మంగళవారం సుబ్రహ్మణ్య స్వామి
పార్వతీపరమేశ్వరుల తనయుడైన సుబ్రహ్మణ్య స్వామి సకల శుభకారకుడు. సర్వ దోష నివారకుడు. ఈ స్వామిని తొమ్మిది వారాల పాటు నియమనిష్టలతో ఆరాధిస్తే కుజ దోషాలు పోతాయి. ముఖ్యంగా కుజుడు వివాహం, సంతాన కారకుడు. కాబట్టి వివాహం ఆలస్యమయ్యే వారు, సంతానం కోసం ఎదురు చూసే వారు సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధిస్తే శీఘ్రంగా వివాహం అవుతుంది, చక్కని సంతానం కలుగుతుంది.
క్షీరాభిషేకం: ఆ స్వామికి ముందుగా మన సంకల్పం చెప్పుకుని ఎవరు వివాహం లేదా సంతానాన్ని కోరుకుంటున్నారో వారి పేరు, జన్మ నక్షత్రం మీద మంగళవారం నాడు సుబ్రహ్మణ్యునికి క్షీరాభిషేకం జరిపిస్తే మంచిది.
కుజ గ్రహానికి ఎరుపు రంగు సంకేతం కాబట్టి సుబ్రహ్మణ్య స్వామికి ఎరుపు రంగు వస్త్రం, ఎర్రని పూలు, ఎర్ర చందనం, దానిమ్మ పండు వంటివి నైవేద్యంగా సమర్పిస్తే మంచిది.
ఇలా తొమ్మిది మంగళవారాలు జరిపించిన అనంతరం వచ్చే కృత్తికా నక్షత్రం రోజున కానీ, శుద్ధ ష్షష్ఠి రోజున శ్రీవల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామి కల్యాణం జరిపించుకుంటే సకల దోషాలు పోయి అనుకున్న పనులు నెరవేరుతాయి.
అలాగే సమీపంలో ఉన్న ఏ దేవాలయంలోనైనా నాగ ప్రతిష్ఠ ఉంటే ముఖ్యంగా రావిచెట్టు కింద నాగ ప్రతిష్ఠ ఉన్నట్లయితే ఇక్కడ కూడా ప్రతి మంగళవారం క్షీరాభిషేకం చేస్తే సుబ్రహ్మణ్యుని పూజించిన ఫలితమే వస్తుంది. సుబ్రహ్మణ్యుని విభూతి ధరించడం వలన సకల గ్రహ దోషాలు, పీడలు తొలగిపోతాయి.
Subscribe to:
Post Comments (Atom)
Tuesday Subrahmanya Swamy - మంగళవారం సుబ్రహ్మణ్య స్వామి
మంగళవారం సుబ్రహ్మణ్య స్వామి పార్వతీపరమేశ్వరుల తనయుడైన సుబ్రహ్మణ్య స్వామి సకల శుభకారకుడు. సర్వ దోష నివారకుడు. ఈ స్వామిని తొమ్మిది వారాల పాటు...
-
సూర్య ద్వాదశ నామాలు ధ్యేయః సదా సవితృమండలమధ్యవర్తీ నారాయణః సరసిజాసన సన్నివిష్టః । కేయూరవాన్ మకరకుండలవాన్ కిరీటీ హారీ హిరణ్మయవపుః ధృతశంఖచక్రః ...
-
నిత్య పారాయణ శ్లోకాలు స్తోత్రాలు నవ గ్రహ స్తోత్రం సుబ్రహ్మణ్యాష్టకం ఆదిత్యహృదయం కనకధారా స్త్రొత్రమ్ దుర్గాసప్తశ్లోకీ శ్రీ సరస్వతీ కవచం తోటకా...
-
ఆదిత్యహృదయం తతో యుద్ధపరిశ్రాంతం సమరే చింతయా స్థితమ్ | రావణం చాగ్రతో దృష్ట్వా యుద్ధాయ సముపస్థితమ్ || 01 || దైవతైశ్చ సమాగమ్య ద్రష్టుమభ్యాగతో ...
No comments:
Post a Comment