నక్షత్రం - శతభిష
అధిపతి - రాహువు
గణము - రాక్షస
జాతి - స్త్రీ
వృక్షం - అరటి
జంతువు - గుర్రము
నాడి - ఆది
పక్షి - కుకుటము
అధిదేవత - వరుణుడు
రాశి - కుంభం
నామ నక్షత్రం - గో, /సా,/ సీ, /సూ
శతభిషా నక్షత్ర జాతకుని గుణగణాలు:
నక్షత్రములలో శతభిషా నక్షత్రం 24వ నక్షత్రము. ఈ నక్షత్ర జాతకులకి దోషం లేదు కనుక శాంతి అక్కర్లేదు. ఇది రాహుగ్రహ నక్షత్రం, అధిదేవత వరుణ దేవుడు, రాక్షసగణము, జంతువు గుర్రం, రాశ్యాధిపతి శని.
ఈ నక్షత్రంలో జన్మించిన వారికి అన్ని మార్గాలలో స్నేహితులు ఉంటారు కాని వీళ్ళ వలన వారు ఉపయోగాలు ఆశించరు. సహోదరీ వర్గంతో, న్యాయపరమైన చిక్కులు ఎదురౌతాయి.
ఇంట్లో అనాదరణ, వ్యతిరేక వాతావరణం ఎదురౌతుంది. విద్య కొంతకాలం మందకొడిగా సాగినా క్రమంగా ఎగుమతి వ్యాపారం కలసి వస్తుంది. రవాణా వ్యాపారం కొంతకాలం కలసి వస్తుంది. సకాలంలో వివాహం జరుగుతుంది. మధ్యవర్తిగా, కమిషన్ ఏజెంటుగా, వ్యాపార వేత్తలుగా రాణిస్తారు.
పురాతన ఆస్థుల వలన లాభాలు, చిక్కులు ఎదురౌతాయి. వీలునామా వలన లాభపడతారు. స్థిరమైన ఉద్యోగం, సంపాదన లేక కొంతకాలం ఇబ్బందులు ఎదురౌతాయి. శని మహర్ధశలో స్థిరత్వం సాధిస్తారు. రాజకీయ వ్యూహం ఫలిస్తుంది.
ఉద్యోగంలో ఇబ్బందులు ఉన్నా వాటిని అధిగమిస్తారు. ఎవరికో ఒకరికి ఎప్పుడూ ఆర్థిక సహాయం చెయవలసి ఉంటుంది. సంతానం మంచి స్థితి సాధిస్తారు. వారి కొరకు జీవితంలో అనేక సౌఖ్యాలను త్యాగం చేస్తారు.
కోరికలు, అవసరాలు అనంతంగా ఒకదాని వెంట ఒకటి పుట్టుకు వస్తూనే ఉంటాయి అన్నది మీ విషయంలో సత్యం. ఆత్మీయులతో అరమరికలు లేకుండా మెలగడం వలన మేలు జరుగుతుంది. ఆధ్యాత్మిక చింతన, నైతిక ధర్మం సదా వీరిని కాపాడుతుంది. జీవితం సాధారణంగా చిక్కులు లేకుండా సాగుతుంది. జాతక చక్రంలోని గ్రహస్థితుల వలన మార్పులు సంభవిస్తాయి.
"సత్యమేవ జయతే" అనే ఫిలాసఫీని శతభిషా నక్షత్ర జాతకులు విశ్వసిస్తారు. సత్యం కొరకు, జీవితాన్ని సైతం పణంగా పెడతారు. జీవితంలో కొన్ని స్థిరమైన సూత్రాలుంటాయి. వీరు స్వీయ ఆసక్తితో పనులు చేయరు. వీరి హృదయం ఎంతో ఉదారంగా ఉంటుంది. ధైర్యసాహసాలుంటాయి.
ఉద్దేశ్యాలు చాలా బలంగా ఉంటాయి మరియు ఏదైనా చేయాలని నిర్ణయించుకున్నట్లయితే, దానిని పూర్తి చేసే వరకు వీరు విడిచిపెట్టరు. తమ బాధ్యతలు తెలుసుకొని వాటిని సరిగ్గా పూర్తి చేయడానికి ప్రయత్నిస్తారు.
