సప్తమ భావమందున్న గ్రహ ఫలితాలు
01. జన్మ లగ్నము నుండి ఏడవ స్థానము సప్తమ భావము! ఇదే కళత్ర భావము! దీనిని "అస్తమయ కేంద్రము", "వివాహ స్థానము" ననియు నందురు.
02. సప్తమ భావమునకు ప్రధాన కారక గ్రహం శుక్రుడు.!
03. సప్తమ భావము ద్వారా జాతకుని యొక్క వివాహము, భార్య, భర్త, దాంపత్య సౌఖ్యము, భార్యాభర్తల అన్యోన్యము, మోహము, రేతస్సు(ఇంద్రియపుష్టి), ఇంద్రియములు, కామము, సంసారము, విహారము, పాతివ్రత్యమును, భార్య లేక భర్త యొక్క మృతి, స్త్రీ-పురుషులతో కలహములు, మృష్ఠాన్న భోజనాదులు, తాంబూల-సుగంధ ద్రవ్య-అలంకార శయ్యా సౌఖ్యములు, కీర్తి-అపకీర్తి, ఆట-పాటలు, వర్తక-వాణిజ్యాదులు, భాగస్వామ్యములు, క్రయ-విక్రయములు, కోర్టు వ్యవహారములు, తగాదాలు, నష్టదనము, దత్తపుత్రులు, గాన-సంగీత-నృత్య-నాటకాది చతుషష్టి కళలు, రహస్య విషయములు, దొంగతనము, అప్పులిచ్చుట, వడ్డీ వ్యాపారము, దానము, ప్రయాణ విఘ్నములు, త్రోవ తప్పుట, ఉద్యోగము, పశుసంపద, శత్రువిజయము, వ్యసనాలంపట, వ్యభిచారము, దంతములు, నాభి, స్త్రీల మర్మావయవములు, స్థనములు, లింగము, నిగూఢవర్తనము అను ఫలితములను గురించి తెలియదగుయున్నది.
04. సప్తమ భావమునకు- శుభ గ్రహములు అధిపతులగుట వలన వారు ఆధిపత్య పాపులగుదురు. పాపగ్రహముల కాధిపత్యము కలిగినవారు- ఆధిపత్య శుభులు కాగలరు. నైసర్గిక శుభగ్రహములు (శుక్రుడు తప్ప) భావము నందుండుట మంచిది.
05. సప్తమ భావము నందు రవియున్న- చంచలత్వము, స్వల్ప సౌఖ్యము, చెవుడు, విఫలత్వము, స్త్రీ వియోగము, అనారోగ్యములు, భార్యకు దౌర్భాగ్యము, పాపకార్యాసక్తి కలుగ గలవు.
06. సప్తమ భావమందు చంద్రుడున్న- శరీరకాంతి, చక్కని దేహము, పరస్త్రీ సంఘమము లుండగలవు. క్షీణచంద్రుడున్న- రోగ శరీరము, పనికిమాలిన భార్య, కళత్ర అనారోగ్యము లుండగలవు.
07. కుజుడు సప్తమమందున్న- విరహము, బావనష్టము లుండగలవు. చంద్రుని కలయిక వలన- ఆర్తి, విద్యావిహీనత, భయంకర స్వభావము లుండగలవు.
08. బుధుడు సప్తమ స్థానమందున్న- యుక్తాయుక్త పరిజ్ఞానము, కాముకత్వము, అల్పమైన రతి సౌఖ్యము, ధనము, తెలివిగల భార్య, కొలహీనత యగుదానితో సంబంధము, పుత్రులు, సువర్ణ-ధన-భాగ్యములు కలుగ గలవు.
09. సప్తమ స్థానంలో గురువున్న- నమ్రత, శాస్త్రాసక్తి,, మంచి యోచన, విద్యా-వినయ-రూప-శీలములు, మంచి భార్య, మాట పొందిక, వకృత్వ శక్తి, దాతృత్వము, సమర్ధత, ఖ్యాతి కలుగగలవు.
10. శుక్రుడు సప్తమ స్థానమందున్న- సౌందర్య స్త్రీలయందు మోజు, జారత్రము, అనేక వివాహములు, పుత్రసంతతి, గొప్ప వంశము, పేరు-ప్రతిష్టలు, విశేష ధన-భాగ్యములు ప్రాప్తించగలవు.
11. సప్తమ స్థానంలో శనియున్న- అందము, బలము లేకపోవుట, స్త్రీ గృహ-ధాన్యా లోపము, జీర్ణావస్త్రధారణ, దుర్జన సహావాసము, నీచత్వము, జారత్వము, వ్యసన లంపటము, అధిక వయస్సు గల భార్య, వృద్ధ స్త్రీ సంపర్కము, కళత్ర నష్టములు కలుగగలవు.
12. రాహువు సప్తమమందున్న- అమాయకురాలైన భార్య, చెడుబుద్ధులు, రోగకళత్రము, సంతానహీనత, నీచ స్త్రీ సంపర్కము, వ్యభిచారము, రెండవ వివాహము, కళత్ర నష్టములు కలుగును.
