వ్యక్తిగత సంవత్సర సంఖ్య - 7వ సంఖ్య
ఈ 7వ సంఖ్యకు కేతువు అధిపతి. ఈ సంఖ్య కేతు ప్రభావంలో ఉంటుంది.
ఈ సంవత్సరంలో అధ్యాత్మిక చింతన ఎక్కువగా ఉంటాయి. ధ్యానం, దైవచింతన పైన ఎక్కువగా దృష్టి పెడతారు. గురువులను, సద్గురువులను కలుసుకొంటారు.
తీర్థయాత్రలు చేస్తారు. కోర్టు వ్యవహారాలలో, కోర్టు లిటిగేషన్లలో విజయం కలుగుతుంది. భౌతిక అభివృద్ధిపై ఎక్కువగా దృష్టిపెట్టరు. ప్రాపంచిక విషయాలపట్ల అంటే ఆస్తులు, వ్యవహారాల విషయాలలో స్నేహితులు, పెద్దలు వారి సంస్ధలు, సహాకారం తీసుకొని పాటిస్తే మంచిది.
వ్యాపార విషయంలో జాగ్రత్త పాటించాలి. విదేశీ ప్రయాణ మోజు తీరుగలదు. విద్యార్థులకు విదేశాలలో చదవాలనే కోరిక ఫలించవచ్చు. ప్రేమ వ్యవహారాలలో తలదూర్చకూడదు.
ఆరోగ్యపరంగా జాగ్రత్తలు తీసుకుంటే మంచిది. ఓర్పు, ఆశాదృక్పథం, నమ్మకం కలిగి ఉంటే మంచిది. ఇటువంటి ఆధ్యాత్మిక చింతన మరల 8 సంవత్సరాల తరువాత మాత్రమే వస్తుంది.
జ్యోతిష్యం, న్యూమరాలజీ, తంత్రశాస్త్రాలు, మ్యాజిక్, హిప్నాటిజం లాంటి వాటిమీద మక్కువ గలవారికి ఈ సంవత్సరం అనుకూలం. నీటి గండాలు ఉంటాయి. కనుక జాగ్రత్త వహించాలి.
Subscribe to:
Post Comments (Atom)
vyakthigatha samvatsara sankhya - 7va sankhya - వ్యక్తిగత సంవత్సర సంఖ్య - 7వ సంఖ్య
వ్యక్తిగత సంవత్సర సంఖ్య - 7వ సంఖ్య ఈ 7వ సంఖ్యకు కేతువు అధిపతి. ఈ సంఖ్య కేతు ప్రభావంలో ఉంటుంది. ఈ సంవత్సరంలో అధ్యాత్మిక చింతన ఎక్కువగా ఉంటా...
-
సూర్య ద్వాదశ నామాలు ధ్యేయః సదా సవితృమండలమధ్యవర్తీ నారాయణః సరసిజాసన సన్నివిష్టః । కేయూరవాన్ మకరకుండలవాన్ కిరీటీ హారీ హిరణ్మయవపుః ధృతశంఖచక్రః ...
-
నిత్య పారాయణ శ్లోకాలు స్తోత్రాలు నవ గ్రహ స్తోత్రం సుబ్రహ్మణ్యాష్టకం ఆదిత్యహృదయం కనకధారా స్త్రొత్రమ్ దుర్గాసప్తశ్లోకీ దేవి మహత్యం ద్వాత్రిస న...
-
శ్రీ దేవీ భాగవతము నవమ స్కంధములోని శ్రీ సరస్వతీ కవచం ఓం శ్రీం హ్రీం సరస్వ త్త్యై స్వాహా -శిరో మే పాతు సర్వతః । ఓం శ్రీం వాగ్దేవతాయై స్వాహా -ఫ...
No comments:
Post a Comment