Tuesday, August 11, 2026

Ashadha Amavasya - ఆషాఢ అమావాస్య

ఆషాఢ అమావాస్య

ఆషాఢ మాసంలో వచ్చే అమావాస్యను ఆషాఢ అమావాస్య లేదా తెలంగాణ ప్రాంతంలో చుక్కల అమావాస్య, తమిళనాట ఆడి అమావాస్య అని పిలుస్తారు. ఈ రోజుతో ఆషాఢ మాసం పూర్తయి, శ్రావణ మాసానికి నాంది పలుకుతుంది.

ఆషాఢంలో సంక్రమణంనాడుగానీ నెలనెలా పంచమీనవముల్లోగానీ మాసాంతంలోగాని (పూర్ణిమ - అమావాస్య) మనసాదేవిని అర్చించినవారికి పుత్రపౌత్రాభివృద్ధిగా ధనధాన్య సమృద్ధి కలుగుతుంది. సర్ప భయం ఉండదు. కీర్తిమంతులూ విద్యావంతులూ గుణవంతులూ అవుతారు. 

అజ్ఞానంతో మనసాదేవిని నిందించినవారికి సర్పభయం తప్పదు. దరిద్రులవుతారు.

గంగ లో అమావాస్య నాడు స్నానం చేస్తే నూరు రెట్లు అధిక పుణ్యాన్నిస్తుంది.

గ్రీష్మ రుతువు అంటే జ్యేష్ట, ఆషాఢ మాసాలలో అయోధ్యా పూరీ యాత్ర చేయాలి పంచ క్రోశ యాత్రలో కని పించే రామేశ్వరమే ఇది.

పితృదేవతల ఆశీస్సులు పొందడానికి, గృహ లక్ష్మిని ప్రసన్నం చేసుకోవడానికి మరియు ఇంట్లోని దరిద్ర బాధలు తొలగిపోవడానికి ఈ అమావాస్య ఎంతో విశిష్టమైనది.

ఆషాఢ అమావాస్య మరియు ఆ రోజు కూష్మాండ దీపం (గుమ్మడికాయ దీపం) వెలిగించడం వెనుక ఉన్న విశిష్టత, లాభాలు మరియు వెలిగించే విధానం గురించి వివరంగా తెలుసుకుందాం.

కూష్మాండ (గుమ్మడికాయ) దీపం వెలిగించడం వల్ల లాభాలు:
ఆషాఢ అమావాస్య రోజు లేదా అమావాస్య సమయంలో బూడిద గుమ్మడికాయతో దీపం వెలిగించడం వల్ల అనేక ఆధ్యాత్మిక ప్రయోజనాలు ఉంటాయి.

దిష్టి మరియు నరదృష్టి నివారణ: ఇంట్లోని ప్రతికూల శక్తి, నరదృష్టి, కంటిదృష్టి తొలగిపోతాయి.

గ్రహదోష నివారణ: శని దోషాలు, రాహు - కేతు దోషాలు ఉన్నవారికి ఇది శ్రేష్ఠమైన పరిహారం.

పితృదేవతల శాంతి: పితృ దోషాల ప్రభావం తగ్గి, పితృదేవతల ఆశీస్సులు లభిస్తాయి.

గుమ్మడికాయ దీపం వెలిగించడానికి కావలసిన సామగ్రి?
చిన్న బూడిద గుమ్మడికాయ, నువ్వుల నూనె లేదా ఆవు నెయ్యి, పసుపు, కుంకుమ, వత్తులు,రాతి ఉప్పు మరియు బియ్యం.

వెలిగించే విధానం:
సిద్ధం చేయడం:
బూడిద గుమ్మడికాయను నిలువుగా లేదా అడ్డంగా సగానికి కోయాలి. అందులోని విత్తనాలు, గుజ్జును కొద్దిగా తొలగించి రెండు ప్రమిదల లాగా తయారు చేయాలి.

అలంకరణ: ఆ గుమ్మడికాయ ప్రమిదలకు బయట వైపు పసుపు రాసి, కుంకుమ బొట్లు పెట్టాలి.

స్థాపన: నేరుగా నేలపై పెట్టకుండా, ఒక పళ్లెంలో కొంత రాతి ఉప్పు, దానిపై కొద్దిగా బియ్యం పోసి, దానిపైన ఈ గుమ్మడికాయ ప్రమిదలను ఉంచాలి.

దీపారాధన: అందులో నువ్వుల నూనె (లేదా ఆవు నెయ్యి) పోసి వత్తులు వేసి దీపాన్ని వెలిగించాలి.

దీపం వెలిగించి ఏమి చేయాలి?ఎక్కడ వెలిగించాలి?:
ఈ దీపాన్ని ఇంట్లోని పూజా మందిరంలో కంటే ఇంటి ప్రధాన ద్వారం బయట (సింహద్వారం వద్ద) లేదా ఇంటి ఈశాన్యం/దక్షిణ దిశలో వెలిగించడం శ్రేష్టం. లేదా గుడిలో (శివాలయం/దుర్గాదేవి ఆలయం) వెలిగించవచ్చు. 108 సార్లు ఓం నమః శివాయ జపం చేయాలి.

మరుసటి రోజు:
మరుసటి రోజు ఉదయం ఆ గుమ్మడికాయ ముక్కలను, ఉప్పు - బియ్యాన్ని ఎవరూ తొక్కని ప్రదేశంలో లేదా ప్రవహించే నీటిలో వేయాలి/పారవేయాలి (ఇంట్లో వంటకు ఉపయోగించకూడదు).

జ్యోతిషశాస్త్రము

నిత్య స్తోత్రావళి

నిత్య పారాయణ శ్లోకాలు

స్తోత్రాలు

పంచాంగం

No comments:

Post a Comment

Aalochana - ఆలోచన

రామాయణం సుందరకాండ పదహారవ  సర్గ - ఆలోచన చూస్తున్న హనుమంతుని కన్నుల నీరు నిండింది. ఉత్తములయిన కుల, గురు, వృద్ధుల శిక్షణలో పెరిగిన లక్ష్మణుని ...