13. సప్తమంలో కేతువున్న- శోకము, జలగండము, దైవభక్తి, తెలివి తేటలు గల భార్య, పాపకార్యాసక్తి, కాముకత్వము కాలత్రానురాగము, భార్య వినియోగ దుఃఖము, ధనహాని ప్రాప్తించగలవు.
వివాహ యోగములు
01. వివాహమునకు శుక్రుని బలాబలములు ముఖ్యము! మరియు లగ్నా చతుర్థి దశమ భావాధిపతులు- వారి బలాబలములు కూడా చూడవలెను.
02. లగ్నాధిపతి, సప్తమాధిపతి, నవమాధిపతి, గురువు, శుక్రుడు అను వారిలో అధిక బలము గల గ్రహ దశయందు- వివాహము కాగలదు.
03. సప్తమాధిపతి శుభారాశి యందుండి వివాహ కారక గ్రహము స్వక్షేత్ర-ఉచ్చ క్షేత్రములందున్న- 9 వ సంవత్సరంలో బాల్యవివాహము కాగలదు.
04. శుక్రుడు సప్తమాధిపతి కలిసియుండి, సప్తమంలో రవియుండిన బాల్య వివాహము జరుగును.
05. సప్తమాధిపతి బలమగు స్థానము నందుండి, ద్వితీయంలో శుక్రుడున- 10-16 సంవత్సరముల మధ్య వివాహము కాగలదు.
06. 1-4-7-10 స్థానములలో శుక్రుడుండి, ఆ శుక్రునికి సప్తమ రాశిలో చంద్రుడున్న- 12 నుండి 19 సంవత్సరముల లోపు వివాహమగును.
07. సప్తమ స్థానంలో గురువుకుఉచ్చ-స్వక్షేత్ర, మిత్రక్షేత్ర స్థితి కలిగిన బాల్య వివాహము జరుగును.
08. ద్వితీయాధిపతి 11 వ స్థానమందు 7 వ స్థానాధిపతి 2 వ స్థానమందు ఉన్న 15 వ సంవత్సరములో వివాహమగును.
09. లగ్న-అష్టమాధిపతులతో శుక్రుడు కలిసియున్న- 15వ సంవత్సరంలో వివాహము జరుగును.
10. చంద్ర లగ్నమునకు 7 వ రాశియందు శుక్రుడుండి, ఆ ఏడవ రాశ్యాధిపతియున్న రాశినుండి 7 వ రాశియందు శనియున్న- 18 వ సంవత్సరంలో వివాహయోగము.
11. శుక్రునికి కేంద్ర స్థితి కలిగియుండి, ఆ కేంద్రాధిపతి 11వ స్థానమందున్న- 20-25 సంవత్సరములందు వివాహం జరుగును.
12. ద్వితీయాధిపతి, కుజుడూ కలిసియుండి; ద్వితీయమందు శుక్రుడున్న- 22 లేక 27వ సంవత్సరంలో వివాహమగును.
13. సప్తమాధిపతి సప్తమమందుండి, శుక్రుడు 7-9 స్థానములందున్న- 27 లేక 30 వ సంవత్సరమునందు వివాహము జరుగును.
14. లగ్నాధిపతి, శుక్రుడు కలిసియుండి; అష్టమాధిపతి 8వ స్థానమందున్న- 23, 25వ సంవత్సరమునందు వివాహ యోగము కలుగును.
15. ద్వితీయంలో రాహువు, తృతీయంలో శుక్రుడుండిన- 31 లేక 34 సంవత్సరములందు వివాహమగును.
16. సప్తమాధిపతి, లగ్నాధిపతీ, శుక్రుడు స్థిరరాశుల యందుండి; చంద్రుడు క్షీణభలము కలిగి, చరరాశియందున్న- వివాహము 30 సంవత్సరములు వరకు జరగదు.
17. పై విధముగా గ్రహ స్థితియందు శుక్ర-సప్తమాధిపతులకు శని యొక్క దృష్టి కలిగిన- లేక లగ్నాధిపతి, శుక్రులతో-శని కలిసిన 50 సంవత్సరముల వరకు వివాహ యోగము కలుగదు.
18. లగ్నమందు అష్టమాధిపతియున్న- మూడు వివాహములు కాగలవు.
19. సప్తమ భావమునందు చంద్రుడున్నను, భావమును జూచినను- వివాహయోగములు కొన్ని తప్పిపోయి; తదుపరి ఫలించగలవు.
20. సప్తమస్థాన, స్థానాధిపతులకు రవి-శని సంబంధములు కలిగినను, లేక మకర-కుంభములందు శుక్రుడునను- వివాహము ఆలస్యమగును.
21. కారకాంశ లగ్నమునుండి 2-4 స్థానములందు బుధుడుండిన యెడల వివాహము కాదు (రాశి చక్రంలో అధిక భాగం గతించిన గ్రహము నవాంశలో ఏ రాశియందున్న ఆ రాశి కారకాంశ లగ్నము).
22. సప్తమాధిపతి శుభగ్రహ సంబంధ రహితుడై, స్థానము బలరహితమై యుండి; సప్తమంలో ధూమగ్రహమున్న యెడల- వివాహము జరగదు.
