భయంకర రూపాలు కల ఆ క్రూర రాక్షస స్త్రీల పరుష వాక్కులు వినలేక జానకీదేవి దుఃఖ సంతప్తహృదయంతో:
మీ రందరూ కలిసి నన్ను తినవచ్చు నేను మాత్రం మీ ప్రభువును వరించను అని మరింత బయంతో అశోకవృక్షం కొమ్మను గట్టిగా పట్టుకుని బొటబొట కన్నీరు విడుస్తున్నది
పెనుగాలికి ఊగిసలాడే లేత అరటి మొవ్వులా వణుకుతూ ఉన్న సీతాదేవి కేశపాశం ఆడు పాములా విలవిలలాడుతున్నది
రామా! లక్ష్మణా!
అత్తయ్యా కౌసల్యాదేవీ! సుమిత్రాదేవీ!
ఆని విచారిస్తూ, ఎంతటి వారికయినా కాలం చెల్లితే కాని మృత్యువు ప్రాప్తించదు. కాకుంటే నేనింతకాలం రామ విరహంతో యీ దుష్టరాక్షసీజన మధ్యంలో జీవించగలిగేదానినా!
ఇంతకూ కారణం నేను చేసిన పుణ్యకర్మలు బహుకొద్దివయి ఉండాలి. అవి కూడా పూర్తి కానున్నాయి కాబోలు, కాగానే, గాలి దెబ్బకు సముద్రంలో మునిగే పడవలా అవుతుంది నా జీవితం. ఇప్పటికే యీ జీవితం వరద నీటి దెబ్బతిన్న నది ఒడ్డులా ఉంది.
కృతజ్ఞతా స్వరూపుడు, ప్రియవాదీ, సింహాపరాక్రమ సంపన్నుడు, సర్వజనమనోహరుడు అయిన నా భర్తను ధర్మాత్ములే దర్శించగలరు.
రామునికి దూరమయిన నా బ్రతుకు విషస్పర్శ తగిలిన దేహంలా ఉంది. ఏనాడు చేసిన పాపకర్మమో యిలా బాధిస్తున్నది. ఇక యీ జీవితం వదిలెయ్యడం మంచిది. రాముడు వస్తాడనే ఆశ కనిపించడం లేదు అని విచారిస్తూ
ఇష్టం వచ్చినప్పుడు జీవితం విడువలేని ఈ మానవదేహంకంటె నీచమయినది లేదు. ఎంత పరాధీనం ఈ దైన్యజీవితం, అని పరిపరివిధాల శోకిస్తూ, ధూళిలో దొర్లుతూ:
నా భర్త ఆశ్రమం దగ్గర లేనప్పుడు ఈ రాక్షసుడు కామరూపంతో నన్ను వంచించి తీసుకురాగలిగాడు. ఇప్పుడీ రాక్షస స్త్రీల మధ్యలో ఈ బాధలు పడుతూ బ్రతకడం కష్టం.
రాముడు వినా నాకేమీ అవసరం లేదు. ఇంత దుఃఖంలో కూడా నా గుండె నిలిచి ఉన్నదంటే దీన్ని రాతితో నిర్మించి ఉంటాడు బ్రహ్మ. బహుశః నాకు వార్ధక్యం, మరణంలేవేమో!
ఏమయినా నా ఎడవుకాలి గోటితో కూడా ఈ రావణుని శరీరాన్ని తాకను. నా తిరస్కారంకూడా వీడికి తెలియడంలేదు. నన్ను చీల్చి ముక్కలు చేసీ నిప్పులో పడవేసినా నేను రావణునివైపు కన్నెత్తి చూడను.
సర్వజ్ఞుడు, సత్ప్రవర్తనపరుడు, దయహృదయుడు అయిన రాముడు ఎందుకింకా నా గురించి ఆలోచించడంలేదో తెలియదు.
జనస్థానంలో పదునాలుగువేలమంది రాక్షసులను ఒంటరిగా నేల కూల్చినవాడు, విరాధునివంటి మహాబలిష్ఠుడయిన రాక్షసుని హతమార్చినవాడు, రావణుని సంహరించగల శక్తి సంపన్నుడు, తనే బాణ ప్రయోగంతో ఈ లంకానగరాన్ని స్వాధీనం చేసుకోగల సామర్ధ్యం కలవాడు ఎందుకింత
అలస్యం చేస్తున్నాడొ!