ఎక్కువగా శారీరక శ్రమ చేయడాన్ని విశ్వసించరు, దానికి బదులుగా మెదడును ఉపయోగిస్తారు. స్వంతంగా వ్యవహరించే వ్యక్తిత్వం ఉండటం వల్ల, భాగస్వామికంటే స్వేచ్ఛగా విడిగా పనిచేయడానికి ఇష్టపడతారు. వీరి ప్రవర్తన కాస్తంత సోమరిగా ఉంటుంది, అలానే కాస్తంత వినోదాత్మకంగా ఉంటారు.
వీరు జీవితాన్ని పూర్తి ఆనందంగా గడపడానికి ఇష్టపడతారు. వీరు యంత్రంలా పనిచేయరు మరియు జీవితాన్ని స్వేచ్ఛగా గడపడానికి ఇష్టపడతారు. వీరు ఏ సమస్యకు కూడా భయపడరు, దానికి బదులుగా ప్రతి పరిస్థితిని కూడా ధైర్యంగా ఎదుర్కొంటారు.
నమ్మకం మరియు శక్తి, మీకు బలాన్ని ఇస్తాయి, ఎలాంటి సంక్లిష్టమైన పరిస్థితిలోనైనా విజయం సాధించడానికి దోహదపడుతుంది. ఇది వీరి వ్యక్తిత్వంలో ఒక ప్రత్యేక లక్షణంగా ఉంటుంది, ఎవరైనా వీరిని వ్యతిరేకించడానికి ప్రయత్నిస్తే, వారిని ఓడిస్తారు.
సులభంగా కోపం రాకపోయినప్పటికీ, ఒకవేళ వీరికి కోపం వచ్చినట్లయితే, దానిని నియంత్రించుకోవడం చాలా కష్టం. వీరు సుమనస్కులు మరియు తెలివైనవారు, క్షణాల్లో కోపం మాయమవుతుంది. ఏదైనా చేయాలని ఒక్కసారి నిర్ణయించుకున్న తరువాత, వీరు ఇక వెనక్కి తిరిగి చూడరు.
వీరికి నైపుణ్యం ఉండటం వల్ల జీవితంలోని అన్ని రంగాల్లో కూడా వీరు విజయం సాధిస్తారు. ఎవరితోనైనా మాట్లాడేటప్పుడు, ఎదుటి వ్యక్తిని వీరు ఎగతాళి పట్టిస్తారు. అయితే, వీరు ఆడంబరాలను ప్రదర్శించడానికి ఇష్టపడరు, మరియు వీరు దేనినైనా ఒక్కసారి చదివినట్లయితే, దానిని చాలాకాలం గుర్తుంచుకుంటారు.
వీరిలో సాహిత్యపరమైన నైపుణ్యం ఉంటుంది, దీనివల్ల వీరు అనతికాలంలోనే పేరుప్రఖ్యాతలు సంపాదించుకుంటారు. మంచి స్వభావం వల్ల, వీరు చాలా పేరు ప్రఖ్యాతులు సంపాదిస్తారు.
శతభిష నక్షత్రం మొదటి పాదము
ఈ జాతకుల మీద గురు రాహు గ్రహ ప్రభావం అధికంగా ఉంటుంది. ఇది రాక్షసగణ ప్రధాన నక్షత్రం. ఈ కారణం వల్ల వీరు పట్టుదల గల వ్యక్తులై ఉంటారు.
ఈ జాతకులకు ఆధ్యాత్మిక విశ్వాసం, ధార్మిక గుణం ఉంటుంది. రచయితలుగా రాణించగలరు. ఉపాధ్యాయ వృత్తి అనుకూలిస్తుంది. పసుపు వర్ణ వస్తు సంబంధిత ఉద్యోగ, వృత్తి వ్యాపారాలు వీరికి అనుకూలం.