23. ద్వితీయ-సప్తమాధిపతులు ఒకే రాశి యందు పాపగ్రహాములతో కలిసి ఉన్న- వివాహము జరుగుట దుర్లభము.
24. సప్తమాధిపతిగానీ, శుక్రుడుగానీ 8-12 స్థానములందుండగా; సప్తమంలో శనియున్న- వివాహము కానేరదు.
25. చంద్రుడు, వ్యాయాధిపతీ శత్రుగ్రహాములతో గలసి; నీచాంశల యందున్న- వివాహము కాదు.
26. 2-7-9-10 స్థానము లన్నిటియందు పాప గ్రహములున్న- వివాహముండదు.
27. ద్వీతీయభావమునకు, సప్తమభావమునకు పాపగ్రహార్గళము కలిగిన (ఇరువైపులా పాపగ్రహములుండుట)- వివాహయోగముండదు.
వివాహకాల దశాంతర్దశలు
1. పాపరాశులయందున్న (6-8-12) శుభగ్రహ దశల మధ్య కాలము వివాహము కలిగించగలదు.
02.సప్తమాధిపతియున్న రాశ్యంశాధిపతి గ్రహములు- శుక్ర-చంద్రులలో శుభాదిక గ్రహ దశాంతర్ధశలయందు- వివాహము జరుగగలదు.
03.శుక్రుడు, కళత్ర స్థానాధిపతి అను గ్రహములతో బలముగల గ్రహముతో కలిసియున్న- గ్రహ దశాంతర్ధశలయందు- వివాహమగును.
04.చంద్ర దశలో బుధ-అంతర్దశ, గురుదశలో-గురు అంతర్దశ, గురుదశలో-చంద్ర అంతర్దశ, బుద్ద దశలో-చంద్ర-బుధ-గురువు అంతర్దశలు; శుక్ర దశలో శుక్ర అంతర్దశల యందు- సామాన్యంగా వివాహయోగము ప్రాప్తిస్తుంది.
05.నవాంశ చక్రంలో లగ్నాధిపతియున్న రాశ్యాధిపతి యొక్క స్వక్షేత్రములందు, గోచార గురు సంచార కాలమునందు- వివాహము కాగలదు.
06.నవాంశ చక్రంలో సప్తమాధిపతి యున్న రాశికి 5-9 రాశులలో, గోచార గురువు సంచరించే కాలం- వివాహ సమయంగా ఉంటుంది.
07.జన్మ లగ్న, చంద్ర లగ్నములకు 1-4-7-10 రాశులలో గోచార గురిని సంచారకాలమునందు- వివాహమునుహించవలెను.
08.రాశి చక్రమందు- గురువున్న రాశికి 1-4-5-7-9-10 రాశులలో గోచార గురిని సంచార కాలమునందు- వివాహ యోగం ఉండగలదు.
09.లగ్నాధిపతి, సప్తమాధిపతియున్న రాశులలో గోచార గురుని సంచారకాలము- వివాహము జరుగుటకు దోహదపడగలదు.
10.జన్మలగ్నము నుండి 2-7 రాశులలో గోచార గురుని సంచార కాలము కూడ- వివాహము జరుగును.
11.లగ్నాధిపతితోగాని, సప్తమాధిపతితోగాని కలిసియున్న గ్రహముల యొక్క దశాంతర్ధశలయందు- భార్య ప్రాప్తించగలదు.
కళత్ర - రూప, శీలాది యోగములు
01.గురు,చంద్ర, శుక్రులు కలిసియున్నను, లేక చంద్ర, శుక్రులు కలసియుండి; వారికి గురుదృష్టి యున్నను- అందమైన భార్య లభించగలదు.
02.కర్కాటక రాశి సప్తమ స్థానమై, అందు కుజ-శనులు కలసియున్న- అందము, పాతివృత్యము గల భార్య ప్రాప్తించగలదు.
03.అంశ చక్రమునందు- సప్తమ స్థానంలో, చంద్ర-గురువులుండిన- రూపవతియకు భార్య లభించగలదు.
04.సప్తమ స్థానమందు బుధుడున్న- భార్య రూపసి కాగలదు, కళత్ర రాశికి బుధ సంబంధముండిన- భార్య చురుకుదనము, తెలివితేటలు కలిగి యదార్ధవాది కాగలదు.
05.సప్తమమున గురుడున్న- జాతకుని భార్య ధర్మ గుణశీల కాగలదు.
06.సప్తమాధిపతి కేంద్ర స్థానము లందుండి, శుభగ్రహ వీక్షితుడైన- వాని భార్య శీలవతియగును.
07.సప్తమాధిపతి శుభ నవాంశలయందున్న- భార్య శీలవతియుగను.
08.లగ్నాధిపతి బలవంతుడై యుండి, సప్తమంలో గురువుండి, శుక్రుడు చరరాశి యందున్న- అధిక సౌందర్యము గల భార్య ప్రాప్తించగలదు.
09.శుక్రునికి, సప్తమాధిపతికి గురుని సంబంధమున్న- భార్య ప్రతివ్రత కాగలదు.
10.సప్తమాధిపతి గురువై, వానికి బుధ-శుక్రుల సంబంధం ప్రాప్తించిన- పతివ్రతయకు భార్య లభించగలదు.
