విష్ణు దూతలు శివ శర్మ ను శని లోకం చూపించారు. మరీచికి కశ్యపుని వలన సూర్యుడు ఉదయించాడు. అతని భార్య త్వష్ట ప్రజాపతి కుమార్తె సంజ్ఞాదేవి. సూర్య తేజస్సును పొంది ఆమె కాంతి విహీనమయింది సూర్యునికి అప్పటి నుండి మార్తాండుడు అనే పేరు వచ్చింది. సూర్య తేజస్సును భరిస్తోంది సంజ్ఞవల్ల ముగ్గురు సంతానం కలిగారు. వైవశ్వతుడు మొదటి వాడు. యముడు రెందోకొడుకు. యమునా నది కన్యకా. ఇక సూర్యుని తేజస్సు భరించలేక సంజన తన చాయను ఏర్పరిచింది.
ఛాయ తో ఆమె"నేను నా తండ్రి దగ్గరకు వెడుతున్నాను. నువ్విక్కడ సుఖంగా ఉండు. నా కూతురు యమున ను జాగ్రత్తగా పోషించు" అని అప్పగించి వెళ్లిపోయింది. త్వష్ట ప్రజాపతి కూతురుని ఆహ్వానించలేదు. భర్త దగ్గరకే పొమ్మన్నాడు. మళ్ళీ సూర్యుడి వద్దకు వెళ్లటం ఇష్టం లేక ఒక అరణ్యం చేరి బడబ అనే ఆడ గుర్రం గా మారి తపస్సు చేస్తూ ఉంది. ఛాయ సూర్యుని వల్ల ఎనిమిదవ మనువు అయిన సావర్నుని పుత్రునిగా కన్నది. యమునను సవతి తల్లి గా ఆరడి పెట్టింది. యముడు జాతి వైరాన్నిపూనాడు
సంజ్ఞా రూపం లో ఉన్న చాయను యముడు శపించాడు. తన్నటానికి కాలు పైకెత్తాడు ఆ కాలు పడిపోవు గాక అని ఆమె శపించి నది. భర్త దగ్గరకు వెళ్లి ఏడ్చింది. ఆమెకు బుద్ధి చెప్పాడు. సంతానాన్ని సమాన ప్రేమ తో చూడాలని హితవు చెప్పాడు. యముడు తనను క్షమించ మని తండ్రిని కోరుకొన్నాడు. కానీ తల్లి శాపానికి తిరుగులేదని పురుగులు అతని మాంసాన్ని తింటాయని భూలోకం లో పడటం తప్పదని చెప్పాడు.
మళ్ళీ తన అనుగ్రహం వల్ల కాలు వస్తుందని అభయమిచ్చాడు తన దగ్గర ఉన్నది సంజ్ఞా కాదని తెలుసుకొని సూర్యుడు ఆమెను వెతికి బడబగా ఉండటం తెలుసుకొని తానూ గుర్రం వేషం లోకి వెళ్ళాడు. ఆమె పరపురుషుడేమో నని అనుమానించి శుక్రాన్ని తన ముక్కు రంద్రాలనుంచి బయటికి పంపింది. ఆ శుక్రము నుంచి అశ్వినీ దేవతలు సూర్య తేజం తో జన్మించారు.
సంజ్ఞ కు విషయం చెప్పాడు రవి. శని సూర్యుని అనుమతి తో కాశీ వెళ్లి శివుని కోసం తపస్సు చేసి అనుగ్రహాన్ని పొంది. గ్రహాది పత్యాన్ని పొందాడు. పోయిన కాలు వచ్చే సింది అందుకే శని మార్గం లో వక్రత ఉంటుంది. శనేశ్వర లింగం శుక్ర లింగానికి ఉత్తరం గా ఉంది. దీన్ని అర్చిస్తే ఉత్తమ లోక ప్రాప్తి, గ్రహ పీడా నివారణా జరుగుతాయి.

No comments:
Post a Comment