ఈ జాతకులకు 16 సంవత్సరాల కాలం రాహు దశ ఉంటుంది. కనుక తొలి నుంచే విద్యలో ఆటంకాలు ఎదురవుతాయి. రాహు దశ అనుకూలిస్తే అడ్డంకులు తక్కువగా ఉంటాయి. తల్లిదండ్రుల పెంపక దశలో రాహుదశ సమస్యలు కనిపించకుండా పోతాయి.
తరువాత వచ్చే 16 సంవత్సరాల గురు దశ కాలంలో ఉన్నత చదువులలో అభివృద్ధి కనిపిస్తుంది. ఇక జీవితంలో త్వరగా స్థిరపడతారు. వివాహం కూడా సకాలంలో అవుతుంది.
వీరు సంపాదించింది జాగ్రత్త చేసుకోవాల్సిందే. లేదంటే 32 సంవత్సరాల తరువాత వచ్చే 19 సంవత్సరాల శని దశలో సంపాదన కంటే ఖర్చులు అధికమవుతాయి. దీంతో ఆర్థిక ఇబ్బందులు ఎదురవుతాయి.
51 సంవత్సరాల తరువాత వచ్చే 17 సంవత్సరాల బుధ దశ కారణంగా జీవితంలో కొంత ఉపశమనం కలుగుతుంది. 68 సంవత్సరాల కాలంలో వచ్చే ఏడు సంవత్సరాల కేతు దశ కాలంలో కొన్ని సమస్యలు ఎదుర్కొంటారు.
కేతు దశ అనుకూలిస్తేనే సమస్యలు తగ్గుతాయి. తీర్ధయాత్రకు, విదేశీ పర్యటనకు అవకాశం ఉంటుంది. 75 సంవత్సరాల తరువాత సమస్యలు తగ్గుముఖం పడతాయి. ఇక వృద్ధాప్య దశ సుఖంగా గడిచిపోతుంది.
శతభిష నక్షత్రం రెండవ పాదము
శతభిషా నక్షత్ర రెండవ పాద జాతకుల మీద రాహు శని గ్రహ ప్రభావం ఉంటుంది. ఇది రాక్షసగణ ప్రధాన నక్షత్రం. కనుక వీరు పట్టుదలగల వ్యక్తులై ఉంటారు.
శ్రమించి పట్టుదలతో కార్యాలను నెరవేర్చగలరు. ఈ జాతకులకు పరిశ్రమలు, కర్మాగారాలు సంబంధిత ఉద్యోగాలు, వ్యాపారాలు అనుకూలిస్తాయి.
ఈ జాతకులకు 12 సంవత్సరాలు రాహు దశ ఉంటుంది. కనుక తొలి నుంచే విద్యలో ఆటంకాలు ఏర్పడతాయి. రాహు దశ అనుకూలిస్తే అడ్డంకులు తగ్గుతాయి. తల్లిదండ్రుల పెంపక దశలో రాహు దశ సమస్యలు కనిపించకుండానే ముగిసిపోతాయి.
తరువాత వచ్చే 16 సంవత్సరాల గురు దశ కాలంలో మాధ్యమిక చదువులలో అభివృద్ధి కనిపిస్తుంది. జీవితంలో త్వరగా స్థిరపడతారు. వివాహం సకాలంలో జరుగుతుంది. ఇక వీరు సంపాదించింది జాగ్రత్త చేసుకోవాలి.
28 సంవత్సరాలలో వచ్చే 19 సంవత్సరాల శని దశలో సంపాదన కంటే ఖర్చులు అధికమవుతాయి. దీంతో ఆర్థిక కష్టాలు వెంటాడుతాయి.
47 సంవత్సరాల తరువాత వచ్చే 17 సంవత్సరాల బుధ దశ కారణంగా కొంత ఉపశమనం కలుగుతుంది. 64 సంవత్సరాల కాలంలో వచ్చే ఏడు సంవత్సరాల కేతు దశ కాలంలో కొన్ని సమస్యలు ఎదుర్కొంటారు.
కేతు దశ అనుకూలంగా ఉంటే సమస్యలు తగ్గుతాయి. తీర్ధ యాత్రలకు అవకాశం ఉంటుంది. 71 సంవత్సరాల తరువాత సమస్యలు తగ్గుతాయి. వృద్ధాప్య దశ సుఖంగా గడిచిపోతుంది.