11.7 వ స్థానాధిపతి శుభగ్రములతో కలసి, శుభగ్రహ వీక్షితుడైయున్న- కళంక రహిత, సౌభాగ్యవతియకు భార్య ప్రాప్తించి; వివాహానంతరము ధన-భాగ్య-సంపదల నందగలడు.
12.గురువు 1-9-11 స్థానములందున్న- సత్కళత్రము కలుగును.
13.బలవంతుడగు సప్తమాధిపతి- శుక్రునితో గలసి 4-10 స్థానంముల యందున్న- సత్కళత్రము కలుగును.
14.జన్మ లగ్నమందు సప్తమాధిపతియుండి, ద్వితీయమున గురుడున్న- ఇరువురు భార్యలుండి అందు మొదటి భార్య పొడవు, స్థూల శరీరము గలదియు; రెండవ భార్య పొట్టిగానుండి, సౌందర్యవతియు కాగలదు.
15.లగ్నాధిపతికన్నను అధిక బలముగల సప్తమాధిపతి శుభగ్రహ రాశ్యాంశల యందుండినను, శుభ దృగ్యోగాది సంబంధము కలిగినను పరమోచ్చ, వైశేషికాంశలయందున్నను- భార్య ఉత్తమ కుల సంజాతురాలు కాగలదు.
16.సప్తమాధిపతి బలము కంటే తక్కువ బలముగల లగ్నాధిపతి బలహీనుడై, శత్రువు నవాంశల యందున్నను; నీచాంశము, మూడము, నీచ గ్రహ దృగ్యోగ సంబంధాదులు కలిగియున్నను- భార్య హీనకుల సంజాతురాలు కాగలదు.
17.సప్తమ స్థానమందు కుజుడున్న- కుచ్చితురాలగు భార్య కలుగును.
18.రవికి సప్తమాధిపత్యం కలిగి, పాపగ్రహరాశి-నవాంశల యందున్నను; పాపగ్రహ, దృక్యోగాది సంబంధములు కలిగినను- భార్య పాపాత్మురాలగును.
19.సప్తమ భావమునకు శని సంబంధము కలిగిన- జాతకుని భార్య కోప స్వభావం కలిగి, ముకుళితముఖియై యున్నాను; ఓర్పు-కష్టించి పనిచేయు స్వభావము కలదిగా నుండును.
20.సప్తమ స్థానమునకు శుభ సంబంధము లేక కేవలం కుజుని సంబంధమే కలిగియున్న- జాతకుని భార్య భర్తను బాధించునది, కోపి రతి, తిరస్కార భావము గలదిగా నుండగలదు.
21.అంశ చక్రమందు 7 వ స్థానంలో కుజుడున్న- అంగవైకల్యము గల భార్య కలుగును.
22.చంద్రునికి సప్తమాధిపత్యం కలిగి, పాపగ్రహ రాశి-నవాంశల యందున్నను, పాప ద్రుగ్యోగాది సంబంధములున్నను- దోషయుక్తయై, చెడు పనుల నాచరించెడు కఠినాత్మురాలు భార్య కాగలదు.
23.సింహరాశి సప్తమ స్థానమై, రవి కేంద్ర స్థానములందున్న- భార్య స్థనములు గొప్పవియు, కఠినముగా నుండునవియు నగును.
24.కుజుడు సప్తమాధిపతిగానున్న- కుష్క స్థనములు గల భార్య కలుగును.
25.రవికి సప్తమాధిపత్యము కలిగి, కేంద్రములందు లేకయున్నను, సప్తమ స్థానంలో శని-రాహు-కేతువులన్నను- వ్రేలాడు స్థనములుగల భార్య ప్రాప్తించగలదు.
26.సప్తమంలో బుధ-చంద్ర-గురువులున్న- భార్య కుచములు కురుచలై యుండును.
27.సప్తమ భావాధిపతి కుజునితో గలసియున్న- కుడి స్థనము కన్న ఎడమ స్థనము పెద్దదిగానున్న భార్యయు; బుధునితో గలసిన- రెండు ప్రక్కల సమానస్థనములు గలదియు భార్యగా ప్రాప్తించగలదు.
28.కళత్ర భావాధిపతి గురు-చంద్రులతో గలసియున్న- ఎడమ ప్రక్క కంటెను, కుడిపక్క స్థనము పెద్దదిగా గల భార్య ప్రాప్తించగలదు.
29.7వ అధిపతితో రవి కలిసియున్న-శుష్కస్థనములు గల భార్యా కలుగును.
30.సప్తమ భావాధిపతి కేతువుతో గలసిన- చిన్నవగు స్థనములు గల భార్య ప్రాప్తించును.
31.కళత్రాధిపతి రాహువుతో గలసిన- వెడల్పగు స్థనములున్న భార్య కలుగును.
32.సప్తమాధిపతి పాప గ్రహముగా నుండినన్ను లేక జలతత్వ గ్రహమైనను లేక జలరాశులయందున్నను; అట్టి స్థితియందు గురుదృష్టి కలిగిన- బలిసిన స్థనములు గల భార్య ప్రాప్తించగలదు.
