Friday, November 6, 2026

vaastu prakaram gruhanni ekkada elaa nirminchukovaali..? - వాస్తు ప్రకారం గృహాన్ని ఎక్కడ ఎలా నిర్మించుకోవాలి..?

వాస్తు ప్రకారం గృహాన్ని ఎక్కడ ఎలా నిర్మించుకోవాలి..?

గ్రామంలోగానీ, పట్టణాల్లోగానీ నైరుతి మూల ధనవంతులు, అధికారవంతులు నివసించడం, ఆగ్నేయ మూలలో చిన్న జీవితాలను గడిపేవారు ఉండటం అనేక ప్రాంతాల్లో మీరు గమనించవచ్చు.

ఊరికి ఆగ్నేయంలో శాస్త్రసమ్మతంగా గృహము నిర్మించిన ఐశ్వర్యవంతులుగా వుందురేగాని.. నైరుతి మూల గలవారిపై పెత్తనం చేయుట కష్టతరము.

ఇటీవల పట్టణాల వైశాల్యం పెరిగిపోవటం వలన, పట్టణానికి ఎక్కడ, ఏ మూలో గమనించి చెప్పడం కష్టతరమే. అందుకని పట్టణ వాసులు వారు గృహము నిర్మించు ప్రాంతాన్ని మాత్రం పరిగణనలోకి తీసుకోవాలి.

మరో ముఖ్యవిషయం.. గ్రామానికి ఈశాన్య దిశలో ఎత్తైన కొండలు ఉండటం, లేదా ఈశాన్య భాగం తెగిపోవడం వంటి కారణాల వల్ల ఈశాన్య దిశ దోషానికి గురైనట్లయితే, ఆ గ్రామానికి నైరుతి దిశ ఉచ్చస్థానంగా పరిగణించబడుతుంది.

ఇటువంటి ఊళ్లలో కొత్తగా గృహము నిర్మించదలుచుకొన్నచో మొత్తం ఊరికి దక్షిణ, పశ్చిమ భాగాల వైపు ఏదైతే ప్రధాన వీధిచే గాని కాలువచేగాని వేరు చేయబడి ఉంటుందో ఆ భాగం ఊరికి ఉచ్ఛం అని గ్రహించండి.

అంటే మొత్తం ఊరిని వదిలి, ఊరిని వేరు చేసిన కాలువకు, ప్రధాన వీధికి రెండవ వైపు (ఊరి వైపు కాకుండా) గృహాన్ని నిర్మించుకోవాలి. అయితే ఈ ప్రాంతం కూడా దక్షిణ, పశ్చిమాలు వాలుగా పల్లంగా వుండకూడదు. ఆ విధంగా వున్న వాయవ్య ఈశాన్యాలలో తూర్పు, ఉత్తరాలు పల్లంగా వున్న స్థలాలు రాణిస్తాయి.

No comments:

Post a Comment

brahma chesina kasi prasamsa - బ్రహ్మ చేసిన కాశీ ప్రశంశ

బ్రహ్మ చేసిన కాశీ ప్రశంశ శివ శర్మను విష్ణు దూతలు స్వర్గ లోకం నుండి మహార్లోకానికి తీసుకొనివెళ్లారు. అక్కడ విష్ణు స్మరణ చేసి, కల్పాయువు కలిగిన...