని తేలికగా అంచనా వేస్తారు.
అందువలన తరచుగా ఇబ్బందులకు గురౌతారు. మంచి మనసు, అందరినీ స్నేహితులవలె చూడగల గుణముకల వీరు సులభముగా మిత్రులను సంపాదించవచ్చును. కానీ ఎక్కువమంది స్నేహితులు ఉండరు.
దానికి వీరి అశ్రద్ధయే కారణము. ఎందరితోనో పరిచయ మున్నా, గాఢ స్నేహమును అభిలషించేవారు గనుక, అతి కొద్దిమందినే స్నేహితులుగా మిగుల్చుకుంటారు. అతి బుద్ధిశాలురగుటచే చిన్నప్పుడే జీవితమును పరిశోధించుటకు పూనుకుంటారు. కథలు, శాస్త్రములు, వేదాంతము, మతపరమైన గ్రంథములు వీరినెక్కువగా ఆకర్షించును.
తమకు అన్ని విషయములు తెలిసియుండవలెను అనునదియే వీరి ముఖ్య లక్షణము. వీరు ఎట్టి ప్రయాసతోనయినా విషయ సేకరణ చేస్తారు. వ్యక్తిగతంగా మరియు వృత్తిపరంగా వీరు ఆర్ధిక మరియు సామాజిక భధ్రతను కోరుకుంటారు.
ప్రపంచంలోని అన్ని విషయాలపై ఆసక్తి ఎక్కువ. ఇతరులకు తెలియని విషయాలను అర్ధం అయ్యేవిదంగా వివరించగలరు. పేదలకు సాయపడి తృప్తి పొందుతారు. అతీత శక్తులపై ఎక్కువ నమ్మకం కలిగి ఉంటారు.
వీరు బుద్ధిసూక్ష్మత కలవారు. ఇతరులలోని మర్మాన్ని త్వరగా గ్రహించగలరు. పలు విషయాలు ఎరిగిన మంచి మనిషిగా ప్రసిద్ది పొందుతారు. విద్యలలో చక్కగా రాణించగలరు.
కీర్తిపైన ఆసక్తి ఉండదు:
వీరు ముక్కుసూటితనంగా ఉంటారు. వీరికి కీర్తి కండూతి ఉండదు. కొరత లేకుండా తృప్తిగా జీవించటానికే ఇష్టపడుతారు. ఆహార విషయ ములో బహుశ్రద్ధ చూపుతారు. భోజనము, చిరుతిండ్లను ఎక్కువ ఇష్టపడతారు. ఆరోగ్యంపైన ఎక్కువ శ్రద్ధ వహిస్తారు.
36 సంవత్సరంలో అదృష్టం:
ఈ నంబర్ వారు 36 సంవత్సరంలో వారు అనుకున్న రంగంలో రాణిస్తారు. వీరు 36 ఏళ్ల వరకు చాలా ఇబ్బందులు కూడా పడే అవకాశం ఉంటుంది. కానీ 36 ఏటలోకి అడుగుపెట్టగానే అదృష్టం కలిసి వస్తుంది. వీరు అనుకున్న రంగంలో రాణిస్తారు.
సున్నిత మనస్కులు:
సులభముగా వీరి మనసు గాయపడుతుంది. ఎక్కువ ఆవేశపరులుగ ఉంటారు. ఇతరుల చిన్నమాట, చేతకూడ వీరిని బాధిస్తుంది. విశాల హృదయులయిన వీరు మిత్రుల యెడ ఉదారముగా నడచుకుంటారు.
కష్టపడి సంపాదిస్తారు:
వీరు పుట్టుకతోనే కష్టపడే గుణం కలిగి ఎలాంటి సమస్య వచ్చినా ఎదుర్కునే సామర్థ్యం కలిగి ఉంటారు. ధన సంపాదన విషయానికి వస్తే వీరు ఒక్కొక్క పైస కష్టపడి సంపాదింపవలసి ఉండును. అయినా దానిని మహా సంతోషంగా ఖర్చు పెడతారు.