33.గురువుగాని, శుక్రుడుగాని సప్తమాధిపతులైనను- భార్య యొక్క భగము సమము గలదిగాను; చంద్ర-శని-బుధులైన హస్వభగముగాను నుండగలదు.
34.రాశిచక్రమందు సప్తమ స్థానంలో గల రాహువు లేక కేతువు అంశయందు కవార గ్రహంశల యందున్న- అట్టి జాతకుని భార్య భర్తకు విషము పెట్టగలదు. కేవలము పాప సంబంధాదులు కలిగిన రాహు-కేతువులు రాశి చక్రమందు సప్తమమందున్న- కఠినాత్మురాలు, పాపకర్మలు చేయునధై లోకాపవాదము నందుగలదు.
35.సప్తమ స్థానమునకు, సప్తమాధిపతికి- శుభగ్రహాల కలయిక, దృష్టి యుండుట; సప్తమాధిపతియున్న నవాంశాధిపతి శుభుడై యుండుట వలన- భార్య సద్గుణములు గలదిగా నుండును.
36.పై విధముగానే సప్తమ స్థాన-భావాధిపతులకు-పాప గ్రహ కలయిక దృష్టి వలనను; సప్తమాధిపతియున్న నవాంశాధిపతి పాపగ్రహ మగుట వలనను- దుర్గుణములు గల భార్యను పొందగలరు.
37.సప్తమ భావంలో 6-8-12 అధిపతులండి, పాపగ్రహ వీక్షితులైన- భార్య స్వేచ్చా విహారిణియై వ్యభిచరించగలదు.
38.సప్తమాధిపత్యం గల శుక్రుడు కుజాంశల యందునను; లేక కళత్ర స్థానాధిపత్యం గల కుజుడు నవాంశ చక్రమందు శుక్రునితో గలసి పాపగ్రహ విక్షితుడైయున్నను; కుజ-శుక్రులు ఒకరి అంశయందు మరొకరు పరివర్తన పొందియున్నను- భార్య వ్యభిచారిణి కాగలదు.
39.సప్తమాధిపతి శుక్రుడై, లగ్నాధిపతితో గలసి మకర రాశి యందుండి; లగ్న-చతుర్ద-సప్తమము లందు శుభగ్రహ దృష్టి లేని పాప గ్రహము లుండి; చంద్రుడు నీచ-నీచాంశల యందున్న యెడల- అట్టివాని భార్య విచ్చలవిడిగాను, బహిరంగముగాను వ్యభిచరించగలదు.
40.చంద్రుడు, శనితోగాని, కుజునితోగాని కలసి యుండగా; శని-కుజులు ఒకరినొకరు చూచుకొనుచున్న (పరస్పర దృష్టి) జాతకుడు వ్యభిచారి యగుటయే గాక; అతని భార్య కూడా వ్యభిచారిణి కాగలదు.
41.లగ్నమందు కుజుడు, సప్తమమునందు శనియుండి; సప్తమాధిపతి శుక్రుడు కుజ నవాంశల యందున్న యెడల- ఆ జాతకుని భార్య వ్యభిచారిణి కాగలదు.
వ్యభిచార యోగములు
01.సప్తమ స్థానములో శుక్రుడు సంపూర్ణ బలం కల్గియుండిన- బహుస్త్రీలతో సంబంధము లుండగలవు.
02.శుక్రుడు నైసర్గిక పాపగ్రహములతోనూ, 2-6-7 స్థానాధిపతులతోనూ, కలసి జన్మలగ్నము నందున్న- వ్యభిచారి కాగలడు.
03.నైసర్గిక పాప గ్రహము 2-6-1 స్థానాధిపతులతో కలిసి, సప్తమ స్థానమందున్న యెడల వ్యభిచారి కాగలడు.
04.శుక్రునకు కుజ-శనుల ఇరువురి దృష్టి కలిగి యున్న- వ్యభిచరించగలడు.
05.సప్తమ స్థానమునకు శుభగ్రహ ద్రోగ్యోగాది సంబంధములు కలుగక ఆ స్థానంలో శుక్రుడుండి, సప్తమాధిపతి రాహువుతో కలసిన- వేబిచార యోగము కలుగును.
06.కుజుడు-శుక్రుడు కలిసి 7 లేక 10 స్థానములందున్న- వ్యభిచారి.
07.జన్మలగ్నమునుండి 10వ స్థానంలో శని, చంద్ర లగ్నము నుండి 10వ స్థానంలో శుక్రుడు ఉన్న యెడల వ్యభిచారి కాగలడు.
08.వృషభ-తులలు 7 లేక 10వ స్థానంలో నుండి, అందు శని-బుధ-శుక్రలు కలసియున్న- వ్యభిచారి కాగలడు.
09.అంశ చక్రంలో 12వ స్థానమందు కుజ-శుక్రులున్న- వ్యభిచారికాగలడు.
10.అంశ చక్రము నందు 9వ స్థానంలో కేతువున్న (రాశి చక్రంలో 9వ స్థానం ఏ రాశి యగునో అంశచక్రంలో ఆ రాశి యందు కేతువుండుట యని కొందరి అభిప్రాయము)- జీవితాంతము పరస్త్రీ రతుడు కాగలడు.
