Saturday, August 22, 2026

Revati Nakshatra - రేవతి నక్షత్రము

రేవతి నక్షత్రము

నక్షత్రం - రేవతి
అధిపతి - బుధుడు
గణము - దేవ
జాతి - పురుష
వృక్షం - విప్ప
జంతువు - ఏనుగు
నాడి - అంత్య
పక్షి - నెమలి
అధిదేవత - పూషణుడు
రాశి - మీనం
దే,/దో, /చా, /చీ

రేవతి నక్షత్ర జాతకుల గుణగణాలు
నక్షత్రములలో రేవతి నక్షత్రము 27వ నక్షత్రము. రేవతి నక్షత్ర అధిపతి బుధుడు, అధిదేవత పూషణుడు, గణము దేవగణం. ఈ నక్షత్రంలో పుట్టినవారు మేధావులు. ఆడంబరం తక్కువ. గణితంలో ప్రజ్ఞ కలిగి ఉంటారు. అనేక రకాల విజ్ఞాన గ్రంథాలను పఠిస్తారు.

కష్టపడే మనస్తత్వము ఉంటుంది. ప్రశాంతంగా నిదానంగా సమాధానాలను చెప్తారు. వ్యాపారంలో మోసం చేసే భాగస్వాముల నుండి తప్పించుకుంటారు. దూరప్రాంతాలలో చదువుకుని స్థిరపడడానికి బంధువుల సహకారం ఉంటుంది.

కీలకమైన అధికార పదవులలో వినూత్న వ్యాపారాలలో రాణిస్తారు. ప్రజలలో మంచి పేరు ఉంటుంది. నమ్ముకున్న వారిని కుటుంబాన్ని పైకి తీసుకురావడానికి ప్రయత్నిస్తారు సహాయం చేస్తారు.

వివాహ జీవితంలో ఒడిదుడుకులు ఉన్నా సర్దుకుపోతారు. వీరికి సాహిత్య రంగంలో జ్ఞాపకశక్తి అధికం. పాడి పంటలకు సంబంధించిన వ్యాపారాలు కలసి వస్తాయి. సంతానాన్ని ప్రేమగా గౌరవంగా చూస్తారు.

మంచితనంతో జీవితంలో ముఖ్యమైన విషయాలను అనుకూలం చేసుకుంటారు. విద్యాభ్యాసంలో కలిగే అవరోధాలను అధిగమించి ముందుకు సాగితే రాణిస్తారు. బాల్యం నుండే తెలివితేటలను ప్రదర్శిస్తారు.

రేవతి నక్షత్రము మొదటి పాదము
రేవతి నక్షత్రము మొదటి పాదము ధనసురాశిలో ఉంటుంది. ధనసురాశి అధిపతి గురువు. రేవతి నక్షత్ర అధిపతి బుధుడు. ఈ నక్షత్రంలోని మొదటి పాదము జాతకుల మీద గురు బుధ గ్రహ ప్రభావం ఉంటుంది. ఇది దేవగణ నక్షత్రం. వీరికి ప్రధానంగా సత్వగుణం ఉంటుంది. అధ్యాత్మిక విశ్వాసం కలిగి ఉంటారు. వీరికి విద్యాసంస్థలు స్థాపించి నిర్వహించ గలిగే నేర్పు ఉంటుంది. విద్యా సంబంధిత వృత్తులు, వ్యాపారం, ఉద్యోగాలు అనుకూలం.

ఈ జాతకులకు 16 సంవత్సరాల వరకు బుధ దశ ఉంటుంది. వీరు విద్యారంభం నుంచి ప్రతిభ చూపిస్తారు.

16 సంవత్సరాల తరువాత ఏడు సంవత్సరాల కేతు దశ కాలంలో విద్యసాధన విషయంలో కొన్ని సమస్యలు ఎదురవుతాయి. ప్రయత్నపూర్వకంగా అడ్డంకులను అధిగమించి విజయం సాధించాలి. కేతు దశ అనుకూలిస్తే సమస్యలు ఉండవు. 

