అక్రూరుండు ధృతరాష్ట్రునితో హితోపదేశముగా సంభాషించుట
ఓ రాజా! (ధృతరాష్ట్రమహారాజా!) నీ తమ్ముడైన పాండురాజు మరణించగా నీవు రాజ్యాన్ని ఏలుతున్నావు. ప్రజలను ధర్మబద్ధమైన బుద్ధితో పాలిస్తూ కాపాడుతూ, పెద్దతనంతో, సమానదృష్టితో వాళ్లను చూసుకుంటే నీకు కీర్తి శ్రేయస్సూ కూడా కలుగుతాయి. అలాకాక వేరేవిధంగా ఉంటే మాత్రం దుర్గతిపాలవుతావు.
ధృతరాష్టమహారాజా! నీవు పాండవులను, నీ కొడుకులైన కౌరవులను సమానంగా చూడటం మంచిది. ఈ ప్రపంచంలో ఎవరుమాత్రం ఎవరితో ఎల్లకాలం ఉంటారు? ఏదీ శాశ్వతం కాదు. భార్య, పిల్లలు, ఇల్లు ఇలాంటి వాటివల్ల ఏం ఒరుగుకుంది? భూమిపై ఒకప్రాణి జన్మిస్తే మరోప్రాణి మరణిస్తూ ఉంటుంది.

ఒకడు పుణ్యం సంపాదిస్తే మరొకడు పాపం మూట కట్టుకుంటాడు. చేపకు ప్రాణభూతమైన నీళ్లను దానిపిల్లలు ఏ విధంగా తాగుతాయో అదే విధంగా బుద్ధిహీనుడిధనాన్నంతా వాడిదుర్మార్గపు కొడుకులే దోచుకుంటారు. ఆ తర్వాత తండ్రి బ్రతికాడా, చచ్చాడా అనికూడా విచారించరు. ఆ తండ్రి ఉన్నవైపునకూ వెళ్లరు.
కాబట్టి, ఓ ధృతరాష్ట్రమహారాజా! తెలివితక్కువవాడివై నీవు సంపాదించిన ధనసంపదలను, దుర్బుద్దులైన నీ కొడుకులు తీసుకొంటారు. అప్పుడు నిన్ను ఈ లోకంలోనూ, స్వర్గలోకంలోనూ కూడా అందరూ నిందిస్తారు.
రాజా! అపనింద పొందవద్దు. ఈ శరీరం నిద్రలో వచ్చిన కలలోని వస్తువులాంటిది. ఇది శాశ్వతంగా నిలిచేది కాదు సుమా! పుట్టంధుడివైకూడా, ఎందుకిలాంటి బుద్ధిలేనిపనులను చేస్తావు? సరి అయిన దృష్టితో చూడు. ఏ అనుమానం లేకుండా పాండవులకు వారికివ్వవలసిన భూ భాగాన్ని పంచి ఇవ్వు.
పై రీతిగా పలికిన మాటలను విని ధృతరాష్ట్రుడు ఇలా అన్నాడు.
నీవు చెప్పిన మాట నిజమే. కానీ నా మనసు చంచలం. అందులో నీ మాట నిలవదు. సుదామపర్వతంయొక్క స్ఫటికశిలపై ఉదయించి తళుక్కున మెరిసే మెరుపు వెలుగులాగా నా మనసు నిలకడ లేనిది. అమృతాన్ని పొందికూడా, సంతోషం పొందలేని మనిషివలె నేనూ ఆనందం పొందలేను. దేవుడు నిర్ణయించిన దాన్ని ఎవడు తప్పించగలడు?

