ఇంట్లో తాబేలు బొమ్మ ఉంచితె వాస్తు ప్రకారం శుభప్రదం. అయితే ఎలాంటి తాబేలు ఉంచాలి, ఏ దిశలో ఉంచాలి తెలుసుకోండి. పురాణాల ప్రకారం, తాబేలును కూడా మహా విష్ణువు రూపంగా పరిగణిస్తారు. శ్రీ మహావిష్ణువు కూర్మావతార రూపంలో వచ్చి తన అద్భుత మహిమలను ప్రదర్శించినట్లు గ్రంథాలలో ఉంది. అందుకే ఇంట్లో, పూజ గదిలో తాబేలు బొమ్మ ఉంచుకోవడం చాలా ప్రాముఖ్యతను కలిగి ఉంది. ఇంట్లో అందం కోసం పెట్టుకునే తాబేలు విగ్రహానికి కూడా వాస్తు శాస్త్రంలో, ఫ్నెగ్ షుయ్‌లో కూడా కొన్ని నియమాలు ఉన్నాయి.
వాస్తు శాస్త్రం ప్రకారం తాబేలు చిహ్నంను ఇంట్లో ఉంచితే ఆర్థిక సమస్యలు దూరమై సంపదలు పెరుగుతాయని చాలా మంది నమ్మకం. అంతేకాదు తాబేలు ఇంట్లో సానుకూల శక్తి ప్రసరణను పెంచుతుంది. ప్రతికూల శక్తిని దూరంగా ఉంచుతుంది. అంతేకాదు వాస్తు శాస్త్రం ప్రకారం ఇంట్లో తాబేలు విగ్రహాన్ని ఉంచడం వల్ల వాస్తు దోషాలు కూడా తొలగిపోతాయి. తాబేలు విగ్రహం ఇంటికి రక్షణ కవచంగా పనిచేస్తుంది.
అయితే ఇంట్లో తాబేలు చిహ్నాలు ఉంచాలనుకునే వారు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి లేకుంటే మీ ఇంట్లో సంతోషానికి బదులు సమస్యలు వస్తాయి.
ఇంట్లో తాబేలు చిహ్నం ఉంచడం ఎల్లప్పుడూ శుభప్రదంగా పరిగణించవచ్చు. ముఖ్యంగా పౌర్ణమి రోజున తాబేలును ఇంటికి తీసుకురావాలి. ఆ రోజు తాబేలును పాలలో కాసేపు ఉంచాలి. అభిజిత్ ముహూర్తం నాడు, ఈ తాబేలును పాల నుండి తీసివేసి నీటితో కడగాలి. ఆ తర్వాత ఒక పాత్రలో కొంత నీరు తీసుకుని అందులో తాబేలు చిహ్నంను ఉంచండి. ఇలా చేయడం వల్ల మీ ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ వ్యాపిస్తుంది. స్తోమతను బట్టి బంగారం, వెండి, వజ్రం, రాగి తాబేళ్లను ఇంట్లో ఉంచుకోవచ్చు.

తాబేలు ఉంచడానికి ఉత్తమ రోజు: బుధ, గురు, శుక్రవారాలు ఇంట్లో తాబేలు విగ్రహాలను ఉంచేందుకు అనువైన రోజులుగా భావిస్తారు. తాబేలు విగ్రహానికి కుంకుమ లేదా పసుపు పువ్వులను సమర్పించండి. ప్రతిరోజూ తాబేలు విగ్రహంపై ఒక తులసి దళాన్ని ఉంచడం శుభసూచకం.
తాబేలు చిహ్నం దిశ:
తాబేలు జలచరాలు కాబట్టి ఈశాన్య దిశలో ఉంచాలి. ఆ తర్వాత 'ఓం శ్రీం కూర్మై నమః' అనే మంత్రాన్ని 11 సార్లు జపిస్తే మంచి ఫలితాలు వస్తాయి. మీరు మీ ఇంట్లో శాంతి, సామరస్యాన్ని కోరుకుంటే, మీ గది తూర్పు భాగంలో తాబేలు ఉంచండి. ఇలా చేయడం వల్ల మీ కుటుంబ జీవితంలో సంతోషం కలుగుతుంది. కానీ ఎల్లప్పుడూ లోహపు తాబేలును నీటిలో ఉంచాలని గుర్తుంచుకోండి. వీటితో పాటు కొన్ని రంగు రాళ్లను కూడా వేయవచ్చు. దీంతో మానసిక ప్రశాంతత లభిస్తుంది. మీ ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది.