వీరికి డబ్బు ఖర్చుపెట్టుట ఇష్టము. అందమైన వస్తువులు కొని చేర్చిపెడతారు. బాల్యములో, పరుగెత్తి ఆడే ఆటలలో ఎక్కువ పాల్గొంటారు. యౌవ్వనంలో, జీవితంలో వృద్ధిపై తీవ్రకాంక్ష ఉంటుంది.
వయసు పెరిగేకొలది వేదాంతములోను, సంఘసేవలోను శ్రద్ధ పెరుగుతుంది. 4 సంఖ్యవారు, తాము కష్టపడకనే, జయము నిశ్చయముగా లభించునన్న కార్యములలోనే దిగుతారు.
వీరు జీవిత రహస్యాలను శోధిస్తారు:
యౌవనంలోనే జీవిత రహస్యాలను గురించి లోతుగా పరిశోధిస్తారు. కధలు, కావ్యం, చిత్రలేఖనం, ఆధ్యాత్మిక, సాహిత్య, కవిత్వ, విజ్ఞాన శాస్త్ర గ్రంథాలు వీరిని ఆకట్టుకుంటాయి. వీరి మనస్సు అన్ని రంగాల గురించి తెలుసుకోవాలని ఆరాటపడుతుంది. ఆధ్యాత్మికంగా మంచి పట్టు, ఆచార వ్యవహారాలలో దైవస్తుతిలో విలక్షణత్వాన్ని పాటిస్తారు.
వీరు నల్లగా కానీ, చామనచాయ రంగులోకానీ ఉంటారు. వీరికి శరీరములో జీవశక్తియు, నరములలో పటుత్వము అధికముగనే ఉండును. సామాన్యముగా వీరికి వ్యాధులు కలుగవు. మానసిక అలసట, పొరబాట్లు చేసి పశ్చాత్తాపపడుటయే వీరికి ఆయాసమును కలిగించును.
యోగాభ్యాసమునకు వీరి శరీరము తగినది. త్వరగానే అభ్యాసములు మంచి ఫలితములనిచ్చును. ఈ సంఖ్యగలవారు మితాహారము భుజించుట అలవాటు చేయవలెను.
సాధ్యమైనంత మటుకు జీర్ణశక్తిని వృద్ధి చేయు ఆహారమునే భుజించుట మంచిది. వీరి ప్రవర్తన వేషధారణలో ప్రత్యేకత ఉంటుంది. సుగంధ ద్రవ్యాలను వాడతారు. సుగంధ ద్రవ్యాల మీద, పువ్వుల మీద ఆసక్తి ఉంటుంది.
దాంపత్యము:
4 డెస్టినీ సంఖ్యగల వారికి చిన్న వయస్సులోనే వివాహం జరుగుతుంది. అందుచేత కుటుంబాన్ని నిర్వహించే బాధ్యత చిన్న వయస్సు నుండే వీరికి ముడిపడుతుంది. భార్యా భర్తల మధ్య ప్రేమ బంధం స్వాభావికంగానే ఉంటుంది.
అదృష్టకాలము:
పేరుగాని, జన్మతేదిగాని నాలుగు సంఖ్యగా ఉన్నవారికి 1, 10, 19, 28 తేదీలు అదృష్టకరమైన దినములు, 9, 18, 27 తేదీలు మంచి సాధకమైన ఫలితముల నిచ్చును. సాధారణంగా తప్పు చేయరు.
ఒకవేళ పొరపాటు జరిగినా తప్పనిసరి పరిస్థితిలో జరిగిన తప్పుగానే ఉంటుంది. తాము చేసిన తప్పులకు ఒంటరిగా చాలా బాధపడతారు. ఇతరులు చేసే తప్పులను తీవ్రంగా మందలిస్తారు.