11.చంద్ర-కుజ-శనులు కలసి సప్తమమందున్న- వ్యభిచారికాగలడు.
12.సప్తమ స్థానంలో కుజ-రాహువులు కలసియున్న- అన్యకుల స్త్రీలతో వ్యభిచరించగలడు.
13. పాప గ్రహములతో గలచిన క్షీణచంద్రుడు సప్తమందున్న- పరస్త్రీ రతుడు కాగలడు.
14.రవి-కుజ-చతుర్ధాధిపతి కలసి, 6-7 స్థానములలో నెందైనను నుండి; శని వీక్షితుడైన- రజస్వలయైన వితంతువును సంఘమించగలడు.
15.సప్తమ స్థానాధిపతి బలహీనుడై లేక కుజ నవాంశల యందుండగా, సప్తమ స్థానంలో క్షీణ చంద్రుడున్న- దాసీ స్త్రీ సంగమము, బలహీనుడైన బుధుడు ఉన్న వేశ్య స్త్రీ సంగమము, రాహువు ఉన్న గర్భిణీ స్త్రీ సంగమము, శని రాహువులున్న- హీన జాతి స్త్రీ సంగమము, శుక్ర-రాహువులున్న- రజక స్త్రీ సంగమము, బుద-రాహువులున్న- పడుపు వృత్తి గల స్త్రీ సంగమము, గురు-శుక్ర-రాహువులు ఉన్న- ఉత్తమ కుల వితంతు సంగమము; కుజ-శనులున్న- నికృష్ట జాతి స్త్రీ సంగమము కలుగును.
16. లగ్నాధిపతి, అష్టమాధిపతి కలిసి మేష-వృషభ-తుల-వృశ్చిక రాశులయందున్న- తన బంధు వర్గమునందు రహస్యముగా వ్యభిచరించువాడు కాగలడు.
బహు బార్య యోగములు
01. సప్తమ స్థానము పాపగ్రహ రాశియై యుండి, సప్తమాధిపతి నీచ నంది, 7వ స్థానంలో పాప గ్రహములున్న- ద్వికళత్రయోగము(ఇద్దరు భార్యలు) వుండును.
02. సప్తమాధిపతి కేంద్రకోణముల యందుండి, ఆ స్థానము అతనికి ఉచ్చ-మిత్ర క్షేత్రమై దశమాధిపతి వీక్షణ కలిగియున్న- అనేక భార్యలు కలుగును.
03. సప్తమాధిపతి-పంచమాధిపతి బలవంతులై శుభగ్రహములతో గలసి యుండి, వారిలో నొకరికి షష్ఠాధిపతి వీక్షణ కలిగిన- బహు భార్య యోగము కలుగును.
04. ద్వితీయాధిపతి 6వ స్థానంలో, సప్తమాధిపతి 8వ స్థానంలో, శుక్రుడు 12వ స్థానంలో (ఈ ముగ్గురు కలిసి 6-8-12 లలో ఏదో ఒక స్థానంలో యుండి) నుండి; ఎన్ని పాపగ్రహ వీక్షణలు కలిగియుందురో- అన్ని కళత్రములు నష్టపడగలవు.
05. శని 2వ స్థానంలో, రాహువు 7వ స్థానంలో నున్న- ద్వికళత్ర యోగముండును.
06. శుక్రునకు పాప గ్రహ సంబంధము వలన- ద్వికళత్ర ప్రాప్తి.
07. ద్వితీయ-అష్టమ స్థానములకు అనేక గ్రహ సంబంధము కలిగిన కళత్ర భంగము కాగలదు. గురు సంబంధము వలన- ద్వితీయ వివాహముండును.
08. అష్టమ స్థానంలో గల పాప గ్రహములను గురుడు చూసుకున్న- ద్వికళత్ర యోగముండును.
09. సప్తమ స్థానంలో 1-8-12 అధిపతులు కలసియున్న- ద్వికళత్ర యోగముండును.
10. మిధున-కన్యలు 8వ స్థానమై, శని వీక్షణ నందియున్న- ద్వికళత్రము కలుగును.
11. సప్తమాధిపతి 8 వ స్థానంలో శుభ బలాధికుడైయున్న- మేనమామల తాలూకు కన్యక భార్య యగును. వ్యాధితో నుండగలరు.
12. లగ్నాధిపతి 12, రవి 7, కుజుడు 8 స్థానములందున్న- రెండవ వివాహము జరుగును.
13. ద్వి స్వభావ రాశులలో శుక్రుడుండి, కుజ-రాహువులు ధృగ్యోగములు కలిగిన- మొదటి భార్య నశించి, రెండవ వివాహము కాగలదు.
14. సప్తమ స్థానంలో రవి-బుధ-కుజులు పాపగ్రహములతో గలసి యున్న- మొదటి భార్య సంతానము కలిగి, నశించగలదు. తదుపరి రెండవ వివాహము జరుగగలదు.
15. శుక్రునికి గురు దృష్టి కలిగిన-ద్వికళత్ర యోగముండును.
16. సప్తమ స్థానంలో శని-రాహువులున్న ద్వికళత్ర యోగముండును.
