కృష్ణుడు పౌండ్రకవాసుదేవునిమీద దండెత్తిపోయి వానిం జంపుట
పౌండ్రక వాసుదేవుడు బలంవల్ల కలిగిన పొగరుతో పిచ్చివాడై భూమిపై వాసుదేవుడనే పేరు నాకు ఒక్కడికే కాక ఇతరులకు తగునా? కృష్ణుడు తాను వాసుదేవుణ్ణి అని అనుకొంటున్నట్లు తెలిసింది అని తన రాయబారిని పిలిచి, కృష్ణుని దగ్గరకు పంపాడు.
ఆ రాయబారి కృష్ణుడు రాజసభలో ఉండగా జంకకవెళ్ళి, పౌండ్రకునిమాటలుగా ఇలా చెప్పాడు. 'కృష్ణా! భూమిని కాపాడేందుకు వాసుదేవుడని పేరు కలిగిన నేను ఉండగా - సిగ్గులేనివాడవై - నీవు
నా నామాల్ని, లాంఛనాల్ని దాల్చి సంచరిస్తున్నావు. ఈ పనిలో నీకు నాతో పోటీయా? గొల్లవానికి రాచమర్యాద ఏ తీరున తెలుస్తుంది?
ఇప్పటినుండైనా తన శక్తినీ, ఎదుటివారిశక్తినీ తెలుసుకొని నా చిహ్నాలనన్నింటిని వదలి, నన్ను సేవించి బతకమని చెప్పు. అలా కానట్లయితే భయంకరమైన యుద్ధంలో ఎదుర్కోమను, చూద్దాం.
రాయబారిప్రలాపాలు విని, సభ్యులు పరస్పరం ఒకరిముఖాన్ని ఒకరు చూచుకొన్నారు. సభ్యులారా! మనం - ఎలాంటి కొత్తమాటలు వింటున్నాం. ఈ రాయబారిమాటలను బాగుగ విన్నారుకదా! అనగా
ఆ సందర్భంలో కృష్ణుడు పౌండ్రకుని రాయబారితో ఇలా చెప్పాడు.
ఓరీ! విను. "మీరాజు పొండ్రకుడు చెప్పిన చిహ్నాలతో వచ్చి, భయంకరయుద్ధంలో వాటిల్ని ప్రయోగించగా తాను భూమిపైబడి అవయవాలను పోగొట్టుకొని రాబందులు, గద్దలు, మూగగా కుక్కల గుంపులకు ఆహారమౌతావని మీరాజు పౌండ్రకునితో నేను చెప్పినట్లు చెప్పు” అని కృష్ణుడు పలికాడు.
కృష్ణుడు ఆవేశంతో పల్కిన మాటలకు భయపడి హృదయం కలతపడుతుండగా తన ప్రభువయిన పొండ్రకునికి విపరీతభావం కల్గేట్టుగా చెప్పాడు.
కృష్ణుడు కదనకుతూహులుడడై దారుకుడు తెచ్చిన రథాన్ని అధిరోహించాడు. పొండ్రకుడూ రెండుఅక్షౌహిణుల సైన్యంతో మిత్రుడు, కాశీరాజు మూడు అక్షౌహిణుల సైన్యంతో కదనరంగానికి వెళ్ళారు.
(1. అక్షౌహిణి అనగా- 21870 రథాలూ, 21870 ఏనుగులూ; 65610 అశ్వములూ, 109850 పదాతులును కలిగినసేన. ఒక అక్షౌహిణి అంటే - 218700ల సేనతో కూడింది.)
శంఖం, చక్రం, గద, శార్ఙ్గాలనే ఆయుధాలను పొండ్రకుడు ధరించాడు. కృత్రిమకౌస్తుభమణిని వక్షఃస్థ్సలంలో ధరించాడు. మకరకుండలాలు, హారాలు, కంకణాలు, రత్నపుటుంగరాలు, మెడలో వనమాల ధరించాడు. గరుడకేతనాన్ని రథంపై కూర్చాడు. పీతాంబరాన్ని ధరించాడు.