దురదృష్ట దినములు:
8, 17, 26 తేదీలు ఎన్నటికినీ కీడు కలిగించునవియే. ఎదురు చూడని కష్టములు ఈ దినములలోనే వచ్చును. కావున ఈ దినములందు క్రొత్త ప్రయత్నములు చేయరాదు.
ఆవిధముగా చేయుట వలన అనేక దురదృష్టముల నుండి తప్పించుకొనవచ్చును. విజయవంతంగా జీవించిన అనేకులు ఇట్లు 8, 17, 25 తేదీలలో చేసిన పనుల వల్ల పతనమయినారు.
పాజిటివ్ లక్షణాలు:
కష్టపడే గుణం, ఖచ్చితత్వం, నీతి నిజాయితీగా ఉండటం, స్థిరత్వం, కుటుంబానికి తగిన గుర్తింపునివ్వడం, కష్టించే తత్త్వం, క్రమశిక్షణ కలిగి ఉండటం, దేశభక్తి, సంప్రదాయాల పట్ల గౌరవం, ప్రశాంతత, వాస్తవికంగా ఆలోచించడం, శాస్త్రీయమైన దృక్పథం, పనిలో నైపుణ్యత, నిర్మాణాత్మక వైఖరి, ఒక పద్ధతిగా చేయడం.
ప్రతీ పనినీ సూక్ష్మంగా గ్రహించే నేర్పు, ఓర్పు, సహనం, ఆసక్తి, క్రమబద్ధమైన జీవితం, గౌరవాదులు పొందడం. సంభాషణా చాతుర్యం, అనుభవానికి ప్రాధాన్యతనివ్వడం. భవిష్యత్తులో జరగబోయేవి ముందుగా ఊహించగలగడం మొదలైన లక్షణాలను కలిగి ఉంటారు.
నెగిటివ్ లక్షణాలు:
వీరు మొండితనంతో కలిగిన జడత్వం వలన ఎపుడూ ఒకేకోణం నుంచి ఆలోచిస్తుంటారు. క్రమశిక్షణ లేకపోవడం, నమ్మకం, నిజాయితీ లేకపోవడం, అసూయ, బద్దకం, సోమరితనం, నిర్లక్ష్యం, మొండితనం, మానవతావాదం లేకపోవడం.ఇతరులకు లొంగని తత్త్వం, మంకు పట్టుదల, మొండి అభిప్రాయాలు, అతిగా విశ్రాంతి లేకుండా పని చేయడం, అతి జాగ్రత్త, పిసినారితనం, మాట వినకపోవటం మొదలైన లక్షణాలను సందర్భానుసారంగా ప్రదర్శిస్తారు.
వీరికి కల్పనాశక్తి తక్కువగా ఉండటం వలన అభివృద్ధి చెందకుండా మిగిలిపోతారు. వీరు ఎపుడూ వాదించటానికి ఇష్టపడుతూ చివరికి కలహాల ప్రియులుగా ముద్రవేసుకుంటారు.
పూజించవలసిన దేవతలు:
సుబ్రహ్మణ్యస్వామి ఆరాధన, శివారాధన, గణేశ, అగ్ని, దుర్గామాత.
దానం చేయవలసినవి:
గోధుమలు, రాగి, కర్పూరము, చందనము,గోమేధికం రంగులో ఉండే వస్త్రాలు, మినుములు దానం చేయవచ్చును.అనాధలు, పేద పిల్లల పెండ్లి ఖర్చులలో పాలు పంచుకోవాలి.
గ్రహప్రీతి:
4 డెస్టినీ సంఖ్యగలవారు దుర్గాస్తోత్ర పారాయణము, దుర్గాదేవి దర్శనము, గ్రామ దేవతా పూజాదికములు చేయుచుండిన రాహుగ్రహ ప్రీతి కలుగుతుంది.
ఉత్తమమైన సమయము:
ప్రతి సంవత్సరము 21 మార్చి నుండి 28 ఏప్రిల్ వరకు మరియు జులై 10 నుంచి ఆగస్టు 20 వరకు వృత్తి, వ్యాపారము, ఉద్యోగము మొదలైన వాటికి ఉత్తమమైన సమయము.
