కనకదుర్గ గుడి, ఒక ప్రసిద్ధమైన దేవస్థానం. ఇది విజయవాడ నగరంలో కృష్ణా నది ఒడ్దున ఇంద్రకీలాద్రి పర్వతం మీద ఉంది. ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే రెండో పెద్ద దేవాలయం. ఇంద్రకీలాద్రి కొండపై ఉన్న ఆలయంలో కనకదుర్గ స్వయంభూగా చెబుతారు. విజయవాడ ప్రధాన దేవతగా పరిగణించబడుతుంది, కనక దుర్గను పవిత్ర గ్రంథాలలో శక్తి దేవతగా పేర్కొనబడింది.
హిందూ పురాణాలలో అమ్మవారి గురించి ప్రస్తావన ఉంది. ఆలయంలో అమ్మవారి విగ్రహం సుమారు నాలుగు అడుగుల ఎత్తు ఉంటుంది. మిరిమిట్లు గొలిపే ఆభరణాలు, పూలతో అలంకరించబడి ఉంటుంది. మూర్తికి ఎనిమిది చేతులు ఉన్నాయి. ఒక్కో చేతిలో ఒక్కో ఆయుధం ఉంటుంది. త్రిశూలంతో మహిషాసురుని గుండెలో పొడుస్తున్న భంగిమలో ఉంటుంది.
స్థల పురాణం
ఈ ఆలయంలోని అమ్మవారు స్వయంభూగా వెలసిందని పురాణాలు చెబుతున్నాయి. అంతేగాక అమ్మవారి శక్తి పీఠాలలో ఈ ఆలయం ఒకటి. పూర్వం కీలుడనే యక్షుడు కృష్ణానదీ తీరంలో దుర్గాదేవి గురించి ఘోరమైన తపస్సు చేసాడు. దానితో అమ్మవారు సంతోషించి వరము కోరుకోమని అడుగగా అమ్మా! నువ్వు ఎప్పుడూ నా హృదయస్థానంలో కొలువుండే వరం ప్రసాదించమని అడిగాడు. అది విన్న అమ్మ చిరునవ్వుతో సరే! కీలా! నువ్వు ఎంతో పరమపవిత్రమైన ఈ కృష్ణానదీ తీరంలో పర్వతరూపుడవై వుండు.
నేను కృతయుగంలో అసురసంహారం తర్వాత నీ కోరిక తీరుస్తాను అని చెప్పి అంతర్ధానమైంది. కీలుడు పర్వతరూపుడై అమ్మవారి కోసం ఎదురుచూడసాగాడు. తర్వాత లోకాలను కబళిస్తున్న మహిషుణ్ణి వధించి కీలుడుకిచ్చిన వరం ప్రకారం మహిషాసురమర్ధిని రూపంలో కీలాద్రిపై వెలసింది.

ఇక్కడ వెలసిన మహిషాసురమర్ధిని అమ్మవారు కనకవర్ణంతో శోభితురాలై వుండటం వల్ల అమ్మవారికి కనకదుర్గ అనే నామం స్థిరపడింది.
తదనంతరం ప్రతీరోజు ఇంద్రాది దేవతలంతా ఇక్కడికి వచ్చి దేవిని పూజించటం మూలంగా ఇంద్రకీలాద్రిగా పిలవబడింది. ఆ తర్వాత ఇంద్ర కీలాద్రిపై పరమేశ్వరుని కూడా కొలువుంచాలని ఉద్దేశంతో బ్రహ్మదేవుడు శివుడ్ని గురించి శతాశ్వమేధ యాగం చేసాడు.
జ్యోతిర్లింగ రూపం
దీనితో సంతుష్టుడైన శివుడు ఇక్కడ జ్యోతిర్లింగ రూపంలో వెలిశాడు. అలా వెలసిన స్వామిని బ్రహ్మదేవుడు మల్లి, కదంబ పుష్పాలతో పూజించటం వల్ల స్వామివారికి మల్లికార్జునుడు అనే పేరొచ్చిందని గాధ.
దర్శన రకాలు: ధర్మ దర్శనం (ఉచితం), ముఖమండప దర్శనం, శీఘ్ర దర్శనం మరియు అంతరాలయ దర్శనం అందుబాటులో ఉన్నాయి.
కొండపైకి వెళ్ళే మార్గాలు:
ఇంద్రకీలాద్రి కొండపై ఉన్న ప్రధాన ఆలయానికి చేరుకోవడానికి కింద రథం సెంటర్ వద్ద నుండి రవాణా ఏర్పాట్లు ఉన్నాయి:
లిఫ్ట్ సౌకర్యం (Lifts & Steps): మెట్లు ఎక్కలేని వృద్ధులు మరియు వికలాంగుల కోసం కింద నుండి నేరుగా కొండపైకి వెళ్లేందుకు పెద్ద పెద్ద లిఫ్టుల (Elevators) సౌకర్యం కూడా కల్పించారు.
సొంత వాహనాలు: మీ సొంత కారు లేదా బైక్ ద్వారా ఘాట్ రోడ్డు మీదుగా కొండపైకి వెళ్ళవచ్చు. అయితే పండుగ రోజుల్లో లేదా రద్దీ ఎక్కువగా ఉన్నప్పుడు కొండపైకి ప్రైవేట్ వాహనాలను అనుమతించరు. కొండ కింద మరియు సీతమ్మ వారి పాదాల వద్ద దేవస్థానం వారి పెయిడ్ పార్కింగ్ (Paid Parking) స్థలాలు అందుబాటులో ఉన్నాయి.
మన దేవాలయాలు చారిత్రక నగరాలూ