వేగంగల గుర్రాల్ని కట్టిన రథాన్ని అధిరోహించాడు. ప్రకాశించే కిరీటాన్ని ధరించాడు. అట్టి పౌండ్రకుణ్ణి చూచి నాటక రంగంపై విహరించే నటుణ్ణిగా భావించి, శ్రీకృష్ణుడు నవ్వాడు. ఆ నవ్వు చూచి పౌండ్రకునికి కోపం కలిగి
పరిఘ, శరాసన, పట్టిస, శర, ముద్గర, ముసల, కుంత, చక్ర, గద, తోమర, భిందిపాల, శక్తి, క్షురిక, అసి, ప్రాస, శూలాది ఆయుధాలతో వేగంగా
శ్రీకృష్ణుడు ఆయుధాల్ని వేగంగా విసరి పౌండ్రకునిపై, శత్రువుల ఆయుధాల్ని తుంచి, వాళ్లను వణికించే పాంచజన్యం పూరించాడు.
కృష్ణుడు తగ్గని కోపంతో విజృంభించాడు. మృత్యుదేవత చెలగాటమాడినట్లు శత్రు సైన్యాలు శవాల గుట్టలయ్యాయి. రథాలు నేలపై పడ్డాయి. గుర్రాలు కూలాయి. ఏనుగులు ఒరిగాయి. వీరులైన భటులు మరణించారు. మిగిలినవారు చావు తప్పించుకొన్నారు.
ఆ సమయంలో రక్తప్రవాహంలో క్రొవ్వు, మాంసంపడి బురదగా అయింది. యుద్ధభూమి మిక్కిలి భయంకరమయింది. అట్టి సమయంలో తగవుకు సిద్ధపడుతున్న పౌండ్రకుణ్ణి చూచి పిలిచి కృష్ణుడు ఈ విధంగా చెప్పాడు.
రాజాధమా! పౌండ్రరాజకుమారా! నీ పౌరుషాన్ని నేటియుద్ధంలో రూపుమాపేటట్లు చేస్తాను. ఎద్దు కొవ్వెక్కి ఆబోతు పై రంకెలు వేసినట్లుగా నీ మాటలు ఉన్నాయి. నీవు ఆక్షేపించిన నా పేరు, చిహ్నాలు మంటలు కురిపిస్తుండగా నేటియుద్ధంలో నీపై ప్రయోగిస్తాను.
నేను నీ శరణును తరువాత వేడుకొంటాను. నీవు బలపరాక్రమ సంపద కలిగినవాడివి అయితే యుద్ధంలో స్థిరంగా పలుకుతూ వాడి అయిన బాణాలు
కృష్ణుడు విజృంభించి పౌండ్రకుని రథాన్ని గుర్రాల్ని సారథిని చంపి, భయంకరమయిన పరాక్రమంతో ప్రళయకాల సూర్యునివలె మంటలు కక్కే సుదర్శన చక్రాన్ని ప్రయోగించాడు. ఆ చక్రం దెబ్బతో పౌండ్రకుడు వజ్రాయుధం దెబ్బకు కూలిన పర్వతంవలె నేలకూలాడు.
కాశీరాజు శిరస్సును శ్రీకృష్ణుడు ఖండించాడు. ఆ శిరస్సును ఎగురకొడుతూ కాశీపట్టణంలో పడేటట్లు చేశాడు. ఒకదానివెనుక మరోబాణం చివర్ల గుచ్చుకొనేట్లు సాగే బాణాలను ప్రయోగించాడు. ఈ విధంగా కృష్ణుడు శత్రువుల్ని జయించి ఆనందిస్తూ

సుర, గంధర్వ, గరుడ, ఉరగ, సిద్ద సాధ్య గణాలు తనను ప్రశంసిస్తూ ఉండగా తిరిగివచ్చి, కృష్ణుడు తన నగరంలో మిక్కిలి వైభవంతో సుఖంగా ఉన్నాడు.
కృష్ణుని లాంఛనాలు ధరించడంచేత, మత్సరబుద్ధితో కృష్ణుణ్ణి సర్వకాల సర్వావస్థల్లో స్మరించడంవల్ల, పౌండ్రకునికి మోక్షం లభించింది.
పౌండ్రకుని మరణాని కాయన భార్యలు, బంధువులు, మిక్కిలి పరితపించారు. పౌండ్రకుని కుమారుడగు సుదక్షిణుడు శాస్త్రోక్తంగా తండ్రికి పరలోకక్రియలు చేశాడు. యుద్ధంలో తండ్రిని వధించిన కృష్ణుణ్ణి నుగ్గు చేసేందుకు తగిన ఉపాయం ఆలోచించి, అందుకు నేర్పరి అయిన తన పురోహితుణ్ణి ఆహ్వానించాడు.
రాజపురోహితుడూ, సుదక్షిణుడూ శివునిపాదపద్మాలకు మొక్కి ఆ దేవుణ్ణి అనేకవిధాలుగా సేవించగా, శివుడు దయకలిగి
'మీరు నన్ను సేవలతో మెప్పించారు. మీరు కోరే కోరిక తప్పక తీరుస్తాను' అని శివుడు అంటే సుదక్షిణుడు శివా! అభవా! పురహరా! తనవాడు పరవాడు అనే భేదంలేకుండా ప్రేమతో మమల్ని రక్షించేవాడివి నువ్వే!
ఓ శివా! నా తండ్రిని కృష్ణుడు యుద్ధంలో చంపాడు. నేను కృష్ణుణ్ణి యుద్ధభూమిలో ఏ విధంగా గెలుస్తానో చెప్పుమని సుదక్షిణుడు పలికాడు.
సుదక్షిణుని కోరిక విని, శివు డాతనితో ఈ విధంగా చెప్పాడు. పుణ్యాత్ముడా! నీవూ, ఋత్విజులగు బ్రాహ్మణులూ తృప్తిగా అభిచారహోమం చేస్తే భూతాలతో కూడిన అగ్ని నీ కోరికను తీరుస్తాడు.
శివుడు చెప్పిన విధంగా సుదక్షిణుడు అధికమైన నియమాలతో మారణహోమం చేశాడు. అగ్నిదేవుడు తృప్తి చెంది ప్రదక్షిణంగా తిరుగుతున్న జ్వాలలతో ప్రకాశించాడు.
మారణహోమాగ్ని ఉన్న హోమకుండం నుండి కృత్య భయంకర రూపంతో, రక్తంతో కూడిన నాలుకతో పెదవులను నాకుకొంటూ వచ్చి, అగ్నిజ్వాలవంటి శూలాన్ని ధరించి, తన పాదఘట్టనవల్ల దుమ్ము వ్యాపిస్తుండగా భూతాలు తనను సేవిస్తూండగా, కన్నులనుండి రాలే మంటలతో దిక్కులను కాలుస్తూ, మిక్కిలి వేగంగా కృష్ణుడుండే ద్వారకానగరం చేరింది.