శతభిష నక్షత్రం మూడవ పాదము
శతభిషా నక్షత్ర మూడవ పాద జాతకులు పట్టుదల గల వ్యక్తులై ఉంటారు. పట్టుదలతో, శ్రమించి కార్యాన్ని పూర్తి చేయగలరు. వీరికి పరిశ్రమలు, కర్మాగారాలు సంబంధిత ఉద్యోగాలు, వ్యాపారాలు అనుకూలిస్తాయి. వీరికి స్థిరమైన అభిప్రాయాలు ఉంటాయి.
ఈ జాతకులకు ఎనిమిది సంవత్సరాల కాలం రాహుదశ ఉంటుంది. కనుక ఆరంభ విద్యలో ఆటంకాలు ఎదురవుతాయి. రాహుదశ అను కూలిస్తే అడ్డంకులు తక్కువగా ఉంటాయి. తల్లిదండ్రుల పెంపక దశలో రాహు దశ సమస్యలు ప్రభావం చూపే అవకాశం లేదు.
తరువాత వచ్చే 16 సంవత్సరాల గురుదశ కాలంలో చదువులలో అభివృద్ధి కనిపిస్తుంది. జీవితంలో త్వరగానే స్థిరపడతారు. వివాహం సకాలంలో జరుగవచ్చు.
24 సంవత్సరాలలో వచ్చే 19 సంవత్సరాల శని దశ వస్తుంది. దీంతో సంపాదన కంటే ఖర్చులే అధికంగా ఉంటాయి. 43 సంవత్సరాల తరువాత వచ్చే 17 సంవత్సరాల బుధ దశ కారణంగా కొంత ఉపశమనం కలుగుతుంది.
60 సంవత్సరాల కాలంలో వచ్చే 7 సంవత్సరాల కేతు దశ కాలంలో కొన్ని సమస్యలు ఎదుర్కొంటారు. కేతుదశ అనుకూలంగా ఉంటే సమ స్యలు తగ్గుతాయి. తీర్థ యాత్రకు, విదేశీ పర్యటనకు అవకాశం ఉంటుంది.
67 సంవత్సరాల తరువాత సమస్యలు తగ్గుతాయి. తరువాత 20 సంవత్సరాల శుక్ర దశ కాలంలో తిరిగి సుఖం మొదలవుతుంది. వృద్ధాప్య దశ సుఖంగానే గడిచిపోతుంది.
శతభిష నక్షత్రం నాలుగవ పాదము
శతభిషా నక్షత్ర నాల్గవ పాద జాతకులు పట్టుదల గల వ్యక్తులై ఉంటారు. ఇక వీరికి ఆధ్యాత్మిక విశ్వాసం, ధార్మిక గుణం ఉంటుంది. వీరు రచయితలుగానూ రాణించే నేర్పు ఉంటుంది.
ఉపాధ్యాయ వృత్తి వీరికి అనుకులిస్తుంది. పసుపు వర్ణ వస్తు సంబంధిత ఉద్యోగ, వృత్తి వ్యాపారాలు వీరికి అనుకూలిస్తాయి.
ఈ జాతకులకు నాలుగు సంవత్సరాల కాలం మాత్రమే రాహు దశ ఉంటుంది. కనుక తొలి నుంచే విద్యభ్యాసం నిరాటంకంగా కొనసాగుతుంది. నాలుగు సంవత్సరాల తరువాత వచ్చే 16 సంవత్సరాల గురు దశ కారణంగా చదువు ఆటంకాలు లేకుండా సాగుతుంది. అయితే ఉన్నత విద్యాభ్యాసంలో అడ్డంకులు తప్పకపోవచ్చు. పట్టుదలతో విజయం సాధించాల్సి ఉంటుంది.
20 సంవత్సరాల తరువాత వచ్చే 19 సంవత్సరాల శని దశలో సంపాదన కంటే ఖర్చులు అధికంగా ఉంటాయి. జీవితంలో నిదానంగా స్థిరపడతారు. వివాహంలో జాప్యం కలుగుతుంది.