13వ తేదీన జన్మించిన వ్యక్తి లక్షణాలు
13వ తేదీన జన్మించిన వారు ఆకర్షణీయంగా, ఉత్సాహంగా మరియు ఆత్మవిశ్వాసంతో వుంటారు. వీరు ఇతరులను తమవైపు ఆకర్షించుకుని, వారికి సౌకర్యవంతంగా, ప్రశాంతంగా అనిపించేలా చేయగల సామర్థ్యానికి కలిగి ఉంటారు.
వీరికి తమపై బలమైన నమ్మకం ఉంటుంది మరియు తమ మనసులోని మాటను చెప్పడానికి భయపడరు, ఈ లక్షణాల వల్ల వారు సహజ నాయకులుగా ఉంటారు. వారు తరచుగా ఆశావాదులుగా మరియు సానుకూలంగా కనిపిస్తారు, ఈ గుణం ఇతరులకు కూడా వ్యాపించి, వారి చుట్టూ ఉన్నవారిని ఉత్తేజపరచడంలో సహాయపడుతుంది.
వీరికి ఆత్మవిశ్వాసం ఉన్నప్పటికీ, కొన్నిసార్లు వీరి తొందరపాటు లేదా బాధ్యతారహితంగా కనిపించవచ్చు, ఇది వారి వ్యక్తిగత మరియు వృత్తిపరమైన జీవితాలలో సమస్యలకు దారితీయవచ్చు.
13వ తేదీన జన్మించిన వారు స్వేచ్ఛా స్వభావం, సాహసోపేతమైన వ్యక్తిత్వాలను కలిగి వుంటారు. వీరు స్వతంత్రంగా ఉంటారు మరియు కొత్త విషయాలను, ఆలోచనలను అన్వేషించడానికి ఇష్టపడతారు. వీరు సహజంగా సృజనాత్మకంగా ఉంటారు మరియు జీవితం పట్ల ఒక ప్రత్యేకమైన దృక్పథాన్ని కలిగి ఉంటారు.
వీరు ఆకస్మికంగా ప్రవర్తించే స్వభావాన్ని కలిగి ఉంటారు, దీనివల్ల వీరి చుట్టూ ఉండటం ఉత్సాహభరితంగా ఉంటుంది. అయితే, వీరు తొందరపాటుతో వ్యవహరించే స్వభావం కొన్నిసార్లు వీరి వ్యక్తిగత మరియు వృత్తి జీవితంలో సమస్యలను కలిగిస్తుంది.
22వ తేదీన జన్మించిన వ్యక్తి లక్షణాలు
22వ తేదీన జన్మించిన వారు బలమైన భావోద్వేగ శక్తి కలిగి వుంటరు. ప్రతి విషయం గురించి బలంగా, లోతుగా ఆలోచిస్తారు. ఇది కొన్ని సార్లు అనుకూలత మరియు కొన్నిసార్లు ప్రతికూలత.
వీరు మొదట్లో ఈ భావోద్వేగాల వల్ల ఇబ్బంది పడవచ్చు, కానీ దీనిని వీరు తమకు అనుకూలంగా మార్చుకోవచ్చు. ఇటువంటి భావోద్వేగాల వల్ల, తమ సమయం, శక్తి మరియు ప్రయత్నాలకు ఏది విలువైనదో నిర్ణయించుకోవడానికి వారికి సహాయపడుతుంది. వారి భావోద్వేగ శక్తి వారి ఆశయాలను మరియు లక్ష్యాలను నిర్దేశించగలదు, ఇది అపూర్వమైన విజయానికి దారితీస్తుంది.
