శ్రీకృష్ణుడు కేళీగృహమునందు రుక్మిణీదేవితో విరసోక్తు లాడుట
ఈ వచనంలో కవి రుక్మిణీదేవి సౌధంలోపలి మందిరాన్ని వర్ణిస్తున్నాడు. రుక్మిణీదేవి అభ్యంతరగ్భృహం నవరత్నాలు పొదిగిన స్తంభాలు, ముంజూరులు, పావురాళ్లగూళ్లు మొదలయినవానితో వెలిగే ఆ మందిరం గోడలు, కిటికీలు, అరుగులు, మెట్లు బంగారుమయాలు.
దానిలో ముత్యాలదండలు వ్రేలాడుతున్న పట్టు మేలుకట్లు ఉన్నాయి. అవి రత్నదీపాలతో ప్రకాశిస్తున్నాయి. సువాసనలకు మూగిన తుమ్మెదలతో కూడియున్న మల్లెపూలదండలతో ఆ భవనం ఒప్పారుతూ ఉంది.
అందలి కిటికీల సందులనుండి అగరు కర్పూరాల పొగలు బయటికి వస్తున్నాయి. గవాక్షాలలో చంద్ర కిరణాలు వ్యాపించాయి. పారిజాత పుష్పాల పరిమళం గ్రహించి గాలులు మనస్సులకు ఆహ్లాదం కల్గిస్తున్నాయి.
ఇట్టి అభ్యంతరగృహంలో ఒకనాడు శ్రీకృష్ణుడు శరత్కాలంనాటి పండువెన్నెలవలె తెల్లనైన పాన్పునడుమ కూర్చుని ఉన్నాడు. రుక్మిణి చెలికత్తెలతోకూడా ప్రాణేశ్వరునివద్దకు వచ్చి సేవిస్తూ ఉన్నాడు.
రుక్మిణీ కుచాలమీది కుంకుమంతో ఒరసికొన్న హారాలు ఎర్రనివి కాగా, చేతిని చాచినప్పుడు ఉంగరాల గాజులకాంతులు చుట్టు వ్యాపింపగా, కదలినప్పుడు కాళ్లయందలి కడియాల గంభీరధ్వని అతిశయింపగా, రత్నాలు పొదిగిన బంగారు చెవికమ్మల కాంతులు చెక్మిళ్లపై చిందులు త్రొక్కగా, తలవెండ్రుకలు చలింపగా, పైటకొంగు అల్లలనాడగా చెలికత్తె చేతిలో ఉన్న వింజామరాన్ని తాను తీసుకొని శ్రీకృష్ణుణ్ణి సమీపించి ఆయనకు మెల్లగా వీవసాగింది.
ఆ సమయమున
పతివ్రత, భర్త ధరించిన రూపానికి అనుగుణమైన రూపంతోనే విరాజిల్లేదీ, సుందరి, చంద్రముఖి, లక్ష్మీస్వరూపిణి, శోభనాంగి, ప్రాణేశ్వరాంకితమతి, నిర్మలహృదయ అయిన రుక్మిణి మహాపతివ్రత. ఆమెతో వాక్చాతుర్యం కలిగిన శ్రీకృష్ణుడు చిరునవ్వులు చిందించుచు ఈ రీతిగా పలికాడు.
(రుక్మిణీకృష్ణలు సాక్షాత్తు లక్ష్మీనారాయణులు. ఒకర్ని వదలి మరొకరు ఉండరు. స్వామి ఎన్ని అవతారాలెత్తినా లక్ష్మి తదనుగుణంగా తగిన రూపంతో ఆయన్ను చేరే ఉంటుంది. స్వామి రాముడైనప్పుడు లక్ష్మి సీత అయింది. కృష్ణుడైనప్పుడు రుక్మిణి అయింది. ఇలా లక్ష్మి శ్రీహరికి అనపాయిని(ఎడబాటులేనిది). ఇట్లుండడం ఆ దివ్యదంపతుల అన్యోన్య ప్రేమకు నిదర్శనం.)
రుక్మిణీ! శిశుపాలుడు మొదలయినవారు కులబలరూపశౌర్యాదులచేత ఇంద్రుడు మొదలయిన దిక్పాలురకంటె గొప్పవారు. ఏ లోటూ లేనివారు. మీ తల్లిదండ్రులు, తోబుట్టువు - వాళ్లకు వివాహం చేస్తుంటే నీవు వారితోపాటు వెళ్లకుండ బలవంతుల్ని చూచి భయపడేవారినీ, భూమిమీద నిలువనీడలేక సముద్రంలో దాగినవారినీ మమ్మల్ని ఎందుకు అంగీకరించావు? (అంగీకరించకుండా ఉండాల్సింది).
రుక్మిణీ! మేము లోకాచారప్రకారంగా ప్రవర్తింపం. ఇతరులకు మా నడవడి తెలియదు. బలమదం గలవారు మామీద పగపూనుతారు. సింహాసనాలెక్కి రాజ్యాలు పరిపాలింపం. మాకు ఈ సముద్రమే ఆశ్రయం. మేము దరిద్రులం. మాకు సొమ్ము పాతరలు లేవు. శ్రీమంతులు మా బంధువులు గారు.