17. జాతకము నందు కుజ దోషముండి, ద్వితీయంలో గురువు వున్నను లేక శనియున్నను- ద్వి కళత్ర యోగము కలుగును.
బార్యా వియోగ-అనారోగ్యములు
01. సప్తమ స్థానంలో 5 లేక 8 స్థానాధిపతిలున్న- భార్యావియోగం కలుగును.
02. సప్తమాధిపతి 5వ స్థానమందున్న- భార్యావియోగ ముండగలదు.
03. పంచమస్తానములో బలహీనుడైన చంద్రుడుండి 1-7-12 స్థానాలలో పాప గ్రహములున్న- భార్యా-సంతాన వియోగము లుండగలవు.
04. శుక్రునకు పాపార్గళము కలిగి పాప గ్రహ సంబంధం లుండిన- భార్యా వియోగము కలుగును.
05. పాప గ్రహముల యొక్క సంబంధములు గల శుక్రుడు 4-8-12 స్థానముల యందున్న యెడల- భార్యా వియోగము కలుగును.
06. సప్తమ స్థానము వృశ్చిక రాశియై, అందు శుక్రుడున- భార్య వియోగం కలుగును.
07. వృషభ రాశి సప్తమ స్థానమై, అందు బుదుడున్న- భార్యాభయోగము.
08. మకరం సప్తమ స్థానమై అందు గురువున్న- భార్యావియోగము.
09 మీనరాశి సప్తమ స్థానమై; అందు శని గానీ, కుజుడు గానీ యుండిన- భార్యాభియోగము కలుగును.
10. శుక్రుడు పాపగ్రహములతో గలసి 7-5-9 స్థలముల యందున్న- అంగవైకల్యం గల భార్య ప్రాప్తించి, వియోగ మేర్పడగలదు.
11. శుక్రునికి సప్తమంలో కుజుడు, చంద్రుడికి సప్తమంలో శనియున్న- భార్యా వియోగము లేక సంతాన హీనత కలుగును.
12. సప్తమ-ద్వితీయాధిపతులు బలహీనులై, పాపగ్రహ సంబంధములు కలిగియున్న- భార్యను వదిలి వేయగలరు.
13. సప్తమ స్థాన-సప్తమాధిపతులకు శనీ-రాహు సంబంధమున్న భార్యను విడిచివెయును.
14. సప్తమ శని, లగ్న రవి వలన- కళత్రము నష్టమగును.
15. కన్య జన్మ లగ్నమై, అందు రవి యుండి; మీనంలో శనియున్న- భార్య నశించును.
16.శుక్ర, షష్ఠాధిపతులు కలిసియున్న- భార్యకు ఆపదలు ప్రాప్తించగలవు.
17. కుజుడు సప్తమ భావమందున్న- 22 లేక 42వ సంవత్సరంలో భార్య నశించును.
18. చంద్ర-శుక్రులు నీచ స్థితి యందున్న- భార్యకు జలగండము.
19. సప్తమాధిపతి పాశ భుజంగ ద్రేక్కాణముల యందున్న- భార్య ఊరి వలన మృతి నందగలదు.
20. శుక్రుడు పాప బలాధిక్యత నంది, సప్తమాధిపతి పాపులతో గలసియుండి, సప్తమ భావమందు 4వ స్థానాధిపతియున్న- గర్భవతియై, భార్య మరణించగలదు.
21. కుజుడు 2-4-7-8-12 స్థానములందున్న- భార్యకు హాని కలుగును.
22. పై విధముగా కుజుడుండి, 2వ స్థానంలో గురువున్న లేక ద్వితీయాధిపత్యము గురువునికి కలిగినను- కళత్రము నష్టమగును.
23. సప్తమాధిపతి 3-8 స్థానములందున్న- భార్యకు అనారోగ్యము.
24. శుక్రుడున రాశి నుండి 4-8 రాశులలో రవి, కుజ, శనులున్న- భార్య అగ్ని వలన మృతి నందగలదు.
25. శుక్రుని కిరువైపులా పాప గ్రహములున్న- భార్య ఎత్తు నుండి జారి పడగలదు.
26. సప్తమాధిపతికి సప్తమంలో రాహువున్న- కళత్ర నష్టం కలుగును.
27. పంచమ స్థానమునకు శుభగ్రహ వీక్షణాది సంబంధములు కలుగక, 11వ స్థానంలో రాహువు యొక్కడే యున్న- రాహు దశలో భార్య మరణించగలదు.
28. సప్తమాధిపతి-రాహువు గలసి, 10వ స్థానమందున్న- విషము వలన భార్య నాశనం కాగలదు.
29. శుక్రుడు మకర-కుంభంము లందుండి- సప్తమాధిపతి నీచస్థితి నందిన, పాప గ్రహముల యొక్క దశాంతర్ధశలు భార్యను నశింపచేయును.
30. సప్తమ స్థానంలో కుజుడు, 2వ స్థానములో రాహువు, 6-8-12 స్థానాలలో ఒకచోట శుక్రుడు యుండిన- వివాహమైన సంవత్సరం లోపల కళత్ర నష్టము కలుగును.
