Friday, November 6, 2026

vaastu prakaram padamara dhikku... anukula pratikulatalu - వాస్తు ప్రకారం పడమర దిక్కు... అనుకూల ప్రతికూలతలు

వాస్తు ప్రకారం పడమర దిక్కు... అనుకూల ప్రతికూలతలు

పడమర భాగము మెరకగానున్న కీర్తిప్రతిష్టలు, ధనధాన్యాభివృద్ధి, సంతాన సౌఖ్యం, ఆరోగ్యపుష్టి, సత్ప్రవర్తన, మానసిక ప్రశాంతత దాంపత్య సౌఖ్యము వ్యవహర విజయము మొదలగు శుభములు కలుగును.

పడమర పల్లముగా నున్నయోడల ధననష్టము, అనారోగ్యం, అపకీర్తి, కుటుంబమునకు సంతానమునకు అరిష్టములు ప్రతిబంధకములు వ్యవహార అపజయములు మొదలగునవి కలుగును.

ఇంటికి పడమర యందు ఎక్కువ ఖాళీ స్థలముండి తూర్పున తక్కువ ఖాళీ స్థలమున్న ఎడల ఆ ఇంట ఆర్థిక దుస్థితి అనారోగ్యం కలుగును.

ఇంటికిగాని, ఖాళీస్థలమునకు గానీ, దక్షిణ పడమర దిశలయందున్న స్థలములుగాని, గృహములుగాని, కొని కలుపుకొనుట అశుభప్రదము దానివలన ఆర్థిక స్థితి క్రమముగా క్షీణించును. ధననష్టము మితముగా వుండును. పడమర భాగము యొక్క ప్రభావం ముఖ్యముగా ఆ ఇంటి కీర్తి ప్రతిష్టలపై ఆర్థిక పరిస్థితిమీద చూపును.

ఇంటికి పడమర వైపు తక్కువ ఖాళీ స్థలముండిన శుభం. ఆర్ధికపుష్టి, ఆరోగ్యపుష్టి, సంతానమునకు, కుటుంబమునకు సౌఖ్యము. వ్యవహార విజయము, కీర్తిప్రతిష్ఠలు మొదలగు శుభములు కలుగును.

ఇంటికి తూర్పువైపున కంటే పడమర మెరకగానున్న శుభప్రదము. పైన చెప్పిన శుభఫలితములు కూడా కలుగును.

పడమర భాగమందు బావియుండుట దోష ప్రదము. ఇంటి పడమటి సగభాగములో పై అంతస్తు వేసిన ఇంటికి వాస్తు బలము కలిగి ఆ ఇంటియందుండువారికి శుభము కలుగును. ఇంటి యజమాని చేయు పనిలో త్వరత్వరగా అభివృద్ధి కలుగును. సుఖ సంతోషములు కీర్తి ప్రతిష్టలు ఆర్ధికపుష్టి కలుగును.

No comments:

Post a Comment

brahma chesina kasi prasamsa - బ్రహ్మ చేసిన కాశీ ప్రశంశ

బ్రహ్మ చేసిన కాశీ ప్రశంశ శివ శర్మను విష్ణు దూతలు స్వర్గ లోకం నుండి మహార్లోకానికి తీసుకొనివెళ్లారు. అక్కడ విష్ణు స్మరణ చేసి, కల్పాయువు కలిగిన...