Friday, August 14, 2026

Asokavana Vidhvamsam - అశోకవన విధ్వంసం

రామాయణం సుందరకాండ 41వ సర్గ - అశోకవన విధ్వంసం

ఆలోచిస్తున్నాడు హనుమంతుడు.

ఈ రాక్షసులు క్రూరప్రవృత్తి కారణంగా సామమార్గాన లొంగిరారు, ఇంత సిరిసంపదలతో వున్నవారిని దానంతో దారికి తీసుకురాలేము. బలగర్వంతో నిండిన వీరు భేదోపాయానికి చిక్కరు.

ఇక మిగిలింది దండనీతియే. అంటే పరాక్రమ ప్రదర్శన తప్పదు.

అందుచేత ఈ రాక్షసయోధులను కొందరిని సంహరిస్తే ఆ భయంతో వారు దిగి రావచ్చు.

కార్యసాధకుడైె న దూత ముందు వెనుకల భంగంకాని దారిని ముందడుగు వేయాలి. చిన్న చిన్న పనులు చేసేవాడు కార్యసాధకుడు అనిపించుకోడు. దానికి అనుబంధించిన యితర కార్యాలు కూడా పూర్తిచెయ్యాలి.

ఈ లంకలో విషయాలన్నీ తెలుసుకు వెడితే అప్పుడు నేను నా కర్తవ్యాన్ని సమగ్రంగా నిర్వర్తించినట్టవుతుంది.

ఈ రాక్షసులతో విపరీత శ్రమ లేకుండా యుద్ధం సాగించి నా శక్తిని రావణుడికి చూపాలి.

రావణుని మంత్రి, సేనానుల బలాబలాలు, వాని సర్వశక్తులూ గ్రహించి వెళ్ళాలి.

దానికి ఒకటే దారి కనిపిస్తున్నది.

నందన వనంలా ఉన్న ఈ ఉద్యానవనాన్ని ధ్వంసం చేస్తాను. దానితో రావణుడికి ఆగ్రహం వస్తుంది. అశ్వ, గజ, రథ బలాలను పంపుతాడు. వారందరినీ నేలకూల్చి అప్పుడు తిరుగుముఖం పడతాను, అని నిశ్చయించుకుని ఆ వనంలోని మహావృక్షాలను ధ్వంసం చేయడం మొదలు  పెట్టాడు.

చెరువుల గట్టు తెగగొట్టేశాడు.

ఆ కల్లోలానికి పక్షుల ఆర్తనాదాలు ఆరంభమయాయి. క్షణాల వ్యవధిలో ఆ వనంలోని లతలు, నికుంజాలు, చిత్రగృహాలు ముక్కలు ముక్కలయాయి.

రావణునికి నిత్య సంతోషం కలిగించే అశోకవనం శోకవనంగా తయారయింది. రావణునికి హృదయక్షోభ కలిగించి, తన్మూలంగా ఆయన పంపే యోధులతో యుద్దానికి సన్నద్ధుడై వన బహిర్ద్వారంలో నిలబడ్డాడు.

సేనా నాశనం

No comments:

Post a Comment

Brahmastra - బ్రహ్మాస్త్రం

రామాయణం సుందరకాండ 48, 49 సర్గలు -  బ్రహ్మాస్త్రం హనూమతో వేద న రాక్షసోన్తరం న మారుతి స్తస్య మహాత్మ నోన్తరమ్‌  । పరస్పరం నిర్విషహౌ బభూవతుః సమే...