నారదా! గాయత్రీవర్ణాలతో చేసే అక్షరన్యాసంకూడా ఉంది. ఆది సర్వపాపహరం. కనక చెబుతాను, గ్రహించు. ముందుగా ఓంకారాన్ని ఉచ్చరించి తత్కారాన్ని పాదాంగుష్ఠాల్లో న్యాసం చెయ్యాలి. సకారం గుల్ఫాలలో, వికారం జంఘలలో, తుకారం జానువులలో, వకారం ఊరువులలో, రేకారం గుదప్రదేశంలో, ణికారం లింగదేశంలో, యకారం కటిలో, భకారం నాభిమండలంలో, గోకారం హృదయంలో, దేకారం స్తనద్వయంలో, వకారం హృదయంలో, స్యకారం కంఠకూపంలో, ధీకారం ముఖదేశంలో, మకారం తాలువులలో, హికారం నాసికాగ్రంలో, ధికారం నేత్రమండలంలో, యోకారం భ్రూమధ్యంలో, యోకారం లలాటదేశంలో, నకారం పూర్వముఖంలో, ప్రకారం దక్షిణముఖంలో, చోకారం పశ్చిమముఖంలో, దకారం ఉత్తరముఖంలో, యాకారం మూర్ధభాగంలో నిన్యసించి తకారాన్ని వ్యాపకంగా న్యాసం చెయ్యాలి. ఈ న్యాసవిధానాన్ని కొందరు జపతత్పరులు ఇష్టపడరు. అటు పైని జగదంబిక గాయత్రిని ధ్యానించాలి.
భాస్వజ్జపా ప్రసూనాభాం కుమారీం పరమేశ్వరీమ్ ।
రక్తాంబుజాసనారూఢాం రక్తగంధానులేపనామ్ ॥
రక్తమాల్యాంబరధరాం చతురాస్యాం చతుర్భుజామ్ ।
ద్వినేత్రాం స్రుక్ స్రువౌ మాలాం కుండికాం చైవ బిభ్రతీమ్ ॥
సర్వాభరణ సందీష్తాం ఋగ్వేదాధ్యాయినిం పరామ్ ।
హంసపత్రామాహవనీయమధ్యస్థాం బ్రహ్మదేవతామ్ ॥
చతుష్పదామష్టకుక్షిం సప్తశీర్షాం మహేశ్వరీమ్ ।
అగ్నివక్త్రాం రుద్రశిఖాం విష్ణుచిత్తాం తు భావయేత్ ॥
బ్రహ్మకవచ, సాంఖ్యాయనగోత్రసంభవ, ఆదిత్యమండల మధ్యవర్తిని గాయత్రీ మహేశ్వరిని ఇలా ధ్యానించాలి. (ముక్తా విద్రుమ హేమనీల ధవళచ్చాయైః - ఇత్యాది ధ్యానశ్లోకమే సుప్రసిద్ధం) ధ్యానమయ్యాక దేవికి ప్రీతికరమైన సమ్ముఖ - సంపుట - వితత - విస్తృత - ద్విముఖ - త్రిముఖ - చతుష్క - పంచక - షణ్ముఖ - ఆధోముఖ - వ్యాపకాంజలిక - శకట - యమపాశ - గ్రథిత - సమ్ముఖోన్ముఖ - విలంబ - ముష్టిక - మత్స్య - కూర్మ- వరాహక - సింహాక్రాంత - మహాక్రాంత - ముద్గర - పల్లవ - చతుర్వింశతి ముద్రలను పట్టాలి. గాయత్రీమంత్రంలో ఇరవైనాలుగు అక్షరాలున్నాయి కనక ఇరవైనాలుగు ముద్రలు. జాతవేదసమంత్రాన్ని పఠించాలి. త్య్రంబకఋక్కును ఆవర్తించాలి. అలా శతాక్షర గాయత్రిని జపించాలి. అటు పైని ఓంకారపూర్వకంగా భూర్భువస్స్వః అనే వ్యాహృతిత్రయంతో చతుర్వింశతి గాయత్రిని ఉచ్చరించాలి. విఫ్రులందరూ నిత్యమూ ఇలా గాయత్రీజపం చేస్తే సంధ్యాదేవి ఆనందించి సమగ్రపుణ్యఫలాలను అనుగ్రహిస్తుంది.