39 సంవత్సరాల తరువాత వచ్చే 17 సంవత్సరాల బుధ దశ కారణంగా కొంత ఉపశమనం కలుగుతుంది. 56 సంవత్సరాల కాలంలో వచ్చే 7 సంవత్సరాల కేతుదశ కాలంలో కొన్ని సమస్యలు ఎదుర్కొంటారు. కేతు దశ అనుకూలంగా ఉంటే సమస్యలు తగ్గుతాయి.
తీర్ధయాత్రకు, విదేశీ పర్యటనకు అవకాశం ఉంటుంది. 63 సంవత్సరాల తరువాత సమస్యలు తగ్గుతాయి. తరువాత వచ్చే 20 సంవత్సరాల శుక్రదశ కాలంలో తిరిగి సుఖం మొదలవుతుంది. వృద్ధాప్య దశ సుఖంగా గడిచిపోతుంది.
శతభిషా నక్షత్ర జాతకులు పెంచవలసిన చెట్టు:
శతభిషా నక్షత్రం వారు కడిమి చెట్టు లేదా అరటి చెట్టును పెంచడం మరియు పూజించడం చాలా మంచిది మరియు శుభ ఫలితాలు కలుగుతాయని నమ్ముతారు. చక్కటి ఉద్యోగం కొరకు, జీవితంలో చక్కగా స్థిరపడడానికి ఉపయోగపడుతుంది.
శతభిషా నక్షత్ర జాతకుల తారా ఫలాలు :
తార నామం - తారలు - ఫలం
జన్మ తార - ఆర్ద్ర, స్వాతి, శతభిష - శరీరశ్రమ
సంపత్తార - పునర్వసు, విశాఖ, పూర్వాభాద్ర - ధన లాభం
విపత్తార - పుష్యమి, అనూరాధ, ఉత్తరాభాద్ర - కార్యహాని
సంపత్తార - ఆశ్లేష, జ్యేష్ట, రేవతి - క్షేమం
ప్రత్యక్ తార - అశ్విని, మఖ, మూల - ప్రయత్న భంగం
సాధన తార - భరణి, పూర్వ ఫల్గుణి, పూర్వాషాఢ - కార్య సిద్ధి, శుభం
నైత్య తార - కృత్తిక, ఉత్తర ఫల్గుణి, ఉత్తరాషాఢ - బంధనం
మిత్ర తార - రోహిణి, హస్త, శ్రవణం - సుఖం
అతిమిత్ర తార - మృగశిర, చిత్త, ధనిష్ట - సుఖం, లాభం
అంశ గుణాలు :
1 ఉత్పన్నాంశ : శతభిష నక్షత్ర ప్రధమ పాదం గురువుది. ఈ జాతకులు గోవులను పూజించువారు. బ్రాహ్మణులపట్ల గౌరవం కలవారు.
2 పాపాంశ : శతభిష నక్షత్ర ద్వితీయ పాదం శనిది. ఈ జాతకులు సత్యం మాట్లాడువారు. స్థిరమైన బుద్ధి కలవారు, అభిమానవంతులు, స్నేహములను కలిగి ఉంటారు.
3 భయాంశ : శతభిష నక్షత్ర తృతీయ పాదం శనిది. ఈ జాతకులు పాండిత్యం కలవారు.
4 సౌమ్యాంశ : శతభిష నక్షత్ర చతుర్ధ పాదం గురువుది. ఈ జాతకులు స్నేహశీలురు, పండితులు, అభిమానవంతులు, యజ్ఞ కార్యాలు చేయువారుగా ఉంటారు.
నక్షత్ర శాంతి: ఎర్రని పువ్వులు దేవాలయంలో దానంగా ఇవ్వాలి.
