హనుమంతుడు తన సేనాపతులను కూడా సంహరించినట్లు విన్న రావణుడు క్రోధోద్రిక్తుడై ఎదురుగా ఉన్న అక్ష కుమారునివైపు తిరిగాడు.
ఆ చూపులోనే తండ్రి మనసు గ్రహించి ధనుస్సు చేబూనిలేచాడు. మంత్రహుతమయిన ఆజ్యాహుతులతో ప్రజ్వలితమయిన అగ్నివలె వెలుగుతూ రధారూఢుడై బయలుదేరాడు. తపశ్శక్తితో సంపాదించిన ఆ స్యందనం బంగారు జాలరులతో రత్నఖచిత పతాకాలతో, మనోవేగంతో ఆకాశమార్గాన పోగలగిన, దానికి ఎనిమిది గుర్రాలు పూన్ని వుంచారు.
రథం బయలుదేరింది.
దాని వెంట చతురంగబలాలూ అనుసరించాయి. అంతవరకూ జరిగిన తమ సేనాసంహారంతో ఉద్రిక్తుడయిన అక్షకుమారుడు సింహ నేత్రాలతో వున్నాడు.
ఆ సమయంలో అటు హనుమంతునీ యిటు అక్షకుమూరునీ తిలకించే సర్వప్రాణికోటీ గజగజలాడింది.
సూర్యుని వేడి తగ్గింది. గాలి స్తంభించింది.
ఆకాశం దద్దరిల్లింది.
సముద్రం కల్లోలమయింది.
ధనుర్విద్యా విదుడయిన అక్షకుమారుడు వాడిగా మొనదేరిన మూడు బాణాలు వదిలాడు. విషభరిత సర్పాలవలె అవి హనుమంతుని శిరస్సున నాటుకున్నాయి,
ఆ బాణకిరణాలతో ఉదయసూర్యు డయాడు హనుమంతుడు.
అక్షకుమారుని వీర పరాక్రమాలకు సంతోషించి, మారుతి కన్నులేర్రజేశాడు. ఆ వేడికి రాక్షససేన భస్మమయేలా ఉంది.
వానరపర్వతంమీద బాణవర్షం కురిపించాడు, రావణనందనుడు.
సింహగర్జన చేశాడు హనుమంతుడు.
ఒక్కసారి కాళ్ళూ చేతులూ ముడిచి దూకాడు.
దూకుతున్న వానిమీదికి శరపరంపర నడిపాడు. ఆ బాణాలమధ్య నుండి గాలివలె తప్పించుకుంటూన్న సమయంలో భుజసంధులలో తగిలిన బాణఘాత తీవ్రతకు గట్టిగా అరచి:
వీడు వయసులో బాలుడైపోయాడు. వీణ్ణి చంపడానికి నాకు మనసు రావడంలేదు. అయితే వీడు అగ్నిలా విజృంభిస్తున్నాడు, వీణ్ణి ఉపేక్షిస్తే నా మీద పగ తీర్చుకుంటాడు, అని ఆలోచించి ఒక్కదూకులో గుర్రాలను తన్ని వదలగా అవి నేలకూలాయి. రథం భగ్నమయింది. అంతతో ఆ యువకుడు గగనవీధికి లేచాడు.
మహాసర్పాన్ని గరుత్మంతుడు కాలిగోళ్ళతో పట్టి ముక్కుతో చీల్చినట్లు అక్షకుమూరుని కాళ్ళు రెండూ బిగబట్టి గిర్రున త్రిప్పి వదిలాడు హనుమంతుడు.
వాని అవయవాలు పట్టు తప్పి రక్తధారలతో ధూళిలో కలిశాయి. ఆ అద్భుతాన్ని తిలకించి సర్వప్రాణికోటీ ఆశ్చర్యచకితం అయింది.
మానవ మారణహోమంతో ఆనందించే యమునివలె హనుమంతుడు సంతోషంగా ద్వారతోరణంచేరి కూర్చున్నాడు.
బ్రహ్మాస్త్రం

No comments:
Post a Comment