హంసుడు, భానుడు, సహస్రామ్శువు, తపనుడు, తాపనుడు, రవి, వికర్తనుడు, వివశ్వంతుడు, విశ్వ కర్మ, విభావనుడు, విశ్వ రూపుడు, విశ్వ కర్త, మార్తాండుడు, మిహిరుడు, అంశుమతుడు, ఆదిత్యుడు, ఉష్నగుడు, సూర్యుడు, ఆర్యముడు, బ్రద్నుడు, ద్వాదశాదిత్యుడు, సప్త హయుడు, భాస్కరుడు,ఆహాస్కరుడు,ఖగుడు, శూరుడు, ప్రభాకరుడు, శ్రీ మంత్ర్హుడు, లోక చక్షువు, గ్రహేశ్వరుడు, త్రిలోకేశుడు, లోక సాక్షి, తమోరి, శాశ్వతుడు, శుచి, గభస్తి, హస్తాంషుడు, తరణి, సుమాహారిణి, ద్యుమణి, హరిదాశ్వుడు, అర్కుడు, భాను మంతుడు, భయ నాశనుడు, చందోశ్వుడు, వేద వేద్యుడు, భాస్వంతుడు, పూషుడు, వృషాకపి, ఏక చక్ర ధరుడు, మిత్రుడు, మందేహారి, తమిశ్రఘ్నుడు, దైత్యఘ్నుడు, పాప హర్త, ధర్ముడు, ధర్మ ప్రకాశకుడు, హీళి,చిత్రభానుడు, కలిఘ్నుడు, తార్ష్య వాహనుడు, దిక్రుతి, పద్మినీ నాభుడు, కుశేషయ కారుడు, హరి, ఘర్మ రశ్మి, దుర్ని రీక్షుడు, చందాంశువు, కశ్యపాత్మజుడు, అనే డెబ్బది రెండు పేర్లు సూర్యునికి ఉన్నాయి.
ఇందులో ప్రతి నామం మొదట ఓం అని చేర్చి, ఉచ్చ రిస్తూ, సూర్యుని చూస్తూ నమస్కరిస్తే సూర్యలోక ప్రాప్తి కలుగుతుంది. రెండు చేతులతో ఎర్రగా తోమిన రాగి చెంబు నిండా నిర్మలమైన జలాన్ని నింపి మోకాళ్ళ పైన భూమి మీద కూర్చుని, గన్నేరు పూలు, రక్త చందనం, గరిక, అక్షతలు ఆ పాత్రలో ఉంచి, సూర్యుడిని ధ్యానిస్తూ, ఫాల భాగం దగ్గర ఆ చెంబు నుంచుకొని స్తిర చిత్తం తో, పైన చెప్పిన72 సూర్య నామాలను ఉచ్చరిస్తూ సూర్యునికి అర్ఘ్యాన్ని చ్చే వాడేప్పుడు అష్టైశ్వర్యాలతో వర్ధిల్లు తాడు, వ్యాధులు నశిస్తాయి’’, అని శివ శర్మకు విష్ణు దూతలు వివరించారని భార్య లోపాముద్రకు అగస్త్య ముని చెప్పాడు.
No comments:
Post a Comment