Friday, November 6, 2026

vaastu prakaram inti chuttu khali sthalam - వాస్తు ప్రకారం ఇంటి చుట్టూ ఖాళీ స్థలం

వాస్తు ప్రకారం ఇంటి చుట్టూ ఖాళీ స్థలం

స్థలంలో వీలయినంత ఎక్కువగా గృహ నిర్మాణం కావించి, ఇంటిలోని అన్ని గదులూ పెద్దవిగా ఉండేలా ఆలోచిస్తారే తప్ప, ఇంటి చుట్టూ ఖాళీ స్థలం వదలకపోతే గాలీ వెలుతురు కరువవుతాయని, ఆ కారణంగా ఆ ఇంట్లో నివశించే వారికి అరోగ్య సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉందన్న దిశలో ఎవరూ అలోచించట్లేదు.

అపార్టుమెంటు అయినా, గృహం అయినా నాలుగు దిక్కులా ఖాళీ ఉన్నది ఉత్తమం. అయితే అపార్టుమెంట్స్ ఇలా నిర్మించడం చాలా కష్టం. కనీసం వీలయినంత మేరకు అపార్టుమెంటులోకి గాలి, వెలుతురు వచ్చేలా నిర్మాణం చేయడం వాస్తు రీత్యా ఉత్తమం.

దక్షిణం కన్నా ఉత్తరం కాస్త ఎక్కువ ఉంటే చాలు. పడమర కన్నా తూర్పు కాస్త అధికం ఉంటే చాలు... శాస్త్రానికేగా... అనవసరంగా స్థలం వేస్టు చేయకండి అనే ఆలోచనగల గృహ యజమానులకు ఉంటుంది. ఇంటి చుట్టూ ఖాళీ వదిలే సమయంలో వాస్తుశాస్త్ర నియమాలను విధిగా పాటించాలి.

ఆవరణంలో పడమర కన్నా కనీసం మూడురెట్లు ఆపైన అధికంగా తూర్పు దిశన ఖాళీ వదలి తీరాలి. ఇలా ఖాళీ వదిలి నిర్మితయమైన గృహం... సుఖశాంతుల నిలయం అవుతుంది.

దక్షిణం వైపు కన్నా మూడు రెట్లు అంత కన్నా ఎక్కువ ఖాళీని ఉత్తర దిక్కులో వదలడం వలన ఆ ఇంట లక్ష్మీదేవి స్థిరనివాసం ఏర్పరచుకుంటుంది. స్థిరాస్తుల రూపంలోనో, చరాస్తుల రూపంలోనో డబ్బుకు కొదవ లేకుండా ఉంటుంది. భవిష్యత్ విషయంలో దిగులు ఉండని అర్ధిక పరిస్థితిలో ఆ కుటుంబం అలరారుతుంది.

No comments:

Post a Comment

brahma chesina kasi prasamsa - బ్రహ్మ చేసిన కాశీ ప్రశంశ

బ్రహ్మ చేసిన కాశీ ప్రశంశ శివ శర్మను విష్ణు దూతలు స్వర్గ లోకం నుండి మహార్లోకానికి తీసుకొనివెళ్లారు. అక్కడ విష్ణు స్మరణ చేసి, కల్పాయువు కలిగిన...