Tuesday, October 20, 2026

Mundeshwari Temple, Kaura, Kaimur District, Bihar - ముండేశ్వరీ ఆలయం, కౌరా, కైమూర్ జిల్లా, బీహార్

ముండేశ్వరీ ఆలయం, కౌరా, కైమూర్ జిల్లా, బీహార్

ప్రపంచంలో అత్యంత ఎక్కువ ఆలయాలు, కట్టడాలు ఉన్న దేశం మనది. మతపరమైన నిర్మాణాలు కూడా మన దగ్గరే అధికంగా ఉన్నవి. అలాంటి కట్టడాలను చూడడానికి ప్రపంచం నలుమూలల నుంచి పర్యాటకులు, భక్తులు వస్తుంటారు. ఎంతో పురాతన నేపథ్యం ఉన్న కట్టడాలు కూడా నిర్లక్ష్యం వల్ల భూస్థాపితమయ్యాయి. కొన్ని మాత్రం ఇప్పటికీ సజీవంగా చెక్కు చెదరకుండా ఉన్నాయి. అలాంటి వాటిలో ఈ ఆలయం కూడా ఒకటి.

భారతదేశంలోని మొట్టమొదటి అత్యంత పురాతనమైనది దుర్గామాత శక్తి ఆలయం. మరి భారతదేశంలోని పూజాదికాలు నిర్వహించే అత్యంత పురాతన ఆలయాలలో ఇది ప్రధమంగా పేర్కొవచ్చు. 

ఇది బీహార్లో కైమూర్ జిల్లాలోని కౌరా ప్రాంతంలోని ముండేశ్వరీ ఆలయం. ఇది ప్రపంచంలోనే అతి పురాతనమైందని చరిత్రకారుల అంచనా. మూడు, నాలుగు శతాబ్దాల కాలంలో దీన్ని నిర్మించారని చెప్తుంటారు. మొదట విష్ణు భగవానుడు మాత్రమే ఇక్కడ కొలువై ఉన్నాడు. ఏడవ శతాబ్దంలో శివుని విగ్రహాన్ని కూడా పెట్టారు. ఈ ఆలయం సముద్రమట్టానికి 608 అడుగుల ఎత్తులో ఉన్నది. ఇది వారణాసికి 60 కిలోమీటర్ల దూరంలో ఉన్నది.

మా ముండేశ్వరి దేవి ఆలయం శివుడు మరియు శక్తికి అంకితం చేయబడింది మరియు ముండేశ్వరి కొండలలో ఉంది. దీనిని భారతదేశంలోని పూజాదికాలు జరపబడుతున్న అత్యంత పురాతన ఆలయంగా పేర్కొనవచ్చును. దుర్గాదేవి వైష్ణవి రూపంలో ఇక్కడ ముండేశ్వరి మాతగా దర్శనమిస్తుంది. ముండేశ్వరి మాత చూడటానికి కొంత వరకూ వరాహి మాతగా కనిపిస్తుంది. ఇక్కడ అమ్మవారి వాహనం మహిషిడు. అమ్మవారి దేవాలయం నాగార శైలికి చెందిన అరుదైన అష్టభుజి దేవాలయం. దక్షిణ దిశలో అమ్మవారి ప్రధాన ఆలయ ద్వారం ఉండటం గమనార్హం.

ఇక్కడ అహింసా పద్ధతిలో పూజా కార్యక్రమాలు జరుగుతాయి. జంతుబలి ఉన్నప్పటికీ, మేకకు ఎలాంటి హాని జరగకుండా అమ్మవారి ముందు పసుపు అక్షింతలు వేసి కేవలం స్పృశించి వదిలేసే విచిత్రమైన సాంప్రదాయం ఇక్కడ ఉంది.

ఆలయ చరిత్ర:
ఇక్కడ నిరంతరాయంగా క్రతువులు నిర్వహించబడుతున్నందున, ఈ ఆలయాన్ని ప్రపంచంలోనే 'అత్యంత పురాతనమైన, క్రియాశీలకమైన' ఆలయంగా పరిగణిస్తారు.

మా ముండేశ్వరి దేవి ఆలయం శివశక్తులకు ఎంతో పవిత్రమైన ఆలయం. ఇది ముండేశ్వరి కొండలలో నెలకొని ఉంది. ఈ ఆలయంలో గణేశుడు, సూర్యుడు మరియు విష్ణువుల విగ్రహాలు కూడా ఉన్నాయి. భారత పురావస్తు శాఖ (ASI) ఈ ఆలయాన్ని క్రీ.శ. 108 నాటిదిగా పేర్కొంది. ఇది 1915 నుండి సంరక్షిత స్మారక చిహ్నంగా ఉంది. ముండేశ్వరి ఆలయం నాగరా ఆలయ నిర్మాణ శైలికి చెందిన అత్యంత పురాతన నమూనా.

క్రీ.శ. ఏడవ శతాబ్దం నాటికి, శైవమతం ప్రబలమైన మతంగా మారింది మరియు అప్పటికి ఉప దైవంగా ఉన్న వినీతేశ్వరుడు ఆలయ ప్రధాన దైవంగా ఆవిర్భవించాడు. ఆయనకు ప్రతీకగా నిలిచే చతుర్ ముఖలింగానికి (నాలుగు ముఖాలు గల లింగం) ఆలయంలో ముఖ్య స్థానం కల్పించారు, అది నేటికీ అదే స్థానంలో ఉంది.