బ్రహ్మనందనా! భిన్నపాదంగా గాయత్రీమంత్రాన్ని ఉచ్చరించాలి. బ్రహ్మహత్యాది దోషాలుకూడా తొలగిపోతాయి. అభిన్న పాదంగా (పాదాలు కలిపేస్తూ) ఉచ్చరిస్తే అంతటిదోషమూ సంక్రమిస్తుంది. కోటి కల్పాలు అధోముఖులుగా ఉండిపోతారు. సంపుటైకషడోంకారాది భేదాలు చాలా ఉన్నాయనీ పంచప్రణవ సంయుక్తమైన గాయత్రినే జపించాలనీ జపసంఖ్యలో ఎనిమిదవభాగం చివర తురీయపాదాన్ని జపించాలనీ, సంపుటైక షడోంకార గాయత్రులు ఊర్ధ్వరేతస్కులకనీ, బ్రహ్మచారులకూ గృహస్థులకూ మోక్షార్ధులకూ తురీయగాయత్రి అనీ ఇత్యాదిగా అభిప్రాయాలు శాస్త్రపురాణేతిహాసాల్లో కనపడుతున్నాయి. ఇక్కడ చెప్పుకోవలసిన మరొక ధ్యానశ్లోకముంది -
హృది వికసితపద్మం సార్కసోమాగ్నిబింబం
ప్రణవమయమచింత్యం యస్య పీఠం ప్రకల్ప్యమ్ ।
అచల పరమసూక్ష్మం జ్యోతిరాకాశసారమ్
భవతు మమ ముదేஉసౌ సచ్చిదానందరూపః ॥
త్రిశూల - యోని - సురభి - అక్షమాల - లింగ - అంబుజ - మహాముద్రలు ఏడింటినీ ప్రదర్శించాలి. సంధ్యాదేవియే గాయత్రీదేవి. కనక భక్తి శ్రద్ధలతో ఉపాసించాలి. అటుపైని పంచోపచారపూజ చెయ్యాలి. లం పృథివ్యాత్మనే నమోనమః గంధమర్పయామి. హం ఆకాశాత్మనే నమోనమః పుష్పమర్పయామి. యం వాయ్వాత్మనే నమోనమః ధూపమాఘ్రాపయామి. రం వహ్న్యాత్మనే నమోనమః దీపం దర్శయామి. వమ్ అమృతాత్మనే నమోనమః నైవేద్యం సమర్పయామి. యం - రం - లం - వం - హం - పుష్పాంజలిం సమర్పయామి. ఈ పూజ అయ్యాక మళ్ళీ ముద్రలు ప్రదర్శించాలి. మనస్సులో దేవిని ధ్యానించాలి.
మంత్రం ఉచ్చరించేటప్పుడుగానీ ధ్యానించేటప్పుడుగానీ శిరస్సు కదలకూడదు. మెడ వంగకూడదు. దంతాలు కనిపించకూడదు. అష్టోత్తరశతంగాని అష్టవింశతి (28)గానీ, మరీ అశక్తుడైతే కనీసం పదిసార్లుగాని గాయత్రిని జపించాలి. ఇంతకు తక్కువగా ఎప్పుడూ చెయ్యకూడదు. అంతా అయ్యాక ఉత్తమే శిఖరే జాతే అనే శ్లోకాన్ని పఠిస్తూ గాయత్రీమాతకు ఉద్వాసన చెప్పాలి. నారదా! గాయత్రీదేవి అగ్నిముఖి కనక జలమధ్యంలో నిలిచి జపించకూడదని కొందరు మహర్షులు అంటున్నారు.
