వాస్తు ప్రకారం దిక్కులలో నవగ్రహాల ఫలితాలు
ఆగ్నేయానికి దిక్పతి అగ్ని, నవగ్రహాలలో శుక్రుడు అధిపతి. శుక్ర గ్రహానికి సంబంధించిన ఆగ్నేయ దోషాలు ఏర్పడితే.. గృహంలో యజమానురాలికి ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి. వివాహ విచ్ఛేదనకు కూడా ఆగ్నేయ దోష శుక్రుడు కారకుడుగా మారతాడు.
తాజ్ మహల్ ప్రేమకు చిహ్నమైనప్పటికీ షాజహాన్ భార్య ముంతాజ్ సమాధిగా నిర్మించబడింది. అది ఒక సమాధి కావడం వల్ల చెడు ఫలితాలు ఉంటాయని అందుకే ఇంట్లో పెట్టుకోకూడదని అంటారు.
నైరుతిలో దిక్పతి నిరుతి. అందరూ రాక్షస స్థానంగా మాత్రమే దీన్ని వర్ణిస్తారు. కానీ ఇది పితృ (వంశ) స్థానంగా చూడాలి. ఈ ప్రదేశంలోని గ్రహం రాహువు. నైరుతిలో దోషం ఏర్పడితే యజమాని చెడు వ్యసనాలకు బానిస అవుతాడు. ఆస్తులు కర్పూరంలా కరిగిపోతాయి. ఈ స్థాన దోషం వల్ల వ్యాపారస్తులు అప్పుల పాలవుతారు.
ఇక మూడోది వాయువ్యం. దిక్పతి వాయువు కాగా. గ్రహం చంద్రుడు. ఈ స్థలంలోని చంద్ర దోషం వల్ల ప్రేమ వివాహాలు జరిగే అవకాశం ఎక్కువ. నైరుతి లాగే నాయకులకు వాయువ్య చంద్రుడు అత్యంత ప్రాధాన్యతాంశం.
నాలుగోది ఈశాన్యం. దీనికి దిక్పతి ఈశ్వరుడు, గ్రహాలు గురువు, కేతువు. ఈ ప్రదేశంలోని దోషాల వల్ల చదువుకొనే పిల్లలపై ఎక్కువగా ప్రభావం పడుతుంది. విద్యార్థులు పరీక్షలు తప్పడం, చెడు అలవాట్లు నేర్చుకోవడం, వాహన ప్రమాదాల బారిన పడటం, నాస్తికులుగా మారడం లాంటి సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది.
ఈ ఎనిమిది దిక్కులతోపాటు రెండు ప్రతి దిక్కులు కూడా ఉన్నాయి. అవి 1. ఊర్థతము, 2. అధోతము. ఒకటి పై భాగం కాగా రెండోది కింది భాగం. వీటిని కూడా కలిపి దశ దిక్కులు అంటారు. పై భాగానికి అధిపతులు సూర్య, చంద్రులు కాగా.. కింది భాగానికి అధిపతి కుజుడు మరియు వృక్ష, పశు పక్ష్యాదులు.
Subscribe to:
Post Comments (Atom)
brahma chesina kasi prasamsa - బ్రహ్మ చేసిన కాశీ ప్రశంశ
బ్రహ్మ చేసిన కాశీ ప్రశంశ శివ శర్మను విష్ణు దూతలు స్వర్గ లోకం నుండి మహార్లోకానికి తీసుకొనివెళ్లారు. అక్కడ విష్ణు స్మరణ చేసి, కల్పాయువు కలిగిన...
-
సూర్య ద్వాదశ నామాలు ధ్యేయః సదా సవితృమండలమధ్యవర్తీ నారాయణః సరసిజాసన సన్నివిష్టః । కేయూరవాన్ మకరకుండలవాన్ కిరీటీ హారీ హిరణ్మయవపుః ధృతశంఖచక్రః ...
-
నిత్య పారాయణ శ్లోకాలు స్తోత్రాలు నవ గ్రహ స్తోత్రం సుబ్రహ్మణ్యాష్టకం ఆదిత్యహృదయం కనకధారా స్త్రొత్రమ్ దుర్గాసప్తశ్లోకీ దేవి మహత్యం ద్వాత్రిస న...
-
శ్రీ దేవీ భాగవతము నవమ స్కంధములోని శ్రీ సరస్వతీ కవచం ఓం శ్రీం హ్రీం సరస్వ త్త్యై స్వాహా -శిరో మే పాతు సర్వతః । ఓం శ్రీం వాగ్దేవతాయై స్వాహా -ఫ...
No comments:
Post a Comment