22వ తేదీన పుట్టిన వారు విలక్షణంగా భిన్నంగా ఉంటారు. వీరు స్వతంత్రంగా ఉంటారు మరియు ఆలోచిస్తారు, కాబట్టి వారు ఒక సమస్యను పరిష్కరించడానికి, ఒక లక్ష్యాన్ని సాధించడానికి లేదా కొత్తగా ప్రారంభించడానికి విభిన్న మార్గాలను అన్వేషిస్తారు.
అయినప్పటికీ, వీరు తమ ఇష్టమైన రంగాలలో మేధావులు. వీరు తమ లక్ష్యాన్ని చేరుకోవడానికి విభిన్నంగా అలోచించి ప్రయోగాలు చేయడానికి వెనుకాడరు. కొత్త పద్ధతిని ప్రయత్నించే అవకాశం ఎక్కువగా ఉంటుంది.
వీరికి విజయాలు ఆలస్యంగా వస్తాయి. అన్ని పనులలోను వీరికి ఆలస్యం, ఆటంకాలు ఎదురౌతాయి. వీరికి ప్రారంభంలో అవమానాలు, బాధలు, ఆలస్యాలు, అవరోధాలు తప్పవు. కాని వీటిని నిలకడగా, ధైర్యంగా అధిగమిస్తే గొప్ప వ్యక్తులుగా ఎదుగుతారు. వీరికి అదృష్టం ఊరికే రాదు. 'కష్టేఫలి' అనే సూక్తి వీరికి వర్తిస్తుంది.
వీరి పుట్టినపుడు కుటుంబ జీవితం ఎలా ఉన్నప్పటికీ, భవిషత్తులో సమృద్ధమైన జీవితాన్ని గడపడం ఖాయం. నిజమైన, స్థిరమైన సంపదను నిర్మించుకోవడమే వారి ప్రధాన ప్రాధాన్యత.
వీరు అధిక ఆదాయం గల వృత్తులను ఎంచుకోవచ్చు లేదా కోట్లు సంపాదించి పెట్టగల నైపుణ్యాన్ని నిలకడగా మెరుగుపరుచుకోవచ్చు. వీరు ఏ విధంగా విజయం సాధించినా, ఆర్భాటంగా కనపడరు. అపారమైన విజయం సాధించినప్పటికీ, ఈ వ్యక్తులు వినయంగా ఉంటారు.
వీరు యెంత కష్టపడితే అంత గొప్ప జీవితం అనుభవిస్తారు. వీరిని మంచికన్నా చెడు. ఎక్కువ ఆకర్షిస్తుంది. కనుక కొందరు చెడు మార్గాలవైపు వెళ్ళే అవకాశం ఉంది. వీరికి తోచిందే చేస్తారు. ఇతరుల మాటలు వినరు.
మొండిగా వ్యవహరిస్తారు. అక్రమ మార్గాల ద్వారా ధన సంపాదనకు ప్రయత్నిస్తారు. డబ్బు బాగా ఖర్చుపెడతారు. వీరికి శత్రువులు వెన్నంటి ఉంటారు.
31వ తేదీన జన్మించిన వ్యక్తి లక్షణాలు
వీరు యెంత కష్టపడితే అంత గొప్ప జీవితం అనుభవిస్తారు. వీరిని మంచికన్నా చెడు. ఎక్కువ ఆకర్షిస్తుంది. కనుక కొందరు చెడు మార్గాలవైపు వెళ్ళే అవకాశం ఉంది. వీరికి తోచిందే చేస్తారు. ఇతరుల మాటలు వినరు.
మొండిగా వ్యవహరిస్తారు. అక్రమ మార్గాల ద్వారా ధన సంపాదనకు ప్రయత్నిస్తారు. డబ్బు బాగా ఖర్చుపెడతారు. వీరికి శత్రువులు వెన్నంటి ఉంటారు.
31వ తేదీన జన్మించిన వ్యక్తి లక్షణాలు
31వ సంఖ్యకు రాహు అధిపతి. వీరు రాహుగ్రహ ప్రభావితులై ఉంటారు. వీరు వాస్తవికంగా ఆలోచిస్తారు. నూతన టెక్నాలజీ అయిన కంప్యూటరు, ఫోటోగ్రఫీ రంగాలు, ఇంజనీర్స్, కళలు, కావ్యాలు, స్నేహ జీవితం, గుర్తింపు తక్కువ.