31. సప్తమాధిపతి అష్టమ స్థానమందుండి, 12వ స్థానాధిపతి సప్తమందున్న- 19 లేక 39 వ సంవత్సరంలో భార్యను భార్యకు మృతి కలుగును.
32. లగ్నాధిపతికి నీచస్థితి కలిగి, సప్తమాధిపతి 8వ స్థానమందున్న- 40 వ సంవత్సరమునందు భార్య మరణించగలదు.
33. ఇతర గ్రహములతో కలయక శుక్రుడోక్కడే కర్కాట రాశి యందున్న- కళత్రమును నష్టపరుచును.
34. జన్మ లగ్న-చంద్ర లగ్నముల నుండి 2వ స్థానంలో నున్న కుజుడు- సంతాన నష్టములను; 7వ స్థానంలో గల కుజుడు- భార్య హానినీ, 8వ స్థాన కుజుడు- స్త్రీల సౌభాగ్య (భర్తను) నష్టమును; 12వ స్థాన కుజుడు- సంపద నష్టము, దరిద్రములను కలిగించగలడు.
35. కుజుడు జన్మ-చంద్ర లగ్నములు రెండింటి ద్వారా దోషప్రధుడైయుండిన- వివాహాటంకము లుండగలవు.
36. కుజుని కి ద్వితీయ-సప్తమ భావస్థితి- పురుషుల కధిక దోష ప్రధము.
37. 4-12 కుజ స్థానస్థితి స్త్రీల కధిక దోషము కలిగించును.
38. అష్టమ స్థాన, లగ్న స్థాన కుజదోషము- స్త్రీ పురుషులను పీడించగలదు.
39. శుక్రుడున్న రాశి నుండి కూడా 1-2-4-7-8-12 రాశులలో కుజుదుండుట- వైవాహిక జీవితమునకు మంచిది కాదు.
సప్తమ భావ యోగములు
01. నైసర్గిక శుభగ్రహమును దృష్టి 5-7 స్థానములకు కలిగిన- భార్యా సంతానముల ద్వారా అభివృద్ధి నందగలరు.
02. సప్తమ భావమునకు రవి గ్రహ సంబంధము కలిగిన- భార్య అదృష్టవతియై, బాగా కలిసి రాగలదు.
03. సప్తమ స్థానమునకు శుక్ర సంబంధమున్న- భార్య వలన సుఖపడగలరు.
04. 7 వ స్థానమునకు గురు సంబంధమున్న- వివాహానంతరం యోగ ప్రాప్తి కలుగును.
05. జన్మ లగ్నమునందు బుధ, కేతువుల కలయిక వల్ల- భార్యకు రోగము కలుగును.
06. సప్తమాధిపతికి గానీ, సప్తమ భావములకుగానీ- కుజ లేక శని సంబంధమున్న- భార్యతో కలహము లుండగలవు.
07. సప్తమమందు పాప గ్రహములున్న- భార్యకు గర్భస్రావము కాగలదు.
08. సప్తమాధిపతి యొక్క స్పుట రాశికి 5-9 స్థానములలో- గోచార గురువు ప్రవేశించు కాలము- భార్య మరణమును సూచించగలదు.
09. సప్తమ, షష్ఠ స్థానాధిపతులు, 6 వ స్థానంలో కలసియున్న- శత్రువివాదములు, చోర బాధలు ప్రాప్తించగలవు.
10. సప్తమ భావము ద్వారా- జాతకుని మొదటి భార్య విషయములు తెలియను.
11. అష్టమ భావం ద్వారా- రెండవ భార్య విషయంలు గ్రహించవలెను.
12. తృతీయ భావము ద్వారా- మూడవ భార్య విషయములు తెలియవలెను.
13. సప్తమ భావము తులాంశ యందున్న- వ్యాపార వృత్తి ప్రాప్తించగలదు.
14.సప్తమ భావములో- కుజ, బుదులు కలసియున్న- వ్యాపారము చేయగలరు.
15. లగ్న, సప్తమాధిపతులు లగ్నమందుండి; సప్తమాధిపతి దశ ప్రాప్తించిన- గొప్ప సుఖ-శాంతులు లేర్పడగలవు.
16. శుభ గ్రహ సంబంధము గల సప్తమాధిపతి దశయందు- నౌకా సంబంధిత వృత్తు లేర్పడగలవు.
17. పాప గ్రహ సంబంధం గల సప్తమాధిపతి దశయందు- ఉన్నంతయు పోయి, దేశాటన మొనర్చును.
18. సప్తమ స్థానంలో రాహు వుండి, పాప గ్రహ వీక్షితుడైన- దేశభ్రమణము కలుగును.
19. సప్తమాధిపతి 9వ స్థానము నందుండి, 1-2 అధిపతులచే చూడబడుచున్న- కాంట్రాక్ట్ ల వలన విరివిగా ధన-భాగ్యములు ప్రాప్తించగలవు.
20. సప్తమాధిపతి- శుక్రుడూ మిత్ర క్షేత్రములందుగానీ, ఉచ్చరాశుల యందు గాని యుండి; శుభగ్రహ సంబంధీకులైన- విశేష భాగ్య-సంపదలతో సుఖ ప్రాప్తి నందగలరు.
No comments:
Post a Comment