యెర్రని శరీరం గల లోకమే అంగారక లోకం అతడు భూమి కుమారుడు అందుకే కుజుడు అనే పేరు, దాక్షాయణీ వియోగం తో శివుడు ఘోర తపస్సు చేశాడు. ఆయన తల భాగం నుండి ఒక చెమట బిందువు భూమి పై పడింది. దాని నుంచి లోహితాన్గుడు అనే కుమారుడు పుట్టాడు. అందుకే అతని తల్లిగా భూదేవిని చెపుతారు. ఆమె పోషణ లో పెరిగి మహేయుడు అనే పేరు పొంది ఉగ్రపురి లో ఉగ్రం గా తపస్సు చేశాడు. అక్కడి నుండి కాశి చేరి లింగ స్తాపన చేసి మహాతపస్సు చేశాడు.
ఇది పంచ ముద్రా స్తానం లో కంబలాశ్వ తరువుకు ఉత్తరం గా ఉంది. అందుకే అంగారకుడనే పేరొచ్చింది. శివుడు సంతోషించి గ్రహాధి పత్యాన్నిచ్చాడు. అన్గాకరేశ్వర లింగాన్ని పూజిస్తే గ్రహ పీడ తొలగిపోతుంది. అంగారక చతుర్ధి నాడు గణ నాధుడు జన్మించాడు.
No comments:
Post a Comment