మరో గాధ ప్రకారం ద్వాపరయుగంలో అర్జునుడు పాసుపతాస్త్రం కోసం ఇంద్రకీలాద్రి పై వుగ్ర తపస్సు చేయగా తనని పరీక్షించటానికి శివుడు కిరాతకుడుగా వచ్చి అర్జునునితో మల్లయుద్ధం చేసి అర్జునుని భక్తికి మెచ్చి పాసుపతాశ్త్రాన్ని అనుగ్రహించాడు.
స్వామి ఇక్కడ మల్లయుద్ధం చేసాడు కాబట్టి మల్లికార్జునుడిగా పిలవబడుతున్నాడు.
జగద్గురు ఆదిశంకరాచార్యులు
ఈ క్షేత్రాన్ని దర్శించిన జగద్గురు ఆదిశంకరాచార్యులు జ్యోతిర్లింగం అదృశ్యంగా వుండటం గమనించి అమ్మ ఆలయ ఉత్తరభాగాన మల్లికార్జునిని పునఃప్రతిష్టించారు.
శ్రీచక్ర యంత్ర ప్రతిష్ట
మహారౌద్రంగా వున్న అమ్మవారిని ఆలయంలో శ్రీచక్ర యంత్ర ప్రతిష్ట చేసి శాంతింపజేసారు. అప్పట్నుంచీ అమ్మ పరమశాంతస్వరూపిణిగా భక్తులను కనువిందు చేస్తోంది.

ప్రతి సంవత్సరం కొన్ని లక్షలమంది ఈ దేవాలయానికి వచ్చి దర్శనం చేసుకొంటారు.
ఆంజనేయ స్వామి:
ఆంజనేయ స్వామిని కనకదుర్గ క్షేత్రానికి క్షేత్రపాలకుడిగా భావిస్తారు. భక్తులు రక్షణ, ధైర్యం, బలం కోసం, అలాగే భయాలు మరియు అడ్డంకులు తొలగిపోవాలని ఆయన్ని పూజిస్తారు.
శరన్నవరాత్రులు
ఇక్కడ మరో విశేషం ఏమిటంటే స్వామివారికి దక్షిణంగా అమ్మవారు కొలువైవున్నారు. కనకదుర్గ అమ్మవారికి అతిప్రీతిపాత్రమైనవి శరన్నవరాత్రులు. ఈ రోజుల్లో గనక అమ్మవారిని పూజిస్తే సకల శుభాలు కలుగుతాయి.
ఈ దుర్గాదేవి అమ్మవారికి ప్రతి సంవత్సరము దసర నవరోత్సవాలు జరుగుతాయి. ఈ దసర నవరోత్సవల లో ప్రతి దినము ఒక అవతారముతో దర్శనము ఇస్తారు. ఈ తొమ్మిది దినములు తొమ్మిది అవతారాలతో దర్శనము ఇస్తారు.
మొదటి రోజు : స్వర్ణ కవచాలంకార దుర్గ దేవి
రెండవ రోజు : బాల త్రిపురసుందరి దేవి
మూడవ రోజు : గాయత్రి దేవి
నాలుగవ రోజు : అన్నపూర్ణా దేవి.
ఐదవ రోజు : లలితా త్రిపురసుందరి దేవి
ఆరవ రోజు : సరస్వతి దేవి
ఏడవ రోజు : దుర్గాదేవి
ఎనిమిదవ రోజు : మహాలక్ష్మిదేవి
తొమ్మిదవ రోజు : మహిషాసురమర్దిని
పదవ రోజు : రాజరాజేశ్వరి దేవి
ఈ ఐదవ రోజున జరిగే సరస్వతి అమ్మవారి అలంకరణ రోజు అమ్మవరి జన్మనక్షత్రంగా అనగా మూలానక్షత్రం గా భావిస్తారు. ఆ రోజు వేలాది మంది భక్తులు, విద్యార్థులు తరలివస్తారు.
ఈ దేవాలయంలో వినాయక స్వామి, ఈశ్వరుడు, శ్రీ రాము ల వారు కొలువుతీరి ఉన్నారు. ఈ దేవాలయాన్ని దర్సించుటకు అనేక మంది భక్తులు అనేక ప్రదేశాల నుండి వస్తారు.