31వ సంఖ్య పూర్తిగా మనోశక్తికి సంబంధించిన అంకె కావున ఇందు జన్మించినవారు మంచి ధైర్యశాలురుగను, అమితమైన మనోశక్తితో, బుద్ధిసూక్ష్మతతో ఉందురు. కొత్తగా పరిచయమైన వారికి కూడా కొద్ది సమయములోనే వీరు సామాన్యులు కారని తెలిసిపోవును.
లాభనష్టముల గూర్చి ఆలోచింపక తన ఇష్టప్రకారమే నడుచుకొందురు. ఎంతటి శతృవునైనా అతి త్వరలో గెలిచెదరు. ఏకాంతవాసములో, వేదాంతము లోను ఎక్కువగా ఆకర్షణ ఉంటుంది. తీవ్రవాది.
31వ తేదీన జన్మించిన వారు సామాన్యంగా సంఘ సంస్కర్తలుగా, సమాజంలో గుడ్డిగా నమ్మే సామాజిక అలవాట్లను వ్యతిరేకించే స్వభావం కలిగి ఉంటారు. అలాగే సమాజంలో అన్యాయానికి గురైన వారిని రక్షించడానికి వీరు కష్టనష్టములకు కూడా వెనుకాడరు.
ఏదైనా నూతన ఉద్యమం ప్రారంభించడం కొత్త ఆలోచనా విధానాన్ని సమాజంలో ప్రవేశపెట్టడం వీరు చేస్తుంటారు. వీరు అమితమైన మనోశక్తి, బుద్ధి సూక్ష్మత కలిగి ఉంటారు. ఏకాంత జీవనం, స్వేచ్చా జీవితం కోరుకుంటారు.
వీరిపై ఆధార పడిన వారిని ప్రేమతో, వాత్సల్యంతో చూస్తారు. వారి కోసం ఎవరినైనా ఎదిరిస్తారు.
తన ఇష్టానుసారం నడుచుకుంటారు. వీరు గొప్ప గొప్ప పనులను చేయగలుగుతారు. ధైర్య సాహసాలు కలిగి ఉంటారు.
తమ కుటుంబాన్ని, వర్గాన్ని, సాంప్రదాయాన్ని ప్రేమిస్తారు. వాస్తవికంగా ఆలోచిస్తారు. ఎక్కువ సమయం కష్టపడి పనిచేయ గలుగుతారు. ఐతే వీరి కష్టం. సామర్థ్యం అంతగా గుర్తింపబడవు.
వీరు మొండిగా, కఠినంగా వ్యవహరిస్తూ ఉంటారు. వీరు నిరాశ, నిస్పృహలకు లోనవుతూ ఉంటారు. జీవితంలో ఒడిదుడుకులు, ఎత్తుపల్లాలు, ఊహించని సమస్యలు, అనూహ్యమైన ఇబ్బందులు ఎదురౌతూఉంటాయి. భవిష్యత్తులో ఎప్పుడు ఏమి జరుగుతుందో తెలియని సస్పెన్స్.
వీరు యదార్ధాన్ని నిర్మొహమాటంగా చెప్పడం, ఎదుటవారిని వారి ఎదుటే విమర్శించడం వలన వీరికి మిత్రులే శత్రువులుగా మారతారు.
వీరి కుటుంబం వారే వీరికి వ్యతిరేకంగా ఉంటారు. వీరు ఇతరులను విమర్శించడం మానుకోవాలి.
వీరు మంచి రచనలు, కథలు, కావ్యాలు, వ్యాసాలు వ్రాయ గలుగుతారు. నటన, సంగీతం వంటి వాటిలో ప్రావిణ్యత ఉంటుంది. వీరి నామ సంఖ్య అనుకూలంగా ఉంటె జీవితంలోని అవరోధాలు అధిగమించవచ్చు.