ఈ కాలం తరువాత, కైమూర్ కొండల యొక్క అసలైన నివాసులు మరియు శక్తివంతమైన ఆదిమవాసులైన చేరలులు అధికారంలోకి వచ్చారు. చేరలు శక్తి ఆరాధకులు, మహేశ్వర్దిని మరియు దుర్గ అని కూడా పిలువబడే ముండేశ్వరి రూపంలో శక్తిని ఆరాధించేవారు. ముండేశ్వరిని ఆలయానికి ముఖ్య దేవతగా చేశారు. 

అయినప్పటికీ, ఆలయంలో చతుర్ ముఖలింగం ముఖ్య స్థానాన్ని ఆక్రమించింది. అందువల్ల, దుర్గా విగ్రహాన్ని ఆలయ గోడల పక్కన ఉన్న ఒక గూడలో ప్రతిష్టించారు, అది ఈనాటికీ అక్కడే ఉంది. అయితే చతుర్ ముఖలింగం ప్రథాన స్థానంలో ఉన్నప్పటికీ, ఉప దేవతగా నిలిచి ఉంది.

ఇక్కడ ఆచారాలు, పూజలు నిరంతరాయంగా జరిగాయని నమ్ముతారు; అందుకే ముండేశ్వరి ప్రపంచంలోని అత్యంత పురాతన హిందూ దేవాలయాలలో ఒకటిగా పరిగణించబడుతుంది. 

ముండేశ్వరి ఆలయంలో శ్రీ రామనవమి మరియు శివరాత్రి పండుగలు ఘనంగా జరుగుతాయి ఉంటాయి. ప్రతి సంవత్సరం పెద్ద సంఖ్యలో యాత్రికులు ఈ ఆలయాన్ని సందర్శించి, దాని ఆధ్యాత్మిక వైభవాన్ని అనుభూతి చెందుతారు.

ఈ ఆలయం నాగరశైలిలో నిర్మించబడి వుంది. ఈ ఆలయంలో అమ్మవారు 10 చేతులతో ఎద్దు పైన స్వారీ చేస్తూ మహిషాసురమర్ధిని రూపంలో వుంటుంది. ఇక్కడ శివుడు కూడా 4 ముఖాలతో వుంటాడు.

ఈ ఆలయంలో సూర్యుడు, వినాయకుడు, విష్ణుమూర్తి ప్రతిమలు కూడా వున్నాయి.ఆ కాలంనుండి ఇక్కడ పూజాదికాలనేవి కొనసాగుతూ రావటం అనేది ఎంతో ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. శతాబ్దాలు మారినా పూజాకార్యక్రమాలు మాత్రం కొనసాగుతూనే వున్నాయి.

చైత్రమాసంలో ఈ ఆలయాన్ని సందర్శించటానికి అధికసంఖ్యలో పర్యాటకులు వస్తూవుంటారు. ఈ ఆలయంలో ప్రధాన విశేషం సాత్విక బలి. అంటే ఇక్కడ మొదట బలి ఇవ్వాల్సిన మేకను అమ్మవారి విగ్రహం ముందుకు తీసుకువస్తారు. అటు పై పూజారి మంత్రించిన అక్షింతలను మేక పై వేస్తారు. దీంతో మేక కొన్ని క్షణాల పాటు సృహతప్పి పడిపోతుంది. అటు పై మరోసారి పూజారి అక్షింతలను మేక పై వేస్తాడు. దీంతో ఆ మేక మరలా యథా స్థితికి వచ్చి అక్కడి నుంచి వెళ్లిపోతుంది.

ఆరాధన సమయాలు: ఈ ఆలయం ప్రతిరోజూ ఉదయం 6:00 నుండి సాయంత్రం 7:00 గంటల వరకు తెరిచి ఉంటుంది.

సందర్శించడానికి ఉత్తమ సమయం: సెప్టెంబర్ నుండి ఏప్రిల్ వరకు.

రవాణా సోకార్యాలు:

రోడ్డు మార్గం : వారణాసికి సుమారు 120 కి.మీ, పాట్నాకు 175 కి.మీ దూరంలో ఈ ఆలయం ఉంది.

రైలు మార్గం: సమీప రైల్వే స్టేషన్ భభువా రోడ్ (Mohania-Bhabua Road Station) - ఇక్కడ నుండి ఆలయం సుమారు 22 కి.మీ దూరంలో ఉంది.

వాయుమార్గం: వారణాసి మరియు పాట్నా వరకు విమాన సోకార్యం కలదు. అక్కడి నుండి రోడ్డు మార్గం లో బస్సు మరియు అందుబాటులో ఉంటాయి.

మన దేవాలయాలు చారిత్రక నగరాలూ

No comments:

Post a Comment

Mundeshwari Temple, Kaura, Kaimur District, Bihar - ముండేశ్వరీ ఆలయం, కౌరా, కైమూర్ జిల్లా, బీహార్

ముండేశ్వరీ ఆలయం,  కౌరా,  కైమూర్ జిల్లా,  బీహార్ ప్రపంచంలో అత్యంత ఎక్కువ ఆలయాలు, కట్టడాలు ఉన్న దేశం మనది. మతపరమైన నిర్మాణాలు కూడా మన దగ్గరే అ...