అధఃశయానుడూ(నేలమీద పడుకునేవాడు). ధర్మాత్ముడూ జితేంద్రియుడూ వినయవంతుడూ మితాహారీ శాంతచిత్తుడూ నిత్య త్రిషవణస్నాయీ నిత్యశుభభాషణుడూ పాపిష్ఠస్నేహదూరుడూ - ఉత్తమోత్తముడు.
జపహోమాది సమయాల్లో మౌనంగా ఉండాలి. ఏ సంభాషణమూ చెయ్యకూడదు. మైథునాలాపాలు (బూతులు) అస్సలు చెయ్యకూడదు. మనోవాక్కాయకర్మలలో సర్వకాలసర్వావస్థలలో మైథునప్రసక్తిని పరిత్యజించడమే బ్రహ్మచర్యమంటేను.
బ్రాహ్మణక్షత్రియులు గృహాస్థాశ్రమంలోకూడా బ్రహ్మచర్యం పాటించవచ్చు. సంస్కారవంతురాలైన సవర్ణస్త్రీని వివాహం చేసుకుని నిషిద్ధ సమయాలలో కలయికను పూర్తిగా పరిత్యజించి, అనుమతించిన దినాలలో రాత్రిపూటమాత్రమే సంగమిస్తూ సంసారం సాగిస్తే అది బ్రహ్మచర్యమే.

దేవ పితృ ఋషి ఋణాలను తీర్చుకునే ప్రయత్నం చెయ్యనివాడికి ముక్తి లభించదు. అతడి జన్మ అజాగళస్తనంలాగా వ్యర్థమే. యజ్ఞయాగాదులతో దేవఋణం, తిలోదకాలతో పితౄణం, బ్రహ్మచర్యంతో ఋషిబుణం తీరుతుంది. అలా తీర్చేందుకే ఆశ్రమధర్మాలను పాటించడం.
క్షీరాహారిగానీ ఫలాహారిగానీ శాకాహారిగానీ హవిష్యాహారిగానీ భిక్షాహారిగానీ చాంద్రాయణ వ్రతధారిగానీ అవుతూ మంత్రజపం చెయ్యాలి. క్షార లవణ ఆమ్ల తాంబూలాదులూ రాత్రిభోజనమూ దుష్టసహవాసమూ మద్య సేవనమూ శ్రౌతస్మార్తవిధులకు సుతరామూ పనికిరావు. అలాగే రాత్రిపూట మంత్రజపం చెయ్యకూడదు. (జపం రాత్రౌ వివర్జయేత్).
ద్యూతక్రీడలతో స్త్రీగోష్ఠులతో నిద్రతో వాదవివాదాలతో వృథాకాలయాపన చెయ్యకూడదు. దేవతా పూజలూ స్తోత్రపఠనలూ ఆగమశాస్త్ర గ్రంథ పరిశీలనలూ - వీటితో కాలాన్ని సద్వినియోగం చేసుకోవాలి.
భూశయనం బ్రహ్మచర్యం మౌనదీక్ష నిత్యమూ త్రిషవణస్నానం శూద్రకర్మవివర్జన నిత్యపూజ నిత్యదానం ఆనందం స్తుతికీర్తనం నైమిత్తికార్చనం దేవతలపట్ల విశ్వాసం గురువులపట్ల విశ్వాసం ఇవి పన్నెండూ జపనిష్ఠుడి ధర్మాలు. సిద్ధిదాయకాలు.
నిత్యమూ సూర్యుడికి అభిముఖంగా సూర్యోపస్థానం చేసి గాయత్రిని జపించాలి. దేవతా ప్రతిమల ముందుగానీ అర్చించిన ఆగ్నిముందుగానీ చెయ్యవచ్చు.

బ్రాహ్మణుడు స్నాన పూజా జప ధ్యాన హోమతర్పణ తత్పరుడై నిష్కామంగా సత్కర్మలనన్నింటినీ ఆచరించి బ్రహ్మార్పణం చేస్తూ నియమం తప్పకుండా ఆయా పురశ్చరణలు చేస్తూ కాలం గడపాలి. ఆత్మకు ప్రసన్నత సిద్ధిన్తుంది. జపహోమాలపట్ల ఏకాగ్రత కుదురుతుంది.
తపస్సుకీ ఆధ్యయనానికీ అంకితమైనవారికి భూతదయ సహజంగా ఉదయిస్తుంది. ఈ తపస్సే స్వర్గసంపాదకం. ఈ తపస్సే మహత్త్వసాధకం. తపస్వికి సాధ్యం కానిది ఏదీ లేదు. ఏయే దేవతలు ఏయే ఫలాలను ఇస్తారని ఋషులు చెప్పారో ఆదేవతలను ఆ రీతిలో ఉపాసిస్తే ఆ కోరికలు నెరవేరతాయి. పురశ్చరణమనేది సర్వకర్మలకూ సిద్ధికారకం. కనక ఆరంభంలో చెయ్యాలి.
No comments:
Post a Comment