తాబేలు విగ్రహాన్ని ఎక్కడ ఉంచాలంటే.. పిల్లలు చదువులో ఏకాగ్రత పెంచాలంటే తాబేలు విగ్రహాన్ని ఉంచడం శుభప్రదంగా భావిస్తారు. దీనిని పిల్లల గదిలో ఉంచవచ్చు. ప్రధాన ద్వారం దగ్గర తాబేలు విగ్రహాన్ని ఉంచడం కూడా ప్రయోజనకరంగా పరిగణించబడుతుంది.
తాబేలు ముఖం ఎల్లప్పుడూ లోపలి వైపు (ఇంటి లోపలికి) చూస్తున్నట్లుగా పెట్టాలి.
అయితే ఇంట్లో తాబేలు ఎప్పుడూ నోరు తెరిచి ఉంచకూడదు. అలా ఉంచడం వల్ల ఇంట్లో ప్రతికూల ఫలితాలు వస్తాయి. అలాంటి తాబేలును ఇంట్లో ఉంచడం వల్ల మీ కుటుంబంలో కలహాలు, అశాంతి, ఆర్థిక సమస్యలు వస్తాయని గుర్తుంచుకోండి.
క్షీర సాగర మథనం సమయంలో తాబేలు ఉద్భవించిందని నమ్ముతారు. లోహపు తాబేలును ఇంట్లో ఉంచడం వాస్తులో చాలా శుభప్రదంగా పరిగణిస్తారు.

తాబేలు రకాలు మరియు ప్రయోజనాలు:
నీటిలో తాబేలు: పూజా గదిలో ఒక చిన్న ఇత్తడి లేదా రాగి పాత్రలో నీరు పోసి, అందులో తాబేలు ప్రతిమను ఉంచడం వల్ల సిరిసంపదలు వృద్ధి చెందుతాయి.
మెటల్ తాబేలు: ఇత్తడి, రాగి లేదా వెండితో చేసిన తాబేళ్లు కెరీర్ వృద్ధికి మరియు వ్యాపార అభివృద్ధికి దోహదపడతాయి. మెటల్ తాబేలు సంపదను సూచిస్తుంది. కెరీర్ వృద్ధిని కోరుకుంటే మెటల్ తాబేలును ఆఫీసులో ఉంచడం మంచిది. ఉత్తర దిశలో తాబేలును ఉంచడం మంచిది.
క్రిస్టల్/స్పటిక తాబేలు: దీన్ని ఇంట్లో ఉంచడం వల్ల మానసిక ప్రశాంతత లభిస్తుంది.
పిల్లలున్న తాబేలు: ఒకటి ఆడ తాబేలు, పిల్లలు. ఇలా ఉన్న తాబేలు కుటుంబానికి ప్రతీకగా పరిగణించబడుతుంది. ఒక పెద్ద తాబేలు వీపుపై చిన్న తాబేలు ఉన్న విగ్రహాన్ని ఉంచడం వల్ల సంతాన ప్రాప్తి కలుగుతుందని నమ్ముతారు. పిల్లతో ఉన్న తాబేలును ఇంట్లో పెట్టుకుంటే కుటుంబ సభ్యుల మధ్య వివాదాలు తలెత్తకుండా సహాయపడుతుంది.
చెక్క తాబేలు: వాస్తు శాస్త్రం ప్రకారం, తూర్పు లేదా ఆగ్నేయ మూలలో చెక్క తాబేలును ఉంచడం వల్ల ఇంటిలోని అన్ని ప్రతికూల శక్తులు తొలగిపోతాయి. ఇది స్నేహితులు, కుటుంబ సభ్యుల జీవితాలను ఆనందం, మంచి కర్మ, సాధనతో నింపుతుంది.
తాబేలు గిన్నె: మీరు ఒక గిన్నెలో నీటితో తాబేలును ఉంచినట్లయితే, తాబేలు గిన్నెలో వేసిన నీటిని ప్రతిరోజూ మార్చాలి.
No comments:
Post a Comment