తరువాత 23 సంవత్సరాల శుక్ర దశ కాలంలో విద్యలో అభివృద్ధి ఉంటుంది. శుక్రదశ కాలంలో విద్య కంటే విలాసాల మీద ఆసక్తి అధికం. కాబట్టి పట్టుదలతో విద్య సాధనలో విజయం సాధించాల్సి ఉంటుంది. సకాలంలో జీవితంలో స్థిరపడతారు. సకాలంలో వివాహం జరుగుతుంది. 

66 సంవత్సరాల వరకు జీవితం సాఫీగా జరుగుతుంది. తరువాత వచ్చే 18 సంవత్సరాల రాహు దశ కాలంలో కొన్ని సమస్యలు ఎదుర్కొంటారు. రాహు దశ అనుకూలిస్తే విదేశీ ఉద్యోగావకాశాలు, విదేశీ పర్యటనలు కలిసి వస్తాయి.

రేవతి నక్షత్ర రెండవ పాదము
వీరు ఆధ్యాత్మిక విశ్వాసం కలిగి ఉంటారు. వీరు శ్రమకు ఓర్చి పని చేయగలరు. వీరికి భూ సంబంధిత, వాయు సంబంధిత ఉద్యోగాలు, వృత్తులు, వ్యాపారాలు అనుకూలిస్తాయి. వీరికి సాంకేతిక విద్య అనుకులిస్తుంది. న్యాయ సంబంధిత విద్య కూడా వీరికి అనుకూలిస్తుంది.

ఈ జాతకులకు 12 సంవత్సరాల వరకు బుధ దశ ఉంటుంది. వీరు మొదటి నుంచి విద్యాలో ప్రతిభ చూపిస్తారు. 

12 సంవత్సరాల తరువాత ఏడు సంవత్సరాల కేతు దశ కాలంలోవిద్యలో కొన్ని సమస్యలు ఎదుర్కొంటారు. ప్రయత్నపూర్వకంగా అడ్డంకులను అధిగమించి విజయం సాధించాలి. కేతు దశ అనుకూలిస్తే సమస్యలు ఉండవు. 

19 సంవత్సరాల తరువాత వచ్చే 20 సంవత్సరాల శుక్ర దశ కాలంలో విద్యలో అభివృద్ధి ఉంటుంది. శుక్ర దశ కాలంలో విద్యకంటే విలాసాల మీద ఆసక్తి అధికం. కాబట్టి పట్టుదలతో మనసును విద్య వైపు మళ్ళించి విజయం సాధించాలి. ఇక వీరు సకాలంలోనే జీవితంలో స్థిరపడతారు. సకాలంలో వివాహం అవుతుంది.

62 సంవత్సరాల వరకు జీవితం సాఫీగా సాగుతుంది. తరువాత వచ్చే 18 సంవత్సరాల రాహు దశ కాలంలో కొన్ని సమస్యలు ఎదురవుతాయి. రాహు దశ అనుకూలిస్తే విదేశీఉద్యోగావకాశాలు, విదేశీపర్యటనలు కలిసి వస్తాయి. 

80 సంవత్సరాలకు వచ్చే 16 సంవత్సరాల గురు దశ కారణంగా జీవితం మళ్లీ గాడిలో పడుతుంది. ఇక వృద్ధాప్య దశ సాఫీగా సాగిపోతుంది.

రేవతి నక్షత్రము మూడవ పాదము
వీరు శ్రమకు ఓర్చి పని చేయగలరు. వీరికి భూసంబంధిత, వాయు సంబంధిత ఉద్యోగాలు, వృత్తులు, వ్యాపారాలు అనుకూలిస్తాయి. వీరికి సాంకేతిక విద్య అనుకూలిస్తుంది. న్యాయ సంబంధిత విద్య కూడా వీరికి అనుకూలిస్తుంది. వీరు స్థిరమైన అభిప్రాయాలు కలిగి ఉంటారు.

ఈ జాతకులకు ఐదు సంవత్సరాల వరకు మాత్రమే బుధదశ ఉంటుంది. కనుక వీరికి విద్యారంభంలో ఆటంకాలు ఎదుర్కొంటారు. 