న గాయత్రీం జపేద్విద్యాన్ జలమధ్యే కథంచన ।
యతస్సాగ్నిముఖీ ప్రోక్తేత్యాహుః కేచిన్మహర్షయః ॥
సురభి - జ్ఞాన - శూర్ప - కూర్మ - యోని - పద్మ - లింగ - నిర్వాణకాలనే ఆష్టముద్రలను జపాంతంలో ప్రదర్శించాలి. ధ్యానమంత్ర పూజావిధుల్లో ఉచ్చారణదోషాలు ఏమైనా దొర్లితే క్షమించమని ప్రార్థిస్తూ గాయత్రీతర్పణం విడిచిపెట్టాలి.
న గాయత్రీం జపేద్విద్యాన్ జలమధ్యే కథంచన ।
యతస్సాగ్నిముఖీ ప్రోక్తేత్యాహుః కేచిన్మహర్షయః ॥
సురభి - జ్ఞాన - శూర్ప - కూర్మ - యోని - పద్మ - లింగ - నిర్వాణకాలనే ఆష్టముద్రలను జపాంతంలో ప్రదర్శించాలి. ధ్యానమంత్ర పూజావిధుల్లో ఉచ్చారణదోషాలు ఏమైనా దొర్లితే క్షమించమని ప్రార్థిస్తూ గాయత్రీతర్పణం విడిచిపెట్టాలి.
ఈ మంత్రానికి ఛందస్సు గాయత్రి, విశ్వామిత్రుడు ఋషి, సూర్యుడు దేవత. తర్పణే వినియోగః. భూః అని ఉచ్చరించి ఋగ్వేదపురుషుణ్ణీ, భువశ్శబ్దంతో యజుర్వేదపురుషుణ్ణీ, స్వః అనే వ్యాహృతితో సామవేద పురుషుణ్ణీ, మహశ్శబ్దంతో అధర్వణవేద పురుషుణ్ణీ, స్మరిస్తూ తర్పణాలు విడిచి పెట్టాలి.
అటుపైని జనః పదంతో ఇతిహాసపురాణాలనూ, తపశ్శబ్దంతో సర్వాగమాలనూ, సత్యం శబ్దంతో సత్యలోకపురుషుణ్ణీ, ఓం భూః - భూలోకపురుషం తర్పయామి తర్పయామి అంటూ నీళ్ళు వదిలిపెట్టాలి. భువశ్చేతి భువర్లోకపురుషం తర్పయామి. స్వః స్వర్లోకపురుషం తర్పయామి.
ఇలాగే గాయత్రీతర్పణలు. ఓం భూరేకపదాం గాయత్రీం తర్పయామి. ఓం భువః ద్విపదాం ..... ఓం స్వః త్రిపదాం గాయత్రీం ..... ఓం భూర్భువః స్వశ్చేతి చతుష్పదాం గాయత్రీం తర్పయామి. ఉషసీ గాయత్రీ సావిత్రీ సరస్వతీ వేదజననీ పృథ్వీ అజాకౌశికీ సాంకృతి సార్వజితి భేదాలతో గాయత్రికి తర్పణలు ఇవ్వాలి. ఇలా వేదపురుష - లోకపురుష - గాయత్రీ తర్పణాలు అయ్యాక శాంతికరంగా జాతవేదసమంత్రం పఠించాలి. మానస్తోకమంత్రంకూడా జపించాలి. త్య్రంబకమంత్రం మరింత శాంతికరంగా ప్రసిద్ధం. తచ్చంయోరిత్యాది మంత్రమూ ఇటువంటిదే. శాంతికరమంత్ర పఠనమయ్యాక అతోదేవా మంత్రద్వయంతో సర్వాంగ స్పర్శనం చేసుకోవాలి. స్యోనాపృథివి మంత్రంతో భూమికి మ్రొక్కాలి. యథావిధిగా గోత్రనామాలు చెప్పుకోవాలి.
పంచాయతన పూజ
No comments:
Post a Comment