Friday, November 6, 2026

tapi mestrilaku vaastu suchanalu - తాపీ మేస్త్రీలకూ వాస్తు సూచనలు

తాపీ మేస్త్రీలకూ వాస్తు సూచనలు

ఏ నిర్మాణం చేపట్టినా.. భారతీయ సాంప్రదాయంలో వాస్తుకు అత్యంత ప్రాధాన్యతనిస్తారు. ఏ మూలలో ఏది ఉండాలనేది ముందుగానే నిర్ణయించి.. తదనగుణంగా నిర్మా ణాన్ని పూర్తిచేయడం ఆనవాయితీ.

వాస్తు అనేది గృహస్తులకు, నిర్మాణాలకేనా? ఆ నిర్మాణాల్లో పాలుపంచుకునే తాపీ మేస్త్రీలకు వర్తించదా? అంటే.. కచ్చితంగా వర్తిస్తుంది అంటున్నాయి వాస్తు శాస్త్రాలు. మరి నిర్మాణాల్లో కీలకపాత్ర పోషించే తాపీ మేస్త్రీలు ఎలాంటి వాస్తు సూచనలు పాటించాలో తెలుసుకుందాం.

గృహ నిర్మాణాల్లో పాలుపంచుకునే తాపీ మేస్త్రీలు మొదలుకొని.. ఇటుకలు, ఇసుక, కాంక్రీటు ఇలా ప్రతి పనిలో భాగస్వామ్యం పంచుకునే కూలీలకు సైతం వాస్తు సూచనలు తప్పనిసరి.

కూలీలకంటే గృహనిర్మాణంలో కీలకపాత్ర పోషించే.. తాపీ మేస్త్రీలే ఎక్కువ నియమాలు పాటించాల్సి ఉంటుంది. వీరు గృహ నిర్మాణ సమయంలో జాగ్రత్తగా వ్యహరిస్తేనే నిర్మాణం అనుకున్న సమయానికి పూర్తవడమే కాకుండా.. బిల్డర్ లేదా యజమాని ఆశించిన రీతిలో నిర్మాణం పూర్తవుతుంది.

ఇంత ప్రాధాన్యత ఉన్న తాపీ మేస్త్రీలకు వాస్తు శాస్త్రంలో కొన్ని సలహాలు పేర్కొనడం జరిగింది. వీరు గృహ నిర్మాణం చేపట్టే సమయంలో కొన్ని కీలక గుర్తులతో పాటు.. దిశలను ఏర్పాటు చేసుకోవాలి. ముందుగా ప్లాన్ ప్రకారం గుర్తులు వేసుకోవాలి. అప్పుడు నైరుతి దిశ 90 డిగ్రీలు ఉండేలా చూసుకోవాలి.

తాపీ మేస్త్రీ నిర్మాణానికి దిగేముందు మూల మట్టాన్ని ముందుగా నైరుతి దిశలో ఉంచాలి. ఆ తరువాతే ఇతర దిక్కుల్లో దిశలను మార్క్ చేసుకోవాలి. ఈ మార్కులు చేసుకునేటప్పుడు ఇతర మూలల కంటే.. ఈశాన్యం కొద్దిగా ఎక్కువగా ఉండేలా చూసుకోవాలి. ఇంటి పునాదులు తీసేటప్పుడు ముందుగా ఈశాన్యం మూల నుంచి ప్రారంభించాలి. అయితే.. కట్టడం మాత్రం నైరుతి దిశ నుంచి ప్రారంభించాలి.

హద్దులను బట్టి ముందుగా ప్రహరీ గోడ నిర్మాణం చేపట్టాలి. పశ్చిమ-నైరుతి దిశలో కొంత ఎత్తైన గోడను నిర్మించి, ఆ తరువాత ఇంటి నిర్మాణం చేపట్టాలి. అలాగే ఇంటి నిర్మాణానికి అవసరమైన వస్తు సామాగ్రిని నైరుతి, పశ్చిమ, దక్షిణ భాగాల్లో మాత్రమే జాగ్రత్త చేసుకోవాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ ఈశాన్య భాగంలో మాత్రం ఉంచకూడదు.

గోడల నిర్మాణంలో ఏ రోజుకారోజు.. దక్షిణ-పశ్చిమ గోడలు.. తూర్పు, ఉత్తర గోడల కంటే కొంచెం ఎత్తుగా ఉండేటట్లు చూసుకోవాలి. అలాగే.. ఫ్లోరింగ్ వేసే సమయంలోను జాగ్రత్తగా చూసుకోవాలి. వీటితో పాటు మరికొన్ని జాగ్రత్తలను మేస్త్రీ పాటించాలి.

దక్షిణపు గదిలో ఆఫీస్ ఉండకూడదని వాస్తు నిపుణులు అంటున్నారు. అలాగే దక్షిణమున కరెంట్ మీటర్లు గానీ, జనరేటర్లు గానీ ఉండకూడదు. దక్షిణ ఆగ్నేయములో ఉండవచ్చును.

No comments:

Post a Comment

brahma chesina kasi prasamsa - బ్రహ్మ చేసిన కాశీ ప్రశంశ

బ్రహ్మ చేసిన కాశీ ప్రశంశ శివ శర్మను విష్ణు దూతలు స్వర్గ లోకం నుండి మహార్లోకానికి తీసుకొనివెళ్లారు. అక్కడ విష్ణు స్మరణ చేసి, కల్పాయువు కలిగిన...