31వ సంఖ్య పూర్తిగా మనోశక్తికి సంబంధించిన అంకె కావున ఇందు జన్మించినవారు మంచి ధైర్యశాలురుగను, అమితమైన మనోశక్తితో, బుద్ధిసూక్ష్మతతో ఉందురు. కొత్తగా పరిచయమైన వారికి కూడా కొద్ది సమయములోనే వీరు సామాన్యులు కారని తెలిసిపోవును.
లాభనష్టముల గూర్చి ఆలోచింపక తన ఇష్టప్రకారమే నడుచుకొందురు. ఎంతటి శతృవునైనా అతి త్వరలో గెలిచెదరు. ఏకాంతవాసములో, వేదాంతము లోను ఎక్కువగా ఆకర్షణ ఉంటుంది. తీవ్రవాది.
31వ తేదీన జన్మించిన వారు సామాన్యంగా సంఘ సంస్కర్తలుగా, సమాజంలో గుడ్డిగా నమ్మే సామాజిక అలవాట్లను వ్యతిరేకించే స్వభావం కలిగి ఉంటారు. అలాగే సమాజంలో అన్యాయానికి గురైన వారిని రక్షించడానికి వీరు కష్టనష్టములకు కూడా వెనుకాడరు.
ఏదైనా నూతన ఉద్యమం ప్రారంభించడం కొత్త ఆలోచనా విధానాన్ని సమాజంలో ప్రవేశపెట్టడం వీరు చేస్తుంటారు. వీరు అమితమైన మనోశక్తి, బుద్ధి సూక్ష్మత కలిగి ఉంటారు. ఏకాంత జీవనం, స్వేచ్చా జీవితం కోరుకుంటారు.
వీరిపై ఆధార పడిన వారిని ప్రేమతో, వాత్సల్యంతో చూస్తారు. వారి కోసం ఎవరినైనా ఎదిరిస్తారు.
తన ఇష్టానుసారం నడుచుకుంటారు. వీరు గొప్ప గొప్ప పనులను చేయగలుగుతారు. ధైర్య సాహసాలు కలిగి ఉంటారు.
తమ కుటుంబాన్ని, వర్గాన్ని, సాంప్రదాయాన్ని ప్రేమిస్తారు. వాస్తవికంగా ఆలోచిస్తారు. ఎక్కువ సమయం కష్టపడి పనిచేయ గలుగుతారు. ఐతే వీరి కష్టం. సామర్థ్యం అంతగా గుర్తింపబడవు.
వీరు మొండిగా, కఠినంగా వ్యవహరిస్తూ ఉంటారు. వీరు నిరాశ, నిస్పృహలకు లోనవుతూ ఉంటారు. జీవితంలో ఒడిదుడుకులు, ఎత్తుపల్లాలు, ఊహించని సమస్యలు, అనూహ్యమైన ఇబ్బందులు ఎదురౌతూఉంటాయి. భవిష్యత్తులో ఎప్పుడు ఏమి జరుగుతుందో తెలియని సస్పెన్స్.
వీరు యదార్ధాన్ని నిర్మొహమాటంగా చెప్పడం, ఎదుటవారిని వారి ఎదుటే విమర్శించడం వలన వీరికి మిత్రులే శత్రువులుగా మారతారు.
వీరి కుటుంబం వారే వీరికి వ్యతిరేకంగా ఉంటారు. వీరు ఇతరులను విమర్శించడం మానుకోవాలి.
వీరు మంచి రచనలు, కథలు, కావ్యాలు, వ్యాసాలు వ్రాయ గలుగుతారు. నటన, సంగీతం వంటి వాటిలో ప్రావిణ్యత ఉంటుంది. వీరి నామ సంఖ్య అనుకూలంగా ఉంటె జీవితంలోని అవరోధాలు అధిగమించవచ్చు.
No comments:
Post a Comment