నక్షత్ర మంత్రం:
।। ఓం ।।
క్షత్రస్య రాజా వరు'ణో ధిరాజః ।
నక్షత్రాణాగమ్ శతభి'షగ్వసి'ష్ఠః ।
తౌ దేవేభ్యః' కృణుతో దీర్ఘమాయుః' ।
శతగ్మ్ సహస్రా' భేషజాని' ధత్తః ।
యన్నోరాజా వరు'ణ ఉప'యాతు ।
తన్నో విశ్వే' అభి సంయంతు దేవాః ।
తన్నో నక్షత్రగ్మ్ శతభి'షగ్జుషాణమ్ ।
దీర్ఘమాయుః ప్రతి’రద్భేషజాని' ॥
నక్షత్ర గాయత్రి
దర్శించవలసిన ఆలయములు
మొదటి పాదం – కోటిపల్లిలో వేంచేసి ఉన్న శ్రీ రాజరాజేశ్వరీ సమేత శ్రీ సోమేశ్వర స్వామి.
రెండవ పాదం – కోటిపల్లిలో వేంచేసి ఉన్న శ్రీ పార్వతీ సమేత శ్రీ కోటేశ్వర స్వామి
మూడవ పాదం – తొట్టరమూడిలో వేంచేసి ఉన్న శ్రీ భ్రమరాంబా సమేత శ్రీమూల్లేశ్వర స్వామి
నాలుగవ పాదం – పాతకోటలో వేంచేసి ఉన్న శ్రీ లోపాముద్రా సమేత శ్రీ అగస్తేశ్వర స్వామి
1 ఉత్పన్నాంశ : శతభిష నక్షత్ర ప్రధమ పాదం గురువుది. ఈ జాతకులు గోవులను పూజించువారు. బ్రాహ్మణులపట్ల గౌరవం కలవారు.
2 పాపాంశ : శతభిష నక్షత్ర ద్వితీయ పాదం శనిది. ఈ జాతకులు సత్యం మాట్లాడువారు. స్థిరమైన బుద్ధి కలవారు, అభిమానవంతులు, స్నేహములను కలిగి ఉంటారు.
3 భయాంశ : శతభిష నక్షత్ర తృతీయ పాదం శనిది. ఈ జాతకులు పాండిత్యం కలవారు.
4 సౌమ్యాంశ : శతభిష నక్షత్ర చతుర్ధ పాదం గురువుది. ఈ జాతకులు స్నేహశీలురు, పండితులు, అభిమానవంతులు, యజ్ఞ కార్యాలు చేయువారుగా ఉంటారు.
నక్షత్ర శాంతి: ఎర్రని పువ్వులు దేవాలయంలో దానంగా ఇవ్వాలి.
నక్షత్ర మంత్రం:
।। ఓం ।।
క్షత్రస్య రాజా వరు'ణో ధిరాజః ।
నక్షత్రాణాగమ్ శతభి'షగ్వసి'ష్ఠః ।
తౌ దేవేభ్యః' కృణుతో దీర్ఘమాయుః' ।
శతగ్మ్ సహస్రా' భేషజాని' ధత్తః ।
యన్నోరాజా వరు'ణ ఉప'యాతు ।
తన్నో విశ్వే' అభి సంయంతు దేవాః ।
తన్నో నక్షత్రగ్మ్ శతభి'షగ్జుషాణమ్ ।
దీర్ఘమాయుః ప్రతి’రద్భేషజాని' ॥
నక్షత్ర గాయత్రి
ఓం భేషజాయ విద్మహే
వరుణదేహాయ ధీమహి
తన్నో శతభిషా ప్రచోదయాత్
దర్శించవలసిన ఆలయములు
మొదటి పాదం – కోటిపల్లిలో వేంచేసి ఉన్న శ్రీ రాజరాజేశ్వరీ సమేత శ్రీ సోమేశ్వర స్వామి.
రెండవ పాదం – కోటిపల్లిలో వేంచేసి ఉన్న శ్రీ పార్వతీ సమేత శ్రీ కోటేశ్వర స్వామి
మూడవ పాదం – తొట్టరమూడిలో వేంచేసి ఉన్న శ్రీ భ్రమరాంబా సమేత శ్రీమూల్లేశ్వర స్వామి
నాలుగవ పాదం – పాతకోటలో వేంచేసి ఉన్న శ్రీ లోపాముద్రా సమేత శ్రీ అగస్తేశ్వర స్వామి
No comments:
Post a Comment