ప్రధాన పండుగలు: దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు, కనకదుర్గమ్మ గాజుల ఉత్సవం, శ్రావణ మాసం పూజలు మరియు భవాని దీక్ష విరమణలు అత్యంత వైభవంగా జరుగుతాయి.
ప్రసాదం: ఇక్కడి లడ్డు ప్రసాదం మరియు ఉచిత అన్నప్రసాదం ఎంతో ప్రసిద్ధి చెందాయి.
సమయాలు & దర్శన వివరాలు:
ఆలయ సమయాలు: ప్రతిరోజూ ఉదయం 4:00 నుండి రాత్రి 10:00 వరకు
సమయాలు & దర్శన వివరాలు:
ఆలయ సమయాలు: ప్రతిరోజూ ఉదయం 4:00 నుండి రాత్రి 10:00 వరకు
దర్శన రకాలు: ధర్మ దర్శనం (ఉచితం), ముఖమండప దర్శనం, శీఘ్ర దర్శనం మరియు అంతరాలయ దర్శనం అందుబాటులో ఉన్నాయి.
కొండపైకి వెళ్ళే మార్గాలు:
ఇంద్రకీలాద్రి కొండపై ఉన్న ప్రధాన ఆలయానికి చేరుకోవడానికి కింద రథం సెంటర్ వద్ద నుండి రవాణా ఏర్పాట్లు ఉన్నాయి:
దేవస్థానం ఉచిత బస్సులు: కొండ కింద పుష్కర్ ఘాట్ లేదా మెట్ల మార్గం వద్ద నుండి కొండపైకి భక్తులను చేరవేయడానికి దేవస్థానం ఉచిత బస్సు సర్వీసులను నడుపుతోంది.
లిఫ్ట్ సౌకర్యం (Lifts & Steps): మెట్లు ఎక్కలేని వృద్ధులు మరియు వికలాంగుల కోసం కింద నుండి నేరుగా కొండపైకి వెళ్లేందుకు పెద్ద పెద్ద లిఫ్టుల (Elevators) సౌకర్యం కూడా కల్పించారు.
సొంత వాహనాలు: మీ సొంత కారు లేదా బైక్ ద్వారా ఘాట్ రోడ్డు మీదుగా కొండపైకి వెళ్ళవచ్చు. అయితే పండుగ రోజుల్లో లేదా రద్దీ ఎక్కువగా ఉన్నప్పుడు కొండపైకి ప్రైవేట్ వాహనాలను అనుమతించరు. కొండ కింద మరియు సీతమ్మ వారి పాదాల వద్ద దేవస్థానం వారి పెయిడ్ పార్కింగ్ (Paid Parking) స్థలాలు అందుబాటులో ఉన్నాయి.
రవాణా మార్గాలు:
రోడ్డు మార్గం: ఆసియాలోనే పెద్ద బస్ స్టాండ్లలో ఒకటైన పండిట్ నెహ్రూ బస్ స్టేషన్ (PNBS - Bus Stand). ఇది ఆలయానికి కేవలం 1 నుండి 3 కిలోమీటర్ల పరిధిలోనే ఉంటుంది. ఇక్కడి నుండి కూడా ఆర్టీసీ లోకల్ సిటీ బస్సులు, దేవస్థానం వారి ప్రత్యేక బస్సులు నిరంతరం నడుస్తూ ఉంటాయి.
రైలు మార్గం: విజయవాడ జంక్షన్ రైల్వే స్టేషన్ (Railway Station). ఆలయానికి కేవలం 4 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఇక్కడి నుండి ప్రతి 20 నిమిషాలకు ఆలయ దేవస్థానం వారి ఉచిత/కనీస చార్జీల బస్సులు నడుస్తాయి. ఇవి కాకుండా షేర్డ్ ఆటోలు, ప్రైవేట్ ఆటోలు మరియు బైక్ టాక్సీలు (Ola, Rapido) ఎప్పుడూ అందుబాటులో ఉంటాయి.
వాయు మార్గం: గన్నవరం ఎయిర్పోర్ట్, ఆలయానికి సుమారు 20 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఎయిర్పోర్ట్ నుండి నేరుగా ఆలయానికి చేరుకోవడానికి ప్రీపెయిడ్ టాక్సీలు, ఓలా (Ola), ఉబెర్ (Uber) క్యాబ్‌లు సులభంగా దొరుకుతాయి.

No comments:
Post a Comment