ఐదు సంవత్సరాల తరువాత ఏడు సంవత్సరాల కేతుదశ కాలంలోవిద్యలో కొన్ని సమస్యలు ఎదురవుతాయి. ప్రయత్నపూర్వకంగా అడ్డంకులను అధిగమించి విజయం సాధించాలి. కేతుదశ అనుకూలిస్తే సమస్యలు ఉండవు. 

12 సంవత్సరాల తరువాత వచ్చే 20 సంవత్సరాల శుక్ర దశ కాలంలో విద్యలో అభివృద్ధి ఉంటుంది. శుక్రదశ కాలంలో విద్య కంటే విలాసాల మీదికే మనసు మళ్లుతుంది. కాబట్టి పట్టుదలతో మనసును విద్య వైపు మళ్ళించి సఫలం కావాలి. ఈ జాతకులు సకాలంలో జీవితంలో స్థిరపడతారు. వీరికి సకాలంలోనే వివాహం జరుగుతుంది. 55 సంవత్సరాల వరకు జీవితం సాఫీగా జరుగుతుంది. 

తరువాత వచ్చే 18 సంవత్సరాల రాహుదశ కాలంలో కొన్ని సమస్యలు ఎదుర్కొంటారు. రాహు దశ అనుకూలిస్తే విదేశీ ఉద్యోగావకాశాలు, విదేశీ పర్యటనలు కలిసి వస్తాయి. 

73 సంవత్సరాలకు వచ్చే 16 సంవత్సరాల గురు దశ కారణంగా జీవితంలో తిరిగి సుఖం వస్తుంది. వృద్ధాప్య దశ కూడా సౌఖ్యంగా గడుస్తుంది.

రేవతి నక్షత్రము నాలుగవ పాదము
వీరికి విద్య సంస్థలు స్థాపించి నిర్వహించ కలిగిన సామర్ధ్యం ఉంది. వీరికి విద్యా సంబంధిత వృత్తులు, వ్యాపారం, ఉద్యోగాలు అనుకూలిస్తాయి. వీరికి నాలుగు సంవత్సరాల వరకు మాత్రమే బుధ దశ ఉంటుంది. కనుక వీరికి విద్యారంభంలో ఆటంకాలు ఎదురవుతాయి.

నాలుగు సంవత్సరాల తరువాత ఏడు సంవత్సరాల కేతుదశ కాలంలో విద్యలో కొన్ని సమస్యలు ఎదురవుతాయి. కేతు దశ అనుకూలిస్తే సమస్యలు ఉండవు. 

11 సంవత్సరాల తరువాత వచ్చే 20 సంవత్సరాల శుక్ర దశ కాలంలో విద్యలో అభివృద్ధి ఉంటుంది. శుక్రదశ కాలంలో విద్య కంటే విలాసాల మీద ఆసక్తి ఉంటుంది కనుక మనసును పట్టుదలతో విద్య వైపు మళ్ళించి విజయం సాధించాలి. ఇక వీరు సకాలంలో జీవితంలోనే స్థిరపడతారు. వివాహం కూడా సకాలంలో జరుగుతుంది. 54 సంవత్సరాల వరకు జీవితం సాఫీగా జరుగుతుంది. 

తరువాత వచ్చే 18 సంవత్సరాల రాహుదశ కాలంలో కొన్ని సమస్యలు ఎదుర్కొంటారు. రాహు దశ అనుకూలిస్తే విదేశీ ఉద్యోగావకాశాలు, విదేశీ పర్యటనలు కలిసి వస్తాయి. 

72 సంవత్సరాలకు వచ్చే 16 సంవత్సరాల గురుదశ కారణంగా జీవితంలో తిరిగి సౌఖ్యం వస్తుంది. వృద్ధాప్యం సాఫీగా గడిచిపోతుంది.