మేము దరిద్రులకు చుట్టాలం. ధనం కూడబెట్టలేదు. మా నడవడి గుట్టుగా ఉంటుంది. మేము మంచిగుణాలు లేనివారం. బిచ్చమెత్తుకొంటూ బతుకు లీడ్చేవారిని ఆశ్రయిస్తాం? ఇటువంటి మమ్ముల్ని సుందరు లెవ్వరూ ప్రేమించరు. నీవేల ప్రేమించావు?
(ఇక్కడ ఒక అర్థం పరిహాసంగా మాటాడే శ్రీకృష్ణునికీ, రెండవ అర్థం శ్రీకృష్ణావతారమెత్తిన విష్ణువుకు అంటే పరమాత్మకూ సంబంధించి ఉంటుంది. మొదటి అర్ధం తాత్పర్యంలో ఉంది.
రెండవది - విష్ణుపరమైన అర్ధం ; 1. ఈ చరాచర ప్రపంచానికి నేనే సృష్టికర్తను. కాబట్టి, నా నడవడి ఈ లోకంలోనివారి నడవడిని పోలియుండదు. 2. త్రికాలజ్ఞుడనయిన నన్ను ఎవ్వరును తెలుసుకొనలేరు. 3. బలమదం గలవారు ప్రతి అవతారంలోను నాతో వైరం పెట్టుకొంటారు. 4 నే నేయవతారంలోను రాజ్యసింహాసన మధిష్టించని లోకేశ్వరుణ్ణి 5. క్షీరసాగరమే మాకు గృహం. 6. మానవుల లక్షణాలు - జననం, మరణం మొదలగునవేవియు లేనివాణ్ణి. నేను పరాప్రకృతిని. అణిమ మొదలయిన అష్టైశ్వర్యాలు కలవాణ్ణి మోక్షప్రదాతను. 7. ధనవంతులు నాకు భక్తులు కాలేరు. 8. నేను దీనబాంధవుణ్ణి. భక్తులే నా సంపద. 9. అజ్ఞానులు నా తత్త్వాన్ని గ్రహించలేరు. 10. నేను నిర్గుణుణ్ణి. 11. మహాయోగులే నాకు ఆప్తులు. 12. నేను ఆత్మారాముణ్ణి - ఇలా పైకి తనను కించపరుచుకొంటున్నా - లోపల తన తత్త్వాన్ని వ్యక్తం చేస్తూ - రుక్మిణిని పరీక్షిస్తున్నాడు శ్రీకృష్ణుడు.)
ఎంతగొప్ప సంసారుల మధ్యనయినా ధనం, సత్కులం, సౌందర్యం సమానంగా నున్నప్పుడే పెండ్లి జరుగుతుంది. స్నేహ మేర్పడుతుంది. చుట్టరికం కుదుర్తుంది. అవి సమానాలు కాకపోతే ఇవి జరగవు.
రుక్మిణీ! ఇది మంచిపని కాదని తెలుసుకోలేక నీవు నన్ను పెండ్లాడినావు. దీనివల్ల నీవు తప్పు చేసిందానివయ్యావు. నీకు తగిన ఒకరాజును పతిగా వరించుకో. సద్గుణాలు లేనివారిని మోహించడం న్యాయమా? (కాదని అర్థం)
రుక్మిణీ! సాల్వుడు, జరాసంధుడు, శిశుపాలుడు మొదలగు రాజులు నన్ను చూచి చెలరేగుతుంటారు. నీ అన్న రుక్మికూడా పొగరుబట్టి బలమదంతో కన్నుగానక ఎగిరిపడుతుంటాడు. వాళ్ల తలపొగరు అణపదలచి నిన్ను బలాత్కారంగా తీసుకొని వచ్చానే కాని సంసారం చేయాలని కాదు.

నేను దారైషణ, పుత్రైషణ, ధనైషణ అను మూడు కోరికల్నీ వదిలినవాణ్ణి. కామాదులైన అరిషడ్వర్గం లేనివాణ్ణి. అన్నిటా తటస్థుడిని. ప్రాపంచిక వ్యవహారాలలో చిక్కుకోను. పూర్ణకాముడిని. పరమాత్మననే బుద్ధితో ఇంటిలోని దీపం మాదిరిగా వెలుగుతూ వెలుగొందజేస్తాను. ఇటువంటి నాతో కలసి నీవు బాధపడవద్దు.
షడ్గుణ సంపన్నుడైన శ్రీకృష్ణుడు ఈ విధంగా మాట్లాడి, నిత్యమూ అన్ని సేవలూ చేస్తూ ఉండడంచేత "నేనే ప్రియురాలిని, నేనే పట్టపురాణిని" అని చెప్పే రుక్మిణిఅహంకారాన్ని అణచి, మాటాడక ఊరకున్నాడు. మానవంతురాలయిన ఆమె వినడానికి ఇష్టంగానివీ, ఇంతకు ముందు ఏనాడూ పలుకనివీ అయిన ప్రాణేశునిమాటలు విని, మేరలేని దుఃఖాతిశయంవల్ల పరితపిస్తూ
మగనిఎత్తి పొడుపుమాటలకు సంతాపం పొందిన రుక్మిణి స్వరూపాన్ని కవి వర్ణిస్తున్నాడు. కాటుక చెదరిపోయేట్లుగా కారిన కన్నీటిచే స్తనద్వయంమీదికుంకుమం తడిసిపోయింది. ఎడతెగని వేడినిట్టూర్పులచే చిగురాకువంటి పెదవి కందింది.