అయితే నేనిక్కడ ఉన్నట్లు ఆయన ఎరగడేమో! ఎరిగి ఉంటే యిలా ఉపేక్షించేవాడేనా?
రామునికి వార్త చెప్పగల జటాయును కూడా నా దురదృష్టంకొద్దీ ఈ రావణుడు సంహరించేశాడే!
ఏం చెయ్యను! నన్ను రాక్షస రావణుడు అపహరించినట్లు తెలిస్తే రాముడు తన శరపరంపరతో సర్వరాక్షస సంహారం చేసి తీరుతాడు. సముద్రాన్ని యింకించి, లంకను నాశనం చేసి, ఈ రావణుని పేరు ప్రతిష్ఠలన్నీ మంట గలపగలడు.
ఈనాడు నేను శోకిస్తున్నట్లే, ఈ రాక్షస స్త్రీలందరూ గోలు గోలున విలపిస్తారు.
రాముని కంటబడేవరకే వీడు ఊపిరితో జీవించేదీ. ఆయన కంటబడిన ఉత్తరక్షణంలో యీ లంకానగరంనిండా చితాగ్ని దూమం; గ్రద్దల విహారం.
పూర్తిగా శ్మశానం అయితీరుతుంది.
నిస్సందేహంగా వీరందరూ నశిస్తారు. నా కోరిక నెరవేరి తీరుతుంది. రావణసంహారంతో యీ లంకా నగరం ధైర్యహీన అయిన స్త్రీవలె పిచ్చెక్కి తిరుగుతుంది.
తప్పదు, ఈ రాక్షస నగరంలో యింటింటా ఆర్తనాదాలు తప్పవు. రామబాణాగ్నిలో యిదంతా తగులబడితీరుతుంది. రాక్షస యోధాగ్రేసరులందరూ నేల పాలవుతారు.
నేనిక్కడ ఉన్నట్లు తెలిసిన క్షణంలో రాముడు యీపనిచేసి తీరతాడు.
అయితే, రావణుడు నాకిచ్చిన గడువులో యింక రెండు మాసాలే మిగిలాయి. ఈలోగా అ మృత్యువు వీడికే రాకూడదా. మాంసభక్షకులయిన యీ రాక్షసులకు ధర్మపరిజ్ఞానంలేదు. గడువు దాటిందంటే వీడు నన్ను ఉదయం ఫలహారానికి వండించితీరతాడు.
అంతకంటే వీరెవరయినా కనికరించి యింతవిషం యిస్తే దానితో యమపురి చేరేదాన్ని.
ఇంతవరకూ రామలక్ష్మణులకు నేను జీవించి ఉన్నానోలేదో కూడా తెలీదు. నన్ను వీడిన దుఃఖంలో ఆయనే ప్రాణాలు విడిచి ఉంటాడేమో.
అసలు నాకీ దుర్దశ ఎందుకు ప్రాప్తించింది. మహాత్ముడు, సర్వశాత్రపారంగతుడు, కుశలుడు, సదాచారపరుడు అయిన రాముడు లేని జీవితం ఎందుకు! నా వియోగబాధతో ఆయన అస్త్రసన్యాసంచేసి ఆశ్రమవాసుడయ్యాడా!
కాక - ఈ రాక్షసుడు కపటోపాయంతో వారిని సంహరించి ఉంటాడా. ఏమయినా యింతబాధలోనూ నాకు చావు వచ్చిపడదేం.
మనోనిగ్రహసంపన్నులు, రాగద్వేషాతీతులు, పాపరహితులు అయిన మహర్షులు ధన్యజీవులు.
ఆత్మవిదుడు, మనోహరుడు అయిన రాముని విడిచి ఈ క్రూర రావణుని చేతబడిన నేను జీవించి ఉండడంకంటె ప్రాణాలు విడవడం మేలు.
అంటూన్న సీతమాటలు వింటున్న రాక్షసస్త్రీలు కొందరు భయంతో ఆ విషయం నివేదించడానికి రావణుని దగ్గరకు పరుగుపెట్టారు.
త్రిజట స్వప్నం

No comments:
Post a Comment