రేవతి నక్షత్ర జాతకుల తారా ఫలాలు
తార నామం తారలు ఫలం

జన్మ తార ఆశ్లేష, జ్యేష్ట, రేవతి శరీరశ్రమ

సంపత్తార అశ్విని, మఖ, మూల ధన లాభం

విపత్తార భరణి, పూర్వ ఫల్గుణి, పూర్వాషాఢ కార్యహాని

సంపత్తార కృత్తిక, ఉత్తర ఫల్గుణి, ఉత్తరాషాఢ క్షేమం

ప్రత్యక్ తార రోహిణి, హస్త, శ్రవణం ప్రయత్న భంగం

సాధన తార మృగశిర, చిత్త, ధనిష్ట కార్య సిద్ధి, శుభం

నైత్య తార ఆరుద్ర, స్వాతి, శతభిష బంధనం

మిత్ర తార పునర్వసు, విశాఖ, పూర్వాభద్ర సుఖం

అతిమిత్ర తార పుష్యమి, అనూరాధ, ఉత్తరా భద్ర సుఖం, లాభం

అంశ గుణాలు :
1) ఉత్పన్నాంశ : రేవతీ నక్షత్ర ప్రధమ పాదం గురువుది. ఈ జాతకులు శాస్త్రాలపైనా పట్టు గలవారు, నీతి నియమాలు కలవారు.

2) పాపాంశ : రేవతి నక్షత్ర ద్వితీయ పాదం శనిది. ఈ జాతకులు అవతలి వాళ్ళలోని గుణాలను గ్రహించగలిగే సామర్థ్యం కలవారు అవుతారు.

3) ఉగ్రాంశ : రేవతి నక్షత్ర తృతీయ పాదం శనిది. ఈ జాతకులు మంచి బుద్ధి కలవారు అగుదురు.

4) శోభనాంశ : రేవతి నక్షత్ర చతుర్ధ పాదం గురువుది. ఈ జాతకులు ఈ జాతకులు యజ్ఞ యాగాదులు చేయువారు, దైవ కార్యాలు చేయువారు, ధైర్యవంతులు అవుతారు.

నక్షత్ర శాంతి: 
పద్మములు, సువాసన గల పుష్పాలు, యాలుకులు, కస్తూరి, పునుగు, జవ్వాది ఇవన్ని ప్యాకింగ్ చేసి శివాలయంలో దానం చేయవలెను.

నక్షత్ర మంత్రం:
।। ఓం ।।
పూషా రేవత్యన్వే'తి పంథా”మ్ ।
పుష్టిపతీ' పశుపా వాజ' బస్త్యౌ ।
ఇమాని' హవ్యా ప్రయ'తా జుషాణా ।
సుగైర్నో యానైరుప’యాతాం యమ్ ।
క్షుద్రాన్ పశూన్ ర'క్షతు రేవతీ' నః ।
గావో' నో అశ్వాగ్మ్ అన్వే'తు పూషా ।
అన్నగం రక్షంతౌ బహుధా విరూ'పమ్ ।
వాజగ్మ్' సనుతాంయజ'మానాయ యజ్ఞమ్ ॥

నక్షత్ర గాయత్రి
ఓం విశ్వరూపాయ విద్మహే 
పూష్ణ దేహాయ ధీమహి 
తన్నో రేవతి ప్రచోదయాత్

దర్శించవలసిన ఆలయములు
మొదటి పాదం - భట్లపాలికలో వేంచేసి ఉన్న శ్రీ లోపాముద్ర సమేత శ్రీ అగస్తేశ్వర స్వామి.
రెండవ పాదం - కాపులపాలెంలో వేంచేసి ఉన్న శ్రీ భద్రకాళీ సమేత శ్రీ వీరభద్రస్వామి.
మూడవ పాదం - పేకేరులో వేంచేసి ఉన్న శ్రీ లోపాముద్ర సమేత శ్రీఅగస్తేశ్వర స్వామి .
నాలుగవ పాదం - బాలాంత్రంలో వేంచేసి ఉన్న శ్రీ రాజరాజేశ్వరీ సమేత శ్రీ అగస్తేశ్వర స్వామి.


No comments:

Post a Comment

Revati Nakshatra - రేవతి నక్షత్రము

రేవతి నక్షత్రము నక్షత్రం - రేవతి అధిపతి - బుధుడు గణము - దేవ జాతి - పురుష వృక్షం - విప్ప జంతువు - ఏనుగు నాడి - అంత్య పక్షి - నెమలి అధిదేవత - ...