సౌందర్యం నిగ్గు తగ్గిపోయి, కళావిహీనమై ముఖం వాడిపోయింది. గాలిదెబ్బకు అల్లల్లాడే కల్పవృక్షంవలె మేను గజగజ వణికింది. మనస్సు బాధపడింది. రుక్మిణి చెక్కిట చేయిచేర్చి, సంతోషం కోల్పోయి, కాలిబొటనవ్రేలితో నేల రాస్తూ, ముఖం సగంవంచి తపించింది. ఆమె కోమలత్వం నశించినపువ్వులాగా కనబడింది.
తనతో ప్రియుడు పలికిన అప్రియమైన మాటలు చెవులలో గ్రుచ్చిన సూదులు కాగా, రుక్మిణి పులిగాండ్రింపు విన్న లేడివలె స్థైర్యం కోల్పోయి, కదలలేక, మెదలలేక చీల ఊడిపోయిన బంగారుబొమ్మవలె భూమిమీద పడిపోయింది.
(శ్రీకృష్ణుడు నిష్కారణంగా ఏమాటా మాట్లాడడు. కనుక తనకు ప్రాణప్రియ అయిన రుక్మిణిని ఇలా నిందించడం వెనుక ఏదో ప్రయోజనం ఉంటుంది. రుక్మిణి ఎప్పుడూ తనకు సేవలు చేస్తుందే కానీ - తానెప్పుడూ ఆమెకు సేవలు చేయలేదు.

అందుకే కృష్ణుడు ఇలాంటి మాటల్లో ఆమెను నొప్పించి, నేలపై పడేట్టుగా చేశాడు. తర్వాత ఆమెకు సేవలు చేసి, అనునయించి, లాలించి, సంతోషపరుస్తాడు. ఇది ఆ స్వామికి ఒక ఆనందలీలావిలాసం.)
ఇట్లు నేలమీద పడిపోగా...
వేదపూజితుడయిన శ్రీకృష్ణుని కన్నీటిపొరలు కమ్ముకోవడంచేత చక్కగా చూడలేనిదీ, శరీరంనుండి జారిపోయిన ఆయా నగలు గలది, భర్త మాటాడిన చెడ్డమాటలవల్ల కళదప్పిందీ, భూమిమీద పడిందీ, కులాచారమనే ఉత్తమధర్మంతో చరించేదీ, మగనికి దూరమయింది, సంతోషం లేనిది, కుటుంబినులలో అగ్రగణ్య ఐన రుక్మిణిని సమీపించాడు.
నేలమీద వ్రాలిన రుక్మిణికి శ్రీకృష్ణుడు ఉపచారాలు చేస్తున్నాడు. అతడు, ఆమెశరీరంపై పలుచగా మంచిగంధం పూశాడు. పన్నీటితో కన్నీటిమకిల కడిగాడు. చెవులలోపల కర్పూరపు పలుకులు పడునట్లుగా ఊదాడు. ముత్యాలదండల చిక్కుదీసి వక్షస్థ్సలంపై సర్దినాడు.

నుదుట తిలకం దిద్దాడు. పడిపోయిన నగలు పెట్టాడు. తామరరేకులవంటి విసనకర్రతో విసిరాడు. స్తనాలమీద పైట సవరించాడు. అలసట పోగొట్టాడు. బిగికౌగిట చేర్చాడు. ముఖం నిమిరాడు.
శ్రీకృష్ణుడు వంకరలై, మన్మథుని నల్లనియుచ్చులను మించినవై అనగా కామోద్దీపనములై, చీకట్లును మించిపోయిన తుమ్మెద రెక్కలకంటె మిక్కిలి నీలంగా ఉండే రుక్మిణి తలవెండ్రుకల చిక్కు తీర్చి, కొప్పు పెట్టి పూలు తురిమాడు.
శ్రీకృష్ణుడు, ప్రశంసింపబడిన ప్రవర్తన గలది, పద్మాలనుపోలినకన్నులుగలదీ, భీష్మకునిపుత్రిక అయిన రుక్మిణిని తుమ్మెదల రెక్కల గాలిచే కదలుతున్న పూలతో, మొగ్గలతో అందంగా ఉన్న పానుపుపై చేర్చాడు.
రుక్మిణిని పాన్పుమీద చేర్చి శ్రీకృష్ణుడు మెత్తని తియ్యని మాటలతో ఓదార్చగా
రుక్మిణి సిగ్గుతో, చిరునవ్వుతో కూడి మనోహరంగా ఉన్న కడగంటి చూపులతో శ్రీకృష్ణుని ముఖపద్మాన్ని చూచి ఈ విధంగా పలికింది.

No comments:
Post a Comment