ద్వారకావాసులు భయపడి రక్షించు రక్షించుమని కృష్ణుణ్ణి వేడారు. కృష్ణుడు పారిపోకుడని వారికి ధైర్యం చెబుతూ, తన దివ్యదృష్టితో విషయం తెలుసుకొన్నాడు. ఈ పని సుదక్షిణుడు చేసిన మారణహోమఫలం అని తెలిసికొని, కృత్యను అడ్డగించెందుకు సుదర్శనచక్రాన్ని పంపాడు.
(కృత్య శత్రుసంహారంకోసం - అందుకు తగిన మంత్రాలతో, వస్తువులో హోమంచేస్తే ఆ హోమంనుండి పుట్టే క్షుద్రదేవతా శక్తి. 'కృత్య' - ఆజ్ఞాపించినపనిని చేసేది అని వ్యుత్పత్తి.)
కృష్ణుడు భయంకరమైన శత్రువులను చంపేట్టిదీ, సూర్యకాంతిని ధిక్కరించేకాంతి కలదీ, అన్ని దిక్కులకు పోగలిగినట్టిదీ, శాశ్వతమైందీ, వేదాలచే స్తుతింపదగిందీ, సుజనులచే స్తుతింపబడేదీ, భక్తులచేత సేవింపబడేదీ, దేవతలచే నమస్కరింపబడేదీ, రాక్షససంహారం చేసేదీ, ప్రళయకాలంలో శివునిఫాలనేత్రంనుంచి వెలువడిన మంటలవలె భయంకరమై తన జూలు అనెడి అగ్నిజ్వాలలతో ప్రాణులకు భయాన్ని కల్గించేదీ అయిన సుదర్శనచక్రాన్ని కృత్యపైకి పంపాడు.
ఆ చక్రాయుధం ప్రళయకాలంనాటి మేఘాలనుంచి పుట్టిన ధ్వనివంటి భయంకర ధ్వనితో, ఆకాశాన్నంటుతున్న అగ్నిజ్వాలలతో, సకలదేవతలు జయ జయధ్వానాలు చేస్తుండగా, అమిత తేజస్సుతో వెలుగొందుతూ కృత్యను సమీపించింది. తనను చూచి తడబడకుండా కంటిగించుకుంటున్న కృత్యను గెంటివేసి వెంటబడింది.

అప్పుడు కృత్య తన పూర్వపు రౌద్రరూపాన్ని వదలి తిరిగి కాశీపురంలో దూరింది. మరలి వచ్చిన కృత్యను చూచి పౌరులంతా భయపడి శోకిస్తుండగా ఆ కృత్య రోషభీషణమైన ఆకారంతో ఋత్విజులతోపాటు సుదక్షిణుణ్ణి దహించివేసింది.
అప్పుడు శ్రీకృష్ణుని చక్రాయుధం సౌధగోపుర ప్రాకారాలతో పాటు ఆ నగరాన్ని భస్మీపటలం చేసింది. దేవతలంతా ఆశ్చర్యపడేట్లు శ్రీకృష్ణునిచెంతకు చేరింది అని శుకమహర్షి పరీక్షిత్తు మహారాజుతో చెప్పి, కృష్ణగాథను ఇంకా కొనసాగించాడు.
పరీక్షిన్మహారాజా! శ్రీకృష్ణు విజయం అనే పేరుగల ఈ చరిత్రను చదివినా, విన్నా భగవంతుని కృపచే పుణ్యాత్ములై ఇహపరలోక సుఖాలను పొందుతారు.
రాజయోగియగు పరీక్షిన్మహారాజు శుకునితో ఇలా అన్నాడు.

No comments:
Post a Comment