ఎంత గొప్ప జ్ఞానిఅయినా దాన్ని అనుభవించాల్సిందే. ఈ ప్రపంచాన్ని సృజించడమేగాక, త్రిగుణాల ప్రకారం ఎవడు విభజించి, తానూ అనుసరించాడో, ఎవడు భూభారాన్ని తగ్గించడానికి దేవకీదేవి గర్భంలో జన్నించాడో; ఎవడికి తన స్వతంత్ర వ్యూహాత్మక శక్తి ఉందో, ఎవరు ఈశ్వరుడో
'అలాంటి శ్రీకృష్ణునికి నమస్కరిస్తాను. ఆ నందకుమారుడు తన మనసులో ఎలా భావిస్తున్నాడో, అలా బతుకుతాము'. అని చెప్పి, దృతరాష్ట్రుడు వీడ్కోలు పలికాడు. అతడిఅభిప్రాయం ఏమిటో అక్రూరునికి అర్థమైంది. "నీ అభిప్రాయం తెలుసుకున్నాను. నీకు ఇష్టం అయిన రీతిలోనే ప్రవర్తించు" అని చెప్పి, అక్రూరుడు తిరిగి మథురనగరానికి వచ్చాడు. అతని సమాచారం బలరామకృష్ణులకు తెలిపాడు.
అటు తర్వాత కంసుని భార్యలైన అస్తి, ప్రాస్తి అనే ఇద్దరూ తమ భర్త మరణించినందుకు ఏడుస్తూ వాళ్ల తండ్రి అయిన జరాసంధునివద్దకు వచ్చి,
జరాసంధుడు మథురాపట్టణము మీద దండెత్తివచ్చి కృష్ణునితో యుద్ధము చేయుట
నిత్య స్తోత్రావళి
నిత్య పారాయణ శ్లోకాలు
స్తోత్రాలు
పంచాంగం
'అలాంటి శ్రీకృష్ణునికి నమస్కరిస్తాను. ఆ నందకుమారుడు తన మనసులో ఎలా భావిస్తున్నాడో, అలా బతుకుతాము'. అని చెప్పి, దృతరాష్ట్రుడు వీడ్కోలు పలికాడు. అతడిఅభిప్రాయం ఏమిటో అక్రూరునికి అర్థమైంది. "నీ అభిప్రాయం తెలుసుకున్నాను. నీకు ఇష్టం అయిన రీతిలోనే ప్రవర్తించు" అని చెప్పి, అక్రూరుడు తిరిగి మథురనగరానికి వచ్చాడు. అతని సమాచారం బలరామకృష్ణులకు తెలిపాడు.
అటు తర్వాత కంసుని భార్యలైన అస్తి, ప్రాస్తి అనే ఇద్దరూ తమ భర్త మరణించినందుకు ఏడుస్తూ వాళ్ల తండ్రి అయిన జరాసంధునివద్దకు వచ్చి,
శ్రీ మహా భాగవతము
శ్రీ మహా భాగవతము ద్వితీయస్కంధము
శ్రీ మహా భాగవతము తృతీయస్కంధము
శ్రీ మహా భాగవతము చతుర్ధస్కంధము
శ్రీ మహా భాగవతము పంచమస్కంధము
శ్రీ మహా భాగవతము షష్టస్కంధము
శ్రీ మహా భాగవతము సప్తమస్కంధము
శ్రీ మహా భాగవతము అష్టమస్కంధము
శ్రీ మహా భాగవతము నవమస్కంధము
శ్రీ మహాభాగవతము దశమస్కంధము - పూర్వభాగము
శ్రీ మహా భాగవతము ద్వితీయస్కంధము
శ్రీ మహా భాగవతము తృతీయస్కంధము
శ్రీ మహా భాగవతము చతుర్ధస్కంధము
శ్రీ మహా భాగవతము పంచమస్కంధము
శ్రీ మహా భాగవతము షష్టస్కంధము
శ్రీ మహా భాగవతము సప్తమస్కంధము
శ్రీ మహా భాగవతము అష్టమస్కంధము
శ్రీ మహా భాగవతము నవమస్కంధము
శ్రీ మహాభాగవతము దశమస్కంధము - పూర్వభాగము
నిత్య స్తోత్రావళి
నిత్య పారాయణ శ్లోకాలు
స్తోత్రాలు
పంచాంగం
No comments:
Post a Comment