Friday, August 14, 2026

Senapathulu - సేనాపతులు

రామాయణం సుందరకాండ 46వ సర్గ - సేనాపతులు

క్షణాల కాలంలో మంత్రిపుత్రులు కడతేరినట్టు విన్న రావణుడు తన సేనాపతులయిన విరూపాక్ష, యూపాక్ష, దుర్ధర, ప్రఘన, భాస కర్ణులను పంపుతూ:

"మీరు సేనాసమేతం వెళ్ళి ఉచితరీతిని ఆ వానరాన్ని శిక్షించండి. ఇంతవరకూ జరిగిన విషయాలు చూస్తుంటే అది సామాన్య వానరం అనిపించడం లేదు. బలిష్ఠమయిన భూతంలా తోస్తున్నది.

ఇంద్రుడు మనమీద ద్వేషంతో తీవ్ర తపస్సుచేసి ఈ బూతాన్ని సృష్టించాడనిపిస్తున్నది. యక్ష, నాగ, గంధర్వ, దానవ, అసురులను 
నం పరాభూతులను చేసి వున్నాం. వారు ప్రతీకారంగా ఈ పనిచేసి వుంటారు. అందుచేత అది సామాన్య వానరం అని భావించకుండా మీ సంగ్రామం సాగించాలి,

దృష్టాహి హరయః పూర్వం 
మయా విపుల విక్రమాః
వాలీ చ సహ సుగ్రీవో
జాంబవాంశ్చ మహాబలః


నీలః సేనాపతి శ్చైవ
యే చాన్యే ద్వివి దాదయః

నైవం తేషాం గతి ర్భీమాః
న తేజో న పరాక్రమః
 

న మ
తి ర్నబలోత్సాహౌ
న రూప పరికల్పనమ్‌

మహ త్సత్య మిధం జ్ఞేయం
కపిరూపం వ్యవస్థితమ్‌


మహాబలపరాక్ర
వంతులయిన వానరవీరులు వాలి సుగ్రీవ జాంబవంతులను ఎరుగుదును. వారి సేనాపతి నీలుడు, మరింకా ద్వివిదుడు వీరందరినీ చూశాను, వారిలో ఎవరూ ఇంత పరాక్రమ, తేజస్సంపన్నులు కారు. వారిలో ఈ ఉత్సాహం, ధీశక్తి ఆకారం, ధీరత్వం ఎరగను. అందుచేత వానరాకృతిలో వచ్చిన మహా భూత మేదో అయి వుండాలి.

ముల్లోకాలలో సురాసుర మానవులను కంపింపజేసిన మీ ముందు ఏ భూతమూ ఆగదు. అయినా యుద్ధంలో జయాపజయ నిశ్చయం ముందుగా చెయ్యలేం కనక అప్ర
త్తంగా ఆత్మరక్షణ చేసుకుంటూ అడుగువెయ్యాలి, అన్నాడు.

ఆ మాటలు విని వారు తీవ్రవేగంతో గజాశ్వ రథ బిల సమేతం అయుధధారులై వచ్చి తోరణం మీద ఉదయసూర్య కాంతితో వెలిగే హనుమంతుని చూశారు.

చూస్తూనే, దుర్ధరుడు వాడిగల ఉక్కుబాణాలు అయిదు వదిలాడు. అవి కలువలవలె వున్నాయి. మారుతి ఆ బాణ ఘాతాలతో ఒక్క గర్జన చేసి ఆకాశవీధికి లేచాడు.

దుర్ధరుడు బాణవర్షం కురిపించాడు.

వార్షుకాబ్రాన్ని వాయువు నిరోధించినట్టు దుర్ధరుని ఎదుర్కొన్నాడు మారుతి. మెరుపుల పిడుగులు పర్వతం మీద పడినట్లు హనుమంతుడు వాని రథం మీదికి దూకాడు.

రథానికి కట్టిన గుర్రాలెనిమిదీ పిప్పి పిప్పి అయాయి. కాడితో ఇరుసు ముక్కలు ముక్కలయింది. దుర్దరుడు ముద్దముద్దగా మట్టిలో పడ్డాడు.

విరూపాక్ష యూపాక్షులు ముందుకు వచ్చి ముద్గరాలతో హనుమంతుని ఉరఃస్థలం మీద కొట్టారు. హనుమంతుడు గరుడవేగంతో నేలకుదిగి సాలవృక్షాన్ని పెకలించి దానితో వారి శిరసులు వ్రక్కలు చేశాడు.

ప్రఘన, భాస కర్ణులు ఖడ్గ శూలాలు విసిరారు.

ఆ దెబ్బలకు రక్తం స్రవించి రోమాలన్నీ ఎరుపెక్కగా బాల సూర్యుని వలె కనిపిస్తూ సర్ప, మృగ, వృక్ష సమూహాలతో నిండిన పర్వత శిఖరాలు పెకలించి వారిని యమపురికి పంపాడు.

సేనాబలం మిగిలి వుండటంతో ఒక గుర్రాన్ని పట్టుకుని దాన్ని విసురుతూ మిగిలిన గురాలనూ, ఏనుగుతో గజబలాన్నీ, భటులతో కాల్బలాన్నీ కడతేర్చాడు.

రథ, గజ, తురగ, పదాతుల, శవాలతో ఆ ప్రాంతం కాలుపెట్టడానికి వీలులేకుండా అయింది.

రాక్షస సంహార కుతూహలంతో వున్న యమునివలె హనుమంతుడు మళ్ళీ విశ్రాంతిగా ద్వారతోరణం అధివసించాడు.

రావణ నందనుడు

No comments:

Post a Comment

Brahmastra - బ్రహ్మాస్త్రం

రామాయణం సుందరకాండ 48, 49 సర్గలు -  బ్రహ్మాస్త్రం హనూమతో వేద న రాక్షసోన్తరం న మారుతి స్తస్య మహాత్మ నోన్తరమ్‌  । పరస్పరం నిర్విషహౌ బభూవతుః సమే...